Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Articles on this Page

(showing articles 5561 to 5580 of 38963)
(showing articles 5561 to 5580 of 38963)

older | 1 | .... | 277 | 278 | (Page 279) | 280 | 281 | .... | 1949 | newer

    0 0

    హైదరాబాద్, జూలై 12: తెలంగాణ హోం శాఖలో సూపర్ న్యూమర్ పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 134 డిఎస్పీ సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈ పోస్టుల్లో డిఎస్పీల నుంచి ఇన్‌స్పెక్టర్లుగా రివర్షన్ పొందిన 42 మంది, సీనియారిటీ ద్వారా డిఎస్పీలుగా పదోన్నతులు పొందే మరో 92 మందిని భర్తీ చేయనున్నారు. ఈ 134 సూపర్ న్యూమరీ పోస్టులోని అధికారులు పదవీ విరమణ పొందడం లేదా ప్రభుత్వం వాటిని రద్దు చేయడం ఈ రెండింటిలో ఏది ముందు జరుగుతుందో అప్పటి వరకు ఆ పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఎన్ శివ శంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
    సిఎస్‌తో డిజిపి భేటీ
    హైదరాబాద్, జూలై 12: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో రాష్ట్ర డిజిపి రాముడు శనివారం సమావేశమయ్యారు. శనివారం సెలవు రోజు అయినప్పటికీ వారు ప్రత్యేకంగా సచివాలయంలోనే భేటీ కావడం గమనార్హం. పోలీసు అధికారుల బదిలీ, ఇతర పాలనాంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే కేవలం అంతర్గత భేటీ మాత్రమేనని, ప్రత్యేక విశేషాలు లేవని సిఎస్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.

    బంద్‌లు ఎందుకు?
    ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి * కెసిఆర్‌కు రుద్రరాజు సూచన
    హైదరాబాద్, జూలై 12: బంద్‌లు నిర్వహించడం దేనికీ? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ (ఎపిసిసి) ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు టి.జెఎసి నేతలను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావునుద్దేశించి అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. 1956 సంవత్సరం కంటే ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని సార్వత్రిక ఎన్నికల ముందు కెసిఆర్ పలు పర్యాయాలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం కుంటుపడిందని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. టిడిపి, బిజెపి ఎంపీలు కొత్తగా పరిశ్రమలను ఎందుకు తెప్పించలేకపోతున్నారు?, వౌలిక వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతరత్రా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకుని రావడంలో ఎందుకు మొహమాటపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

    విద్యుత్ సమస్యలపై ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థ
    హైదరాబాద్, జూలై 12: ఆంధ్రరాష్ట్రంలో విద్యుత్ రంగంలో కొత్తగా కంప్యూటర్ ఆన్‌లైన్ వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా, లేక నాణ్యమైన విద్యుత్ అందకపోయినా తక్షణమే విద్యుత్ శాఖాధికారులు రంగంలోకి దిగి మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఆన్‌లైన్ వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయిందని వినియోగదారుడు ట్రాన్స్‌కో టోల్ ఫ్రీ నంబర్ 180042555333కు ఫోన్ చేస్తే రికార్డు అయిన సమాచారం తక్షణమే సంబంధిత సబ్‌స్టేషన్‌కు చేరుతుంది. రెండు రోజుల్లో ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి సమీక్షించి సిఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న డాటా సెంటర్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఏపి జెన్కో సిఎండికి ప్రభుత్వం సూచించింది. డిజాస్టర్ రికవరీ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తారు. టాటా కనె్సల్టెన్సీ సర్వీసస్ రూపొందించిన ఈ వ్యవస్ధను ఫీడర్‌లో తలెత్తే విద్యుత్ అంతరాలను జిపిఎస్ మ్యాపింగ్ ద్వారా జిల్లా, మండలం, సబ్‌స్టేషన్ నుండి ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా, వోల్టేజి వంటి అంశాల్లో కూడా కొన్ని మార్పులు సూచించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పబ్లిక్ వెబ్‌సైట్ ద్వారా ఈ వ్యవస్ధను అందుబాటులోకి తెస్తారని సిఎం కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు.

    ఈసేవ డైరెక్టర్‌గా శ్రీధర్
    హైదరాబాద్, జూలై 12: పలువురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈసేవా డైరెక్టర్‌గా బి శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ బాబు, పిఎస్ ప్రద్యుమ్న సత్యనారాయణలు గ్రేటర్ హైదరాబాద్ అడిషనల్ కమీషనర్లుగా నియమించారు. పి కోటేశ్వరరావును వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. శ్రీమతి పి ప్రశాంతిని మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఆరవింద్ సింగ్‌ను ప్రొటోకాల్ డైరెక్టర్‌గా నియమించారు. ఇ శ్రీధర్‌ను వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. లవ్ అగర్వాల్‌ను సాప్ వైఎస్ ఛైర్మన్, ఎండిగా నియమించారు. రాహుల్ బొజ్జాకు ఎస్సీ , బిసి సంక్షేమ శాఖల డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

    ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    english title: 
    t

    0 0

    హైదరాబాద్, జూలై 12: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో విడుదల చేస్తారు. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి గంటా శ్రీనివాసరావువిడుదల చేస్తారు. అనంతరం 12 గంటలకు పరీక్షల బోర్డుకార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి విడుదల చేస్తారు. తొలుత తెలంగాణ రాష్ట్ర ఫలితాలను ఈ నెల 14వ తేదీన పరీక్షల బోర్డు కార్యాలయంలో విడుదల చేయాలని భావించారు. 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తున్న సందర్భంగా అదే రోజు తెలంగాణ రాష్ట్ర ఫలితాలను కూడా ఇస్తే బావుంటుందనే చర్చ జరగడంతో తేదీని మార్చారు. వెంటనే వెబ్‌సైట్లలో ఉంచుతామని ఫలితాలను పరీక్షల బోర్డు సంచాలకుడు బి మన్మధరెడ్డి చెప్పారు.

    పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల ఫలితాలను
    english title: 
    10th

    0 0

    సుప్రీం కోర్టులో నిలవదు * మండలాల బదిలీ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి

    న్యూఢిల్లీ, జూలై 12: పోలవరం నిర్మాణంతో ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని రెండువందల పైచిలుకుగ్రామాలను ఆంధ్రకు బదిలీ చేస్తూ లోక్‌సభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనందున సుప్రీం కోర్టు కచ్చితంగా కొట్టివేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుందని ఆయన శనివారం విలేఖరులకు చెప్పారు. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించే ముందు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే తీరులో ప్రభుత్వం రూపొందించిన బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించవలసిందిగా తమ పార్టీ అధినాయకత్వాన్ని కోరతానని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆమోదించిన బిల్లులో ముంపునకు గురయ్యే గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయటం జరిగిందని జైపాల్ చెప్పారు. కాగా ఇప్పుడు ఆమోదించిన సవరణ బిల్లు ప్రకారం ముంపునకు గురికాని గ్రామాలను కూడా ఆంధ్ర ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నారని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులవుతారని, గిరిజనులుకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కులను కూడా పట్టించుకోకుండాప్రభుత్వం హడావిడిగా బిల్లును తీసుకురావటం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించటంతోపాటు వారు కోల్పోయే భూమికి సరిసమానమైన భూమిని ఆయకట్ట ప్రాంతంలో ఇవ్వవలసి ఉంటుందని ఆయన చెప్పారు. వీటన్నింటిపై చర్చించకుండా ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ సాయం లేకుండా పోలవరం నిర్మాణం సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. యుపీఏ ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి జెండా ఊపింది. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ముంపుగ్రామాలను ఖరారు చేయటం జరిగిందన్నారు. మార్చి రెండవ తేదీతో ఈ ప్రక్రియ పూర్తయిది. ముంపుగ్రామాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేట్లు వచ్చిన ప్రతిపాదనలను తాను మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు.
    యుపీఏ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ రాష్టప్రతికి పంపలేదని తాను గంటాపధంగా చెప్పగలనని జైపాల్‌రెడ్డి చెప్పారు. మార్చి రెండు నుంచి ఇప్పటివరకూ మీరు ఎందుకు వౌనం వహించారన్న ప్రశ్నకు ఎన్నికల కారణంగా మాట్లాడలేకపోయామని చెప్పారు. ఎన్నికలు జరిగి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎర్పడినందునే కేంద్ర ప్రభుత్వం ముంపుగ్రామాల వ్యవహారంపై చర్చించి సామరస్యంగా పరిష్కరించి ఉంటే బాగుండేదని జైపాల్ చెప్పారు. మార్చి రెండు తరువాత రాజ్యాంగంలోని మూడు, నాలుగు అధికరణల ప్రక్రియ ముగిసిపోయిందని ఆయన అన్నారు. ఒకసారి తెరపడిన తరువాత ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించే అధికారం ఎవ్వరికి లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని తిరిగి రెండు రాష్ట్రాల విధాన సభలకు పంపి ఆమోదం పొంది తీరాలని జైపాల్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును సంతృప్తిపరిచేందుకే ఎన్డీయే ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించిందని జైపాల్ ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరించిన ఆనాలోచిత ధోరణి వల్ల రెండు ప్రాంతాల ప్రజల మధ్య అపార్ధాలు పెరుగుతాయని జైపాల్ అభిప్రాయ పడ్డారు.

    సుప్రీం కోర్టులో నిలవదు * మండలాల బదిలీ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి
    english title: 
    jaipal

    0 0

    *14న ఢిల్లీకి హరీశ్ రావు బృందం

    హైదరాబాద్, జూలై 12: కృష్ణా జాలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నాయకత్వంలో నిపుణుల బృందం సోమవారం ఢిల్లీ వెళుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ వాదన వినిపించేందుకు, తెలంగాణకు న్యాయం జరిగేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఢిల్లీ వెళుతున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రాల వాదన విన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉన్నందున తమ వాదన తాము వినిపించుకునే అవకాశం కల్పించాలని కోరనున్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో, ఎలాంటి మార్పులు చేయాలో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 18 పేజీల నివేదిక రూపొందించింది. హరీశ్‌రావు బృందం ఈ నివేదికను కేంద్ర మంత్రి ఉమాభారతికి అందజేస్తారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే అది 2050 వరకు ఉంటుంది. తెలంగాణ ఏర్పడకముందు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందే ట్రిబ్యునల్ నివేదిక ఇచ్చింది. ఆ తరువాత తెలంగాణ ఏర్పడినందున మారిన పరిస్థతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ తీర్పు వర్తిస్తుంది.
    ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల
    ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, భూ సేకరణ కొంత వరకు మిగిలినట్టు మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంథనిలోని 20వేల ఎకరాలకు డిసెంబర్‌లో నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. వచ్చే మార్చినాటికి మరో 30వేల ఎకరాలకు నీటివిడుదల జరుగుతుంది. రెండున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే సామర్ధ్యం ఉండగా, తొలి విడత లక్ష ఎకరాలకు నీరు విడుదల చేస్తారు. ఎల్లంపల్లి భూ సేకరణ కోసం నిర్వాసితులకు 120 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ బాధితుల సమస్యలపై సమీక్షించినట్టు తెలిపారు. సమస్యలు పరిష్కరించనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.

    *14న ఢిల్లీకి హరీశ్ రావు బృందం
    english title: 
    harish

    0 0

    టిడిపి, బిజెపిని డిమాండ్ చేసిన మంత్రి హరీష్‌రావు
    బాధితుల పక్షాన ఉండాలనుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్ వ్యతిరేకించాలి

    హైదరాబాద్, జూలై 12: పోలవరం ముంపు మండలాల బదలాయింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కార్చవద్దని, నిజంగా బాధితుల పక్షాన ఉండదలిస్తే రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకు వచ్చి రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపుమండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిజెపి, టిడిపి నాయకులు తమ అభిప్రాయం చెప్పాలని టిఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తన్నీరు హరీశ్‌రావు సచివాలయంలో, పార్టీ నాయకుడు కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్‌లో ఈ అంశంపై శనివారం విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ టిడిపి, బిజెపి నాయకులు ముంపు మండలాల వ్యవహారంపై తమ పార్టీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
    పొలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ విజయవంతం అయిందని కర్నే ప్రభాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపిలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తే, ఆ రెండు పార్టీలకు చెందిన తెలంగాణ ఎంపిలు మాత్రం వౌనంగా ఉన్నారని కర్నే ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ఆలోచించడం లేదని, తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నాయని విమర్శించారు.

    టిడిపి, బిజెపిని డిమాండ్ చేసిన మంత్రి హరీష్‌రావు బాధితుల పక్షాన ఉండాలనుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్ వ్యతిరేకించాలి
    english title: 
    polavaram

    0 0

    41 మంది డిఎస్పీలకు ఇన్‌స్పెక్టర్లుగా రివర్షన్ * ఉత్తర్వులు జారీ

    హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో 28 మంది ఇన్‌స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డిజిపి అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో మరో 41 మంది డిఎస్పీలకు ఇన్‌స్పెక్టర్లుగా రివర్షన్ కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని 1985, 1989 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం 55 మంది ఇన్‌స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు ఉత్తర్వులు జారీ చేశారు.
    తాజాగా తెలంగాణలో కూడా 28 మందికి పదోన్నతులు, 41 మందికి రివర్షన్ కల్పిస్తూ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డిఎస్పీలుగా ఉన్న అధికారులను ఇన్‌స్పెక్టర్లుగా రివర్షరన్ ఇస్తే వారి మానసిక స్థైర్యం దెబ్బ తింటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రివర్షన్ కాకుండా మరో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేశారు.

    41 మంది డిఎస్పీలకు ఇన్‌స్పెక్టర్లుగా రివర్షన్ * ఉత్తర్వులు జారీ
    english title: 
    dsp

    0 0

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు నేతల విజ్ఞప్తి

    హైదరాబాద్, జూలై 12: కాపుల సమస్యలను సానుకూలంగా స్పందించగలమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో కాపునేతలు చంద్రబాబునాయుడును కలిసి అనేక సమస్యలను వివరించారు. కాపులను బిసిల్లో చేర్చాలని, 2014-15 సంవత్సరంలో కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు, కాపుకుల ఆర్ధిక, సామాజిక కులగణన సర్వేకు గానూ బిసి కమిషన్‌కు కోటి రూపాయిలు కేటాయించాలని అన్నారు. తమకు మెరుగైన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని వారు చంద్రబాబునాయుడును కోరారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను ఎఫ్ కేటగిరి కింద కేటాయించి బిసిలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని వారు కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. కాపునేతల డిమాండ్ల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాపునాడు అధ్యక్షుడు వి పి నారాయణ స్వామి రాయల్, ప్రధానకార్యదర్శి రెడ్డిపల్లి సత్యనారాయణ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రేవూరి భాస్కర్, నీలం బాలాజీ, అనిల్ రాయల్‌లు కలిశారు.
    లోకేష్‌తో విద్యార్థి సంఘం భేటీ
    తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టిడిపి విద్యార్ధి విభాగం ముఖ్యనాయకులు టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారాలోకేష్‌తో ఎన్టీఆర్ భవన్‌లో భేటీ అయ్యారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధినేతలతో , యువత సంక్షేమం, అభివృద్ధి, విద్యార్ధి విభాగం బలోపేతం తదితర అంశాలపై నారాలోకేష్ చర్చించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రూపొందించిన విద్యార్ధుల స్వాగత గోడ పత్రికలను నారా లోకేష్ విడుదల చేశారు. దేశంలోని నిర్మాణాత్మకమైన , శక్తివంతమైన విద్యార్ధి విభాగంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ను తీర్చిదిద్దేందుకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ పదిరోజుల్లో నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రెండు రాష్ట్రాల్లో టిడిపి విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. జూలై చివరి వారంలో సభ్యత్వ నమోదు మొదలుపెట్టి ఆగస్టు చివరి నాటికి రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది నూతన విద్యార్ధులను చేర్పించి, సభ్యత్వం కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తామని అన్నారు. దీని కోసం ప్రతి కళాశాలలో కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడానికి ముఖ్య నాయకులతో కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు నేతల విజ్ఞప్తి
    english title: 
    kapu

    0 0

    హైదరాబాద్, జూలై 12: మన ఊరు మన ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టిసారించారు. తెలంగాణ అభివృద్ధికి కొత్త కోణంలో ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించుకున్న కేసిఆర్ ఆ దిశలో తొలి అడుగుగా మన ఊరు మన ప్రణాళికను ప్రకటించారు. ప్రతి గ్రామం తమ గ్రామ ప్రణాళికను తామే రూపొందించుకోవాలి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను అమలు చేసే వారని, అలా కాకుండా ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆదిలాబాద్ జిల్లాకు అశోక్, కరీంనగర్ పార్థసారధి, వరంగల్ రాహుల్ బొజ్జా , ఖమ్మం కుమార్ ప్రసాద్, నల్లగొండ అనీల్, మహబూబ్‌నగర్, జగదీశ్, రంగారెడ్డి బిఆర్ మీనా, మెదక్ బి వెంకటేశం, నిజామాబాద్ జనార్ధన్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు సోమేశ్‌కుమార్‌లకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.

    మన ఊరు మన ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక
    english title: 
    mana vooru - mana pranalika

    0 0

    హైదరాబాద్, జూలై 12: పోలవరం ప్రాజెక్టు కింద 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిపే బిల్లును లోక్‌సభ ఆమోదించడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నోట్లో వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. ఈ విషయంలో తప్పిదం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోనే కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఈ ఆర్డినెన్స్ వచ్చి ఉండకపోతే ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడమే కాకుండా ఆందోళనలతో అట్టుడుకించే వాళ్ళమని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ శనివారం టి.జెఎసి ఇచ్చిన బంద్‌లో పాల్గొనాలని పార్టీ పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఏడు మండలాలు, 236 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అయితే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం అంశం రావణకాష్టంగా మారుతున్నదని, దీనికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఇతర పార్టీలు దుమ్మెత్తిపోయడం లేదన్న తృప్తి కొంత ఉందని మరో నాయకుడు అన్నారు. ఎపి పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014లోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకుని వచ్చి కేంద్రం ఆమోదించినందున ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఆందోళన చేయడానికి అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు కొందరు బాధపడుతున్నారు.

    పోలవరం ప్రాజెక్టు కింద 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిపే బిల్లును లోక్‌సభ
    english title: 
    t congress

    0 0

    * కొనసాగుతున్న రగడ
    * ఆయకట్టు రైతుల్లో అయోమయం
    * ఖరీఫ్ ప్రారంభమైనా నారుమళ్ల జాడే లేదు
    మహబూబ్‌నగర్, జూలై 13: ఆర్డీఎస్ రగడ కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటిని అందించే రాజోళిబండ మళ్లింపు పథకం మరోసారి ఉద్రిక్తతలకు తావిచ్చింది. రూ. 118 కోట్లతో ఆర్డీఎస్ ఆధునీకీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎనిమిది ఫేజ్‌ల మరమ్మతు పనులు 80శాతం పూర్తయి మిగతా పనులను ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచాల్సి ఉంది. ఆనకట్ట ఎత్తును పెంచేందుకు కాంట్రాక్టర్లు పనులు చేపట్టిన వెంటనే సీమకు చెందిన రైతులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆనకట్ట ఎత్తు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే రెండుమార్లు ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పనులను అడ్డుకున్న కర్నూల్ జిల్లాకు చెందిన నాయకులు మరోసారి ఆనకట్ట దగ్గరకు వచ్చి హల్‌చల్ సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు ఆదివారం ఆనకట దగ్గరకు వెళ్లారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచాల్సిందేనని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కర్నాటక పోలీసులు ఇటు తెలంగాణ రైతాంగాన్ని, అటు సీమ రైతాంగాన్ని ఎక్కడికక్కడ వెనక్కి పంపించారు. ఆర్డీఎస్ పథకం కింద అలంపూర్ నియోజకవర్గంలోని 87500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ఇప్పటికీ ఏ ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిన దాఖలాలు లేవు. 25వేల నుండి 30వేల ఎకరాలకు మాత్రమే ప్రతి ఏటా ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించిన దాఖలాలు ఉన్నాయి. ప్రతిసారి తుంగభద్ర నది నుండి నీరు వచ్చిన తదుపరి వివాదాలకు ఆర్డీఎస్ కేంద్ర బిందువుగా మారి రైతులలో ఆందోళన కలిగిస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికినీ ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు కూడా విడుదల కాకపోవడం ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే దృక్పథంతో ఆధునీకీకరణ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో దృష్టి పెట్టి రూ. 118 కోట్ల నిధులను రెండు, మూడు విడతలుగా విడుదల చేశాయి. ప్రస్తుతం ఆధునీకీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అభ్యంతరాలు బయటకు రావడం, దాంతో ఆయకట్టు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఏ ఒక్క రైతు కూడా నారుమళ్లను కూడా సిద్ధం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆర్డీఎస్‌పై కొనసాగుతున్న రగడను తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఆయకట్టు చైర్మన్ సీతారాంరెడ్డి సైతం ఆధునీకీకరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఆనకట్ట దగ్గర పనులు చేపట్టబోయే తరుణంలో రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు అడ్డుకుని పనులకు అంతరాయం కలిగించడం పట్ల చైర్మన్ సీతారాంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ రెండు, మూడు రోజుల నుండి ఆర్డీఎస్ ఆనకట్ట పనులు చేస్తూ ఎత్తు పెంచేందుకు పనులు ఇలా ప్రారంభించారోలేదో రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం పట్ల ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై తెరాస దృష్టి
    మహబూబ్‌నగర్, జూలై 13: జిల్లాలోని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించని పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై జిల్లా తెరాస శ్రేణులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో తెరాస ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ తరపున ఇన్‌చార్జిలను నియమించే అవకాశాలు ఉన్నాయని సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏడుగురు ఉండటంతో వారిని ఎదుర్కొనేందుకు నియోజకవర్గాలలో తెరాస ఇన్‌చార్జిలను నియమించాలని జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించి ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలు, మరోపక్క పార్టీ కార్యక్రమాలను విస్తృత పరచాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుండి ఇద్దరి పేర్లను కెసిఆర్ తీసుకున్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే ఒకపక్క పార్టీ బలోపేతం, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించే అవకాశాలు ఉంటాయని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా జిల్లాకు నాలుగైదు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను కూడా ఇచ్చి తెరాసను మరింత బలోపేతం చేసేందుకు టిఆర్‌ఎస్ నాయకులు కసరత్తులు ప్రారంభించారు. ఏదిఏమైనప్పటికినీ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహంచని నియోజకవర్గాలలో త్వరలోనే ఇన్‌చార్జిలను నియమించే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం.

    జిల్లా కాంగ్రెస్‌లో ప్రక్షాళనకు రంగం సిద్ధం
    మహబూబ్‌నగర్, జూలై 13: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే కాలంలో అధికారానికి చేరువలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుండే పార్టీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ప్రతిసారి ఎన్నికల్లో పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం సందర్భంగా ఓటింగ్‌లో ఇలాంటి అంశాలు తెరపైకి రావడం కూడా ఓటమికి కారణమని చెబుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందడాన్ని ఇంకా ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం కూడా ఉందని జైపాల్‌రెడ్డి అనుచరులు భావిస్తున్నారు. ఈ అంశాలు ఎలా ఉన్నా ఐదేళ్ల తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఇద్దరు, ముగ్గురు పరిశీలకులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా గ్రామ స్థాయి నుండి పార్టీని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. డిసిసి కార్యవర్గంతో పాటు గ్రామ స్థాయి కార్యవర్గంపై కసరత్తులు చేసి పార్టీని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెలాఖరులో జిల్లాకు ఢిల్లీ నుండి దూతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రాహుల్ దూతలు నాలుగైదు రోజులు జిల్లాలోనే మకాం వేసి గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణానికి తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో మిగతా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్యవర్గాలను కూడా నియమించేందుకు టి.పిసిసి నేతలు ఇప్పటికే ఆయా అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకత్వానికి సూచనలు, సలహాలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ప్రభుత్వ చర్యలకు నిరసనగా, టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేసేందుకు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐలను జిల్లాలో బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తులు మొదలుపెట్టారు. ఏదిఏమైన్పప్పటికినీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాలను విస్తృత పరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

    కాంగ్రెస్, టిఆర్‌ఎస్ బహిరంగ చర్చా వేదికను అడ్డుకున్న పోలీసులు
    * కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన మైదానం
    గద్వాల, జూలై 13: 2005-2009 సంవత్సరంలో గద్వాల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో చర్చావేదికకు సిద్ధమని మూడు రోజుల క్రితం టిఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. చర్చావేదిక జరిగితే గొడవ జరిగే ప్రమాదం ఉందని పోలీసులు ముందస్తుగా గ్రహించి పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు. ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి తేరుమైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తేరుమైదానం చుట్టుపక్కల ఎవరిని కూడ రానివ్వకుండా పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు చేపట్టారు. అయినా లెక్కచేయకుండా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకులు చర్చావేదికకు సిద్ధపడి తేరుమైదానం వద్దకు చేరుకున్నారు. రెండు పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. గద్వాల మున్సిపాలిటీ 2005లో అప్పటి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ బిఎస్ కేశవ్ కొనసాగారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు కేశవ్ టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో చైర్మన్‌గా పని చేసిన కేశవ్ రూ.4 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని, రూ.47లక్షల ఎల్‌ఆర్‌ఎస్ నిధులు, బిఆర్‌ఎస్ నిధులు స్వాహా చేశారని, 2వ వార్డు గంజిపేట, 11వ వార్డు వడ్లవీధి లబ్దిదారుల పేరట 17వ వార్డులో కోట్ల రూపాయల ఇందిరమ్మ బిల్లులు స్వాహాచేశారని, పిల్లిగుండ్ల లబ్దిదారుల నుంచి డబ్బుల వసూలు తదితర అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీన్ని ప్రతి సవాల్‌గా తీసుకున్న టిఆర్‌ఎస్ నాయకులు మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి పాల్పడలేదని, ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో కౌన్సిలర్లు పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించడం జరిగింది. దీంతో ఇరుపార్టీల వారు చర్చావేదికకు సిద్ధమయ్యారు. చర్చావేదిక జరిగితే ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతో డిఎస్పీ గోవిందరెడ్డి 144 సెక్షన్‌ను విధించారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను డికె సత్యారెడ్డి బంగ్లా వద్ద, టిఆర్‌ఎస్ నాయకులను కృష్ణమోహన్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. చివరకు వారి కళ్లుగప్పి తేరుమైదానం సమీపానికి చేరుకున్నారు. సిఐ రఘు, ఎస్‌ఐలు గడ్డంకాశీ, సత్యనారాయణ, అప్పయ్యతో పాటు పోలీసు సిబ్బంది పహారా కాశారు. ఇరుపార్టీల వారిని తేరుమైదానానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ నేత కేశవ్ పలుమార్లు ఆగ్రహంగా ఊగిపోతూ కాంగ్రెస్ నాయకులను కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మీసాలు మెలేసి..తొడగొట్టారు. ఇది గమనించిన కాంగ్రెస్ నేత బండల వెంకట్రాములు సైతం మీసాలు మెలేశారు. ఆతర్వాత ఇరువురు చీపుర్లు, చెప్పులు చూపించుకున్నారు. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన పోలీసులు ఇరుపార్టీల నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసి పంపించి వేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు చంద్రశేఖర్, పులిపాటి వెంకటేష్, భాస్కర్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, రామాంజనేయులు టిఆర్‌ఎస్ నేతలవైపు పరుగులు తీయడంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు.
    గత మూడు నెలలుగా గద్వాల పట్టణంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పక్షాల వాదోపవాదాలు, సవాళ్లు, ఘర్షణలు, దూషణలను చూసి పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గద్వాల పట్టణంలో ప్రస్తుత రాజకీయ పక్షాలు విద్వేషాలను రెచ్చగొట్టడం మంచి పద్ధతికాదని వారిస్తున్నారు.

    వౌలిక సదుపాయాలపై ప్రజలకు
    అవగాహన కల్పించాలి
    * ప్రజాప్రతినిధులు, అధికారులకు
    డ్వామా పిడి హరిత సూచన
    భూత్పూర్, జూలై 13: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని, ప్రజలకు అవసరమయ్యే వౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించాలని డ్వామా పిడి హరిత అన్నారు. ఆదివారం భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘మన ఊరు - మన ప్రణాళిక’ కార్యక్రమంలో పిడి హరిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడి హరిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు, మరుగుదొడ్లు అవసరం ఉన్న ఇళ్లను గుర్తించి మరుగుదొడ్డి లేని గ్రామంగా ప్రతిఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామంలో శ్మాశాన వాటికలు లేనందున వెనకబడిన తరుగుతులకు చెందిన వారు తమ వ్యవసాయ పొలాల్లో శవాలను పూడ్చుతున్నారని, ప్రభుత్వం శ్మాశాన వాటికలకు స్థలం కేటాయించాలని పిడి దృష్టికి తెచ్చారు. గ్రామాలలో ప్రభుత్వ భూములను గుర్తించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి చంద్రవౌళి, ఎంపిడిఓ గోపాల్‌నాయక్, సర్పంచ్ శోభ, పంచాయతీ కార్యదర్శి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.

    * కొనసాగుతున్న రగడ * ఆయకట్టు రైతుల్లో అయోమయం * ఖరీఫ్ ప్రారంభమైనా నారుమళ్ల జాడే లేదు
    english title: 
    rds

    0 0

    * మరో రెండు రోజులు వర్షాలు
    * అత్యధికంగా పెడగపల్లిలో 35 మి.మీ
    * అత్యల్పంగా కమలాపూర్‌లో 1 మి.మీ
    * రైతుల్లో హర్షాతిరేకాలు
    కరీంనగర్, జూలై 13: నిన్నటివరకు ఖరీఫ్ సాగుపై ఆందోళనలో ఉన్న రైతులకు ఆదివారం వేకువఝాము నుంచి కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయ. ఖరీఫ్ సాగుపై నీలి మేఘాలు అలుముకున్న తరుణంలో ఆదివారం కురిసిన వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. మూడ్నాలుగు రోజుల కిందట కురిసిన వర్షంతో ఖరీఫ్ పనులను ఆరంభించగా, ఆదివారం కురిసిన వర్షంతో ఖరీఫ్ సాగు పనులు ముమ్మరమయ్యాయి. దుక్కుల్లో, పొలాల్లో హలాలు కదులుతున్నాయి. వాస్తవానికి ఖరీఫ్ సాగులో భాగంగా జూలై మొదటి వారం వరకు అంచనాలో కనీసం 60శాతం మేర వివిధ పంటలు వేయాల్సి ఉంటుంది. అయితే, రుతుపవనాల రాక ఆలస్యం కావటం, రుతు పవనాలు వచ్చినా, తెలంగాణలో కానరాకపోవటం వంటి కారణాలు సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. కనీసం 30శాతం మేర కూడా సాగు చేయలేదు. గత ఖరీఫ్‌లో జూలై మొదటి వారం వరకు అధికారుల అంచనాలకు మించి సాగు చేశారు. ఈసారి మాత్రం వాతావరణం అనుకూలించకపోవటం ఇబ్బందిగా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు కోసం సిద్ధం చేసిన నారుమడులు ఎండిపోగా, వరి మొలక కూడా మాడిపోతుంటే ఖరీఫ్ సాగుపై అత్యధిక శాతం రైతులు ఆశ చాలించుకున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురియగా, నిరాశ, నిస్పృహల్లో ఉన్న రైతుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా పొలాల్లో రైతులు పరుగులు తీస్తుండగా, విత్తనపు గడ్డలతో హలాలు పోటీపడుతున్నాయి. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుండగా, మరింత ఉత్సాహంతో రైతులు ముందుకు సాగుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షాలతో జిల్లాలో సగటున 6.3మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెడగపల్లిలో 35.మి.మీ.వర్షపాతం నమోదు కాగా, అత్యల్ఫంగా కమలాపూర్‌లో 1మి.మీ.వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 57మండలాలకుగాను 34మండలాల్లో వర్షం కురిసింది. 23మండలాల్లో వర్షం కురువలేదు. మొత్తం మీద మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటుండగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ఖరీఫ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

    మాట తప్పను.. మడమ తిప్పను!
    * మంత్రి ఈటెల రాజేందర్
    జమ్మికుంట, జూలై 13: ఇచ్చిన మాట తప్పేవాడిని కాదని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని ఆర్థిక, ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం జమ్మికుంటలో వ్యాపార వర్గాలు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన ఉద్వేగ పూర్వకంగా ప్రసంగించి కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు. పార్టీలో సీనియారిటీకి పెద్దపీట వేసిన సందర్భాలను ఉటంకించారు. పార్టీలోకి కొత్తవారు వస్తే తమను పట్టించుకుంటారా? అనే అనుమానాలకు తావు లేదన్నారు. తాను వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చే వాడిని కాదని, నిబద్దత, అంకితభావం కలిగిన వారిని విస్మరించబోనన్నారు. 2001 నుండి పార్టీనే నమ్ముకున్న వారిని చేర దీసి పదవులను కట్టబెట్టిన సంగతి మరవద్దన్నారు. నాటి నుండి నేటి వరకు ఇదే ఆచరించానని, భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుందన్నారు. తాను అందరి వాడినని, కొందరికే పరిమితం కాబోనన్నారు. ఎవరి సేవలను ఎలా వినియోగించుకోవాలో అవసరాన్ని బట్టి గుర్తిస్తామన్నారు. సేవ చేసిన వారిని ఎప్పటికి గుర్తింపు వుంటుందన్నారు. నాయకులకు పదవులే ప్రామాణికం కాదని, ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వారే నిజమైన నాయకులన్నారు. అధికారం వచ్చిందని విర్రవీగితే ప్రజా క్షేత్రంలో పతనం తప్పదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శాసించే పద్ధతిని విడనాడి ప్రేమతో గెలుచుకునే తత్వాన్ని అలవరుచుకోవాలన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం నుండి నేటి వరకు ఎక్కడా తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి వుండాలనే తత్వంతో ముందుకు సాగడమే తన ఇజమన్నారు. కీలక శాఖలు చేపట్టిన నేపథ్యంలో కొంత బిజీగా వున్నప్పటికీ ఎవరి సమస్యను విస్మరించబోనన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎక్కడ లోపం కనిపించని రీతిలో పనిచేయాలని, వారి బాధలు, గాధల్లో, సుఖ సంతోషాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో సాధించలేనిదంటూ ఏమి లేదన్నారు. 14 ఏళ్ల ఉద్యమం లక్ష్యాన్ని సాధించిందని, ఇక మిగిలింది బంగారు తెలంగాణ నిర్మాణమేనన్నారు. ఇందుకోసం అలుపెరుగని కృషి చేస్తానన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన వుందని, ఈమేరకు అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఎక్కడ మట్టి రోడ్లు లేకుండా ప్రతి గ్రామానికి ఒకే దఫా తారు రోడ్లు త్వరలోనే పూర్తి చేయిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని సంక్షేమ పథకాల అమలు త్వరలోనే అమలు కానుందని, 16న జరిగే కేబినెట్ సమావేశం అనంతరం అన్ని విషయాలను స్పష్టంగా వెల్లడించడం జరుగుతుందన్నారు.
    అధికారులు, ప్రజాప్రతినిధులు
    బండి చక్రాల్లా పనిచేయాలి
    అధికారులు, ప్రజా ప్రతినిధులు బండికి రెండు చక్రాల్లా పనిచేయాలని సూచించారు. ఎక్కడా బేషజాలకు పోవద్దని, అధికారులపై జులుం ప్రదర్శించవద్దన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమస్యలు పరిష్కంచుకోవాలన్నారు. అధికార పార్టీ అనే అహం, ఆ నీడలు ఎక్కడ కనిపించవద్దన్నారు. అధికారులు తమ దృష్టికి వచ్చే సమస్యలను తమ పరిధిలో సత్వరమే పరిష్కరించాలని, తమ పరిధిలోకి వస్తే తన దృష్టికి తేవాలన్నారు. పదవులను వనె్న తెచ్చే తరహాలో నాయకులు మసలు కోవాలని, పదవులకు కలంకం తేవద్దన్నారు.
    జలుం చేస్తే సహించేది లేదు
    వ్యాపారులపై నాయకులు జులుం ప్రదర్శించడం, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. అదే సమయంలో వ్యాపారులు సక్రమ వ్యాపారం చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. నిజాయితీగా వ్యాపారం చేసే వారికి తాము అండగా వుంటామని, వక్ర మార్గంలో వెళితే క్షమించేది లేదన్నారు. ఇకపై వ్యాపారులపై వేధింపులనే ప్రశే్న ఉత్పన్నం కాబోదన్నారు. వ్యాపారులు సామాజిక సేవతో పాటు పేదలకు అండగా వుండే కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు.

    48గంటల్లో నల్లా కనెక్షన్
    * మేయర్ రవీందర్‌సింగ్
    కరీంనగర్, జూలై 13: దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నల్లా కనెక్షన్ ఇస్తామని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తెలిపారు. ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో దరఖాస్తు చేసుకున్న అర్జీదారుకు నల్లా కనెక్షన్‌కు సంబంధించి ప్రొసీడింగ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకొన్న ప్రతి ఒక్కరికి 48గంటల్లో నల్లా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి, 6వ డివిజన్ కార్పొరేటర్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

    పోలవరం పేరుతో తెలంగాణ భూభాగం ఆక్రమణ
    జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజం
    జగిత్యాల, జూలై 13: పోలవరం ముంపు మండలాల ఆక్రమణ ముమ్మాటికీ కుట్రపూరితమేనని, పోలవరం పేరుతో తెలంగాణ భూభాగం ఆక్రమించుకునే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమింపజేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జగిత్యాలలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సిఎం బాబు కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆర్డినెన్స్‌ను జారీ చేయించుకోవడం అన్యాయమేనన్నారు. ఎపి పునర్విభజనకు వ్యతిరేకంగా ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విధంగా ఆర్డినెన్స్ ఆమోదం తేవడం సమంజసం కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారని, పునర్విభజనకు అనుగుణంగా ఏడు మండలాల ప్రస్తావనే తీసుకురాలేదన్నారు.

    ప్రోటోకాల్ ఖర్చులు అమాత్యుల శాఖలకే!
    రెవెన్యూ శాఖపై తగ్గిన భారం * అరకొర బడ్జెట్‌కు చెల్లుచీటీ
    కలెక్టరేట్ (కరీంనగర్), జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనపరమైన మార్పులను ప్రోటోకాల్‌తో మొదలు పెట్టారు. అతిథుల వ్యయాలపై నియంత్రణకు చర్యలు చేపట్టింది. అతిథి మర్యాదల కింద అడ్డగోలు వ్యయాలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా ఈ భారం మోసే రెవెన్యూ శాఖకు కొత్త విధానం అమలులోకి వస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల ఏ శాఖకు చెందిన అమ్యాతులు లేదా ఇతర అతిథులు వచ్చినా సదరు శాఖ మాత్రమే వారి ఖర్చులు భరించాలి. గతంలో అతిథి మర్యాదల పేరిట ప్రోటోకాల్ ఖర్చులు రెవెన్యూ శాఖ మాత్రమే భరించేంది. రెవెన్యూ శాఖలో జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక ప్రొటోకాల్ విభాగం కూడా ఉంటుంది. వీరికి మూడునెలలకు ఒక మారు బడ్జెట్ కూడా విడుదల చేస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలో ఆర్‌అండ్‌బి అతిథిగృహాలు వున్న చోట అతిథితుల తాకిడి ఎక్కువగా వుంటుంది. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంథని ఆర్‌అండ్‌బి అతిథిగృహాలకు ప్రోటోకాల్ ఖర్చుల కింద విడుదల చేసే నిధులకంటే కూడా ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి వస్తున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంకు మూడునెలల ఖర్చులు తీర్చేందుకు 15వేల రూపాయలు బడ్జెట్ వస్తుంది. మిగతా చోట ఏడువేల వరకు విడుదల అవుతోంది. దీనితో రెవెన్యూశాఖ వారు ఖర్చుల కోసం తప్పకుండా ఏదో ఒక రూపంలో అక్రమమో, సక్రమమో కానీ చేతులు చాపాల్సి వచ్చేది. తాజాగా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో జిల్లాకు చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు వస్తే వ్యయాలు ఆయా శాఖలకు బదలాయించడానికి రెవెన్యూ శాఖకు వెసులుబాటు దొరికింది. ఆర్థిక, పౌరసరఫరాల, తూనికలు కొలతలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లా పర్యటన తాలుకు ఖర్చులు ఇక ఆయా మూడు శాఖలు వంతులవారిగా భరించాల్సి వుంటుంది. అదే విధంగా ఐటి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వస్తే మాత్రం ఆ రెండు శాఖలు ఖర్చులు భరిస్తారు. అతిథి మర్యాదల ఖర్చులు రెవెన్యూ శాఖ నుంచి పోతుండటంతో ఆ శాఖ అధికారులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

    రాజన్న సన్నిధిలో స్పీకర్ ‘సిరికొండ’
    వేములవాడ, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వరస్వామిని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూధనచారి ఆదివారం దర్శించుకున్నారు. ఇవో కృష్ణాజీరావు, స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఆలయ ముఖ ద్వారం వద్ద ఆయనుకు ఎదురేగి స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆయన్ను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీలక్ష్మిగణపతి స్వామివారికి స్పీకర్‌తో తొలి పూజలను చేయించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో ఆయన్ను స్థానాచార్యులు శంకరయ్య, వేదపండితులు ఆశీర్వదించగా ఇవో కృష్ణాజీరావు స్వామివారి చిత్రపటాన్ని, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట ఎంపి వినోద్, ఎమ్మెల్యే రమేశ్, జడ్పీచైర్మన్ తుల ఉమ, తెరాస జిల్లా అధ్యక్షులు ఈద శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆదివారం సాయంత్రం స్పీకర్ మధుసూదనచారి దర్శించుకున్నారు. ఆర్యవైశ్య కులస్తులు ఆదివారం అమ్మవారికి దిష్టికుంభాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

    నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
    గోదావరిఖని, జూలై 13: పెద్దపల్లి లోక్‌సభ నియోజక వర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఎంపి బాల్క సుమన్ అన్నారు. ఆదివారం గోదావరిఖని కోల్‌బెల్టు ఏరియా పరిధిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గోదావరిఖని చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్‌తోపాటు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్‌లు వేరువేరుగా నిర్వహించిన సన్మాన సభలో ఆయన ఎంపి మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మూసివేతకు గురైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుర్దరించేందుకు ఇప్పటికే కేంద్ర ఎరువుల రసాయన శాఖ మంత్రిని కలిసి కోరడం జరిగిందని అన్నారు. ఫ్యాక్టరీని సాధ్యమైనంత త్వరలోనే తెరిపిస్తానని, అదేవిధంగా సింగరేణిలో మరిన్ని గనులను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం నియోజక వర్గ ఎమ్మెల్యే సొమారపు సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక పట్టణంలో వ్యాపార కేంద్రంగా మరింత అభివృద్ధి జరిపేందుకు తన వంతు సహకరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

    * మరో రెండు రోజులు వర్షాలు * అత్యధికంగా పెడగపల్లిలో 35 మి.మీ * అత్యల్పంగా కమలాపూర్‌లో 1 మి.మీ * రైతుల్లో హర్షాతిరేకాలు
    english title: 
    kharif

    0 0

    తిరుపతి, జూలై 13: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై టిటిడి దృష్టిపెట్టాలని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు వచ్చిన ఆయన స్వామివారికి తలనీలాలు సమర్పించి కల్యాణ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోను నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపైనా, ఆలయ పవిత్రత కాపాడటంపైనా దృష్టిపెట్టారన్నారు. ఇందులో భాగంగా టిటిడి అధికారులకు ఇప్పటికే అనేక సూచనలు ఇచ్చారన్నారు. టిటిడి యాజమాన్యం కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందన్నారు. ఇంకా మంచి సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం అనేకరకాల చర్యలను చేపడుతోందన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

    9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
    * రూ. 9లక్షల విలువచేసే దుంగలు, కత్తులు, గొడ్డళ్లు, నగదు స్వాధీనం
    తిరుపతి, జూలై 13: ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ఆరుగురు కూలీలను, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్వీ యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్ సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో వెటర్నరీ యూనివర్శిటీ ప్రాంతంలో తమ సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఈసందర్భంగా 9మందిని అరెస్ట్ చేశామని, వీరి నుంచి 9లక్షల రూపాయలు విలువచేసే 9 ఎర్రచందనం దుంగలను, 2లక్షల 35వేల నగదును, కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అరెస్ట్ అయిన స్మగ్లర్లలో రైల్వేకోడూరు పగడాలపల్లి గ్రామానికి చెందిన కె.సాయిరాం (22), వి.సుబ్రమణ్యం (22), రైల్వేకోడూరు ధర్మవరంకు చెందిన ఎం.చంద్రాచారి (24)ను అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన కూలీల్లో గోవిందన్ (62), సతీష్‌కుమార్ (20), రాజశేఖర్ (20) కే.మహీంద్రన్ (22), శంకర్ (23), టి.మునియన్ (27) ఉన్నారన్నారు. వీరందరూ తమిళనాడు విల్లిపురంకు చెందినవారన్నారు. వీరి నుంచి ఎర్రచందనం కొనుగోలుచేసే ప్రధాన స్మగ్లర్ బాషాను ఈ కేసులో అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కర్నాటకలోని కటికనహళ్లి, మాలూరోంకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పట్టుబడ్డ స్మగ్లర్లు తెలిపారన్నారు. వీరిని అరెస్టు చేయడంలో క్రైం డిఎస్పీ ఎం.వి.ఎస్.స్వామి, సిసిఎస్ సిఐ రామ్మోహన్, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్ పిళ్లైతోపాటు సిబ్బంది సుధాకర్, మురళి, శ్రీనివాసులు, శివయ్య, మునిరాజ, మునిరత్నం, గణేశ్వర్, సురేంద్ర, దేవదత్తారెడ్డి, వెంకట్రావు, రవిచంద్ర, శివ, నాగసుబ్రమణ్యం, రమణకుమార్ ఉన్నారన్నారు. వీరికి రివార్డులు ఇప్పించడానికి ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

    తిరుమలలో తరగని రద్దీ
    * సర్వదర్శనానికి 30, నడక భక్తులకు 16, ప్రత్యేక దర్శనానికి 9 గంటల పాటు నిరీక్షణ
    తిరుపతి, జూలై 13: శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. దీంతో సర్వదర్శనానికి 30 గంటలు, నడక దారిలో వెళ్లే భక్తులకు 16 గంటలు, 300 రూపాయలు ప్రత్యేక క్యూలో వెళ్లే భక్తులకు 9 గంటలు సమయం పడుతోంది. వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి అన్ని క్యూలైన్లలో ఉన్న భక్తులు కాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్లు మేర బారులుతీరి ఉన్నారు. రద్దీ కారణంగా 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని టిటిడి అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఒకవైపు భక్తుల రద్దీ, మరోవైపు ఉదయం నుంచి పొడిజల్లులు పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాంప్లెక్స్ వెలుపల క్యూలైన్లో ఉన్న భక్తులు చలికి తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. రద్దీ కారణంగా వసతిగదులు దొరకని భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    తిరుమలలో పెద్దజియ్యంగార్ చాతుర్మాస దీక్ష ప్రారంభం
    తిరుపతి, జూలై 13: శ్రీవారి ఆలయ పెద్దజియ్యంగార్ నేతృత్వంలో ఆదివారం తిరుమలలో చాతుర్మాస దీక్ష సంకల్ప అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈసందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజియ్యంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనవున్న జియ్యంగారి మఠం నుండి చిన్నజియ్యంగారు ఆయన శిష్యబృందంతో కలసి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం అలయానికి విచ్చేశారు. ఈసందర్భంగా శ్రీవారి ఆలయమహాద్వారం వద్దకు చేరుకున్న జియ్యర్‌లను ఇఓ ఎం.జి.గోపాల్, జెఇఓ పోలా భాస్కర్, ఇతర ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం జియ్యంగార్లు వారి శిష్యబృందంతో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో తిరుమల పెద్దజియ్యంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, చిన్న జియ్యంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరించారు. ఈసందర్భంగా తిరుమల పెద్దజియ్యంగార్ మాట్లాడుతూ ఈ చాతుర్మాస దీక్షలన్నవి హైందవ సనాతన వైధి ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. శ్రావణ, బాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్రమాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఈనేపధ్యంలో రామానుజాచార్యులవారి వంశ పారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుంచి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో జీయంగార్ల శిష్యబృందం, ఆలయ డిప్యూటి ఇఓ చిన్నంగారి రమణ, పేష్కార్ కేశరాజు తదితరులు పాల్గొన్నారు.

    రాజకీయ హైడ్రామా నడుమ నిమ్మనపల్లె ఎన్నిక
    * ఎంపిపిగా పారిజాత, వైస్ ఎంపిపిగా చంద్రశేఖర్ ఎన్నిక
    మదనపల్లె, జూలై 13: నిమ్మనపల్లె మండలాధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ వెంగవారిపల్లె ఎంపిటిసి అంగజాల పారిజాతకు ఆ పార్టీ నలుగురు ఎంపిటిసిలతో పాటు వైకాపా నిమ్మనపల్లె ఎంపిటిసి ఈటకట్ట చంద్రశేఖర్ మద్దతు పలకారు. దీంతో పారిజాతను ఎంపిపిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వసుంధర ప్రకటించారు. అనంతరం వైస్ ఎంపిపి ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి మద్దతు పలికిన వైకాపా నిమ్మనపల్లె ఎంపిటిసి చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి వసుంధర వెల్లడించారు. అంతకుముందు ఐదుగురు ఎంపిటిసిలతో ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నిక జరగాల్సి ఉండగా 40నిమిషాల ఇరువర్గాల ఘర్షణల అనంతరం వైకాపా ఎంపిటిసిలు, ఎమ్మెల్యే నిష్క్రమించడంతో ఆలస్యంగా ఎన్నిక నిర్వహించారు.
    భారీ రోడ్‌షో
    నిమ్మనపల్లె ఎంపిపి తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోవడంతో భారీ రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ కొడవలి శివప్రసాద్, మదనపల్లె టౌన్‌బ్యాంకు ఛైర్మన్ నాదెళ్ళ విద్యాసాగర్, టిడిపి నాయకులు రాటకొండ నందకిషోర్, కోపూరి మల్లికార్జుననాయుడు, గంగారపు రామ్‌దాస్‌చౌదరి, రెడ్డెప్పరెడ్డి, శ్రీరామ్‌చినబాబు, వెంగంవారిపల్లె మాజీ సర్పంచి మల్లికార్జున, మాజీ సింగిల్‌విండో అధ్యక్షులు ఆర్‌జె వెంకటేష్, శ్రీరామ విద్యాసాగర్, బాలుస్వామి, మున్సిపల్ కౌన్సిలర్‌లు నూతనంగా ఎన్నికైన ఎంపిపి అంగజాల పారిజాతను అభినందించి నిమ్మనపల్లె మండల కేంద్రంలోని పురవీధులలో భారీ రోడ్‌షో నిర్వహించారు.

    అధికారులతో వేర్వేరుగా సమావేశమైన జిల్లా కలెక్టర్
    * అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు జిల్లా సమగ్ర సమాచారం సేకరణ
    చిత్తూరు, జూలై 13: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడానికి జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు కలెక్టర్ సిద్దార్థజైన్ నడుం బిగించారు. ఒక్కరోజు కూడా వృథా చేయకుండా శనివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి వరకూ ఒక్కోశాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖపై సమగ్ర అవగాహన తెచ్చుకునేందుకు వివిధ అంశాలపై సమీక్షించారు. ఒక్కో శాఖలో ఉన్న లోటుపాట్లను ప్రశ్నించిన జిల్లా కలెక్టర్ తనకు కావలసిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖలపై సంపూర్ణ పట్టు సాధించిన తరువాత అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఆయన అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కోశాఖ పనితీరు, చేపడుతున్న అభివృద్ధిపనులు తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రధానంగా జిల్లాలో తాగునీటి సమస్య, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, భూగర్భ గనుల శాఖ పనితీరుపై ఆయన మరింత లోతుగా సమీక్షించారు. జిల్లాలో ఇసుక లభించే ప్రాంతాలపై, ఇసుక తరలింపుపై, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులు, నీటి వనరులు, వ్యవసాయ, పారిశ్రామిక స్థితిగతులపై ఆయా శాఖల అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. జడ్పీ సిఇఓ వేణుగోపాల్‌రెడ్డి జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు సంబంధించి తయారుచేసిన అంచనాలను, వందరోజుల ప్రణాళికలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వకుండా తనదైన శైలిలో ప్రశ్నించి మరీ తనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుండి రాత్రి వరకూ పూర్తి స్థాయిలో ఆయా శాఖలపై సమీక్షించిన కలెక్టర్ సోమవారం మరికొన్ని శాఖలపై సమీక్షించనున్నారు. జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న కలెక్టర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన సమీక్షలతో అర్థం అవుతోంది.

    ఎట్టకేలకు కేశవులు శవం వెలికితీత
    * పోలీసుల అదుపులో నిందితుడు
    కుప్పం, జూలై 13: రామకుప్పం మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన కేశవులు(35) గత వారం రోజులుగా అదృశ్యం కాగా రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం కర్ణాటక సరిహద్దు దేవరబండ వద్ద గొర్రెల కాపరుల ఆచూకీతో బయటపడిన శవం కేశవులదే అని తేలింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కర్ణాటక సిఐ లక్ష్మీనారాయణ, తహశీల్దార్, వైద్యులు, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా శవాన్ని వెలికితీసి నరబలి అని నిర్ధారించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పీలవరంకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం కర్ణాటక పోలీసులు తీసుకెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. మూఢ నమ్మకాలు, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గుప్తనిధుల తవ్వకాలతో డబ్బు సంపాదించాలని క్షుద్రపూజలు, నరబలులకు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల పాత దేవాలయాల్లో తవ్వకాలు జరిపినట్లు తెలిసింది.

    ముగిసిన సదాచారం తరగతులు
    తిరుపతి, జూలై 13: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో గత నెలరోజులుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న సదాచారం శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డిపిపి ప్రత్యేక అధికారి ఎస్.రఘునాధ్ మాట్లాడుతూ ఈ తరగతుల్లో భాగంగా బాలమందిర్‌లోని అనాధ పిల్లలకు హిందూ ధర్మ విశిష్టత, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, నైతిక విలువలు, మానవీయ విలువలను బోధించినట్లు తెలిపారు. చిన్న వయస్సులోనే ఇలాంటి విషయాలు నేర్పి, ఆచరింపజేయడంవల్ల విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతశిఖరాలను అందుకుంటారన్నారు. ఈకార్యక్రమంలో శిక్షణ ఇచ్చిన ప్రముఖ పండితులు డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య హెచ్. ఎస్.బ్రహ్మానందం, ఆచార్య సర్వోత్తమరావు, చెన్నకేశవులునాయుడు, గల్లా సురేష్, బాలమందిర్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.

    అమ్మవారి భక్తుల సౌకర్యాలపై డిప్యూటీ ఇఓ ఆరా
    తిరుచానూరు, జూలై 13: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు సౌకర్యాలను అమ్మవారి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఇఓ భాస్కర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. భక్తుల సౌకర్యాలను, సమస్యలను ఆరాతీసి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. అన్న ప్రసాదం, లడ్డూల నాణ్యతను పరిశీలించి భక్తులకు వేగంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం రావడంతో 2 గంటల పాటు క్యూలైన్ల వెంటే తిరుగుతూ క్యూలైన్లను క్రమబద్దీకరిస్తూ భక్తులతో మాట్లాడారు.

    ఉన్న చట్టాలు అమలుచేయండి
    * సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
    తిరుపతి, జూలై 13: అసంఘటిత రంగ కార్మికుల విషయంలో కొత్త చట్టాలను రూపొందించి అమలు చేయకపోయినా పరవాలేదని, ఉన్న చట్టాలనైనా సక్రమంగా అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలో హమాలీ వర్కర్స్ పట్టణ మహాసభలకు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదలో 50శాతం సంపదను సృష్టిస్తోంది అసంఘటిత రంగ కార్మికులేనన్నారు. వీరందరికీ పని భద్రత, కనీస కూలి, జీవన భద్రత కల్పించాల్సి ఉందన్నారు. పాలక ప్రభుత్వాలు మారుతున్నా అసంఘటిత రంగ కార్మికుల జీవితాలు మాత్రం మారడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేయకపోయినా పరవాలేదని, ఉన్న చట్టాలను అధికారులు చిత్తశుద్దితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలవుతున్నా ఇప్పటికి ప్రతి పదిమందిలో ముగ్గురు పేదవారేనన్నారు. 127 కోట్ల మందిలో 50 కోట్లమంది పేదలేనని, దీని ఆధారంగా దేశం ఏ దిశగా ప్రయాణిస్తోందో అర్థమవుతోందని చెప్పారు. పేదవాడు ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి ఏనాడో దాటిపోయిందని, గత ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని ఆయన తెలిపారు. తమ హక్కుల సాధనకోసం కార్మికులు పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు తులసేంద్ర మాట్లాడుతూ మోదీ ప్రధాని అయిన వెంటనే తన బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి కేటాయించిన నిధిని లక్షా 93వేల కోట్ల నుంచి లక్షా 13వేల కోట్లకు తగ్గించారన్నారు. పేరుకు తమది పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, కోటీశ్వరులు బడా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తోందని, వారికి అనుకూలంగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతి పట్టణ ఎఐటియుసి నాయకులు ఎన్.డి.రవి మాట్లాడుతూ పట్టణంలో హమాలీల సమస్యలు పరిష్కారంకోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు చలపతి, పి.సత్యవేలు, చంద్రశేఖర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
    తిరుపతి హమాలీ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎంపిక
    తిరుపతి హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన ప్రధానకార్యదర్శిగా ఎన్.డి.రవి, అధ్యక్షులుగా సత్యవేలు, మరో 20మంది కమిటీ సభ్యులుగా, 8 మందిని ఆఫీసు బేరర్లుగా ఎన్నుకున్నారు.

    చిన్న పుష్పపల్లకిలో కనకదుర్గమ్మ ఊరేగింపు
    చంద్రగిరి, జూలై 13: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో చిన్న పుష్ప పల్లకిలో కనకదుర్గమ్మ ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం ఆదివారం కల్పించారు. శ్రీనివాస మంగాపురంలో అతి పురాతనమైన శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 3వ రోజు ఉదయానే్న సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలోని శూలాలకు నిమ్మకాయలు, పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించి శూలాలను ఊరేగింపుగా తిప్పారు. అనంతరం చిన్న పుష్పపల్లకిలో కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్న వుంచి రక రకాల పుష్పాలతో, ఆభరణాలతో వైభవంగా అలంకరించారు. మేళ తాళాలు ముందు నడువగా అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు.

    వర్షం వస్తుందని అమ్మవారి గజ వాహన సేవ నిలిపివేత
    * గటాటోపం ఏర్పాటు చేయడంలో అధికారుల వైఫల్యం
    తిరుచానూరు, జూలై 13: వర్షం వస్తుందని అనుమానించి అమ్మవారి గజ వాహన సేవ ఊరేగింపును టిటిడి అధికారులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురైన సంఘటన ఆదివారం జరిగింది. వర్షం వస్తున్నా వాహనాలను ఊరేగించేందుకు వినియోగించే గటాటోపాన్ని అధికారులు ఏర్పాటు చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గజ వాహన ఊరేగింపు అర్ధాంతరంగా నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలు ఇలావున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రాన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజ వాహనంపై ఊరేగించే కార్యక్రమాన్ని టిటిడి క్రమం తప్పకుండా పాటిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం 7గంటలకు గజ వాహనంపై అమ్మవారిని ఊరేగించాల్సి ఉంది. ఈనేపధ్యంలో మధ్యాహ్నం 4గంటల నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. ఈపరిస్థితుల్లో అమ్మవారిని ఊరేగించడంకోసం అధికారులు ఆలయంలో నుంచి అమ్మవారి ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపుచేశారు. వాహనంపై ఉంచి అలంకరణ పూర్తి చేశారు. 7గంటల సమయంలో వాహనమండపం నుంచి వాహనసేవను వెలుపలికి తీసుకువచ్చి, 5 అడుగులు ముందుకు వచ్చారు. ఆ సమయంలో వర్షం కూడా ఆగిపోయింది. కొందరు అధికారులు మార్గమధ్యంలో వర్షం పడితే ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుమానించారు. వెంటనే వాహనాన్ని తిరిగి వాహన మండపానికి చేర్చారు. అమ్మవారి జన్మదినం రోజున అమ్మవారిని గజ వాహనంపై దర్శించాలని తిరుమాడా వీధుల్లో వేచి ఉన్న భక్తులు అధికారుల చర్యలకు తీవ్రనిరాశకు గురై శాపనార్థాలు పెట్టారు. టిటిడికి నిధుల కొరతలేకపోయినా అధికారుల నిర్లక్ష్యంతో వర్షం సమయంలోకూడా వాహనాలకు ఉపయోగించే ఘటాటోపం (గొడుగు)ను ఏర్పాటు చేసుకోలేకపోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు గటాటోపం తెప్పించలేమని, దానిని మోయడానికి 25 మంది సిబ్బంది అవసరమని కుంటిసాకులు చెప్పడం గమనార్హం.

    ఆర్థిక శాఖ మంత్రి యనమల సూచన
    english title: 
    yanamala

    0 0

    ఖమ్మం, జూలై 13: పోలవరం గిరిజనులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టెస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లాభనష్టాలు ఎలా ఉన్నా ఖమ్మం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానున్న గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధం పోలవరం బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే పూర్తిగా తెగిపోనున్నది. రాజ్య సభలో బిల్లు ఆమోదం తర్వాత చట్టబద్ధత వచ్చిన మరుక్షణం వారంతా పూర్తిగా ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్ళనున్నారు. భద్రాచలం మండలంలోని 70రెవెన్యూ గ్రామాల పరిధిలోని 38,961మంది, కూనవరం మండల పరిధిలోని 56రెవెన్యూ గ్రామాల పరిధిలోని 26,245మంది, విఆర్ పురం మండలంలోని 62రెవెన్యూ గ్రామాల పరిధిలోని 25,597మంది, చింతూరు మండల పరిధిలోని 89రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న 40,725 మంది, బూర్గంపాడు మండల పరిధిలోని 6రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న 7502 మంది, కుక్కునూరు మండల పరిధిలోని 20 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న 28,392 మంది, వేలేరు పాడు మండలంలోని 21రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న 22,882 మంది సీమాంధ్రలో కలవనున్నారు. చింతూరు, భద్రాచలం, కూనవరం, విఆర్‌పురం మండలాల ప్రజలు తూర్పు గోదావరిలో కలవనుండగా బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు పశ్చిమ గోదావరిలో కలవనున్నారు. ఈ ప్రజలు జిల్లా కేంద్రం వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భద్రాచలం మండల ప్రజలు జిల్లా కేంద్రమైన కాకినాడ వెళ్ళాలంటే చింతూరు, మారేడుమిల్లి మీదుగా ఘాట్‌రోడ్డులో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి రావాలంటే కచ్చితంగా రెండు రోజులు సమయం పడుతుంది. ఇటు పశ్చిమ గోదావరిలో కలపబడిన మండలాల పరిస్థితి కూడా అంతే ఉంది. బూర్గంపాడు మండలాల ప్రజలు జిల్లాకేంద్రమైన ఏలూరు వెళ్ళాలంటే 5, 6 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం రెవెన్యూ డివిజన్‌లకు వెళ్ళాలన్నా ఇబ్బందులు తప్పవు.
    ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భద్రాచలం కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం పని చేసిన ఐటిడిఏ పరిధి నుంచి కూడా ఈ గ్రామాలను తీసివేయనున్నారు. దీంతో అటు రంపచోడవరం ఐటిడిఏ, ఇటు రామచంద్రాపురం ఐటిడిఏల పరిధిలోకి ఈ గ్రామాలు వెళ్ళనున్నాయి. ప్రస్తుతం భద్రాచలం ఐటిడిఏ కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ మండలాలు ఇప్పుడు ఆ ఐటిడిఏలకు దూరంగా ఉండటంతో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారనున్నది. అది కాకుండా ఈ ఏడాది భద్రాచలం ఐటిడిఏ 29 మండలాల పరిధిలో 591కోట్ల విలువైన పనులను ప్రతిపాదించారు. ఇప్పుడు ఏడు మండలాలు ఇతర ఐటిడిఏల పరిధిలోకి బదలాయించబడుతుండటంతో ఆ నిధులు మిగిలిన 22 మండలాల పరిధిలోనే ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దశాబ్దాలుగా వెనుకబడిన ఆదివాసీలు ఇప్పుడిప్పుడే అబివృద్ధిలోకి వస్తుండగా ఈ ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంతో ప్రజలంతా పునరావాసం తెలంగాణాలోనే ఏర్పాటు చేయాలనటం గమనార్హం. వేలేరుపాడు. కుక్కునూరు, బూర్గంపాడు మండలాలలోని ముంపు గ్రామాల ప్రజలైతే కచ్చితంగా తాము తెలంగాణలోనే ఉంటామని పునరావాసం కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    పోలవరంపై న్యాయపోరాటం చేస్తాం
    * చంబ్రాబు మెప్పుకోసమే ఆర్డినెన్స్
    * ఎంపి పొంగులేటి ఆరోపణ
    కొణిజర్ల, జూలై 13: ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుపొందటం కోసమే ఎన్‌డిఎ ప్రభుత్వం పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని స్థానిక పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని చిన్నగోపతిలో లక్ష, శాంతినగర్ బిసి కాలనీలో నాలుగున్నర లక్షల టిఎఫ్‌సి నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి, రెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేంద్రం గిరిజన ప్రజల మనోభావాలను, తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపిల మొర ఆలకించకుండా అధికారం ఉందనే అహంకారంతో ఆర్డినెన్స్ తీసుకవచ్చి పార్లమెంట్‌లో మూజువాణి ఓటు ఆమోదింప చేసిందన్నారు. గిరిజన ప్రజలకు అండగా ఉంటూ పోలవరంపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. మంచి పనులు చేసేవారిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోరని జనరంజకమైన పాలన అందించటం వలనే దివంగనేత వైఎస్‌ఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని, వాటిని విస్మరిస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓట్లువేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, చిన్నగోపతి, గుండ్రాతి మడుగు సర్పంచ్‌లు సవళ్ళ ముత్తయ్య, అప్పం సురేష్, ఎంపిటిసిలు దొబ్బల కృష్ణవేణి, తడికమళ్ళ ఉమారాణి, తహశీల్దార్ యూసఫ్ అలీ, ఎపిడిఓ శ్రీనివాసరావు, పిఆర్, హౌసింగ్ ఏఈలు కృష్ణారెడ్డి, శోభన్ బాబు, వ్యవసాయ అధికారిణి అరుణాకుమారి, ఉపాధి హామీ ఏపిఓ సరిత, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు గుమ్మా రోశయ్య, పాముల వెంకటేశ్వర్లు, దొడ్డపనేని రామారావు, రాయల పుల్లయ్య, ప్రకాశం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

    పోలవరం విషయంలో మమ్మల్ని తప్పుపట్టడం తగదు
    * టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఖండన
    ఖానాపురం హవేలి, జూలై 13: కాంగ్రెస్ పార్టీ హయంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని, దానిని పట్టించుకోకుండా టిడిపి నాయకుల వల్ల పోలవరం నిర్మాణం చేపట్టడంతో పాటు ఆర్డినెన్స్‌ను ఆమోదించారని జెఏసి నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపట్టడం తగదని టిడిపి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2004-05వ సంవత్సరంలోనే వైఎస్‌ఆర్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఉన్నారని, ఆ నాయకులే నేడు ఆందోళనలు చేస్తూ టిడిపిని విమర్శించటం ఎంత వరకు సబబన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా చేస్తామని గతం నుంచే చెప్తూ వస్తోందన్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు టిడిపిని దెబ్బతీయాలనే ఆరోపణలు చేస్తున్నారని, టిడిపితో చట్ట సవరణలు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. ఏపిలో భూములు కోల్పోయిన వారికి 3లక్షలు నష్ట పరిహారం ఇస్తే ఖమ్మం జిల్లాలో పోలవరం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి 1.25లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని, తాము మాత్రం 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ప్రస్తుతం యుపిఏ ప్రభుత్వం, సోనియాగాంధీ తటస్థగా ఉన్నారన్నారు. ముంపు ప్రాంతాలను తగ్గించాలని ధర్నాలు, బంద్‌లు, ఆందోళనలు చేస్తే చేసిన చట్టాలు మారుతాయా అని ప్రశ్నించారు. జెఏసి నేతలు సైతం టిడిపిని విమర్శించటం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్ల ఏ ఒక్క ప్రాంతానికి సక్రమంగా నీరు అందలేదన్నారు. కిందిస్థాయిలో నివేదికలు సేకరించకపోవటం వల్లే కొన్ని ప్రాంతాలు ఆంధ్రలో, కొన్ని ప్రాం తాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా జడ్పీ చైర్మన్, ఎంపిపిల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో హన్మంతరెడ్డి, కేతినేని హరీష్, రాయపుడి జయకర్ తదితరులు పాల్గొన్నారు.

    అభివృద్ధి అంటే ఆదివాసీల నిర్మూలనేనా..?
    * పోలవరం ఆర్డినెన్స్‌పై సుప్రీంలో పోరాడతాం
    * పీపుల్స్ ఎగెనెస్టు పోలవరం ప్రాజెక్టు జాతీయ కార్యదర్శి వెంకటరమణ
    భద్రాచలం, జూలై 13: అభివృద్ధి అంటే ఆదివాసీలను నిర్మూలించడమేనా? అని పీపుల్స్ ఎగెనెస్టు పోలవరం ప్రాజెక్టు జాతీయ కార్యదర్శి సున్నం వెంకటరమణ ప్రశ్నించారు. 13 రోజుల కిందట ఒడిషాలో ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న ఆదివాసీలకు పట్టణంలో ఘన స్వాగతం లభించింది. కొమరం భీమ్, మల్లు దొర, ఘంటం దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో ముద్దా పిచ్చయ్య, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత జంజర్ల రమేష్‌బాబు, రాజారత్నం, బంగారు వెంకటేశ్వర్లు, శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్‌లో వారు మాట్లాడుతూ తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లోని 3 లక్షల మంది ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎటువంటి లాభం అని కేంద్రాన్ని సూటిగా నిలదీశారు. తరతరాల ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వ్యవహారం వల్ల ఆదివాసీల అభివృద్ధి నానాటికీ తీసికట్టుగా ఉందని వాపోయారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వాలే వాటిని తుంగలో తొక్కడం విచారకరమన్నారు. పీసా చట్టం, 1/70 చట్టాలు ఉన్నా అవి ప్రభుత్వాలకు చుట్టాలుగా మారాయని నిరసన వ్యక్తం చేశారు. పీసా చట్టం ప్రకారం గ్రామసభల తీర్మానం చేసి పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రభుత్వానికి సమర్పించినా వాటిని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. పీసా చట్టంతో సుప్రీంకోర్టును పోలవరం ఆర్డినెన్స్‌పై ఆశ్రయించి రద్దు చేసేంత వరకు పోరాడుతామని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఆదివాసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీల నాగరికతపై నిత్యం విధ్వంసకర విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్డినెన్స్ రద్దు చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు ఆయా దేశాలకు జాతీయ సంపదగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినా భారతదేశంలో వారి పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆదివాసీలంతా ఓ చరిత్రగా మిగిలిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆదివాసీ జాతి మేల్కొని తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల మెడలు వంచి తమ హక్కులు, చట్టాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

    24 నుంచి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
    ఖమ్మం, జూలై 13: హైదరాబాదులోని హకీంపేటలో గల తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి అడ్మిషన్ల కోసం ఈ నెల 24, 25 తేదీలలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలను స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాధికారి కబీర్‌దాస్ తెలిపారు. ఇందుకు గాను జిల్లాలోని వివిధ మండలాల నుంచి అర్హత ప్రాతిపదికన విద్యార్థులను ఎంపిక చేసే బాధ్యత ఎంపిడివో, ఎంఇఓలదేనని ఆయన తెలిపారు. విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 17వ తేదిలోగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు పంపాలని సూచించారు. ఎంపికలకు విద్యార్థులు 2006 ఫిబ్రవరి 28 నుంచి 2007 మార్చి 1వ తేదీల మధ్య జన్మించి ఉండాలని, అదేవిధంగా 2014 ఆగస్టు 31 తేది నాటికి 8ఏండ్ల వయస్సు మించని విద్యార్థులు ఈ ఎంపికలకు అర్హులను తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులు 4వ తరగతిలో ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 7,8తేదిల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20మంది విద్యార్థులను మాత్రమే స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక చేస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక కోసం వయస్సు, తగిన ఎత్తు, బరువుఉండలన్నారు. ఎంపికలలో 30మీటర్ల ఫ్లయింగ్‌స్ట్రాట్, స్టాండింగ్ బోర్డుజంఫ్, 800వందల మీటర్ల పరుగు పందెం, 10మీటర్ల షటిల్న్,్ర మెడిసిన్ బాల్‌ఫుట్, వర్టికల్‌జంప్, శారీరక సామర్థ్యం తదితర అంశాలలో ఎంపికలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఆరోగ్య పరీక్షల్లో నెగ్గిన వారు రాష్ట్ర స్థాయి ఎంపికకు అర్హత సాధిస్తారని కబీర్‌దాస్ తెలిపారు.

    16న జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు
    ఖమ్మం, జూలై 13: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను ఈ నెల 16వ తేదీన స్థానిక జూబ్లిక్లబ్, స్వీకల్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పాటిబండ్ల యుగంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 13నుంచి 15సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలకు ఎంపికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అండర్ 17, 19 వయస్సు గల బాల, బాలికలకు, అండర్ 35,45,55 వయస్సు గల పురుషులు, మహిళల వెటరన్స్‌కు ఎంపికలు ఈ నెల 19, 20 తేదీలల్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లాకు సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీని కేటాయించినట్లు, ఈ పోటీలు ఆగస్టు 20నుంచి 23తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.

    వైరా రిజర్వాయర్ పరిరక్షణ పాదయాత్ర
    వైరా, జూలై 13: స్థానిక రిజర్వాయర్‌ను రెండు టిఎంసిల సాగర్ జలాలతో నింపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా రిజర్వాయర్ పరిరక్షణ పాదయాత్ర పేరుతో రైతులు యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతులు మంచినీటి కోసం పోరాడుతూనే సాగునీటి కోసం ఉద్యమాలు చేస్తున్నామని, రైతులు తాగునీటికి వ్యతిరేకం కాదన్నారు. రైతులు పంటలు పండాలన్నా, ఏడు మండలంలో బోడేపుడి సుజల స్రవంతి పథకం, మంచినీరుప్రజలకు అందాలన్న 2టిఎంసిల జలాలను రిజర్వాయర్‌కు కేటాయించాలన్నారు. అధికారులు 12అడుగుల వరకు నీరు నిల్వ ఉన్నా నీటిని విడుదల చేయటం లేదని, పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తొలుత స్థానిక రిజర్వాయర్ వద్ద వైరా ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ మచ్చా నర్సింహారావు యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు బోడేపుడి వీరభద్రం, వెంకటేశ్వరరావు, విద్యాసాగర్‌రావు, కర్నాటి హన్మంతరావు, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

    ట్రాఫిక్ పోలీస్‌ను నియమించండి
    కల్లూరు, జూలై 13: స్థానిక చండ్రుపట్ల రోడ్డుకు ఎదురుగా గల రాష్ట్రీయ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసును నియమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చండ్రుపట్ల రోడ్డులో ప్రైవేటు పాఠశాలలు, కళాశాల ఉండటంతో ఉదయం సాయంకాల సమయాలలో పాఠశాలకు వచ్చే పోయే విద్యార్థులతో, వాహనాలతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. విద్యార్థులు, పాఠశాలకు తమ పిల్లలను తీసుకొని వెళ్లే తల్లి దండ్రులు రాష్ట్రీయ ప్రధాన రహదారి దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. స్కూల్ జోన్ ఏరియాగా పిలువబడే చండ్రుపట్ల రోడ్డుకు ఎదురుగా గల రాష్ట్రీయ ప్రధాన రహదారిపై గతంలో ట్రాఫిక్ పోలీసును నియమించి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ రోడ్డు దాటేందుకు సహకరించేవారు. కానీ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై నెల గడుస్తున్నా నేటికి ట్రాఫిక్ పోలీసును నియమించక పోవటంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కూల్‌జోన్ ఏరియాగా పిలువబడే చండ్రుపట్ల రోడ్డుకు ఎదురుగా గల రాష్ట్రీయ ప్రధాన రహదారిపై ఉదయం సాయంకాల సమయాలలో ట్రాఫిక్ పోలీసును నియమించాలని కోరుతున్నారు.

    ఎలక్ట్రీషియన్‌కి విద్యుదాఘాతం
    ముదిగొండ, జూలై 13: మండల పరిధిలోని వెంకటాపురం గ్రా మంలో ఓ ప్రైవేటు ఎలక్ట్రిషియన్ విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి గాయాలపాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెంకటాపురం ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం మీద మరమ్మతు చేసేందుకు ఎక్కిన రాఘవాపురం గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రిషియన్ సాధినేని సత్యనారాయణ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావటంతో స్తంభం నుంచి కిందపడ్డాడు. కాగా స్థానికులు వెంటనే 108 ద్వారా ఖమ్మం తరలించారు. సంఘటనపై సత్య నారాయణ తండ్రి వెంకయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి
    * ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
    ఖమ్మం(ఖిల్లా), జూలై 13: ఖమ్మం నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం నగరంలోని రంగనాయకుల గుట్టలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం నగర కమిషనర్ బి శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ అధికారి రంజిత్, కాంట్రాక్టర్ రామారావుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు సకాలంలో తాగునీటిని అందించాలని కోరారు. ప్రతి 15రోజులకొకసారి తనకు పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. ఇంకా సమస్యలుంటే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.

    పోలవరంపై ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
    కారేపల్లి జూలై13: పోలవరం ముంపు ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధమని యుటిఎఫ్ జిల్లా సహఅధ్యక్షులు బానోతు రాందాస్, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు కె నాగేశ్వరరావులు విమర్శించారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన పోలవరం ప్రాజెక్టు-కేంద్రం ఆర్డినెన్స్‌పై తలారి దేవప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సదస్సులోవారు మాట్లాడుతూ గిరిజన చట్టాలు, ఆర్టికల్-3, పీసా చట్టాలను తుంగలోతొక్కి కేంద్రం తన బలంతో గిరిపుత్రులను ముంచటానికి ప్రయత్నించటం క్షమించరాని నేరమన్నారు. 2లక్షల మంది గిరిజనులు మునిగినా,పోలవరం కట్టితీరతాం అనేరీతిలో ఎపి ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైఖరులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ఏరియాలోని 7మండలాలను తెలంగాణలోనే కొనసాగే విధంగా మరో సకల జనుల సమ్మెకైనా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వజ్జా రామారావు, సిఐటియు నాయకులు కె నరేందర్ పాల్గొన్నారు.

    ప్రారంభమైన పిఓడబ్ల్యు మహాసభలు
    సత్తుపల్లి, జూలై 13 : పిఓడబ్ల్యూ మండల 7వ మండల మహాసభలు ఆదివారం గుడిపాడులో జరిగాయి. జిల్లా పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షురాలు డి. శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే దోపిడీ అణచివేత నుంచి విముక్తి కావాలని, అణచివేతలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో స్ర్తిలపరిస్థితి, వ్యక్తిగత ఆస్తి, పునాదిపై ఏర్పడిన వివక్షకు మూలకారణమని ఈ మూలాన్ని నిర్మూలించడానికి మహిళలు ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా జరుగుతున్నాయని, వాటిని నివారించడంలో పోలీసులు, అధికారులు విఫలమవుతున్నారన్నారు. సామ్రాజ్యవాద విష సంస్కృతి దేశంలో, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతుందని, దీంతో నేటి సమాజంలో విద్యార్థులు, యువత నాశనమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాజభలకు ముందుగా పీడబ్ల్యూ జెండాను మండల అధ్యక్షురాలు కోటమ్మ ఆవిష్కరించి అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశంలో మండల అధ్యక్షురాలు సారా పద్మ, ఉపాధ్యక్షురాలు సోయం కమల, ప్రధాన కార్యదర్శి కోటమ్మ, కృష్ణవేణి, జలాల్‌భీ పలువురు మహిళలు పాల్గొన్నారు.

    మద్యనిషేధం అమలుచేయాలి
    * పిఓడబ్ల్యూ ప్రదర్శన
    సత్తుపల్లి, జూలై 13 : సంపూర్ణ మద్యపాన నిషేధంలు చేయాలని, బెల్టుషాపులను వెంటనే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా పాల్వంచ డివిజన్ కార్యదర్శి జి.లలిత మట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా మద్యం టెండర్లు గత ఏడాది కంటే ఎక్కువగా అనుమతులిచ్చి విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేశారని, గ్రామాల్లో బెల్టుషాపులు నడుస్తుంటే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మద్యం షాపుల వల్ల కటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంపూర్ణ మద్య నిషేదం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

    ’సింగరేణిలో గుర్తింపు కార్మిక
    సంఘాల వైఫల్యం‘
    ఇల్లెందు, జూలై 13: సింగరేణి సంస్థలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు వైఫల్యం చెందాయని బిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్ విమర్శించారు. కోల్‌బెల్ట్ ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆదివారం ఇల్లెందు డివిజన్‌లో పర్యటించిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోగా అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ నేతలు కార్మికవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సకలజనుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాన్ని ఇప్పించడంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా గని కార్మికులకు ఇంక్రిమెంట్ ఇప్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల లెక్కలు తేల్చడంతోపాటు 25 శాతం లాభాల బోనస్‌ను కార్మికవర్గానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అలీఖాన్, మల్లయ్య, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    రేషన్ దుకాణంపై అధికారుల దాడి
    * 150 లీటర్ల కిరోసిన్, 40 కేజీల కందిపప్పు స్వాధీనం
    * రేషన్ దుకాణం సీజ్
    ఖమ్మం రూరల్, జూలై 13: మండలంలోని తల్లంపాడు రేషన్ దుకాణంపై సివిల్ సప్లయి అధికారులు ఆదివారం దాడి చేశారు. గ్రామానికి చెందిన డీలర్ రేషన్, కిరోసిన్‌ను అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందించి సదరు రేషన్ దుకాణాన్ని తణిఖీ చేయాల్సిందిగా సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సివిల్ సప్లయి అర్బన్ డిటి వీరభద్రరావు, ఆర్‌ఐ లక్ష్మణ్, విఆర్వో వెంకటేశ్వర్లు రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి వరిగడ్డిలో దాచిపెట్టిన 150 లీటర్ల కిరోసిన్, 40 కిలోల కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు ఇవ్వగా డీలర్ వద్ద 12 కిలోల బియ్యం, 30 కిలోల పంచదార ఉన్నట్టు నిర్థారించారు. స్టాక్ రిజిష్టర్‌కు, స్టాక్‌కు ఎటువంటి పొంతన లేకపోవడంతో దుకాణాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న 150 లీటర్ల కిరోసిన్, 40 కిలోల కందిపప్పును మరో డీలర్ పాండరికి అప్పగించారు. రేషన్ దుకాణంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసిన వెంటనే జెసి, సివిల్ సప్లయి అధికారులు స్పందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

    పల్లెల్లో బోనాల సందడి
    భద్రాచలం, జూలై 13: ఆషాఢ మాసంలో బోనాల పండుగతో మన్యంలోని పల్లెల్లో భక్త్భివం ఉప్పొంగుతోంది. పురాతనమైన గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తూ బోనాలను సమర్పించుకుంటున్నారు. అలనాటి బస్తర్ సామ్రాజ్యంలోని వెంకటాపురం మండలం నూగూరుకోటలో పోతురాజు, కట్టమైసమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజనులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతలకు పూజలు నిర్వహించి వర్షాలు సకాలంలో కురవాలని, పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నారు. కొందరు గిరిజన భక్తులు పూనకాలతో బోనాలను ఎత్తుకొని నృత్యాలు చేయడం విశేషం.

    1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి
    కొత్తగూడెం, జూలై 13: ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నంగరాభేరి గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ రమేష్‌నాయక్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చుంచుపల్లి పంచాయతీ విద్యానగర్ కాలనీలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చుంచుపల్లి మేజర్ ఏజెన్సీ పంచాయతీ, లక్ష్మిదేవిపల్లి పంచాయతీలలో యథేచ్ఛగా 1/70, పీసా చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తూ గిరిజనేతరులు బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు ఎల్‌టిఆర్ కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా ముడుపులకు ఆశపడి గిరిజనేతరులు నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఏజెన్సీ పంచాయతీలలో గిరిజన చట్టాలను అమలు చేసే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో గిరిజనులతో ఉద్యమాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భూక్యా వీర ప్రసాద్, రవి, రాములు, రాందాసు, దాసు తదితరులు పాల్గొన్నారు.

    ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి
    కొత్తగూడెం రూరల్, జూలై 13: జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి సంభా సురేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బిసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం బాధాకరమన్నారు. కేంద్రం పోలవరంపై ఆంధ్రప్రదేశ్ పునర్వీవస్థకరణ సవరణ బిల్లును ఏకపక్షంగా ప్రవేశపెట్టిందన్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేసే పోరాటాల్లో తెలంగాణ ప్రజా సమితి ముందుభాగంలో ఉంటుందన్నారు. ఆర్డినెన్స్‌ను పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్ నాయకులు బండారి ఓదెలు. అలీబాబా, లక్ష్మయ్య, కొమరయ్య, వీరస్వామి, బండి నర్సయ్య, రాజలింగు, హరిగోపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

    ఘనంగా పార్థివ లింగాభిషేకం
    కూనవరం, జూలై 13: గురుపౌర్ణమి సందర్భంగా టేకులబోరులోని శ్రీ సాయి మందిరంలో రెండవ రోజు ఘనంగా పార్థివలింగాభిషేకం నిర్వహించారు. ఆదివారంనాడు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, లలిత సహస్రనామార్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల శాంతి కల్యాణం, సాయిదుర్గా యాగం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

    నగరంలో ఘనంగా బోనాల పండుగ
    ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 13: ఆదివారం నగరంలో అడపడుచులు బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో మహిళలు పుట్టినింటికి వచ్చి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయంగా వస్తుంది. తరుణులు ఆషాడమాసంలో ఆదివారం ఎకువాఝామునే లేచి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారు చేస్తారు. ప్రత్యేకంగా మహిళలు బోనాలను తలపై ధరించి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మేళతాళాలతో, డబ్బు వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరుకుంటారు. పుట్టినింటితో పాటు మెట్టినిల్లు క్షేమంగా ఉండాలని, దేశంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనాలు చెల్లిస్తారు. ఈ బోనాల పండుగలో మహిళలు కోలాటాలు ఆడుతూ, తెలంగాణ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. వీరితో పాటు యువకులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుంన్నారు. ఆదివారం నగరంలో జరిగిన బోనాల వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాలు చెల్లించారు.

    పోలవరం గిరిజనులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టెస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల
    english title: 
    m

    0 0

    * దయనీయ స్థితిలో కౌలు రైతులు
    * అదును దాటుతున్నా విడుదల కాని సాగునీరు
    * మందకొడిగా నారుమడులు
    మచిలీపట్నం , జూలై 13: కృష్ణా డెల్టా రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీటి విడుదలపై స్పష్టత రాకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్ అదును దాటుతున్నా సాగునీరు విడుదల కాకపోవటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాగునీటి విడుదల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుండటంతో ఈ దుస్థితి నెలకొంది. నాగార్జున సాగర్ నుండి సాగు నీరు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటుండగా సాగునీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులు డెల్టా రైతుల పాలిట శాపంగా మారాయి. సకాలంలో సాగునీరు విడుదల కాకపోవటంతో ఈ విడత ఖరీఫ్‌పై నీలి నీడలు పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వరస తుఫాన్లతో గత ఖరీఫ్ సీజన్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా ఈ ఖరీఫ్ పరిస్థితి తయారైంది. సాగునీటి వివాదం కారణంగా సాగు జాగుగా మారింది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన డెల్టా భూములు మసకబారి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నాయి. మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఖరీఫ్ సాగులో తీవ్ర జాప్యం చోటు చేసుకోగా నేడు సాగునీరు విడుదల కాకపోవటంతో మరింత జాప్యం ఏర్పడుతోంది. పది రోజులుగా వర్షాలు అడపాదడపా కురుస్తున్నప్పటికీ సాగునీరు విడుదల చేయని కారణంగా సాగు చేసేందుకు రైతులు ముందడుగు వేయడం లేదు. ఎక్కడో కొద్దిమంది మాత్రమే బోర్ల ద్వారా నారుమడులు పోశారు. మెట్ట ప్రాంతాల్లో అంతంత మాత్రంగా వ్యవసాయ పనులు జరుగుతున్నా మాగాణి భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా 5 లక్షల ఎకరాల్లోనైనా సాగు జరుగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేవలం వర్షాధారంపై నారుమడులు పోస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సాగునీటి కష్టాలను ఎలా అధిగమించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న కౌలు రైతులు విపత్కర పరిస్థితుల్లో సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఏటా కౌలు రైతులు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న కౌలు రైతులకు ప్రభుత్వపరంగా న్యాయం జరగడం లేదు. రుణ అర్హత గుర్తింపు కార్డులు నాలిక గీసుకోడానికి తప్ప మరేందుకూ పనికి రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పంటకాపంటకు రుణాలు పొందేందుకు కౌలు రైతులు బ్యాంకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా రుణంగా పొందలేకపోతున్నారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి సాగు చేస్తున్నా ఫలితం శూన్యం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రుణ అర్హత గుర్తింపు కార్డుల కోసం కౌలు రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు వాటిని పక్కన పడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా డెల్టాలో రైతాంగం చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.

    భవిష్యత్తులో కృష్ణా, గుంటూరులో గణనీయమైన అభివృద్ధి
    * రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం నుండి పూర్తి సహకారం
    * కోస్తా కారిడార్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి
    * పోలవరం రాష్ట్రానికి ఓ వరం
    * కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల బిజెపి జోనల్ ఇన్‌చార్జి లక్ష్మీపతి
    మచిలీపట్నం టౌన్, జూలై 13: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జోనల్ ఇన్‌చార్జి లక్ష్మీపతి అన్నారు. ఆదివారం మచిలీపట్నం విచ్చేసిన ఆయన కొద్దిసేపు విలేఖర్లతో ముచ్చటించారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. రానున్న కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలు గణనీయమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉందన్నారు. గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కీలకంగా మారిన పోలవరం ఆర్డినెన్స్‌కు లోక్‌సభలో ఆమోదం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్ర ప్రాంత రైతాంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. గుజరాత్ తరహాలో రాష్ట్రంలో ఓడ రేవులను అభివృద్ధి పర్చనున్నట్లు చెప్పారు. త్వరలోనే బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. కోస్తా కారిడార్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాల వారికి ఉపయుక్తంగా ఉందన్నారు. ఏ రంగాన్నీ విస్మరించకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజారంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా డెల్టా ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి కాల్వలను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. ఆధునికీకరణ పేరుతో గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుందే తప్ప రైతుల శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2019 ఎన్నికలలో పోటీ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని తయారుచేస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, కట్టా జ్యోతీశ్వరరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, వైవిఆర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

    అన్నదాతల ఆశలు నెరవేరతాయా..?
    * రుణాలు రీ షెడ్యూల్ అవుతాయా..?
    * 24 గంటల విద్యుత్ ఉంటుందా..?
    * అల్పపీడనంతో వర్షాలు కురుస్తాయా..?
    కూచిపూడి, జూలై 13: వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్, 24 గంటల విద్యుత్ సరఫరా, నాగార్జున సాగర్ నుండి 10 టిఎంసిల కృష్ణా జలాల విడుదల, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటం అన్నదాతలకు అన్ని శుభ శకునాలుగా మారాయి. ఇవే నిజమైతే తామంత అదృష్టవంతులు ఉండరని రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి బ్యాంకులు ద్వారా రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే. అయితే రిజర్వ్ బ్యాంకు రుణాలు మాఫీ చేసేందుకు అంగీకరించలేదు. దీనితో ఖంగుతిన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేయూతనివ్వటంతో ఎట్టకేలకు గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు తీసుకున్న రుణాల వరకు రీ షెడ్యూల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ప్రైవేటు వ్యక్తుల నుండి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన బాధ రైతులకు తప్పింది. తాగునీటికి నాగార్జున సాగర్ నుండి విడుదల చేయాల్సిన కృష్ణా జలాలు సగం విడుదలైన వెంటనే తెలంగాణా నాయకుల ఒత్తిడిపై కృష్ణా జలాల విడుదల నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కేంద్ర జల వనరుల సంఘ సమావేశంలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారుల చర్చల ఫలితంగా నిలిచిపోయిన 3 టిఎంసిల నీటి విడుదల, 10 టిఎంసిల కృష్ణా జలాలను కోరిన వెంటనే విడుదల చేయాలంటూ అధికారులు ఆదేశించారు. ఫలితంగా తాగునీటితో పాటు సాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశం ఏర్పడింది. ఇదే సమయంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు నిజమైతే ఇప్పటికే బోర్ల కింద నారుమడులు పోసిన రైతులు వరి నాట్లు ముమ్మరం చేసే అవకాశం ఏర్పడుతుంది. జిల్లాలో పెనమలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, మొవ్వ మండలాల్లో ఇప్పటికే బోర్ల కింద పోసిన నారుమడులు ఏపుగా పెరిగా నాట్లకు సిద్ధమవటంతో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు విడుదలైతేనే దాదాపు 50 శాతానికి పైగా పోసిన నారుమడులతో వరి నాట్లు ముమ్మరంగా సాగే అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎంటియు 1061, బిపిటి 5204 రకాలతో పాటు పలు మండలాల్లో ప్రభుత్వం అనుమతి పొందని ఎంటియు 2077, 1166 రకాల విత్తనాలను పోసిన నారుమడులు వరి నాట్లకు సిద్ధమయ్యాయని రైతులు పేర్కొంటున్నారు. మునే్నరు, బుడమేరు, నడిమేరు, తమ్మిలేరు, ఇప్పవాగు, ఉప్పుటేరు, బీమనది, ఐనంపూడి డ్రైన్లలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు డ్రెయిన్లలో చేరటంతో డీజిల్ ఇంజన్లతో పలువురు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా పేర్కొన్నట్లు రుణాల రీ షెడ్యూల్, 24 గంటల విద్యుత్, అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిస్తే ఈ ఏడాది రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. ఆశ నిరాశల మద్య ఉన్న ఒక్క అక్షరాలా ఇవన్నీ నిజమవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

    జిల్లాలో 32 మందికి హెచ్‌సిలుగా పదోన్నతి
    మచిలీపట్నం , జూలై 13: జిల్లాలో 32 మంది కానిస్టేబుల్స్‌కు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఇనగుదురు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి శ్రీనివాసరావు, వీరుళ్ళపాడు స్టేషన్‌కు చెందిన ఎం సుధీర్‌కుమార్, టి దేవదాస్, కోడూరు స్టేషన్‌కు చెందిన పి రాంబాబు, పామర్రు స్టేషన్‌కు చెందిన వి వెంకటేశ్వరరావు, డివి శ్రీనివాసరావు, జి కనకరాజు, పెడన స్టేషన్‌కు చెందిన వి వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేశ్వరరావు, జి.కొండూరు స్టేషన్‌కు చెందిన ఎండి యూనుస్, చల్లపల్లి స్టేషన్‌కు చెందిన కె బాబూరావు, ఒర్లగొందితిప్ప సిఎస్‌పిఎస్‌కు చెందిన ఎం ఆనంద గోపాల్, గుడివాడ తాలుకా స్టేషన్‌కు చెందిన వి రమాకుమార్, విఎస్ నాగేశ్వరరావు, గుడివాడ టూ టౌన్‌కు చెందిన బి ఏడుకొండలు, సిహెచ్ పద్మారావు, ఎ రాజు, ఎస్ కృష్ణమూర్తి, బందరు తాలుకా స్టేషన్‌కు చెందిన సిహెచ్ వెంకటేశ్వరరావు, చందర్లపాడు స్టేషన్‌కు చెందిన బి సుధీర్, విజయవాడ జిఆర్‌పికి చెందిన యండి సలీమ్, ఆర్ కిషోర్, విజయవాడ విఅండ్‌ఇ డిపార్టుమెంట్‌కు చెందిన జిటి మహేశ్వరరావు, మచిలీపట్నం డిసిబికి చెందిన పిఎన్ సునీల్‌కుమార్, మచిలీపట్నం ఆర్‌పేటకు చెందిన కె శ్రీనివాసరావు, తిరువూరు స్టేషన్‌కు చెందిన పి రాంబాబు, అవనిగడ్డ స్టేషన్‌కు చెందిన కె వెంకటేశ్వరరావు, మైలవరం స్టేషన్‌కు చెందిన వై జాన్ విల్సన్, కంచికచర్ల స్టేషన్‌కు చెందిన టి బాబిరావు, గూడూరు స్టేషన్‌కు చెందిన బి చెన్నకేశవులు, కైకలూరు టౌన్ స్టేషన్‌కు చెందిన ఎన్ మాధవరావు, ముసునూరు స్టేషన్‌కు చెందిన టి అజయ్‌బాబుకు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్‌పి ఉత్తర్వులు జారీ చేశారు.
    ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయండి
    - వాణిజ్య పన్నుల శాఖల అదనపు కమిషనర్ లక్ష్మీప్రసాద్
    మచిలీపట్నం టౌన్, జూలై 13: ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ జి లక్ష్మీప్రసాద్ కోరారు. స్థానిక బృందావనపుర కల్యాణ మండపంలో ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీప్రసాద్ నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా మద్దుల గిరీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మామిడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా చలమలశెట్టి నరసింహారావు, దింటకుర్తి దేవేంద్ర వర ప్రసాద్, వేమూరి రమేష్, తాడేపల్లి మెహర్ బాబా, కోశాధికారిగా చక్కా అనీల్ కుమార్, కార్యదర్శులుగా సామా కిషోర్, ఉదయగిరి కిషోర్, ఎం పూర్ణచంద్రరావు, శిర్విశెట్టి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా అన్వర్ హుస్సేన్, దేసు సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆది సత్యనారాయణ, యక్కల చంద్రశేఖరరావు, కార్యవర్గ సభ్యులుగా సామా కాంతారావు, పరిమి ప్రసాద్, తాడేపల్లి రేవతీ కుమార్, కొల్లూరి అనీల్ కుమార్, పి శ్రీనగిరి దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు జివివి గున్నయ్య శెట్టి, గుడివాడ రామచంద్రరావు, సిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), చిత్తజల్లు నాగేశ్వరరావు, కృష్ణాజి, సాధు గాంధి, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

    తెలుగు జాతి, తెలుగు భాష ఒక్కటే : మండలి బుద్ధ ప్రసాద్
    మచిలీపట్నం , జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి, తెలుగు భాష ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక బచ్చుపేట మహతి లలిత కళావేదికలో ఆదివారం డాక్టర్ పట్ట్భా కళాపీఠం ఆధ్వర్యంలో తూములూరి రాజేంద్రప్రసాద్ సంపుటీకరించిన సమీక్షా సమీరాల పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు, బహు గ్రంథకర్త, బహు వ్యాసకర్త డా. భోగరాజు పట్ట్భా సీతారామయ్య చిరస్మరణీయులన్నారు. తొలుత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆలోచనను బందరులోనే ఆయన ప్రవేశ పెట్టారన్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం శోచనీయమన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా రచయితలు రచనలు చేయాలన్నారు. బౌద్ధమతం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు వైదిక మతానికి ప్రాచుర్యం కల్పించడానికి నన్నయ్య మహాభారత రచన చేశారన్నారు. అనంతరం శైవ, వైష్ణవ మతాలలో సమన్వయం సాదించడానికి తిక్కన రచనలు చేశారన్నారు. ప్రతి రచయిత ఒక తిక్కన కావాలన్నారు. రచయితలు సమాజానికి మార్గదర్శకులని, సమాజాన్ని సంస్కరించే విధంగా రచనలు చేయాలని కోరారు. అనంతరం ప్రముఖ విశే్లషకులు డా. కెబి లక్ష్మి పుస్తక సమీక్ష చేశారు. ఈ గ్రంథాన్ని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సతీమణి దివంగత రామరత్నంకు అంకితమిచ్చారు. అనంతరం డా. పూసల రజనీ గంగాధర్ రచించిన ధమ్మపదం బౌద్ధ గీతాల సంపుటిని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత, కవి, విశే్లషకులు విహారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర మాసపత్రిక సంపాదకులు యజ్ఞప్రసాద్, సాహితీ కిరణం మాస పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, డా. మాదిరాజు రామలింగేశ్వరరావు, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డా. జివి పూర్ణచంద్, తూములూరి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లాలో 32 మందికి హెచ్‌సిలుగా పదోన్నతి
    మచిలీపట్నం , జూలై 13: జిల్లాలో 32 మంది కానిస్టేబుల్స్‌కు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఇనగుదురు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి శ్రీనివాసరావు, వీరుళ్ళపాడు స్టేషన్‌కు చెందిన ఎం సుధీర్‌కుమార్, టి దేవదాస్, కోడూరు స్టేషన్‌కు చెందిన పి రాంబాబు, పామర్రు స్టేషన్‌కు చెందిన వి వెంకటేశ్వరరావు, డివి శ్రీనివాసరావు, జి కనకరాజు, పెడన స్టేషన్‌కు చెందిన వి వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేశ్వరరావు, జి.కొండూరు స్టేషన్‌కు చెందిన ఎండి యూనుస్, చల్లపల్లి స్టేషన్‌కు చెందిన కె బాబూరావు, ఒర్లగొందితిప్ప సిఎస్‌పిఎస్‌కు చెందిన ఎం ఆనంద గోపాల్, గుడివాడ తాలుకా స్టేషన్‌కు చెందిన వి రమాకుమార్, విఎస్ నాగేశ్వరరావు, గుడివాడ టూ టౌన్‌కు చెందిన బి ఏడుకొండలు, సిహెచ్ పద్మారావు, ఎ రాజు, ఎస్ కృష్ణమూర్తి, బందరు తాలుకా స్టేషన్‌కు చెందిన సిహెచ్ వెంకటేశ్వరరావు, చందర్లపాడు స్టేషన్‌కు చెందిన బి సుధీర్, విజయవాడ జిఆర్‌పికి చెందిన యండి సలీమ్, ఆర్ కిషోర్, విజయవాడ విఅండ్‌ఇ డిపార్టుమెంట్‌కు చెందిన జిటి మహేశ్వరరావు, మచిలీపట్నం డిసిబికి చెందిన పిఎన్ సునీల్‌కుమార్, మచిలీపట్నం ఆర్‌పేటకు చెందిన కె శ్రీనివాసరావు, తిరువూరు స్టేషన్‌కు చెందిన పి రాంబాబు, అవనిగడ్డ స్టేషన్‌కు చెందిన కె వెంకటేశ్వరరావు, మైలవరం స్టేషన్‌కు చెందిన వై జాన్ విల్సన్, కంచికచర్ల స్టేషన్‌కు చెందిన టి బాబిరావు, గూడూరు స్టేషన్‌కు చెందిన బి చెన్నకేశవులు, కైకలూరు టౌన్ స్టేషన్‌కు చెందిన ఎన్ మాధవరావు, ముసునూరు స్టేషన్‌కు చెందిన టి అజయ్‌బాబుకు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్‌పి ఉత్తర్వులు జారీ చేశారు.

    ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిస్తే సహించం
    * వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి
    మైలవరం, జూలై 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పధకానికి తూట్లు పొడిస్తే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మురళి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పధంలో పెడతామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పధకాలు పెట్టి పేదలను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాల్సింది పోయి ఉన్న పధకాలను నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. అదేవిధంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయటం శోచయనీయమన్నారు. గడచిన ఎనిమిదేళ్లుగా అనేక కరువు కాటకాలు వచ్చినా, వరదలు సంభవించినా ఉపాధి హామీ పథకం పేదల కడుపు నింపుతోందని ఆయన గుర్తు చేశారు. అటువంటి పథకంపై తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తప్పుడు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ఉపాధి హామీ కూలీలు ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించటం సిగ్గుచేటన్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యన్న పాత్రుడు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామనటం, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామని చెప్పటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. మైలవరం నియోజకవర్గంలో 2010 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకూ 18997 మంది ఉపాధి కూలీలు పని చేసి 3.50కోట్ల రూపాయల వేతనాల రూపంలో పొందారన్నారు. దాదాపు 2900 ఉపాధి గ్రూపులు పని చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పనిదినాలను పెంచటంతోపాటు రోజుకు 250 రూపాయలు ఇవ్వాలని దీనిని అమలు చేయాలని కోరుతూ జూలై 15నుండి 25వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే రైలు చార్జీలు పెంచారని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని, ఉల్లి సామాన్యుడు కొనలేని స్థితిలో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రవి, రేణుకమ్మ, ఆర్ రామారావు, శివనాగేంద్రం, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.

    ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి
    నందిగామ, జూలై 13: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిఎస్‌పి చిన హుస్సేన్ సూచించారు. స్థానిక ఎస్‌డిపిఒ కార్యాలయ ఆవరణలో పట్టణ ప్రముఖులు, ట్రాఫిక్ నియంత్రణ సలహా మండలి సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురి అభిప్రాయాలను స్వీకరించారు. వివిధ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే స్టాపర్ బోర్డులకు స్పాన్సర్‌లు ముందుకు రావాలన్నారు. సలహా మండలి సూచనలు, సలహాలు తీసుకొని వాటికి అనుగుణంగా చర్యలు చేపడతామని దీనికి ప్రజలు, వాహనచోదకులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, ఇన్స్‌పెక్టర్ భాస్కరరావు, ఎస్‌ఐ ఏసుబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నకిరికంటి విశే్వశ్వరరావు, సీనియర్ సిటిజన్ డబ్ల్యు హరిప్రసాదరావు, వార్డు కౌన్సిలర్లు యేచూరి రాము, సరికొండ రవీంద్రబాబు, పట్టణ ప్రముఖులు అమరనేని రమేష్‌బాబు, అంబడిపూడి రాధాకృష్ణమూర్తి, సముద్రాల మధు, పారేపల్లి సాయిబాబు, సూరె రాంబాబు, డాక్టర్ హసీనాబేగం, కామసాని సత్యవతి పాల్గొన్నారు.

    పంటకు గిట్టుబాటు ధర రైతులే నిర్ణయించాలి
    * రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నాగిరెడ్డి
    మైలవరం, జూలై 13: రైతులు పండించిన పంటకు వారే ధరను నిర్ణయించుకునే అధికారం రావాలని రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎంవివిఎస్ నాగిరెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని పుల్లూరులో శ్రీ వీరాంజనేయ రైతుల సహకార సంఘానికి ఉత్తమ క్లబ్ అవార్డు వచ్చిన సందర్భంగా క్లబ్‌ను అభినందించేందుకు ఆదివారం ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఈసందర్భంగా క్లబ్ పనితీరును, మార్కెటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారిని అభినందించి వారికి మెమోంటో అందించి సత్కరించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రైతు క్లబ్‌ల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులు నిర్ణయించుకునే అధికారం వచ్చినప్పుడే నష్టాలనుండి బయటపడతాడన్నారు. గత ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలో పూర్తిగా విఫలమైనందునే రైతులు అప్పులపాలయ్యారన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జస్టిస్ స్వామినాధన్ కమిటీ సిఫార్సులు అమలైనప్పుడే రైతులకు వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు. రైతాంగం సంఘటితమై క్లబ్‌గా ఏర్పడి పంటలను పండించుకోవటం, మార్కెటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా మేలు రకమైన అధిక దిగుబడులు సాధించటంతోపాటు గిట్టుబాటు ధర పొంది వ్యవసాయం లాభదాయకంగా తయారు చేసుకునే వీలుంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతాంగం పట్ల సానుకూల ధోరణిని అవలంభించి వ్యవసాయ రంగం బలోపేతం అవటానికి కృషి చేయాలని సూచించారు. ఇతర రైతులంతా పుల్లూరు రైతుక్లబ్‌ను ఆదర్శంగా తీసుకుని వృద్ధి చెందాలని ఆయన సూచించారు.

    శాకాంబరిగా దర్శనమిచ్చిన తిరుపతమ్మ అమ్మవారు
    పెనుగంచిప్రోలు, జూలై 13: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. దాతల సహకారంతో వివిధ రకాల కూరగాయాలు, ఆకు కూరలు, పండ్లతో అమ్మవారితో పాటు సహదేవతల ఆలయాలు, తిరుపతమ్మ ఆలయాన్ని అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ పూజారులు మర్రెబోయిన వెంకట రమణ, జయ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాఖాంబరి అమ్మవారిగా దర్శనమిస్తున్న తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కార్యనిర్వహణ అధికారి హనుమంతరావు, ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. కాగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి రథోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు రైతులు అమ్మవారి రథానికి తమ ఎద్దుల జతలను కట్టి లాగించడం ఆనవాయితీగా కొనసాగింది. అలాగే మహిళా భక్తులు తిరుపతమ్మ రథం ముందు వారులు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు స్వామి గోపాలరావు, గోపి మురళి, ఇఇ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

    స్పందించని సిఎం బాబు
    విజయవాడ, జూలై 13: నవ్యాంధ్రప్రదేశ్‌కు కాబోయే రాజధానిగా ఉన్నతికెక్కిన విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగ కార్మిక పెన్షనర్‌లకు మూడు నెలలుగా జీతాలకు నోచుకోని విషయం తేటతెల్లమైనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏ మాత్రం స్పందించకపోవడంపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు నిప్పులు చెరిగారు. దాసరి నాగభూషణరావు భవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు ఏనాడు కూడా సకాలంలో జీతాలకు నోచుకోకపోవడంతో అవివాహితులకు పెళ్లిళ్లు కూడా కావటం లేదంటూ పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నా చంద్రబాబు ఏ మాత్రం చలించలేదన్నారు. కనీసం రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీల తరహాలో 0/0 పద్దు కింద ప్రభుత్వమే జీతాలు చెల్లించాలంటూ ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలోని దాదాపు 80వేలమంది కాంట్రాక్టు కార్మికులందరికీ వారి వారి వేతనాలకు అదనంగా రూ. 1600 పెంపునకు నాటి ప్రభుత్వం అంగీకరించి గత మార్చి మాసం నుంచి కేవలం పారిశుద్ధ్య కార్మికులకు ఆ పెంపును అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వం అంగీకరించిన విధంగా కార్మికులందరికీ ఈ పెంపును అమలుచేయాలని కోరుతూ ఈనెల 15న నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేయనున్నామని ఆసుల తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పంచాయతీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర తొలి మహాసభలు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విశాఖపట్టణంలో జరుగనున్నాయని తెలిపారు.

    డ్వాక్రా రుణమాఫీకి సంతకాల సేకరణ
    విజయవాడ, జూలై 13: ముఖ్యమంత్రి చంద్రబాబు తానిచ్చిన ఎన్నికల హామీ మేరకు తక్షణం డ్వాక్రా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) 42వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్‌లో సంతకాలు సేకరించారు. నగర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఓర్సు భారతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కుటుంబ పోషణలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో పొదుపు సంఘాలుగా ఏర్పడి బ్యాంకు రుణాల ద్వారా ఊరట పొందుతున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడం, మహిళలంతా ఆయనకు ఓట్లు వేసి గెలిపించడం దాంతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ప్రమాణ స్వీకారం నాడు రుణమాఫీ ఫైలుపై సంతకం పెట్టారేతప్ప ఇంతవరకు మరో అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం శోచనీయమన్నారు. కాలయాపన చేయకుండా చిత్తశుద్ధితో డ్వాక్రా రుణమాఫీకి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు సత్యవతి, సక్కుబాయి, మల్లీశ్వరి, కోటేశ్వరమ్మ, సిరాలక్ష్మి, సిపిఐ డివిజన్ కార్యదర్శి పోట్రు వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి అన్నామలై సాంబశివరావు, స్థానిక నాయకులు పుట్టగుంట సాయిబాబు పాల్గొన్నారు.
    ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు నిర్ణయం
    బెంజిసర్కిల్, జూలై 13: ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న వ్యాపార, వాణిజ్య వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించాలని, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ల సమాఖ్య ద్వారా ఆంధ్రరాష్ట్రానికి ప్రాతినిధ్యం సహేతుకంగా ఉండే విధంగా ఆ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. నగరంలోని బందురురోడ్డులో ఉన్న విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కార్యాలయంలో అదివారం 13 జిల్లాల ఛాంబర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా అమోదించారు. నిత్వావసర వస్తువులపై నాన్ బెయిలబుల్ వారెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వివమించుకోవాలని కోరారు. ఉల్లిపాయలను, బంగాళదుంపలను నిత్వావసర వస్తువులలో చేర్చే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం వెంటనే విరమించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా గోధుమలు, గోధుమ బైప్రోడక్ట్‌లపై అమలులో ఉన్న వ్యాట్ ధర తొలగించాలని, తెలంగాణా రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై సిఎస్‌టి విధింపు ఐదేళ్లపాటు టాక్స్ హాలిడే అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో త్వరలోనే 13జిల్లాలలో విడివిడిగా సమావేశాలు నిర్వహించి కొత్తగా తలెత్తుతున్న సమస్యలను కూలంకషంగా చర్చించి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, అనంతరం కీలకస్థానంలో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కమిటీని ఎన్నుకొని తమ సమస్యలను ముఖ్యమంత్రికి నివేదించాలని నిర్ణయించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వి భాస్కరరావు అధ్యక్షత వహించగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

    దుర్గమ్మ సేవలో సిపి దంపతులు
    ఇంద్రకీలాద్రి, జూలై 13: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శాంతి స్వరూపిణి శ్రీకనకదుర్గమ్మను ఆదివారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావుదంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఇదేవిధంగా సబ్‌కలెక్టర్ హరిచందన దంపతులు, గుంటూరు జిల్లా ప్లానింగ్ కమిషనర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన పలువురు ఉన్నతస్థాయి అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో వి త్రినాథరావు ఆదేశాల మేరకు ఆలయ సహాయ ఇవో వి రాంబాబు ప్రొట్‌కాల్ ఉన్న విఐపిలకు అమ్మవారి రాజగోపురం వద్దనే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాయంలోనికి వద్దకు తీసుకువెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత వారికి అమ్మవారి రాయబార మండపంలో అర్చకులు అమ్మవారి దివ్య అశీస్సులను అందచేయగా, ఆలయాధికారులు వీరికి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు.

    టెక్నికల్ ఆఫీసర్స్‌ను గెజిటెడ్ ఆఫీసర్స్‌గా పరిగణించాలి
    విజయవాడ, జూలై 13: రాష్ట్రంలోని 13 ప్రభుత్వ శాఖల్లో రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ ఆఫీసర్స్‌ను గెజిటెడ్ ఆఫీసర్స్‌గా పరిగణించాలని ఆదివారం నాడిక్కడ జరిగిన సీమాంధ్ర టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 13 ప్రభుత్వ శాఖలకు చెందిన టెక్నికల్ ఆఫీసర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తికావటాన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోని సాంకేతిక విభాగాల్లోని ఖాళీలన్నింటినీ భర్తీచేయాలని సమావేశం కోరింది.

    * దయనీయ స్థితిలో కౌలు రైతులు * అదును దాటుతున్నా విడుదల కాని సాగునీరు * మందకొడిగా నారుమడులు
    english title: 
    krishna

    0 0

    ఎచ్చెర్ల, జూలై 13: వారం వ్యవధిలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా ఖరీఫ్ సీజన్‌లో సాగించాల్సిన వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పదును అనుకూలంగా ఉండటంతో ఓ పక్క ఎదలు, మరోపక్క నారుమళ్లు వేసేందుకు అన్నదాతలంతా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అయితే మునుపటి మాదిరిగా దుక్కి పశువులు లేకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. పశుపోషణ భారంగా మారడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు సైతం దుక్కిపశువులు ఆలనాపాలనా చూడలేక విక్రయించి ట్రాక్టర్ల సాయంతో వ్యవసాయ పనులు ముగిస్తున్నారు. దమ్ము, దుక్కి, నూర్పు వంటి పనులు ట్రాక్టర్లతో నిర్వహించినప్పటికీ నారుమళ్లు వేసేందుకు , ఎదలు వంటి విత్తనాలు చల్లేందుకు దుక్కిపశువులతో ఏరువాక సాగించక తప్పదు. ఇవి గ్రామాల్లో లేకపోవడం , మరోవైపు పదును పోతుందన్న భయం కూడా అన్నదాతలను వెంటాడుతోంది. ప్రతీ గ్రామంలో ఐదు నుండి పది మధ్య దుక్కిపశువులు ఉండటం, వీటి సాయంగా ఏరువాక సాగించి ఆకుమడులు సిద్ధం చేయడంతో మరింత జాప్యం జరుగుతుంది. వీటి కొరత కారణంగా ఏరువాక నిర్వాహకులు ప్రతీ విత్తనాల బస్తా చల్లేందుకు వంద నుండి 150 రూపాయలు వసూలు చేస్తూ రైతుల జేబులకు చిల్లులు పడేలా ధరలు పెంచేశారు. అయినప్పటికీ వ్యవసాయ పనులు కార్తెల్లో పూర్తికావాలన్న తాపత్రయంతో అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎదలు వంటి వ్యవసాయ పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో పల్లెల్లో వ్యవసాయ కూలీలకు గొప్ప డిమాండ్ నెలకొంది. మరోవైపు మెట్ట ప్రాంతాల్లో సరుగుడు, నీలగిరి, జీడిమామిడి వంటి తోటలు వేసేందుకు కొంతమంది రైతులు ఉపకరించడంతో ఇటు విత్తనాలు చల్లేందుకు రైతులంతా సమాయత్తం కావడంతో కూలీలు కొరత కూడా పట్టిపీడిస్తోంది.

    16, 17 తేదీల్లో జగన్ పర్యటన
    * చెన్నై బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
    శ్రీకాకుళం, జూలై 13: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో జిల్లాలో పర్యటించి ఇటీవలి చెన్నైలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో మృత్యువాతపడి నిరాశ్రయులుగా మిగిలిన కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. బహుళ అంతస్థుల భవనం కుప్పకూలి 14 మంది, గోడ కూలి తొమ్మిది మంది జిల్లా వాసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ కుటుంబాలను ఓదార్చడానికి సిక్కోలులో సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. తొలుత కొత్తూరు, హిరమండలం, నరసన్నపేట, ఎల్.ఎన్.పేటలలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే గోడ కూలిన ఘటనలో మృత్యువాత పడ్డ బూర్జ, కోటబొమ్మాళి, సారవకోటలో వారి కుటుంబాలను ఓదార్చేందుకు జిల్లాకు విచ్చేస్తున్నారు.
    పార్టీ బలోపేతానికి సంస్కరణలు
    ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసిన తరువాత తొలిసారిగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా నుంచే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సంస్కరణలకు జగన్ శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జిల్లాలోపార్టీ బాధ్యతలు అప్పగించి తద్వారా పది నియోజకవర్గాల్లో కేడర్‌ను ఉత్తేజపరిచేలా వివిధ కార్యక్రమాలను రూపొందించే బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు అడ్డాగా ఉన్న కోటబొమ్మాళిలో బాధిత కుటుంబాలను పరామర్శించడమే కాకుండా అక్కడ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సాగించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించడమే కాకుండా పార్టీ అభిమానుల్లో నూతనుత్సాహం నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించనున్నారు.

    పితృకర్మల ప్రదేశంలో స్వామివారి కట్టడి!
    గార, జూలై 13: ఎంతో పవిత్రమైన కూర్మనాథ స్వామి వారి భోగం అదే వంట పాత్రలు(కట్టడి) ఆలయ వెలుపల శే్వత పుష్కరిణి గట్టుపై నిర్వహించే పితృకర్మలు ప్రదేశంలో దర్శనమిస్తుండంతో భక్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. హిందూ ధర్మంలో భక్తులు దేవుడిని ఎంతగా విశ్వసిస్తారో అంతే విశ్వాసంతో స్వామికి నివేదించే ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదం తయారు చేసే పాత్రలు బయటకు వెళ్లడం, అదీ కూడా భోగంతో కూడినవి కావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది. స్వామివారికి తయారు చేసే నిత్య భోగాలు కట్టడితో సహా ఆలయ పరిధి దాటి అపరకర్మలు చేసే ప్రదేశంలో దర్శనమిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో భోగంతో ఉన్న స్వామివారి కట్టడిని వంటస్వామి పితృకర్మలు చేసే ప్రదేశంలో వేరే వారికి అందజేసిన ఘటన భక్తుల కంటపడడంతో కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆనోటా ఈనోటా బయటకు పొక్కింది. ఆలయ కార్యనిర్వాహణాధికారిగా పూర్తి బాధ్యతలు వహించాల్సిన ఇ.ఒ.కు వేరే బాధ్యతలు ఉండడంతో ఇటువంటి సంఘటనలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, ఆ కారణంగానే ఇటు వంటివి చోటు చేసుకుంటున్నాయన్నది స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. పితృకర్మలు చేసే అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేరుగా వంట స్వామితో ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుండి స్వామి వారి భోగాన్ని కట్టడిలో బయటకు తీసుకువెళ్ళడం.. అక్కడి వారు ఇచ్చిన బియ్యాన్ని ఆలయంలోని పాకశాలకు తీసుకురావడం ఇక్కడ సాధారణమైందన్న విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగానే స్వామి వారి ప్రసాదం నాణ్యత లోపిస్తుందని, తయారైన కొద్ది సేపటికే రుచి మారిపోతుందన్న భక్తుల ఆరోపణలకు ఈ ఘటన ఊతమిస్తోంది. గతంలో అన్నవరం, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయంలో లోపించిన ప్రసాదం నాణ్యతపై ఏకంగా ఇ.ఒ. శ్యామలాదేవికే ఫిర్యాదుచేశారు. అయినప్పటికీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కార్యనిర్వాహణాధికారిణి వి. శ్యామలాదేవి వద్ద ప్రస్తావించగా తన దృష్టికి రాలేదని, విచారణ చేసి చర్యలు చేపడతానని, కట్టడి ఆలయ ప్రాంగణం దాటి బయటకు వెళ్ళడానికి వీలులేదన్నారు.‚

    చక్కెర పరిశ్రమను తెరిపిస్తా..
    శ్రీకాకుళం, జూలై 13: జిల్లాలో చెరకు రైతులకు అండగా నిలిచి మూతపడిన ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా అరసవల్లి ఆదిత్యుని దర్శించుకుని అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని న్యాయస్థానాన్ని నాడు ఆశ్రయించానని గుర్తుచేశారు. తుదితీర్పు అనుకూలంగా వెలువడిన అనంతరం సహకార రంగంలో కొనసాగుతున్న చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినట్లయితే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. పదవుల కన్నా చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు రెవెన్యూ మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వంఇటీవలి ఆర్డినెన్స్ తీసుకురావడం తెలుగుదేశం ప్రభుత్వ తొలి విజయమన్నారు. రాష్ట్భ్రావృద్ధియే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇది ఓ తార్కాణమన్నారు. ఇందులో చంద్రబాబు కృషి దాగి ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని స్పష్టంచేశారు. విభజనలో ఎంతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిబాటలో పయనింపజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ వర్తింపజేయడం ఖాయమని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పటికే రిజర్వు బ్యాంకును ఒప్పించి రీషెడ్యూల్‌కు కావలసిన అనుమతులను ఇప్పించారని గుర్తుచేశారు. మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్‌తో విడిపోగా 15 వేల కోట్ల లోటుబడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. ఉద్యోగుల విభజన, రాష్ట్ర రాజధాని నిర్మాణం వంటి సమస్యలను అధిగమించేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. యు.పి.ఏ ప్రభుత్వం విభజన సమయంలో చేసిన తప్పిదం వల్ల అనేక అంశాలలో ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత కొరవడిందన్నారు. దీని కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తలదాచుకునేందుకు అవకాశం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేసారు. ఇటువంటి సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు అందరం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత రవికుమార్‌ను ఆలయ సిబ్బంది మర్యాదలతో లోపలకు ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనివెట్టి మండపంలో రవికుమార్ కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు అందించారు. ఈయనతోపాటు సతీమణి , మాజీ ఎంపిపి ప్రమీల, విశ్రాంత గ్రంథాలయ అధ్యాపకులు దుంపల సన్యాసిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.

    ఇంద్రపుష్కరిణికి మహర్దశ!
    శ్రీకాకుళం, జూలై 13: సూర్యనారాయణస్వామి దేవస్థానం ఆవరణలో గల పవిత్ర ఇంద్రపుష్కరిణికి మహర్ధశ పట్టింది. గత కొద్దికాలంగా మరమ్మతులకు నోచుకోక భక్తులు పడిన ఇబ్బందులు పాఠకులకు తెలిసిందే. సమస్యను గుర్తించిన ట్రైమెక్స్ యాజమాన్యం 24 లక్షల రూపాయలతో దక్షిణం వైపు పూర్తిగా మెట్లు నిర్మించడంతోపాటు నాలుగువైపులా మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చిందని ఆలయ ఇ.ఒ పుష్పనాధం తెలిపారు. సమస్యను ట్రైమెక్స్ ఎం.డి కోనేరు ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే ఆయన స్పందించి అవసరమైన అదనపు నిధులు సమకూర్చడానికి అంగీకరించారన్నారు. సకాలంలో మరమ్మతులు పూరె్తై ఇంద్రపుష్కరిణి వినియోగంలోకి వచ్చినట్లయితే గత కొద్దికాలంగా భక్తులు ఎదుర్కొనే సమస్యల నుంచి విముక్తి కలిగినట్లవుతుంది.

    పిఎసిఎస్ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ!
    జలుమూరు, జూలై 13: మండలం చల్లవానిపేట సొసైటీ సహకార సంఘ అధ్యక్ష ఎన్నికపై కొందరు డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ నెల 15వ తేదీన జరుగనుండటంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 13 డైరెక్టర్ల పదవులలో పది కాంగ్రెస్, మూడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఒక్క డైరెక్టర్ పదవిని కూడా టిడిపి దక్కించుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాన కనకయ్యను కొందరు డైరెక్టర్లు కలసి అధ్యక్షునిగా ఎన్నుకొనేందుకు నెల రోజుల కిందట అవిశ్వాసాన్ని పెట్టేందుకు డి.ఆర్.కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఎన్నిక జరిపేందుకు డి.ఆర్. ఆదేశాలివ్వడంతో మండలంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అవిశ్వాసంలో నెగ్గేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్న దుంగ స్వామిబాబును తొలగించేందుకు ఇటీవల టిడిపికి అనుకూలంగా ఉన్న ఓ నేత ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు దుంగ స్వామిబాబును కొనసాగించేందుకు వైసిపి నేతలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు తేలనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గేది ఎవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
    వరుణిడి కరుణ కోసం సహస్ర ఘటాభిషేకం
    జలుమూరు, జూలై 13: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం గ్రామంలో వెలసిన తీర్ధలింగేశ్వరస్వామికి ఆదివారం వరుణదేవుని కరుణ కోసం భక్తులు సహస్త్ర ఘటాభిషేకం చేపట్టారు. 1001 బిందెలతో నీటిని తీసుకువచ్చి పురోహితులు మరువాడ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురాతనం నుండి వర్షాలు కురవని సందర్భంలో తీర్ధలింగేశ్వరస్వామికి ఘటాభిషేకం చేస్తే రెండు మూడురోజుల్లో తప్పనిసరిగా వర్షం కురుస్తుందని భక్తుల విశ్వాసం. తొలుత వినాయక పూజ , మహాపుణ్యావచనం, పూర్వగదశ సహస్తశ్రతకం, ఏకాదశ పూర్ణ్భాషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రభాకరరావు, తీర్ధలింగేశ్వరస్వామి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
    రోడ్డు విస్తరణలో
    టెలికాం సంస్థకు భారీ నష్టం
    * జె.పి.ఒ కైలాసరావు
    నరసన్నపేట, జూలై 13: పట్టణంలో ఇటీవలి రోడ్డు విస్తరణ పనులను చేపట్టిన ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించకపోవడంతో టెలిఫోన్ శాఖకు భారీ నష్టం ఏర్పడిందని జె.పి.ఒ కైలాసరావు తెలిపారు. ఆదివారం పట్టణంలో పలుచోట్ల దెబ్బత్నిన కేబుళ్లకు సిబ్బందిచే మరమ్మతులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా కాలువల నిర్మాణాలు చేపడుతున్న ఆర్.అండ్.బి శాఖ ఇష్టానుసారంగా గోతులు తీయడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న టెలిఫోన్ కేబుళ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. దీనివల్ల టెలిఫోన్‌తోపాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా దెబ్బతిందని, పలు బ్యాంకులకు సంబంధించి లావాదేవీలు గత రెండురోజులుగా నిలిచిపోయాయని వివరించారు. సంబంధిత శాఖకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా తమ దృష్టికి తీసుకురాకుండా పనులు చేయడం వల్లనే ఐదు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని స్పష్టంచేశారు. టెలిఫోన్ లైన్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాచూస్తామన్నారు.

    తాటికల్లుతో ఆరోగ్యానికి మేలు
    * ఎపి కల్లుగీత కార్మిక సంఘం
    శ్రీకాకుళం, జూలై 13: ప్రకృతి పానీయంగా తాటికల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోట అప్పారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన కల్లుగీత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహజ సిద్ధమైన తాటి కల్లుతో కామెర్లు, నరాల బలహీన, పండురోగం, అజీర్తి, మలబద్దకం, రక్తహీనత వంటి రోగాలు నయమవుతాయని అన్నారు. అయితే కోకోకోలా, పెప్సీ వంటి బహుళజాతి శీతల పానీయాల కంపెనీల ప్రచారాలతో దీనిని అంటరాని పానీయంగా నెట్టివేయడం దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణాలో కల్లును దేవతలకు నైవేద్యంగా పెడతారని అక్కడ కల్లులేనిదే ఏ జాతర నిర్వహించరని తెలిపారు. కల్లు సేవించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నివారణవుతాయని పరిశోధనలో వెల్లడయ్యాయన్నారు. అయితే ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్య ధోరణితో నేడు కల్లు వృత్తి చిన్నాభిన్నం అయిపోయిందని, దీంతో గీత కార్మికుల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్లుతెరచి గీత వృత్తిని ఆధునీకరించి కార్మికుల ఉపాధి కాపాడాలని కోరారు. తొలుత ప్రకృతి పానీయం టాడీనే సేవిద్దాం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్.వి.రమణమూర్తి, టి.తిరుపతిరావు, సూర్యనారాయణ, ఎం.సిమ్మయ్య, గోదావరి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

    ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
    శ్రీకాకుళం, జూలై 13: ప్రింటింగ్, బుక్ బైండింగ్ రంగంలో ఉచిత శిక్షణ పొందడానికి అర్హత గల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అక్షయ స్వచ్ఛంధ సంస్థ కార్యదర్శి గుమ్మా నగేష్ ఒక ప్రకటనలో కోరారు. ఏడవ తేదీ కనీస విద్యార్హత కలిగి 18 నుండి 25 ఏళ్ల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలన్నారు. ఆరునెలల శిక్షణ కాలంలో నెలకు రెండువేలు చొప్పున స్ట్ఫైండ్ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి గల స్ర్తి, పురుషులు ఈ నెల 30వలోగా కోణార్క్ బంగారం షాపు, జి.టి.రోడ్డు గల చిరునామాకు దరఖాస్తులను అందించాలన్నారు.

    జిల్లా ప్రజల సహకారం మరువలేనిది
    శ్రీకాకుళం, జూలై 13: జిల్లాలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని కలెక్టర్ సౌరభ్‌గౌర్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు బదిలీ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక పాత్రికేయులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించి తొడ్పడ్డారని పాత్రికేయులను కొనియాడారు. ఇక్కడి యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఉంటారని, వారి సహకారంతోనే జిల్లా అభివృద్ధికి కృషిచేయడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలు సౌమ్యులని, వారి సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో పనిచేసిన గత కలెక్టర్ల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి పనిచేసానని చెప్పారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికారులతో పాటు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిపిఆర్‌వో ఎల్.రమేష్, ఎన్.్ధర్మారావు, కె.వేణుగోపాలరావు, ఎస్.్భస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

    మహిళా చైతన్యంతోనే సాధికారత
    * ఎమ్మెల్యే లక్ష్మీదేవి
    శ్రీకాకుళం, జూలై 13: సమాజంలో మహిళా చైతన్యంతో సాధికారితను సాధించవచ్చునని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. జెసిఐ ఫెమీనా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక వరం రెసిడెన్షిలో నిర్వహించిన ‘సూపర్ మామ్’ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా జెసిఐ ఫెమీనా నిర్వహిస్తున్న విద్య, సామాజిక, సేవా కార్యక్రమాలు ఎందరో మహిళలతోపాటు ఇతర సేవాసంస్థలకు స్పూర్తిని కలిగిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మహిళలకు తల్లీ, పిల్లల బాంధవ్యాలు, టూ మినిట్స్ గేమ్ తదితర ఆటలను ఆడించి న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు వ్యక్తపరిచిన మహిళలకు సూపర్ మమ్‌లుగా ఎంపిక చేశారు. న్యాయనిర్ణేతలుగా పాలిశెట్టి ఉమాదేవి, సీతాదేవి, శారదాదేవి, పోలుమహంతి రమాదేవిలు పాల్గొన్నారు. ఫెమీనా అధ్యక్షురాలు మొదలవలస రేవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు నీలిమాప్రసాద్, పూర్వాధ్యక్షురాలు పైడి రజని, ఎస్.శోభారాణి, మహలక్ష్మీలతోపాటు పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

    అరసవల్లికి తగ్గిన భక్తుల తాకిడి
    శ్రీకాకుళం, జూలై 13: ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి వారి దేవస్థానంలో భక్తులు సాధారణంగా కనిపించారు. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం పురస్కరించుకుని పలువురు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. తలనీలాలు అర్పించి పవిత్ర ఇంద్రపుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యక్ష దైవాన్ని మొక్కుకున్నారు. శూన్యమాసమైన ఆషాఢం కావడంతో ఆశించినంతగా భక్తులు కనిపించలేదు. 25 రూపాయల క్యూలైన్‌లో కనీసంగా భక్తులు లేకపోగా ధర్మదర్శనం క్యూలైన్‌ల నుంచి నేరుగా ఆదిత్యుని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో అర్చనలు, విశేషాలంకరణ సేవలు జరిగాయి. క్షేత్ర పాలకులైన రామలింగేశ్వరస్వామి, నవగ్రహ మండపాల వద్ద అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లలో భాగంగా ఆలయ ఇ.ఒ ఆర్.పుష్పనాధం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రసాదాల తయారీ భవనం వద్దకు చేరుకుని ప్రసాదాల నాణ్యత, పరిమాణాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.

    వైభవంగా గణపతి, చండీహోమ పూజలు
    శ్రీకాకుళం, జూలై 13: లోక కల్యాణార్ధం పట్టణ పరిధిలో గల కొత్తబ్రిడ్జి దరి చిం దత్తనాధ క్షేత్రంలో గత మూడురోజులుగా నిర్వహించిన నవచండీ హోమ సహిత వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ మహోత్సవాలు ఆదివారం పూర్ణాహుతి పూజలతో ముగిసాయి. ధర్మపురి గౌరీశంకరశాస్ర్తీ, శృంగారం ధనుంజయ్‌శర్మల నిర్వహణలో ఉదయం గణపతి, నవచండీ హోమ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. హాజరైన భక్తులందరితో అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి మూర్తికి తైలాభిషేకాలు చేయించారు. ప్రధాన మందిరంలో గణపతి హోమాన్ని, గాయత్రీ మాతా ఆలయం ఎదుట నవచండీహోమాన్ని నిర్వహించి 14 అధ్యాయాలు, వేదపఠనం చేసి పూర్ణాహుతికి చెందిన ద్రవ్యాలను, మూలికలను భక్తులచే తాకించి అగ్నిహోమంలో వేయించారు. సువాసినులచే కుంకుమార్చనలు చేయించారు. అవధూతగా ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద, ప్రత్యేక పర్యవేక్షకులుగా వేదపండితులు అంపోలు రుద్రకోటేశ్వరశర్మలు హాజరయ్యారు. అనంతరం గాయకులు భారతీ రమేష్ ఆలపించిన భక్తి సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు లాడె వాసుదేవరావు దంపతులు, బెవర గోవిందరావు, పన్నాల రామకృష్ణ, మోహనరావు, గణపతి ఆలయ నిర్మాత మొదలవలస రమేష్, ఔషధ నియంత్రణ శాఖ ఎ.డి వై.వి.సత్యనారాయణ, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు సూరి చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
    * దత్తనాథున్ని దర్శించిన జెడ్పీ చైర్‌పర్సన్
    జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ దత్తక్షేత్రంలో నిర్వహిస్తున్న నవచండీ హోమ, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తొలుత ఆమెకు ఆలయ మర్యాదలతో నిర్వాహకులు పూర్ణకుంభంతో లోపలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆమె దత్తనాథ మూర్తికి తైలాభిషేకం , గాయత్రీమాతకు పుష్పాభిషేకం పూజలు చేసి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈమెతోపాటు కమిటీ సభ్యులు ఎన్.కాంతారావు, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

    కూర ‘గాయాలు’
    పొందూరు, జూలై 13: కూరగాయల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయల జోలికి వెళ్లలేని పరిస్థితిని పెరిగిన ధరలు కలిగించాయి. ఇదేమిటంటే స్టాక్ లేదంటున్నారు కొందరు, ఇతర ప్రాంతాల నుండి కూరగాయలు దిగుమతి కావడం లేదని మరికొందరు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి మండల కేంద్రమైన పొందూరు మహరాజా మార్కెట్‌లో వారపు సంత అయిన ఆదివారం నాటి పరిస్థితి పై విధంగా ఉంది. ధరలు నింగినంటుతున్నా పట్టించుకునే వారే లేకపోవడంతో వ్యాపారులు, దళారులే మార్కెట్‌లో రాజ్యమేలుతున్నారు. నిన్న, మొన్నటివరకు కిలో 15 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు ఏకంగా 30 రూపాయలకు చేరాయి. దీనికి కారణం కొంతమంది వర్షాలు లేవని చెబుతుండగా మరికొందరు స్టాక్ లేవంటున్నారు. కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశనంటుతుండటంతో ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతోంది. 500 రూపాయలు తీసుకువెళ్తేనే తప్ప రెండు, మూడురోజులకు సరిపడా కూరగాయలు రావడం పేద, మధ్య తరగతి వర్గాలు వాపోతున్నాయి. ఇక సామాన్య ప్రజలు మాత్రం కూరగాయల జోలికే పోవడం మానేశారు. నిన్న మొన్నటివరకు ఎండలు మండగా ఇప్పుడు కూరగాయ ధరలు మండుతున్నాయి. గత నాలుగురోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూరగాయల ధరలు మాత్రం దిగలేదు. కూరగాయల ధరలను వినేందుకే ప్రజలు వణికిపోతున్నారు. కేవలం మూడురోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశనంటాయి. అలాగే టమాటా ఇప్పటికే 40 రూపాయలకు చేరుకుంది. ఇంటికి బంధువులు వస్తే వారికి భోజనం పెట్టాలంటే కూర ఏమిటని ముందుగా ఆలోచిస్తే మొదటగా గుర్తొచ్చేది బంగాళ దుంప. బంగాళ దుంప కూరేనా అని చాలామంది తీసిపారేస్తుంటారు. అటువంటి బంగాళ దుంప నేడు బంగారం దుంపలా మారింది. నేడు బంగాళ దుంప కిలో 30 రూపాయలు పలుకుతోంది. చేమదుంపలు కేజీ 40 రూపాయలు, బెండకాయలు 50, వంకాయలు 40, బీరకాయలు 60, దొండకాయలు 30, పచ్చిమిర్చి 60 రూపాయలు, అల్లం 200 రూపాయలకు చేరుకుంది. క్యారెట్ ముట్టుకుంటేనే భయమేసేలా 70 రూపాయలకు చేరింది. నిన్న మొన్నటివరకు వాతావరణం అనుకూలించకపోవడంతో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయనుకునే వారు కాని, ప్రస్తుతం వాతావరణం సహకరించినా పుష్కలంగా కూరగాయలు వస్తున్నా..్ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక సామాన్య ప్రజలు ఏమి కొనుక్కు తింటారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

    వారం వ్యవధిలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా
    english title: 
    joru

    0 0

    విశాఖపట్నం, జూలై 13: విద్యుత్ పంపకాలపై ఢిల్లీలో సోమవారం కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించాల్సిన విద్యుత్ వాటాలపై ఇందులోనే కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సమీక్ష మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. దీనిలోనే విద్యుత్ వాటాల కేటాయింపులపై తుది నిర్ణయం వెలువడనుంది. అందువలనే ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారటీ (సిఇఎ) చైర్మన్ సమక్షంలో జరిగే సమీక్షా సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ కార్యదర్శులు (ఎనర్జీ సెక్రటరీలు), పవర్ గ్రిడ్‌కు చెందిన ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్‌లు, ఎన్టీపిసి నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ సమీక్షకు హాజరవుతారు. దీనిలో కీలకమైన విద్యుత్ పంపకాలపై చర్చిస్తారు. గతంలో సీమాంధ్రకు 46 శాతం, తెలంగాణకు 54 శాతం మేర విద్యుత్ వాటాను కేటాయించడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువుగా ఉన్నా, విద్యుత్ వాటాలో మాత్రం తీవ్ర అన్యాయానికి గురయ్యేది. అందువల్ల ఇప్పుడైనా ఈ తరహా విధానానికి స్వస్తి పలికి ఆంధ్రా రాష్ట్రానికి అవసరమైన లేదంటే 58:42 నిష్పత్తి ప్రకారం విద్యుత్‌ను పంపిణీ చేయాలని విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల విద్యుత్ పంపకాల అంశంపై సమావేశంలో స్పష్టతతో కూడిన ప్రకటన చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్ర నుంచి ఎనర్జీ సెక్రటరీ, పవర్ గ్రిడ్ నుంచి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ఎన్టీపీసి నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హాజరవుతున్నందున ఎటువంటి వివక్షత లేకుండా చూడాలని, వాస్తవానికి ఆంధ్రాలోనున్న ఎన్టీపిసి నుంచి తొలి దశలో వెయ్యి మెగావాట్లు, రెండవ దశలో 260 మెగావాట్ల విద్యుత్ అందుతోందని, అలాగే కాకతీయ పవర్ ప్లాంట్ నుంచి తగినంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నందున ఆంధ్ర రాష్ట్రానికి సరిపడే విద్యుత్‌నిస్తూ, మిగులు విద్యుత్‌ను మాత్రమే తెలంగాణాకు అందించే విధంగా ఈ సమీక్షలో నిర్ణయం తీసుకోవాలన్నారు. 1992 సెక్షన్ ప్రకారం విద్యుత్ కేటాయింపుల్లో స్పష్టతను తెలియజేయాలన్నారు. దీనిపై గతంలో గవర్నర్, ముఖ్యమంత్రులకు వినతులు అందజేసామన్నారు. ఆంధ్రాకు విద్యుత్ పరంగా ఎటువంటి వివక్షతకు గురికాకుండా తగిన విధంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో పోరాటానికి దిగుతామన్నారు.
    రాజధాని రాకుంటే రైల్వే జోన్
    విశాఖపట్నం, జూలై 13: విశాఖకు రాజధాని రాకుంటే, రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందని ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వే జోన్‌పై నియమించిన కమిటీ రాష్ట్ర విభజన జరిగిన తేదీ నుంచి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉందని, బహుశా డిసెంబర్‌లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. విశాఖకే జోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వివిధ సంస్థలు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుతాయన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన పవర్ ప్రాజెక్ట్‌లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని, అవి నేటికీ ప్రారంభం కాకపోవడానికి కారణాలను ముఖ్యమంత్రి సమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎపి మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, దీనివలన కోస్తా తీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. విశాఖకు కనె్వన్షన్ సెంటర్, సైన్స్ మ్యూజియం వంటికి అనేక ప్రాజెక్ట్‌లు రానున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లను వెంటనే కేటాయించాలని, లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2/3 వంతు పూర్తయిందని హరిబాబు అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, బండారు రంగమోహన్, పివి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
    ఉద్యమం తీవ్రతరం
    విశాఖపట్నం, జూలై 13: కెజిహెచ్ ట్రామాకేర్ ఉద్యోగుల ఉద్యమం ఇక నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. నాలుగు రోజులుగా రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న ట్రామాకేర్ ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో చేసేదిలేక సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి న్యాయం కోరనున్నారు. తొమ్మిది మాసాలుగా కేంద్రం జీతాలు చెల్లించనందుకు నిరసనగా ఏపీ ట్రామాకేర్ కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ యూనియన్ (కెజిహెచ్) ఆధ్వర్యంలో కెజిహెచ్ మెయిన్‌గేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రెండుసార్లు ట్రామాకేర్ కో-ఆర్డినేటర్ వరప్రసాద్, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌లతో జరిగిన చర్చలు ఫలించలేదు. ఈ నెలాఖరికి బకాయిపడిన జీతాలు మంజూరవుతాయని నోటమాటగా ఇచ్చిన హామీ కాకుండా రాతపూర్వకంగా ఉండాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే దీనికి అంగీకరించకపోవడంతో సమ్మె కొనసాగించాలని వీరు నిర్ణయించారు. అవసరమైతే అనేక రూపాల్లో తీవ్రతరం చేయడం ద్వారా కేంద్రం స్పందించే విధంగా పోరాడతామని హెచ్చరించారు.
    ఎంపీ హరిబాబు హామీ
    విశాఖ నగర పార్లమెంటు సభ్యులు డాక్టర్ కంభంపాటి హరిబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఆదివారం కెజిహెచ్ వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ట్రామాకేర్ సిబ్బణది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గత తొమ్మిది మాసాలుగా జీతాలు అందకపోవడంపట్ల విచారం వ్యక్తంచేశారు. అక్కడికక్కడే ఆయన రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావుతో టెలిఫోన్లో మాట్లాడారు. బకాయి పడిన జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెజిహెచ్ ట్రామాకేర్ సిబ్బంది నుంచి ముగ్గురు ప్రతినిధులు హైదరాబాద్ వెల్ళి మంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయిన తరువాత నుంచి ప్రతినెల జీతం అందే ఏర్పాటు చేస్తామని, కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామని హరిబాబు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు బి.రంగమోహన్‌రావు, బిజెపి రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ ఆర్.రవికుమార్, ట్రామాకేర్ యూనియన్ నాయకులు వై.త్రినాధ్, నాగరాజు, సుధాకరరావు, లక్ష్మీకాంత్, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
    నిద్దరోతున్న నిఘా
    విశాఖపట్నం, జూలై 13: నగరంలో నిఘా వ్యవస్థ నిద్రలో ఉంది. ముంబైలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తీరప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్ఠపరిచేందుకు నిర్ణయించారు. తీరప్రాంతం ద్వారా ఉగ్రవాదులు దాడులకు దిగే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు అనువుగా నగరంలోని కీలక ప్రాంతాల్లో సిసి కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం నగర పోలీసులు కొన్ని ప్రణాళికలను రూపొందించారు. ఇందులో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోని కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం. దీనితో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కూడళ్లలోని సిగ్నల్ వ్యవస్థతో పాటు సిసి కెమెరాలు సమర్థవంతంగా పని చేసేందుకు అనువుగా సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి రూ. 7 కోట్లు వ్యయం అవుతుందని భావించి, బిఒటి (బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగర పోలీసు విభాగంతో పాటు జివిఎంసి సంయుక్తంగా దీన్ని నిర్వహించాల్సి ఉంది. నగరంలోని 94 ముఖ్య కూడళ్లలో సోలార్ సిగ్నల్ వ్యవస్థతో పాటు సిసి టివి కెమేరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన స్టాన్ పవర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా. బిఓటి కింద సిసి కెమేరాలను, సోలార్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఈ సంస్థ నగరంలోని 55 ప్రధాన కూడళ్లలో ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని తీసుకుంటుంది. ఒప్పందం కుదుర్చుకుని ఏడాది పూర్తయినా సిసి కెమేరాల ఊసులేదు, సిగ్నల్ వ్యవస్థ జాడలేదు. సిసి కెమేరాల నిఘాతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారిని సైతం గుర్తించి, వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసే అవకాశం ట్రాఫిక్ పోలీసులకు ఉంది. ఉగ్రదాడులు, ఇతర సంఘ వ్యతిరేకుల కదలికలను పసిగట్టే విధంగా రూపొందించిన ఈప్రణాళికపై పోలీసు యంత్రాంగంలో కదలిక లేదు.
    వ్యవసాయాన్ని వదిలేస్తున్న రైతులు
    విశాఖపట్నం, జూలై 13: దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకుంటున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం వ్యవసాయానికి దూరమవుతుందని ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ నళిని అభిప్రాయపడ్డారు. రచయిత ఎస్.ఎ.సాగర్ రచించిన ‘పల్లెను మింగిన పెట్టుబడి’ అనే పరిశోధనాత్మక గ్రంధంపై ఆదివారం నాడిక్కడ చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెల్లో భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, రైతు మాత్రం రైతు వలసపోయి రైతు కూలీగా మారుతున్నాడని అన్నారు. అక్కడ కూడా రైతుకూలీ తీవ్రమైన సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడని అన్నారు. వ్యవసాయం, ఉత్పత్తిరంగంలో వచ్చిన మార్పులపై ఈగ్రంధంలో సోదాహరంగా వివరించారని అన్నారు. దేశం మొత్తంగా చూస్తే నాలుగోవంతు రైతాంగం సాగును వదిలివేస్తున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. వారి కష్టాలు, బాధలు రచయిత వాస్తవితను చాటారని పేర్కొన్నారు. చిన్న,సన్నకారు రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల జీవితాలు పూర్తిగా అధ్యయనం చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ జీవనవిధానంలో మార్పులు, ప్రభుత్వాలు, పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, తద్వారా చోటుచేసుకుంటున్న పరిణామాలను వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. చర్చాకార్యక్రమంలో రచయిత రామ్మోహన్, విమర్శకులు, సామాజిక కార్యకర్త విమల, కథారచయిత కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు.

    వేంకటేశ్వర వైభవోత్సవాలకు ఉచిత కూపన్లు
    * 16 నుంచి పంపిణీ
    విశాఖపట్నం, జూలై 13: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి నిత్యం నిర్వహించే అన్ని రకాల సేవలను స్థానిక భక్తులు స్వయంగా వీక్షించే సదవకాశాన్ని తితిదే దేవస్థానం కల్పిస్తోంది. స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి 29 వరకూ శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల పేరిట ఈకార్యక్రమాన్ని తితిదే తలపెట్టింది. వారం రోజుల పాటు జరిగే వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 వరకూ అర్చన, 8.15 నుంచి 8.30 వరకూ నివేదన, శాత్తుమొర ఉంటాయి. అలాగే ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకూ ప్రత్యేక సేవ, 10 నుంచి 10.30 వరకూ రెండవ నివేదన చేపడతారు. అనంతరం భక్తులకు స్వామి వారి సర్వదర్వన భాగ్యం కల్పిస్తారు. సాయంత్రం సమయంలో 5.30 నుంచి 6.30 వరకూ సహస్ర దీపాలంకరణ, 6.30 నుంచి 7.30 వరకూ వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 వరకూ కైంకర్యాలు, 8.30 నుంచి 9 వరకూ ఏకాంతసేవ నిర్వహిస్తారు. వీటితో పాటు ఈనెల 23న సహస్రకలశాభిషేకం, 24న తిరుప్పావడసేవ, 25న అభిషేకం, 26న పుష్పయాగం, 27న భక్తులచే సహస్రనామార్చన, సాయంత్రం కల్యాణోత్సవం, 28నన విశేషపూజ, 29 అష్టదశపాదపద్మార్చన ఉంటాయి. వైభవోత్సవంలో పాల్గొనే భక్తులకు ఈనెల 16 నుంచి ఉచిత కూపన్లు పంపిణీ చేయనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 21నుంచి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే నిత్యం ప్రవచన కార్యక్రమాన్ని తితిదే ఏర్పాటు చేసింది .

    పాఠశాల నిర్వహణపై ప్రత్యేక తనిఖీ బృందాలు
    * జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి. కృష్ణారెడ్డి
    విశాఖపట్నం (జగదాంబ), జూలై 13: జిల్లాలోని పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సమయపాలన, వౌలికవసతుల కల్పనపై ప్రత్యేక దృష్టితో పాటు వీటన్నింటిని పరిశీలించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలు నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఈ తనిఖీ బృందంలో ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి, సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఉంటారని అన్నారు. ఒక్కో బృందం వారంలోని ఒకరోజు మూడు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని అన్నారు. ఉపాధ్యాయుల సమయానికి విధులకు హాజరు కాకపోయినా, నిబంధనల ప్రకారం బోధన జరగకపోయినా కఠినచర్యలు తప్పవని అన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో వౌలికవసతుల తనిఖీకి మండలస్థాయి పర్యవేక్షక బృందాలను నియమించడం జరుగుతుందని అన్నారు. ఈ బృందాలలో ఎంపిడిఓ, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు, మండల ఇంజనీరింగ్ అధికారులు ఉంటారని అన్నారు. జిల్లాలోని 4126 పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని, వారానికి రెండుసార్లు గుడ్లు పెట్టాలని, పరిశుభ్రత వాతావరణం ఉండేలా చర్యలు ఉన్నాయా? లేవా? అనే విషయాలను పరిశీలిస్తారన్నారు. ఈ ఏడాది నుండి తొమ్మిది, పది తరగతులు కొత్త పాఠ్యాంశాలపై బోధన, గ్రేడింగ్ విధానం అమలు అవుతుందని, ఇప్పటికే ఉపాధ్యాయులకు అవసరమైన బోధన సామాఅగిని అందజేయడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని అన్నారు.

    ‘మద్దిగోపాలకృష్ణారెడ్డి సేవలు శ్లాఘనీయం’

    విశాఖపట్నం , జూలై 13: ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి విశిష్ఠ సేవలతో పాటు, ప్రగతికి మద్దిగోపాలకృష్ణారెడ్డి బాటలు వేశారని ఎయు ఉపకులపతి ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అన్నారు. ఆదివారం ఉదయం మద్ది వర్ధంతి సందర్భంగా ఎయు ఎకనామిక్స్ విభాగం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ 23 సంవత్సరాలు రిజిస్ట్రార్‌గా, ఆరున్నర సంవత్సరాలు ఉపకులపతిగా ఎయుకు ఆయన విశిష్ఠసేవలను అందించారన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడే అన్ని కార్యక్రమాలలో ప్రోత్సహించేవారని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఎయు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని అన్నారు. ఆయన వర్శిటీకి అందించిన సేవలు నిరుపమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహన్‌రావు, ప్రిన్సిపాల్స్ పి.ఎస్. అవధాని, ఆర్.సత్యరాజు, డీన్ టిఎన్‌ఎవి.ప్రసాద్‌రెడ్డి, దూరవిద్యా సంచాలకులు ఆచార్య ఎల్‌డి.సుధాకర్‌బాబు, బి.రత్నకుమారి, వై.సత్యనారాయణ, ఆచార్యులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

    ‘సినీహబ్‌గా విశాఖ ఎదుగుతుంది’
    విశాలాక్షినగర్, జూలై 13: విశాఖ మహానగరంలోని పరిసర ప్రాంతాలు సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉంటాయని సినీహీరో నారా రోహిత్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉషోదయ జంక్షన్‌లో అత్యాధునిక హంగులతో నెలకొల్పిన స్లిమ్ సిటీ క్లినిక్‌ను రోహిత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తన తొలి చిత్రం షూటింగ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగిందన్నారు. చిన్నతనం నుంచి విశాఖ నగరంలో బీచ్ అంటే తనకు ఇష్టమన్నారు. సినీ పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతాలకు విస్తరించడం సర్వసాధారణమని చెప్పారు. మొదట్లో సినీ పరిశ్రమ మద్రాస్‌లో ఉండేదని తర్వాత హైదరాబాద్‌కు తరలి వచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా విశాఖ సినీ పరిశ్రమ తరలి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. వౌలిక సదుపాయాలు సమకూరిస్తే విశాఖ సినీహబ్‌గా ఎదుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాణం చిత్రం ద్వారా చలన చిత్రరంగంలో అడుగుపెట్టి మంచి హీరోగా ప్రేక్షకుల ఆభిమానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు. కొత్తగా నాలుగు చిత్రాల్లో నటించటానికి అంగీకరించినట్లు తెలిపారు. రొటీన్ చిత్రాలు కాకుండా యువతను ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రాల్లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రోహిత్ తెలిపారు. బాణం, సోలో, ప్రతినిది చిత్రాలకు ప్రేక్షక ఆదరణ లభించినట్లు తెలిపారు. తనకు నచ్చిన పాత్ర దుర్యోధనుడు అని చెప్పారు. అవకాశం వస్తే నటించి మెప్పిస్తానని రోహిత్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయ సమస్య ఎక్కువ కావడంతో అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. చక్కటి వ్యాయామం, వాకింగ్ వంటి వాటితో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నారా రోహిత్ తెలిపారు.

    చేపలవేటకు వేటకు సవాలక్ష సమస్యలు

    విశాఖపట్నం, జూలై 13: చేపలవేటకు సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. ఎపుడూ ఒకటి, రెండు రకాలైన ఇబ్బందులు ఉండేవి. అదీ వేటకు సంబంధించి పెద్దగా సమస్యలుండేవి కావు. అటువంటిది మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది తొలిసారిగా చేపలవేటకు వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడంలేదు. సముద్రంలో వేడి వాతావరణం వలన సముద్ర గర్భంలో ఉండే పెద్ద చేపలు, రొయ్యలు పైకి రావడంలేదు. దీనివల్ల రోజుల తరబడి సముద్రంలోనే మత్స్యకారులు నిరీక్షించాల్సి వస్తోంది. జూన్ ఒకటవ తేదీ నుంచి వేట ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరోజూ పూర్తిగా చేపలవేట జరగలేదు. దీనివల్ల 20 శాతం మంది మత్స్యకారులు మాత్రమే సముద్రంలో ఉంటున్నారు. తప్పితే మిగిలిన దాదాపు 60 నుంచి 80 శాతం మంది నిరాశతో ఇళ్ళ ముఖం పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలో 650కి పైగా మరబోట్లు ఉండగా, ఇవి కాకుండా దాదాపు మరో 1500 ఫైబర్ బోట్లు, నాటు పడవలు ఉన్నాయి. ఈ విధంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగా 17వేల మందికి పైగా చేపలవేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరంతా విశాఖ సాగరతీరంతోపాటు కళింగపట్నం, పారాదీప్ వరకు వేటకు వెళ్తుంటారు.
    సమస్యగా మారిన జీవనం... తీవ్ర రుణభారం
    అయితే సముద్ర వాతావరణ వేడెక్కడం, దాదాపు 40 రోజులుగా చేపలవేట నిరాజనకంగా మారడంతో వందలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఫలితంగా రుణగ్రస్తులు అవుతున్నారు. లక్షన్నర నుంచి రెండున్న లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టుకుని దొరికన ప్రతిచోట నుంచి అప్పులు చేసి మరీ కొండంత ఆశతో వేటకు వెళ్ళిన మత్స్యకారులకు మిగిలింది ఆర్ధిక కష్టాలే. డీజిల్ కర్చులు, నిత్యావసర సరుకులు తీసుకువెళ్ళడం, చేపల రక్షణకు ఐస్ నిల్వలు, వేట పనిముట్లు, వలలు తదితర వాటి కోసం విపరీతంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వేట మాట ఎలా ఉన్నా ముందుగా పెడుతున్న పెట్టుబడులతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీ బకాయిలు మంజూరుకాక, అనేకసార్లు పెరిగిని డీజిల్ ధరలకనుగుణంగా దీనిని పెంచకపోవడం వీరి పాలిట శాపంగా పరిణమిస్తోంది. లీటర్ డీజిల్‌కు పది రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం తరపున సబ్సిడీగా వచ్చేది కేవలం రూ.6.3లు మాత్రమే. ఆయిల్ సబ్సిడీ పెరగకపోగా, పాత బకాయిలు మంజూరుకాకపోవడం వలన, చేపలవేటకు వెళ్ళని పరిస్థితులోనూ ప్రభుత్వ సహాయం అందక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఏపీ మరబోట్ల సంక్షేమ సంఘ ప్రతినిధి పిసి అప్పారావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి కుటుంబం కనీసం లక్ష వంతున అప్పుల పాలైందని, 40 రోజులుగా కేవలం 20 శాతం మంది మాత్రమే కొండంత ఆశతో ఇంకా సముద్రంలో వేట కోసం నిరీక్షిస్తున్నారన్నారు. మిగిలిన 70 శాతం మంది మత్స్యకారులు చేసేదిలేక తిరుగు ముఖం పట్టగా, ఇందులో మరికొంతమంది ఇప్పటికే ఇళ్ళకు చేరుకున్నారన్నారు. వీరంతా ప్రత్నామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల తలరాతలు మారడంలేదన్నారు.
    విదేశీ బోట్లు...మత్స్యకారుల పాట్లు
    భారత సముద్రతీరంలో ఇపుడు విదేశీ నౌకలు, బోట్లు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. ఇది ఎపుడూ ఉంది. అయితే ఇటీవలకాలంలో మరీ పెరిగింది. అత్యంత అధునాతన యంత్రాల సహాయంతో విలువైన పనిముట్లను ఉపయోగించి మరీ అక్రమ చేపలవేటకు పాల్పడుతున్నారు. దీనివల్ల సాంప్రదాయ మత్స్యకారులు తీరని అన్యాయానికి గురవుతున్నారు. తీర గస్తీ నిఘా ఉంటున్నా యదేచ్ఛగా సాగిస్తున్న అక్రమ చేపలవేట కార్యకలాపాలపట్ల దృష్టిసారించడంలేదు. దీంతో వీటికి అడ్డూ,అపూ లేకుండా పోతోంది. అసలే సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటున్న మత్స్యకారులకు ఈ ఏడాది సీజన్ నుంచి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.
    లేని సర్కార్ చేయూత...
    ఇన్ని రకాలైన నష్టాలను ఎదుర్కొంటున్న మత్స్యకారులను కనీసం ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంపట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, మత్స్యకారులను అన్నిరకాలుగా ఆదుకుంటామనే ఎన్నికల హామీలు ఇపుడు నీటి మూటలుగా మారుతున్నాయంటూ మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కనీసం ఆయిల్ సబ్సిడీని పెంచి కరవును ఎదుర్కొంటున్న వారందరికీ బియ్యం పంపిణీ చేస్తూ, రుణ సదుపాయాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

    ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో హైఅలర్ట్
    సీలేరు, జూలై 13 : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు వారోత్సవాలను పురస్కరించుకుని అమరవీరుల స్థూపాలను ఆవిష్కరించడానికి స న్నాహాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతమంతా పోలీసు బలగాలను ఇప్పటినుండే మోహరించి అప్రమత్తమయ్యారు. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ గిరిజన గ్రామాల్లో మావోయిస్టులకు ఎవరు సహకరించరాదని గిరిజనులను చైతన్యవంతులు చేస్తున్నారు. ఒకవేళ అలా చేసినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. అలాగే సీలేరులో ఆదివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా సిఆర్‌పిఎఫ్ పోలీసు బలగాలతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి ఎటువంటి ముప్పు కలుగకుండా అదనపు పో లీసు బలగాలను ఏర్పాటుచేసి పటిష్టపరిచారు. సీలేరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి అనుమానితులను ప్రశ్నించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల గుండా వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. దీంతో సీలేరులో పోలీసు లు మరింత అప్రమత్తమై స్టేషన్ భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నారు.

    నిండుకుండలా జలాశయాలు
    * ఖరీఫ్‌పై రైతుల్లో పెరిగిన ఆశలు
    నర్సీపట్నం, జూలై 13 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాంతంలోని ప్రధాన రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరడంతో ఖరీఫ్‌పై ఆయకట్టు రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంట చేతికి వస్తుందనే ఆశతో వీరంతా ఉన్నారు. తొలకరి వర్షాలు నెలరోజులకు పైగా ఆలస్యమైనప్పటికీ తాజాగా కురిసిన వర్షాలతో నర్సీపట్నం డివిజన్‌పరిధిలోని తాండవ, కళ్యాణపులోవ, రావణాపల్లి రిజర్వాయర్లలో నీటినిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ సాధారణ నీటిమట్టానికి చేరువలోనే నీటినిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 371అడుగుల మేర నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 373.8 అడుగుల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ ప్రారంభం నుండి ఎప్పుడులేని రీతిలో రిజర్వాయర్‌లో నీరు నిల్వ ఉండడం విశేషం. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు కుడి, ఎడమ కాలువల నుండి రోజుకు 600 క్యూబిక్ మీటర్ల నీరు విడుదల చేస్తే 70 రోజుల వరకు నీరు సరిపోతుందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ కోసం నీటిని విడుదల చేసేందుకు సాగునీటి సంఘాల అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈనెల 16వతేదీన సాగునీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ డైరెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా కళ్యాణపులోవ రిజర్వాయర్‌లో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు నీరు చేరింది. వేసవి ఎండలు మండిపోవడంతో రిజర్వాయర్‌లో ఉన్ననీరు ఆవిరైపోయింది. ఖరీఫ్ కష్టమేనని అనుకున్న రైతాంగానికి ప్రస్తుతం కురిసిన వర్షాలు ఆశలు కల్పించాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే రీతిన వర్షాలు కురిస్తే రిజర్వాయర్‌లో మరింత నీరు చేరుతుందని రైతులు భావిస్తున్నారు. రిజర్వాయర్ నీటిమట్టం 460 అడుగులు కాగా, ప్రస్తుతం 449 అడుగుల నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్ కింద సుమారు 5,200 ఎకరాల ఆయకట్టు భూములుఉన్నాయి. ఈ భూములకు నీరు విడుదల చేయాలంటే మరో రెండు, మూడు అడుగులు మేర నీరు చేరాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ కింద ఆయకట్టు రైతులు వరి నారుమడులు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే నర్సీపట్నం మండలం రావణాపల్లి రిజర్వాయర్‌లో నీటిమట్టం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఖరీఫ్‌తోపాటు రబీకి కూడా నీరందించే ఈ రిజర్వాయర్ కింద సుమారు 1800 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రబీ సాగు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపధ్యంలో ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో ఆయకట్టు భూములు సాగుచేసే అవకాశం ఏర్పడుతుందని రైతులు ఆశతో ఉన్నారు.

    విద్యుత్ పంపకాలపై ఢిల్లీలో సోమవారం కీలక
    english title: 
    v

    0 0

    ఎన్నికల కోసం రైతులు ఎదురుచూపులు
    రాజమండ్రి, జూలై 13: రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు జరిగిపోయినప్పటికీ ఇంకా నీటి సంఘాలు మాత్రం ఎన్నికలకు నోచుకోలేదు. సాగునీటి పారుదల రంగంలో అత్యంత కీలకంగా మారిన నీటి సంఘాల వ్యవస్థను 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రారంభించారు. అప్పటి నుండి మళ్లీ వెనుదిరిగి చూడకుండా నీటిసంఘాల వ్యవస్థ మంచి ఫలితాలను సాధిస్తూ కొనసాగుతూ వచ్చింది. మొదట్లో నీటిసంఘాల వ్యవస్థ పట్ల పెద్దగా అవగాహన లేని రైతులు, ప్రజాప్రతినిధులు నీటిసంఘాల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదు. తీరాచూస్తే నీటిసంఘాల వ్యవస్థకున్న ప్రాధాన్యత బాగా పెరిగింది. దాంతో నీటిసంఘాల ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తయారయ్యాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీటిసంఘాల ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. చివరకు ఎన్నికలు నిర్వహించకుండా, ఉన్న నీటిసంఘాల పదవీకాలానే్న పొడిగిస్తూ కాలక్షేపం చేసారు. ఎట్టకేలకు 2012 జనవరిలో రాష్ట్రప్రభుత్వం నీటిసంఘాల పాలకవర్గాలను రద్దుచేసింది. అంటే దాదాపు రెండున్నరేళ్లుగా నీటిసంఘాలకు పాలకవర్గాలు లేకుండా పోయాయన్న మాట. నీటిసంఘాలకు పాలకవర్గాలు లేకపోవటంతో సాగునీటిపారుదల రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇరిగేషన్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు, కాలువలకు మరమ్మతులు నోచుకోలేదు. అయినా గత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కమిటీలు 23, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు 60, నీటి వినియోగదారుల సంఘాలు సుమారు 10750, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు 323 ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని నీటిసంఘాలు ఉన్నాయో ఇంత వరకు స్పష్టంగా లెక్కలు తేల్చలేదు. రాష్ట్రంలో ఎన్ని నీటిసంఘాలు ఉన్నాయో లెక్క తేల్చి, నీటి సంఘాల వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించాలని రైతులు కోరుతున్నారు. గత నీటిసంఘాల చట్టంలో కొన్ని మార్పులు చేయాలని రైతులు సూచిస్తున్నారు. జిల్లాల వారీ వసూలవుతున్న నీటిపన్నును రాష్టస్థ్రాయిలోని కమిటీ ఆధీనంలోకి తీసుకెళ్లకుండా, జిల్లా కేంద్రాల్లోనే ఉంచి, వీటిపై అజమాయిషీని రైతులు, ఇరిగేషన్ అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడున్న విధానంలో అయితే ప్రతిపాదనలు రాష్ట్రప్రభుత్వానికి వెళ్లిన తరువాత 6నెలలకుగానీ మంజూరుకావటం లేదని రైతులు చెబుతున్నారు. నీటిసంఘాల వ్యవస్థను రూపొందించి, ప్రారంభించిన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటంతో, సాధ్యమైనంత త్వరలోనే నీటిసంఘాల వ్యవస్థను చక్కదిద్ది వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
    బాలయోగి స్ఫూర్తితో పనిచేస్తా
    జడ్పీ ఛైర్మన్ నామన
    మలికిపురం, జూలై 13: తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి బాలయోగి స్ఫూర్తితో పనిచేస్తానని జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తొలిసారి ఆదివారం ఆయన రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్కవరం ముదునూరి చినబాబు ఇంటివద్ద తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో త్రాగునీటికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆసమస్యను పరిష్కరిస్తానన్నారు. అన్ని జిల్లా పరిషత్ స్కూళ్లలో వౌళిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తానన్నారు. గత సంవత్సర కాలంగా ఇసుక సీనరేజి లేకపోవటంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటమే కాకుండా ప్రభుత్వాధాయానికి గండి పడిందని, 10రోజుల్లో ఈవిషయంలో స్పష్టత లభిస్తుందని రాంబాబు అన్నారు. రాంబాబుకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే ఎవి సూర్యనారాయణరాజు, రుద్రరాజు వెంకటరామరాజు, మలికిపురం జడ్పీటిసి మంగిన భూదేవి, మండలాధ్యక్షురాలు జి గంగాభవానీ, ముదునూరి చినబాబు, అడబాల సాయిబాబు మరియు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
    గ్యాస్ కలెక్టింగ్ సెంటర్‌ను
    తొలగించాలని గ్రామస్థుల ధర్నా
    మలికిపురం, జూలై 13: దిండి గ్రామంలో జనవాసాల మద్యనున్న గెయిల్ గ్యాస్ కలెక్టింగ్ సెంటర్‌ను చించినాడ వంతెనపై ఉన్న గ్యాస్ పైపులైన్‌ను వేరే ప్రదేశానికి తరలించాలంటూ అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో దిండి చెక్‌పోస్టు వద్ద ఆదివారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాజోలు కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, గ్రామ సర్పంచ్ బందెల పద్మ, దేవ దయానంద్, ముదునూరి శ్రీనివాసరాజు, పాడి మన్మోహన్, దేవ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

    రాష్ట్ర విభజనతో ఆంధ్రాకు అన్యాయం
    ఎక్సైజ్, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
    మామిడికుదురు, జూలై 13: రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించటం వల్ల ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో కొత్త రాజధాని నిర్మాణానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి అనువైన తీరప్రాంతమున్న ఈ రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామన్నారు. 1100 కిలోమీటర్ల తీరమున్న ఆంధ్ర రాష్ట్రాన్ని వివిధ పోర్టుల అనుసంధానం ద్వారా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసేందుకు కార్యక్రమం సిద్ధమవుతోందన్నారు. అంతర్వేదితో సహా 16పోర్టులను ఏర్పాటుచేసి రైల్వే లైన్లు ద్వారా వీటిని అనుసంధానం చేసేందుకు మాస్టర్ ప్లాను రూపొందించామని, వీటి ద్వారా బందరు, నర్సాపురం, రేపల్లె పోర్టులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రాదాయాన్ని పెంచేందుకు అందరూ సహకరించాలని ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. విజన్ 2029 లక్ష్యంతో రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నారన్నారు. చేనేత సొసైటీలను పటిష్టపర్చేందుకు బృహత్తర ప్రణాళికను అమలుచేస్తున్నామని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న 31 చేనేత క్లస్టర్లకు యాభై శాతం నిధులు విడుదల చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. సుమారు వంద కోట్ల రూపాయలలోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేసేందుకు పథకం తయారైందన్నారు. 90కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో ఉన్న రెండు మెగా చేనేత క్లస్టర్లను అభివృద్ధి పరుస్తామన్నారు. సొసైటీల్లో పేరుకుపోయిన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు 30కోట్ల రూపాయలు కేటాయించామని, దీనిలో 10కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేశామన్నారు. బిసి హాస్టళ్లల్లో వౌలిక సదుపాయల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. బెల్టుషాపుల నిర్వహణపై కఠినచర్యలు తీసుకుంటామని, గ్రామ, జిల్లా కమీటీలను ఏర్పాటుచేయడం ద్వారా పర్యవేక్షణను వేగిరపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంతు సూర్యభాస్కరరావు, ఉప సర్పంచ్ కంకిపాటి నర్సింహారావు, బిసి సంఘాల నాయకులు కొండా జగదీశ్వరరావు, మల్లాడి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

    ఏలేశ్వరం ఎంపిపి వైసిపికే
    టిడిపికి వైస్ ఎంపిపి
    ఏలేశ్వరం, జూలై 13: ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎట్టకేలకు వైసిపికి దక్కింది. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధించి పెద్దాపురం డిఎస్పీ అరవింద్‌బాబు పర్యవేక్షణలో 130మంది పోలీసులు నిఘా మధ్య అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మండలంలో 13 ఎంపిటిసి స్థానాలకు గాను ఏడింటిని టిడిపి, ఆరు స్థానాలను వైసిపి కైవసం చేసుకున్నాయి. అయితే ఎంపిపిగా ఏలేశ్వరానికి ఎస్టీ మహిళకు రిజర్వు అయిన సంగతి విధితమే. టిడిపి తరపున ఎన్నికైన ఏడుగురిలో ఎస్టీ మహిళలెవరూ లేకపోవడంతో ఆ పార్టీ ఎంపిపి స్థానానికి దూరమైంది. వైసిపి నుండి గెలుపొందినవారిలో తూర్పులక్ష్మీపురం, కొండ తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఎంపిటిసి సభ్యులిద్దరూ ఎస్టీ మహిళలే కావడంతో వారిలో నుండి ఒకర్ని తమవైపునకు తిప్పుకునేందుకు టిడిపి యత్నించి విఫలమైంది. దీంతో టిడిపికి వైస్ ఎంపిపి పదవి మాత్రమే దక్కింది. ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా వైసిపికి చెందిన కొండ తిమ్మాపురం ఎంపిటిసి అయిలు సత్యవతి పేరును పెద్దనాపల్లి ఎంపిటిసి బీశెట్టి వెంకటరమణ ప్రతిపాదించగా, లింగంపర్తి ఎంపిటిసి గురువెళ్ల రామరాజు బలపర్చారు. దీంతో ఈ ఎన్నికకు తూర్పు లక్ష్మీపురం ఎంపిటిసి (ఎస్టీ మహిళ) మనే్నపల్లి రాఘవ హాజరుకాలేదు. సదరు ఎంపిటిసి కూడా ఎన్నికలకు హాజరుకావాలని టిడిపి ఎంపిటిసి సభ్యులు ఎన్నికల అధికారులను పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంత మంది ఎంపిటిసి సభ్యులు హాజరైనా, కోరం లేకపోయినా వచ్చిన ఎంపిటిసి సభ్యులతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు ఎన్నికల అధికారి, ఎడిఎ ఎడివి ప్రసాద్ వారికి నచ్చచెప్పడానికి యత్నించారు. అయితే తామీ ఎన్నికలను బహిష్కరిస్తామని టిడిపి ఎంపిటిసి సభ్యులు బిగ్గరగా నినదించడంతో వారికి ఎన్నికల అధికారి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరూ కూడా ఎన్నికల సమావేశం నుండి బయటకు వెళ్లరాదని, ఎటువంటి నినాదాలు చేయకూడదని అధికారులు తెలపడంతో వారు మిన్నకున్నారు. అనంతరం అధ్యక్షురాలిగా వైసిపి బలపర్చిన సత్యవతి పేరును అధికారికంగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఉపాధ్యక్ష పదవికి టిడిపికి చెందిన భద్రవరం ఎంపిటిసి కొప్పుల బాబ్జీ పేరును యర్రవరం ఎంపిటిసి మైలా కనకారావు ప్రతిపాదించగా, తిరుమాలి ఎంపిటిసి వరపాటి మణికుమార్ బలపర్చారు. ఈయనకు మద్దతుగా టిడిపికి చెందిన ఏడుగురు చేతులెత్తారు. దీంతో కొప్పుల బాబ్జీ వైస్ ఎంపిపిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రసాద్ ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియకు హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండలాలు ఏర్పడిన నాటినుండి ఇప్పటి వరకూ ఏలేశ్వరం ఎంపిపి స్థానాన్ని తన వర్గానికే దక్కిందన్నారు. ఏలేశ్వరం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. మండల పరిధిలోని కొండ తిమ్మాపురంలో కేవలం 46 గడపల గల ఈ గిరిజన తండా నుండి ఎస్టీ గిరిజన మహిళను ఎంపిపి పదవికి ఎంపిక చేయడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వరుపుల తన అభిమానులతో మండల పరిషత్ కార్యాలయం నుండి భారీ బాణాసంచా మధ్య ఊరేగింపుగా స్థానిక బాలాజీ చౌక్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మిఠాయిలు పంచి విజయోత్సవ వేడుక జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఏలేశ్వరం జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, ముదునూరి కృష్ణంరాజు, గొల్లపల్లి బుజ్జి, జువ్విన వీర్రాజు, తొండారపు రాంబాబు, చిడగం వెంకటేశ్వరరావు తదితర్లు పాల్గొన్నారు. అదే విధంగా టిడిపి నాయకులు వైస్ ఎంపిపిగా ఎన్నికైన కొప్పుల బాబ్జీని కూడా పూలమాలలతో ముంచెత్తి విజయోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక మాలకొండయ్య ఆసుపత్రి వద్దగల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలువేసి, ఘన నివాళులర్పించారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సూతి బూరయ్య, చందువోలు నాగరాజు, పసా ప్రసాద్, మైలా సుభాష్‌చంద్రబోసు, కోట్ల కృష్ణ తదితర్లు పాల్గొన్నారు.

    100రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు
    కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ గోవిందస్వామి
    కాకినాడ, జూలై 13: కాకినాడ నగర పాలక సంస్థలో నెలకొన్న వివిధ దీర్ఘకాలికసమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఇటీవల సిద్ధం చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకున్నట్టు నగర పాలక సంస్థ కమీషనర్ శృంగవరపు గోవిందస్వామి తెలియజేశారు. రానున్న 3 నెలల్లో నగర పాలక సంస్థలో పలు దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుతం శీఘ్రగతిన పనులు చేపడుతున్నట్టు చెప్పారు. కాకినాడ నగర పాలక సంస్థలోని తన ఛాంబర్‌లో గోపాలస్వామి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఇటీవల నగరాభివృద్ధికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఆ ప్రణాళికలో పొందుపరిచిన ప్రతి ఒక్క కార్యక్రమం నిర్దేశించిన గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
    వౌళిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నగర పాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి ఆక్రమణలదారుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దీని కోసం లక్ష చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. లక్ష చెట్లను అటవీ శాఖ, నర్సరీల ద్వారా సేకరిస్తున్నామన్నారు. నగర పాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల చుట్టూ చెట్లు నాటి పెంచడం ద్వారా ఒక ప్రక్క ఆస్తుల పరిరక్షణ, రెండో ప్రక్క వాతావరణ సమతుల్యాన్ని సాధించడం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.
    నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. నగరంలో 62 కిలోమీటర్ల మేర డ్రెయిన్లలో పూడిక తీయడం, 3వేల వీధి లైట్లకు మరమ్మత్తులు, 1000 మీటర్ల మేర 3 ఫేజ్ లైన్ల అభివృద్ధి, 100 కొత్త కరెంట్ ఫోల్స్ ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. 20 లక్షలతో 2 కిలోమీటర్ల మేర రహదారుల ప్యాచ్ వర్క్స్, కోటి రూపాయల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారుల నిర్మాణం, 10 కిలోమీటర్ల మేర డివైడర్ల సుందరీకరణ, 20 లక్షలతో 4 కిలోమీటర్ల మేర డ్రెయిన్ల ఆధునీకరణ, 1 కోటి 25 లక్షలతో 5 కిలోమీటర్ల మేర డ్రైన్లు నిర్మించనున్నట్టు తెలిపారు. 20 లక్షలతో 2 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం, కాకినాడ నగరంలో 3 చోట్ల స్మశాన వాటికల అభివృద్ధి, 15 లక్షలతో 3 పార్క్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. నగరంలో 5 లక్షలతో 50 భారీ ఇంకుడు గుంతలను తవ్వి వర్షపు నీటిని మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించామన్నారు. కాకినాడ నగరంలో 175కు పైగా కార్పొరేషన్ స్థలాలున్నాయని, వీటిలో 60 నుండి 70 స్థలాలకు రక్షణ ఉందని, మిగిలిన స్థలాలకు ట్రీప్లాంటేషన్ ద్వారా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఇటీవల కాకినాడ సిటీ శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నగరాభివృద్ధికి తయారుచేసిన ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఆయా ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఆయా కార్యక్రమాల అమలులో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారని, జవాబుదారీతనంతో, పారదర్శకమైన పాలనను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని కమీషనర్ గోవిందస్వామి తెలియజేశారు.

    రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తలు మృతి
    కాకినాడ , జూలై 13: కాకినాడ రూరల్ మండలం పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువ జామున మృతి చెందారు. ఈ ప్రమాదంపై తిమ్మాపురం ఎస్సై బి వినయ్ ప్రతాప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామానికి చెందిన కొండవిల్లి ప్రసాద్(37) అనే వ్యక్తి తన భార్య ప్రసాంతి(35)ని తీసుకుని శనివారం రాత్రి 7గంటల సమయంలో కాకినాడ బీచ్ నుండి సూర్యారావుపేట గ్రామం మీదుగా ఎడిబి రోడ్డు వెంట అచ్చంపేట గ్రామం వైపు తమ గ్రామానికి వెళ్ళేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారికి ఎదురుగా వేగంగా వచ్చిన వేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానిక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేసి హుటాహుటీన వారిద్దనీ కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందూ ముందుగా భర్త ప్రసాద్ ఆదివారం వేకువ జామున మృతి చెందాడు. అనంతరం మృతుని భార్య ప్రసాంతి సైతం మృతి చెందింది. ఈ సంఘటనపై తిమ్మాపురం ఎస్సై బి వినయ్ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు మృతి కారకుడైన వేన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
    అభివృద్ధికి ‘స్వచ్ఛంద’ంగా సహకరించాలి : ఎమ్మెల్యే గొల్లపల్లి
    మలికిపురం, జూలై 13: గ్రామాభివృద్ధికి ప్రభుత్వ నిధులే కాకుండా స్వచ్ఛంద సంస్ధలు మరియు ప్రజలు తమవంతు సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన గుడిమెల్లంక గ్రామస్తులు, సొంత గ్రామంపై అభిమానంతో మంచినీటి సరఫరాకై రెండు లక్షలతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంటుకు ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల ఔధార్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎవి సూర్యనారాయణరాజు, బత్తుల రాము, జడ్పీటిసి మంగిన భూదేవి, ఎంపిపి జి భవానీ, సర్పంచ్ చెల్లింగి సీతమహాలక్ష్మి, ఎంపిటిసి ముత్యాల దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.

    విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
    అమలాపురం, జూలై 13: బివిసి ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న బిటెక్ విద్యార్థి నవ్య క్రాంతికుమార్ తల్లిదండ్రులు, కళాశాల విద్యార్థులు ఆదివారం అమలాపురం ఏరియా ఆసుపత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. తమ కుమారుడు మృతికి కారణమైన కళాశాల ప్రిన్సిపాల్ బివిఎస్ ప్రసాద్‌ను, లెక్చరర్ స్వామిని వెంటనే అరెస్టు చేయాలని వారు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సంఘటనా స్థలానికి అమలాపురం రూరల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపి మృతుని కుంటుంబ సభ్యుల నుండి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై సిఐ మాట్లాడుతూ క్రాంతికుమార్ మృతిపై విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. మృతుని తండ్రి రంగ సత్యనారాయణ నుండి సిఐ వాంగ్మూలం తీసుకొనగా మృతుని తల్లి మోహిని నుండి అయినవిల్లి ఎస్‌ఐ నాగార్జునరాజు వాంగ్మూలం తీసుకున్నారు. నవ్య క్రాంతికుమార్ తల్లిదండ్రులు తన కుమారుడు మరణానికి కళాశాల యాజమాన్యం, సిబ్బందే కారణమని, తమ కుమారుని వారు హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇదే కళాశాలలో గతంలో కూడా విద్యార్థులు వేధింపులకు గురై మరణించారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు కళాశాల యాజమాన్యానికి కూడా శిక్షపడేలా చూడాలని వారు పోలీసులను కోరారు.

    అడవి పంది దాడి: ఉపాధి కూలీకి గాయాలు
    వై రామవరం, జూలై 13: వై రామవరం మండలం మడుగుకోట గ్రామానికి చెందిన కడబాల నాగేశ్వరరావు అనే గిరిజనుడిపై ఆదివారం అడవి పంది దాడిచేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఉపాధి పనులలో భాగంగా జీడిమామిడి తోటలో పనికి వెళ్లగా అడవిపంది హఠాత్తుగా వెనుకనుండి వచ్చి గాయపర్చిందని కడబాల నాగేశ్వరరావు తెలిపాడు. అడవిపంది దాడిచేస్తుండగా పెద్దగా కేకలు వేశానని, దీంతో కూలీలంతా పరుగెత్తుకు రావడంతో అడవిపంది అడవిలోకి పారిపోయిందని చెప్పాడు. రక్తపుమడుగులో ఉన్న అతనిని కూలీలు 108లో వై రామవరం ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు.
    రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
    రావులపాలెం, జూలై 13: మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కొత్తపేట మండలం పలివెల శివారు పూజారిపాలెంకు చెందిన పొనుగుపాటి సూరిబాబు (28) వ్యవసాయ కూలి ఆదివారం రాత్రి పని పూర్తి చేసుకుని సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈతకోట వద్ద జాతీయ రహదారి నుండి గంటి రోడ్డులో వెళ్తుండగా స్థానిక ఎరువుల ఫ్యాక్టరీ ఎదురుగా వచ్చేసరికి వెనుక నుండి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాలు సూరిబాబు తలపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని సంఘటనా స్థలంలోనే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతునికి ఏడాది క్రితమే వివాహమైంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బిఎస్ అప్పారావు తెలిపారు.

    పాళ్లమ్మను దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్
    మామిడికుదురు, జూలై 13: జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు ఆదివారం ఈదరాడ గ్రామంలోని శ్రీపాళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శివాలయంలో కూడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాశర్లపూడి లంకలో పర్యటించి కార్యకర్తలను కలుసుకున్నారు. డ్వాక్రా మహిళలు నామనను అభినందించారు. ఈదరాడ గ్రామంలో పార్టీకి అహర్నిశలు పాటుపడిన స్వర్గీయ చిక్కం పిచ్చియ్య చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి విత్తనాల మాణిక్యాలరావు, టిడిపి నాయకులు ఉండ్రు రామారావు, కొమ్ముల నాగబాబు, మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, కొండా జగదీశ్వరరావు, పొలమూరి వెంకటలక్ష్మి, ఎరుబండి లక్ష్మయ్య, చిక్కం రాంబాబు, ఎరుబండి గోవిందరాజస్వామి, సాదనాల సుబ్బారావు, ఎరుబండి మాచరయ్య, కన్నబాబు, ఎ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    ఎన్నికల కోసం రైతులు ఎదురుచూపులు
    english title: 
    water societies

    0 0

    విజయనగరం, జూలై 13: త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారనే ప్రచారం జరగడంతో జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఆ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు తమకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజును, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్టు సమాచారం. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆరు చోట్ల టిడిపి గెల్చుకోగా, మూడు చోట్ల వైకాపా నేతలు విజయం సాధించారు. దీంతో ఆశించిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలను గెల్చుకోవడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.జగదీష్‌తోపాటు టిడిపి ఆరోగ్య విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు పోటీపడుతున్నారు. ఇందులో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్ సతీమణి శ్రీదేవికి పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ ఆ డివిజన్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక విద్యావేత్త, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం కలిగిన డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఈయనకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. దాంతోపాటు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు వద్ద గుర్తింపు పొంది ఉన్నారు. ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు కూడా పార్టీని క్రమశిక్షణలో నడపడం, పార్టీలో ఏ కార్యక్రమం చేపట్టిన ఆయన ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం జరగదంటే ఆశ్చర్యపోనక్కర లేదు. ఇక చీపురుపల్లికి చెందిన కె.త్రిమూర్తుల రాజుకు కూడా పార్టీలో మంచి గుర్తింపునిస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. దీంతో ఎవరికి వారు తమకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ విధంగా జిల్లాలో టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎవరిని వరించనున్నదీ తేటతెల్లం కాగలదు.
    భయపెడుతున్న ఉల్లి ధర
    గజపతినగరం, జూలై 13: ఉల్లిపాయలు ధరలు రోజురోజుకి పెరగడంతో సామాన్యప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నటివరకూ కిలో ఉల్లిపాయలు 15 నుండి 20 రూపాయలు ఉండగా ప్రస్తుతం 20నుండి 30 రూపాయలకు చేరి నిలకడలేకుండా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహారాష్ట్రం నుండి కొంత మంది వ్యాపారులు నేరుగా లారీల్లో ఉల్లిపాయలు తీసుకువచ్చి విక్రయించడంతో అక్కడ ఉల్లిపాయలను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. వ్యాపారులు 50 కిలోలల బస్తాను 800 నుండి 900 రూపాయలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు, లారీల్లో తీసుకువచ్చి విక్రయిస్తున్న ధరలో 10 రూపాయలు వ్యత్యాసం ఉండడంతో కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు.
    ఉపాధ్యాయుడి అరెస్టు
    పాచిపెంట, జూలై 13: మండలంలో పెదకంచూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అరెస్టు చేసి ఆదివారం కోర్టుకు తరలించామని స్థానిక ఎస్‌ఐ పి రవికుమార్ తెలిపారు. ఆయన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ టీచర్ పాఠశాల అదనపు భవనాల నిధులతో పాటు పిల్లల ఏకలవ్య దుస్తులకు సంబంధించి 1,65,200 రూపాయలు తన సొంత ఖర్చులకు వినియోగించడంపై అందిన ఫిర్యాదు మేరకు ఇటీవల కేసును నమోదు చేశామన్నారు. పార్వతీపురం ఐటిడిఎ పిఒ రజిత్‌కుమార్‌శైని ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడును అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు.
    ట్రాఫిక్ స్టేషన్‌లో డిఎస్పీ తనిఖీ
    ఆంధ్రభూమి బ్యూరో
    విజయనగరం, జూలై 13: పట్టణంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను డిఎస్పీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఆదివారం ఉదయం ట్రాఫిక్ స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రవికుమార్, ఎస్సైలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

    అందరి మన్ననలు చూరగొన్న కాంతిలాల్
    విజయనగరం, జూలై 13: జిల్లాలో మంచి పరిపాలనాదక్షునిగా పేరు సంపాదించుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇటీవల గుంటూరు జిల్లాకు బదిలీ అయిన విషయం విధితమే. ఈయన పనిచేసిన ఏడాది కాలంలోనే తనదైన శైలిలో వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చూపడంతోపాటు ప్రజల్లో గ్రీవెన్స్ విభాగం పట్ల విశ్వాసం పెంచారు. ఏ ఒక్కపార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా అందరిని కలుపుకొని మంచి పేరు ఆపాదించుకున్నారు. ప్రతి శుక్రవారం గ్రామ సందర్శన పేరిట గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ఆకస్మిక తనిఖీలు జరుపుతూ అధికారులను అప్రమత్తం చేయడం, లోపాలను సరిదిద్దడం చేశారు. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరిచారు. ముఖ్యంగా విద్య, వైద్యం రంగాలపై ఎక్కువ దృష్టిసారించారు. పంచాయతీ, స్థానిక, సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. చెన్నై దుర్ఘటన సమయంలో జిల్లా నుంచి ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, బాధితులకు అవసరమైన సాయం అందించడంలో కలెక్టర్ మంచి గుర్తింపు పొందారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న దండుమారమ్మ కాలనీతోపాటు ఐదు కాలనీలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయంలో కలెక్టర్ ప్రజల పక్షాన నిలబడి రోడ్డు నిర్మాణానికి సహకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షలు జరుపుతు అధికారులకు సూచనలు చేస్తూ పథకాల అమలులో లోపాలను సరిదిద్దారు. అంతేగాకుండా అధికారులను చైతన్యవంతులను చేసి పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా చూడటంలో సఫలమయ్యారు. జిల్లాలో ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయగలిగారు. అన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించారు. కూలీలకు చెల్లింపులు జరపడంలో జాప్యాన్ని నివారించగలిగారు. అయినప్పటికీ కొన్ని చోట్ల టెక్నికల్ అసిస్టెంట్లు మార్క్ చేయడంలో జాప్యం వల్ల కూలీలకు చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయి. పట్టణంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పెద్దఎత్తున నిర్వహించి ఎక్కువ మంది అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంఘటనలో అపశ్రుతులు చోటుచేసుకున్నప్పటికీ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం వలన ఎక్కువ మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అంతేగాకుండా ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో ఎంపిక కావడం గమనార్హం.
    ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పట్టణంలో కర్ఫ్యూ విధించినపుడు ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. కర్ఫ్యూ ఎత్తివేయడంలో జాప్యం జరిగినపుడు కలెక్టర్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. పోలీసులు కర్ఫ్యూ కొనసాగించాలని, కలెక్టర్ కర్ఫ్యూ ఎత్తివేయాలని డిమాండ్ చేసినప్పటికీ పోలీసులు తమదే పైచేయి అన్పించుకున్నారు. ఈ విధంగా ఏడాది కాలంపాటు ఆయన జిల్లాకు అందించిన సేవలు ఎక్కువ మందికి సంతృప్తిని కలిగించాయనడంలో ఎటువంటి సందేహం

    పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రశ్నార్థకం..!
    బొబ్బిలి, జూలై 13: పట్టణంలో రోడ్లు విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ మేరకు బొబ్బిలి-బలిజిపేట రోడ్లు విస్తరణ పనులకు 10 కోట్లు రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు సంబందించిన టెండర్లు కూడా పూర్తిచేశారు. అయినప్పటికి పనులు ప్రారంభం కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విస్తరణ విషయంలో ఆర్‌అండ్‌బి అధికారులకు, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం కుదరడం లేదని తెలుస్తోంది. 60 అడుగుల రోడ్డును విస్తరించేందుకు తీర్మానించారు. రోడ్డును మున్సిపల్ అధికారులు ఆర్‌అండ్‌బి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని భీష్మించారు. రోడ్డు విస్తరణ కార్యక్రమానికి కొంతమంది బాధితులు అడ్డంగా మారారు. ఇందులో 16 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా దర్శనమిస్తున్నాయి. మొదట మార్కెట్ రోడ్డును విస్తరణ చేసిన అనంతరం బలిజిపేట రోడ్డును విస్తరించాలని కోరుతూ ఆ వీధి వాసులు, ప్రముఖులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా ఉన్న రోడ్డు మార్కెట్ అని ఈ రోడ్డు ద్వారా వాహన చోదకులు, ప్రజలు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇదే రోడ్డును విస్తరణ చేయాలని అధికారులకు సూచించినట్లు వారు చెపుతున్నారు. ఆర్‌అండ్‌బి, మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులకు తలొగ్గి బలిజిపేట రోడ్డుకు ఆ నిధులను మళ్ళించి
    విస్తరణ పనులు చేపట్టడంతో ఈ రోడ్డు వాసులు అంగీకరించడం లేదు. రెండు రోడ్లు ఒకే సారి చేస్తేనే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు. అంతవరకు ఈ రోడ్డు విస్తరణ ప్రక్రియకు స్వస్తి చెప్పాలని వారు చెప్పారు. దీంతో ఈ విషయంపై అటు ఆర్‌అండ్‌బి, మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బలిజిపేట రోడ్డు విస్తరణ పనులు చేయాల్సిన అవసరం ఉందని మరికొంతమంది వాదన. బైపాస్ రోడ్డు కావడం వలన బలిజిపేట, చిలకలపల్లి, తెర్లాం, శ్రీకాకుళం, తదితర ప్రాంతాలకు ఈ రోడ్డుపై నుండి బస్సులు వెళుతున్న ప్రమాదంలో తరుచుగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఇదే రోడ్డులో వివిధ పాఠశాలలు, విద్యా సంస్థలు ఉండడంతో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జనసంచార నడుమ వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గతంలో ఈ రోడ్డులో రెండు ప్రమాదాలు జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్ల విస్తరణలో ఉన్న సమస్యలను పరిష్కరించి పనులను త్వరితగతిన చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.

    ప్రశాంతంగా ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక
    మెంటాడ, జూలై 13: ఆదివారం జరిగిన ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. కోరంలేక రెండు పర్యాయాలు ఎన్నిక వాయిదా పడిన విషయము విదితమే. ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఆదివారం ప్రక్రియ జరిగింది. ఎంపిపి అభ్యర్ధిగా శోంఠ్యాన సింహాచలం (వైసిపి)ను పోరాం ఇద్దనవలస ఎంపిటీసిలు చెల్లూరు లక్ష్మణరావు, పూడి రామకృష్ణలు ప్రతిపాదించారు. అలాగే వైస్ ఎంపిపి అభ్యర్ధిగా చలుమూరి వెంకటరావు (టిడిపి)ను పిట్టాడ, కుంటినవలస ఎంపిటిసిలు రెడ్డి పార్వతి, సూరెడ్డి పార్వతి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను ఆమోదం అనంతరం ఎన్నికల అధికారి టి.శ్రీనివాసరావు ఏకగ్రీవ తీర్మాణంతో ఇరువురుతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బొబ్బిలి డిఎస్సీపి ఇసాక్ అహమ్మద్ పర్యావేక్షణలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మండల కాంప్లెక్స్ ఆవరణంలోకి ఇతరులను లోనికి రాకుండా పోలీస్ బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేశారు. ఎంపిపి, వైస్ ఎంపిపిలను అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌర సభ్యులుగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ఎంపిడిఓ గంటా వెంకటరావు, మండల ప్రాదేశిక సభ్యులు పాల్గొన్నారు.

    ‘నైతికంగా గెలుపు మాదే’
    మెంటాడ, జూలై 13: మండలంలో నైతికంగా గెలుపు మాదేనని సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడు ఎంపిటిసి స్థానాలు గెలుచుకున్నప్పుటకీ ఎంపిపి పదవికి రిజర్వుకాబడిన అభ్యర్ధి లేనందున ఎంపిపి పదవి వైసిపికి ఇవ్వడం జరిగిందని ఆమె పోర్కొన్నారు. అయినా ఎవరూ అదైర్య పడవలసిన పనిలేదని వైస్ ఎంపిపి పదవి మనకు దక్కిందని ఆమె పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్ మాట్లాడుతూ సాలూరులోని నిరక్షరాస్యులయిన వారిని ఎంపిపి పదవిని కట్టబెట్టామని టిడిపి నాయకులపై ఆరోపణ చేసిన స్దానిక ఎమ్మెల్యే రాజన్నదొర ఆదివారం మెంటాడలో నిరక్షరాస్యులైన శోంఠ్యాన సింహాచలంను ఎంపిపిగా చేసారని, నిన్నటి వాఖ్యలు ఇప్పడం ఈయనకు వర్తించవని ఆయన దుయ్యిబట్టారు. అక్కడున్న రాజకీయ పరిస్ధితులను బట్టి రాజకీయ పదవులు వర్తిస్తాయని ఈవిషయం స్ధానిక ఎమ్మెల్యే రాజన్నదొర గ్రహించాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపిపి చలుమూరి వెంకటరావు, గెద్ద అన్నవరం, మాజీ మండల అధ్యక్షుడు చలుమూరి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

    పార్వతీపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా జయప్రకాష్
    పార్వతీపురం, జూలై 13: పార్వతీపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కిరీటాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ బెలగాం జయప్రకాష్ నారాయణ దక్కించుకున్నారు. ఎన్నికల నిర్వహణాధికారి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రజత్‌కుమార్ సైనీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 27వ వార్డు కౌన్సిలర్ కందుకూరి వాసుదేవరావు విసిగా జయప్రకాష్ నారాయణ పేరును ప్రతిపాదించగా 5వ వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావుబలపరిచారు. అయితే దేశం కౌన్సిలర్లంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తెదేపా తరుపున ఒకే ఒక్కరు ఈపదవికి నామినేషన్ వేయగా జయప్రకాష్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ఎన్నికల నిర్వహణాధికారి రజత్‌కుమార్ సైనీ ప్రకటించారు. ఈ సందర్భంగా సైనీని అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ వి సిహెచ్ అప్పలనాయుడులు కూడా పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయిన జయప్రకాష్ అన్నారు. చైర్మపర్సన్‌గా ఎన్నికయిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి చైర్మపర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, ఎమ్మెలే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్ అధికారుల సహకారంతో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయగలనన్న ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, ఎమ్మెల్యే చిరంజీవులు పాల్గొన్నారు.

    ఖరీఫ్‌కు ‘తోటపల్లి’ నీరు విడుదల
    గరుగుబిల్లి, జూలై 13: తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ప్రస్తుత ఖరీప్ సీజన్‌కు సంబంధించి ఆదివారం ఇరిగేషన్ అధికారులు మంచినీరు విడుదల చేశారు. ఆనవాయితీ ప్రకారం తొలుత పాత రెగ్యులేటర్ వద్ద బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ ఎస్‌వి రమణరావు, దవళేశ్వరం సూపరిండెంట్ ఇంజనీర్ శంబంగి సుగుణాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రవీంద్ర, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై గనిరాజ్, ఎఇలు ఎం శ్రీరంగనాయకులు, డివి రమణ, ఐజి శంబంగి తిరుపతిరావు పూజలు నిర్వహించారు. అనంతరం కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తివేశారు. తాగునీరు విడుదల చేసిన దృష్ట్యా ఇప్పటికే తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు మూసివేసి నదిలోపల నీరు నిల్వ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ రమణారావు మాట్లాడుతూ ప్రస్తుతం నదిలో 101 స్థాయిలో నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఎడమ కాలువ పరిధిలోని విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ మండలాలకు సంబంధించి 31500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.కుడి కాలువ ద్వారా గరుగుబిల్లి మండలంతో పాటు బలిజిపేట, వంగరకు చెందిన 7,800 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఖరీప్ సీజన్‌కు దాదాపు 120రోజులు నిరాటంకంగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

    త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారనే ప్రచారం జరగడంతో జిల్లాలో
    english title: 
    mlc

    0 0

    వట్లూరు ఎస్సీ గురుకుల ఆశ్రమ బాలికల వసతిగృహం ఆకస్మిక తనిఖీలో మంత్రి సుజాత ఆగ్రహం
    ఏలూరు, జూలై 13 : మీ ఇంట్లో ఇలానే అన్నం ముద్ద ముద్దగా వండుకుంటావా? మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతావా? సంక్షేమ పాఠశాలల్లో పిల్లలంటే ఇంత నిర్లక్ష్యమా? అంటూ రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత వసతిగృహ అధికారులను నిలదీశారు. పెదపాడు మండలం వట్లూరులోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఆశ్రమ బాలికల వసతిగృహాన్ని ఆదిరం మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లల కోసం వండిన అన్నంను అపరిభ్ర వాతావరణంలో వార్చి ఉంచిన పరిస్థితులను చూసిన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రక్క చెత్తాచెదారం మరో వైపు మురికి గుంట అపరిశుభ్ర వాతావరణం మధ్య అన్నం వార్పు చేసి ఉంచడం ఏమిటని వార్డెన్‌ను మంత్రి సుజాత నిలదీశారు. ఈగలు ముసురుతున్న పరిస్థితిలో ఆ ఆహారం తింటే పిల్లలకు అనారోగ్యం సంభవించదా? వండిన అన్నం కూడా ముద్దగా ఉండడం ఏమిటని వార్డెన్‌ను ప్రశ్నించారు. సంక్షేమ వసతిగృహాల్లో మంచి వాతావరణ పరిస్థితులు నెలకొల్పాలని మన ఇళ్లల్లో మన పిల్లలను ఎలా ఆరోగ్యవంతంగా చూసుకోగలుగుతామో అదే విధంగా వసతిగృహాల్లోని చిన్నారుల పట్ల వ్యవహరించాలని మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తే సహించబోమని హెచ్చరించారు. పేద కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక మధ్యలో బడి మాన్పిస్తున్న పరిస్థితులను తొలగించడానికే ప్రభుత్వం పేద వర్గాలకు చెందిన పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హాస్టల్స్‌ను నిర్వహించి వారికి విద్య నేర్పించడం జరుగుతున్నదని ఇటువంటి స్థితిలో హాస్టల్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. హాస్టల్ పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ వసతిగృహంలో పిల్లలకు అనువైన సౌకర్యాలు లేకపోవడంతో అదనపు భవనం నిర్మాణ పనులు కూడా వెంటనే పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. నీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని చిన్నారులంతా క్రమశిక్షణతో విద్య నేర్చుకుని బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతకోవాలని మంత్రి చిన్నారులను కోరారు. ఒకనాడు వంటశాలలుగా ఉన్న హాస్టల్స్‌ను తెలుగుదేశం పాలనలో పటిష్టవంతంగా అభివృద్ధి చేయగలిగామని భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా హాస్టల్స్‌ను నిర్వహించి వెనుకబడిన చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు.

    రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1500 కేటాయించాలి
    భీమవరం, జూలై 13: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు కేటాయించాలని రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. కనీసం ఈ నిధులైనా కేటాయిస్తే ఈ ప్రాజెక్టుకు హెడ్‌వర్క్స్ పనులైనా చేసే అవకాశం ఉంటుందని సమితి పేర్కొంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు అవసరమైన గిరిజనులకు పునరావాసం కోసం కేటాయించిన దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్ కలపాలని డిమాండ్ చేస్తున్నామని, అవసరమైతే ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆదివారం భీమవరం నీటిపారుదల శాఖ అతిధిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపి యర్రా నారాయణస్వామి, మెంటే పద్మనాభం, రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవి సూర్యనారాయణరాజు, రిటైర్డ్ ఎస్‌ఇ కె.హరినాథ్‌లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కలుపుతూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రాంతవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని వారు మండిపడ్డారు. డిజైన్ విషయంలో ఎటువంటి మార్పు లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని రైతు కార్యాచరణ సమితి పేర్కొంది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని యర్రా నారాయణస్వామి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కరవు పరిస్థితులు గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలను కూడా వెంటాడనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొద్దికాలంలోనే పూర్తికావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే కేంద్రం కూడా ముందుకు వచ్చి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించే అవకాశముంటుందన్నారు. పివి.సీతారామరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, మంతెన కృష్ణంరాజు, వడ్డి సుబ్బారావు, పోశింశెట్టి మురళి, గంటా సుందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    రూపం మారుతున్న రూపాయి బియ్యం
    భీమవరం, జూలై 13: పేదల కోసం కిలో రూపాయికే అందచేస్తున్న రేషన్ బియ్యం చౌకధరల దుకాణాల డీలర్లకు, మిల్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో పట్టపగలే దర్జాగా రైసు మిల్లులకు తరలిస్తున్నారు. ఇటీవల జిల్లాలో విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఈ విషయం బయటపడుతున్నా.. అక్రమాలు ఆగడం లేదు. ప్రభుత్వం కిలోకు రూ.25 వరకు రాయితీ భరించి పేదల కోసం రూపాయికే అందిస్తోంది. అధికారుల ఉదాసీనత కారణంగా కొందరు డీలర్లు మండల నిల్వ కేంద్రం నుంచే నేరుగా మిల్లులకు బియ్యం తరలిస్తున్నారు. మరికొన్నిచోట్ల డీలర్ల వద్ద దళారులు కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.15కు డీలర్ల వద్ద కొనుగోలు చేసి, సాధారణ బియ్యంలో కలిపి మిల్లుల్లో మరపట్టి తిరిగి బహిరంగ మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు.
    భీమవరం బియ్యం మాఫియా
    విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రతీసారి తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల పైనే దృష్టిసారిస్తూ ఉండేది. కానీ డెల్టాలో అడుగడుగునా రైస్ మిల్లులు ఉన్నాయి. బియ్యం మాఫియా కూడా భీమవరం కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తుందన్న ప్రచారం ఉంది. అయితే లక్షల టన్నుల కొద్దీ బియ్యం భీమవరం నుండే పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని రైస్ మిల్లులకు రీసైక్లింగ్ కోసం తరలిస్తున్నట్టు సమాచారం. దీనిపై విజిలెన్స్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం భీమవరంలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేసి చౌకబియ్యాన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే.
    తరలింపే తరువాయి...
    రేషన్ బియ్యం మిల్లులకు చేరడమే తరువాయి. వెంటనే వాటిని సంచుల్లోకి మార్చేస్తున్నారు. అధికారుల కంట పడకుండా వేకువజామున, రాత్రివేళల్లో మిల్లులకు వీటిని చేరుస్తున్నారు. మిల్లులకు చేరిన తరువాత సాధారణ ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి వెంటనే మరపడుతున్నారు. ఒకవేళ అధికారులకు సమాచారం అంది, మిల్లులకు చేరితే అప్పటికి బియ్యం రూపురేఖలే మారిపోతున్నాయి.
    తనిఖీలు లేకనే...
    ఆర్‌ఐ నుంచి ఆర్డీవో స్థాయి అధికారి వరకు ప్రతినెలా రేషన్ దుకాణాలను విధిగా తనిఖీలు చేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం తనిఖీలు దస్త్రాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో రేషన్ డిపోలు తనిఖీలు చేయడం లేదు. ఈ కార్యక్రమం వివరాలు ముందుగానే తెలియడంతో అధికారులు గ్రామాలకు చేరే సమయానికి డీలర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీలర్ల నుంచి కొందరు రెవెన్యూ సిబ్బందికి ప్రతినెలా మామూళ్లు అందుతుండటంతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
    జిల్లాలో బోగస్ రేషన్‌కార్డులు ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గత పాలకులు బోగస్ కార్డులను ఏరివేసేందుకు యత్నించారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించలేదు. తెలుపు రేషన్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు ఉండటంతో ధనవంతులు సైతం దొడ్డిదారిలో తెలుపురంగు రేషన్‌కార్డులు పొందారు.
    నిబంధనలు పట్టవు
    రేషన్ దుకాణాలు ఉదయం ఏడుగంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంగల వరకు తెరవాల్సి ఉంది. ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. దుకాణాల్లో కచ్చితంగా నిల్వ వివరాలు ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ చాలా దుకాణాల్లో ఈ బోర్డులు ఖాళీగానే కనిపిస్తున్నాయి. తూనికల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా ఈ నెల నుంచి ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల పంపిణీ కేంద్రం నుంచి డిపోలకు అనుమతి ఉన్న వాహనాల్లో, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో సరుకులు తరలించాల్సి ఉంది. ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. చౌకధరల డిపోల డీలర్లు విధిగా బ్యాడ్జీలు ధరించాల్సి ఉన్నప్పటికీ ఆచరించే వారే కనిపించడం లేదు.
    బినామీలే అధికం
    చౌకధరల దుకాణాలను డీలర్లే నిర్వహించాలి. జిల్లాలో అధిక రేషన్ దుకాణాలు బినామీలే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం బాగుండటంతో బినామీల చేతుల్లోనే ఉన్నాయి.

    ప్రభుత్వాసుపత్రులు ఆకస్మికంగా తనిఖీ చేస్తా:మంత్రి కామినేని
    ఏలూరు, జూలై 13 : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు తాను తరుచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడైనా సిబ్బంది విధులలో అలక్ష్యం, అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ 10 పడకల విభాగం, ఆయుర్వేద వైద్య విభాగంలోని రెజిమెంటల్ థెరఫీ విభాగాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రసూతి, ఆర్ధోపెడిక్, డయాలసిస్, ఆరోగ్యశ్రీ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను స్వయంగా కలిసి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ప్రస్తుతం వుందని, ఆ పరిస్థితి నుండి ప్రభుత్వ ఆసుపత్రులను బయటకు తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేలా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. డాక్టర్ వృత్తి పవిత్రమైనదని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించినప్పుడే వైద్య వృత్తికి సార్ధకత చేకూరుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్ ఛార్జీలు తొలగించామని, సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసపత్రుల అభివృద్ధి, వౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీల నిధుల నుండి వినియోగించుకోవచ్చునన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా 45 శాతం డాక్టర్లు, సిబ్బందికి ప్రోత్సాహకంగాను, 35 శాతం ఆసుపత్రికి అందుతుందన్నారు. ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఆసుపత్రికి వచ్చిన మొత్తం 1.10 కోట్ల రూపాయలు అందుబాటులో వున్నాయని, ఈ నిధులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అనుమతితో ఆసుపత్రి అభివృద్ధికి, వౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయవచ్చన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈశ్వర ప్రసాద్‌ను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఏలూరు, నిడదవోలు ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, బూరుగుపల్లి శేషారావు, జిల్లా కలెక్టర్ కె భాస్కర్, ఆయుష్ శాఖ కమిషనరు కెపి శ్రీవాసుకి, ఆయుష్ శాఖ ప్రాంతీయ సంయుక్తసంచాలకులు పెన్నా వీరభద్రరావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె శంకరరావు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎవి ఆర్ మోహన్, ఎ ఎస్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

    ఎవరెస్టు విజేతలకు సన్మానం
    తణుకు, జూలై 13: హిమాలయాలలో అత్యంత ఎతె్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వచ్చిన పూర్ణ, ఆనంద్‌లను తణుకు పురపాలక సంఘం, ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాలలు వేర్వేరుగా ఆదివారం ఘనంగా సత్కరించాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌లో జరిగిన సభలో వీరిద్దర్నీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ సత్కరించి, అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో అద్భుత సాహసం చేసి తెలుగు జాతికి పేరుతెచ్చిన పూర్ణ, అనంద్‌లను చరిత్ర ఎప్పటికీ మరువదన్నారు. ఈ సందర్భంగా ఆర్మీలో పనిచేస్తూ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తణుకు నివాసి దివంగత మద్దిపాటి ఉదయభాస్కర్ చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కమిషనర్ కోనేరు సాయిరాం, కౌన్సిలర్లు పరిమి వెంకన్నబాబు, బసవా రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జిఎల్‌ఆర్ మూర్తి, క్రైస్తవ మత ప్రచారకుడు జగ్జీవన్, న్యాయవాది మద్దిపాటి రాజశేఖర్ తదితర్లు ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణా, అనంద్‌లను అభినందించారు. అలాగే శ్రీమతి కొండేపాటి సరోజినీ దేవి మహిళా కళాశాలల ఆవరణలో జరిగిన సభలో పూర్ణా, అనంద్‌లను కళాశాలల వ్యవస్థాపకుడు చిట్టూరి సుబ్బారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వారిద్దరికీ రూ.10వేలు, కళాశాల విద్యార్థులు రూ.10వేలు నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలలో ఒకరిగా కాకుండా తమదైన ప్రత్యేకతను చాటుకున్న పూర్ణ, ఆనంద్‌లను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు వివిధ రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, డిగ్రీ, జూనియర్, ఎస్‌డి కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ పి అరుణ, డాక్టర్ డి విజయలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఇన్‌ఛార్జి పరిపాలనాధికారి డాక్టర్ జె చంద్రప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ బి నాగపద్మావతి, కెవి రాజ్యలక్ష్మి, కుసుమకుమారి, స్పోర్ట్స్ జోనల్ ఆఫీసర్ పుల్లయ్య, పూర్ణా, ఆనంద్‌లకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబు తదితర్లు పాల్గొన్నారు.

    టిడిపిని వరించిన అదృష్టం
    దేవరపల్లి, జూలై 13: దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు డ్రా పద్ధతిలో తీయగా ఈ రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీనే వరించాయి. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికలలో తెలుగుదేశం, వైసిపిలు పోటీపడ్డాయి. ఈ రెండు పార్టీలకు సమాన బలం ఉండడంతో ఎవరికి మండల పరిషత్ దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే అధికారులు ఇరు పార్టీలకు సమానంగా ఎంపిటిసి స్థానాలు దక్కడంతో లాటరీ పద్ధతిలో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోకతప్పలేదు. అధ్యక్ష పదవికి టిడిపికి చెందిన శ్రీకాకోళపు వెంకట నరసింహారావును వరించగా, ఉపాధ్యక్ష పదవిని టిడిపికి చెందిన బాదంపూడి ఇందిరను వరించింది. అలాగే కోఆప్షన్ పదవికి కూడా లాటరీ తీయగా వైసిపికి చెందిన అక్బర్ ఖాన్ సతాన్‌కు దక్కింది. ఈ నెల 4న దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన విషయం విధితమే. ఈ నెల 4న జరిగిన ఎన్నికలకు 22 ఎంపిటిసి సభ్యులలో 12మంది వైసిపికి చెందిన వారుకాగా, 9మంది టిడిపి, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. నాల్గవ తేదీ నుండి ఇప్పటి వరకూ జరిగిన రాజకీయ పరిణామాలలో లక్ష్మీపురానికి చెందిన వైసిపి ఎంపిటిసి పోలుమాటి విజయనిర్మల, గౌరీపట్నం ఎంపిటిసి చెరుకూరి కృష్ణకుమారి అనూహ్యంగా టిడిపిలో చేరారు. స్వతంత్ర అభ్యర్థి పెనుపోతుల సుబ్బారావు వైసిపిలో చేరారు. దీంతో టిడిపి, వైసిపిలకు 11 చొప్పున ఎంపిటిసి సభ్యులు ఉన్నారు. ఎన్నికల అధికారి, కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వైసిపి తరపున గన్నిమని జనార్ధనరావు, టిడిపి తరపున శ్రీకాకోళపు వెంకట నరసింహారావు పోటీపడ్డారు. వైసిపి అభ్యర్థి గన్నిమని జనార్ధనరావును యాదవోలు ఎంపిటిసి అనిశెట్టి సర్వశ్రీనివాసరావు ప్రతిపాదించగా, త్యాజంపూడి ఎంపిటిసి యర్రంశెట్టి వీర్రాజు బలపర్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీకాకోళపు వెంకట నరసింహారావుకు యర్నగూడెం ఎంపిటిసి బాదంపూడి ఇందిర ప్రతిపాదించగా, దేవరపల్లి ఎంపిటిసి చింతపల్లి నాగమణి బలపర్చారు. చేతులు ఎత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించగా టిడిపి, వైసిపిలకు చెరో 11మంది ఎంపిటిసిలు ఓట్లు వేశారు. దీంతో ఎన్నికల అధికారి గోవిందరావు లాటరీ నిర్వహించగా టిడిపి అభ్యర్థి శ్రీకాకోళపు వెంకట నరసింహారావును అదృష్టం వరించింది. ఈయన ఎన్నికైనట్టు ఆర్డీవో అధికారికంగా ప్రకటించారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి కూడా టిడిపి తరపున బాదంపూడి ఇందిర, వైసిపి తరపున బొంతా భరత్ తలపడ్డారు. టిడిపి అభ్యర్థిని ఇందిరకు దేవరపల్లి ఎంపిటిసి చింతపల్లి నాగమణి ప్రతిపాదించగా, కృష్ణంపాలెం ఎంపిటిసి కడలి దుర్గారావు బలపర్చారు. వైసిపి అభ్యర్థి భరత్ అభ్యర్థిత్వాన్ని కురుకూరు ఎంపిటిసి కాయల వెంకట్రావు ప్రతిపాదించగా, స్వతంత్ర అభ్యర్థి పెనుబోతుల సుబ్బారావు బలపర్చారు. లాటరీలో ఇందిరను అదృష్టం వరించింది. ఇక కోఆప్షన్ సభ్యునిగా వైసిపి తరపున అక్బర్ ఖాన్ పటాన్‌ను బలపర్చగా, టిడిపి షేక్ అబ్దుల్ అమీద్‌ను బలపర్చారు. వీరిద్దరి పేర్లను లాటరీ తీయగా వైసిపి బలపర్చిన అభ్యర్థి అక్బర్ ఖాన్ పటాన్‌ను అదృష్టం వరించింది. తొలుత ఎంపిటిసి సభ్యుల ప్రమాణస్వీకారం చేయించేందుకు ఎన్నికల అధికారి, ఆర్డీవో గోవిందరావు సిద్ధమవ్వగా టిడిపి ఎంపిటిసి సభ్యులు అడ్డుకున్నారు. తమ ఇద్దరు ఎంపిటిసి సభ్యులిద్దరు ఏలూరు నుండి రావలసి ఉందని, వారు వచ్చేవరకూ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ఆర్డీవో సమ్మతించలేదు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారికి ఫోన్‌చేసి పరిస్థితిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎన్నికల అధికారి ఆర్ గోవిందరావుకు ఎంపిడిఒ జె రేణుకమ్మ, సిబ్బంది రాజు, వెంకటేశ్వరరావు సహకరించారు.
    భారీ బందోబస్తు:డిఎస్పీ
    ఈ ఎన్నికలకు 450మంది కానిస్టేబుళ్లు, అయిదుగురు సిఐలను, 20మంది ఎస్సైలను నియమించినట్టు కొవ్వూరు డిఎస్పీ రాజగోపాల్ తెలిపారు. గతంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఆదేశాల మేరకు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు, ఎఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, కొవ్వూరు రూరల్ సిఐ బాలకృష్ణ, టౌన్ సిఐ చిరంజీవి, తాడేపల్లిగూడెం సిఐ దేవకుమార్, నిడదవోలు సిఐ శ్రీనివాస్, తణుకు సిఐ గోవిందరావు, 50మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారని డిఎస్పీ తెలిపారు.

    బాల్‌బ్యాడ్మింటన్ పొటీల విజేతలు తూ.గో., గుంటూరు
    నిడదవోలు, జూలై 13: పట్టణంలో జరుగుతున్న 28వ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల బాలికల బాల్‌బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆదివారం బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖ - తూర్పు గోదావరి జిల్లాలు తలపడగా తూర్పు గోదావరి జట్టు గెలుపొందింది. బాలికల విభాగంలో విశాఖ - గుంటూరు జట్లు తలపడగా గుంటూరు జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతీ ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. ఈనాడు గెలుపొందిన వారు ముందు ముందు మరిన్ని ఆటల పోటీల్లో గెలుపొందడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓడిన వారు నిరాశ చెందకుండా ఈనాటి ఓటమి రేపటి గెలుపునకు నాందిగా గుర్తించి, విజయ పథంలో పయనించాలన్నారు. రాష్టస్థ్రాయి పోటీలు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం పట్టణ మున్సిపల్ ఛైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులకు, అభిమానులకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులకు ఆహార, వసతులు కల్పించడంతోబాటు పోటీలు ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి ఛాంపియన్‌షిప్‌లు పట్టణంలో మరిన్ని నిర్వహించాలని, వాటి నిర్వహణకు తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందని మున్సిపల్ ఛైర్మన్ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. అనంతరం స్టార్ ఆఫ్ ఆంధ్రాగా క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలుర విభాగంలో విశాఖపట్నానికి చెందిన పి శ్యామ్‌కుమార్, చిత్తూరుకు చెందిన పి కార్తిక్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైవిఎస్‌కె రెడ్డి, విజయనగరానికి చెందిన ఆర్ రాజేష్, అనంతపురానికి చెందిన ఎ గోవర్దన్‌లను ఎంపిక చేశారు. బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన పి పెర్సీ జ్యోతి, విజయనగరానికి చెందిన పివివిఎస్ ఐశ్వర్య, విశాఖపట్నానికి చెందిన కె శ్రావణి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్ ప్రియాంక, పశ్చిమ గోదావరికి చెందిన ఎస్ గీతా ప్రసన్నలను ఎంపిక చేశారు. అనంతరం హర్యానాలో జరిగే రాష్ట్ర జట్లను ప్రకటించారు.
    జట్టు వివరాలు
    బాలుర విభాగంలో పి శ్యామ్‌కుమార్ (విశాఖపట్నం), ఆర్ అనిల్‌కుమార్ (తూర్పు గోదావరి), ఆర్ రాజేష్ (విజయనగరం), కెఎల్‌వి సాయి సురేష్ (కర్నూలు), వైవిఎస్‌కె రెడ్డి (తూర్పు గోదావరి), పి పవన్‌కుమార్ (విశాఖపట్నం), పి కార్తీక్ (చిత్తూరు), ఎ గోవర్దన్ (అనంతపురం), డి శ్రీను (విశాఖపట్నం), డి సాయితేజ (పశ్చిమ గోదావరి) ఉన్నారు. వీరికి అదనపు ఆటగాళ్లుగా సాయిధరణీ రాజు (కర్నూలు), ఎస్‌కె పఠామియా (ప్రకాశం) ఎస్ సాయికృష్ణ (కర్నూలు)లను ఎంపిక చేశారు.
    బాలికల విభాగంలో జి హర్షిణి (కర్నూలు), పివివిఎస్ ఐశ్వర్య (విజయనగరం), పి పెర్సీ జ్యోతి (గుంటూరు), పి ప్రభావతి (విశాఖపట్నం), ఎల్ నాగలక్ష్మి (గుంటూరు), కె శ్రావణి (విశాఖపట్నం), ఆర్ ప్రియాంక (తూర్పు గోదావరి), కె అమూల్య (ప్రకాశం), వై స్రవంతి (నెల్లూరు), ఎస్ గీతా ప్రసన్న (పశ్చిమ గోదావరి)లను ఎంపిక చేశారు. కె వాణి (గుంటూరు), ఎం ఈశ్వరి (కడప), కె ఫణితా చౌదరి (కర్నూలు) ఎక్స్‌ట్రా క్రీడాకారిణులుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్‌ఒ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంగా ప్రసాద్, అధ్యక్షుడు ఎన్ త్రిమూర్తులు, పట్టణ కౌన్సిలర్ రంగా మధుసూదనరావు, సిటీ కేబుల్ ఎండి నాగేంద్ర ప్రసాద్, పిఇటిలు పాలేటి శ్రీనివాస్, టి రవీంద్ర, పి లెనిన్‌బాబు, ఎన్‌టి రామారావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దాం
    కలెక్టర్ భాస్కర్‌తో సమావేశమైన మంత్రి సుజాత
    ఏలూరు, జూలై 13 : జిల్లాలో అభివృద్ధి లక్ష్యాలను అధిగమించడానికి సమన్వయంతో పనిచేద్దామని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జిల్లా కలెక్టర్‌ను కోరారు. స్థానిక జడ్పీ అతిధిగృహంలో ఆదివారం కలెక్టర్ డాక్టర్ కె భాస్కర్‌తో మంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ ప్రజాప్రతినిధులు ఎంతో ఆసక్తితో ఉన్నారని, జిల్లా కలెక్టరు బాధ్యతలు చేపట్టినందున జిల్లాపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడానికి జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని మంత్రి కోరారు. పేద ప్రజల ఆర్ధికాభివృద్ధికి, జిల్లా సమగ్ర అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేద్దామని చెప్పారు. ప్రజా ప్రతినిధుల సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టినా పాలనాపరంగా అనుభవంతో పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని కలెక్టర్ డాక్టర్ కె భాస్కర్ చెప్పారు. సత్వర అభివృద్ధికి అందరి సహకారం తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు.
    యువనేత జోక్యంతో వివాదం పరిష్కారం
    తాళ్లపూడి, జూలై 13: తొలగించిన ఇద్దరు కార్మికులను ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి ఆహ్వానిస్తూ బయో ఇథనాల్ ఎండి సంజయ్‌సింగ్ తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 17 రోజులుగా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికుల తొలగింపు వివాదాస్పదమైంది. శనివారం రాత్రి ఫ్యాక్టరీ ఎండి సంజయ్‌సింగ్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. యువ పారిశ్రామికవేత్త అల్లూరి విక్రమాదిత్య ఫ్యాక్టరీ యాజమాన్యానికి నచ్చచెప్పడంతో సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాదానికి కారణాలు, కారకులను గుర్తించిన యాజమాన్యం కొన్ని మార్పులు చేసింది. సమ్మెలో పాల్గొన్న, సమ్మెకు దూరంగా వున్న కార్మికులతో వేర్వేరుగా చర్చలు జరిపి అందర్నీ విధుల్లోకి రావాలని యాజమాన్యం ఆహ్వానించింది. చర్చల్లో బయట వ్యక్తులెవరికీ అవకాశం కల్పించలేదు. సమ్మె కాలంలో కూడా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామన్న ఎండి నిర్ణయానికి కార్మికులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం నుండి ఫ్యాక్టరీ యధాతథంగా పనిచేయనుంది.

    వట్లూరు ఎస్సీ గురుకుల ఆశ్రమ బాలికల వసతిగృహం ఆకస్మిక తనిఖీలో మంత్రి సుజాత ఆగ్రహం
    english title: 
    sujatha

    0 0

    కడప, జూలై 14: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కెవి రమణ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, మేధావులు కలిసిరావాలని కోరారు. సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా సంబంధిత ప్రాంత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారులు అంకితభావంతో పని చేసి ప్రజలకు చేరువ కావాలని కోరారు. పరిపాలన, విద్య, వైద్యం,
    వ్యవసాయం, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అభివృద్ధికి దోహదపడాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లా సమస్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, వాటి పరిష్కరించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలన్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలే అజెండా పెట్టుకుని అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఆయన కోరారు. తాను ప్రజలకు, అధికారులకు నిత్యం అందుబాటులో ఉంటానని ఎటువంటి చిన్న సమస్య ఎదురైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
    బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
    కడప, జూలై 14: కొత్త కలెక్టర్‌గా కెవి రమణ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.రామారావు లాంఛనంగా ఆయనకు చార్జి అప్పగించారు. ఇప్పటి వరకు జిల్లాలో 47 మంది కలెక్టర్లు పని చేశారు. 48వ కలెక్టర్‌గా కెవి రమణ కలెక్టరేట్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర రాజధాని ఈసేవా కేంద్రానికి డైరెక్టర్‌గా బదిలీ అయిన కోన శశిధర్ జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బదిలీపై వచ్చిన కెవి రమణ సోమవారం ఉదయం కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పలువురు అధికారులు కలిసి సాదరంగా స్వాగతం పలికారు. డిఆర్వో సులోచన, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.గోపాల్, డ్వామా పిడి బాలసుబ్రమణ్యం, డిఆర్‌డిఏ పిడి అనిల్ కుమార్‌రెడ్డి, హౌసింగ్ పిడి సాయినాధ్, ఐసిడిఎస్ పిడి లీలావతి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ప్రతిభాభారతి, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రసాదరావు తదితరులతోపాటు అన్ని శాఖలకు చెందిన అధిపతులు కలెక్టర్‌ను కలిశారు. తమశాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు కలెక్టర్‌కు నివేదించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ అంతా కలియ తిరిగి సభాభవన్‌లో అధికారులు నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్, గ్రీవెన్‌సెల్‌ను పరిశీలించారు.

    అవధుల్లేని ఆనందం
    కడప, జూలై 14: ఎంతోకాలంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎదురుచూస్తున్న శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న డిఎస్సీ నోటిఫికేషన్‌తో శిక్షణ ఉపాధ్యాయుల్లో ఆనందోత్సవం వెల్లివిరస్తోంది. సోమవారం విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఈమేరకు డిఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రకటించారు. జిల్లాలో 322 పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిలో స్కూల్ అసిస్టెంట్లు 125 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 197 ఖాళీగా ఉన్నాయి. ఈ డిఎస్సీకి పరీక్ష రాసేందుకు టెట్ పాసైన వారే అర్హులుగా ప్రకటించారు. అయితే 2007 ముందు శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు 2008 తర్వాత టెట్ పాసైన వారే అర్హులుగా ప్రకటించారు. డిఎస్సీ 2011 తర్వాత నిర్వహించకుండా రెండేళ్లపాటు డిఎస్సీ లేకపోవడంతో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తు వస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వయస్సు పెంచడంతో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నిరుత్సాహానికి గురయ్యారు. ఎట్టకేలకు రెండుసంవత్సరాల తర్వాత శిక్షణపొందిన ఉపాధ్యాయులకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక ఉపాధ్యాయ ఖాళీ విషయానికొస్తే స్కూల్ అసిస్టెంట్లలో సాంఘీకశాస్త్రం 45, జీవశాస్త్రం 33, గణితం 19, ఇంగ్లీషు 11, భౌతిక శాస్త్రం 9, హిందీ 7, ఉర్దూలో ఒకటి చొప్పున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం ఒక పోస్టు కూడా ఖాళీగా లేదు. ఇక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విషయానికొస్తే తెలుగుమీడియంలో 153, ఉర్దూమీడియంలో 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ శిక్షణ ముగించుకున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు జిల్లాలో 5వేల మంది పైబడే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీలు చూపిన పోస్టులలో డిమాండ్ బాగావుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు పెంచడంతో ఇక 2017 వరకు డిఎస్సీ నిర్వహణ ఉంటుందో లేదోనని అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. త్వరలో నిర్వహించనున్న డిఎస్సీ నిర్వాహకులకు కూడా పరీక్ష నిర్వహణ కత్తిమీద సాము లాంటిదే.
    డ్వాక్రా మహిళల వెలుగు చంద్రబాబుదే
    రాజంపేట, జూలై 14:డ్వాక్రా మహిళలను వెలుగులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీలో మెప్మా, నాక్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ 1995లో డ్వాక్రా సంఘాలకు ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. వారి ఆలోచన మేరకు న్యాక్ సెంటర్లు ఏర్పాటు చేయడం, యువతకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు త్వరలో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీకి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏక్కడో దూర ప్రాంతాలకు యువత వలసలు వెళ్లకుండా సమీపంలోని న్యాక్ కేంద్రాలలో మోటార్ వైడింగ్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, కుట్టుమిషన్లలో యువత శిక్షణ తీసుకోవాలన్నారు. మెప్మా, డిఆర్‌డిఏ స్వయం ఉపాధి పథకాలపై రుణాలు పొంది ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. ఆర్డీఓ ఎం.విజయసునీత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినపుడు కుటుంబం బాగుపడుతుందన్నారు. న్యాక్ సెంటర్ హైద్రాబాద్‌లో 1998లో ఏర్పాటైందని, ఈ సెంటర్లలో కొన్ని వేల మందికి శిక్షణ కల్పించి వారికి స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వాలంభన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారని, వీటిలో నైపుణ్యం సంపాదించాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలో 4 వేల మంది పొదుపు మహిళా సంఘాల ద్వారా వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు బట్టలు కుట్టేందుకు రూ. 2.20 కోట్ల ఆర్థిక పరపతి అందజేయడం జరిగిందన్నారు. రాజంపేట మున్సిపాలిటీలో కుట్టుశిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా రాజంపేలో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. న్యాక్‌లో శిక్షణ పొందిన చంద్రావతి, ఆశ్విని, పి.నూర్జహన్, షరీఫాలకు మేడా చేతుల మీదుగా సర్ట్ఫికేట్లు, కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జి.చంద్రవౌళి, ఎం.వెంకటేశ్వర్లు గజమాలతో మేడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య, న్యాక్ ఏడి రాజశేఖర్, లేబర్ ఆఫీసర్ గణేష్, టిడిపి నాయకులు జ్యోతీశ్వరబాబు, జి.గుల్జార్‌బాషా, డాక్టర్ సి.సుధాకర్, యోగీశ్వరరెడ్డి, మల్లేల సుబ్బరాయుడు, రమణారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనిశ్చితి
    కడప, జూలై 14: ఓట్లు దండుకోవడానికి శతకోటి ఉపాయాలు అన్న చందంగా పాలకులు వివిధరకాల అమలుకాని హామీల్లో భాగంగా ప్రతిభావంతులకు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి దశాబ్దకాలంలో రోజుకొక జీఓలతో విద్యార్థులను బెంబేలెత్తిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎంబిబిఎస్, బిటెక్, ఎంబిఏ, ఎంసిఏ, డిఎడ్, బిఇడి, ఫార్మసీ, ఫార్మాడి కోర్సుల్లో పదివేల పై చిలుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యను జిల్లాకుచెందిన వారే అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం చదువు ముగింపుదశలో ఉన్న విద్యార్థులకు, రెండు, మూడవ సంవత్సరం చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోవడంతో వారి భవిష్యత్ అర్థాంతరంగా ముగియనుంది. గత విద్యాసంవత్సరం, ఈ విద్యాసంవత్సరం ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై అనిశ్చితి నెలకొని విద్యార్థుల భవిష్యత్ అర్థాంతరంగా ముగిసిపోనున్నాయి. రాష్టవ్రిభజన పుణ్యమా అని తెలంగాణ ప్రభుత్వం వివిధ కుంటిసాకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్న వారికి తమకు ఆ విద్యార్థులతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. రాష్టవ్రిభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వం, ఇప్పటి గవర్నర్ పది సంవత్సరాల పాటు పదేళ్లవరకు ఉమ్మడి చదువులే విద్యార్థుల విషయంలో ఉమ్మడిపాలనే అని ప్రకటించినా ఆ ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. తెలంగాణ జిల్లాల్లో చదువుకుంటున్న జిల్లాకు చెందిన విద్యార్థుల విషయంలో తాను ఎటువంటి ఫీజుల విషయంలో భరించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించుకోవాలని హుకుం జారీ చేసింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా వారిపై కౌంటర్ ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప జిల్లా విద్యార్థుల భవిష్యత్‌పై ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారపార్టీ ఇప్పటికే రైతు, డ్వాక్రా మహిళల గ్రూపుల రుణాలు, బంగారు నగలు తాకట్టురుణాల రద్దుపై జుట్టుపీక్కుంటోంది. ఇప్పటి వరకు ఆ ప్రధాన సమస్యలకే పరిష్కారం కన్పించడం లేదు. చివరకు రుణాల రీ షెడ్యూలు అంటూ కొత్తపాట పాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలుకాని పరిస్థితుల్లో పేద విద్యార్థులు తమ చదువులను అర్థాంతరంగా ముగించుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టాల్సివస్తుంది. ఇప్పటికే వారి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతూ ఆ ఫీజులు చెల్లించలేక, సంబంధిత యాజమాన్యాలు విద్యార్థులపై వత్తిడి తెస్తున్నందున వారు చదువులు అర్థాంతరంగా ముగించుకోనున్నారు. ఈ ఏడాది చదువుకోనున్న విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టత లేకపోవడంతో వృత్తి విద్యాకోర్సులు అభ్యసించాల్సిన విధ్యార్థులు చదువుకునే ఆర్థికస్తోమత లేక చదువులకు స్వస్తి చెప్పే పరిస్థితులున్నాయి. లేదా ఉపాధిలేని కోర్సుల్లోనైనా చేరడమే శ్రేయస్కరమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడి
    కడప(టౌన్), జూలై 14: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌వద్ద ముట్టడి నుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు జూన్‌లో ఎంసెట్‌తోపాటు అన్నిరకాల కౌనె్సలింగ్‌ను పూర్తిచేసి ఆగస్టులో తరగతులు ప్రారంభించాలని గత సంవత్సరం సుప్రీం కోర్టు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించిందన్నారు. కానీ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సిలింగ్ ఇప్పటికి రెండుసార్లు వాయిదా వేసిందన్నారు. దీనికారణంగా విద్యార్థులు తమ విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రప్రభుత్వం రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టమైన వైఖరి తీసుకుని ఎంసెట్‌తోపాటు అన్ని రకాల సెట్ కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి రీయంబర్స్‌మెంట్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ బిల్లులో పది సంవత్సరాలు ఉమ్మడి అడ్మిషన్లు ఉంటాయని చెప్పినప్పటికీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విద్యార్థులకు ఫీజు ఇవ్వమని, 1956 సంవత్సరానికి ముందు ఉన్నవారికి మాత్రమే ఫీజు ఇస్తామని ప్రకటించడంతో మన రాష్ట్ర విద్యార్థుల చదువులు అర్థాంతరంగా ముగించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజకీయ కారణాలతో విద్యార్థుల భవిష్యత్‌ను ముడిపెట్టడం దారుణమన్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలపై ఇప్పటికే మంచి అభిప్రాయం లేదన్నారు. అదేవిధంగా టాప్ కళాశాలల్లో గత రెండు సంవత్సరాల క్రితం ఏకీకృతఫీజు విధానం పేరుతో ఫీజును విపరీతంగా ప్రభుత్వం పెంచిందన్నారు. కానీ విద్యార్థులకు 35వేల రూపాయలు ఇస్తామని, మిగిలిన మొత్తం విద్యార్థులే చెల్లించాలని నిబంధనలు పెట్టడం శోచనీయమన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలుచేసి ఉమ్మడి రాష్ట్రంలో గత విద్యాసంవత్సరం 2500 కోట్లు రూపాయలు జిల్లాలోని విద్యార్థులకు ఏడుకోట్ల వరకు బకాయి ఉన్న రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు. కళాశాలల యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసినా వేలాది మంది విద్యార్థులకు సర్ట్ఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించిన తర్వాత విద్యార్థులు తమ సర్ట్ఫికెట్లు తీసుకోవాలని, విధించిన నిబంధనల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. రాష్ట్రంలో 369 ఇంజనీరింగ్ కళాశాలున్నాయని, కానీ 50శాతం పైగా కనీసం ఏఐసిటిఐ నిబంధనలు పాటించడం లేదన్నారు. మొత్తం ఇంజనీరింగ్ కళాశాలల్లో మూడు లక్షల సీట్లు ఉండగా, ఎంసెట్‌లో సంవత్సరం అర్హత సాధించిన వారు కేవలం 1.7లక్షల మంది విద్యార్థులు మాత్రమేనని, ఇప్పటికీ 1.3లక్షల సీట్లు ఖాళీగా మిగులుతున్నాయన్నారు. అనంతరం జెసి ఎం.రామారావుకు వినతిపత్రం సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, మహేష్, నరసింహ, పుల్లయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    త్వరలో సంక్షేమ హాస్టళ్ల తనిఖీ : మేడా
    రాజంపేట, జూలై 14:నియోజకవర్గంలోని వసతిగృహాలను తాను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులను వార్డన్లు స్వంత బిడ్డలుగా చూసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ సభాభవన్‌లో బీసీ హస్టల్స్ సలహ కమిటీ అధ్యక్షునిగా మేడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. హస్టల్స్ అధికారులు, సిబ్బంది వసతిగృహాలున్న చోటే స్థిర నివాసం ఉండాలన్నారు. సంబంధిత అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, హస్టల్స్‌లో పరిశుభ్రత పాటించాలన్నారు. హస్టల్స్‌కు తాగునీటి సౌకర్యం సక్రమంగా ఉండేందుకు, ఇన్వర్టర్ల ఏర్పాటుకు నియోజకవర్గ నిధుల నుంచి భర్తీ చేస్తామన్నారు. హస్టల్స్‌లో సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అద్ద్భెవనాల్లో నడుస్తున్న యాజమానులతో మాట్లాడి మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. వారానికి ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఉపకార వేతనాల మంజూరుకు కృషి చేస్తామన్నారు. హస్టల్స్ విద్యుత్ బకాయిలు, సంబంధిత వ్యయాలపై నివేదిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, హస్టల్ భోజనాన్ని ముందు వార్డన్లు రుచి చూచి, ఆపై విద్యార్థులకు పెట్టాలన్నారు. ఎంపిపి సుహర్లత, జడ్పీటీసీ ఝాన్సీ, సిద్దవటం ఎంపిపి నరసింహరెడ్డి, ఎంపిడిఓ జి.వెంకటసుబ్బయ్య, బీసీ సంక్షేమాధికారి మల్లికార్జున, ఈఓఆర్డీ మల్లికార్జునరెడ్డి, కార్యదర్శులు, డివిజన్‌లోని హెచ్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.
    బస్సు పాసులకోసం విద్యార్థుల అగచాట్లు
    రాయచోటి, జూలై 14 : పట్టణంలోని ఆర్టీసి బస్టాండులో విద్యార్థులకు సంబంధించిన బస్సు పాసుల కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్‌లో విద్యార్థులకు పాసులను గత రెండు రోజుల నుంచి పంపిణీ చేస్తున్నారు. నేడు బస్సు పాసులు ఇచ్చేందుకు చివరి రోజు కావడంతో సోమవారం విద్యార్థులు బస్సు పాసులు ఇచ్చే కౌంటర్‌వద్ద భారీ క్యూ కట్టారు. ఇక్కడ బకేఒక్క కౌంటర్‌ను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందున నేడు చివరి రోజు కావడం రేపటి నుంచి అపరాధరుసుంతో బస్సు పాసులు తీసుకోవాల్సి ఉండటంతో విద్యార్థులు ఎండలో కూడా క్యూ కట్టారు. విద్యార్థులకు బస్సు పాసులు రూ.50 నుంచి రూ.250 వరకు ఆర్టీసి అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు బస్సు పాసుల కౌంటర్‌ను మరొకటి ఏర్పాటుచేస్తే ఇబ్బందులు కలుగకుండా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.
    ఇంజనీర్లను నియమించండి
    * చెన్నూరు ఎంపిపి మిట్టపల్లి బాలమ్మ
    చెన్నూరు, జూలై 14: చెన్నూరు మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న ఆర్‌డబ్ల్యుఎస్‌తోపాటు పిఆర్ ఇంజనీర్‌ను వెంటనే నియమించాలని చెన్నూరు మండల అధ్యక్షురాలు మిట్టపల్లి బాలమ్మ జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో ప్రజావినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఇద్దరు ఇంజనీర్లు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరు పదోన్నతిపై వెళ్లిందని అలాగే పిఆర్ ఇంజనీర్‌ను కడప కార్పొరేషన్‌కు బదిలీ చేశారని దీని కారణంగా ఇంజనీర్లు లేకపోవడంతో అభివృద్ధిపనులు జరగడం లేదన్నారు. ఈకార్యక్రమంలో చెన్నూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు టి.వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ చేసిన జెసి
    కడప(టౌన్), జూలై 14: అర్హులైన వికలాంగులకు రెండు ట్రై సైకిళ్లు, రెండు వీల్ చైర్లను జెసి ఎం.రామారావు సోమవారం పంపిణీ చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఆవరణంలోని సభాభవన్ వద్ద ఖాజీపేటకు చెందిన ఎం.ఈశ్వరయ్య, కోడూరు మండలానికి చెందిన వి.తిరుపతయ్యలకు రెండు ట్రై సైకిళ్లను, పెండ్లిమర్రికి చెందిన వి.రెడ్డమ్మ, మైదుకూరుకు చెందిన వై.రాణమ్మలకు రెండు వీల్ చైర్లను జెసి పంపిణీ చేశారు.
    బ్రాందీషాపును తొలగించాలి
    కడప(టౌన్), జూలై 14:ప్రొద్దుటూరు సంజీవనగర్ వీధిలోని మడూరు దారి వద్ద వున్న బ్రాందీషాపును వెంటనే తొలగించాలని సంజీవనగర్ వీధి స్థానికులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. లక్ష్మీనారాయణమ్మ, లూతమ్మ, నాగమ్మలు మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల వసతి గృహం, రెండు చర్చిలు ఉన్న ప్రాంతంలో బ్రాందీషాపు వల్ల రోజురోజుకు తాగుడుబోతుల ఆగడాలు భరించకుండా ఉన్నామన్నారు. బ్రాందీషాపు పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలు ఇంటికి వస్తున్నప్పుడు తాగుబోతులు వారిని దుర్భాషలాడుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్రాందిషాపు తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జెసి రామారావుకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ఇచ్చిన వారితో వెంకటలక్షుమ్మ, నాగలక్ష్మి, నవ్యశ్రీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
    నేడు కలెక్టరేట్ ముట్టడి
    సుండుపల్లె, జూలై 14: నేడు కలెక్టరేటు ముట్టడి చేయనున్నట్లు మండల సిపిఐ నాయకులు ప్రసాద్, సధాకర్ ఆచారి, వెంకటయ్య, అబ్దుల్ ఖలిమ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణాలు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామిలను నేరవేర్చాలేదని ఖరిఫ్ సీజన్ పూర్తి అవుతున్న రుణాలు మాఫీ చెయకపోవడం చాలా దారుణం అన్నారు. ఇందుకు నిరసనగా నేడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టునున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు, నాయకులు, ప్రజలు వచ్చి జయప్రదం చేయాలని వారు ప్రకటనలో తెలిపారు.
    పట్టాను రద్దు చేయండి
    చిన్నమండెం, జూలై 14 : మండలంలోని బస్టాండు పరిధిలో అక్రమంగా ఇల్లు కట్టడాలు చేస్తున్న సయ్యద్ ఖాదర్ వలి అనే వ్యక్తి వంకలో అక్రమంగా గునాదులు తీస్తున్నందు వల్ల ప్రజలు తహసీల్దార్‌కు సోమవారం విన్నవించారు. ఈ విషయంపై తహసీల్దార్ భవాని అయన పట్టాను రద్దు చేయడానికి జిల్లా అధికారులకు ఆదేశాలు పంపినట్లు ఆమె తెలిపారు. 2009 రిటైర్డు అయిన తహసీల్దార్ దగ్గర సంతకాలు చేయించుకుని పట్టా పొందడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని వాటిని రద్దు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
    ప్రజావాణిలో 20 వినతులు
    సుండుపల్లె, జూలై 14: స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణీలో 20 వినతులు అందినట్లు తహాశీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో జనర్ధన్ రావు, ఎంఈఓ రామక్రిష్ణ మూర్తి, పిఆర్ ఎఈ బ్రహ్మనంద రెడ్డి, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, ఆర్‌ఐ భాస్కర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
    హెల్త్‌కార్డులపై అవగాహన
    సండుపల్లె, జూలై 14:మండలంలోని మడితాడు గ్రామం చెండ్రాజుగారిపల్లె,తిమ్మసముద్రం గ్రామం రెడ్డివారిపల్లెలో సోమవారం త్ధయిల్ హెల్తకార్డులపై రైతులకు ఎ వో పవన్ కుమార్, ఎ ఈ వోలు లోకేశ్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా బాస్పరం ఎరువుల అయిన డిఎపి 17.17.17 28.0 వరి పైరులలో కాక వేరుశనగలో వాడటం వల్ల సూక్ష్మపోషికాలైన జింకు లోహం ఏర్పాడి దిగుబడి తగ్గుతుందని అదేవిధంగాసూపర్ వాడటం వల్ల దిగుబడి పెరిగి ఖర్చు తగ్గుతుందని తెలియజేశారు.
    ప్రజావాణి ఫిర్యాదులకే అధిక ప్రాధాన్యం
    గాలివీడు, జూలై 14: ప్రజావాణీ కార్యక్రమం సందర్భంగా వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత కల్పించి పరిష్కరించడం జరుగుతుందని తహాశీల్దార్ చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానికి కార్యాలయంలో జరిగిన ప్రజావాణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి తహాశీల్దార్ రెడ్డెన్న, ఆర్‌ఐ కృపావతి,టైపిస్ట్ నాగభూషణం,వీఆర్‌ఓలు హరినాధ రెడ్డి,లక్ష్మీరెడ్డి,గంగాధర్,క్రిష్ణప్ప,నిర్మల్ కుమార్,సబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
    ఆర్‌ఎస్‌యు రాష్ట్ర కార్యదర్శిగా రవీంద్ర
    రాయచోటి, జూలై 14 : రాయలసీమ విద్యార్థి యూనియన్ (ఆర్‌ఎస్‌యు) రాష్ట్ర కార్యదర్శిగా మాధవారం రవీంద్ర ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వి
    ఆధార్ అనుసంధానాన్ని వేగవంతం చేయండి
    వీరబల్లె, జూలై 14: మండలంలోని రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్ అనుసందాన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహాశీల్దార్ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓలతో జరిగిన సమావేశలో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ రాయితీలు వర్తించాలంటే ఆధార్ అనుసందానం తప్పని సరి అన్నారు. ఈ కార్యక్రమంలో డిటి నరేంద్ర కుమార్, ఆర్ ఐ వంశీధర్,వి ఆర్ ఓలు తదితరుల పాల్గొన్నారు.
    విద్యార్ధులకు దుస్తులు పంపిణీ
    రాయచోటి, జూలై 14: పట్టణంలోని ఆర్‌హెచ్‌జిబిఎంఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవా సంస్ధ ఆధ్వర్యలోగుడ్ నైబర్స్ ఇండియా సహకారంతో సుమారు 756 మంది విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు నోట్ పుస్తకాలు, చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి యన్ ఐ సంస్ధ సభ్యులు యమ్.బాబు,నాగేంద్ర,లక్ష్మీ,సునంద,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    ప్రజా సమస్యల పరిష్కారం
    చిన్నమండెం, జూలై 14 : తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ భవాని అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రజావాణికి మండల అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులను ఉద్దేశించి తహసీల్దార్ భవాని మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చడానికి ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

    జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు
    english title: 
    c

older | 1 | .... | 277 | 278 | (Page 279) | 280 | 281 | .... | 1949 | newer