Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మహిళ దారుణ హత్య

$
0
0

* ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
* పోలీసుల అదుపులో నిందితుడు
పుంగనూరు , జూలై 14: ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. తానే హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్న సంఘటన పుంగనూరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మే 25వ తేదీన పుంగనూరు మండలంలోని వనమలదినె్న గ్రామానికి చెందిన రామానాయుడు భార్య సరస్వతమ్మ(55) మే నెల 25వ తేదీన వడదెబ్బతో పొలం వద్ద మృతి చెందిందని కుంటుంబ సభ్యులు దహన క్రియలు నిర్వహించారు. అయితే గత మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గురుమూర్తి మద్యం మత్తులో వనమలదినె్న గ్రామంలో సరస్వతమ్మను తానే హత్య చేశానని ప్రజలను బెదిరిస్తుండగా గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని గత మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే మహిళను హత్య చేశానని తెలిపాడు. ఈమేరకు సోమవారం సరస్వతమ్మ సమాధి వద్దకు ఎస్‌ఐ, తహశీల్దార్ మునిరాజు, డాక్టర్ వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త రామానాయుడు ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా గత ఆదివారం నిందితుడు గురుమూర్తి పోలీసులకు కళ్లుగప్పి పరారయ్యేందుకు యత్నించాడు. అప్రమత్తమైన గ్రామస్థులు నిందితున్ని పట్టుకుని తిరిగి పోలీసులకు అప్పగించారు.
గురుమూర్తి ఒక సైకో
పుంగనూరు మండలంలోని వనమలదినె్న గ్రామానికి చెందిన గురుమూర్తి గత కొంత కాలంగా సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమూర్తి తమ గ్రామంలో కత్తి పట్టుకుని తిరుగుతుంటాడని, కనిపించిన కోళ్లను కత్తితో గొంతుకోసి కాల్చి అక్కడికక్కడే తినేవాడని, కుక్కలు కనపడితే వాటి తోకలు కత్తిరించేవాడని, అతనికి ఎవరైనా ఎదురు సమాధానం చెబితే చంపేస్తానని బెదిరించేవాడని తెలిపారు. అతని భార్యను సైతం హింసించేవాడని, అడ్డుకునేందుకు స్థానికులు వెళ్తే అక్రమ సంబంధం అంటగట్టేవాడని, అతనికి ఉరిశిక్ష వేయించాలని గ్రామస్థులు పోలీసులను కోరారు.

రుణమాఫీపై నేడు రాష్టవ్య్రాప్త ఆందోళన
సిపిఐ రాష్టక్రార్యదర్శి రామకృష్ణ
తిరుపతి, జూలై 14: ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీమేరకు రైతులకు రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్టవ్య్రాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలోసోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరుణ్ జైట్లీ బడ్జెట్ యుపి ఎ ప్రభుత్వ ఆర్థిక విధానాల కొనసాగింపేనని ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులను యుపి ఏ 26శాతానికి పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎన్ డి ఏ ఏకంగా 49శాతం పెంచడానికి నిర్ణయం తీసుకుందన్నారు. దీనిని తాము తీవ్రంగా నిరసిస్తున్నట్లు చెప్పారు. రక్షణ, భీమా,విమానయానాలతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎఫ్ డి ఐ పెట్టుబడులకు బడ్జెట్‌లో ద్వారాలు తెరవడం దారుణమన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ప్రాధాన్యతా రంగాలన్నింటిలో కోత విధించారని వివరించారు. వ్యవసాయ రంగానికి 2013-14 బడ్జెట్‌లో 18,781 కోట్లు కేటాయిస్తే, 2014-15 బడ్జెట్‌లో 11,531కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు గత బడ్జెట్‌లో 1,93,443 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి 1,13,633 కోట్లు కేటాయించారని తెలిపారు. చేనేత రంగానికి గతంలో 594కోట్లు కేటాయించగా ఈసారి 321కోట్లే కేటాయించారని రామకృష్ణ వివరించారు. ఇలా అన్ని రంగాల్లోకోత విధించారని,అధిక జనాభా ఆధారపడివున్న ఆయా రంగాల కేటాయింపుల్లో కోతవిధించడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, పన్నుల మినహాయింపు, పరిశ్రమలస్థాన, ఉత్తరాంధ్రలో వెనుకబడిన మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు,నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణంపైన బడ్జెట్‌లో ప్రసక్తే లేదన్నారు. పేద,సామాన్య,కార్మిక,రైతు వ్యతిరేక బడ్జెట్‌గా, కార్పొరేట్ రంగాన్ని సంతోషపెట్టే బడ్జెట్‌గా ఉందని ఆయన వివరించారు.రుణమాఫీ విషయంలోరీ-షెడ్యూల్ అంటు కొత్త పల్లవిని చంద్రబాబు అందుకున్నారని వివర్శించారు. ఎవరికి రుణమాఫీ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏయే రుణాలు మాఫీ చేస్తారన్నది ఇంతవరకు స్పష్టం చేయలేదన్నారు.చండ్రరాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆగస్ట్ 9,10తేదీల్లో హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.11వతేదీన సుమారు 10వేలమందితో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలనున్నట్లు,ప్రజలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు ఈకార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈవిలేఖరుల సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.వెంకయ్య,చిన్నం పెంచలయ్య, మురళి,హరికృష్ణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

రూటు మార్చిన స్మగ్లర్లు
* పొలాలు, అటవీశాఖ గోడౌన్ల ఎర్రచందనంపై కన్ను
* జిడి నెల్లూరులో కాపలాదారులను కట్టేసి
ఎర్రచందనం చెట్లు నరుక్కెళ్లిన వైనం
చిత్తూరు, జూలై 14: పోలీసుల ఎత్తుగడలను స్మగ్లర్లు తిప్పికొడుతూ స్మగ్లింగ్ రూటు మార్చుతున్నారు. అడవుల్లో పోలీసుల కూంబింగ్‌లు ఎక్కువ కావడంతో వ్యవసాయ పొలాల్లో రైతులు పెంచుకుంటున్న ఎర్రచందనం చెట్లపై, అటవీశాఖ గోడౌన్లలోని దుంగలపై కనే్నస్తున్నారు. ఇటీవల తిరుపతి వైల్డ్ లైఫ్ కార్యాలయంలోని అటవీశాఖ గోడౌన్‌పై, మొలకల చెరువు, చిన్నగొట్టిగల్లు అటవీశాఖ గోడౌన్లలోని ఎర్రచందనం దుంగలను తరలించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా స్మగ్లర్లు తమ రూటు మార్చి తమ వ్యాపార కార్యకలాపాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్‌పి పిహెచ్‌డి రామకృష్ణ ఎర్రచందనం స్మగ్లర్ల ఏరివేత కార్యక్రమాన్ని ఒకవైపు ముమ్మరం చేస్తుండగా, మరోవైపు పోలీసులకే సవాల్ విసురుతూ పొలాల్లో, అటవీశాఖ గోడౌన్లలోని ఎర్రచందనంను స్మగ్లర్లు దోచుకువెళుతున్నారు. ఇప్పటికే 800 స్మగ్లర్ల జాబితాలను ఎస్‌పి రామకృష్ణ తయారుచేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన విషయం విదితమే. ఇందులో ఇప్పటికే పదుల సంఖ్యలో బడా స్మగ్లర్లతో పాటు 175 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు స్మగ్లర్లను పట్టుకునే పనిలో ఉండగా బడా స్మగ్లర్లు కొందరు అజ్ఞాతంలో ఉంటూ తమ అనుచరులు, కూలీలతో వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో జిడి నెల్లూరు మండలం చిత్తూరు -పుత్తూరు ప్రధాన రహదారిలో ఉన్న జయచంద్రనాయుడు మామిడి తోపులో సుమారు వంద ఏళ్లుగా ఉన్న ఎర్రచందనం చెట్లపై స్మగ్లర్ల కన్నుపడింది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది స్మగ్లర్లు తోపులో ప్రవేశించి అక్కడ కాపలాగా ఉన్న సాంబశివరావు, రాజేశ్వరి దంపతులను చెట్టుకు కట్టేసి బ్యాటరీ మిషన్‌తో నాలుగు టన్నుల బరువు కల్గిన నాలుగు భారీ ఎర్రచందనం వృక్షాలను నరుక్కుని వెళ్లారు. పోలీసులు ఎక్కువగా నిఘా పెంచిన ప్రతి పర్యాయం ఈ మార్గంలోని ఫామ్ హౌస్‌లు, మామిడి తోపుల్లో రైతులు పెంచుకునే ఎర్రచందనం చెట్లపై స్మగ్లర్లు కనే్నస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిడి నెల్లూరు మార్గంలో సిఎం రమేష్ ఫామ్ హౌస్‌లో ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని వెళ్లారు. అటవీశాఖ గోడౌన్లపైనే కాదు ఏకంగా అటవీశాఖ అధికారుల కార్యాలయాల్లో ఉన్న చెట్లను నరక్కువెళ్లిన సంఘటనలపై విచారణ జరుగుతున్నాయి. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలోని ఎర్రచందనం చెట్లను సైతం నరుక్కుని వెళ్లిన సంఘటనలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇలా పోలీసులను సవాల్ చేస్తూ స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను రూటు మార్చి కొనసాగిస్తున్న సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఏదిఏమైనా జిల్లాలో ఎక్కడపడితే అక్కడ విస్తారంగా ఉన్న ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి కొత్త కొత్త రూట్లలో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను ఒకవైపు ఏరివేస్తుండగా, మరో వైపు కొత్త స్మగ్లర్లు పుట్టుకొస్తున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి స్పష్టం అవుతోంది. చోటా మోటా స్మగ్లర్లను సైతం పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో కూలీలుగా ఉన్నవారు నేడు స్మగ్లర్ల అవతారం ఎత్తుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా రూటు మార్చుతున్న స్మగ్లర్లు పోలీసులకు సవాల్‌గా మారారని చెప్పక తప్పదు .
మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా
కొడవలి శివప్రసాద్ బాధ్యతల స్వీకరణ
* 34 బోర్లు మంజూరుకు తొలి సంతకం
* నూతన పాలకవర్గాన్ని అభినందించిన టిడిపి నేతలు
మదనపల్లె టౌన్, జూలై 14: మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా సోమవారం కొడవలి శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలో 34 చేతిబోర్లు వేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ తొలి సంతకం పెట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశ మందిరంలో నూతన పాలక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ ఛైర్మన్ కొడవలి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్‌గా తాను ఎన్నిక కావడం తనకు గర్వంగా వుందన్నారు. ఈ విజయం పార్టీ నాయకులు, కార్యకర్తలకే దక్కుతుందన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా వున్న విషయాన్ని దృష్టిలో వుంచుకుని సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 34 చేతిబోర్లను వేయనున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటి సరఫరా గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. అధికారులు మరింత నిబద్ధతతో పనిచేసి నీటి కొరత లేకుండా చూడాలన్నారు. పారిశుధ్ధ్యం నిర్వహణపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలన్నారు. వర్షాకాలం రానుండడంతో దోమలు ప్రబలకుండా ప్రతి రోజూ ఫాగింగ్ చేసేందుకు సిద్ధంగా వుండాలన్నారు. అలాగే మురికినీటి కాలువలను ప్రతి రోజూ శుభ్రం చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు అటువంటి ప్రాంతాలను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో తాను వార్డు పర్యటనలు చేపడతానని, ఆ సమయంలో లైట్లు ఏర్పాటు చేయలేదనిప్రజల నుంచి తనకు ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. సిమెంట్ రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలు విడతలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ భవానీప్రసాద్, తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు, టిడిపి నాయకులు గంగారపు రామ్‌దాస్‌చౌదరి, రాటకొండ బాబురెడ్డి, రాటకొండ మధుబాబు, డిఇ కరీముల్లా, నీలకంఠనాయుడు, టిపిఓ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో
వైభవంగా పుష్పయాగం
తిరుపతి, జూలై 14: అప్పలాయగుంటోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల ముగిసిన బ్రహోత్సవాల సందర్భంగా తెలిసి తెలియకుండా ఏవైనా పొరబాట్లు జరిగివుంటే వాటికి ప్రాయశ్చితంగా టిటిడి నిర్వహించే పుష్పయాగం సోమవారం అత్యంత వైభవంగా సాగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు టన్నుల బరువుకలిగిన 16 రకాల సుగంధ పుష్పాలను ఈ పుష్పయాగానికి వినియోగించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, 7గంటలకు వీధి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

కోరం లేక కెవిబిపురం ఎంపిపి ఎన్నిక వాయిదా
కెవిబిపురం, జూలై 14: కెవిబిపురం ఎంపిపి ఎన్నిక కోరం లేక మళ్లీ నిలిపివేసినట్లు ఎన్నికల అధికారి రాజు, ఎంపిడివో మోహన్ రావు తెలిపారు. సోమవారం జరిగిన ఎంపిపి ఎన్నిక ప్రక్రియ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. మండలంలోని 12 సెగ్మెంట్లలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో 10 స్థానాల్లో టిడిపి, 2 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపొందింది. మండలానికి ఎంపిపి పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ చేయడంతో 12 సెగ్మెంట్లలో ఒక కళత్తూరు సెగ్మెంట్‌కే ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఖరారైంది. దీంతో ఆ సెగ్మెంట్‌లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి సులోచన గెలుపొందింది. కానీ ఈనెల 4వ తేదీ, 5వ తేదీ జరిగిన ఎంపిపి ఎన్నికల్లోనూ, అదేవిధంగా 13, 14 తేదీ జరిగిన ఎంపిపి ఎన్నికల్లోనూ సరిపడు కోరం లేకపోవడంతో అధికారులు ఎంపిపిని ఎన్నిక చేయలేదు. దీంతో రిజర్వేషన్ స్థానంలో గెలిచిన ఎంపిపి అభ్యర్థి కోరం లేక ఎంపిపి కాలేకపోతోంది. అధికారులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదని నాలుగు సార్లు ఎన్నికల కోరం లేకుండా వాయిదా పడటం వలన సంబంధిత జిల్లా అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదికలు పంపించామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాజకీయ ఎత్తుగడలో భాగంగా కోట మంగాపురం సెగ్మెంట్‌లో గెలిచిన ఎ. విశ్వనాథ్ చేత రాజీనామా చేయించి ఆ నివేదికను కూడా అధికారుల ద్వారా జిల్లా అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి ఏమాత్రం టిడిపి నాయకులకు లొంగకపోవడం వలన జిల్లాలోనే కాకండా రాష్ట్రంలో కూడా కెవిబిపురం ఎంపిపి ఎన్నిక రసవత్తరంగా మారింది.
మున్సిపల్ కార్యాలయం వద్ద టిడిపి దిమ్మె కూల్చివేత
* వైఎస్‌ఆర్‌సిపి కౌన్సిలర్లపై కేసు నమోదు
మదనపల్లెటౌన్, జూలై 14: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్‌గా కొడవలి శివప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ దిమ్మెను ఏర్పాటుచేసి ఛైర్మన్‌తో ప్రారంభించేందుకు పనులు చేపట్టారు. అయితే ఈ విషయం తెలిసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అక్కడికి చేరుకుని దిమ్మె ఎలా కడతారంటూ కార్మికులపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చెప్పడం వల్లే తాము దిమ్మె నిర్మిస్తున్నామని నిర్మాణ కార్మికులు వైకాపాకు చెందిన కౌన్సిలర్లకు చెప్పడంతో ఆగ్రహించిన వారు దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయం తెలియడంతో పలువురు టిడిపి నాయకులు అక్కడి చేరుకున్నారు. అనంతరం కార్మికులపై దౌర్జన్యంచేసి దిమ్మెను కూల్చివేసిన వైకాపా కౌన్సిలర్లపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి’
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు బెదిరింపు రాజకీయాలను మానుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ కొడవలి శివప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు గంగారపు రామ్‌దాస్‌చౌదరి, రాటకొండ బాబురెడ్డి హితవు పలికారు. 40 ఏళ్ల మున్సిపల్ చరిత్రను తిరగరాసి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంతో ఓర్వలేని వైకాపా నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.

* ఆలస్యంగా వెలుగుచూసిన వైనం * పోలీసుల అదుపులో నిందితుడు
english title: 
m

వైద్యులు అంకితభావంతో పనిచేయాలి

$
0
0

* చినకాకాని వద్ద 120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి
* మంత్రి కామినేని శ్రీనివాసరావు
గుంటూరు , జూలై 14: వైద్యులు అంకితభావంతో పనిచేసి రోగుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లాకు విచ్చేసిన ఆయన గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పొదిలి ప్రసాద్ జింఖానా భవనం, పిల్లల, ప్రసూతి వైద్యసేవల విభాగాలు, అత్యవసర సేవా విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే పేదవారికి ప్రభుత్వాసుపత్రులు దేవాలయాలవంటివన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు 25 సంవత్సరాల క్రితం ఎంతో పేరు ప్రఖ్యాతులుండేవన్నారు. కాలానుగుణంగా
వైద్యరంగంలో వస్తున్న మార్పులతో వైద్యరంగంలో ప్రైవేటురంగం జోక్యంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి తన ఉనికిని కోల్పోయిందనే భావన కలుగుతుందన్నారు. ఇక్కడ వైద్యులు ఎంతో ప్రతిభ సామర్థ్యాలు గలవారని, శస్త్ర చికిత్సల్లో ప్రపంచ ఖ్యాతిగడించిన వారని, ఇదేపంథాతో నిర్విరామంగా కృషిచేసి ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సూచించారు. మాతా శిశుమరణాల తగ్గింపునకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందులో భాగంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి 20 కోట్ల రూపాయలను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో గరిష్ఠస్థాయిల్లో లభిస్తున్న వైద్యసేవలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆసుపత్రిలో సాంకేతిక పరిజ్ఞానం అభినందనీయమని కొనియాడిన మంత్రి పొదిల ప్రసాద్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటి, ఎంఆర్‌ఐ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించారు. చినకాకాని వద్ద 120 కోట్ల రూపాయలతో క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆసుపత్రి పర్యటనలో మంత్రి కామినేని వెంట రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపినాయక్, ఇతర విభాగాల ముఖ్యులు పాల్గొన్నారు.
జింఖానాలో సమావేశం...
ఆసుపత్రి పర్యటన ముగిసిన అనంతరం మంత్రి కామినేని శ్రీనివాసరావు అమరావతి రోడ్డులో గల ప్రభుత్వ జ్వరాల వైద్యశాల, అక్కడి సెంట్రల్ మెడిసెన్ స్టోర్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన అనంతరం మెడిసిన్ స్టోర్‌లో గల మందుల నిల్వ రికార్డులను పరిశీలించారు. గరిష్టంగా 6 మాసాలకు మించి మందులను నిల్వ చేయవద్దని, మందుల నిల్వలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పొందుపర్చి గడువుముగిసిన మందుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం గుంటూరు మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి ఇక్కడి జింఖానా ఆడిటోరియంలో వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యులు, ఇతర విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. ఆసుపత్రుల్లో గరిష్ఠస్థాయిలో సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు కల్పించినప్పటికీ మాతా శిశు మరణాలు తగ్గించలేక పోవడానికి గల కారణాలపై ఆరాతీశారు. ఇదేక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వైద్యసేవలు అందించే విధంగా రూపొందించిన ప్రణాళికలపై అధ్యయనం చేశారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘాల సమావేశాలు, ఆసుపత్రుల్లో ఖరీదైన మందుల సదుపాయాల కల్పన, ప్రజల్లో ప్రభుత్వ వైద్యసేవల పట్ల విశ్వాసం కలిగేలా చర్యలు తదితరాంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వాసుపత్రికి నాలుగేళ్లుగా గైనకాలజిస్ట్ లేరని, ఆ పోస్టును త్వరగా భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వైద్యసేవలకై వచ్చే రోగుల సంఖ్య అధికమని, ఇదే స్థాయిలో ఇక్కడ సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ పిడుగురాళ్ల ప్రాంతంలో ఎమెర్జన్సీ ట్రామాకేర్ ఆసుపత్రిని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయాలని కోరారు. పల్నాడు ప్రాంతంలో ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవిస్తే అందుబాటులో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి వరకు క్షతగాత్రులు విలవిల్లాడుతూ రావాల్సి వస్తోందని, కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ట్రామాకేర్ ఆసుపత్రి అవసరముందని మంత్రిని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్, వైద్యారోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గృహిణి ఆత్మహత్య
* భర్త పరిస్థితీ విషమం

దాచేపల్లి , జూలై 14 : దాచేపల్లి పట్టణంలోని భవ్య పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గుండా నరసింహారావు(50) రాజ్యలక్ష్మి(45) దంపతులు సోమవారం శీతల పానియంలో పురుగుమందు కలుపుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మి మృతి చెందగా, నరసింహారావు పరిస్థితి విషమంగా వుంది. వివరాలు ఇలా వున్నాయి. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన గుండా నరసింహారావు గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక భవ్య పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెట్రోలు బంకు సమీపంలోనే తన భార్యతోకలసి నివాసం వుంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నప్పటికి వారు ఉద్యోగ రీత్యా వేరే పట్టణాల్లో నివాసముంటున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం బాగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా భార్యభర్తలు పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడివున్నారు. వీరిద్దరిని చికిత్స నిమ్మిత్తం స్థానిక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించగా రాజ్యలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందిది. కాగా నరసింహారావు పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన చికిత్సకోసం పిడుగురాళ్ళ తరలించారు. కాగా ఈసంఘటనపై దాచేపల్లి ఎస్‌ఐ వై కోటేశ్వరరావు విలేఖర్లతో మాట్లాడుతూ దంపతుల ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు జరిగి ఆత్మహత్యా కారణాలను వెలికితీస్తామని చెప్పారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిఎస్‌గా సురేష్‌కుమార్
గుంటూరు (సిటీ), జూలై 14: జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ బదిలీ అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ సిసిఎల్‌ఎ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కాంతిలాల్‌దండే నియమితులయ్యారు. ఆయన ఈనెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. బదిలీ అయిన కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మంగళవారం విధుల నుంచి రిలీవ్ కానున్నారు. కొత్త కలెక్టర్ నియమితులయ్యే వరకు జెసి వివేక్‌యాదవ్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. బదిలీని పురస్కరించుకుని కలెక్టర్ సురేష్‌కుమార్ సోమవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి తన వంతు బాటలు వేశానని, జిల్లా పాలనలో తన రెండేళ్ల పయనంలో ఎంతగానో ప్రోత్సహించిన మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రాజకీయంగా ఎంతో చారిత్రాత్మక ప్రాచుర్యం కల్గిన గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించడంలో అధికారులకు మీడియా పూర్తి సహకారం అందించిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించ లేకపోయానని ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలు గానీ, ఆర్థిక పరమైన ఇబ్బందులు గానీ కారణాలు లేకపోలేదని అన్నారు. ప్రత్యేక అధికారి హోదాలో కార్పొరేషన్ అభివృద్ధికీ బాటలు వేయగలిగానన్నారు. గత ఏడాది కాలంగా కార్పొరేషన్ ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజాప్రతినిధుల పాలనలో ఆదాయ వ్యవస్థ గాడిన పడుతుందని అభిప్రాయపడ్డారు. నీలం, లైలా, పైలాన్ వంటి తుఫాన్‌లను జిల్లా యంత్రాంగం సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. అధికారుల పనితీరు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎంతో భేష్ అని ప్రశంసిస్తూనే జిల్లాలో అవినీతిని వీలైనంతమేర అరికట్టగలిగామని కితాబిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తనవంతు సహకారం తప్పక ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు అధికారుల వీడ్కోలు...
బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్‌కు జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం సాయంత్రం రెవెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు ఎదురైన ఆటంకాలను కలెక్టర్ ఏ విధంగా ఎదుర్కోవాలో సూచనలందిస్తూ తమకు మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రతిపక్ష నేతల మాటలు నమ్మకండి..
రైతుల రుణమాఫీ చేసి చూపిస్తాం

* ప్రజల భాగస్వామ్యంతో ఏపీని సింగ్‌పూర్‌గా మారుస్తాం
* రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు

నూజెండ్ల, జూలై 14: ప్రతిపక్ష నేతల మాటలు నమ్మకండి.. రైతుల రుణమాఫీ చేసి చూపిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మండలంలోని ఐనవోలు గ్రామం నుండి ప్రకాశం జిల్లా కురుచేడు వెళ్లే ఆర్‌అండ్‌బి రహదారికి 6.60కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. తొలుత గ్రామస్థులు, టిడిపి నాయకులు, మహిళలు మంత్రి రాఘవరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు తీన్‌మార్ బ్యాండు, బాణసంచా పేలుస్తూ, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేశారన్నారు. విభజనతో తెలంగాణాకు ఆస్తులు పోగా, ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు మిగిలాయన్నారు. ప్రజలు బాగస్వామ్యులైతే రాష్ట్రాన్ని మరో సింగపూర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా మారి రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్లు బాగున్నప్పుడే ప్రయాణానికి సులువుగా ఉండడమే కాకుండా ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. చింతలచెరువు నుండి నూజెండ్లకు రింగ్ రోడ్డు, ఐనవోలు, కంభంపాడు మీదుగా గురప్పనాయుడుపాలెం గ్రామం వరకు లింక్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఆర్టీసి సంస్థ రోజుకు 2.70 కోట్ల రూపాయలు నష్టాలతో నడుస్తోందన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులతో కూడా పనులు చేయిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. వెనుకబడిన నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి రాఘవరావు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రజలు నుండి వచ్చిన అర్జీలను మంత్రికి అందజేశారు. ప్రజలు అందించిన ఆర్జీలను పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొమ్మా ఉమాదేవి, జడ్‌పిటిసి మురుగుల ఆదెమ్మ, గ్రామ సర్పంచ్ రాయల శేషమ్మ, ఎంపిటిసి పి అంజమ్మ, టిడిపి నాయకులు మేడం రమేష్, వంకాయలపాటి పేరయ్య, కొమ్మా వెంకటేశ్వర్లు, కొమ్మా శ్రీను, రావుల మల్లేశ్వరరావు, బొట్ల అంజయ్య, బచ్జు అంజిరెడ్డి, రావుల బుజ్జి, గంగినేని వెంకటేశ్వర్లు, ముండ్రు సుబ్బారావు, ముండ్రు హనుమంతరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాధాకృష్ణ, డిఇ మురళీకృష్ణ, ఎఇ గణేష్, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపిడివో మేకా సుబ్బారావు, ఈవోపిఆర్‌డి జిలానీ బాషా, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
లారీ బోల్తా:స్తంభించిన ట్రాఫిక్
అమరావతి, జూలై 14: మండల కేంద్రమైన అమరావతి నుంచి ఇసుక లోడ్‌తో గుంటూరు వైపు వెళ్తున్న లారీ మార్గమధ్యలో నరుకుళ్లపాడు గ్రామ నడిబొడ్డున ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఆ సమయంలో రోడ్డుపక్కన ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నరుకుళ్లపాడు నుండి అమరావతి వరకు, మరోవైపు యండ్రాయి వరకు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మధ్యాహ్నం 4 గంటలకు జెసిబి సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
మోటారుబైక్‌దొంగలఅరెస్ట్
* 9 బైక్‌లు, బంగారపు ఆభరణాల స్వాధీనం
పెదకూరపాడు, జూలై 14: గుంటూరుకు చెందిన ఆరాధ్యుల రాఘవ, ప్రకాశం జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన చింతం సిసింద్రి (ద్రోణ) కలిసి కనిగిరి, గుంటూరు లాలాపేట, పొదిలి ప్రాంతాల్లో 4 లక్షల రూపాయల విలువైన 9 మోటారు బైకులు చోరీ చేశారు. వీరిద్దరూ తాడేపల్లిలో కలిసి ఆర్‌కె క్యాటరింగ్‌లో పనిచేస్తున్నారు. ఈనెల 4వ తేదీ క్యాటరింగ్ పనిలో భాగంగా అమరావతికి వచ్చారు. గుంటూరు లాలాపేటలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి వస్తూ అమరావతి మండలంలోని లింగాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్కూల్ టీచర్ అన్నం వేణుకుమారి మెడలో బంగారు చైన్‌లను లాక్కుని ఉడాయించారు. వీరు పరస గ్రామ పొలాల్లో ద్విచక్ర వాహనం ఆపి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెదకూరపాడు ఎస్‌ఐ నక్కా ప్రకాశరావు అదుపులోకి తీసుకుని, తనదైన శైలిలో విచారించగా చోరీల గుట్టు ర ట్టైంది. చోరీ చేసిన 9 మోటారు బైకుల తోపాటు, బంగారపు చైనును స్వాధీ నం చేసుకున్నారు. సోమవారం నిందితుల వివరాలను పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అమరావతి సిఐ హనుమంతరావు ఎస్‌ఐ సాంబశివరావు, పెదకూరపాడు ఎస్‌ఐ ప్రకాశరావులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ హనుమంతరావు మాట్లాడుతూ గత మూడు మాసాలు గా చోరీకి గురైన 47 మోటారు బైకుల ను ఎస్‌ఐ ప్రకాశరావు పట్టుకున్నారని అభినందించారు. తాజాగా స్వాధీనం చేసుకున్న 9 బైకుల విలువ 4 లక్షలు, బంగారపు చైను విలువ మరో లక్షకు పైగా ఉంటుందని ఉంటుందన్నారు. వీ రితో పాటు రత్నరాజు, చంద్రమోహన్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, రవి, లక్ష్మీనారాయణ, నాగరాజు, రోశయ్య, రమేష్, కమర్‌బాషా, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వైసీపీ అంతర్గత విభేదాలకు అద్దంపడ్తున్న ఎన్నికలు: మన్నవ
గుంటూరు (కొత్తపేట), జూలై 14: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు స్థానిక సంస్థల ఎన్నికలే అద్దంపడ్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మన్నవ సుబ్బారావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, వైఎస్‌ఆర్ సిపి నేతలు చేసిన అసత్యారోపణలను ఖండిస్తున్నామన్నారు. ముప్పా ళ్ల ఎంపిటిసి సభ్యులను అంబటి రాం బాబు తీవ్రంగా భయాందోళనకు గురిచేసి వారి స్వేచ్ఛను హరించి, అభిప్రాయాలకు భిన్నంగా ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒక్కో ఎంపిటిసి సభ్యునికి 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రజలను అవినీతి డబ్బుతో కొనాలని, ప్రలోభాలకు గురిచేయాలని చూస్తే భంగపాటు తప్పదన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి మాట్లాడుతూ అధికార, ధనదాహం, పదవీకాంక్షతో హింస, విధ్వంసాలను ప్రోత్సహించాలని వైఎస్ జగన్మోహనరెడ్డి తండ్రిని మించిన తనయుడన్నారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు చంద్రగిరి ఏడుకొండలు, షేక్ లాల్‌వజీర్, కసుకుర్తి హనుమంతరావు, గుడిమెట్ల దయారత్నం, పప్పుల దేవదాసు, గడ్డిపాటి రాంబాబు, నల్లమేకల సంగమేశ్వరరావు, సగ్గెల రూబెన్, ముప్పాళ్ల మురళి, షేక్ చినబాజి, లంకామాధవి తదితరులు పాల్గొన్నారు.
భర్త చేతిలో భార్య దారుణహత్య
మంగళగిరి, జూలై 14: మండల పరిధిలోని కాజగ్రామంలో ఆదివారం రాత్రి పావులూరి స్వప్న (30) అనే వివాహిత భర్త చేతిలో దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం అమృతలూరుకు చెందిన విజయకృష్ణకు 2002లో స్వప్నతో వివాహమయింది. ఈ దంపతులకు ఒక కుమారుడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో స్వప్న భర్తతో విభేదించి కాజలోతల్లితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి స్వప్న ఉంటున్న ఇంటికి వచ్చిన భర్త ఆమెతో గొడవపడి రోకలిబండతో తలపై కోట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇరుగుపొరుగు చేరి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ స్వప్న మృతిచెందింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ ఎం మధుసూదనరావు, ఎస్సై సత్యనారాయణ పరిశీలించి వివరాలు ఆరాతీసి నమోదుచేసుకున్నారు.

పొన్నూరు ఎంపిపి సీతమ్మకు యడ్లపాటి ఆశీస్సులు
పొన్నూరు, జూలై 14: పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైన బొర్రు సీతమ్మ టిడిపి కార్యకర్తలు, అభిమానులు తోటి ఎంపిటిసిలతో కలిసి సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపిపి ఛాంబర్‌లోని తన స్థానంలో ఆమె కూర్చుకున్నారు. ఎంపిపి పీఠంపై కూర్చున్న బొర్రు సీతమ్మను రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావ్, స్థానిక ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు తదితరులు అభినందనలు తెలిపారు. మండలంలోని సమస్యలను తీర్చి అభివృద్ధి పథంలో నడిపించేందుకు శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలోని దివంగత ఎన్‌టిఆర్, మాజీ మంత్రి వీరయ్యచౌదరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని పలు గ్రామాల నుండి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపిపి సీతమ్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోటా శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు జి సునీత, దేశం పార్టీ నాయకులు మాదల వెంకటేశ్వర్లు, రామారావు, కుర్రా వీరయ్యచౌదరి, బి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
వాటర్ ట్యాంకు నిర్మాణానికి మంత్రి రావెల శంకుస్థాపన
చేబ్రోలు, జూలై 14: వట్టిచెరుకూరు మండల పరిధిలోని చమళ్లమూడి గ్రామంలో సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు 22 లక్షల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించతలపెట్టిన వాటర్ ట్యాంకు ద్వారా గ్రామంలో ప్రజలందరికీ తాగునీరు సౌకర్యం కల్పించబడుతుంది. ఈ సందర్భంగా మంత్రి రావెల మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానన్నారు. అలాగే గ్రామీణప్రాంతాల్లో వౌలిక వసతులు కల్పించి ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎస్‌ఐపై మంత్రి ఆగ్రహం...
వట్టిచెరుకూరు ఎస్‌ఐ ప్రసాదరెడ్డిపై మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోవెలమూడి గ్రామంలో గల దేవాదాయశాఖకు చెందిన చెరువులో మట్టితోలి అమ్ముకున్నారని, దీనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదునిచ్చినప్పటికీ పట్టించు కోలేదని, కోవెలమూడికి చెందిన కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో ఎస్‌ఐ టిడిపి కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని మంత్రికి ఫిర్యాదుచేశారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన మంత్రి రావెల ఎస్‌ఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాక ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే కోవెలమూడి దేవాదాయశాఖ చెరువులో మట్టితవ్వి అమ్ముకుంటే ఏం చేస్తున్నావని ఆలయ ఇఒ అచ్చిరెడ్డిపై కూడా మంత్రి రావెల మండిపడ్డారు. అంతేకాక పాసు పుస్తకాలు పంపిణీలో జాప్యం జరుగుతుందని ఫిర్యాదులు రావడంతో తహశీల్దార్ వెంకటేశ్వరరావును మంత్రి మందలించారు.

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడమే ధ్యేయం
*రవాణా శాఖా మంత్రి రాఘవరావు
ఈపూరు, జూలై 14: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని రాష్ట్ర రవాణా, రోడ్డు, భవనాల శాఖా మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మండలంలోని కొచ్చెర్ల, అంగలూరు గ్రామాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కొచ్చెర్ల గ్రామంలో కొచ్చెర్ల నుండి ఉప్పరపాలెం వరకు రోడ్డు మార్గానికి మంత్రి రాఘవరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అంగలూరు గ్రామంలో 18.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వినుకొండ-కారంపూడి రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గ్రామంలోని పశువైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, విడదీసి మనలను కష్టాలపాలు చేశారన్నారు. బాధల్లోనూ బతుకుతెరువు వెతుక్కున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించడానికి చంద్రబాబు నడుంకట్టారన్నారు. మంత్రి పదవి ముళ్లకిరీటమని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి తాను శాయశక్తుల కృషి చేస్తామన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రజల ఆదరాభిమానాలే టిడిపికి శ్రీరామరక్ష అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటింది ఎన్టీఆర్ అన్నారు. అంబేద్కర్, పూలే, గాంధీ ఆశయాలని అందరూ ఆచరణలో పెట్టాలన్నారు. రైతుల రుణమాఫీ తప్పని సరిగా చంద్రబాబునాయుడు త్వరలో ప్రకటిస్తారన్నారు. టిడిపి పాలనలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పేద నియోజకవర్గమైన వినుకొండ అభివృద్ధికి మంత్రి సహకారం కావాలని ఆయన కోరారు. మండలాలను కలుపుతూ రింగ్‌రోడ్డులను వేయాలన్నారు. ఈపూరు ఎంపీపీ రాపర్ల రామాంజమ్మ మండలంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాను కొత్తగా నిర్మించాలని, రోడ్ల నిర్మాణం చేయాలని, ఎంపీడివో కార్యాలయానికి నూతన భవన నిర్మాణాలను చేపట్టాలని పలు వినతులతో కూడిన పత్రాలను ఆమె మంత్రికి అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ బందెల కన్నయ్య, ఎంపీటీసీ వీరాంజనేయులు, టిడిపి మండలాధ్యక్షుడు రాపర్ల జగ్గారావు పలు గ్రామాలు సర్పంచ్‌లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యపై దృష్టిపెట్టాలి
* ఎమ్మెల్యే ఆలపాటి
తెనాలిటౌన్, జూలై 14: పట్టణంలో శాంతిభద్రతలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో ట్రాఫిక్ సమస్యలపైన దృష్టి పెట్టాలని, సామాన్యులు సైతం పోలీస్ స్టేషన్ ద్వారా తమకు రక్షణ లభిస్తుందనే నమ్మకాన్ని పెంచుకునేలా విధి విధానాలు మెరుగు పర్చుకోవాలని ఎమ్మెల్యే ఆలపాటి పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం రాత్రి స్థానిక కొత్తపేటలోని ట్రావెలర్స్ బంగళాలో ఎమ్మెల్యే ఆలపాటి పోలీస్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. డిఎస్పీ టిపి విఠలేశ్వర్ శాఖాపరంగా చేపడతున్న చర్యలను వివరించారు.ట్రాఫిక్ నియంత్రణకు మున్సిపల్ శాఖ సమన్వయంతో పలు మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే అలపాటి సూచించారు. సుమారు గంటకు పైగా అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే ఆలపాటి అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ సమావేశ సారాంశాన్ని వివరించారు. పట్టణ సిఐలు కమలాకర్, లక్ష్మయ్య, అజీజ్, మురళీకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.

అభివృద్ధికి పెద్దపీట
* ఎమ్మెల్యే ఆలపాటి
తెనాలిటౌన్, జూలై 14: తెనాలిలో ఆర్యవైశ్యుల ఆశయాలకు అద్దం పట్టే రీతిలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి, శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు సత్కార సభ ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను వెండి కిరీటంతో, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఘనంగా సత్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాస్‌ను దేవస్థాన కమిటి ఘనంగా సత్కరించింది. కౌనె్సలర్లు వెంకట్రావ్, సుబ్బారావు, వైస్‌చైర్మన్ మాదల కోటేశ్వర్రావు, జిడిసిసి బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికే సహకార సంఘాలు
*జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని
చెరుకుపల్లి, జూలై 14: రైతు సంక్షేమం కోసం సహకారం సంఘాలు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయని వాటిని గ్రామీణ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిడిసిసి బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య అన్నారు. మండల పరిధిలోని నడింపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో రైతులకు అధిక మొత్తంలో రుణాలు అందజేసేందుకు సహకార బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకొనేందుకు గిడ్డంగుల నిర్మాణాలకు కూడా రుణాలు అందించేందుకు అవకాశం ఉందన్నారు. ఈఅవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సహకారం సంఘం అధ్యక్షుడు భూషడపు దుర్గాప్రసాద్, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ పిట్టు శ్రీనివాసరెడ్డి, కోపరేటివ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన్, మాజీ ఎంపిపి చెన్నుకోటేశ్వరావు, సంఘ కార్యదర్శులు కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* చినకాకాని వద్ద 120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి * మంత్రి కామినేని శ్రీనివాసరావు
english title: 
kaminei

ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలిపే బిల్లుకు ‘రాజ్య’ముద్ర

$
0
0

* అఖిలపక్షం ఆందోళన చేసినా ఆగని వైనం
* జిల్లాలో మిన్నంటిన ఆందోళనలు
ఖమ్మం, జూలై 14: ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పునర్ వ్యవస్థీకరణ బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. గత శుక్రవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లును యథాతథంగా రాజ్యసభ కూడా ఆమోదించటంతో ఖమ్మం జిల్లాలోని కూనవరం, విఆర్ పురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగానూ, భద్రాచలం పట్టణం మినహా మండలంలోని అన్ని గ్రామాలతో పాటు బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. పార్లమెంట్ ఆమోదం తెలపటంతో రాష్టప్రతి ఆమోద ముద్ర పడిన వెంటనే ఈ గ్రామాలన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు మారనున్నది. ప్రస్తుతం 46మండలాలతో ఉన్న ఖమ్మం జిల్లా ఇక నుంచి 40మండలాలతో ఉండే అవకాశం ఉంది. భద్రాచలం గ్రామ పంచాయతీని టెంపుల్ టౌన్‌గా చేయటం ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలవరం ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒక వైపు ఆందోళనలు జరుగుతుండగానే, మరో వైపు రాజ్యసభలో చర్చ జరగటం గమనార్హం. అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నేతలు భారీ స్థాయిలో ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించేందుకు ప్రయత్నించినప్పటికీ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు పోలవరం ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని వామపక్షాలు చేసే డిమాండ్లను చేయటం గమనార్హం. కాగా రాజ్యసభ ఆమోదంతో జిల్లాలో ఒక్క సారిగా ఆందోళనలు మిన్నంటాయి. అనేక చోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. రాజ్యసభ ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని 211రెవెన్యూ గ్రామాల పరిధిలోని 34వేల కుటుంబాలు 1,16,796మంది ప్రజలు, 3,267 హెక్టార్ల అటవీ భూమి ఆంధ్రప్రదేశ్ పరం కానున్నది. అయితే ఇరు రాష్ట్రాల సరిహద్దులు కొన్ని గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడుతున్న కొన్ని గ్రామాల ప్రజలు తమ రాష్ట్ర, జిల్లా కేంద్రాలకు వెళ్ళాలంటే కచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల ప్రజలు తమ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏటపాక, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలను దాటి వెళ్ళాల్సి ఉంది. ఈ విషయంపై ఎవరు స్పష్టమైన వైఖరిని చెప్పకపోవటంతో ఈ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడు మండలాల ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఏడు మండలాలపై దృష్టి సారించకపోవటం విమర్శలకు తావిచ్చింది. సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎటువంటి అభివృద్ధి పనులు ఈ మండలాలకు జరిగిన దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ మండలాలు తెలంగాణలో ఉంచేందుకు ప్రయత్నిస్తామంటూనే ఈ మండలాల పరిధిలో మద్యం దుకాణాలకు వేలం వేయలేదు. అలాగే సంక్షేమ కార్యక్రమాలను సైతం నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు ఆంధ్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు వేలం వేసినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం నిలిపివేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందటంతో ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం లేదని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ప్రభుత్వం ఒరిస్సాలో ఉన్న ముంపు ప్రాంతాన్ని కూడా కలపాలని కోర్టుకు వెళ్ళనున్నట్లు వెల్లడించారు.

ఓపెన్‌కాస్టులలో స్తంభించిన ఉత్పత్తి
ఇల్లెందు, జూలై 14: గత రెండు రోజులుగా చెదురుమదరుగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్టు మైన్స్‌లలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆంటకాలు ఏర్పడుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం సాయంత్రం వరకు వర్షపు జల్లులు పడుతుండడం వల్ల ఓపెన్‌కాస్టులలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. సింగరేణి సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే ఓపెన్‌కాస్టులలోనే అధికంగా బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. మొన్నటి వరకు ఎండల కారణంగా కార్మికుల గైర్హజరుతో ఉత్పత్తికి అంతరాయం కలగడంతో ఆశించిన మేరకు బొగ్గు ఉత్పత్తి జరగలేదు. తాజాగా వర్షాల కారణంగా ఓపెన్‌కాస్టు మైన్స్‌లలో బొగ్గు ఉత్పత్తికి ఆంటకాలు ఏర్పడడం గమనార్హం. ఓసిలలోని భూగర్భం నుండి వెలువడే నీటికి తోడు వర్షపు నీరు చేరడంతో నీటి నిల్వలు అధికం కావడం వల్ల బొగ్గు ఉత్పత్తి చేసే పరిస్థితులు లేకుండాపోయాయి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అదనంగా చేరుకున్న నీటి నిల్వల వల్ల ఓపెన్‌కాస్టు మైన్స్‌లలో బొగ్గు ఉత్పత్తికి అవరోధంగా మారాయి. రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా కురిస్తే ఓపెన్‌కాస్టులలో రోజుల తరబడి బొగ్గు ఉత్పత్తి స్తంభించే అవకాశం ఉంది. దాని ఫలితంగా సింగరేణి సంస్థకు వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి ద్వారా లాభాలు రాకపోగా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగనందున నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

ముగిసిన లాంఛనం...సీమాంధ్రకు మన్యం
భద్రాచలం, జూలై 14: ఓ లాంఛనం ముగిసింది. సీమాంధ్ర నేతల పంతం నెగ్గింది. పోలవరం ఆర్డినెన్స్‌కు పెద్దల సభ రాజ్యసభలోనూ ఆమోద ముద్ర లభించడంతో మన్యంలోని ఏడు ముంపుమండలాలు సీమాంధ్రపరం అయ్యాయి. సోమవారం రాజ్యసభలో ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిందన్న వార్త వెలువడటంతో మన్యంవాసులు మరింత కృంగిపోయారు. ఇదిలా ఉంటే అఖిలపక్షం, టిజెఏసి ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాకు తెలంగాణకు చెందిన ఎంపీలతో పాటు త్రిపుర, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎంపీలు సైతం హాజరై ఆర్డినెన్స్ అన్యాయమంటూ గొంతెత్తారు. అయినా ఫలితం దక్కలేదు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు, సీమాంధ్ర ఎంపీలు ఏకమై ఆర్డినెన్స్‌కు ఆమోదం సాధించారు. ఇక గెజిట్ రావడమే తరువాయి. భద్రాచలం పట్టణం మినహా మండలం మొత్తం, కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడులోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. ఎంపీలు గుప్తా సుఖేందర్‌రెడ్డి, జి హన్మంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెరాస ఎంపీలు కవిత, వినోద్ తదితర 15 ఎంపీలు జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమంటూ నినదించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధవౌతున్నట్లు నిర్వాసితుల పక్షాన వారి ఉద్యమాలకు బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ముంపుమండలాలను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించేలా తుది వరకు పోరాడుతామని వారు హామీ ఇచ్చారు. ఆందోళన చేసేందుకు వెళ్లిన భద్రాచలం మన్యంలోని అఖిలపక్షం, టిజెఏసి నేతలంతా రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభించిందన్న వార్తతో ఖంగుతిన్నారు. తీవ్ర కలవరం చెందారు. ఆదివాసీలను జల సమాధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకోవడం విచారకరమని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టిజెఏసి నేత చల్లగుళ్ల నాగేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ, గుండి శరత్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల కోణం నుంచి ఎన్డీఏ సర్కారులోని ప్రజాప్రతినిధులు చూడకపోవడం దురదృష్టకరమని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు చేసే చెడును నిపుణులు, పర్యావరణ వేత్తలు వివరిస్తున్నా ప్రభుత్వాలు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇటువంటి ప్రభుత్వాలకు ప్రజాక్షేత్రంలో ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
* జేసీ సురేంద్రమోహన్
ఖమ్మం రూరల్, జూలై 14: తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. సోమవారం జలగంనగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ‘మన ఊరు..మన ప్రణాళికలు’ అన్న అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణాలో అందులోనూ ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ అడవులు తరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు తరిగిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అన్నారు. ప్రణాళికలు రూపొందించడంలో మొక్కల పెంపకానికి ప్రత్యేక స్థానం కల్పించాలని జేసి సూచించారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆమోదయోగ్యమైన నిధుల కేటాయింపుకే ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమన్వయంతో గ్రామ స్థాయిలో నిర్ధిష్ట ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విద్య, వైద్యం, ఉపాధి, వౌలిక వసతులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో సమావేశాలో ఏర్పాటు చేసి ఆరోగ్య ప్రణాళికను రూపొందించాలన్నారు. పాఠశాలల్లో వసతులు, ఉత్తీర్ణతాశాతం, సిబ్బంది కొరత, బడి బయటి పిల్లలు తదితర అంశాలపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని వెలికితీసి సమగ్ర రూపకల్పన చేయాలని సూచించారు. ఏయే గ్రామాలలో స్మశానవాటికలకు స్థలాలు లేవో గుర్తించాలని, పాఠశాలల్లో ఆట స్థలాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అనుసంధానం, తాగునీటి అవసరాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు గ్రామీణ పరిస్థితులపై సమగ్ర ప్రణాళికలు రొపొందించి మండల, జిల్లా కేంద్రాలలో సమర్పించాలన్నారు. ఈ ప్రణాళికలు రానున్న బడ్జెట్‌లో జిల్లాకు నిధులు కేటాయించే విషయంలో ప్రధాన భూమిక పోషిస్తాయని జేసి అన్నారు. అధికారులు ఈదిశగా ప్రజాప్రతినిధులను చైతన్యపర్చి మన ఊరు..మన ప్రణాళికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి స్వరూపారాణి, డిఎఫ్‌ఓ సతీష్, తహశీల్దార్ శ్రీనివాసరావు, డిటి శ్రీనివాసరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారుల బృందం గ్రామ సందర్శన
* ప్రజా సమస్యలను గుర్తించేందుకు కసరత్తు
జూలూరుపాడు, జూలై 14: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని క్షేత్ర స్థాయి నుంచి సమస్యలను గుర్తించి, పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు బృందం గ్రామాలను సందర్శించారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని శివారు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గుర్తించాల్సి ఉంది. వీటితో పాటు అధికారులు కూడా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలో పొందుపరచాల్సి ఉంది. ఇందు కోసం నియమింపబడిన ప్రత్యేక అధికారులు ఉదయానికే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయా గ్రామాలకు చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ రెవిన్యూ అధికారులు,రెవిన్యూ సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సాక్షరతా భారత్ సమన్యయ కర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు గ్రామాలల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసారు. వీరితో పాటు ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పంచాయతీ వార్డు సభ్యుల సమన్వయంతో పల్లెల్లో సమస్యలను గుర్తించే పనిలో అధికారులు, ఉద్యోగులు పడ్డారు. ప్రజలు కూడా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నారు. జనావాసాల మద్య సైడ్‌డ్రైన్‌లు లేక కొద్ది పాటి వర్షానికే మురుగు నీరు నిల్వ ఉండటం, అంతర్గత రహదారులన్నీ చిత్తడిగా మారటం, అక్కడక్కడా వీధి దీపాలు వెలగక పోవడం వంటి చిన్న చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంతే కాకుండా పింఛన్లు,రేషన్‌కార్డులు,పక్కాగృహాలు కూడా ఇప్పించాలని పలువురు కోరారు. అధికారుల బృందం గ్రామాల్లో బురదలోనే తిరిగి ప్రణాళికను తయారు చేసేందుకు ముమ్మర కసరత్తులు చేసారు.జూలూరుపాడులో ఎంపిడిఓ కె.రాజేశ్వరి, పాపకొల్లులో వ్వవసాయశాఖాధికారి ఎన్.తిరుపతి రెడ్డి,కొమ్ముగూడెంలో హౌసింగ్ ఎ.ఈ వెంకటేశ్వరరావు,గుండెపుడిలో ఎంఈఓ కె.శ్రీనివాసరావు,ఐకెపి ఎపిఎం అశోకరాణి, మాచినేనిపేట తండాలో పశువైద్యాధికారి బి.బద్దూలాల్, అనంతారంలో వైద్యాధికారి పి.వినోద్, పడమట నర్సాపురంలో ఏపిఓ జమీర్‌పాషా,ఈజిఎస్ ఈసి వెంకటేశ్వర్లు అధికారులు సర్వే నిర్వహించారు.

షెడ్యూల్డ్ ప్రకారం ‘మన ఊరు మన ప్రణాళిక’ నిర్వహించాలి
*జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్
ఖానాపురం హవేలి, జూలై 14: మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని షెడ్యూల్డ్ ప్రకారం నిర్వహించాలని, మన ఊరు మన ప్రణాళిక జిల్లా మానిటరింగ్ సెల్ నిర్వాహకులకు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మన ఊరు మన ప్రణాళిక జిల్లా స్థాయి పర్యవేక్షణ సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం రోజు వారిగా నిర్దేశించిన ప్రకారం జరుగుతుందోలేదో తెలుసుకోవాలన్నారు. అనివార్య కారణాల వల్ల కార్యక్రమం షెడ్యూల్డ్ ప్రకారం జరగకపోతే దానికి సంబంధించిన కారణాలను మండల ప్రత్యేకాధికారుల ద్వారా తెలుసుకోవాలన్నారు. కార్యక్రమం నిర్వహణ సమయంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులకు ఏ విధమైనా సమాచారం అందించాలో తెలుసుకొని సంబంధిత సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. జిల్లా స్థాయి మానిటరింగ్ సెల్‌కు వెంటనే అంతర్జాల సౌకర్యం కల్పించి ల్యాండ్ ఫోన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీసిఇవో జయప్రకాశ్ నారాయణ, డ్వామా పిడి వెంకటనర్సయ్య, సిపివో రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
* జిల్లా ఎస్పీ ఎవి రంగనాథ్
ఖమ్మం(గాంధీచౌక్), జూలై 14: ప్రజా సమస్యలపై నిర్వహిస్తున్న ప్రజాదివస్‌లో ప్రజలు ఇచ్చిన విన్నపాలను క్షుణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎవి రంగనాథ్ ఆదేశించారు. ప్రజాదివస్ కార్యక్రమంలో ప్రజల పలు సమస్యలపై పోలీసులను ఆశ్రయిస్తున్నారని వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కేసును త్వరగా ఛేదించేందుకు ప్రయత్నించాలని అన్నారు. ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చెందిన అర్జున్ తన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో కొంతభాగం నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారని, అడిగితే బెదిరిస్తున్నాడని ఎస్పీకి విన్నవించటంతో డాక్యుమెంట్ వాస్తవాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని ముదిగొండ ఎస్‌ఐకు ఆదేశించారు. అలాగే దుమ్ముగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త అదనపు కట్నం కావాలంటూ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా ఎస్పీ వరకట్నం వేధింపుల కేసుల్లో ఫిర్యాదు చేసిన వ్యక్తల ప్రమేయం ఎంతమేర ఉంటుందో సాక్షాధారాలు సేకరించి చర్యలు తీసుకోవాలని టేకులపల్లి సిఐను ఆదేశించారు.

ద్విచక్ర వాహన ఫైనాన్స్ కార్యాలయాలల్లో పోలీసుల తనిఖీ
ఖమ్మం(ఖిల్లా), జూలై 14: ఖమ్మం నగరంలోని ద్విచక్ర వాహన ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయాలపై ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్ సిఐల ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐలు రమణమూర్తి, సారంగపాణిలు మాట్లాడుతూ కాగితాలు లేని అపహరణకు గురైన పలు ద్విచక్ర వాహనాలు పలు ఫైనాన్స్ కార్యాలయాల వారు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తాము తనిఖీలు నిర్వహించామన్నారు. కాగా ఇప్పటికైనా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు ఉంటే తమకు అప్పగించాలని వారు కోరారు. కాగా ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

రుణమాఫీ చేసి ఖరీఫ్‌లో రుణాలివ్వండి
ఖమ్మం(జమ్మిబండ), జూలై 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీని వర్తింపచేసి ఈ ఖరీఫ్ కాలంలో సకాలంలో రైతులకు రుణాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మండే వీర హన్మంతరావు అన్నారు. సోమవారం స్థానిక గిరిప్రసాన్ భవన్‌లో తెలంగాణ రైతుసంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అడప రామకోటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండే వీరహన్మంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ కాలం 45రోజులు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా సగటుగానైనా వర్షపాతం నమోదు కాలేదన్నారు. అనేక ప్రాంతాలలో చిరుజల్లులకు వేసిన పత్తి, పెసర, కంది, తదితర పంటలు ఇటీవల వడగాల్పులకు ప్తూగా ఎంపిడోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఖరీఫ్ కాలం 15రోజులు దాటినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది అధిక వర్షాలు, తుఫానులకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న ఆయా రైతాంగం కుటుంబాలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతాంగం పండించిన పంటు గిట్టుబాటు ధర కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతాంగ సమస్యలపై తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ నెల 26న ఖమ్మంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా జనరల్ బాడి సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రైతుసంఘం జిల్లా నాయకులు ఎడవల్లి శంకరయ్య, మందడపు రాణి, ముత్యాల విశ్వనాధం, తాళ్ళూరి రామారావు పాల్గొన్నారు.

జిల్లాలో చిరుజల్లులు - రైతుల్లో ఆనందోత్సాహాలు
ఖానాపురం హవేలి, జూలై 14: ఖమ్మం జిల్లాలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంతోనే రైతులు తమ పొలాల్లో పత్తి, మొక్కజొన్న పంటలను వేశారు. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, తల్లాడ, జూలూరుపాడు, సత్తుపల్లి, చింతకాని, తిరుమలాయపాలెం తదితర మండలాల్లోని రైతులు విత్తనాలు విత్తిన నాటి నుంచి నేటి వరకు వర్షాలు ఎప్పుడు పడతాయా, తమ విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయా అనే మీమాంసలో ఉండగా, ఆదివారం నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో రైతులు తమ పొలంలోని విత్తనాలు మొలకెత్తుతాయని ఆశతో ఉన్నారు. ఆలస్యంగానైనా వర్షాలు పడతాయని గత వారం రోజుల నుంచి జిల్లాలో రైతులందరు పూర్తిస్థాయిలో పత్తి విత్తనాలు వేశారు. చిరుజల్లులతో విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండటంతో నిరాశలో ఉన్న రైతుల్లో కొంత ఆశ నెలకొంది. అయితే ఈ వర్షాలు మాత్రం రైతులకు అనుకూలంగానే ఉంటాయని, మరి కొద్దిగా వర్షాలు కురిస్తే వేసిన విత్తనాలు మొలకెత్తటంతో పాటు మరో కొన్ని రోజుల పాటు మొక్కలు జీవించే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇలాగే వర్షాలు పడితే దిగుబడి తగ్గినా పత్తి పంట తగ్గుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రైతులు జూన్ చివరి వారంలోనే పత్తి, మొక్కజొన్న విత్తనాలు పెట్టి అవి మొలకెత్తక అనేక మంది రైతులు వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ రైతులందరు ఈ వర్షాలను చూసి మళ్ళీ దుక్కులు సిద్ధం చేసుకొని, విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఈ వర్షాలను చూసిన రైతులు వరి, మిర్చి నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు ప్రారంభం కావటంతో ఇన్ని రోజులు వర్షాల కోసం ఎదురుచూసిన రైతన్నలు ఆది, సోమవారాల్లో కురిసిన వర్షంతో వరి, మిర్చి నార్లు పోసి తమ వ్యవసాయ పనులు చురుగ్గా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
చింతకాని మండలంలో...
చింతకాని: మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అడపాదడపా వర్షాలకు అన్నదాతలు ఊరట చెందుతున్నారు. గత 20 రోజులుగా పొడి దుక్కుల్లో వేసిన పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్తుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 20వేల హెక్టార్‌లలో పత్తి విత్తనాలను రైతులు వేశారు. గత 20 రోజుల కిందట రైతులు విత్తిన పత్తి విత్తనాలలో సగానికి పైగా ఎండ తీవ్రతకు దెబ్బతిన్నాయి. పొడు దుక్కుల్లో వేసిన విత్తనాలు అక్కడక్కడ మొలకెత్తకపోవడంతో రైతులు తిరిగి వాటి స్థానంలో రెండోసారి విత్తనాలు వేశారు. ఈ వర్షాలకు రెండోసారి వేసిన విత్తనాలు మొలిచే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లాయని భావిస్తున్నారు. ఇదే విధంగా వర్షాలు పడితే నామమాత్రపు పంటలు పండుతాయని ఆశతో ఉన్నారు. వరిసాగు చేసే రైతులు ఇకనుండైనా వర్షాలు పడుతాయనే ఆశతో నార్లు చల్లుతున్నారు. కొంత మంది రైతులు పెసర, కంది, మినప పండుతాయన్న ఆశతో పొలం పనులు ప్రారంభించారు.

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురండి
ఖమ్మం(ఖిల్లా), జూలై 14: డివిజన్‌లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రారంభమైన మన డివిజన్ మన ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టకి తేవాలన్నారు. ప్రతి డివిజన్‌లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, ఆ సమస్య పరిష్కరించేందుకు డివిజన్ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రానున్న ఐదేళ్ళలో కార్పొరేషన్‌కి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతో పాటు ఆరోగ్యం, పాఠశాలలో వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు చేమట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాదుల దృష్ట్యా ముందస్తు చర్యలుగా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

గ్రామాల్లో సమస్యలు గుర్తించండి
* ప్రత్యేక అధికారి విజయచంద్ర
వైరా, జూలై 14: ప్రతి గ్రామ పంచాయతీ సమస్యలను గుర్తించి వాటిని గ్రామ సభలో తీర్మానం చేయాలని వైరా మండల ప్రత్యేక అధికారి విజయచంద్ర సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయితీల సర్పంచ్‌లకు, ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారులకు, వీఆర్వోలకు, గ్రామ కార్యదర్శుల ప్రత్యేక శిక్షణా సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మన ఊరు - మన ప్రణాళిక ’’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాలలో కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్, విద్య, అవసరమైన రోడ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి ఆసమస్యలను పంచాయితీ సమావేశం ఏర్పాటు తీర్మానం చేయాలని ఆయన వారిని కోరారు. ఈసమస్యలను స్థానిక ప్రజలతోపాటు సర్పంచ్, ప్రత్యేక అధికారి, కార్యదర్శి, వీఆర్వోలు గుర్తించాలని కోరారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ సైదులు, మధుసూదన్‌రాజు, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు, సర్పంచ్‌లు, వీఆర్వోలు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పాత నేరస్థుల వేలిముద్రలు డేటాబేస్‌లో పొందుపర్చాలి
* జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్
ఖమ్మం(గాంధీచౌక్), జూలై 14: ఇటీవల జరిగిన దొంగతనాల కేసుల్లో చాలా వరకు పాత నేరస్థులే ఉన్నారని వారి వేలిముద్రలను సరైన సమయంలో సేకరించి డేటాబేస్‌లో పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో క్లూజ్ టీం పోలీస్ సిబ్బందికి వేలిముద్రలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరం జరిగిన సమయం, వచ్చిన సమాచారం, పోలీసులు ఘటనా స్థలానికి ఎప్పుడు చేరుకున్నారనే విషయాన్ని రికార్డు చేయాలని, అదే విధంగా టవర్ లొకేషన్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఫింగర్ ప్రింట్ కిట్స్ అందిస్తామన్నారు. దొంగతనం జరిగిన తీరు, అవసరమైన అధారాలు సేకరించటంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డి రమణకుమార్, డిఎస్పీ బాలకిషన్‌రావు, రఘు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి హైకోర్టు వద్దే వద్దు...
ఇల్లెందు, జూలై 14: రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడిగా హైకోర్టును కొనసాగించే యోచన సరైందికాదని ఉమ్మడి హైకోర్టు తమకు వద్దని కోర్టు ఆవరణలో న్యాయవాదులు నినాదాలు చేశారు. ఉమ్మడిగా హైకోర్టును కొనసాగించాలనే యోచనను నిరసిస్తూ సోమవారం ఇల్లెందు కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును, రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గోపినాద్, మల్లిఖార్జున్‌రావు, చెన్నకేశవరావు, పి బాలకృష్ణ, పి చంద్రవౌళి, నర్సయ్య, ఉమమహేశ్వరరావు, ఇందిర, రవి తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో పచ్చదనం పరిమళించాలి
చింతూరు, జూలై 14: మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించుకొని అధికారులు, ప్రజలు సమన్వయంతో మెలగి పల్లెల్లో పచ్చదనం పరిమళించే విధంగా కృషి చేయాలని మండల స్పెషలాఫీసర్, ఐటిడిఏ డిడి ఎం సరస్వతి అన్నారు. సోమవారం మండలంలోని ఐకెపి కార్యాలయంలో మన ఊరు మన ప్రణాళికపై స్పెషలాఫీసర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో డిడి ఎం సరస్వతి, ఎంపీడీఓ రాధాకృష్ణకుమారిలు మాట్లాడుతూ విద్య, మధ్యాహ్న భోజనం, వ్యవసాయం, ఉపాధి, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు మొత్తం 3 లక్షలు మొక్కలు పంపిణీకి రంగం సిద్ధమైనట్లు తెలుపుతూ మండలానికి 30-50 వేల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టుకోవాలని, 2017 నాటికి మలమూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాలలో జరపకుండా ఉండేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దారు శివకుమార్, ఏఇలు రాములు, కిశోర్, సుధాకర్, డా.చేతన్, ఎంఇఓ రమేష్, ఆర్‌ఐ రాజు, ఈఓఆర్డీ గుంపెనపల్లి మోహన్, కార్యదర్శులు గంగరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కొణిజర్లను కరవు మండలంగా ప్రకటించాలి
* హామీలను వెంటనే అమలుచేయాలి
* తహశీల్దార్ కార్యాలయం ఎదుట టిడిపి ధర్నా
కొణిజర్ల, జూలై 14: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షడు పోట్ల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల పదిహేను రోజులు గడుస్తున్నా వర్షాలు కురవలేదని వర్షాభావం వలన మొలసిన పత్తి పైర్లు దెబ్బతిన్నాయన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అర్హూలైన దళితులందరి మూడు ఎకరాలు భూమిని పంపిణి చేయాలని రుణ మాఫీ పథకాన్ని వెంటనే అమలు చేసి తిరిగి రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. పెంచిన పింఛన్లు అమలు చేసి ఒకటవ తారీఖు అందచేయాలని, అర్హత కలిగిన వారందరికి రేషన్ కార్డులు, ఇళ్ల్ల స్థలాలు ఇవ్వాలన్నారు. హామీలను వెంటనే అమలు చేయకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహశ్దీర్ యూసఫ్ అలీకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ, పెద్దమునగాల ఎంపిటిసిలు గాజుల కృష్ణమూర్తి, జానిమియ్య, సర్పంచ్‌లు బండారుపల్లి రజని, తడికమళ్ళ జ్యోతి, దాడే పుల్లయ్య, నాయకులు పాసంగులపాటి శ్రీను, ఖాదర్, తేళ్ళూరి వెంకటేశ్వల్లు, లింగాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

* అఖిలపక్షం ఆందోళన చేసినా ఆగని వైనం * జిల్లాలో మిన్నంటిన ఆందోళనలు
english title: 
mumpu

వికటిస్తున్న మాఫీ మంత్రం!

$
0
0

కర్నూలు, జూలై 14: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇపుడు ఆయన మెడకు చుట్టుకునేలా పరిస్థితులు తయారవుతున్నాయి. ఆయన రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు రాష్ట్రంలో చేపట్టిన యాత్ర సందర్భంగా రుణమాఫీ హామీని ఇచ్చారు. ఎన్నికలు సమీపించే సమయానికి రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చి రాష్ట్ర విభజనకు దారి తీసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం కాకపోవడంతో రుణమాఫీ ప్రకటన జాప్యానికి దారి తీసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంత వరకు రైతులకు కొత్త రుణాలు చేతికి రాకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. గత వారం రోజులుగా వర్షం కురుస్తూ రైతులను సాగుకు సిద్ధం చేసింది. అయితే రుణమాఫీ హామీ అమలు కాకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో రుణాల రీషెడ్యూల్ కోసం ఆర్బీఐని ఒప్పించినా ఆదేశాలు వెలువడక పోవడంతో రైతులకు రుణాలు అందడంలో జాప్యం అనివార్యమైంది. మరో వైపు డ్వాక్రా మహిళలు సైతం రుణమాఫీ హామీ కారణంగా గత అయిదు, ఆరు నెలలుగా వారు తీసుకున్న రుణాల చెల్లింపును నిలిపి వేశారు. రుణమాఫీ అమలైతే అనేక పొదుపు గ్రూపులు కొత్త రుణాలకు అర్హత సాధిస్తాయని వెల్లడవుతోంది. దీంతో ప్రభుత్వ ప్రకటన కోసం వారు సైతం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ ప్రకటన జాప్యమయ్యే కొద్దీ మాఫీ మొత్తం పోను మిగిలిన సొమ్ము చెల్లించాలంటే వడ్డీ భారమవుతుందని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లింపులు సక్రమంగా ఉంటేనే తమకు వడ్డీ లేని రుణాల పథకం వర్తిస్తుందని లేని పక్షంలో బ్యాంకర్లు వేసే వడ్డీ మొత్తం భరించాల్సి ఉంటుందని వారంటున్నారు. మాఫీ ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీ భారం పెరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదే విధంగా రైతులకు సైతం పావలా వడ్డీ అమలు కావాలంటే వారు కూడా సకాలంలో రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించని పక్షంలో బ్యాంకర్లు వేసే వడ్డీని భరించాల్సిందేనని రైతులు పేర్కొంటున్నారు. రుణ హామీ అమలులో జాప్యమయ్యే కొద్దీ తమ రుణం మొత్తం బ్యాంకర్ల నిబంధనల ప్రకారం అధికంగా వడ్డీ పడుతుందని తద్వారా తాము నష్టపోయే ప్రమాదం ఉందని వెల్లడిస్తున్నారు. రైతులు, పొదుపు మహిళల పరిస్థితి ఇలా ఉండగా మాఫీ హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో మరో నెల రోజుల సమయమైనా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడటమే కాకుండా లబ్ధిదారులకు సైతం వడ్డీ భారం లేకుండా ఉంటుందని వారంటున్నారు.

సమగ్ర ప్రణాళికతో
జిల్లా అభివద్ధి
* బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ విజయమోహన్
కర్నూల్ సిటీ, జూలై 14: జిల్లాను సమగ్రమైన ప్రణాళికను రూపోందించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహకారంతో అన్ని శాఖల్లో నెలకున్న సమస్యలను పరిష్కరిస్తానని వివరించారు. అలాగే అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను అమలు జరిగేలా చూస్తానని తెలిపారు. 20 సూత్రాల పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా ఖ్యాతిని ఇనుముడింప చేస్తానని వెల్లడించారు. ప్రజాదర్బారుకు వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో తాగు నీటి సమస్య అధికంగా వునట్లు సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్ని తెలిపారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని, జిల్లాను అభివృద్ధి పరిచేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసి కన్నబాబు, ఎజెసి అశోక్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరాన్ని
శోభాయమానంగా తీర్చిదిద్దాలి - కలెక్టర్
కర్నూలు, జూలై 14: నూతనంగా ఏర్పాటైన ఆంధ్రరాష్టల్రో తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కర్నూలు నగరాన్ని సుందరంగా, శోభాయమానంగా తీర్చి దిద్దేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ మున్సిపల్ కమిషనర్ మూర్తిని ఆదేశించారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ రఘురామిరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతిశాఖ చేయాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రాణాళిక రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండవ బెటాలియన్ మైదానంలోని హెలిపాడ్ నుండి జాతీయ పతాకం ఎగురవేసే వేదిక వరకు బ్లాక్‌టాప్ లేయర్‌తో కూడిన రోడ్డును సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇని సూచించారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు, వాటర్ ప్రూప్ స్టేజి, విఐపిలు, అధికారులు కూర్చునే స్థలాలు, మైదానంలో అవసరమైన ప్రదేశాల్లో బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లపై దృష్టి సారించి ప్రణాళిక నివేదిక అందజేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకొనే తీరును ప్రజలందరికి తెలిసేలా నగరమంతా పబ్లిక్ స్థలాలు, ప్రైవేటు భవనాలకు రంగులు, విద్యుత్ దీపాలు వేయించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ దీపాలతో అలంకరించాలని మున్సిపల్ కమిషనర్‌కు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికార ప్రతినిధులు జిల్లాకు వస్తున్నందున అవసరమైన వసతి ఏర్పాట్లను సిద్ధం చేయాలని డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల శకటాలు, విఐపి పాసులు, సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఎస్పీ రఘురామిరెడ్డి వివరించారు. వేదిక సమీపంలో అగ్నిమాపక వాహనాలు, ఇద్దరు నిపుణులైన డాక్టర్లతో రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి కన్నాబాబు, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజీవ్‌రెడ్డి, డ్వామా పిడి హరినాథరెడ్డి, డిఆర్‌డిఎ పిడి నజీర్‌సాహెబ్, డిఇఓ నాగేశ్వరరావు, ఉప రవాణ కమిషనర్ శివరాంప్రసాద్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ బసయ్య, ఆర్‌డిఓ రఘురాబాబు తదితరులు పాల్గొన్నారు

ఆలయం నిర్మాణంలో వివాదం
* అడ్డుకున్న మున్సిపల్ కమిషనర్
* ఆందోళనకు దిగిన హిందూ ధర్మపరిరక్షణ సమితి నాయకులు
ఆదోని, జూలై 14:ఆదోనిలోని ఇందిరానగర్ సమీపంలో నిర్మాణమైన ఆంజనేయస్వామి దేవాలయం సోమవారం వివాదాలకు కేంద్రమైంది. దేవాలయంలో ధ్వజస్తంభం నిర్మించడానికి పెద్దరాతి దులాన్ని తెచ్చి ఉంచి పనులు ప్రారంభించారు. అయితే దీనిపై దేవాలయం ప్రక్కన ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్టీ కులానికి చెందిన ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నట్లు ఆ ప్రాంతంలోని ప్రజలు, కౌన్సిలర్ మారుతి, హిందు ధర్మపరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు రామాంజినేయులు, టూటౌన్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారించిన సిఐ సురేంద్రబాబు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికితీసుకుపోయారు. దీంతో పోలీసుకానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పారు. అయితే మున్సిపాలిటీకి చెందిన స్థలంలో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించడమే కాకుండా మళ్ళీ పనులు చేస్తున్నారంటూ మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారి వివికె కన్యాకుమారి, టౌన్‌ప్లానింగ్ అధికారి మురళీకృష్ణగౌడ్‌లు దేవాలయం స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఇప్పటికే మున్సిపాలిటి స్థలంలో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించడం నిబంధనలకు వ్యతిరేకమని కమిషనర్ అన్నారు. ధ్వజస్తంభం పనులను నిలిపివేయాలని కమిషనర్ ఆ ప్రాంతం ప్రజల వద్ద స్పష్టం చేశారు. అయితే అప్పటికే ఆ ప్రాంతం కౌన్సిలర్ మారుతి వచ్చి కమిషనర్‌తో దేవాలయం నిర్మాణానికి అడ్డు చెప్పవద్దని వాగ్వివాదం చేశారు. ఇదే సమయంలో హిందు ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, భజరంగ్‌దళ్ నాయకులు నాగరాజుగౌడ్, కార్యకర్తలు, నాయకులు వచ్చి కమిషనర్‌తో, టౌన్‌ప్లానింగ్ అధికారులతో వాగ్వివాదం చేశారు. ఈప్రాంతంలో దేవాలయం పనులను ఆపేదిలేదని రామాంజినేయులు స్పష్టం చేశారు. అవసరమైతే దేవాలయం ప్రాంతం ప్రజలకు నోటిసు ఇవ్వాలని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. నడి రోడ్డు ప్రక్కన, మున్సిపాలిటీ స్థలాలలో అన్యమత ప్రార్థన మందిరాలు ఆదోనిలోఎన్నో ఉన్నాయని వాటిని కూడా కూలగొట్టాలని రామాంజినేయులు కమిషనర్‌ను డిమాండ్ చేశారు. అయితే 262, 263ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటికి చెందిన రిజర్వు స్థలంలో ఏ మతానికి చెందిన మందిరాలు నిర్మించరాదని కమిషనర్ అన్నారు. అంతేకాకుండా దేవాలయం నిర్మాణంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయని ఆమె చెప్పారు. దీంతో ఆ ప్రాంతం ప్రజలు అన్యమతానికి చెందిన కానిస్టేబుల్ దేవాలయం ప్రక్కనే ఉన్నారని ఉదయం ధ్వజస్తంభం పనులు చేయడానికి వచ్చిన ఎరుకుల సంజన్నను కూడా చేయి చేసుకున్నారని ఆ ప్రాంతం ప్రజలు హిందు ధర్మపరిరక్షణ సమితి నాయకులు రామాంజినేయుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమయంలోనే మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోవడంతో, ఎస్టీ కులానికి చెందిన వారు వెంటనే టూటౌన్ వద్దకు గుంపుగా వెళ్ళి సిఐ దృష్టికి కానిస్టేబుల్ శాంతకుమార్ చేయి చేసుకున్న విషయాన్ని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దేవాలయం పనులపై ఫిర్యాదులు కూడా ఇతనే చేస్తున్నాడని వారు సిఐతో చెప్పారు. దీంతో సిఐ ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుపోయారు. సిఐతో మాట్లాడుతూ కానిస్టేబుల్ శాంతకుమార్‌పై చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. హిందు ధర్మ పరీరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు మాట్లాడుతూ ఆంజినేయస్వామి దేవాలయం పనులు కొనసాగిస్తామని అన్నారు. కానిస్టేబుల్‌గా ఉంటూ దేవాలయం పనులను చేయిస్తున్న వ్యక్తిపై చేయి చేసుకోవడం తగదని రామాంజినేయులు అన్నారు. సిఐ సురేంద్రబాబు ప్రజలకు సర్దిచెప్పడంతో ఆలయం వివాదం సద్దుమణిగింది.
కోవెలకుంట్లలో
ఎమ్మెల్యే విస్తృత పర్యటన

* ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ
కోవెలకుంట్ల, జులై 14: పట్టణంలో బనగానపల్లె శాసనసభ్యుడు బిసి.జనార్ధన్‌రెడ్డి సోమవారం విస్తృత పర్యటన, తనిఖీలు నిర్వహించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.42.35 లక్షలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అగ్రగామిగా నిలుపుతానన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, మంచినీరు తదితర వౌళిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిచ్చి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.65లక్షలతో అదనపు గదుల నిర్మాణం, గురుకుల పాఠశాలలో రూ.4.15కోట్లతో డార్మిటరీ, డైనింగ్ హాల్‌లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, చక్కగా చదువుకుని తల్లితండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వైద్యశాలలో వున్న సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు, రికార్డులను పరిశీలించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి పాఠశాలలో తరగతి గదులు, సదుపాయాలు, మధ్యాహ్నం భోజనం తదితరాలను పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని హస్టల్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ వారి పరిధిలోని సమస్యలు, అభివృధ్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులకోసం ప్రతిపాదనలకు తనకు అందజేస్తే తగిన చర్యలు చేపడతానన్నారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సర్పం చ్ చుక్కా స్వరూపరాణి, ఎంపిపి చెన్నక్రిష్ణమ్మ, టిడిపి నాయకులు బివి.ప్రసాదరెడ్డి, గడ్డం రామక్రిష్ణారెడ్డి, గడ్డం అమర్‌నాథ్‌రెడ్డి, అమడాల మద్దిలేటి, కరిమద్దెల మురళి, లక్ష్మిదుర్గ పాపిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా సంగమేశ్వరం స్వామి కల్యాణం
* వేపదారు శివలింగానికి అన్నాభిషేకం
* వరుణయాగం పరిసమాప్తి
పాములపాడు, జూలై 14: సప్తనది సంగమేశ్వర క్షేత్రం కల్యాణంతో పులకించింది. శ్రీ లలితా సంగమేశ్వరులకు కల్యాణం, వేపదారు శివలింగానికి అన్నాభిషేకం, వరుణ యాగాలతో కృష్ణాతీరంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు నదీ పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రాతఃకాలంలో మూల విరాట్‌కు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మాతృక పూజ, కంకణధారణ, మహాసంకల్పం కొనసాగగా, కల్యాణ మహోత్సవంలో కన్యదాతలుగా శ్రీనివాసులు, చంద్రశేకరప్ప, పాపారావు దంపతులు వ్యవహరించారు. మాంగళ్యధారణ అనంతరం అంక్షితారోహనం, హోమంతో కల్యాణం కమనీయంగా సాగింది. శ్రీ జయనామ సంవత్సరం మిధున ఆషాడ బహుళ విదియ సోమవారం శ్రావణ నక్షత్ర యుక్త అభిజిన్ లగ్నమందు 12.08 గంటలకు శ్రీ లలితా సంగమేశ్వరులకు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సంగమేశ్వర క్షేత్రంలో ఒకవైపు వరుణయాగం, మరోవైపు శ్రీ లలితా సంగమేశ్వరులకు కల్యాణ వైభోగంతోపాటు గర్భాలయంలోని ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు శివలిగానికి అన్నాభిషేకం ఏకకాలంలో జరిగాయి. ఆలయ అర్చకులు వేదపండితులు ఆచార్య తెలకపల్లె రఘురామ శర్మ ఆధ్వర్యంలో యాగ క్రతువులు కొనసాగాయి. శివలింగానికి పూర్తిగా అన్న పదార్థాలతో కప్పబడిన అనంతరం ఆ పదార్థాన్ని సాయంత్రం సప్తనదీ జలాల చేపలకు ఆహారంగా నివేదించారు. ఈ విశేష అన్నాభిషేక ంను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
భక్తులకు పడిగ్యాలకు చెందిన గొల్ల నారాయణ, వెంకటేశ్వర్లు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చి నదీ పుణ్యస్నానాలు ఆచరించి స్వామి మ్మవార్లను దర్శించుకున్నారు. ఏప్రిల్ 14 నుంచి జూలై 14 వరకు 118 రోజులు 14 సోమ వారాల పాటు వారాల పూజలు సంగమేశ్వరంలో సాగుతున్నాయి. వరుణయాగం సోమవారంతో పరిసమాప్తమైంది. ఈ ఏడాది దసరా పండుగ సోమవారం రావడంతో స్వామి వారికి 118 రోజున అన్నాభిషేకాన్ని వేదపండితులు నిర్వహించారు.
సకాలంలో జలాశయాలు నిండుతాయి...
వర్ష రుతువులో వర్షాలు సకాలంలోనే కురిసి అన్ని జలాశయాలు నిండుతాయని వేదపండితులు తెలకపల్లె రఘురామశర్మ తెలిపారు. శ్రీశై లం జలాశయానికి ఈ నెల చివరలో నీరుచేరుకుంటుందని ఈ ప్రాజెక్టు ఆధారిత ప్రాంతాల్లో పుష్కలంగా పంటలతో నిండుతాయని వివరించారు. పునర్వసుకార్తే 17 నుంచి జూలై 13వరకు ఆ తరువాత 20వ తేదీ వరకు జలరాశుల్లో చంద్రుడు ఉండడం వల్ల అలాగే ఆగస్టు 17 నుంచి 30 వరకు ముఖకార్తి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. సంగమేశ్వరంలో జరుగుతన్న వరుణయాగ ఫలితాల్లో ఈ నెల చివరలో ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారని వివరించారు.
టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
* ఆర్డీఎస్ సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలి
* గద్వాల ఎమ్మెల్యే డికే అరుణ
మంత్రాలయం, జూలై 14 : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాల్సిందేనని గద్వాల ఎమ్మెల్యే డికే అరుణ డిమాండ్ చేసింది. సోమవారం రాఘవేంద్రస్వామి బృందావనం దర్శనం కోసం డికే అరుణ, గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ బండాల పద్మవతిలు మంత్రాలయం వచ్చారు. ఈమేకు మఠం అధికారులు ఆలయ సంప్రదాయలతో ఘనంగా స్వాగతం పలికారు. రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మూలరాముల వారి ప్రత్యేక పూజల్లో పాల్గొని విశేషంగా తిలకించారు. అనంతరం మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులు పట్టుచీర, జ్ఞాపిక, తీర్థప్రసాదాలు, ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. అనంతరం ఆమె మఠం అతిథి గృహంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని విభజించడం జరిగిందన్నారు. అయితే విభజన తీరును తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటోందన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు తీర్చలేని హామీలిచ్చి ప్రజల ముందుకు తీసుకుపోయారని, దీనికి తోడుగా ప్రజలు మార్పుకోరుకోవడం వల్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రైతులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీని ఇంతవరకు అమలుచేయకపోవడం వల్ల రైతులు ఖరీఫ్ సీజన్‌పై ఆశలు వదులుకుని తీవ్రంగా నష్టపోతున్నరన్నారు. వెంటనే తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచడం వల్ల నీటి నిలువను ఎక్కవ సామర్థ్యంలో పెంచుకోవచ్చని, అవసరమైనప్పడు ఆనీటి వాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎత్తు పెంచే విషయమై ఇరురాష్టల్ర ప్రజాప్రతినిధులు సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కారించుకోవాలన్నారు. అదేవిధంగా పోలవరం డిజైన్ మార్పు చేయవలసిన అవసరం ఎంతైన వుందన్నారు. డిజైన్ మార్చకపోతే ఆదివాసులు చాలా నష్టపోతారన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా వున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు సమస్యలపై పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, వైస్‌చైర్మన్ గండిపేట శంకర్, కౌన్సిలర్లు గంట రమేష్, రామాంజిని, నాగేంద్రయాదవ్, ఎల్లప్ప, ఇంతియాజ్, చందు, నరసింహులు, అంజి, ఈ కార్యక్రమంలో మఠం అధికారులు మేనేజర్ శ్రీనివాసరావు, శ్రీపతాచార్, పిఆర్‌ఓ రాఘవేంద్రరావు, వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
ఆదర్శగ్రామంగా బసాపురం
* ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
ఆదోని, జూలై 14:విషజ్వరాలు, డెంగ్యూ జ్వరంతో సతమతమవుతున్న బసాపురం గ్రామ ప్రజలకు అన్నింటా అండగా ఉంటామని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గ్రామంలోని వాడవాడల ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి విస్త్రృతంగా పర్యటించారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఆపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి మురుగునీటి ప్రవాహానికి మురుగుకాలువలు నిర్మించాలని పంచాయతీరాజ్ ఏఇ రామచంద్రను ఆదేశించారు. అలాగే గ్రామంలోని ఎస్సీ, బిసి, ఎస్టీ కాలనీలతోపాటు ఇతర కాలనీల్లో కూడా పర్యటన చేశారు. ముందుగా గ్రామంలోని మురికి కాలువల్లోని మురికినీ శుభ్రం చేయాలని ఎంపిడిఓ సలీమ్‌బాషాను ఆదేశించారు. అలాగే పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి చేపట్టిన వైద్య సేవలను వైద్యులు అనురాధను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విషజ్వరాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో సుమారు రెండు గంటల సేపు పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చేరుస్తామని వివరించారు. అలాగే గ్రామంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదోని మున్సిపాలిటి బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి మంచినీరు సరఫరా చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం పాటించడచం లేదని, దీని వల్ల వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. సిసి రోడ్లుపై పెంట దిబ్బలు వేశారని మురుగునీరు రోడ్లుపై వదులుతున్నారని పేర్కొన్నారు. అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని గ్రామంలో విషజ్వరాలను అరికట్టేందుకు ఎంతో కృషి చేశారని అధికారులను అభినందించారు. త్వరలోనే బడ్జెట్ సమావేశం అనంతరం ఈ గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డి, నాగేంద్రరెడ్డి, డిఎల్‌పిఓ హెచ్‌ఎం బాషా, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఇఓఆర్డీ దిలిప్, కార్యదర్శి దనుంజయరెడ్డి, నాయకులు ప్రకాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

* జాప్యంపై జనాగ్రహం * కొత్తరుణాలకు బ్యాంకర్లు నిరాకరణ
english title: 
maphi manthram

ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలపై ప్రత్యేక శిక్షణ

$
0
0

ఎంఇఓ మరుద్వతి
తోటపల్లిగూడూరు, జూలై 14: విద్యార్థులకు 1 నుంచి 5 తరగతులకు పాఠ్యాంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఎంఇఓ మరుద్వతి తెల్పారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు సులువుగా పాఠాలు నేర్పి బోధనా శక్తిని పెంపొందించడానికి ఈ శిక్షణ తోడ్పడుతుందన్నారు. తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. రెసోర్సు నిర్వాహకులు రత్నం రామ సుబ్బయ్యలు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడంతో పాటు వారి నంచి జవాబులు రాబట్టారు. 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శిక్షణలు 19తో ముగియనున్నట్లు నిర్వాహకులు తెల్పారు. ఈ శిక్షణలు విద్యార్థులకు మరింత దోహదపడగలవని ఉపాధ్యాయులు తెల్పారు.

పెన్షన్‌దార్లకు ఆధార్ కార్డులు తప్పనిసరి
ఎండిఓ
తోటపల్లిగూడూరు, జూలై 14: మండలంలో పెన్షన్‌దార్లు తప్పనిసరిగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని ఎండిఓ సావిత్రమ్మ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆమె పాల్గొని సూచనలు చేశారు. మంగళవారం ఈ విషయమై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్‌దార్లు ఆధార్ కార్డు నమోదు వీలుగా మండలంలోని కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
గ్రీవెన్స్ డేలో కలెక్టరకు అర్జీదారులు విజ్ఞప్తి
నెల్లూరు కలెక్టరేట్, జూలై 14: సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానం లభించటం లేదని, జవాబుదారీతనం లోపించిందని జిల్లా సచివాలయానికి సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చిన అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరివద్ద నుండి జిల్లా పాలనాధికారి శ్రీకాంత్, ఎజెసి రాజ్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వౌలిక వసతులు కల్పించాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు అర్జీ సమర్పించారు. రూరల్ నియోజక వర్గంలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని, చాలా దూరం వ్యయప్రయాసలకోర్చి రక్షిత మంచినీరు తెచ్చుకోవల్సి వస్తోందని, సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర భాజాపా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి కలెక్టరును కోరారు. మెమోరాండం సమర్పించి నెల రోజులు గడిచినా కనీసం ఎండార్స్‌మెంట్ కూడా కలెక్టరేట్ కార్యాలయం నుండి రాలేదంటూ నిద్రాణంగా ఉన్న వ్యవస్థను చక్కదిద్దటం మాని ఉన్నతాధికారులు కోపగించుకుంటున్నారని ఎపీ, ఎస్సీ సంక్షేమ సంఘం వారు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టరుకు అర్జీ సమర్పించారు. స్పష్టమైన పరిష్కారం చూపాలని వారు కోరారు. నూతన టెండర్లలో మద్యం షాపును నివాసాల మధ్య ఏర్పాటు చేశారని వెంటనే తొలగించాలని సూళ్లూరుపేటకు చెందిన మహిళలు అర్జీ సమర్పించారు. మద్యం సేవించిన మందుబాబులు నివాసాల్లోకి చొరబడుతున్నారన్నారు. గతంలో ఇలాగే జరిగితే తొలగిస్తామన్నారు, కానీ యథాతథంగా అక్కడే కేటాయించి మహిళలకు ఇక్కట్లకు గురిచేస్తున్నారని వారు కలెక్టరు ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

‘ఏపీ రాజధాని నెల్లూరులో ఏర్పాటు చేయాలి’
నెల్లూరు కలెక్టరేట్, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా నగరంలో సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరులో రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కావాల్సిన అన్ని వసతులు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం కలుగుతుందన్నారరు. ఈనెల 28న నగరంలోని టౌన్‌హాలులో ‘ఏపీ రాజధాని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలి’ అనే అంశంపై సభ నిర్వహించతలపెట్టామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగలవారు తనను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గాలి కిరణ్‌కుమార్, సాయిరాం ప్రసాద్, పిన్ని గంగాధర్, కేతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ డేకు 22 అర్జీలు
కోవూరు, జూలై 14: పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో అర్జీదారులు వివిధ సమస్యలపై 22 అర్జీలను సమర్పించినట్లు కోవూరు తహశీల్దార్ నరసింహులు తెలిపారు.

15న ఉద్యోగాల భర్తీకి ఇంటర్‌వ్యూలు
నెల్లూరు టౌన్, జూలై 14: కృష్ణపట్నం పోర్టు, ముత్తుకూరులో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈనెల 15న నెల్లూరులో ఇంటర్‌వ్యూలు నిర్వహిస్తామని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరక్టర్ చంద్రవౌళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న ఉదయం 10గంటలకు నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్‌లోని జిల్లా సంఘరక్ష కార్యాలయం(జిల్లా సమాఖ్య కార్యాలయం)లో ఇంటర్‌వ్యూలు నిర్వహిస్తామన్నారు. మొత్తం 50 పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ పాసై, 18నుంచి 28సంవత్సరాలలలోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. జీతం 6,500 రూపాయలుంటుందన్నారు. భోజనవసతి, ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం ఉంటుందన్నారు. అర్హత ఆసక్తి ఉన్నవారు ఈనెల 15న రేషన్‌కార్డు, విద్యార్హత సర్ట్ఫికెట్ల జెరాక్స్ కాపీలతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఇంటర్‌వ్యూకు హాజరుకావాలన్నారు.

కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం
నెల్లూరు కల్చరల్, జూలై 14: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్,టిటిడి ధర్మ ప్రచార మండలి ఆధ్వర్యంలో సోమవారం స్ధానిక దర్గామిట్టలోని టిటిడి కల్యాణ మండపంలో కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి జన్మ నక్షమ్రైన శ్రవణా నక్షత్రం రోజు ప్రతి నెలా ధర్మప్రచార మండలి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. శ్రీదేవి,్భదేవి సమేతంగా శ్రీనివాసుని కల్యాణ ఉత్సవ మూర్తులను దివ్యాభరణాలు, దివ్యవస్త్రాలు, రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబుచేసి మేళతాళాలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కల్యాణ వేదికను మామిడితోరణాలు, పుష్పతోరణాలు, అరటిపిలకలతో అలంకరించారు. కల్యాణ మండపంలో కొలువుతీర్చిన స్వామి దేవేరులకు అర్చకస్వాములు ఫణిశర్మ, నాగేంద్రశర్మ బృందం ఆధ్వర్యంలో శాస్రోక్తంగా, వేదోక్తంగా కల్యాణం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల నడుమ మాంగల్యధారణ చేశారు. శ్రీనివాస శ్రవణానక్షత్ర కల్యాణానికి ఎం రామరాజు, రామలక్ష్మి, ఎం కార్తీక్‌రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈసందర్భంగా గుండాల గురువయ్య గానం చేసిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు నారా నాగేశ్వరరావుతిరునామాలు తీర్చిదిద్దారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలతోపాటు తిరుమలనుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లడ్డు, కల్యాణ అక్షింతలు ప్రసాదాలుగా అందచేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు తులసి మొక్కలను ప్రసాదంగా అందచేశారు. కార్యక్రమాన్ని హిందూ ధర్మప్రచార మండలి అధ్యక్షులు సివి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు కొండా శేఖర్‌రెడ్డి, కార్యదర్శి వంజవాక ధనుంజయ, వాకాటి విజయకుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో ప్రచార మండలి సభ్యులు కె గిరిజమ్మ, శ్రీనివాసమూర్తి,కోఆర్డినేటర్ మల్లెల శ్రీహరి, ఆలూరి శిరోమణిశర్మ,డి నాగార్జునాచారి,వీరిశెట్టి సుధాకర్,వికె సుధీర్, బాలాజీ రవికుమార్,హృషీకేశవరావు,సూర్యనారాయణ, జయరామయ్య, పోలయ్య, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.
ఫోటో

ఇలా అయితే వ్యాపారాలు చేయలేం
కలెక్టరుని వాణిజ్య సంఘాల నేతలు
నెల్లూరు కలెక్టరేట్, జూలై 14: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులు నిత్యావసర సరుకులు అక్రమ నిల్వదారులు, అధిక ధరల విక్రేతలతోపాటు సక్రమంగా ఉన్న లైసెన్సీ దుకాణాలపై కూడా చేయటం దారుణమని వివిధ వాణిజ్య సంఘాల నాయకులు జిల్లా పాలనాధికారితో మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరు కార్యాలయంలో గ్రీవెన్స్‌లో అర్జీలు సమర్పించడానికి వచ్చిన వారు కలెక్టరుతో మాట్లాడుతూ నిబంధనల మేరకు దుకాణాల్లో రికార్డులు సరిగా నిర్వహించకపోతే 6ఎ కేసు నమోదు చెయ్యాలి. ప్రభుత్వ అధికారులు చేస్తున్న దాడులకు మేం వ్యతిరేకం కాదు... అయితే సక్రమమైన లైసెన్సీ దుకాణదారులపై దాడులు చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇలా అయితే వ్యాపారాలు చేయలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వంట నూనెల వ్యాపారుల సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పొట్టి శ్రీరాములు వాణిజ్య మండలి జిల్లా అధ్యక్షులు శేషయ్య, దాల్‌మిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలువాది నాగేశ్వరరావు, పెసల నరసింహస్వామి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీరాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో

గ్రీవెన్ సెల్‌కు 8 అర్జీలు
ఇందుకూరుపేట, జూలై 14: కొత్తూరులోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఫిర్యాదుల దినోత్సవానికి ప్రజల నుంచి ఎనిమిది అర్జీలు అందినట్లు తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొన్ని భూసంబంధనమైనవి, మరికొన్ని రేషన్‌కార్డుల కోసం వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

జడ్పీటిసి కిడ్నాప్‌పట్ల ఉత్కంఠ
ఇందుకూరుపేట, జూలై 14: మండల పరిధిలోని సోమరాజుపల్లె గ్రామానికి చెందిన బందెల వెంకటరమణయ్య వైకాపా తరఫున జడ్పీటిసి స్థానానికి పోటీ చేసి గెలిచారు. జిల్లాలో జరగనున్న జడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏదో ఒక పార్టీ వారు స్వలాభం కోసం ఆయనను గత కొన్ని రోజులుగా కిడ్నాప్ చేశారని ఆయన సోదరి స్వయంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చి కొద్దిరోజులైనప్పటికీ ఆయన జాడ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని మండలంలో చర్చ జరుగుతోంది. అయితే ఆయనను ఎవరు కిడ్నాప్ చేసారో, కిడ్నాప్ చేస్తే ఎవరికి లాభం, ఎందుకు చేసారో తెలియదు కాని కుటుంబ సభ్యుల మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా పోలీసులు త్వరగా స్పందించి ఆయన కిడ్నాప్ పర్వానికి తెర దించాలని మండలవాసులు కోరుతున్నారు.

అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం
ఎంపిపి రేణుక
ఇందుకూరుపేట, జూలై 14: మండల అధ్యక్షురాలుగా కైలాసం రేణుక సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేణుక పరిచయ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడుతూ తాను కొత్తగా ఎంపిపిగా ఎన్నికయ్యానని మండల అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కృషి చేద్దామని కోరారు. పదవీబాధ్యతలు చేపట్టిన ఆమెను క్లస్టర్ అధికారి డాక్టర్ మున్వర్ సుల్తాన, వ్యవసాయ శాఖ అధికారి సురేంద్రరెడ్డి, ఎంపిడిఓ ఎల్ జ్యోతి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, పలు శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి కైలాసం ఆదిశేషారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఉప్పాల సుధాకర్, వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ మావులూరి శ్రీనివాసులరెడ్డి, ఇరుపార్టీలకు చెందిన ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఇదేమి.... అన్యాయం
గగ్గోలు పెడుతున్న బిల్ కలెక్టర్ అసిస్టెంట్‌లు
27మందికి మెమోలు
నెల్లూరుసిటీ, జూలై 14: కార్పొరేషన్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి బిల్ కలెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న 27మంది కార్మికులను తీసి వేసేందుకు కమిషనర్ జాన్ స్యాంసన్ సర్వసిద్ధం చేశారు. గత 14 నెలల నుంచి వారిచేత వెట్టి చాకిరి చేయించుకున్న అధికారులు వారికి జీతాలు ఇవ్వకపోగా వారిని అర్థంతరంగా తీసి వేసేందుకు వారికి మెమోలను సోమవారం జారీ చేశారు. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అర్డర్ ఉంటేనే పని చేయించుకోవాలని లేదంటే వారికి ఇంటికి పంపించాలని సంబంధింత అధికారులకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు 14 నెలల నుంచి 27 మంది జీతాలు చెల్లించపోవడంతో కార్మికులంతా ఏకమై వారం రోజులు పాటు సమ్మె చేశారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు స్పందించి కార్మికులకు అండగా ఉంటామని, ఏ ఒక్క కార్మికుడుని తీసి వేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ్ధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ చూస్తు ఊరుకోమని వారికి గట్టిగా భరోసా ఇచ్చారు. అయితే వారి మాటలను అధికారులు లెక్క చేయకుండా ముందుగా సెక్యూరిటీ గార్డులు తొలగింపు తరువాత కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులు తమ హక్కుల కోసం వారం రోజులు పాటు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమ్మె దిగితే వారికి అండగా ఉంటామని టిడిపి నాయకులు అనూరాధ, కోటంరెడ్డి శ్రీనివాసులు, కార్పొరేటర్లు వారి చేత సమ్మెను విరమించారు గాని వారి కోర్కెలు మాత్రమే ఇంత వరకు పరిష్కారం కాలేదు. నాయకుల మాటలు విని కార్మికులంతా నమ్మి సమ్మెను విరమించారు. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెకు దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులకు రావాల్సిన జీతాలు ఇప్పించి వాళ్ళ పరువును కాపాడుకోక ఇక వారి మాటలను ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని తెలుస్తోంది.

కెఎన్‌ఆర్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలి
కమిషనర్‌కు బిజెపి నాయకులు వినతిపత్రం
నెల్లూరుసిటీ, జూలై 14: నగరంలోని భక్తవత్సల నగర్ గల కెఎన్‌ఆర్ స్కూల్ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ యరబోలు అపర్ణ మాట్లాడుతూ ఈ పాఠశాలలో సుమారు 1250మంది విద్యార్థిని, విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వారికి 20మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో తరగతికి 100 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వేలమంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలో కనీసం తాగునీరు వసతి కూడా లేదన్నారు. ఈ పాఠశాల్లో తాగునీరు కొరకు ఓవర్ హెడ్ ట్యాంకర్, బోర్ వెల్ వేయాలని సూచించారు. ఈ పాఠశాల్లో మరుగుదొడ్లు, వాచ్‌మెన్, స్వీపర్‌ను వెంటనే నియమించాలని కోరారు. అదనపు గదులు, బెచ్‌లు, లైట్లు, ఫ్యాన్లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

16న పింఛన్లు పంపిణీ
నెల్లూరుసిటీ, జూలై 14: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పంపిణీ చేస్తున్న వృద్ధాప్య, వితంతువు, చేనేత, వికలాంగులకు సంబంధించిన పింఛన్లను ఈ నెల 16వ తేదీ నుండి పంపిణీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జాన్‌స్యాంసన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులందరు తప్పని సరిగా ఆధార్ కార్డు జెరాక్స్‌ను తీసుకుని వచ్చి పింఛన్ పొందాలని కోరారు. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ సెంటర్లలో పేరు నమోదు చేసుకుని సంబంధిత రసీదును ఇవ్వాలని కోరారు.
కేంద్రమంత్రి వెంకయ్యతో
మేయర్ అజీజ్ భేటి
నెల్లూరుసిటీ, జూలై 14: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుతోనగరపాలక సంస్థ మేయర్ అబ్దుల్ అజీజ్ సోమవారం రాత్రి ఢిల్లీలో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరాభివృద్ధికి పార్టీలకతీతంగా కలసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నెల్లూరు నగరానికి మరిన్ని నిధులను తీసుకుని ఇచ్చేందుకు కేంద్రమంత్రి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీలను వారిని కలుపుకుని పోతున్నట్లు తెలిపారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనే జి, రోడ్ల వెడ ల్పు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నాను. అనంతరం వెంకయ్యనాయుడుతో పలు విషయాలపై చర్చించానన్నారు.
డిప్యూటీ మేయర్‌గా ముక్కాల బాధ్యతలు స్వీకరణ
నెల్లూరుసిటీ, జూలై 14: నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముక్కాల ద్వారకానాధ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెల్లూరుసిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డితో పాటు పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు కూడా పాల్గొని ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరున్నారు. అభివృద్ధి విషయంలో రాజీయాలు చూసే ప్రసక్తే లేదన్నారు. పార్టీల కతీతంగా అన్ని డివిజన్‌లను ఒక ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్యేలు, మేయర్ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తుందన్నారు. తమ పార్టీ అవినీతికి పాల్పడదని అవినీతికి పాల్పడినట్లు చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. అభివృద్ది విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెప్పారు. నగరంలోని అన్ని డివిజన్‌లలో అభివృద్ధి పనులను చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అనంతరం ఆయన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఎంఇఓ మరుద్వతి
english title: 
n

ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచా..

$
0
0

చంద్రబాబు ఆదేశిస్తే జడ్‌పి చైర్మన్ పదవికి రాజీనామా
స్థానిక నేతలే తనకు పదవి రాకుండా అడ్డుకున్నారు
జిల్లా అభివృద్ధికి కృషి
జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర స్పష్టం

ఒంగోలు, జూలై 14: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే తాను జిల్లాపరిషత్ చైర్మన్ రేసులో ఉన్నానని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు తెలిపారు. సోమవారం ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా తనకు జిల్లాపరిషత్ చైర్మన్ పదవిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా తనతోపాటు దామచర్లను చంద్రబాబు హైదరాబాదులో కూర్చోపెట్టి జడ్‌పి చైర్మన్‌కు తనను, ఒంగోలు శాసనసభ్యునిగా దామచర్లను పోటీ చేయాలని సూచించారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తాను పోటీ చేశానని, ఆయన తప్పుకోమంటే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక నాయకులైన మంత్రి శిద్దా రాఘవరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ల నిర్వాకం వల్లే మనే్న రవీంద్ర చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారన్నారు. తాను ఎవరికీ శత్రువుని కాదని, తనకు అందరూ మిత్రులేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని 56 మంది జడ్‌పిటిసిలకు, జిల్లాప్రజలకు చైర్మన్‌నని, జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తాను పని చేస్తానని ఈదర వెల్లడించారు. కాగా తనకు విప్ జారీ చేశామని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు ఎవరూ విప్ జారీ చేయలేదని, కనీసం మాట్లాడలేదని, సంతకం కూడా పెట్టించుకోలేదని అలాంటప్పుడు తనకు ఏ విధంగా విప్ జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు వైకాపా నుండి ముగ్గురు జడ్‌పిటిసిలను తీసుకువస్తే తాను 27 మందిని తీసుకువచ్చి చైర్మన్ అభ్యర్థిగా గెలిస్తే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. తన పేరు మీద వచ్చిన సీల్డ్‌కవర్‌ను పక్కనపెట్టి స్థానిక నాయకులు రవీంద్రకు బి ఫారం ఇచ్చినప్పుడే హైడ్రామాకు తెర లేచిందన్నారు. దీంతో తనను పూర్తిగా అలక్ష్యం చేశారని స్థానిక నాయకులపై మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తాను చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నానని చెప్పారు. తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయాలకు అతీతంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గెలిచానన్నారు. తనకు మద్దతు ఇచ్చిన వైకాపా నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైస్ చైర్మన్‌గా బరిలోకి దిగితే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేసిన తరువాతనే మద్దతు పలికానన్నారు. 1999లో తనకు అసెంబ్లీ సీటు రాకుండా అడ్డుకుని తనను బయటకు నెట్టేవిధంగా స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తే మనస్తాపం చెంది పార్టీ మారిన విషయాన్ని గుర్తుచేశారు. కేవలం దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావుకు అనుచరుడిగా ఉన్నందుకే తనను పార్టీ నుండి బయటకు పంపించారన్నారు. అంతే తప్ప తనకు తానుగా బయటకు వెళ్లలేదన్నారు. ఆ సమయంలో కూడా ఎన్‌టిఆర్ కళాపరిషత్‌ను నిర్విరామంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్‌టిఆర్‌కు తానొక భక్తుడిగా ఉన్నానని, ఎన్‌టిఆర్ ఆస్తులకు మాత్రం వారసుడిని కాదని, ఆశయాలకు మాత్రం వారసుడినని వెల్లడించారు. సమర్ధవంతమైన నాయకుడిగా పార్టీలో మంచి గుర్తింపు ఉందని టిడిపి కుటుంబ సభ్యుల్లో తాను ముఖ్యనాయకుడినని చెప్పుకొచ్చారు. ఎన్‌టిఆర్, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకోసమే తాను కష్టపడి పని చేశానన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి జరిగిన సమస్యను వివరిస్తానని తెలిపారు. చంద్రబాబు నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని ఈదర స్పష్టం చేశారు. రెండు రోజుల్లో తాను జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన వెల్లడించారు. కాగా జిల్లాపరిషత్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. చంద్రబాబునాయుడు సారధ్యంలో తాను జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తానని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని ఈదర తెలిపారు.

చీరాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం
కొత్త చైర్మన్ రమేష్ స్పష్టం
చీరాల, జూలై 14 : చీరాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని చైర్మన్ మోదడుగు రమేష్ తెలిపారు. నూతన చైర్మన్‌గా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల పురపాలకంలో తాగునీరు, పారిశుద్ధ్యం, డైనేజి వంటి ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. క్లీన్ చీరాల, గ్రీన్ చీరాల తన ధ్యేయమన్నారు. ఇందుకు కౌన్సిలర్లు అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్తానన్నారు. టిడిపి నియోజకవర్గ బాధ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా కృషి చేశామని తెలిపారు. ఆరు నెలల కాలంలోనే పార్టీలోని అందరి సహకారంతో చీరాల మున్సిపల్ చైర్మన్ స్థానంతో పాటు, రెండు జడ్పీటీసీలు, ఎంపీపీ పీఠం సాధించామన్నారు. పార్టీలకతీతంగా కౌన్సిలందరినీ కలుపుకుని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. టిడిపి పట్టణాధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, మండలాధ్యక్షుడు పాలిబోయిన చినఅంకిరెడ్డి, టిడిపికి చెందిన 12 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.

బందిపోటు దొంగలముఠా అరెస్టు
* రెండు కిలోల గంజాయి స్వాధీనం
* నిందితుల నుంచి మారణాయుధాలు, దోపిడీ సొత్తు స్వాధీనం
మార్కాపురం, జూలై 14: మార్కాపురం ప్రాంతంలో దారిదోపిడీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బందిపోటు దొంగలముఠాను అరెస్టు చేసినట్లు మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. జూన్ 29న మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో రాయవరం వద్ద మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఇరువురిపై దాడిచేసి గాయపరచిన కేసుతోపాటు 30వతేదీ పెద్దారవీడు పోలీసుస్టేషన్ పరిధిలో అమానిగుడిపాడురోడ్డువద్ద మోటారుసైకిల్‌పై వస్తున్న ఇరువురిపై దాడిచేసిన కేసులో తొమ్మిది మంది నిందితులు. కాగా వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మరో ముగ్గురు పరారిలో ఉన్నట్లు డివైఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నాగులూరి చిన్నవెంకటేశ్వర్లు, నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం నెదుర్లపల్లి గ్రామానికి చెందిన గురునాథం శ్రీను, అదేగ్రామానికి చెందిన ఆవలి వెంకటరమణ, పొదలకూరు మండలం ఇరువూరుపాలానికి చెందిన షేక్ మస్తాన్‌వలి, అదేగ్రామానికి చెందిన దాసరి శ్రీనులతోపాటు వీరు దోపిడీకి పాల్పడేందుకు సుమో వాహనం ఏర్పాటు చేసిన వెలిగండ్ల మండలం మొగుళ్ళూరు గ్రామానికి చెందిన ఉడుముల బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న నాగులూరి చిన్నరోశయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు, నెల్లూరుకు చెందిన పట్టా ప్రసాద్‌లు పరారిలో ఉన్నారు. వీరిది ప్రకాశంజిల్లా కనిగిరి కాగా ప్రస్తుతం కడపజిల్లా బద్వేలులో నివాసం ఉంటున్నారని డిఎస్పీ తెలిపారు. వీరు దారిదోపిడీలకు ఉపయోగించే ఎపి 26 యు 5656 నెంబర్‌గల టాటాసుమో, రాయవరం వద్ద తీసుకువెళ్ళిన ఎపి 27 కె 5773 హీరోహోండా మోటారుసైకిల్, అమానిగుడిపాడు రోడ్డుపై దోపిడీ చేసిన జిపిఎస్ సిస్టమ్, పగడపురాయి బంగారు ఉంగరం, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు దోపిడీలో సొత్తు దొరకని సమయంలో దారి ఖర్చుల కోసం గంజాయిని సుమోలో పెట్టుకొని విక్రయించి వచ్చిన డబ్బును ఖర్చు పెడుతుంటారని డిఎస్పీ తెలిపారు. వీరు పట్టణ ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోని గొలుసులను కూడా చోరీ చేస్తుంటారని తెలిపారు. కాగా పరారిలో ఉన్న నాగులూరి చిన్నరోశయ్య వద్ద ఒక ఉంగరం, పట్టా ప్రసాద్ దగ్గర ఒక సెల్‌ఫోన్ ఉన్నాయని, వారి సమాచారం కూడా తమ వద్ద ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ఈవిలేఖరుల సమావేశంలో మార్కాపురం సిఐ ఎ శివరామకృష్ణారెడ్డి, పట్టణ, పెద్దారవీడు ఎస్సై యు రాంబాబు, సురేష్ పాల్గొన్నారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
మార్కాపురం, జూలై 14: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. గతనెల 30వతేదీ రాత్రి గిద్దలూరు పోలీసుస్టేషన్‌పై దాడి చేయడమేకాక మార్కాపురం రూరల్ ఎస్సై జీపు దగ్ధంతోపాటు హీరోహోండా షోరూంపై దాడి, షోరూం యజమాని సుబ్బారావు వాహనాలపై దాడితోపాటు పలుకుట్ర కేసుల్లో ఒకటవ నిందితునిగా కేసు నమోదు కాబడిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జిల్లాపరిషత్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఒంగోలుకు జడ్పీటిసిలతో కలిసి బస్సులో వస్తున్నట్లు సమాచారం రావడంతో సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసేందుకు ప్రయత్నించామని, అయితే ఆ బస్సులో ఎమ్మెల్యే లేకపోవడంతో మార్కాపురం జడ్పీటిసిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నందున ఆయనను అదుపులోనికి తీసుకోవడం జరిగిందని మార్కాపురం డిఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. త్వరలో గిద్దలూరు ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.

టిడిపి నీచరాజకీయాలకు పరాకాష్ట రంగారెడ్డి అరెస్టు
* కాకీచొక్కాలు వీడి పచ్చచొక్కాలు తొడగండి
* ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి
మార్కాపురం టౌన్, జూలై 14: తెలుగుదేశంపార్టీ నీచరాజకీయాలకు పరాకాష్టకు మార్కాపురం జడ్పీటిసి జవ్వాజి వెంకటరంగారెడ్డి అరెస్టు నిదర్శనమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం సబ్‌జైలులో ఉన్న రంగారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు కూడా అధికారపార్టీకి తొత్తులుగా మారి వారి అడుగుజాడల్లో నడుస్తున్నారని, వారికి అధికారపార్టీపై అభిమానం ఉంటే కాకీచొక్కాలు వీడి పచ్చచొక్కాలు తొడుక్కోవాలని హెచ్చరించారు. రంగారెడ్డి అరెస్టుపట్ల పోలీసులు ప్రదర్శించిన తీరు సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం ప్రతిఒక్కరి హక్కుఅని, నిందితుడుగా ఉన్న రంగారెడ్డిని ఓటుహక్కు వినియోగించుకున్న తరువాత కస్టడీలోనికి తీసుకోవాలని చెప్పినప్పటికీ పోలీసులు మూర్ఖంగా ప్రవర్తించారని అన్నారు. రాజకీయ నాయకుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డిఎస్పీపై కేసు దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపిని ప్రకాశంజిల్లావాసులు ఆదరిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని, ఈనేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపికి 31జడ్పీటిసి స్థానాలు, టిడిపికి 25జడ్పీటిసి స్థానాలను ఇవ్వడం జరిగిందని, అధికార దాహంతో తెలుగుదేశంపార్టీ నీచరాజకీయాలకు పాల్పడుతూ వైఎస్‌ఆర్‌సిపి సభ్యులను ప్రలోభపెట్టి వారివైపు మరల్చుకునే ప్రయత్నం చేశారని అన్నారు. 5వతేదీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్‌ఆర్‌సిపికి ఎక్కడ జడ్పీపీఠం దక్కుతుందోనని గందరగోళ పరిస్థితులను నెతలకొల్పి జిల్లాకలెక్టర్‌పై దాడిచేసేంతగా తెలుగుదేశంపార్టీ వారు రౌడీయిజం చలాయించారని అన్నారు. దీనితో ఎన్నిక వాయిదా పడి 13వతేదీన తిరిగి జరగనుండగా వైఎస్‌ఆర్‌సిపి వారిని ప్రలోభాలకు గురిచేసి కుదరదు అన్నందుకు మార్కాపురం జడ్పీటిసి రంగారెడ్డిపై అక్రమకేసులను బనాయింపచేసి ఒక తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు వేకువజామున 5గంటలకు వందమంది పోలీసులు చుట్టుముట్టి అదుపులోనికి తీసుకోవడం తెలుగుదేశంపార్టీ కుట్రలకు అద్దంపడుతుందని అన్నారు. జడ్పీపీఠం కోసం అధికార దుర్వినియోగం చేస్తూ కుట్రలపై కుట్రలు పన్నుతున్న తెలుగుదేశంపార్టీకి తగినబుద్ధి చెప్పాలని ఇండిపెండెంటు అభ్యర్థి ఈదర హరిబాబుకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. నెల్లూరుజిల్లాలో 46 జడ్పీటిసి స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి 31 గెలుచుకోగా సంగం సంఖ్యను కూడా (15) గెలుచుకోలేని తెలుగుదేశంపార్టీ అధికారం కోసం గందరగోళ పరిస్థితులను నెలకొల్పి అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయించడం జరిగిందన్నారు.ప్రజల సహకారంతో తెలుగుదేశంపార్టీ ఎత్తుగడలను తిప్పికొడుతామని హెచ్చరించారు.
* రంగారెడ్డిని పరామర్శించిన ఎంపి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న మార్కాపురం వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, జడ్పీటిసి జవ్వాజి వెంకటరెడ్డిని ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి సోమవారం సబ్‌జైలుకు వెళ్ళి పరామర్శించారు. అరెస్టు జరిగిన వైనాన్ని, పోలీసులు ప్రవర్తించిన తీరును, జడ్పీ అధ్యక్ష ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుతగిలిన వైనం తదితర అంశాలను ఆయన నుంచి అడిగితెలుసుకున్నారు. ఇది టిడిపి కుట్రేనని, ధైర్యం ఉండాలని అన్నారు. రంగారెడ్డి తండ్రి యతిరాజులరెడ్డికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి, డిఆర్‌యుసిసి షేక్ ఇస్మాయిల్, నాదెళ్ళ సుబ్రహ్మణ్యం, బట్టగిరి తిరుపతిరెడ్డి, సప్తగిరి చెన్నారెడ్డి, మీర్జా షంషీర్‌అలీబేగ్, కంది ప్రమీలరెడ్డి, గొట్టం శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
ఒంగోలు అర్బన్, జూలై 14: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా నెల్లూరు బస్టాండ్ లోని మినీస్టేడియం నుండి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు విద్యార్థులు ప్రయత్నించగా వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు బైఠాయించి గంటకు పైగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి రఘురాం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. విద్యార్థులకు సర్ట్ఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ , బిసి, ఈబిసి విద్యార్థులకు వంద కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కాగా ఇప్పటివరకు 40 శాతం మాత్రమే నిధులు విడుదల చేశారన్నారు. మిగిలిన 60 శాతం నిధులను విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు కౌనె్సలింగ్ జరుపక పోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఎప్పుడో కౌనె్సలింగ్ నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. నూతన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆందోళన లేకుండా వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. అనంతరం ప్రజాదర్బార్‌కు వెళ్ళి జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షులు పి కిరణ్, ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, రాంబాబు, నాయకులు రాజేంద్ర, సుకుమార్, స్వప్ప, హేమ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

డ్వాక్రా రుణాలను వెంటనే రద్దు చేయాలి
ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్
ఒంగోలు అర్బన్, జూలై 14 : రైతుల రుణమాఫీ, డ్వాక్రా గ్రూపుల రుణాలను వెంటనే రద్దు చేయాలని శాసనమండలి సభ్యులు డాక్టర్ గేయానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపు మహిళల రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షురాలు యు ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం పెట్టారని, డ్వాక్రా గ్రూపు రుణాల మాఫీపై కూడా సంతకం చేశారన్నారు. ప్రస్తుతం డ్వాక్రా గ్రూపు మహిళల రుణాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదన్నారు. ఈ విషయంపై శాసనమండలిలో లేవనెత్తుతామన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన డ్వాక్రా పథకంలో ఎక్కువ మంది పేద మహిళలు ఉన్నారన్నారు. వారికి ఇచ్చిన రుణాల మొత్తం కూడా చాలా తక్కువేనన్నారు. పెద్దపెద్ద కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఐదు లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తుందని గుర్తు చేశారు. డ్వాక్రా రుణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో డ్వాక్రా గ్రూపు మహిళల రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అప్పటి నుండి డ్వాక్రా మహిళలు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించారన్నారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు గ్రూపు సభ్యులను డబ్బులు కట్టాలని వేధిస్తున్నారన్నారు. ఎలాంటి నిబందనలు లేకుండా రుణాలు రద్దు చేసి నూతన రుణాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటి పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు డ్వాక్రా రుణాల మాఫీపై పోస్టుకార్డులు పంపాలని నిర్ణయించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సమావేశంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, రమాదేవి, ప్రతినిధులు సృజన, రాజేశ్వరి, మాలతి, మల్లిక, పద్మ, మల్లేశ్వరి, కల్పన తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధికి చర్యలు
ఆర్ అండ్ బి శాఖ మంత్రి శిద్దా స్పష్టం
దర్శి, జూలై 14 : రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, వాటి అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. భధ్రతా వారోత్సవాల పేరిట టివి, పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1500 కొత్త బస్సులు కొనుగోలు చేసి నెలకు 40 నుండి 50 లక్షల డీజిల్ ఖర్చును తగ్గిందుకు ఆర్టీసీ ఎండి పూర్ణచంద్రరావుతో చర్చించినట్లు చెప్పరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తరువాత బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పది సంవత్సరాల నుండి మందకొడిగా సాగుతున్న ఆర్టీసీ డిపోల్లో టాయిలెట్స్ శుభ్రత, మినరల్ వాటర్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామన్నారు. వంద రోజులలో అన్ని డిపోలలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. సోలార్ సిస్టంను ఉపయోగించుకొని గుంటూరు, విజయవాడ వంటి పెద్ద డిపోల్లో విద్యుత్ ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు అధికారులకు 2 వేల 200 కోట్లు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. రవాణా అధికారులకు సొంత వాహనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను విడతలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధానికి అనుసంధానంగా రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ఆదేశిస్తే జడ్‌పి చైర్మన్ పదవికి రాజీనామా స్థానిక నేతలే తనకు పదవి రాకుండా అడ్డుకున్నారు జిల్లా అభివృద్ధికి కృషి జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర స్పష్టం
english title: 
eedara

సామాన్యుడి సమస్యలు శరవేగంగా పరిష్కరిస్తా!

$
0
0

శ్రీకాకుళం, జూలై 14:సామాన్యుడు తనవద్దకు వచ్చి చెప్పుకునే ప్రతీ సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ ప్రాధాన్యతపరంగానే ప్రజలకు అందించడంలో తనవంతు కృషి చేస్తా..ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి గ్రీవెన్స్‌సెల్ పనిచేసే విధానంలో చేర్పులు- మార్పులు తీసుకువస్తా... జిల్లాలో అక్రమంగా నడుపుతున్న ఇసుక దందాపై ఉక్కుపాదం మోపనున్నాను... అంటూ జిల్లాకు కొత్తగా వచ్చి కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తన బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలికిన తొలిపలుకులివి. సాధారణ ప్రజానీకం సమస్యలను శరవేగంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. శ్రీకాకుళం నూతన జిల్లా కలెక్టర్‌గా సోమవారం ఉద యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా చాలా మంచి ప్రాంతమని, అభివృద్ధి చేయడానికి అనే క అవకావాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు చక్కగా అమలు చేయవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు తమకు ప్రాధాన్యత కలిగినవేనని చెప్పారు. జిల్లాలో విద్య, వైద్యం తదితర రంగాలను బాగా అమలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాలానుగుణంగా ప్రభు త్వం జారీ చేసే సూచనలు, ఆదేశాలు అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని, పథకాల అమలులో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వలసల నివారణ తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు చేపడతామన్నారు. ఇసుక అక్రమరవాణా కూడా తన దృష్టికి వచ్చిందని, దీనిపై అధ్యయ నం చేస్తామని చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్‌తో చర్చిం చి తగు చర్యలు చేపడతామన్నారు. ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ సుస్పష్టం చేశారు. మండలాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రజావాణిలో అందుతున్న సమస్యలపై అధికారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని మార్పులు - చేర్పులు చేయుటకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి.వీరపాంఢ్యన్, అదనపు సంయుక్త కలెక్టర్ మహ్మద్ హషీమ్‌షరీఫ్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.సత్యన్నారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషా ఖాసీమ్, అధికారులు పాల్గొన్నారు.
ఉపారుద్రుడుని దర్శించుకున్న కలెక్టర్
సోమవారం ఉదయం ఇక్కడ శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ దర్శించారు. నూతనంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఉమారుద్రుడుని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కలెక్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాదాయశాఖ కమిషనర్ శ్యామలదేవి, ఆయల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి
* క్రీడల శాఖామంత్రి అచ్చెన్నాయుడు
బలగ, జూలై 14: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర యువజన, క్రీడల శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నా రు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం ఇండోర్‌లో నూతనం గా నిర్మించిన ఉడెన్ కోర్టు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు సంబంధించి కావలసిన నిధులను త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒలింపిక్స్ స్థాయి వంటి పోటీలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పేద క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. జిల్లాలో మినీ స్టేడియంల నిర్మాణానికి తమవంతు చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. అరబిందో ఫార్మసిటుకల్ పరిశ్రమ ఐదు లక్షల ఆర్థిక సహాయంతో ఉడెన్‌కోర్టు నిర్మాణానికి సహకరించారని, అదే తరహాలో మరిన్ని పరిశ్రమలు క్రీడాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సి.హెచ్.్ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, డిఎస్‌డిఒ జూన్‌గెల్యూట్, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి జి.ఏ.నాయుడు, ఉపాధ్యక్షుడు కె.సాగర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూరిబాబు, సంయుక్త కార్యదర్శి సైలాని, వూన్న నాగరాజు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

బాబ్జీ ఔట్... గుండ ఇన్!
శ్రీకాకుళం, జూలై 14: నిన్నటివరకు కేబినెట్ కూర్పు, ఆ తరువాత జెడ్పీ చైర్‌పర్సన్..నేడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి.. ఇలా ప్రతీ అంశాన్ని భూతద్దంలో చూస్తూ అచ్చెన్న, కళా వర్గాలు అధినేత చంద్రబాబును ఇరుకున పెడుతున్నాయి. తాజాగా జిల్లా పీఠం ఎపిసోడ్ ప్రారంభమైంది. జెడ్పీ చైర్‌పర్సన్ వంటి కీలకపదవిని బాబ్జీ సతీమణి ధనలక్ష్మీకి అప్పగించడంతో జిల్లా పార్టీ అధ్య క్ష బాధ్యతలను వేరే సామాజిక వర్గానికి కేటాయించాలని అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్టీఆర్ ట్రస్టు వర్గా లు మాత్రం అజాతశత్రువుగా ఉన్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు ఈ అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు వినికిడి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికవ్వడమే కాకుండా 1999 నుండి 2005 వరకు జిల్లా పార్టీ బాధ్యతలను నిర్వర్తించే అనుభవం ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని గుండ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే కేబినెట్‌తోపాటు శ్రీకాకుళం ఎంపి పదవి, నరసన్నపేట ఎమ్మెల్యే వంటి పదవులు ఆ సామాజిక వర్గానికి అప్పగించ డం వల్ల పాతకాపులను పరిశీలిస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా పాలకొండ డివిజన్‌కు ఈ బాధ్యతలను అప్పగించి ప్రాం తీయ సమతుల్యతను పాటించాలని మరో కోణంలో కూడా యోచిస్తున్నట్లు సమాచారం. సంతకవిటి ఎంపిపిగా, జెడ్పీటీసీగా సేవలందించడమే కాకుండా స్థానిక సంస్థల పదవులలో ఓటమి పాలవ్వకుండా సీనియర్ నేతగా ఎదిగిన కొల్ల అప్పలనాయుడు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక పాలకొండ జెడ్పీటీసీగా ఉన్న సామంతుల దామోదర పేరు కూడా వినిపిస్తోంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్న సామంతుల టిడిపిలో జూనియర్ కావడం ఓ మైనస్‌గా చెప్పవచ్చు. ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నేతలందరినీ ఐక్యంగా ముందుకు నడిపించాలంటే గుండకే జిల్లా పీఠం అప్పగించాలని చంద్రబాబు కిచెన్ కేబినెట్ సైతం భావిస్తున్నారు!. ఈ ప్రతిపాదనకు ఇటు కళా, అటు శివాజీలు అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదని హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్‌గా గుండను కూర్చోబెట్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సభ్యత్వ డ్రైవ్ నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఇప్పటికే ఈయన సతీమణి లక్ష్మీదేవి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భోగట్టా.

ఇదేనా మీ పనితీరు?
నిధులకు కొరత లేదు
అక్రమ లే అవుట్లపై పర్యవేక్షణేది?
పెద్దలపై ఉన్న ప్రేమ
పేదలపై ఉండదా?
అధికారులపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
శ్రీకాకుళం, జూలై 14: పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం...చినుకు పడితే జలాశయమే... మున్సిపల్ స్థలాలను ఆక్రమణ... కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు... అయినా పేదలకు మంచినీరివ్వలేక పోతున్నారు... ఏంటిది? ఇదేనా మీరు చేస్తున్న పని? పెద్దలపై ఉన్న ప్రేమ పేదలపై ఉండదా? వారికి ఒక రీతి, వీరికి ఒక రీతా? పట్టణ అభివృద్ధికి అసలు ప్రణాళికలు తయారుచేశారా? లేదా? ఇక నుండి అలా కుదరదు..అందరూ పనిచేయాల్సిందే. మా ప్రభుత్వంలో నిర్లిప్తత క్షమించేది లేదు. మరింత అభివృద్ధికి నిధులు అవసరమైతే ప్రభుత్వం నుండి రప్పించే గురుతర బాధ్యత మాపై ఉంది. సమస్యల పరిష్కారానికి మీ శాసనసభ్యురాలితో చర్చించండి. త్వరితగతిన పనులను పూర్తిచేసేలా చూడండి. అభివృద్ధికి తోడ్పడండి.రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక్కో విభాగపు అధికారిని నిలదీశారు. మంత్రితో పాటు శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు మున్సిపాల్టీలో ఇదివరకు నిర్వహించిన పనుల తీరుపై ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే అధికారులకు నీళ్లు నమలడం తప్ప మరో మార్గం కానరాలేదు. జిల్లా కేంద్రం అయి ఉండి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వేసిన రోడ్డుపైనే మరల మరల రోడ్డు వేసి నిధులు దుర్వినియోగం తప్ప ప్రజాభివృద్ధి పనులు కానరావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పన్నుల విధింపులో పెద్దలకు తక్కువ పన్ను, పేదలకు ఎక్కువ పన్నులు వేయడం భావ్యమేనా? ఇదేనా మీరు చేసే పని అంటూ రెవెన్యూ విభాగపు అధికారిని ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక రెవెన్యూ అధికారి మిన్నకుండటంతో తక్షణమే పది రోజుల్లో తక్కువ పన్ను చెల్లిస్తున్న పెద్దలను గుర్తించి, వారికి పన్ను సరిచేయాలని ఆదేశించారు. అధికారుల్లో నిర్లిప్తత కూడదని, మున్సిపల్ ఆదాయం పెరిగే అవకాశాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. అనంతరం పబ్లిక్ హెల్త్ పనితీరుపై మాట్లాడుతూ మున్సిపాల్టీలో ఈ విభాగంపై చెడ్డ పేరుందని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా చెత్త పేరుకు పోయి కంపు కొడుతోందని అధికారులు ఏంచేస్తున్నట్లు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తక్షణమే పరిష్కార మార్గం ఆలోచించి అమలు చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగానికి వచ్చేటప్పటికి మొత్తం వచ్చిన నిధులు, ఖర్చు వివరాలు అడిగి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చిన నిధులను ఖర్చు చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారంటే మీ పనితీరు అర్థమవుతుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధిలైట్లు వెలగడం లేదని, వర్షం వస్తే పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అధికారులు ఏంచేస్తున్నట్లని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ కలుగజేసుకొని 500 లెడ్ లైట్ల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పడంతో శాంతించిన ఆయన మిర్తిబట్టి పనులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు. ప్రణాళికలు తయారు చేశామని, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైందని, వర్షాలు పడలేదుకాబట్టి సరిపోయింది... లేదంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రతి గుత్తేదారుకు ఓ కాలపరిమితిని ఇచ్చి ఆ సమయంలోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పట్టణంలో మోడల్ సులాభ్‌కాంప్లెక్సుల ఏర్పాటుకు ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. మంచినీటి పరిస్థితి ఏంటని ప్రశ్నించిన మంత్రి 24 గంటల నీటి పథకం అమలులో ఉందా అని అడిగారు. అయితే తనకు తెలియదంటూ చెప్పిన మున్సిపల్ ఇంజనీరు సమాధానంనకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియదు, చేస్తాను, చూస్తాను అంటూ చెబితే కుదరదని, పేదలకు మంచినీరందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారి నుండి డే అండ్ నైట్ కూడలి వరకు నిర్మిస్తున్న రోడ్డు కిరువైపుల జాతీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ తరహాలో ట్యాంకు బండ్‌లా తయారు చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు లేకపోవడంతో పట్టణంలో ఉన్న రోడ్ల నిర్వహణ పట్ల సమీక్షిస్తుండగా ఆ శాఖాధికారులు రాకపోవడమేంటని ప్రశ్నించారు. అనంతరం అక్రమ లే అవుట్లను గుర్తించి తక్షణమే వాటిని కాపాడే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, శాసనమండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్, జెసి జి.వీరపాండ్యన్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
రు.40 లక్షలతో మిర్తిబట్టి పనులు చేశారా?
పట్టణంలో 40 లక్షల రూపాయలు ఖర్చుచేసి మిర్తిబట్టి పనులు చేపట్టారా? ఎక్కడ? ఎప్పుడంటూ శ్రీకాకుళం శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆమె అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. చినుకు పడితే పట్టణం జలమయం కావడానికి కారణమైన మిర్తిబట్టి పనులపై మున్సిపల్ ఇంజనీరు కె.రామ్మోహనరావు సమాధానం చెబుతూ ఇటీవలే 40 లక్షల రూపాయలు ఖర్చుచేసి స్థానిక పియస్‌యన్‌యం స్కూల్ వద్ద బట్టి పనులు చేపట్టామని చెప్పగా ఆమె తక్షణమే స్పందించి పనులు చేపట్టారా? ఎప్పుడంటూ ప్రశ్నించారు. ఇంజనీరు రామ్మోహనరావు నీళ్లు నముల్తుండగా పోనీ ఎక్కడ చేసారో చూపిస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతలో జాయింట్ కలెక్టర్ కలుగజేసుకొని ఖర్చుచేసిన వివరాలు అందించాలని అడుగగా, సంబంధిత విభాగపు అసిస్టెంటు ఇంజనీరు లేచి రెండేళ్ల క్రితం ఖర్చుచేశామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి ఇపుడు ప్రశ్నిస్తుంటే ఎప్పుడో రెండేళ్ల క్రితం నిర్మించిన విషయాన్ని గుర్తుచేస్తారేంటంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అప్పుడు కూడా మిర్తిబట్టి పనులకు ఖర్చు చేయలేదని, అక్కడి పరిస్థితులను బట్టి ఆ వార్డు కౌన్సిలర్ చొరవతో రెండు లక్షల రూపాయలు ఖర్చుచేసి కాలువ నిర్మించారని చెప్పారు. దీంతో అధికారుల పనీతీరు ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, పట్టణంలో ఏ పనిచేసినా తనకు తెలియకుండా చేయకూడదని ఆదేశిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తిరువల్లూరు బాధితులకు ప్రభుత్వ సాయం!
* ఒక్కొక్కరికి రూ. 5.25 లక్షలు
శ్రీకాకుళం, జూలై 14: ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో గోడకూలి మృతిచెందిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సోమవారం ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ కులానికి చెందిన కుటుంబాలు ఎక్కువగా వలసలకు వెళుతున్నాయన్నారు. యాదవ కులంలో నిరక్షరాస్యత ఉందని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వసతిగృహాల్లో వారి పిల్లలను చేర్చిలని కోరారు. ఈ సందర్భంగా ఒక్కో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మూడు లక్షల రూపాయలు, కార్మికశాఖ నుంచి రెండు లక్షల రూపాయలు, వారం రోజులపాటు పని కోల్పోయినందుకు 25 వేల రూపాయలు మొత్తంగా 5.25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మృతి చెందిన బాధిత కుటుంబాలలో బూర్మండలం కొల్లివలస గ్రామానికి చెందిన శెలగల పెంటమ్మ, కర్రి రాజులమ్మ, బొట్టా రామకుమారి 5.25 లక్షల రూపాయల చెక్కులను అందుకోగా, ప్రమాదంలో గాయపడిన శెలగల నాగరాజుకు 75 వేల రూపాయల చెక్కును విప్ కూన రవికుమార్ అందించారు. శాసనమండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ బాధితల పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం ఉండదని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ చెన్నై, తిరువల్లూరు సంఘటనలు బాధాకరమన్నారు. ప్రభుత్వ విప్ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పిల్లలను బడిలో చేర్చుతామన్నారు. వలసల నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా ఖాసీమ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎం.కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత లేదా?
శ్రీకాకుళం, జూలై 14: పట్టణంలోని పి.ఎన్. కాలనీలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేస్తే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్లని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. సోమవారం స్థానిక మున్సిపల్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల పనితీరుపై ధ్వజమెత్తారు. ఉదాశీన వైఖరితో అధికారులే అక్రమార్కులకు సహా యం చేస్తున్నట్లుందని విమర్శించారు. పిఎన్ కాలనీలో కాలనీ అభివృద్ధిలో భాగంగా వారు మున్సిపాల్టీకి అప్పగించిన 18 రిజర్వు స్థలాల్లో ప్రస్తుతం 13 స్థలాలు మాత్రమే మిగిలి ఉన్నాయని మరో ఐదు స్థలా లు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనికి టౌన్ ప్లానింగ్ అధికారి సమాధానం చెబుతూ అవి మున్సిపాల్టీకి రిజిస్టర్ కాలేదని అందుకే వాటి గూర్చి ఆలోచించలేదని చెప్పగా ఆయన మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. మిగిలిన 13 స్థలాలను ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారని, అసలు 18 స్థలాలు మున్సిపాల్టీకి అప్పగించినట్లు ఏవిధంగా ధ్రువీకరించారని ప్రశ్నించారు. దీంతో ఓ కాగితంపై వారు 18 స్థలాలు రాసిచ్చారని అధికారి తెలుపగా ప్రభుత్వానికి ఓ తెల్లకాగితంపై రాసిస్తే అవి ప్రభుత్వ పరం అవుతాయని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. ఇవన్నీ మీకు తెలుసని, అయితే ఆక్రమణదారులకు సహాయపడేందుకే మీరు తెలియనట్లు నటిస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్‌తో చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తక్షణమే అక్ర మ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లక్ష్మణవలసలో కుక్కల సంహారం
రేగిడి,జూలై 14: మండలంలోని తోకలవలస పంచాయతీ పరిధి గ్రామమైన లక్ష్మణవలస గ్రామంలో సోమవారం గ్రామస్థులు కుక్కలను హతమార్చా రు. గ్రామంలోని ఇటీవల గొర్లె, పశువులు, మనుషులను ఉమ్మడిగా దాడి చేసి గాయాలుపాలు చేస్తుండటంతో గ్రామస్థులను వీటిని హతమార్చారు. స్థానిక సర్పంచ్ లావేటి సరస్వతి, సర్పంచ్ ప్రతినిధి లావేటి సత్యంనాయుడు, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ హైదరావల్లి స్పందించి తన సొంత సొమ్ముతో కుక్కలను హతమార్చారు. హతమార్చిన 47 కుక్కలను గ్రామానికి శివారు ప్రాంతంలో పూడ్చినట్లు తెలిపారు.
జాబ్‌మేళాకు విశేష స్పందన
నరసన్నపేట, జూలై 14: మండల కేంద్రంలో ఇందిరక్రాంతి పథం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సం దర్భంగా ఐకెపి ఎ.పి.ఎం గోవిందరాజులు మాట్లాడుతూ పోలాకి, నరసన్నపేట మండలాలకు చెందిన పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు 27 మంది ఈ జాబ్‌మేళాకు ఎంపికయ్యారన్నారు. వీరికి ఎచ్చెర్ల వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో మూడు నెలలపాటు టైలరింగ్, కంప్యూటర్లపై శిక్షణ ఇవ్వనున్నారని వివరించారు. ఉచిత భోజన, వసతులతోపాటు ఏకరూప దుస్తులు, బూట్లు ఉచితంగా అందజేయనున్నారని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఒక్కొక్కరికి 3,200 రూపాయలు చొప్పున స్ట్ఫైండ్ ఇవ్వనున్నారన్నారు. అనంతరం వీరికి పలు కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని స్పష్టంచేశారు. ఎంపికైన విద్యార్థినులు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ రిసోర్స్ పర్సన్ కృష్ణవేణి, సి.ఎఫ్ రమపాల్గొన్నారు.

సామాన్యుడు తనవద్దకు వచ్చి చెప్పుకునే ప్రతీ సమస్యను సాధ్యమైనంత వేగంగా
english title: 
s

పిపిపి ప్రాజెక్టులపై బిడ్డర్ల నిరాసక్తత

$
0
0

* ఈ టాయిలెట్లు, బయోటాయిలెట్లకు రాని స్పందన
* ఫుట్‌పాత్‌ల నిర్వహణదీ అదేదారి
* బిఆర్‌టిఎస్ బస్‌షెల్టర్ల బిడ్‌ను విడదీయాలి
* మున్సిపల్ గెస్ట్‌హౌస్ నిర్వహణపై మడతపెచీ
విశాఖపట్నం, జూలై 14: మహావిశాఖ నగరపరిధిలో ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిన చేపట్టాలని భావించిన ప్రాజెక్టులకు బిడ్డర్ల నుంచి సానుకూలత వ్యక్తం కావట్లేదు. నగర పరిధిలో 12 ప్రాజెక్టులకు సంబంధించి కన్సల్టెన్సీ డాక్యుమెంట్లను సిద్ధం చేయగా, వీటిలో ఏఒక్కటీ ఇంకా గ్రౌండ్ కాలేదు. నగరంలో బహిరంగ మల,మూత్ర విసర్జనను నిర్మూలించేందుకు ఉద్దేశించిన ఈ టాయిలెట్లు, బయో టాయిలెట్ల నిర్వహణ అంశంపై ఇప్పటికే మూడు సార్లు బిడ్డింగ్‌లకు ఆహ్వానించినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నగరంలో 17 ప్రధాన సెంటర్లలో టాయిలెట్లు నిర్మించి, వాటిని నిర్వహించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి బిడ్‌లు జివిఎంసి ఆహ్వానించింది. వీటిని వినియోగించుకున్న వారి నుంచి రుసుం వసూలు చేసుకుని, 15 నెల్లపాటు వీటి నిర్వహణ ప్రైవేటు సంస్థలు చూడాలి. అయితే ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. చివరకు జివిఎంసి ఇద్దరు అధికారులను చెన్నై పంపి అక్కడ టాయిలెట్ల నిర్వహణ తీరును పరిశీలించి నివేదిక కోరింది. జగదాంబ, డైమండ్‌పార్కు, ఆర్‌కె బీచ్‌ల వద్ద ఈ టాయిలెట్ల నిర్వహణ విషయంలో నీటి సమస్య తలెత్తింది. ఇక్కడ కూడా టాయిలెట్ల నిర్వహణ మొదలు కాలేదు. ఇక నగర పరిధిలో 19 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ల నిర్వహణ విషయంలో కూడా ప్రైవేటు సంస్థలు నిరాశక్తత వ్యక్తం చేస్తున్నాయి. దీనితో పాటు జివిఎంసి నిర్మించిన పెందుర్తి, సింహాచలం బిఆర్‌టిఎస్ కారిడార్లలో బస్‌షెల్లర్ల నిర్వహణకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కీలక ప్రాంతాల్లో బస్‌షెల్టర్లను పిపిపి కింద తీసుకునేందుకు ముందుకు వస్తున్న సంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండని వాటి పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. వీటిని రెండుగా వర్గీకరించి, వేర్వేరు టారిఫ్‌లను నిర్ణయిస్తే తమకు అభ్యంతరం లేదంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌రోడ్డు సమీపంలోని జివిఎంసి గెస్ట్‌హౌస్ పునర్మిర్మాణం, నిర్వహణ అంశంలో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. తొలి అంతస్తులో 10 సూట్‌లను జివిఎంసికి కట్టబెట్టేందుకు బిడ్డర్ విముఖత వ్యక్తం చేయడంతో తిరిగి మరోసారి టెండర్ పిలవాలని భావిస్తున్నారు. డైమండ్‌పార్కు సమీపంలోని నెహ్రూ బజార్, బాజిజంక్షన్‌లోని వారపుసంతలో వ్యాపారులకు దుకాణాలను కేటాయిస్తూనే వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేయాలన్న జివిఎంసి ప్రతిపాదనకు కూడా బిడ్డర్ల నుంచి సానుకూలత వ్యక్తం కావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నగరంలోని మద్దిలపాలెం, జగదాంబ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించి, వాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ప్రతిపాదనకు కూడా పెద్దగా స్పందన రాలేదు.
ఇక లుంబినీ పార్కులో వౌలిక సదుపాయాలు కల్పించి, నిర్వహించేందుకు ఈనెల 31 వరకూ బిడ్లను ఆహ్వానించనున్నారు. సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశంలో భాగంగా కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో చెత్తను తొలగించి, ఆహ్లాదకరమైన పార్కు నిర్మించేందుకు 11 కంపెనీలు ఆసక్తివ్యక్తీకరించాయి. డీశాలినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి స్థల పరిశీలన ఎంపిక, ఫీజుబిలిటీ వంటి అంశాల ప్రతిపాదనలకు ప్రైవేటు సంస్థల నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తున్నారు. ఇక రైల్వే స్థలాల్లోని మురికి వాడలను నిర్మూలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అంశం కూడా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. నగరంలోని దయానందనగర్‌లో రెండు, తారకరామనగర్‌లో రెండు ధర్మశక్తి నగర్, కంచరపాలెం ప్రాంతాల్లోగల రైల్వే స్థలాల్లో నివశిస్తున్న వారిని వేరే ప్రాంతానికి తరలించకుండా, వారికి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేస్తూ మిగిలిన ప్లాట్లను బయటివారికి కేటాయించే ప్రతిపాదన కూడా ముందుకు కదలేదు. దీనితో పాటు నగరంలో ఖాళీస్థలాలకు పన్ను (విఎల్‌టి) విధించే అంశం విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. ప్రైవేటు వ్యక్తులచే ఖాళీ స్థలాలకు సంబంధించి అసెస్‌మెంట్లను తయారు చేసి, వారికి కొంతమొత్తం ఇచ్చే విధానంపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద పిపిపి కింద చేపట్టే ప్రాజెక్టుల వ్యవహారం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలట్లేదన్నది వాస్తవం.

రోజు విడిచి రోజు నీటి సరఫరా తప్పదు
* ఇప్పటికే సమయం కుదించిన జివిఎంసి
* రైతాంగం పట్టుబట్టినా నగరానికి తాగునీరు
* గాజువాకలో యుజిడి పనులకు డిపిఆర్ తయారీ
* జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, జూలై 14: తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆగస్టు 1 నుంచి తాగునీటి సరఫరాలో కఠిన నిర్ణయాలు తప్పేట్టులేదు. అడుగంటుతున్న జలాశయాల్లో నీటి నిల్వల దృష్ట్యా ఆగస్టు నుంచి రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేయనున్నట్టు జివిఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం ఆయన్ను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో ప్రజల తాగునీటి అవసరాలకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. రైవాడ, ఏలేరు, తాటిపూడి వంటి ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మరో రెండు నెల్ల వరకూ సరిపోతాయని, ఈమధ్యకాలంలో వర్షాలు కురవని పక్షంలో నీటి సరఫరా విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక రానున్నకాలంలో ఆస్తిపన్నుతో పాటే నీటిపన్ను డిమాండ్లను యజమానులకు జారీ చేయనున్నట్టు తెలిపారు. నీటి పన్ను బకాయిలను సమర్ధవంతంగా వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర పరిధిలో దాదాపు రూ. 21 కోట్లమేర మంచినీటి పన్ను బకాయిలు ఉన్నట్టు తెలిపారు. నగరంలోని 72 వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం ప్రాంతానికి సంబంధించి రూ 386 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. తొలి దశలో రూ 240 కోట్లతో రెండు దశల్లో చేపట్టిన పనులతో పాటు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద చేపట్టిన పనులు అక్టోబర్ మాసాంతానికి పూర్తిచేయనున్నట్టు తెలిపారు. అందరికీ యుజిడి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు ఆస్తిపన్నుతో పాటే ఛార్జీలను వసూలు చేసేందుకు ప్రతిపాదించామని ఆయన వెల్లడించారు. ఇక యుజిడి పనుల్లో భాగంగా రహదార్ల నిర్మాణం పనులపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. యుజిడి పనులు పూర్తయినప్పటికీ రహదార్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖాళీ స్థలాలకు పన్ను (విఎల్‌టి) వసూలు విషయంలో జివిఎంసి పూర్తిగా వెనుకబడిందని చెప్తూనే ప్రైవేటు వ్యక్తుల ద్వారా అసెస్‌మెంట్లను గుర్తించి వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. విఎల్‌టి ద్వారా జివిఎంసికి సాలీనా రూ. 150 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని అన్నారు.

ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలి
* జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, జూలై 14: ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి,పొడి చెత్తసేకరణకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని జివిఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఆయన నగరంలోని 37,38,39 వార్డుల్లో పర్యటించారు. అపార్ట్‌మెంట్‌లలో యజమానులు తడి,పొడి చెత్తలను వేర్వేరుగా కార్మికులకు ఇవ్వాలని సూచించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అందరిబాధ్యతని అన్నారు. జివిఎంసి పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినా ప్రజల సహకారం అవసరమని అన్నారు. అంతకు ముందు వార్డులో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, పనుల నిర్వహణ అంశాలను స్థానికుల నుంచి ఆరాతీశారు. ప్రస్తుతం నగరంలో 39 వార్డుల్లో మాత్రమే తడి,పొడి చెత్తల సేకరణ జరుగుతోందని, మిగిలిన వార్డుల్లో కూడా చెత్తసేకరణ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సేకరించిన తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చేందుకు ఆరిలోవ, గాజువాక, వేపగుంట ప్రాంతాల్లో పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఘన వ్యర్థాలను వేరు చేయడం ద్వారా మిగిలిన చెత్తను మాత్రమే డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నట్టు తెలిపారు. అనంతరం చావులమదుం నుంచి పోర్టురోడ్డు, పాతపోష్ట్ఫాసు, పూర్ణామార్కెట్, పెదవాల్తేరు, బీచ్‌రోడ్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

పారిశుద్ధ్య కార్యక్రమాలను బాధ్యతతో నిర్వహించండి
అనంతరం జివిఎంసి ప్రధాన కార్యాలయం పాతకౌన్సిల్ హాల్‌లో జోన్ 4కు చెందిన ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటరీ ఇనస్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. మెగాసిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన నగరంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సిఎంఓ సత్యనారాయణ రాజు ఇతర ప్రజారోగ్య విభాగంగ అధికారులు పాల్గొన్నారు.

వుడా ఇన్‌ఛార్జ్ విసిగా జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, జూలై 14: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఇన్‌ఛార్జ్ వైస్‌చైర్మన్‌గా జివిఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణను నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సత్యనారాయణ సోమవారం ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యనారాయణ వుడా కార్యదర్శి డాక్టర్ జి.సి.కిషోర్‌కుమార్ సహా ఇతర విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలు,పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వుడాకు సంబంధించి కోర్టులో ఉన్న కేసుల వివరాలపై ఆరాతీశారు. జివిఎంసి పరిధిలో వుడా చేపట్టిన మాస్టర్‌ప్లాన్ రహదారుల అభివృద్ధిపై వుడా చీఫ్ ఇంజనీర్ ఐ.విశ్వనాధరాజుతో చర్చించారు. గ్రీన్ విశాఖ ప్రాజెక్టుల పనుల ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలనాపరంగా తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలపై కార్యదర్శి ఇన్‌ఛార్జ్ విసికి వివరించారు. కార్యక్రమంలో చీఫ్ అకౌంట్స్ అధికారి డి.విజయభారతి, చీఫ్ అర్బన్ ప్లానల్ ఆర్.జె.విద్యుల్లత, ఎస్టేట్ అధికారి బి.్భవానీదాస్, డిఎఫ్‌ఓ బి.రాజారావు, మేనేజర్ నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది ఇన్‌ఛార్జ్ విసికి శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్య సాధనలో అలసత్వం వద్దు
* వుడా అధికారులకు కలెక్టర్ ఉద్బోధ
విశాఖపట్నం, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వుడా మొదటి స్థానంలో ఉందని, విధుల నిర్వహణ, లక్ష్యాల సాధనలో అలసత్వం వద్దని ఎన్.యువరాజ్ ఉద్బోదించారు. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన యువరాజ్ వుడా వైస్‌ఛైర్మన్‌గా బాధ్యతల నుంచి రిలీవ్ అవుతూ సిబ్బందితో మాట్లాడుతూ అభివృద్ధితో పాటు అన్ని అంశాల్లోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖకు, వుడాకు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. విధినిర్వహణలో ఎవరు తప్పుచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని అన్నారు. వుడా కార్యకలాపాల్లో జిల్లా కలెక్టర్‌గా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తన పాలనాకాలంలో సహకరించిన ఉద్యోగులు, అధికారులకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వుడా అధికారులు కిషోర్‌కుమార్, విశ్వనాధరావు, విజయభారతి, విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ మంత్రి జిల్లాలో టీచర్ల నిర్లక్ష్యం
* అక్రమాల కంపుకొడుతున్న మధ్యాహ్న భోజనం
* హాజరుపట్టిలో సంతకం చేయని హెచ్‌ఎం
* మంత్రి తనిఖీతో బయటపడిన వైనం
విశాఖపట్నం, జూలై 14: ఎలుగు తోలు పట్టి ఎన్నాళ్లు ఉతికినా.. నలుపు నలుపే కానీ తెలుపు రాదు.. అన్నట్టుంది ఉపాధ్యాయుల వైఖరి. ప్రభుత్వాలు ఎన్ని మారినా, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టలేకపోతోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..సంస్కరణలు తీసుకువచ్చి.. నాణ్యమైన విద్యను అందిస్తామని చెపుతున్న పాలకులు ఉపాధ్యాయుల మైండ్‌సెట్‌ను మార్చలేకపోతోంది. ఉద్యోగం వచ్చే వరకూ నానా అగచాట్లు పడి.. ఆ తరువాత వారి ఇస్టారాజ్యంగా వ్యవరిస్తున్న ఉపాధ్యాయులు లెక్కకు మించి ఉన్నారు. విద్యార్థులు పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ వ్యవస్థే అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే ఎలా? ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు బాధ్యత గల ఉపాధ్యాయులే గండి కొడితే ఏమనుకోవాలి? విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఇంకేంటి? పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, చదువుకోడానికి ఇష్టపడని వారిని సైతం బడులకు రప్పించేందుకు నిర్దేశించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులే భోంచేస్తే, క్రమశిక్షణ అనే పదానికి అర్థమేముంది? నీతి, నిజాయితీలతో నడవాల్సిన ఉపాధ్యాయులు నీతి తప్పితే, విద్యావ్యవస్థ నిర్వచనమే మార్చుకోవలసి ఉంటుంది. ఎందుకింత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చిందంటే.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం చేసిన ఆకస్మిక తనిఖీలో ఒక స్కూల్ పనితీరు చూస్తే ఎవ్వరికైనా ఏవగింపు కలుగక మానదు.. అదే..ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలోని ప్రభుత్వం పాఠశాల..
ఉదయం 11 గంటల సమయం.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ.. బల్బుకారును చూడగానే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడిరాజు ఉరుకులు..పరుగులతో వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మంత్రిగారు కారు దిగిన వెంటనే ప్రధానోపాధ్యాయుని గదికి వెళ్లి టీచర్ల హాజరు పట్టిని పరిశీలించారు. ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లంతా సంతకాలు చేశారు..కానీ వీరందరికీ బాస్ అయిన ప్రధానోపాధ్యాయుడు మాత్రం రిజిస్టర్‌లో సంతకం చేయలేదు. బాధ్యతల వ్యక్తివై ఉండి..నీవే సంతకం చేయకపోతే ఎలా అంటూ మంత్రి చిన్నగా మందలించారు. ఆ తరువాత అబ్రహంలింకన్ తన కుమారుడి గురించి ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖను ప్రభుత్వం కరపత్ర రూపంలో ముద్రించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించింది. మంత్రి గంటా ఆ లేఖను చదివారు. సిలబస్‌ను ఎలా ఫాలో అవుతున్నారు? టైంటేబుల్ వగైరాలను గంటా పరిశీలించారు. నీవు నిర్వహిస్తున్న డైరీ ఏదని హెడ్మాస్టర్‌ను అడిగారు. హెచ్‌ఎం పైడిరాజు నీళ్లు నమిలారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగారు. ఇక అక్కడి నుంచి స్కూల్ సిబ్బందిలో మొదలైంది టెన్షన్.. మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అదే స్కూల్‌లోని సైన్స్ టీచర్ వచ్చి రికార్డును మంత్రి గంటాకు అందచేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ను తయారు చేసి ప్రతి స్కూల్‌కు అందచేశారు. కానీ ఈస్కూల్‌లో భోజన వివరాలను సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్‌లో రాయడాన్ని గంటా గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఇన్‌చార్జ్ ఎడీఓను కూడా ఈ విషయమై గంటా గట్టిగా నిలదీశారు. ఆ తరువాత ఎక్కడి నుంచో సదరు బోజన రిజిస్టర్ ఊడిపడింది. మంత్రి గంటా రిజిస్టర్‌ను పరిశీలించగా, జూలై నెల ఒకటో తేదీ నుంచి అందులో ఎంట్రీలే లేవు. ఇక్కడే అసలు లొసుగులు వెలుగు చూశాయి. స్కూల్‌లో విద్యార్థులు భోజనం చేసినా, చేయకపోయినా, కాగితాలపై మాత్రం చూపిస్తున్నట్టు అర్థమైంది. ఏరోజుకు ఆరోజు ఉండాల్సిన ఎంట్రీలు నెలకోసారి రాయడాన్ని బట్టి ఈ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులే భోంచేస్తున్నారని అర్థమైంది. వెంటనే ఆగ్రహించిన గంటా సంబంధిత వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేయమని ఆదేశించారు.
అక్కడి నుంచి పక్క గదికి వెళ్లిన మంత్రి గంటా మరింత షాక్‌కు గురయ్యారు. స్కూల్‌లో ఉన్న కంప్యూటర్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అవన్నీ అంగుళం మేర ధూళిపట్టి ఉన్నాయి. వైర్లు ఊడిపోయి.. వౌస్‌లు విరిగిపోయి కనిపించాయి. చాలా వరకూ యుపిఎస్‌లు మాయమైపోయాయి. ఆ పక్కనే పాఠ్య పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. వాటి పక్కనే బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆపక్కనే లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన జనరేటర్ ఎందుకూ పనికిరాకుండా పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూస్తే అది స్కూలా? గొడౌనా అన్న అనుమానం ఎవ్వరికైనా కలుగకమానదు. సరే! క్లాస్ రూం ఎలా ఉందో చూద్దామని వెళ్లిన విద్యాశాఖ మంత్రి గంటాకు అక్కడ మరో షాక్! క్లాస్ రూంలో ఉన్న ఫ్యాన్ గడచిన మూడు నెలల నుంచి తిరగడం లేదు. ఇదేమని హెచ్‌ఎంని ప్రశ్నిస్తే నీళ్ళు నమలడం మళ్లీ ఆయన వంతైంది. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిఫారంలు కొంతమంది అందాయి.. మరికొంతమంది సొంతంగా కొనుక్కున్నారు. స్కూల్ పిల్లల తెలివితేటల్ని తెలుసుందామని గంటా ప్రత్నించారు. కొన్ని ప్రశ్నలు వేశారు. తడబాటు విద్యార్థుల వంతైంది. ఆ పక్కనే ఉన్న తరగతి గదిలో విద్యార్థుల పరిస్థితి చూస్తే మరింత అధ్వాన్నంగా ఉంది. విరిగిన కుర్చీలు, తిరగని ఫ్యాన్‌లు, పక్కనే మధ్యాహ్న భోజనం వండడం కోసం తెచ్చిన సరుకులు, కట్టెపుల్లలు. వీటి మధ్య సగటు విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆ పక్క గదిలోనే స్టేట్ బ్యాంక్ ఇండియా విరాళంగా ఇచ్చిన వాటర్ ఫిల్టర్ ఎక్కడిక్కడ విరిగిపోయి కనిపించింది. అక్కడి నుంచి మంత్రి టాయిలెట్స్‌ను పరిశీలించి వెనుదిరిగారు. సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి ఉన్నా కనీస భయం లేకుండా పిల్లల కోసం వండిన భోజనాన్ని పాఠశాల ఆవరణలో పోసి, దానిపై గుడ్డ కప్పారు. దానిచుట్టూ ఈగలు ముసిరి ఉన్నాయి. మంత్రిగారికి మనం వండిన భోజనాన్ని రుచిచూపించండిరా అంటూ టీచర్లు ఆదేశించడంతో అక్కడ ఉన్న వంట మనుషులు ఈ ఈగలు ముసిరిన అన్నం కుప్ప నుంచి పిడికెడు అన్నాన్ని ఓ ప్లేట్‌లో ఉంచి ఆయనతో తినిపించారు. ఈగలు ముసిరిన వ్యవహారం పాపం ఆయనకు తెలియక వేడిగా ఉందని ఓ స్పూన్ అన్నాన్ని రుచి చూశారు. దటీజ్..గిడిజాల గవర్నమెంట్ స్కూల్.
ఇదీ మన స్కూళ్ళ ముచ్చట. రాష్ట్రంలోని పాఠశాలల దయనీయ స్థితికి ఈ స్కూల్ ఒక మచ్చుతునక మాత్రమే. ఒకే స్కూల్‌లో మంత్రిగారికి ఇన్ని ట్విస్ట్‌లు ఎదురైతే, రాష్ట్రంలోని మిగిలిన స్కూళ్ళలో ఉపాధ్యాయులు ఇంకెన్ని షాక్‌లు ఇస్తారో!

ఐటి పరిశ్రమ నిలదొక్కుకునేనా
* మంత్రి రాకతోనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా?
విశాఖపట్నం, జూలై 14: సుమారు రెండు సంవత్సరాల కిందట అప్పటి ఐటి మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్యయ్య వచ్చి రుషికొండ ఐటి సెజ్‌లో హడావుడి చేశారు. హైదరాబాద్ తరువాత విశాఖను ఐటి హబ్‌గా మార్చుతామని, ఐటి కంపెనీలను ఇబ్బడి ముబ్బిడిగా తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అనేక వరాలు కూడా ఇచ్చారు. ఆ తరువాత ఐటి మంత్రికానీ, ఐటి శాఖ కార్యదర్శికానీ విశాఖవైపు కనె్నతైనా చూడలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖను ఐటి హబ్‌గా మార్చుతామని చెపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మంగళవారం ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి విశాఖ వస్తున్నారు. ఆయన మధురవాడ ఐటి సెజ్‌ను పరిశీలించనున్నారు. అయితే ప్రభుత్వం ఊహిస్తున్నంత స్థాయిలో విశాఖలో ఐటి పరిశ్రమలు మెరుగ్గా లేవు. సుమారు ఆరు సంవత్సరాల కిందట రుషికొండ హిల్-1,2,3లపై ఐటి కంపెనీలు ఏర్పాటు చేయడానికి కొండలను పిండి చేసి మరీ స్థలాలను కేటాయించారు. కానీ ఇప్పుడు ఈ మూడు కొండలపై కేవలం ఐదు నుంచి ఏడు కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు కనీసం నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టని దుస్థితి ఉంది. నిర్ణీత సమయంలో పనులు కంపెనీలను ప్రారంభించకపోవడం వలన మంజూరు చేసిన స్థలాలను వెనక్కు ఇవ్వాల్సిందిగా ఎపిఐఐసి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇలా పదేపదే నోటీసులు ఇచ్చినా, స్థలాలను వెనక్కు తీసుకోలేదు. స్థలాలను వెనక్కు తీసుకోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని ఎపిఐఐసి అధికారులు వెనకాడుతున్నారు. ఇదిలా ఉండగా రుషికొండ ఐటి సెజ్‌ను డీ నోటిఫైడ్ చేయాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. దీనివలన ప్రస్తుతం ఉన్న భవనాలను కొత్తగా వచ్చే ఐటి కంపెనీలకు లీజుకు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఐటి పరిశ్రమల కోసం స్థలాలను తీసుకున్న వారు ఎకరాకు 100 మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన ఆనాడు విధించారు. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఈ నిబంధనను పాటించడం లేదు. స్థానిక టిబి సెంటర్ వద్ద విప్రోకు 7.2 ఎకరాలను సుమారు ఎనిమిదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రెండు వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ ఇందులో కేవలం 680 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 300 మంది శిక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా విప్రో సంస్థలో 1.5లక్షల మంది వరకూ పనిచేస్తుంటే, అందులో 0.5 శాతం మందికి మాత్రమే విశాఖ యూనిట్‌లో అవకాశం కల్పించింది. ఇక గంభీరంలో వంద ఎకరాల భూమిని ఐటి పరిశ్రమల కోసం అధికారులు కేటాయించారు. కానీ నేటికీ ఒక్క పరిశ్రమ కూడా అక్కడ నెలకొల్పలేదు. మరోపక్క విశాఖకు మంజూరైన ఐటిఐఆర్ కోసం నక్కపల్లి వద్ద తొమ్మిది వేల ఎకరాలను గుర్తిస్తే, ప్రభుత్వం ఆ భూమిని తీసుకునేందుకు ససేమిరా అంటోంది. దీనివలన కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు రాకుండా పోతున్నాయి. విశాఖకు ఐబిఎం వంటి ప్రతిష్ఠాత్మక ఐటి పరిశ్రమ రావల్సి ఉన్నప్పటికీ, తగిన వౌలిక సదుపాయాలు లేకపోవడం వలన రావడం లేదు. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటి కంపెనీలన్నీ కుదేలయ్యే దుస్థితిలో ఉన్నాయి. రుషికొండపై ఏర్పాటు చేసిన ఐటి పరిశ్రమల్లో మూడు, నాలుగు వరకూ మూతపడ్డాయంటే ఇక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను ఐటి హబ్‌గా మార్చాలనుకుంటే, ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
విప్రోను సందర్శించిన విష్ణుకుమార్ రాజు
ఇదిలా ఉండగా విప్రో యాజమాన్యాం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారం విప్రో కంపెనీని సందర్శించి, అక్కడి యాజమాన్యంతో మాట్లాడారు. నిర్దేశించిన విధంగా ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వలన ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునేలా నోటీసులు ఇవ్వాలని ఎపిఐఐసి అధికారులను ఎమ్మెల్యే రాజు ఆదేశించారు.

భూముల రక్షణలో అధికారుల తప్పులను ఉపేక్షించేదిలేదు
* మన్యం రోగాలపై ప్రత్యేక కార్యాచరణ
* ప్రజావాణి, ‘డయల్ యువర్ కలెక్టర్’ కొనసాగింపు
* మన్యం రోగాలను నియంత్రిస్తాం
బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ యువరాజ్
విశాఖపట్నం, జూలై 14: ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు తప్పు చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎన్.యువరాజ్ హెచ్చరించారు. రాష్ట్ర విభజన తరువాత తొలి కలెక్టర్‌గా సోమవారం ఉదయం 10గంటలకు ఇక్కడి కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రక్రియ జిల్లాలో చురుగ్గా కొనసాగుతోందని, దీనికి సంబంధించిన హద్దులు, బోర్డులు తగిలించడం, మ్యాప్‌లు వంటివి సిద్ధమవుతున్నాయన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో జిల్లాలో భూముల విలువ మరింత పెరుగుతున్న నేపధ్యంలో వీటిపై అన్ని రకాలైన రక్షణా చర్యలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా, దీనిని మరింత పరిష్టపరుస్తున్నట్టు చెప్పారు. టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఇందుకోసం అంతా సహకరించాలన్నారు. అపుడే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. భూముల పరిరక్షణ, ప్రజాపంపిణీ వ్యవస్థలకు సంబంధించిన బాధ్యతలు జాయింట్ కలెక్టర్ నిర్వహిస్తారన్నారు. భూ ఆక్రమణలపై దృష్టిపెట్టి వీటిని పూర్తిగా నియంత్రిస్తామన్నారు.
* మన్యం రోగాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, వీటిని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు. గర్భిణీల మరణాల శాతం ఎక్కువుగా ఉంటుందన్నారు. వైద్యులు, పరికరాలు, మందులు, కింది స్థాయి సిబ్బంది ఈ విధంగా ప్రతిఒక్కటీ ఖచ్చితంగా ఉన్నపుడే పూర్తిస్థాయిలో వైద్యం అందుతుందని ఆయన స్పష్టంచేశారు. అలాగే కెజిహెచ్‌లో వైద్య సదుపాయాలు మెరుగుకు, అనేక రకాలైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. కొన్ని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఆసుపత్రిలో సమస్యల గురించి ఇటీవల సూపరింటెండెంట్ తన దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రమాద రహిత పరిశ్రమలుగా మార్పు
పరిశ్రమల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, తద్వారా ప్రమాదరహిత పరిశ్రమల మార్పు చేసేందుకు వీలుంటుందన్నారు. కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, పాత వాటిలో ప్రమాదంలో పెరిగిపోతున్నందున ఈ క్రమంలో వీటి నియంత్రణకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ప్రజావాణి కొనసాగింపు
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. వీటి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆయన స్పష్టంచేశారు. పారదర్శకతతో సేవలందిస్తూనే వీలైనంత త్వరితగతిన వీటిని పరిష్కరిస్తామన్నారు. ఎన్ని పరిష్కారం అయ్యాయి? ఆలస్యానికి, తిరస్కరించిన వినతులు, ఏఏ మండలాల నుంచి ఎనె్నన్ని వచ్చాయి? పరిస్థితిని కూడా ఇక నుంచి దరఖాస్తుదారులకు తెలియజేసే విధానం అమల్లోకి రానుందన్నారు. ప్రజావాణి ద్వారా బాధితులు అందజేసే పిర్యాదులను ఇంతవరకు నమోదు చేసి తగిన రసీదులు ఇవ్వడమనేది ఉందని, దీనివల్ల సంబంధిత తహశీల్దార్లకు ఈ వినతులను పంపించేవారన్నారు. ఇక నుంచి వీటిని కలెక్టరేట్ నుంచే స్కాన్ చేసి అప్‌లోడ్ ద్వారా నేరుగా వారికి పంపడం జరుగుతుందన్నారు. దీనివల్ల తక్షణమే స్పందించేందుకు వీలవుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, అదనపు జెసి పాల్గొన్నారు.

గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్
* పవర్ హాలీడేని ఎత్తివేశాం
* ఏడు గంటల వ్యవసాయ విద్యుత్ అమలు
* నెలకు 1.85 ఫిర్యాదులు
* విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు కొత్త కాల్‌సెంటర్లు
విశాఖపట్నం, జూలై 14: గృహ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు 24గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ చిరంజీవిరావు తెలిపారు. గురుద్వారా జంక్షన్ సమీపానున్న సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా 24గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. సంస్థ పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 50 లక్షల విద్యుత్ సర్వీసులుండగా వీటికి ప్రతిరోజు 40 మిలియన్ యూనిట్లు వాడకం ఉంటుందన్నారు. మరో ఎనిమిది మిలియన్ యూనిట్లు అదనంగా ఉంటే కోతలనేవే ఉండవన్నారు. లేదంటే వాడకం తగ్గినా సమస్యలు తీరుతాయన్నారు. చల్లబడిన వాతావరణం సహకరించిందని, దీనివల్ల సోమవారం 15.35 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా, 14.18మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారన్నారు. పరిశ్రమలకు (హెచ్‌టి)కి రోజుకీ 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటుందన్నారు. పరిశ్రమలకు ఉండే ‘పవర్ హాలిడే’ను ఎత్తివేసామని, అలాగే ఏడు గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందివ్వగలుగుతున్నామన్నారు. ఒకటవ తేదీ నుంచి వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. దీనిలో భాగంగా పది ప్రధానమైన అంశాలను దీని పరిగణనలోకి వస్తాయన్నారు. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా మెరుగైన, నాణ్యతతో కూడిన విద్యుత్‌ను అందివ్వడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు. దెబ్బతినే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు మార్పు, లో టెన్షన్ (ఎల్‌టి) నెట్‌వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను మెరుగుపర్చడం, విద్యుత్ అధిక లోడ్‌ను భరించే ట్రాన్స్‌ఫార్మర్లను అభివృద్ధిపర్చడం, ఏబి స్వీచ్‌ల మార్పు, వేలాడే తీగలు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి సత్వరమే మార్పు చేయడం, లోవొల్టేజీ, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌పై కార్యాచరణ రూపొందించి పరిష్కరించడం, వాణిజ్య సముదాయాలకు ఎనర్జీ ఆడిట్‌ను నిర్వహించడం, వినియోగదారుల కేంద్రాలు, వసూళ్ళ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి పది అంశాలను వంద రోజుల కార్యక్రమంలోకి తీసుకువచ్చామన్నారు. సంస్థ జనరల్ మేనేజర్ (ఆపరేషన్-1) వైఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా చింతపల్లిలోను, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో కొత్తగా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇంతవరకు స్టేజ్-1 కాల్‌సెంటర్లు తొమ్మిది, స్టేజ్-2 కాల్‌సెంటర్లు 64 ఉన్నాయన్నారు. క్యాటిగిరీ, పేరు మార్పు, ఎల్,టి, వ్యవసాయ సంబంధిత సమస్యలు వీటి ద్వారా సత్వరమే పరిష్కారమవుతాయన్నారు. ప్రతినెల 1.85లక్షల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇక నుంచి పిర్యాదు చేసే వినియోగదారునికి ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. పిర్యాదును నమోదు చేసుకుని దాని పరిస్థితి గురించి వివరిస్తామన్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో జరిగే జాప్యాన్ని నివారించే ఎటువంటి లోపాలు లేని సేవలు అందించేందుకుగాను వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (విటిఎస్)ను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి వారం టెలికానె్ఫరెన్స్ ద్వారా సమస్యల పరిష్కారంపై అధికారులతో సంస్థ సిఎండి ఎంవి శేషగిరిబాబు సమీక్షిస్తున్నారన్నారు.

మమ్మల్ని కొనసాగించాలి
* కలెక్టరేట్ వద్ద ఆదర్శ రైతుల ధర్నా
విశాఖపట్నం, జూలై 14: ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మానవతా దృక్ఫథంతో వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఏపీ స్టేట్ ఆదర్శ రైతుల అసోసియేషన్ (ఏపిఎస్‌ఏఆర్‌ఏ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచి ఆదర్శ రైతులు తరలివచ్చారు. తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఎన్.శేఖర్ మాట్లాడుతూ జివో నెంబఱ్ 284 ప్రకారం ఆదర్శ రైతు వ్యవస్థను నియమించిందని, 2007 ఏప్రిల్ ఒకటవ తేదీన స్వామినాథ్ కమిటి సిఫారుసుల మేరకు ఆదర్శ రైతుల వ్యవస్థను నియమించిందన్నారు. ఆంధ్ర రాట్రంలో సుమారు 24 వేలు మంది ఆయా జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వ యంలో 2007లో ఆదర్శరైతులుగా నియామకాలు జరిగాయన్నారు. ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా కనీస విద్యార్హతతో ఎన్నుకోబడ్డారన్నారు. 2008 ఏప్రిల్ ఒకటవ తేదీన 200 నుంచి 250 మంది రైతుల కుటుంబాలకు ఒక ఆదర్శ రైతును నియామకం చేసి, రెండు విడతల్లో వీరందర్ని నియమించడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ శాకలైన వ్యవసాయం, ఉద్యానవన శాఖ, వెటరనీ, సెరికల్చర్,హార్టికల్చర్ ఫిషరీస్, చక్కెర, రెవెన్యూ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, మార్కెటింగ్, ట్రాన్స్‌కో, ప్రకృతి విపత్తుల నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమల్లోను ఆదర్శ రైతులు పాలుపంచుకోవాలన్నారు. ఇటువంటి దీనిని కాపాడి, రైతుల జీవితాలను రక్షిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బి.ఆదినాయుడు, ఎల్.గోపి తదితరులు పాల్గొన్నారు.

* ఈ టాయిలెట్లు, బయోటాయిలెట్లకు రాని స్పందన * ఫుట్‌పాత్‌ల నిర్వహణదీ అదేదారి * బిఆర్‌టిఎస్ బస్‌షెల్టర్ల బిడ్‌ను విడదీయాలి * మున్సిపల్ గెస్ట్‌హౌస్ నిర్వహణపై మడతపెచీ
english title: 
ppp

కొత్త కలెక్టర్‌కు సమస్యల స్వాగతం

$
0
0

విజయనగరం, జూలై 14: కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.ఎం.నాయక్‌కు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. జిల్లాను భౌగోళికంగా చూస్తే.. ఇక్కడ గిరిజన, మైదాన, తీర ప్రాంతాలు ఉన్నాయి. ఈ మూడు రకాల సమస్యలు ఇక్కడ ప్రస్ఫుటిస్తున్నాయి. వీటిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఏదంటే మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలను ఐటిడిఎలో విలీనం చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే మిగిలి ఉంది. గిరిజన ప్రాంతాల్లో వౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 1/70 చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే తోటపల్లి ప్రాజెక్టు చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తప్ప సాగునీరు అందే అవకాశాలు లేవు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇక అంతరాష్ట్ర జల వివాదం కింద జంఝావతి వివాదం గత నాలుగు దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉంది. అక్కడ కేవలం 300 కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో ఒడిశా, ఆంధ్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో ఆ వివాదం నేటికి కొలిక్కి రాలేదు. ఇక ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో ఉన్న 21 కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వెళ్తాయనే విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ గ్రామాలు ఆంధ్రలో చూపలేదు. అదే విధంగా ఒడిశాలో కూడా చూపకపోవడంతో ఈ గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వెళ్తాయనేది మిస్టరీగా మారింది. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఒడిశా భాషను మాట్లాడుతున్నారు. ఈ గ్రామాల్లో ఆంధ్ర, ఒడిశా రెండు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నాయి. వీరు రెండు రాష్ట్రాల నుంచి లబ్ధిపొందుతున్నారు. ఈ గ్రామాలు తమవేనంటూ ఒడిశా ప్రభుత్వం చెబుతుండగా, తమవేనంటూ మన రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. కాగా, ఈ కొండల్లో బాక్సైట్ నిక్షేపాలు కూడా అధికంగా ఉండటంతో ఒడిశా ప్రభుత్వం కూడా ఈ గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పెద్దగెడ్డ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ ఆశించిన మేర సాగు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. టైలాండ్ పాయింట్ వరకు సాగునీరు అందాల్సి ఉండగా అక్కడ వరకు సాగునీరు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక సంక్షేమ పథకాలను పరిశీలిస్తే... జిల్లాలో వలసలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ జిల్లాలో వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ కూలీ కంటే ఎక్కువ వేతనం వస్తుందని ఆశపడి ఇటీవల చెన్నై వెళ్లిన భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన విషయం విధితమే. ఈ విధంగా ఇక్కడ కూలీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, జిల్లా కేంద్రంలో ప్రజలకు మంచినీరు పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదు. ఇక్కడ సుమారు 2.25 లక్షల మంది నివాసం ఉండగా గత కొనే్నళ్లుగా రెండు రోజులకోమారు నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. ప్రతి మనిషికి రోజుకు 130 లీటర్లు అవసరమని అంతర్జాతీయ సంస్థలు చెబుతుండగా, కనీసం అందులో సగం నీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పట్టణ వాసులకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందించాలంటే రామతీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వ్యవసాయం పరిస్థితి చూస్తే.. చుట్టుపక్కల జూట్ పరిశ్రమలు ఉన్నప్పటికీ గోగు పండించే రైతులు ఏడాదికాయేడాది తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో అత్యధికంగా 40వేల హెక్టార్లలో గోగు పండించగా, నేడు పదివేల హెక్టార్లు కూడా గోగు సాగు చేయడం లేదు. దీంతో ఇక్కడ జూట్ పరిశ్రమలు పశ్చిమబెంగాల్ నుంచి జూట్‌ను కొనుగోలు చేస్తున్నాయి. దీని వల్ల పరిశ్రమలకు ఉత్పాదక ఖర్చు పెరుగుతోంది. మరోపక్క ప్రతీ ఏటా గోగు పరిశ్రమలు వివిధ కారణాల వల్ల మూతపడుతున్నాయి. వీటిని నివారించాలంటే గోగు పంటను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా వివిధ రంగాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తే జిల్లాను ముందంజలో నడిపే అవకాశం ఉంటుంది.

పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్తా
విజయనగరం, జూలై 14: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా చూస్తానని జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ చెప్పారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఆయన బదిలీపై వెళ్లనున్న కలెక్టర్ కాంతిలాల్ దండే నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో అధికారులను, రాజకీయ నాయకులను కలుపుకొని అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధిపరుస్తానన్నారు. జిల్లాను అభివృద్ధిపథంలో నడిపేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

‘ట్రీట్‌మెంట్ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు’
విజయనగరం, జూలై 14: పట్టణంలోని పెద్ద చెరువు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మీసాల గీత చెప్పారు. సోమవారం ఆమె అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో వర్షం కురిసినపుడు నీరు నిల్వ ఉండటం, చేపల మార్కెట్ అధ్వాన్నంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్లనే వాటిని పరిశీలించి అవసరమైన పనులు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 3న తాను పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద సమస్యలను గుర్తించడం వాటిని ఏ విధమైన పరిష్కారానికి అవకాశం ఉందో పరిశీలించి వాటికి అవసరమైన నిధులు రాబడతామన్నారు. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన పెద్ద చెరువు నీటి శుద్ధి యంత్రం వృథాగా పడి ఉందన్నారు. దీనిని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ వంటి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, మండల పార్టీ అధ్యక్షుడు సైలాడ త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ
చీపురుపల్లి, జూలై 14: రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సోమవారం మండలంలోని గల జెడ్పీ బాలికోన్నత పాఠశాల కస్తూరిభా పాఠశాల, ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జడ్పీ బాలికోన్నతపాఠశాలలో సందర్శించి పాఠశాలలో మధ్యాహ్నా భోజన పథకం నిర్వహణ తీరు పరిశీలించారు. విద్యార్ధులు కోసం సిద్ధంచేసిన భోజనాన్ని రుచిచూశారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. విద్యార్ధులను వౌలిక వసతుల గురించి చర్చించారు. పాఠశాలలలో 600 మంది విద్యార్ధులు చదువుకుంటూన్నామని, టాయిలెట్ సౌకర్యంలేక పలు ఇబ్బందులు పడుతున్నామని , హిందీ, సోషల్‌కి టీచర్లులేరని విద్యార్దులు మంత్రి ముందు వాపోయారు. భోజనం నాణ్యత బాగా లేదని, నెలకోకసారి కూడా గుడ్డు పెట్టడంలేదని విద్యార్ధులు మంత్రికి ఫిర్యాదు చేశారు. పాఠశాలలో చదువుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్ధులతో పాఠాలను చదివించారు. ఇంగ్లీష్ పదాలకు అర్ధం తెలుసుకోవాలని అపుడే పాఠాలు అర్ధం అవుతాయని మంత్రి పిల్లలకు సూచించారు. అలాగే పాఠశాలలో ఐదు తరగతులకు 15 సెక్షన్లు నిర్వహిస్తున్నామని పాఠశాల గదులు కొరతగా ఉందని పాఠశాల హెచ్‌ఎం మంత్రికి తెలిపారు. భారత నిర్మల్ అభియాన్ పథకం ద్వారా అన్ని పాఠశాలలకు సదుపాయాలను ఇస్తామని మంత్రి అన్నారు. నిరూపయోగంగా ఉన్న టాయిలెట్లును, మరుగుదొడ్లులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కారిస్తానని పిల్లలలకు హామి ఇచ్చారు. పిరియాగ్రాహంలో మెట్టకాలనీలోగల కస్తూరిభా పాఠశాలను సందర్శించి భోజన వసతి వౌళిక సౌకార్యాలపై విద్యార్ధులను ప్రశ్నించారు. అనంతరంస్ధానిక ఐసిడిఎస్ కార్యాలయాన్ని సందర్శించి సూపర్‌వైజర్స్, పిఓతో చర్చించారు. అనంతరం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదార్లునుంచి వినతులు స్పీకరించారు. మండలంలో గల యూటిఎఫ్ ప్రతినిధులు మంత్రిని కలిసి ఒక ఉపాధాయుడున్న పాఠశాలలో వాలంటీర్లును నిర్వహించాలని కోరారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ ఎన్‌సిఎస్ సుఘర్ ఫెక్టరీ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన 26 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించేటట్లు నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ విషయంపై పార్వతీపురం పర్యటనలో కలెక్టర్, సబ్ కలెక్టర్లుతో చర్చించామన్నారు. తక్షణమే రైతులకు చెల్లింపులు జరిగే విదంగా అధికారులు పరిష్కారించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గణపతిరావు, గద్దెబాబురావు, ఎంపిపిలు రౌతు కాంతమ్మ, పి.సన్యాసినాయుడు, జెడ్పీటిసి మీసాల వరహాలనాయుడు, ఇతర అధికారులు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

‘విద్యార్థులు, టీచర్ల సమస్యలు పరిష్కరించాలి’
విజయనగరం (్ఫర్టు), జూలై 14: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎపిటిఎఫ్ సీనియర్ నాయకుడు బంకురు జోగినాయుడు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణికి సోమవారం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరత ఉందన్నారు. కనీసం బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదన్నారు. రామభద్రపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో, పూసపాటిరేగ, బాడంగి, బలిజపేట తదితర పాఠశాలల్లో ఒక్కొక్క హిందీ ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని చెప్పారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో తెలుగు భాషోపాధ్యాయుల పోస్టులను మంజూరుచేసి భర్తీ చేయాలన్నారు. అనేక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలు సక్సెస్ పాఠశాలలుగా మార్చారన్నారు. ఒక్కొక్క సక్సెస్ పాఠశాలలో 15 తరగతి గదులు ఉండాలని, ఎక్కడా 15 నాణ్యమైన తరగతి గదులు లేవని జోగినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.శ్రీనివాస్, వై.గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారులతో కిటకిటలాడిన ‘గ్రీవెన్స్’
విజయనగరం , జూలై 14: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌లో సామాజిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కోరుతూ 200లకు పైగా వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ రామారావు, డిఆర్‌ఓ వెంకటరావులు వినతులు స్పీకరించారు. కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై విజలెన్స్‌తో దర్యాప్తుచేయించాలని పౌర హక్కుల ప్రజా సంఘం నాయకులు బి.వెంకటరమణ తదితరులు వినతులిచ్చారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామం ఉపాధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని బి.అప్పారావు,శంకర్ తదితరులు వినతినిచ్చారు. జామి మండలకేంద్రంలోని ఒక కాలేజీ గుర్తింపు రద్దుయినప్పటకీ బిఇడి ప్రవేశాలను నిబంధనలకు విరుద్దంగా నిర్వహించిన యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇ. రామచంద్రరావు తదితరులు వినతినిచ్చారు. గుర్ల మండలం చింతలపేట గ్రామంలో తుమ్మచెట్లును అక్రమంగా నరికివేసిన వ్యక్తులపై చర్యలుతీసుకోవాలని వై. బుచ్చిబాబు తదితరులు కోరారు. పట్టణంలోని 30వ వార్డులో కొందరు వ్యక్తులు తినుబండరాలను తయారుచేయడానికి వాడుతున్న జీడితొక్కు రంపపుపొట్టు వల్ల వెలువడుతున్న కాలుష్యంతో తాము రోగాలు బారిన పడుతున్నామని, తగిన చర్యలు తీసుకోవాలని ఎంఎస్ రాజు తదితరులు కోరారు. గరివిడి మండలం కె పాలవలసలో ఇందిరమ్మ గృహనిర్మాణంలో జరిగిన అవకతవకల దర్యాప్తు జరిపించాలని కొంతమంది కోరారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు వినతులు అందజేశారు.
ఎన్‌సిఎస్ ఆస్తుల జప్తునకు
నేటితో ముగియనున్న గడువు
సీతానగరం, జూలై 14: చెరకు రైతులకు బకాయిలు పడ్డ ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలకు అధికారులకు ముమ్మరంగా యత్నాలు చేస్తున్నారు.. పార్వతీపురం సబ్ కలెక్టర్ శే్వతామహంతి ఆదేశాలకు అనుగుణంగా మండల రెవెన్యూ అధికారులు ఈనెల 1వ తేదీన ఎన్‌సిఎస్ ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఇందుకు 15 రోజుల వ్యవధి ఇచ్చారు. మంగళవారంతో ఎన్‌సిఎస్‌కు ఇచ్చిన గడువు పూర్తి కానుంది. ఈ మేరకు ఆస్తుల జప్తునకు సంబంధించి నోటీసులు జారీ చేసేందుకు మండల రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక లచ్చయ్యపేట గ్రామంలో ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు, యంత్రాలు తదితర ఆస్తుల విలువ రూ. 43కోట్లుగా అధికారులు నిర్ధారించారు. రైతులకు చెల్లించాల్సింది 28కోట్లు. చెల్లింపులు ఆలస్యమైనందుకు ప్రతి రైతుకు అపరాధ రుసుంతో కలిపి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం’
విజయనగరం, జూలై 14: ‘ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్‌గా కాంతిలాల్ దండే చూపిన చొరవ అభినందనీయమని, ఆ బాటలోనే జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిస్తాం’ అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి అన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాంతిలాల్ దండే గుంటూరు జిల్లాకు బదిలీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి సాధారణ ఎన్నికల వరకు ప్రశాంతంగా నిర్వహించగలిగారన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను పరిష్కరించి వారికి సాంత్వన చేకూర్చారన్నారు. దండుమారమ్మ గుడి వివాదంలో కీలకంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందారన్నారు. మరో ఏడాదిపాటు జిల్లాలో పనిచేస్తే జిల్లాకు మరింత మేలు జరిగేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధ్యక్షత వహించిన జెడ్పీ సిఇఒ మోహనరావు మాట్లాడుతూ కలెక్టర్ కాంతిలాల్ మృదు స్వభావి అని, హోదాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా గౌరవించేవారని చెప్పారు.
ఆయనను గుంటూరు జిల్లాకు కలెక్టర్‌గా నియమించిందంటే ఆయన సమర్థతపై ప్రభుత్వానికి అంత నమ్మకం ఉందని అన్నారు. జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టారన్నారు.
జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తినాయుడు మాట్లాడుతూ కలెక్టర్‌తో అతి తక్కువ పరిచయం ఉన్నప్పటికీ ఆయన కార్యదక్షత గల వారని అర్థమైందన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని పొందడం అదృష్టమన్నారు. ఎంపిడివోల తరఫున ఎంపిడివో సుధాకర్ , ఇంజనీర్ల తరఫున డిఇఇ ఎంవిఆర్ కృష్ణాజీ మినిస్టీరియల్ సిబ్బంది తరఫున రమణమూర్తి ప్రసంగించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్‌ఇ మెహర్ ప్రసాద్, పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఇ వేణుగోపాల్, వివిధ మండలాలకు చెందిన ఎంపిడివోలు, పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
‘వేధింపుల నుంచి రక్షించండి’
విజయనగర , జూలై 14: తమ భర్తల వేధింపుల నుంచి తమని కాపాడాలని సోమవారం నాటి ఎస్పీ గ్రీవెన్స్‌లో ఇద్దరు మహిళలు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్‌కి ఫిర్యాదు చేశారు. భోగాపురం మండలం రాయవలసకు చెందిన మహిళ తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన నాటి నుంచి మరింత వేధింపులకు గురిచేస్తున్నాడని, తనకి న్యాయం చేయాలని ఎస్పీకి విన్నవించుకుంది. గజపతినగరం మండలం మర్రివలసకు చెందిన మహిళ కూడా భర్త, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నందున న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
సమస్యలు పరిష్కరించాలని
వినతుల వెల్లువ
పార్వతీపురం, జూలై 14: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం డివిజన్‌లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పార్వతీపురం సబ్ కలెక్టర్ శే్వతామొహంతికు విజ్ఞప్తి చేశారు. సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్సులో సీతానగరం గ్రామస్థులు మాట్లాడుతూ తమకు తాగునీటికోసం ఏర్పాటు చేసిన పైపులైన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే సబ్‌కలెక్టర్ స్పందిస్తూ ఆర్ డబ్ల్యు ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును ఫోన్లో పరిష్కరించాలని ఆదేశించారు. నర్సిపురం గ్రామస్థులు కూడా తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం,కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు,పాచిపెంట, మక్కువ, జియ్యమ్మవలస తదితర మండలాల నుండి వచ్చిన ప్రజలు తమకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
పడవ బోల్తా.. ఒకరి మృతి
భోగాపురం, జూలై 14: మండలంలోని చేపలకంచేరు గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా, సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చేపలకంచేరు నుంచి కారి రామస్వామి, కారి దానయ్య, కోల ఎల్లయ్య, కోల ఎర్రయ్యలు వేటకు వెళ్లగా పడవ బోల్తా పడటంతో కోల ఎల్లయ్య (45) సముద్రంలో మునిగిపోగా, మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారని సర్పంచ్ ఎల్లారావు తెలిపారు. దీనిపై ఎఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.ఎం.నాయక్‌కు
english title: 
new collector

రాబోయే ఆరేళ్లలో వోక్స్‌వాగన్ రూ. 1500 కోట్ల పెట్టుబడులు

$
0
0

న్యూఢిల్లీ, జూలై 15: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ వోక్స్‌వాగన్ రాబోయే ఆరేళ్లలో భారత్‌లో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాలని యోచిస్తోంది. మంగళవారం పోలో అప్‌డేట్ వెర్షన్‌ను ఇక్కడ పరిచయం చేసింది. 4.99 లక్షల రూపాయల నుంచి 7.37 లక్షల రూపాయల మధ్య (్ఢల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం) దీని ధర ఉంది. ఈ సందర్భంగా వోక్స్‌వాగన్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొడుముడి విలేఖరులతో మాట్లాడుతూ ‘మాకు భారత్ వ్యూహాత్మక మార్కెట్. ఓ క్రమపద్ధతిలో దశలవారీగా ఇక్కడ మేము పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నాం. ఇందులోభాగంగానే రాబోయే 5-6 ఏళ్లలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాలని యోచిస్తున్నాం. కొత్త ఉత్పత్తులకు స్థానికత పెంపునకు ఈ పెట్టుబడులను వినియోగించాలని భావిస్తున్నాం.’ అని అన్నారు. కాగా, తాజాగా ఆవిష్కరించిన పోలో వేరియంట్‌లో పెట్రోల్ వెర్షన్ 4.99 లక్షల రూపాయల నుంచి 6.07 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉండగా, డీజిల్ వెర్షన్ 6.27 లక్షల రూపాయల నుంచి 7.37 లక్షల రూపాయల మధ్య ఉంది. క్రాస్ పోలో 7.9 లక్షల రూపాయలకు లభిస్తుందని తెలిపిన వోక్స్‌వాగన్.. వచ్చే నెల ఆగస్టులో పోలో జిటి టిడిఐ, టిఎస్‌ఐ మోడళ్లను విడుదల చేస్తామని ధర 7.99 లక్షల రూపాయల వద్ద ఉంటుందని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీలో మంగళవారం కొత్త పోలో కారు విడుదల దృశ్యం

* కొత్త పోలో కారు ఆవిష్కరణ
english title: 
r

4జి మొబైల్స్ రావాలి

$
0
0

హైదరాబాద్, జూలై 15: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్‌లోకి 4జి మొబైళ్లను తీసుకురావాల్సి ఉందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాంకేతికతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే త్వరలోనే హైదరాబాద్‌లో 4జి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సెల్‌కాన్ మొబైల్ తమ కొత్త మోడల్స్ మిలీనియం పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470లను మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో విదేశీ తయారీ సెల్‌ఫోన్ల హవా నడుస్తోందని, వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా టెక్నాలజీలో దేశీయ కంపెనీ అయిన సెల్‌కాన్ మొబైల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సెల్‌కాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఉన్న మొబైళ్లను సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో అందించడం గొప్ప విషయమన్నారు. అనంతరం సెల్‌కాన్ సిఎండి గురు మాట్లాడుతూ మూడు, నాలుగు నెలల్లోనే అత్యాధునిక పరిజ్ఞానంతో 4జి మొబైళ్లను రూపొందిస్తామని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి 4జి మొబైల్స్ తామే మార్కెట్‌లోకి తీసుకువస్తామని తెలిపారు.
మిలీనియం మోడళ్ల ప్రత్యేకతలు
సెల్‌కాన్ మొబైల్స్ ఈడి మురశీ మాట్లాడుతూ కొత్త మోడళ్ల ప్రత్యేకతలను వివరించారు. మిలీనియం పవర్ క్యూ 3000 కిట్‌కాట్ ఓఎస్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 ఇంచుల డిస్‌ప్లే, 9.9 ఎంఎం మందం, 1జిబి ర్యామ్, 4 జిబి రోమ్ కలిగి ఉండడంతోపాటు 3000 ఎంఎహెచ్ అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని వివరించారు. 8 మెగా పిక్సల్ రీయర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జిబి ఎక్స్‌స్పాండబుల్ మొమొరీ సౌకర్యం కలిగి ఉన్న ఈ మొబైల్ ధర కేవలం రూ. 8999 అని చెప్పారు. అలాగే మిలీనియం ఎలైట్ క్యూ 470 మోడల్ స్మార్ట్ఫోన్ కూడా కిట్‌కాట్ ఓఎస్, 16 జిబి రోమ్, 1 జిబి ర్యామ్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుందన్నారు. ఈ మోడల్ ధర రూ. 11,999 అని ఆయన చెప్పారు.
చిత్రం.. సెల్‌కాన్ కొత్త మొబైల్ ఫోన్లను సంస్థ ప్రతినిధులతో కలిసి విడుదల చేస్తున్న మంత్రి కెటిఆర్

సెల్‌కాన్ మొబైల్ ఆవిష్కరణలో మంత్రి కెటిఆర్
english title: 
f

బ్రైట్‌స్టార్ చేతికి బీటెల్ వాటా

$
0
0

న్యూఢిల్లీ, జూలై 15: భారతీ ఎంటర్‌ప్రైజెస్ తమ టెలికాం ఉత్పాదక, పంపిణీ సంస్థ బీటెల్ టెలీటెక్‌లో అధిక వాటాను మంగళవారం అమెరికాకు చెందిన గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్రైట్‌స్టార్‌కు అమ్మేసింది. అయితే ఎంత మొత్తానికి ఈ వాటాను బ్రైట్‌స్టార్‌కు భారతీ విక్రయించిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతీ గ్రూప్ టెలికాం రంగంలోకి 1985లో బీటెల్ ద్వారానే రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత వివిధ సేవలను విస్తరించింది. భారతీ గ్రూప్‌లోని ఎయిర్‌టెల్‌తోపాటు ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌లకు మొదట ఫిక్స్‌డ్ లైన్ ఫోన్లను తయారుచేసి పెట్టిన బీటెల్.. అనంతరం పంపిణీ వ్యాపారంలోకి దిగింది. ప్రస్తుతం ఓ వైపు ఫోన్లను తయారు చేస్తూనే సామ్‌సంగ్, పానసోనిక్, పాలీకమ్, అవయ, ఎమ్‌ఎక్స్, ఎక్స్‌ట్రాన్, రాడ్విన్, హువాయ్, సాన్‌డిస్క్ వంటి బహుళజాతి టెక్నాలజీ సంస్థల ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది. కాగా, భారతీ గ్రూప్‌గానీ, బ్రైట్‌స్టార్‌గానీ బీటెల్‌లో ఎంత వాటాను విక్రయించామో, కొనుగోలు చేశామో అన్న వివరాలను వెల్లడించలేదు. బ్రైట్‌స్టార్ సంస్థకు బీటెల్ సేవలు తోడైతే అంతా అభివృద్ధేనని భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతీ మిట్టల్ ఓ ప్రకటనలో అన్నారు.

తగ్గిన ఎస్‌బిఐ
ఎఫ్‌డి రేట్లు

న్యూఢిల్లీ, జూలై 15: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై మంగళవారం వడ్డీరేట్లను తగ్గించింది. 7 రోజుల నుంచి 179 రోజుల మధ్యగల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.5 శాతం నుంచి 7 శాతానికి దించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో ఎస్‌బిఐ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.

భారతీ ఎంటర్‌ప్రైజెస్ తమ టెలికాం ఉత్పాదక, పంపిణీ సంస్థ బీటెల్ టెలీటెక్‌లో అధిక వాటాను మంగళవారం
english title: 
b

ఎమ్‌ఆర్‌పిఎల్‌కు ఒఎమ్‌పిఎల్ వాటా

$
0
0

న్యూఢిల్లీ, జూలై 15: ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ సంస్థ ఒఎన్‌జిసి.. మంగళూరు పెట్రోకెమ్ ప్రాజెక్టు (ఒఎమ్‌పిఎల్) లోని తమ వాటాను మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎమ్‌ఆర్‌పిఎల్)కు అమ్మేయనుంది. కర్నాటకలోని ఒక బిలియన్ డాలర్ల విలువైన మంగళూరు పెట్రోకెమ్ ప్రాజెక్టులో ఉన్న 46 శాతం వాటాను దాని అనుబంధ సంస్థ ఎమ్‌ఆర్‌పిఎల్‌కు ఒఎన్‌జిసి విక్రయించనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎమ్‌ఆర్‌పిఎల్‌లో ఒఎమ్‌పిఎల్ విలీనం కానుందన్నారు. ఒఎమ్‌పిఎల్‌లో 46 శాతం వాటా ఒఎన్‌జిసికి ఉండగా, 3 శాతం వాటా ఎమ్‌ఆర్‌పిఎల్‌కు ఉంది. మిగతా 51 శాతం ఈక్విటీ వాటా కేటాయింపులు జరగాల్సి ఉంది. కాగా, మంగళూరు స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో రూ. 6,400 కోట్ల వ్యయంతో ఆరొమాటిక్ కాంప్లెక్స్‌ను ఒఎమ్‌పిఎల్ నిర్మిస్తోంది. కాంప్లెక్స్ కోసం మంగళూరు ఎస్‌ఇజెడ్‌లో 442 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఒఎమ్‌పిఎల్‌కు ఎమ్‌ఆర్‌పిఎల్ పెరాక్సిలిన్, బెంజిన్ తయారీకి అవసరమైన ముడి సరుకును సరఫరా చేస్తుంది. పాలిస్టర్ ఫైబర్స్, పెట్ బాటిల్స్ తయారీలో పెరాక్సిలిన్ కీలక పాత్ర పోషిస్తే, పారిశ్రామిక రసాయనాల ఉత్పత్తికి బెంజిన్ తప్పనిసరి.

ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ సంస్థ ఒఎన్‌జిసి.. మంగళూరు పెట్రోకెమ్ ప్రాజెక్టు
english title: 
m

టెస్టు జట్టు సారథిగా ధోనీ పనికిరాడు

$
0
0

బెంగళూరు, జూలై 15: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని కొనసాగించడం సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టుకు సారథ్యం వహించే సామర్ధ్యాన్ని ధోనీ ఎప్పుడో కోల్పోయాడని, జట్టుకు స్ఫూర్తినిచ్చే శక్తి ధోనీకి ఏమాత్రం లేదని, కనుక భారత టెస్టు క్రికెట్ జట్టు నాయకత్వ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించేందుకు ఇదే సరైన తరుణమని చాపెల్ పేర్కొన్నాడు. ‘క్రికెట్‌లోని వివిధ ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ధోనీ రాణించినప్పటికీ టెస్టు జట్టుకు సారథ్యం వహించేందుకు అతను సరైన వాడు కాదు. కనుక ఆ బాధ్యతల నుంచి ధోనీ వైదొలిగి విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలను అప్పగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ బాధ్యతలను కోహ్లీకి అప్పగించడంలో ఇబ్బంది తలెత్తుతుందని నేను భావించడం లేదు’ అని చాపెల్ అన్నాడు. భారత జట్టుకు యువ ఆటగాడిని కెప్టెన్‌గా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని, అయితే ఇటువంటి విషయాల్లో ఆస్ట్రేలియా సెలెక్టర్ల మాదిరిగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే తెగువ భారత సెలెక్టర్లకు ఏమాత్రం లేదని, అందుకే భారత సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయకుండా ప్రస్తుత కెప్టెన్ రిటైరయ్యే వరకు వేచి చూస్తున్నారని చాపెల్ విమర్శించాడు. ధోనీ సారథ్యంలోని భారత టెస్టు జట్టు ఇంతకుముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న విషయాన్ని చాపెల్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ధోనీ గనుక ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయితే సారథ్య బాధ్యతల నుంచి ఎప్పుడో వైదొలగాల్సి వచ్చేదన్నారు. ‘మనకు ఎప్పుడూ ఓటములే ఎదురుకావచ్చు. కానీ ఆ ఓటములను అధిగమించేందుకు మన వంతు ప్రయత్నం మనం చేసి తీరాలి. ధోనీ ఇటువంటి ప్రయత్నం చేసినట్టు నాకు ఎన్నడూ కనిపించలేదు’ అని చాపెల్ విమర్శించాడు.

తొలగించే ధైర్యం భారత సెలెక్టర్లకు లేదు ఆసీస్ మాజీ కెప్టెన్ చాపెల్ విమర్శలు
english title: 
t

ఫైనల్‌కు ముందే ప్రత్యేక స్టాంపు!

$
0
0

బెర్లిన్, జూలై 15: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు సాధించిన విజయానికి గుర్తుగా ముద్రించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను ఆ దేశం ఈ వారంలో విడుదల చేయనుంది. వీటిలో 50 లక్షల స్టాంపులను ఫైనల్ మ్యాచ్‌కు ముందే ముద్రించినట్టు అధికారులు వెల్లడించారు. ‘ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఈసారి మా జట్టు టైటిల్ సాధించడం ఖాయమని మొదటి నుంచే నేను ఎంతో గట్టిగా నమ్ముతూ వచ్చా. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా జట్టు విశ్వ విజేతగా నిలవడం ఎంతో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ విజయం కోట్లాది మంది జర్మనీ ప్రజలకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సంతోషం ఎప్పటికీ గుర్తుండిపోవాలన్న తలంపుతోనే ఈ స్టాంపును ముద్రించాం’ అని జర్మనీ ఆర్థిక శాఖ మంత్రి ఉల్ఫ్‌గాంగ్ తెలిపారు. ‘జర్మనీ ఫుట్‌బాల్ వరల్డ్ చాంపియన్-2014’ అనే నినాదంతో ముద్రించిన ఈ స్టాంపు విలువను 60 సెంట్లుగా నిర్ణయించారు. ఈ స్టాంపులను తొలుత జర్మనీ జట్టు కోచ్‌తో పాటు ఆటగాళ్లకు, సిబ్బందికి అందజేసిన తర్వాత గురువారం నుంచి విక్రయించనున్నారు. జర్మనీ ఆటగాళ్లు మైదానంలో పరిగెడుతున్న దృశ్యాన్ని ఈ స్టాంపుపై ముద్రించడం జరిగిందని, అయితే ఆటగాళ్ల ముఖాలు కనిపించకుండా ఈ చిత్రాన్ని ముద్రించడం జరిగిందని, జట్టులోని ప్రతి సభ్యుడిని సమాన స్థాయలో గౌరవించాలన్న తలంపుతోనే స్టాంపును ఈ విధంగా రూపొందించడం జరిగిందని గ్రాఫిక్ డిజైనర్ లట్జ్ మెంజే జర్మనీ జాతీయ వార్తా సంస్థ ‘డిపిఎ’కి వివరించారు. ఒక స్టాంపును రూపొందించాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, అయితే ఈ స్టాంపును ముద్రించాల్సిందిగా జర్మనీ ప్రభుత్వం ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభమైన తర్వాతే తనను సంప్రదించిందని ఆయన తెలిపారు. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు ఓటమిపాలై ఉంటే ఈ స్టాంపులన్నీ ఏమయ్యేవని జర్మనీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని ఒక విలేఖరి ప్రశ్నించగా, జర్మనీ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందని మొదటి నుంచే బలంగా విశ్వసించామని, అందుకే ఫైనల్ మ్యాచ్ పూర్తి కావడానికి ముందే ఈ స్టాంపుల ముద్రణ ప్రక్రియను ప్రారంభించామని ఆమె చెప్పారు.

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు సాధించిన విజయానికి గుర్తుగా ముద్రించిన ప్రత్యేక పోస్టల్
english title: 
f

మురిసిపోయన జర్మనీ

$
0
0

బెర్లిన్, జూలై 15: ప్రపంచ కప్ విజేతలైన తమ సాకర్ జట్టుకు కనీ వినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకడం కోసం వేలాది మంది జర్మనీ అభిమానులు మంగళవారం బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద గుమికూడారు. ప్రపంచ ఫుట్‌బాల్ కప్ విజేతలైన జర్మనీ జట్టు ఆటగాళ్లతో ఆలస్యంగా రియోడిజనిరోనుంచి జర్మనీ రాజధాని బెర్లిన్‌కు బయలుదేరిన విమానం గ్రీనిచ్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు విమానాశ్రయంలో దిగుతుందని విమానాశ్రయం ప్రతినిధి ఒకరు చెప్పారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానానికి జర్మనీ జట్టుకోసం ‘్ఫన్హాన్సా’ అని కొత్త పేరు పెట్టారు. అయితే బంగారు వెలుగులు చిమ్మే ఎండలో టేగీ విమానాశ్రయంలో దిగే ఈ విమానాన్ని చూడడం కోసం వేలాది మంది అభిమానులు సూర్యోదయానికి ముందునుంచే సెంట్రల్ బెర్లిన్‌లోని ఈ ఎత్తయిన వేదిక వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. ఇది ఒక చరిత్రాత్మక ఘటన అని 34 ఏళ్ల బస్సు డ్రైవర్ బెర్నాడ్ హెస్సే అన్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు అతను రేడియోలో బ్రెజిల్‌లో జరిగిన అన్ని పుట్‌బాల్ మ్యాచ్‌లు ఫాలో అవుతూ వచ్చే వాడు. ప్రపంచ కప్ విజయం కోసం జర్మనీ అభిమానులు 24 ఏళ్ల పాటు వేచి ఉన్నారని అతను అన్నాడు. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఏకమైన తర్వాత జర్మనీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. జర్మనీ ఆ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌ని తాను చూసే దాన్నని 28 ఏళ్ల అడ్వర్టయిజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ లిడియా లాంపా చెప్పింది. తాజాగా ప్రపంచ కప్ గెలుచుకున్నందుకు నాలుగో నక్షత్రంతో కూడిన ఒక జర్మనీ జెర్సీ ధరించడంతో పాటుగా హవాయ్ స్టైల్‌లో జర్మనీ జాతీయ కలర్‌లయిన నలుపు, ఎరుపు, బంగారు రంగుల ప్లాస్టిక్ పూల దండను ధరించి ఆమె తమ దేశ జట్టుకు స్వాగతం చెప్పడానికి వచ్చింది. జట్టుకు కృతజ్ఞతలు చెప్పడానికి నా స్టైల్ ఇది అని ఆమె చెప్పింది. అన్ని మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా జరిగాయని, జీవితంలో ఒక్కసారయినా ఆటగాళ్లను నేరుగా చూడాలనేది నాకోరిక అని ఆమె చెప్పింది. టోర్నమెంట్ మొదటినుంచి కూడా ఈ సారి తమ దేశం జట్టు గెలుస్తుందని తనకు అనిపించిందని కూడా ఆమె చెప్పింది.
నగర మేయర్ క్లాస్ వోవెరిట్‌తో భేటీ అయిన తర్వాత జర్మనీ ఆటగాళ్లు జర్మనీ తిరిగి ఒక్కటైనదానికి గుర్తుగా నిర్మించిన బ్రెండెన్‌బర్గ్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ వద్దకు చేరుకుంటారు. 1990లో జర్మనీ తొలిసారి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం రాత్రి జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని తిలకించడానికి రెండున్నర లక్షలకు పైగా అభిమానులు ఈ గేట్ వద్దకు చేరుకున్నారు. మంగళవారం కూడా ఆటగాళ్లు, కోచ్ జోకిమ్ లోవ్ ట్రోఫీని ఎత్తిపట్టుకునే దృశ్యాన్ని చూడడం కోసం అదే స్థాయిలో అభిమానులు ఇక్కడికి చేరుకుంటారని భావిస్తున్నారు.

చిత్రం... జగజ్జేతలుగా స్వదేశానికి తిరిగి వచ్చిన జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లకు బెర్లిన్‌లో నీరాజనాలు పలుకుతున్న అభిమానులు

విశ్వ విజేతలకు అద్భుత స్వాగతం అభిమానులతో జనసంద్రమైన బెర్లిన్
english title: 
m

టాప్-10 నుంచి కోహ్లీ ఔట్

$
0
0

దుబాయ్, జూలై 15: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సోమవారం తాజాగా విడుదల చేసిన టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ పలు స్థానాలు కిందికి దిగజారారు. పుజారా ఒక స్థానం కిందికి దిగజారి ప్రస్తుతం 8వ ర్యాంకులో నిలువగా, మూడు స్థానాలు దిగజారి టాప్-10 బ్యాట్స్‌మన్ల జాబితాలో చోటు కోల్పోయిన కోహ్లీ 13వ ర్యాంకులో నిలిచాడు. అయితే ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వరుసగా 146, 52 చొప్పున పరుగులు చొప్పున సాధించిన మురళీ విజయ్ ఒకేసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకుకు చేరుకున్నాడు. పుజారా, కోహ్లీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (27వ ర్యాంకు) తర్వాత ప్రస్తుతం మెరుగైన స్థానంలో నిలిచిన నాలుగవ భారత బ్యాట్స్‌మన్ మురళీ విజయే. కాగా, టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భువనేశ్వర్ కుమార్ గొప్ప పురోగతి సాధించాడు. నాటింగ్‌హామ్ టెస్టులో 82 పరుగులిచ్చి 5 వికెట్లతో రాణించిన భువనేశ్వర్ కుమార్ ఎకాఎకిన 27 స్థానాలు మెరుగుపరుచుకుని 46వ ర్యాంకుకు ఎగబాకాడు. ఐసిసి టాప్-50 టెస్టు బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగకపోయినప్పటికీ ర్యాంకింగ్స్‌లో అతను ఒక స్థానం కిందికి దిగజారి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే ఐసిసి ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్శిన్ రెండో స్థానం పదిలంగా ఉంది.

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్..
english title: 
t

హైదరాబాద్ విద్యార్థికి గోల్డ్ మెడల్

$
0
0

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర అండర్-11 చెస్ చాంపియన్‌షిప్ 2014లో హైదరాబాద్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి ఆర్ రాజ రిత్విక్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈనెల 11 నుంచి విజయవాడలో జరుగుతున్న ఈ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో 6 పాయింట్‌లు స్కోర్ చేశాడు. దాంతోపాటు మొత్తం 100 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో రాజ రిత్విక్ అత్యుత్తమ ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రస్తుతం రిత్విక్ అంతర్జాతీయ స్థాయిలో 1742వ ర్యాంకు సంపాదించాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను రిత్విక్ ఒడిషాలోని పూరిలో ఈనెల 23 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు జరిగే నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు.

అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో
english title: 
h

విజృంభించిన ఓజా.. శివమెత్తిన ఉమేష్

$
0
0

బ్రిస్బేన్, జూలై 15: బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండవ అనధికార టెస్టు (నాలుగు రోజుల) మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ నమన్ ఓజా శతకంతో కదం తొక్కగా, టెయిలెండర్ బ్యాట్స్‌మన్ ఉమేష్ యాదవ్ (90) అద్భుత ప్రదర్శనతో అలరించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులకు ఆలౌటైన భారత-ఎ జట్టు ప్రత్యర్థుల కంటే 78 పరుగుల ఆధిక్యత సాధించింది. మూడు వికెట్ల నష్టానికి 165 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టుకు నైట్ వాచ్‌మన్లు బాబా అపరాజిత్, మనోజ్ తివారీ 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం అపరాజిత్ (28) సేయర్స్ బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్‌కు దొరికిపోగా, కొద్దిసేపటికి మనోజ్ తివారీ (63) కూడా సేయర్స్ బౌలింగ్‌లోనే నిష్క్రమించాడు. ఈ తరుణంలో అంబటి రాయుడు, నమన్ ఓజా క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం రాయుడు (40) మిఛెల్ మార్ష్ బౌలింగ్‌లో నాథన్ లియోన్‌కు క్యాచ్ ఇచ్చినప్పటికీ అతని స్థానంలో వచ్చిన అమిత్ మిశ్రా కూడా నమన్ ఓజా స్థిమితంగా ఆడుతూ ఓజాకు సహకరించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపిన ఓజా ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత అమిత్ మిశ్రా (36) బెన్ కట్టింగ్ బౌలింగ్‌లో పీటర్ ఫారెస్ట్‌కు క్యాచ్ ఇవ్వగా, సెంచరీ పూర్తి చేసుకున్న నమన్ ఓజా (110), అనురీత్ సింగ్ (8)లను కూడా కట్టింగ్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో భారత-ఎ జట్టు 419 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో జస్పీత్ బుమ్రాహ్ (16-నాటౌట్))తో కలసి దూకుడుగా ఆడిన ఉమేష్ యాదవ్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 66 బంతుల్లో ఐదు సిక్సర్లు, మరో 11 ఫోర్ల సహాయంతో 90 పరుగులు రాబట్టిన ఉమేష్ యాదవ్ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కట్టింగ్ బౌలింగ్‌లో నాథన్ లియోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులకు ఆలౌటైన భారత-ఎ జట్టు కంగారూల కంటే 78 పరుగుల ఆధిక్యత సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 423 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

భారత్-ఎ 501 ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగుల ఆధిక్యత
english title: 
o

పోలవరం డిజైన్ మార్చాలని కేంద్రాన్ని కోరుతాం

$
0
0

హైదరాబాద్, జూలై 16: పోలవరం డిజైన్ మార్చాలని ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని కోరుతామని తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి తెలిపారు. తాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆదివాసిలల హక్కులకు భంగం కలుగుతున్నందున ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రం హడావుడిగా పార్లమెంటులో బిల్లును ఆమోదించడం దురదృష్టకరమని అన్నారు.
అఖిలపక్షంతో ఢిల్లీకి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె. అరుణ మాట్లాడుతూ అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఈ అంశాన్ని లోగడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏడు మండలాలను కాపాడలేని కెసిఆర్ 10 జిల్లాల ప్రజలను ఎలా కాపాడుతారని ఆమె ప్రశ్నించారు.
‘సుప్రీం’కు వెళతాం
ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పించేందుకు తాము సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. ప్రస్తుత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మిస్తే ఖమ్మం అస్థిత్వానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించడం టిడిపి-బిజెపిల కుట్ర అని విమర్శించారు.
హక్కులు కాలరాయడమే..
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం డిజైన్ మార్చకపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత డిజైన్‌తో నిర్మాణం చేపడితే 3 లక్షల మంది నిరాశ్రయులవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సిఎల్‌పి నేత జానారెడ్డి
english title: 
p
Viewing all 69482 articles
Browse latest View live