Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండి చేయి

$
0
0

ఊసే లేని నడికుడి - శ్రీకాళహస్తి లైను
అటకెక్కిన ఒంగోలు - దొనకొండ రైలుమార్గం
రైల్వే బడ్జెట్‌పై మండిపడుతున్న ప్రతిపక్షాలు

ఒంగోలు, జూలై 8:కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపారు. ప్రతి రైల్వే బడ్జెట్‌లోను జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇదిలాఉండగా ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల పురోభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అభివృద్ధి చేస్తామని ఆయన లోక్‌సభలో వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఆ కమిటీ ఎప్పటికి నివేదిక ఇస్తుందని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. ప్రధానంగా నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే పూర్తయినప్పటికీ శంకుస్థాపనకు నోచుకోలేదు. 1997-98 సంవత్సరంలో ఈ రైల్వేలైనుకు సంబంధించి సర్వే పూర్తయింది. ఈ లైను నిర్మాణానికి 1311 కోట్ల రూపాయలతో అంచనాలను కూడా రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులను వెచ్చించి ఈ లైను నిర్మించే విధంగా నివేదిక రూపొందించారు. కాని లైను నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగడంలేదు. ఈ లైను నిర్మాణం పూర్తయితే ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే సదుపాయం కలుగుతుంది. ప్రధానంగా జిల్లాలోని దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు తదితర ప్రాంతాలకు రైల్వే లైను వస్తుంది. కాని ఈ బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు. అదేవిధంగా ఒంగోలు - దొనకొండ రైలు మార్గానికి సర్వే పూర్తయినప్పటికి నేటికి కార్యరూపం దాల్చలేదు. 265 కోట్ల రూపాయల వ్యయంతో సర్వే కూడా పూర్తయింది. ఈ రైల్వేలైను నిర్మాణం పూర్తయితే తూర్పుప్రకాశానికి, పశ్చిమప్రకాశానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రధానంగా చీమకుర్తిలోని గ్రానైట్ రాళ్ళు, పలకలు లాంటివి ఇతర ప్రాంతలకు ఎగుమతులు చేసుకునే వీలుంటుంది. అదేవిధంగా మార్కాపురం - శ్రీశైలం, బాకరావుపేట -కంభం -ప్రొద్దుటూరు రైల్వేలైను సర్వే కూడా జరగలేదు. గతంలో సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా ఇంతవరకు అతీగతీ లేదు. మొత్తంమీద జిల్లాకు రైల్వే బడ్జెట్‌లో మంత్రి మొండిచేయి చూపారు. ఇదిలాఉండగా రైల్వే ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు కొంత వెసులుబాటు కల్పించారు. పోస్ట్ఫాసులు, మొబైల్స్ ద్వారా రిజర్వేషన్లు చేసుకోవచ్చునని మంత్రి ప్రకటించారు. కాగా రైల్వేల్లో తరచుగా దొంగతనాలు జరుగుతుండటంతో ఆ దొంగతనాలను నివారించేందుకు ఆర్‌పిఎఫ్ సిబ్బంది మొబైల్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. విశాఖ - చెన్నై ఎక్స్‌ప్రెస్ కొత్త రైలు నడవనుంది. ఆ రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఆగుతుందో లేదో తెలియాల్సి ఉంది. అదేవిధంగా హైదరాబాదు నుండి చెన్నై వెళ్లే రైళ్ల వేగాన్ని కూడా ఇకపై పెంచనున్నారు. ఇంతకుమినహా జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు.
అభివృద్ధికి పెద్దపీట:మాజీ ఎంపి మాగుంట
పార్లమెంటులో రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేశారని ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్ అన్నిరంగాల వారికి ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాలో నిర్మాణంలో ఉన్న 29 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు 20,680 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాలో రైల్వేల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. దేశంలోని పలు కొత్త రైళ్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్త రైళ్లను వేశారన్నారు. విజయవాడ - ఢిల్లీ ఎపి ఎక్స్‌ప్రెస్, చెన్నై - హైదరాబాదు బుల్లెట్ రైలు, విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్, పరదీప్ - విశాఖ మధ్య, సికింద్రాబాదు - చెన్నై, సికింద్రాబాదు - నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైలు, యశ్వంత్‌పూర్ - గుంటూరు డైలీ ప్యాసింజర్ రైళ్లను వేశారన్నారు. రైళ్లల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత, నాలుగువేల మంది మహిళా ఆర్‌పిఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం, డబ్లింగ్, కొత్తరైళ్లకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్ని స్టేషన్లలో వంతెనలు, ఎస్కలేటర్లను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, రైల్వేస్టేషన్లలో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు, ప్రజల సౌకర్యార్ధం పాల రవాణాకు రైళ్లల్లో ప్రత్యేక బోగీలు ఏర్పాటు, రైళ్లలో శుభ్రమైన ఆహారపదార్థాల సరఫరా వంటివి బడ్జెట్‌లో హైలెట్‌గా ఉన్నాయన్నారు. వృద్ధులు, వికలాంగులను ప్లాట్‌పారాల్లోకి తీసుకెళ్లేందుకు బ్యాటరీ బండ్ల ఏర్పాటు, గ్రామీణ ప్రజల సౌకర్యార్ధం పోస్ట్ఫాసుల ద్వారా కూడా టిక్కెట్లు అమ్మకం, దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ రైళ్ల అనుసంధానం చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఊసే లేని నడికుడి - శ్రీకాళహస్తి లైను అటకెక్కిన ఒంగోలు - దొనకొండ రైలుమార్గం రైల్వే బడ్జెట్‌పై మండిపడుతున్న ప్రతిపక్షాలు
english title: 
railway budget

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి:జిల్లా కలెక్టర్

$
0
0

మార్కాపురం, జూలై 8: అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వైఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు నూరుశాతం ఇమినైజేషన్‌తోపాటు ఆసుపత్రిలో కాన్పుల నిర్వహణపై శ్రద్ధ వహించాలని, ఐసిడిఎస్ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకపై అలాంటి సంఘటనలు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్ సకాలంలో అందచేయడం లేదని ఫిర్యాదులు రావడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే 50శాతం అధికారులు కూడా హాజరుకాకపోవడం మంచిపద్ధతి కాదని, తీరుమార్చు కోవాలని సూచించారు.
నాణ్యతలేని విత్తనాలు మార్కెట్‌లోనికి రాకుండా చూడాలి
ఖరీఫ్ సీజన్‌లో నాణ్యతలేని విత్తనాలు మార్కెట్‌లోనికి రాకుండా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని, డివిజన్ స్థాయిలో రైతులు అవసరమైన ఎరువుల ఇండెంట్‌ను సకాలంలో జిల్లా అధికారులకు అందచేయాలని ఆదేశించారు. పశువైద్యాధికారులు అలక్ష్యం లేకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. పశుగ్రాసం విత్తనాలు అడిగిన రైతులందరికీ అందచేసేలా పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించండి
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విషయంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పిల్లలందరిని బడిలో చేర్పించాలని, బయటిప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలను కస్తూరిబా గురుకుల పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని, మంచి పోషకాహార భోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టండి
అసంపూర్తిగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను పూర్తిచేసి తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. పనులు మంజూరై టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకుంటే త్వరితగతిన టెండర్లు వేసి అగ్రిమెంట్లు ఇచ్చి వేగవంతంగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో 46 పనులు మొదలు పెట్టలేదని, 75పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వెంటనే పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
పనులు చేయాలనే ఆలోచనలేదా..?
పిఆర్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పంచాయతీరాజ్ అధికారులు కిసాన్ షెడ్లు పూర్తి చేయకపోవడంపై ఆయన మాట్లాడుతూ మీరు ఏమి పనులు చేస్తున్నారో చెప్పాలని పిఆర్ ఎఇలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, తర్లుపాడు, పెద్దదోర్నాల మండలాల ఎఇలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని, డిఇఇల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉందని వారికి కూడా నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిడిఓలు కూడా కిసాన్ షెడ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. 7906 పనులు ఇంకా ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపన్నులు, ఇతరత్రా పన్నుల వసూలుపై దృష్టి సారించాలని ఇఓఆర్‌డిలను ఆదేశించారు.
మీ సేవ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి
మీసేవా ద్వారా వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలని గిద్దలూరు, మార్కాపురం మున్సిపాలిటీల్లో పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిచేయాలని కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బ్యాంకు లింకేజీలను వెంటనే పూర్తి చేయండి
పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చాలా వెనుకబడి ఉన్నాయని, వారంరోజుల్లో ప్రగతి సాధించని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిని విధుల నుంచి తొలగించాలని మెప్మా పిడిని ఆదేశించారు. బంగారు తల్లుల ఎంపికలో కూడా ఆశించిన ప్రగతి సాధించని పక్షంలో వారిని తొలగించి పనిచేసే వారిని నియమించుకోవాలని మున్సిపల్ కమిషన్లు వీటిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఓ ఎ ప్రసాద్, జెడిఎ పిబికె మూర్తి, డిటిడబ్ల్యుఓ కమలా, డిఇఓ రవీంద్రబాబు, ఎస్‌సి ఆర్‌డబ్ల్యుఎస్ మూర్తి, మెప్మా పిడి కమలకుమారి, హౌసింగ్ పిడి ధనుంజయరావు, ఇడి ఎస్సీ కార్పొరేషన్ రాజు, స్టెప్ సిఇఓ రవి తదితరులు పాల్గొన్నారు.

అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా
english title: 
collector

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి

$
0
0

డిసిసి అధ్యక్షుడు ముక్కు స్పష్టం
ఒంగోలు, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు వైఎస్‌ఆర్ 65వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని, ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని వారు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు తిరిగి పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. ముందుగా ఒంగోలులోని రాంనగర్ బాలసదన్ విద్యార్థులకు అల్పాహారం, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం 10.30 గంటలకు ఒంగోలులోని డిసిసి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు రిమ్స్ హాస్పటల్‌లో 350 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం బధిరుల ఆశ్రమ పాఠశాలలో కేక్‌ను కట్‌చేసి గ్రైండర్‌ను, నాలుగు ట్యూబ్‌లైట్ సెట్లను అందచేశారు. విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, కనకరావు, జి రాజ్‌విమల్, గాదె లక్ష్మారెడ్డి, నవీన్‌రాయ్, హనుమంతరావు, మేడిద రవి, చెరుకూరి కిరణ్, వెంకటేశ్వరరెడ్డి, గోవిందరాజులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్లాబ్ కూలి చిన్నారి మృతి
పామూరు, జూలై 8: మండలంలోని నర్రమడేల్లా గ్రామంలోని ఎస్సీ కాలనీలోని గదం దేవదానం మనవరాలు 3నెలల చిన్నారి శ్లాబ్ కూలి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన దేవదానం కుమారై ప్రేమలతను కనిగిరి మండలం చాకిరాలకు చెందిన వెంగయ్యకు ఇచ్చి వివాహం చేశారు. 18ఏళ్లకు ప్రేమలతకు పాప జన్మించింది. పుట్టింటిలో రోజూమాదిరిగా ఇంటి ముందు శ్లాబ్ కొక్కానికి ఉయ్యాల వేసి పాపను నిద్రపుచ్చుతుండగా అకస్మాత్తుగా శ్లాబ్ కూలిపోవడంతో పాప మృతి చెందింది. ఈవిషయం తెలుసుకున్న తహశీల్దార్ మల్లికార్జునప్రసాద్, సిఐ మల్లికార్జునరావు, విఆర్‌ఓలు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

డిసిసి అధ్యక్షుడు ముక్కు స్పష్టం
english title: 
congress asset

ఒంగోలు రిమ్స్ కళాశాలకు 100 ఎంబిబిఎస్ సీట్లు మంజూరు

$
0
0

ఒంగోలు, జూలై 8: ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలకు నాల్గవ బ్యాచ్‌కు సంబంధించి 100 ఎంబిబిఎస్ సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు చేసినట్లు ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ బి అంజయ్య మంగళవారం తనను కలిసిన విలేఖర్లకు తెలిపారు. ఈ సీట్లను త్వరలో ఎంసెట్ కౌనె్సలింగ్ ద్వారా భర్తీ చేస్తారని ఆయన తెలపారు. నాల్గవ బ్యాచ్ ఎంబిబిఎస్‌కు సంబంధించి మొత్తం 100 చీట్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సీట్లు మంజూరుకు సహకరించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్య నాయుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయకుమార్, డాక్టర్ మన్నం గోపీచంద్ తదితరులకు డైరెక్టర్ అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి హర్షవర్థన్‌ను మంగళవారం ఢిల్లీలో కలిసి రిమ్స్‌కు వంద సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి మంజూరు చేసినట్లు ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

‘గిద్దలూరును పారిశ్రామికాభివృద్ధి చేయాలి’
గిద్దలూరు, జులై 8: గిద్దలూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో పశ్చిమనికి పూర్తి వెనుకబడిన నియోజకవర్గమని ఈ నియోజకవర్గంలో ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి లేకపోవటంతో ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు ఉపాధికోసం వలసలు వెళుతున్నారని అదే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే వలసలను నివారించవచ్చని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పూనాటి అంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం గిద్దలూరు డివిజన్ సిపిఎం పార్టీ ప్లినం ఆపార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు సూర అంకిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పూనాటి ప్రసంగిస్తూ నిరుద్యోగులకు ఉపాధి లేకపోవటంతోనే వలసల వెల్లువ ఎక్కువగా ఉందని అన్నారు. 1972లో ప్రకాశం జిల్లాలో గిద్దలూరును కలిపారని, అప్పటి నుండి పశ్చిమాన జిల్లా కేంద్రానికి దూరంగా అభివృద్ధికి అమడదూరంలో ఉందన్నారు. ఈ ప్రాంతంలో పేపరు, టామోట ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశం ఉన్నప్పటికి అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతోనే ఈ పరిశ్రమలు నెలకొల్పలేదని. ప్రస్తుత శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి స్థానిక వనరుల అధారిత పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఫ్లోరిన్ సమస్య మరి అధికంగా ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని గిద్దలూరు దాహార్తి తీర్చేందుకు చేపట్టిన భైరవేని గుండాల నీటి ప్రాజెక్ట్ పూర్తిగా విఫలం అయిందని, గుండ్లమోటు ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లోపం కొట్టోచ్చినట్టు కనపడుతుందన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చాలని పూనాటి డిమాండ్ చేశారు. రైతులు,డాక్రామహిళలు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని ఉపాధి హామి పనులను పునరుద్దరించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పూనాటి డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సిపిఎం పార్టీ డివజన్ నాయకులు జివి నాగేశ్వరరెడ్డి, పి అంజమ్మ, కాల్వ మహేశ్వరరావు, షేక్ పాశ్చామియా అవులయ్య, అల్లూరిస్వామి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు
అద్దంకి, జూలై 8: తొలి ఏకాదశి పండుగను అద్దంకి మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మంగళవారం ఉదయం దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దైవదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, మణికేశ్వరంలోని శ్రీగంగా పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం, అద్దంకి పట్టణంలోని పాతశివాలయం, వెయ్యిస్తంబాల దేవాలయం, శ్రీకమఠేశ్వర స్వామివారి ఆలయం తదితర దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రత పూజలు
అద్దంకి పట్టణంలోని శ్రీ్ధన్వంతరీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో తొలిఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజలు గణపతి పూజ, దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. అనంతరం దైవదర్శనం చేసుకున్న భక్తులకు తీర్ధప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో దత్తపాదుకాక్షేత్ర నిర్వాహకులు నాగసూరి హనుమంతరావు, నాగసూరి హనుమత్‌ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతాలు
పామూరు : తొలి ఏకాదాశి పర్వదీనం సందర్భంగా స్థానిక శ్రీ రామసత్యనారాయణస్వామి దేవస్థానంలో వ్రతాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సత్యదేవుని కల్యాణ మండపంలో 150 జంటలు వ్రతాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రతాలలో కూర్చున జంటలకు దర్శి సీతయ్య వారసులు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ డివి మనోహర్, దర్శి కలేశ్వరరావు, సత్యనారాయణ, బాలచంద్రరావు, నరసింహారావు, బాలరాఘవులు, బాలగురునందం, తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలకు నాల్గవ బ్యాచ్‌కు సంబంధించి
english title: 
100 seats

ఆదిత్యుని చెంతకు రైలు కూత

$
0
0

శ్రీకాకుళం, జూలై 8: ఎన్.డి.ఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో సిక్కోలుకు మరింత ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా అన్ని పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేసే విధంగా రైళ్లు ఏర్పాటుకు అధిక నిధులు కేటాయించడం, అరసవల్లిలో కొలువైయున్న ఆదిత్యునికి మహర్దశ పట్టినట్లయింది. గత ప్రభుత్వాలు ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్ల శ్రీకూర్మనాథుడు, సాలిహుండాం వంటి బౌద్ధక్షేత్రాలకు సందర్శకుల రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ రైళ్ల ప్రకటనతో ఆధ్యాత్మిక, పర్యాటక రంగం జిల్లాలో మరింత అభివృద్ధి బాటలో పయనించేందుకు పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేసే ప్రక్రియ దోహదపడనుంది. శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఆదిత్యుని పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు రాకపోకలకు అనుగుణంగా అనుసంధానం చేసే ప్రక్రియ రైల్వే బడ్జెట్‌లో రూపొందించడంపై ఆధ్యాత్మికవాదులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. రైల్వే బడ్జెట్ అంటే సంబంధిత శాఖామాత్యులు సొంత రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించుకోవడం నిన్నటివరకు పరిపాటిగా మారింది. నేడు మాత్రం దానికి భిన్నంగా రైల్వే రంగాన్ని ఆధునీకరిస్తూ ప్రయాణీకులంతా గమ్యానికి వేగంగా చేరుకునేందుకు మరిన్ని వౌలిక వసతులు కల్పించే అంశాలతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా శ్రీకాకుళం రోడ్ నుండి రాకపోకలు సాగించే ప్రయాణీకుల సౌలభ్యం కోసం వివిధ రైళ్లను ఏర్పాటుచేయడం ముదావహం. విశాఖపట్నం నుండి పారాదీప్ వరకు వీక్లి ఇంటర్‌సిటీ రైలును ఏర్పాటుచేయడం ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల అనుబంధాన్ని మరింత దగ్గర చేసినట్లయింది. అంతేకాకుండా హైదరాబాద్ నుండి విశాఖ వరకు రాకపోకలు సాగిస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పలాస రైల్వేస్టేషన్ వరకు పొడిగించడంతో ఇక్కడ ప్రయాణీకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. మహిళాప్రయాణీకులకు మరింత రక్షణ కలిగించే మాదిరిగా ఆర్.పి.ఎఫ్ సిబ్బందిని కూడా మహిళలనే నియమించేందుకు రైల్వే బడ్జెట్‌లో నిర్ణయించడం కూడా ఓ శుభసూచికం. శ్రీకాకుళంరోడ్ , తిలారు, నౌపడ, పలాస, ఇచ్ఛాపురం వంటి రైల్వేస్టేషన్లు ఆధునీకరించడమే కాకుండా ప్రయాణీకులకు మెరుగైన వౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాజెక్టులు పూర్తిచేసే మాదిరిగా నిధుల వర్షం కురిపించడం కూడా సిక్కోలు వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఎన్.డి.ఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే
english title: 
aditya

వాన కురిసింది..

$
0
0

ఎచ్చెర్ల, జూలై 8: అన్నదాతలు ఎప్పుడా..ఎప్పుడా అని ఎదురుచూసిన వాన మంగళవారం మధ్యాహ్నం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రత, ఉక్కపోత జనాన్ని ఎప్పటిలాగే ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం సరికి కారుమబ్బులకు నీలిమేఘాలు తోడవ్వడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటసేపు కుండపోతగా కురిసిన వర్షం అన్నదాతలకు మరింత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు చేసి విత్తనాలన్నీ నారుమళ్లలో జల్లినప్పటికీ అవి మొలకెత్తకపోవడంతో రైతులంతా ఆకాశం వైపు ఎదురుచూస్తున్న తరుణంలో వాన కురవడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంత రైతులు సాగు చేసే కూరగాయలే కాకుండా వాణిజ్య పంటలైనా మొక్కజొన్న, నువ్వు వంటి పంటలకు కూడా ఈ వర్షం అనుకూలంగా ఉంటుందని వారంతా పేర్కొంటున్నారు. ఓ వైపు కాలువల ద్వారా సాగునీరు విడిచిపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో కురిసిన వర్షం అన్నదాతల్లో ఖరీఫ్ ఆశలు చిగురించేలా చేసింది. ఇదిలా ఉండగా అధిక ఉష్ణోగ్రతలకు ఉక్కిరిబిక్కిరి అయిన జనాన్ని ఈ వర్షం సేదతీర్చిందనే చెప్పాలి,. వాతావరణం ఒక్కసారి చల్లబడటంతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
పిడుగుపాటుకు ఒకరు మృతి
ఇదే సమయంలో మండలంలో కమ్మపేటకు చెందిన దుప్పల పోలినాయుడు(55) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. వరుణదేవుడు కరుణ కోసం ఎదురుచూడగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.

అన్నదాతలు ఎప్పుడా..ఎప్పుడా అని ఎదురుచూసిన వాన మంగళవారం
english title: 
vana kurisindi

తమ్ముళ్లూ..తగునా ఇది!

$
0
0

శ్రీకాకుళం, జూలై 8: ప్రభుత్వ - ప్రైవేటు సంయుక్తంగా అభివృద్ధికి బాటలు వేయాలన్న ఆలోచనలతో ప్రధాన మంత్రి మోదీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకూ ఆకాంక్షిస్తున్నారు! మంగళవారం రైల్వే బడ్జెట్‌లో పారిశ్రామికవేత్తల సహకారాన్ని కోరే విధానం ఇందుకు తార్కణం. అటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచించే ఎన్.డి.ఎ. సర్కార్‌లో కొంత మంది టిడీపీ నేతలు పరిశ్రమలకు తాళాలు వేయించే దిశగా దండయాత్ర ప్రారంభిస్తే...సిక్కోల్‌లో పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికపారిశ్రామికవేత్తలు భయపడాల్సిందే..కూలీలు వెళ్లకుండా ఉత్పాదకశక్తిని అడ్డుకోవడం వంటి చర్యలతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలం, వత్సవలస ప్రాంతంలో గల ట్రైమాక్స్ పరిశ్రమ లాకౌట్ చేసేందుకు కూడా వెనుకాడమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...
టిడిపి నేతలకు శ్రీకాకుళం నియోజకవర్గం ఓటర్లు పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా ముగియకముందే పరిశ్రమలపై పెత్తనం చలాయించేందుకు పసుపుదళం యత్నిస్తుండటం పారిశ్రామిక వాతావరణం ఎటువెళ్తుందోనన్న భయం ఈ ప్రాంతీయల్లో నెలకొంది. పరిశ్రమ నిర్వాహకులు సాధారణంగా పవర్ పాలిటిక్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ సమీప గ్రామాల్లో చోటా నేతలకు ఆదాయ మార్గాలు పెంచే విధంగా వివిధ పనులు అప్పగించడం పరిపాటి. ఇదే ఫార్ములాను ట్రైమాక్స్ పరిశ్రమ కూడా అవలంభించి అప్పటి అధికార పార్టీ నేతలకు వివిధ ఉత్పత్తి పనుల్లో భాగస్వామ్యులను చేస్తూ గుత్తేదారులుగా నియమించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పసుపుదళం పవర్2చలాయించి పాత గుత్తేదారుల స్థానాన్ని ఆక్రమించుకోవాలని పసుపు దళం నేతలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే గత కొద్దిరోజులుగా మైనింగ్ కూలీలను పనులకు వెళ్లకుండా నియోజకవర్గంలో గార మండలం తెలుగుతమ్ముళ్లు అడ్డుకుంటూ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేపనిలో పావులుకదుపుతున్నారు. అధికారంలో ఉన్న మామాట వినాల్సిందే..అన్న ధృక్పథంతో తెలుగుతమ్ముళ్ల చర్యలు అభివృద్ధికే అటంకంగా మారే పరిస్థితి నెలకొంది. పరిశ్రమలు వస్తే ప్రాంతాలు అభివృద్ధి జరుగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నది సత్యం! కాని - ఈ ప్రాంతంలో మాత్రం నేతల ప్రసంగాలకు, చేతలకు చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. వత్సవలస ప్రాంతంలోని ఇసుక పరిశ్రమలో రాజకీయాలతీతంగా యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే ఈ పంచాయతీకి సంబంధించి కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు వైఖరి సమస్యను మరింత జటిలం చేసేదిగా తయారైంది. అధికారం ఉంది కదా అని తాము చెప్పిందే వేదం అన్న చందాన కార్యకర్తలు వ్యవహారం చట్టంపై వారికున్న అవగాహనను ఎత్తిచూపుతుంది. రోడ్లపై రాళ్లు పెట్టి వాహనాలు అడ్డుకోవడం, విధులకు వెళ్లనీయకుండా సిబ్బందిని అడ్డుకోవడం, మైనింగ్ నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో పరిశ్రమపై పరోక్షంగా దాడిచేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు నేడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వత్సవలస పంచాయతీ తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండడంతో వారి చర్యలకు అడ్డుచెప్పని పరిస్థితి నాయకుల వంతైంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఉపాధి కరవై వందల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నేలకొననుంది. అయితే పరిశ్రమ కూడా ఆయా ప్రాంతాల్లో ఇంకా సమకూర్చాల్సిన వౌలిక సదుపాయాలుపై దృష్టి సారించినట్లైతే ఇటు సమస్యలు పునరావృతం కావన్నది వాదన. లాభాలు గడిస్తున్నారు.. మనకు ఎందుకు ఇవ్వరు అన్న భావనను ఈ ప్రాంతంలో రాజకీయ శ్రేణులు ప్రోత్సహిస్తుండడంతో పరిశ్రమకు గుదిబండగా మారుతుంది.
ఇటువంటి పరిణామాలు పారిశ్రామిక ప్రగతికి నిరోధకంగా మారే ప్రమాదం లేకపోలేదని మేథావులు సైతం తప్పుపడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని ఫలితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరుకుంటాయని ఆర్థిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్న నేపథ్యంలో సిక్కోల్ తమ్ముళ్లు పారిశ్రామిక తంటాకు దిగడం జిల్లా అభివృద్ధి తిరోగమనంగా మారింది. ట్రైమాక్స్ అధినేత కోనేరు ప్రసాద్ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బరిలోదిగి ఓటమిపాలయ్యారు. కోనేరు ప్రసాద్ విపక్ష పారిశ్రామిక వేత్త కావడం వల్లే తమ్ముళ్లు వేధింపులకు దిగుతున్నారా? లేకుంటే - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్టీఆర్ ట్రస్టు భవనం వర్గాలదా?? అంటూ రాజకీయ వాదుల్లో వాడివేడి చర్చ మొదలైంది!

ప్రభుత్వ - ప్రైవేటు సంయుక్తంగా అభివృద్ధికి బాటలు వేయాలన్న ఆలోచనలతో ప్రధాన
english title: 
tammullu

కొనేదెలా..తినేదెలా..!

$
0
0

ఎచ్చెర్ల, జూలై 8: కేంద్ర, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి నెల రోజులు దాటుతున్నా నిత్యవసర వస్తువుల ధరలు అదుపులోకి రాకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.యుపిఏ ప్రభుత్వం ఇదే అపవాదును ఎదుర్కొని చిత్తుగా ఓటమిపాలైన విషయాన్ని సామాన్యులు సైతం గుర్తుచేసుకుంటున్నారు. ధరలు నియంత్రిస్తామని హామీలిచ్చిన అధికార పార్టీలు కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని విమర్శలు నింగినంటుతున్నాయి. ఉల్లిపాయలు 30 రూపాయలు ధర పలుకగా అల్లం కిలో 150 రూపాయలకు చేరుకోవడంతో జనమంతా సర్కార్ తీరును ఆడిపోసుకుంటున్నారు. ఇక కూరగాయల విషయానికొస్తే, బంగాళ దుంపలు కిలో 24 రూపాయలు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడు వంటి రకాలు కిలో 40 రూపాయలకు తక్కువ లేకుండా విక్రయిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరటి కాయ ఒక్కొక్కటి ఏడు నుంచి పది రూపాయలు ధర పలకడంతో శాఖాహారుల బాధలు అన్ని ఇన్ని కావు. కొత్తిమీర, పర్చిమిర్చి, వెల్లుల్లి ధరలు కూడా సుర్రుమనడంతో వినియోగదారులు జేబులకు చిల్లులుపడక తప్పడం లేదు. ఇదేంటని వ్యాపారులను ప్రశ్నించగా వానలు లేకపోవడం వల్ల పంటల సాగు తగ్గిపోయిందని సాకులు చెబుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారంటూ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సరుకులు తక్కువ పరిమాణంలో వస్తున్నాయని వ్యాపారులు చెబుతూనే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించి కూరగాయల ధరలను నియంత్రించాలని వినియోగదారులంతా కోరుతున్నారు.

సమృద్ధిగా ఎరువుల నిల్వలు
* డి.సి.ఎం.ఎస్. చైర్మన్ కృష్ణమూర్తి
గార, జూలై 8: జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ కాలంలో రైతు అవసరానికి తగ్గట్టుగా డి.సి.ఎం.ఎస్. విక్రయ కేంద్రాల్లో ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఈ విషయమై రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొండు క్రిష్ణమూర్తి అన్నారు. మండల కేంద్రంలో గల డి.సి.ఎం.ఎస్. విక్రయ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన డి.సి.ఎం.ఎస్. చైర్మన్ క్రిష్ణమూర్తి ఎరువుల విషయమై రైతు ఆందోళన చెందాల్సింది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విక్రయ కేంద్రాల గొడౌన్లలో ఇప్పటికే 73లక్షల రూపాయల ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. గడచిన ఏడాది చివరిలో మార్క్‌ఫెడ్ ద్వారా వచ్చిన కాంప్లెక్సు ఎరువుల నిల్వలు కూడా ఉన్నాయన్నారు. గడచిన యేడాది ఎరువుల ధరలు, ఈ యేడాది ధరల్లో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రైతులకు ఏ విధంగా ఎరువులు విక్రయించాలన్న అంశమై చర్చించనున్నామన్నారు. నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో అదనపు నిల్వలు మరింత ఆర్ధిక భారం అవుతుందన్నారు.

త్వరలో ఈ-పాస్‌పుస్తకాలు జారీ
శ్రీకాకుళం, జూలై 8: రైతులకు ఇక మీదట ఈ-పాసుపుస్తకాలు జారీ చేయనున్నట్లు తహశీల్దార్ దిలీప్‌చక్రవర్తి తెలిపారు. మంగళవారం ఇక్కడ తహశీల్దార్ కార్యాలయంలో విఆర్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ముటేషన్ చేస్తున్న సమయంలో సంబంధిత రైతులు, విఆర్వోలు తమ దృష్టికి తీసుకువచ్చి ముటేషన్ చేయించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు నెంబర్లను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. నాలా వసూళ్లపై దృష్టి సారించి వాటిని వేగవంతమయ్యేటట్లు చూడాలన్నారు.

కోర్టు ఉత్తర్వులు అమలుచేయరా..!
* తహశీల్దార్‌ను నిలదీసిన తమ్మినేని
పొందూరు, జూలై 8: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలుచేయరంటూ వైకాపా నేత తమ్మినేని సీతారాం తహశీల్దార్ భువన్‌మోహన్‌ను నిలదీశారు. మంగళవారం ఆయన తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ట పిల్లలవలస డీలర్‌ను పునర్ నియామకం చేయమని ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యం చేయడంలో ఆంతర్యం ఏమిటని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని తహశీల్దార్ బదులిచ్చారు. ఆ కోర్టు ఉత్తర్వులు అమలుపరిచే వరకు తాను ఈ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ప్రశే్న లేదంటూ తమ్మినేని కూర్చొన్నారు. దీంతో ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ దృష్టికి అక్కడ నుంచి తీసుకువెళ్లారు. జేసీ వీరపాండ్యన్, శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు పిల్లవలస డీలర్ హైకోర్టు నుండి తెచ్చుకున్న మధ్యంతర ఉత్తర్వులను అమలుచేస్తున్నట్లు తహశీల్దార్ స్పష్టంచేశారు.

తోటపల్లి పూర్తి చేసేందుకు కృషి చేయండి
* కళాను కోరిన బిజెపి నేతలు
ఎచ్చెర్ల, జూలై 8: అత్యధిక శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని తోటపల్లి పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావును బిజెపి నేతలు కోరారు. ఆయన క్యాంపు కార్యాలయానికి మంగళవారం ఆ పార్టీ నేతలు పైడి వేణుగోపాలం, కోటగిరి నారాయణరావు, సంపతిరావు నాగేశ్వరరావులు కలిశారు. ఈ సందర్భంగా ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు మడ్డువలస నీరు మళ్లించినట్లయితే ఆయకట్టు రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. .. అంబేద్కర్ విశ్వవిద్యాలయం బలోపేతానికి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కళాకు విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల్లో వౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని సూచించారు ఎమ్మెల్యేను కలసిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు కంచరాపు చిన్నారావు, పైడి సత్యం, రఘురాం, దన్నాన లక్ష్మణ, పతివాడ పైడినాయుడు తదితరులు ఉన్నారు.

జనహృదయ నేత వైఎస్సార్
శ్రీకాకుళం, జూలై 8: రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టినవేనని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వై.ఎస్. జయంతి సందర్భంగా స్థానిక ఏడురోడ్ల కూడలిలో ఉన్న వై.ఎస్. విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చరిత్రలో లిఖించదగినిదన్నారు. ఆయన పాలనతో జనహృదయాలను గెలుచుకున్న నేతగా ఖ్యాతి కెక్కారన్నారు. సాధ్యం కాని వాగ్ధానాలు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత అధికారంలోకి వచ్చారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం అఫీషియల్ కాలనీలో ఉన్న బెహరా మనోవికాస్ కేంద్రంలోని చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, చల్లా అలివేలుమంగ, అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, కోణార్క్ శ్రీను, రావాడ జోగినాయుడు, గుంట జ్యోతి, కె.ఎల్.ప్రసాద్, జె.ఎం.శ్రీనివాస్, మండవిల్లి రవి, బుజ్జి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

జననేత వైఎస్సార్
* మాజీ మంత్రి తమ్మినేని
పొందూరు: మాట తప్పని మడమ తిప్పని జన హృదయ నేతగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నిలిచారని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 65వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ జంక్షన్ వద్ద గల రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రస్థానం ద్వారా తెలుసుకున్న ప్రజాసమస్యలు, ఇబ్బందులు అధికారం చేపట్టిన అనంతరం అధిగమించినందునే ఆయన జననేతగా నిలిచారన్నారు. కేవలం అధికారం కోసం చంద్రబాబు అర్రులు చాచారని, అధికారం చేపట్టిన తరువాత రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా వంటివి అమల్లో గాలికి వదిలేసారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సువ్వారి దివ్య, ఉపాధ్యక్షుడు తమ్మినేని వెంకటరామినాయుడు, సీనియర్ వైఎస్సార్‌సీపీ నాయకులు రామస్వామినాయుడు, కొంచాడ రమణమూర్తి, బి.ఎల్.నాయుడు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఈసారీ.. వాల్తేరు రైల్వేజోన్‌పై నిరాశే
ఆమదాలవలస, జూలై 8: ఈ రైల్వే బడ్జెట్‌లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని అసంతృప్తిని మిగిల్చింది. వాల్తేరు రైల్వే జోన్ ఏర్పాటుపై ఎన్నో ఆశలు పెంచుకున్నప్పటికీ జిల్లా ప్రజలకు నిరాశే ఎదురైంది. దశాబ్ధాలు తరబడి ఈ జోన్‌ను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ఎంత గొంతుచిచ్చుకున్నా కేంద్రప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా సేవలందించిన దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు , మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి నుండి ఇప్పటి రామ్మోహన్‌నాయుడు వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. దేశంలోనే అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జించే వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ఏర్పాటుచేయాలని ఇక్కడ నేతలు చేసిన పోరాటం వృథాగానే మిగిలింది. ఇక రైల్వేస్టేషన్‌ల ఆధునీకరణ పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది. సామాన్య ప్రయాణీకులు వెళ్లేందుకు సరిపడ్డ బోగీలు లేకపోవడం, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అనేక చోట్ల హాల్ట్‌లు లేకపోవడంతో రాకపోకలు సాగించే ప్రయాణీకులు నానా అవస్థలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లోనైనా ఇటువంటి సమస్యలను గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని పలువురు ఆశిస్తున్నారు. రైల్వేస్టేషన్లలో వౌళికవసతుల కల్పన, భద్రత వంటి అంశాలపై ఎన్‌డిఏ ప్రభుత్వం రూపొందించిన రైల్వే బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించడం కొంత ఊరటనిచ్చింది.

వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, జూలై 8: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి వారి సన్నిధిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆదిత్యుని కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో ప్రధానార్చకులు ఉషా, పద్మినీ ఛాయా సహిత స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణ చేసి అనివెట్టి మూర్తులను ప్రత్యేక అలంకరణ చేసి అనివెట్టి మండపంలో కొలువు తీర్చారు. 500 రూపాయలు చెల్లించి రశీదు పొందిన భక్తదంపతులకు కల్యాణ కంకణాధరణ చేసి కల్యాణ పూజలు జరిపారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలు , అక్షింతలు , తీర్ధప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇ.ఒ పుష్పనాధం, సిబ్బంది కొండలరావు, మృత్యుంజయరావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

నీటి పరిరక్షణకు కార్యాచరణ
శ్రీకాకుళం, జూలై 8: జిల్లాలో నీటి పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ అన్నారు. ఉపాధి పనులు, ఇతర అంశాలపై కలెక్టర్‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి నిల్వ పనులపై దృష్టిసారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అనేక జిల్లాలో ఇప్పటికే మొక్కలు నాటుటకు గుంతలు తవ్వడం జరిగిందని వాటిలో మొక్కలు నాటాలన్నారు. ఉపాధి జాబ్ కార్డులకు ఆధార్ సీడింగ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సౌరభ్‌గౌర్, అదనపు జెసి ఎం.డి.హషీమ్ షరీఫ్, జిల్లా నీటియాజమాన్య సంస్థ పి.డి ఎ.కళ్యాణ చక్రవర్తి, అదనపు ప్రాజెక్టు డైరక్టర్ ఆర్.గణపతిరావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.శివరామనాయకర్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి నెల రోజులు దాటుతున్నా నిత్యవసర
english title: 
konedela

బ్రిటిష్ విదేశాంగ మంత్రితో సుష్మాస్వరాజ్‌ కరచాలనం

$
0
0

మంగళవారం న్యూఢిల్లీలో భారత
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కరచాలనం చేస్తున్న బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియమ్ హేగ్,

కరచాలనం
english title: 
b

ఆరు నెలల్లో ఇళ్లు కట్టుకుంటాం

$
0
0

హైదరాబాద్, జూలై 9: ‘ఎపిఎన్జీవోల ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వాలు కేటాయించిన స్థలంపై కొనే్నళ్లుగా సుప్రీం కోర్టులో వివాదం నడుస్తోంది. సుప్రీం ఆదేశాల మేరకే ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. వివాదాలు పరిష్కారమైన ఆరు నెలల్లో ఇళ్లు కట్టుకుంటాం. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి వివరిస్తాం.’ అని ఎపిఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు.
ఎపిఎన్జీవో హోంలో బుధవారం ఆయన సంఘం ముఖ్య నేతలు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, పివివి సత్యనారాయణ, వీరేంద్రబాబు తదితరులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. అలాగే ఎపిఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఇళ్ల స్థలాలు రాని కొంత మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఎపిఎన్జీవో హోంలో వాటా ఇవ్వాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎపిఎన్జీవో హోం స్థలం ప్రైవేటుదని, సంఘం ఆస్తిలో ఏ ఒక్కరికి వాటా ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగుల వెనక ఆ ప్రాంత నాయకులు ఉండి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, సంఘంలో కొనసాగడం ఇష్టంలేని వారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఎపిఎన్జీవో సంఘంలో సభ్యులుగా ఉంటూ తెలంగాణవాదం వినిపించే వారిని సంఘం కార్యాలయంలోకి రాకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మేరకు పిఆర్సీ, హెల్త్ కార్డులు కూడా ఉమ్మడిగానే ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. అలాగే స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని పట్టుబడితే తాము కూడా తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు రానివ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉంటేనే అంగీకరిస్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని తరగతులు ఉద్యోగులు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈనెల 12న విజయవాడ లయోలా కాలేజీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సన్మానం చేయనున్నట్టు అశోక్‌బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపి మంత్రులు కూడా హాజరవుతారన్నారు. సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న అన్ని సంఘాలు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు.

ఉత్తర్వులు ఉపసంహరించుకోండి సుప్రీం ఆదేశాల వల్లే నిర్మాణాలు చేపట్టలేదు ఇదే విషయాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కలిసి వివరిస్తాం 12న ఎపి సిఎం చంద్రబాబుకు సన్మానం ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
english title: 
a

రెండు అసెంబ్లీలూ ఒకేసారి జరిగితే..

$
0
0

హైదరాబాద్, జూలై 9: ‘తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఒకేసారి జరిగితే...శాసనసభ గేట్ (నెం.1) ద్వారా తొలుత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లోపలికి రావాలి...మా రాష్ట్ర ముఖ్యమంత్రి తొలుత రావాలంటే, కాదు మా ముఖ్యమంత్రే రావాలని గేట్ వద్ద బందోబస్తులో ఉండే ఇరు రాష్ట్రాల పోలీసులు పట్టుబడితే...అసలే గన్స్ లోడ్ అయి ఉంటాయి...కాబట్టి ప్రమాదం జరగకుండా నివారించాలి..’ అని తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ లెజిస్లేచర్.ఒఆర్‌జి.ఇన్’ వెబ్‌సైట్‌ను చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌ను, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని అసెంబ్లీ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్ అధ్యక్షత వహించారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ ప్రసంగిస్తూ రెండు అసెంబ్లీల సమావేశాలు ఒకేసారి జరిగితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. లోగడ ఎల్.బి. స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఎదురైనటువంటి సంఘటనలు పునరావృత్తం కారాదన్న భావనతో తాను అంటున్నానని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరిగితే అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలుత లోపలికి రావాలన్న అంశంపై ఇబ్బంది వస్తుందని, ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు పోటీ పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైర్మన్ స్వామిగౌడ్ ఆ విధంగా మాట్లాడుతుండగా, పక్కనే ఉన్న రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ఆయనను మెల్లగా వారించడం కనిపించింది. జూబ్లీహాలును అసెంబ్లీ కార్యదర్శి సదారామ్ ‘మయసభ’లా మార్చారని చైర్మన్ ప్రశంసించారు. అవుట్‌సోర్సింగ్ పేరిట ఉద్యోగులను వెట్టిచాకిరిలా చేయించే విధానాన్ని రూపుమాపి వారిని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సూపర్‌న్యూమరీ ఉద్యోగాలను కల్పించాలని పర్మినెంట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ను పటిష్టపరిచి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. బంగారు తెలంగాణకు మార్గదర్శకులుగా ఉండాలని ఆయన ఉద్యోగులను కోరారు.
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ అసెంబ్లీ ఉద్యోగుల సమస్యలు ఏవీ ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర సర్కారులోకి (నిష్పత్తి ప్రకారం) వెళ్ళాల్సి వచ్చిన ఉద్యోగులను వెనక్కి తెప్పించుకుందామని, ఈ విషయమై ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌తో మాట్లాడుతానని ఆయన భరోసా ఇచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులైన, ఉద్యోగులైనా ప్రజా సేవకులేనని అన్నారు. కాబట్టి అందరం కలిసి పని చేద్దామని కోరారు. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి సదారామ్‌కు ప్రధాన కార్యదర్శి హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ ఈ మేరకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ప్రసంగించారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్ ప్రసంగిస్తూ పార్లమెంటు తరహాలో అసెంబ్లీని పటిష్టం చేయాలని, వేతనాలు కూడా ఆ విధంగా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ వి. నరసింహాచార్యులు వందన సమర్పణ చేశారు. అసెంబ్లీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర రావు, రిసెర్చ్ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు సుధాకర్ రావు, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారామ్‌ను సన్మానిస్తున్న కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రి టి.హరీష్‌రావు

ఏ రాష్ట్ర సిఎం తొలుత రావాలి అనుమానం వ్యక్తంచేసిన తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ తుపాకులు లోడ్ అయఉంటాయ ప్రమాదం జరగకుండా పోలీసులు జాగ్రత్తపడాలని సూచన
english title: 
r

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

$
0
0

విశాఖపట్నం, జూలై 9: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈప్రాంతాల్లో ఒకటి,రెండు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణితో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు.

కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలపై డిజిపి సమీక్ష

కర్నూలు, జూలై 9: రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు నగరంలోని ఎపిఎస్పీ పోలీసు మైదానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర డిజిపి జెవి రాముడు బుధవారం సాయంత్రం కర్నూలు నగరంలోని ఎపిఎస్పీ పోలీసు మైదానాన్ని పరిశీలించారు. ఆగస్టు 15వ తేదీ జరిగే స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నందున విస్తృత ఏర్పాట్లతో పాటు భారీ బందోబస్తు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డిఐజి మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, నగర పాలకసంస్థ కమిషనర్ మూర్తి, రెవెన్యూ, ఆర్ అండ్‌బి అధికారులు పాల్గొన్న సమావేశంలో డిజిపి జెవి రాముడు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల విజయవంతానికి అంతా కలసికట్టుగా అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు ముందుగానే విస్తృత తనిఖీలు చేయాలని ఆదేశించారు.

ఏనుగుల దాడిలో
ఒకరు మృతి

హిరమండలం, జూలై 9: శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం పాడలి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందారు. సీతంపేట ఏజన్సీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు దాహార్తి తీర్చుకోవడానికి పాడలి సమీపంలోని వాగు వద్దకు వచ్చాయి. అక్కడ పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వీటిని గమనించి, గ్రామంలోకి పరుగులు తీశారు. విషయం తెలిసి గ్రామస్థులు గుంపులు, గుంపులుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఏనుగులు బెదిరిపోయి వారి మీదకి దూసుకు వచ్చాయి. పాసుపల్లి మురళి (33) అనే రైతు భయంతో పరుగులు తీసి జీడి చెట్టు ఎక్కేశాడు. ఏనుగులు చెట్టును కూలదోసి మురళిని కాళ్లతో తొక్కటంతో మురళి అక్కడిక్కడే మృతిచెందాడు. ఇలాఉంటే ఏనుగులను కవ్వించే చర్యలకు పాల్పడవద్దని ఆ ప్రాంత ప్రజలకు అటవీ అధికారులు సూచించారు.

గిరిజన ఎంపిటిసిపై
అత్యాచార యత్నం

జి.మాడుగుల, జూలై 9: విశాఖ ఏజెన్సీలోని జి మాడుగుల మండలంలో మహిళా ఎంపిటిసిపై ఒక యువకుడు మంగళవారం సాయంత్రం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. జి మాడుగులలో వారపుసంత పనులు చూసుకుని తిరిగి గ్రామానికి వెళ్తున్న ఎంపిటిసిని, ఆమె భర్తను మధ్యలో కొండపల్లి సత్తిబాబు అనే యువకుడు అటకాయించి, ఎంపిటిసిపై దాడి చేసి పొదల్లోకి లాక్కొని వెళ్ళాడు. బిత్తరపోయిన భర్త అడ్డుకునే యత్నం చేయగా, అతడిని సైతం సత్తిబాబు తీవ్రంగా గాయపర్చి, మహిళా ఎంపిటిసి వస్త్రాలను చించి అత్యాచార యత్నం చేశాడు. అదే దారిలో మరికొంత మంది వ్యక్తులు రావడాన్ని గమనించిన సత్తిబాబు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.

ఎన్‌ఎంయూ నుంచి
మహమూద్ సస్పెన్షన్

తిరుపతి, జూలై 9: ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహద్‌ను సంఘం నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఖమ్మంలో ఎన్‌ఎంయుకి చెందిన కార్యాలయాన్ని విక్రయించడమే కాకుండా అనేక అక్రమ ఆర్థిక లావాదేవాలను నడిపినట్టు ఆయనపై ఆరోపణలు. కాగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, వయోపరిమితిని 60కి పెంచాలని ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో బుధవారం ఉమ్మడి రాష్ట్రాల ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ సమావేశం తిరుపతిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన రీజనల్, జోనల్, డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు 60 సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయోపరిమితిని నిర్ధేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పుష్కరాలకు మెరుగైన రైల్వే సేవలు

రాజమండ్రి, జూలై 9: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని దక్షిణమధ్య రైల్వే జిఎం పికె శ్రీవాత్సవ చెప్పారు. రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లను బుధవారం ఆయన పరిశీలించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్నంతలో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అదనపు టిక్కెట్లు కౌంటర్లు, ఇతర అదనపు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కొంత ఆలస్యమవుతుందన్నారు. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిర్భయ స్క్వాడ్‌ను ఏర్పాటుచేస్తున్నామని, ఇందుకోసం 16వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, 4వేల మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేలుఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బూరుగుపల్లి శేషారావు, జవహర్, మేయర్ పంతం రజని తదితరులు జిఎం శ్రీవాత్సవను కలిసి తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. పాత రైలు వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేలు కోరినపుడు రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని చెప్పారు. రోడ్‌కంరైలు వంతెన పరిస్థితిని తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.

* కోస్తాంధ్ర, తెలంగాణకు వర్షసూచన
english title: 
b

గోదావరిలో అపారంగా ఇసుక

$
0
0

రాజమండ్రి, జూలై 9: గోదావరి నది మధ్యలో ఉన్న ఇసుక మేటలను తొలగిస్తే వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఎగువన సుమారు 40కిలోమీటర్ల వరకు ఉన్న అఖండ గోదావరి కుడి, ఎడమ గట్ల వెంబడి గోదావరి నదిలో ఎటు చూసినా ఇసుక మేటలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకు వీటి వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గోదావరి ప్రవాహానికి అవరోధంగా తయారయిన ఈ ఇసుక మేటల వల్ల నదీ ప్రవాహం తన దిశను మార్చుకుని గోదావరి గట్లకు దగ్గరగా వెళుతోంది. దీనివల్ల గట్లపై ఒత్తిడి పెరిగి బలహీనపడే ప్రమాదం ఏర్పడుతోంది. కొండలు, గుట్టలు దాటి 15వందల కిలోమీటర్ల ప్రవహించి ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద చేరుకుంటున్న గోదావరి నీటిలో ఇసుకతో కూడిన బురద ఎక్కువ ఉంటుంది. ఇదే ఇసుక మేటలుగా తయారవుతోంది. నిపుణుల అంచనా ప్రకారం పోలవరం ప్రాంతం వద్ద గోదావరిలో ఏడాదికి చదరపు కిలోమీటరుకు 192 క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకుంటోంది.
సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నిర్మాణం తరువాత 30ఏళ్లుగా, అంతకు ముందు 160 ఏళ్ల పాటు బ్యారేజికి ఎగువన ఇసుక మేటలు తొలగింపు జరగనే లేదు. ఈ మేటల తీవ్రత ఎంతగా ఉందంటే, రాజమండ్రి వద్ద గోదావరి వెడల్పు 6కిలోమీటర్లయితే, ఇందులో నీటి ప్రవాహం వెడల్పు కేవలం 2కిలోమీటర్లు మాత్రమే. మిగిలిన 4కిలోమీటర్లు ఇసుక మేటలతో నిండిపోయింది. దీనివల్ల వరద ప్రవాహం అటు పశ్చిమగోదావరి జిల్లావైపు, ఇటు తూర్పుగోదావరి జిల్లావైపు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉంది. 2మీటర్లు ఎత్తులో చాలా చోట్ల ఉన్నాయి. దీనివల్ల వరదల సమయంలో వరద ప్రవాహం సముద్రంలోకి వేగంగా వెళ్లటం లేదు. ఒకటవ, రెండవ హెచ్చరికలను దాటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్న గోదావరి నీటిమట్టం వెనక్కు తగ్గటానికి చాలా ఆలస్యమవుతోంది. నీటిమట్టం తగ్గటం మొదలుపెడితే, సహజంగా మూడు లేదా నాలుగు రోజుల్లో సాధారణ స్థాయికి చేరుకోవాలి. కానీ ఇసుక మేటలు, లంకల్లో ఉన్న చెట్లు కారణంగా రోజుల తరబడి గోదావరి వరద నీటిమట్టం ఎక్కువ రోజులు అలాగే కొనసాగుతోంది.
ఈ ప్రమాదం నుండి గోదావరి జిల్లాలను రక్షించుకోవటంతో పాటు, వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వం సంపాదించుకోవాలంటే గోదావరి ఎగువన 40కిలోమీటర్ల పొడవున ఉన్న ఇసుక మేటలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం బ్యారేజి ఎగువన గూటాల గ్రామం సమీపంలో గోదావరిలో ఉన్న ఇసుక మేటలను నీటిమట్టానికి పైన 2మీటర్ల వరకు, అడుగు భాగాన 2మీటర్ల లోతు వరకు 2కిలోమీటర్ల పొడవున ఇసుకను తవ్వితే కోటి క్యూబిక్ మేటర్ల పైనే ఇసుక లభిస్తుంది. ఈ లెక్కన బ్యారేజి ఎగువన అఖండ గోదావరి కుడి, ఎడమ గట్ల వెంబడి 40కిలోమీటర్ల పొడవున ఇసుక తవ్వకాలు సాగిస్తే సుమారు 20కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభిస్తుంది. గోదావరి వరద గట్ల పొడవు సుమారు 533కిలోమీటర్లు. వరద గట్ల వెంబడి నది మధ్యలో ఉన్న ఇసుక మేటలను కనుక తొలగిస్తే ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేందుకు అవకాశం ఉంటుందో? ఎన్ని వేల కోట్లు సంపాదించగలమో రాష్ట్రప్రభుత్వమే లెక్కలు కట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్ధిక లోటును కచ్చితంగా ఇసుక అమ్మకాల ద్వారా కొంత వరకు భర్తీచేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పైపెచ్చు ఇసుక మేటలు తొలగించుకునేందుకు పర్యావరణ అనుమతులు, ఇతర నిబంధనలు వర్తించవు. అసలే ఇసుక కొరతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నిర్మాణ రంగానికి ఊతమివ్వటమే కాకుండా, సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నానా తిప్పలుపడుతున్న ప్రజలకు దీనివల్ల ఊరట కలుగుతుంది.

కాటన్ బ్యారేజి ఎగువన 40 కి.మీ పొడవున మేటలు
english title: 
g

రాజధానిని సీమలో పెట్టాలి

$
0
0

తిరుపతి, జూలై 9: తిరుపతిని గాని, కర్నూలునుగాని రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ ముందు మేధావులు, ప్రజాసంఘాలు, ప్రొఫెసర్లు ముక్త కంఠంతో విన్నవించారు. తమ ముందు వెలిబుచ్చిన జనకాంక్షను కేంద్రానికి ఇచ్చే నివేదికలో పొందుపరుస్తామని కమిటీ సభ్యులు వారికి హామీ ఇచ్చారు. తిరుపతి ఎస్వీ యూనిర్శిటీ సెనేట్‌హాల్‌లో బుధవారం నూతన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఐదు గంటల పాటు అభిప్రాయ సేకరణ జరుగుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ కేవలం ఒకటిన్నర గంటలోనే ముగించేసారు.
సమావేశం ప్రారంభించడానికి ముందు కమిటీ సభ్యులు అధికారులను వెంటబెట్టుకుని తిరుపతి నగరంలో తిరిగారు. కమిటీ సభ్యులు అరోరారవి, జగన్‌షా, కె.టి.రవీంద్రన్, నితిన్, అడ్వకేట్ రీసెర్చర్ రాసేవావుల్, టౌన్ కంట్రీ ప్లానింగ్ సంచాలకులు, తిమ్మారెడ్డి, ప్రాంతీయ ఉప సంచాలకులు బి.బాలాజీ ముందు మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రాయలసీమకే రాజధానిని ఇవ్వాలన్నారు. రాజధాని పేరిట కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండడం వల్ల విభజన నేపధ్యంలో అందరం బాధపడే పరిస్థితి తలెత్తిందన్నారు. భవిష్యత్‌లో అలా జరగకుండా 13 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పెంపొందించుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వివక్షకు తావులేకుండా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీసిటి వారు జిల్లా ప్రాముఖ్యతను కమిటీ సభ్యులకు వివరించారు. తిరుపతి డెవలప్‌మెంట్ అసోసియేషన్ తిరుపతి గ్లోబల్ సిటీ మ్యాప్‌ను కమిటీకి అందజేశారు. రాయలసీమ అధ్యయనాల కమిటీ అధ్యక్షుడు భూమన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1953లో అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది కనుక ఇప్పుడు కూడా కర్నూలును రాజధాని చేయడం సబబన్నారు. నీటి సమస్య పేరుతో రాజధానిని దూరం చేయవద్దని కోరారు.

* శివరామకృష్ణన్ కమిటీకి అన్ని వర్గాలు వినతి * జనకాంక్షను నివేదికలో పొందుపరుస్తామన్న కమిటీ
english title: 
r

‘దురంతో’కు తప్పిన ప్రమాదం

$
0
0

వరంగల్ బల్దియా, జూలై 9: న్యూఢిల్లీ నుండి చెన్నై వెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రానికి ఉండే ఇనుప పట్టీ విరిగిపోవడాన్ని ప్రయాణికుడు గమనించి అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. పట్టీ విరిగిన బోగిని రైలు నుంచి వేరుచేసి పంపించడానికి రెండు గంటలు పట్టడంతో దురంతో ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్ స్టేషన్‌లో రెండు గంటలు నిలిపివేశారు. దీంతో దూరప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీ నుండి చెన్నై వెళుతున్న చెన్నై దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుండి బయలుదేరింది. రైలులో సుమారు వేయి మంది ప్రయాణికులతో వస్తుండగా కరీంనగర్ జిల్లా రామగుండం స్టేషన్ దాటిన తరువాత ఎస్ 6 బోగిలో ప్రయాణిస్తున్న ఎస్‌ఎస్ కుమార్ అనే ప్రయాణికుడు బోగికి సంబంధించి రకరకాల శబ్దాలు, వైబ్రేషన్ రావడాన్ని గమనించాడు. రైలు కాజీపేట టౌన్ స్టేషన్ దాటుతుండగా సిగ్నల్స్ లేకపోవడంతో రైలును నిలిపివేశారు. రైలు ఆగడాన్ని గమనించిన ప్రయాణికుడు కుమార్ బోగి నుండి కిందకు దిగి ఎస్ 6 బోగి చక్రాలను గమనించాడు. రైలు బోగి రియర్‌వీల్ ఇనుపపట్టీ విరిగిపోవడాన్ని గమనించి డ్యూటీలో ఉన్న టిసి ఎస్.పార్థసారథికి సమాచారం అందించారు. రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు రాగానే రైల్వే అధికారులు ఎస్ 6 బోగిని పరిశీలించారు. రియర్‌వీల్ ఇనుప పట్టీ విరిగిపోవడాన్ని గమనించి వెంటనే కాజీపేట నుండి రైలు ఇంజన్‌ను తెప్పించి ఎస్ 6 బోగిని వేరుచేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మిగతా బోగిలలో ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చోబెట్టి రైలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

వరంగల్ రైల్వేస్టేషన్‌లో దురంతో ఎక్స్‌ప్రెస్ రైలును పరిశీలిస్తున్న రైల్వే అధికారులు

* విరిగిపోయన వీల్‌పట్టీ- వరంగల్‌లో 2 గంటలు నిలిపివేత * లోపాన్ని గమనించి అప్రమత్తం చేసిన ప్రయాణికులు
english title: 
d

వక్కపలుకు గొంతులో అడ్డుపడి చిన్నారి మృతి

$
0
0

బెజ్జూరు, జూలై 9: వక్కపొడి పలుకు మింగిన ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎల్కపల్లి(బి) గ్రామంలో బుధవారం జరిగింది. మాండూరి మల్లేష్, సునీత రెండో సంతానం కిరణ్ (8నెలలు). తండ్రి మల్లేష్ అడవికి వెళ్లగా, తల్లి సునీత సమీప పెరట్లో వ్యవసాయ పనులు చేస్తోంది. కిరణ్ సోదరి కృష్ణవేణి ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో చిన్నారి ఇంట్లో కింద పడిన వక్కపొడిని మింగాడు. దీంతో కిరణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కృష్ణవేణి తల్లికి సమాచారం అందజేసింది. హుటాహుటిన తల్లి వచ్చి కిరణ్‌కు శ్వాస ఆడక ఇబ్బంది పడడం చూసి ఇరుపొరుగు వారి సహాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. స్థానికంగా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం లేకపోవడంతో 108లో కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతి చెందాడు. వక్క పొడి తిని తన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

వక్కపొడి పలుకు మింగిన ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం
english title: 
a

బిసి వసతి గృహాలకు దశలవారీగా సొంత భవనాలు

$
0
0

విజయవాడ, జూలై 9: ఆంధ్రప్రదేశ్‌లోని బిసి వసతి గృహాలన్నింటిలో కనీసం వౌలిక సదుపాయాల కల్పనతో పాటు దశల వారీగా సొంత భవనాలు సమకూర్చనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. హాస్టల్ విద్యార్థులు వేర్వేరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని అయితే ఉపాధ్యాయుల్లో అత్యధిక మంది స్తానికంగా నివసించకుండా నిత్యం సుదూర ప్రాం తాల నుంచి వచ్చిపోతుండటంతో ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్లిపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయని అన్నారు. ఉపాధ్యాయుడు విధిగా ఉదయం 9 గంటలకే ప్రాంగణంలో ఉండేలా గట్టి చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు , ఉద్యోగులు అందరూ పనిచేసే చోటే నివాసం ఉండాలనే విషయమై రానున్న మంత్రివర్గంలో చర్చించాల్సి ఉందని దానిపై తాను ఒక్కడినే ఏ నిర్ణయం తీసుకోలేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్థానిక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ సమావేశపు హాలులో రాష్ట్రంలోని 13 జిల్లాల బిసి సంక్షేమ అధికారులు, రెసిడెన్షియల్ కళాశాలల ప్రిన్సిపాల్, బిసి స్టడీ సర్కిల్ అధికారులతో మంత్రి రవీంద్ర బుధవారం జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాకో స్టడీ సర్కిల్ ఉందని వీటిల్లో అధ్యయనం చేసేవారికి హాస్టల్ సదుపాయం కల్పించి సరైన బోధనా సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 900 వసతి గృహాలున్నాయని వీటిల్లో కేవలం 500 గృహాలకే సొంత భవనాలున్నాయని చెప్పారు. 300 హాస్టల్స్‌కు వార్డెన్లు లేరని దీనివల్ల కూడా అక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులు లే కుండా పోతున్నారని, నాలుగో తరగతి సిబ్బంది పోస్టులు వెయ్యి వరకు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. 31 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయంటూ దశల వారీగా వసతి గృహాలన్నింటిని రెసిడెన్షియల్‌గా మార్చగలమన్నారు. బిసి బడిఈడు పిల్లలు వసతి గృహాల్లో చేర్పించేందుకై వారి తల్లితండ్రులలో అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేపడతామన్నారు.

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

ఉదయం 9 గంటల కల్లా టీచర్లు ఉండేలా చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర
english title: 
bc

కృష్ణా డెల్టాకు దాహార్తి

$
0
0

విజయవాడ, జూలై 9: కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నారుమళ్ల విషయం ఆ దేమునికే ఎరుక. తాగునీటి సమస్య నివారణ కోసం చెరువులను నింపుకోటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యం తెలంగాణ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తున్నది. రాష్టప్రతి పాలన సమయంలోనే ఉభయ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో తాగునీటి అవసరాలకై దాదాపు 600 తాగునీటి చెరువులను నింపుకోటానికి 10 టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ నీటి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పోరాడాల్సి వస్తున్నది. ఈ నీటితో నారుమళ్లు పోసుకుంటున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై కేంద్ర జల సంఘం ప్రతినిధులు ఆఘమేఘాలపై కృష్ణా డెల్టా ప్రాంతంలో పర్యటించి అసలు తాగునీటి చెరువులే నిండలేదు. ఇక నారుమళ్లు ఏమిటంటూ అపహాస్యం చేసి, నీటి విడుదలను కొనసాగింపచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ముందస్తుగా ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీ ముగిసిందంటూ మంగళవారం రాత్రి నాగార్జున సాగర్ వద్ద నీటి విడుదలను నిలిపివేశారు. అయితే రికార్డుల ప్రకారం 7.2 టిఎంసిల నీరు విడుదలయితే ప్రకాశం బ్యారేజీకి కేవలం 4.1 టిఎంసిలు మాత్రమే చేరింది. మార్గమధ్యంలో విజినేపల్లి వద్ద 4.14 టిఎంసిలు రాకార్డు అయింది. సిపేజీ ఆవిరి కారణంగా అత్యధిక మొత్తంలో నీరు ముందుకు ప్రవహించడం లేదు అయితే తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యాలేజీ వద్ద నిలువ ఉండాల్సిన నీటినే కాలువలకు సరఫరా చేస్తుండటంతో ఎన్‌టిటిపిఎస్‌లో విద్యుత్ ఉత్పాదనకై ఏడాది పొడవునా 12 అడుగుల మేర ఉండాల్సిన నీటిమట్టం 11 అడుగులకు దిగజారింది. ఇదొక ఆందోళనకర అంశం. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులకు కొద్దిపాటి నీరు చేరినా అటు ప్రకాశం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల వైపు కాలువలకే చుక్క నీరు చేరలేదు. ఇక చెరువులకు నీరు ఎలా చేరుతుంది. దీంతో ఆయా ప్రాంత ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఇప్పటివరకు అరకొరగా వదలిన ఆ కొద్దిపాటి 7.2 టిఎంసిల నీటివల్ల తెలంగాణ ప్రాంత రైతాంగానికి దాదాపు రూ.237 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఎలా అంటే ఈ నీటి విడుదల కోసం సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన జరగటం వల్ల 39.5 మిలియన్ యూనిట్లు (1647 మెవా) విద్యుత్ ఉత్పత్తి జరగటం వల్ల తెలంగాణ ప్రాంతంలో బోర్లు ఆధారిత భూముల్లో నారుమళ్ల ప్రక్రియ ఊపందుకుంది. సాధారణంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు కనీసం ఆరు రూపాయలు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొంతమేరకు విద్యుత్ కొనుగోలుకు నిధులు వెచ్చించక్కర్లేకుండా పోయింది.

ప్రకాశం బ్యారేజీకి చేరింది కేవలం 4.1 టిఎంసిల నీళ్లే
english title: 
k

కృష్ణాడెల్టాకు నీటి నిలిపివేత

$
0
0

నాగార్జునసాగర్, జూలై 9: నాగార్జునసాగర్ జలాశయం నుండి గత రెండువారాలుగా సాగునీటి అవసరాలకై కృష్ణాడెల్టా ప్రాంతానికి విడుదల చేస్తున్న నీటిని బుధవారం ఉదయం 7గంటలకు నిలిపివేశారు. గత నెల 25వ తేది నుండి ఈనెల 8వ తారీఖు వరకు నీటి విడుదల చేసిన అధాకారులు బుధవారం ఉదయం 7గంటల వరకు సగటున ఒక్కరోజే 7,685క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 590అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 513.10అడుగులుగా ఉంది. మరో మూడు అడుగులు నీటిమట్టం తగ్గిపోతో సాగర్ జలాశయం కనీస నీటిమట్టానికి చేరుకుంటుంది. బుధవారం జలాశయం నుండి 900క్యూసెక్కుల నీటిని ఎస్‌ఎల్‌బిసికిగాను విడుదల చేశారు. గత రెండువారాలుగా 7.2టిఎంసిల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేసినందుకుగాను సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 39మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేశామని జెన్‌కో ఎస్‌ఇ ఉమామహేశ్వర్‌శాస్ర్తీ తెలిపారు.

నాగార్జునసాగర్ జలాశయం నుండి గత రెండువారాలుగా సాగునీటి అవసరాలకై కృష్ణాడెల్టా ప్రాంతానికి విడుదల చేస్తున్న నీటిని బుధవారం ఉదయం 7గంటలకు నిలిపివేశారు.
english title: 
k

ఎక్కువగా ఊహించుకోవడం పొరపాటే

$
0
0

జైట్లీ బడ్జెట్‌పై మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ

విజయవాడ, జూలై 10: కేవలం నెల రోజుల పాలనలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ గురించి ఎక్కువగా ఊహించుకుని విమర్శించటం సరికాదని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రభూమి ప్రతినిధితో తన అభిప్రాయాలను వెల్లడించారు. గత జనవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని దాన్ని కొనసాగించడం మినహా విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం లేదన్నారు. అయితే 2015-16 బడ్జెట్‌లో గణనీయమైన మార్పులు రాగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికి కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవలం రెండు మాత్రమే ఉండగా మూడవదాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయటం హర్షణీయమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు 100 కోట్లు కేటాయింపులు జరిగినా కనీసం 1500 కోట్లు ఖర్చు కాగలదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో గెజిట్‌లో పేర్కొన్న విధంగా గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీలను మంజూరుచేస్తూ కోటి రూపాయల చొప్పున కేటాయించారని, అయితే వీటికి త్వరితగతిన స్థలాలను ఎంపిక చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉందన్నారు. ఎయిమ్స్, ఐఐటి, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్, ట్రిపుల్ ఐఐటి, ఎన్‌ఐటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ వంటివి దశలవారీగా వచ్చే అవకాశం ఉందని వీటిక్కూడా ముందుగానే స్థలాలను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కొత్తరాజధాని నిర్మాణానికి తగినన్ని నిధుల కేటాయింపు జరగలేదన్నారు.
రైతాంగానికి ఊరట ఏదీ: సిపిఐ
విశాఖపట్నం: సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగాన్ని గట్టెక్కించే చర్యలేవీ కొత్త బడ్జెట్‌లో లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ధరల స్థిరీకరణకు కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించటంతోనే ప్రభుత్వ చిత్తశుద్ధి వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడుల విషయంలో గత యుపిఏ ప్రభుత్వం కంటే ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం మరింత వేగంగా పరుగెడుతోందన్నారు. రోడ్లు, వౌలిక సదుపాయాల కల్పన, విమానాశ్రయాలు ఇలా అన్నింటినీ ప్రైవేటీకరించటమే నరేంద్రమోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనపడుతోందన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి తెచ్చి, ధరలు తగ్గించే చర్యలు బడ్జెట్‌లో ఏ మాత్రం లేవన్నారు. బిజెపితో చేతులు కలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు నోరు మెపటం లేదన్నారు.

జైట్లీ బడ్జెట్‌పై మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ
english title: 
shivaji
Viewing all 69482 articles
Browse latest View live