Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

శ్రావణమాసంలో పుష్కరాల సమావేశాలు

0
0

రాజమండ్రి, జూలై 16: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అధికారిక సమావేశాలు, పర్యటనలకు శ్రావణమాసంలో శ్రీకారం చుట్టాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతుండటంతో, ఈ సమయంలో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశాలను అధికారికంగా ప్రారంభించటం సరికాదన్న సెంటిమెంటుతోనే వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది. మరో 12రోజుల్లో ఆషాడమాసం ముగుస్తుండటంతో, శ్రావణమాసం ప్రారంభమైన తరువాత పుష్కరాల సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూలై నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కావాల్సి ఉంది. కేవలం ఏడాది మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఇంత వరకు పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమావేశాలు ప్రారంభం కాలేదు. కనీసం జిల్లా స్థాయిలో కూడా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమావేశాలు ప్రారంభం కాలేదు. గోదావరి పుష్కరాల నిర్వహణలో కీలకపాత్రను పోషించే దేవాదాయశాఖలో కొంత కదలిక కనిపిస్తోంది. అయినప్పటికీ ఇంత వరకు గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంలో స్పష్టత లేదు. గోదావరి పుష్కరాలు ముహూర్తంపై పండితులతో నిర్వహించిన సమావేశాల్లో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. 2015 జూన్ 28న పుష్కరాలను ప్రారంభించాలని కొంత మంది, జూలై 7న ప్రారంభించాలని మరికొంత మంది చెబుతుంటే, జూలై 18, 25తేదీలను కూడా కొంత మంది సూచించారు. అయితే ఎక్కువ మంది పండితులు జూలై 14న గోదావరి పుష్కరాలను ప్రారంభించాలని సూచించినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాల ముహూర్తంపై రాష్ట్రప్రభుత్వం పండితులు, పీఠాధితులు, ఆధ్యాత్మికవేత్తలతో ఒక కమిటీని నియమిస్తుందని, ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే పుష్కరాల ముహూర్తం ఖరారవుతుందని తెలుస్తోంది.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెలాఖరులో రాజమండ్రిలో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

విలీనం బాధతో
విద్యార్థి ఆత్మహత్య
కమలాపూర్, జూలై 16: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడాన్ని తట్టుకోలేక కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పచ్చిమడ్ల ఓంకార్ (16) అనే టెన్త్ విద్యార్థి కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సర్ధార్ సత్పాల్ సింగ్ తెలిపారు. ఓంకార్ మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపాలనే ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన దృశ్యాలను టివిలో చూసి మనస్థాపంతో మంగళవారం రాత్రి ఇంట్లోవారు నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తండ్రి చంద్రవౌళి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎస్వీయులో కొత్త భవనం
నిర్మాణానికి బాబు విరాళం
తిరుపతి, జూలై 16: తన తల్లి తండ్రులు ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మల జ్ఞాపకార్థం ఎస్వీయూలో అర్థశాస్త్ర విభాగం కొత్త్భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తాను విరాళంగా ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు చెప్పినట్టు ఎస్వీయూ విశ్రాంతి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఆచార్య జి.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ఆచార్య ఎ.రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లో బాబును కలసి విశ్రాంతి అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించి, తగు న్యాయం చేయాలని కోరామన్నారు. ఎస్వీయూ పూర్వపు విద్యార్థి అయిన బాబు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఓ భవన నిర్మాణం చేపట్టాలని కోరినప్పుడు విరాళం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సి ఎం ను కలిసినవారిలో ఎం.రామచంద్రమూర్తి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

బాగా పనిచేసే టీచర్లకు
ఇనె్సంటివ్‌లు: గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 16: బాగా పనిచేసే టీచర్లకు ఇనె్సంటివ్‌లు ఇస్తామని, పనితీరు బాగులేకుంటే ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రాంతీయ సదస్సుల్లో తొలి సదస్సును బుధవారం విశాఖలో నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎంఇఓలు, డిఇఓలు హాజరైన ఈ సదస్సులో మంత్రి గంటా మాట్లాడుతూ ఉపాధ్యాయులు వారి సొంత పనులను పక్కన పెట్టి, విద్యా బోధనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. శత శాతం అక్షరాస్యతను సాధించి, దేశంలోనే మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 745 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల పోస్ట్‌లకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని గంటా వెల్లడించారు. మంత్రి గంటా చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, డ్రాపౌట్స్ తదితర వివరాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, విద్యాశాఖ కమిషనర్ ఉషాకిరణ్, కలెక్టర్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అధికారిక సమావేశాలు, పర్యటనలకు శ్రావణమాసంలో
english title: 
s

స్కాలర్ వేధింపులపై విద్యార్థినుల ఆందోళన

0
0

తిరుపతి, జూలై 16: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఎంబిఎ విభాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న స్కాలర్ వరకుమార్‌పై ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంబిఎ విద్యార్థులు ఎడి బిల్డింగ్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పిడిఎఫ్ స్కాలర్ వరకుమార్ ఆగడాలపై రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్‌లకు ఫ్యాక్స్ సందేశాలు కూడా పంపించారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శ్రీవారి పాదాలచెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్కాలర్ వరకుమార్ విద్యార్థినుల పట్ట అనుచితంగా వ్యవహరించడమేకాకుండా, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మార్చి 22న ఎస్వీయు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశామని, పోలీసులు వరకుమార్‌పై నిర్భయ కేసు కూడా నమోదుచేశారన్నారు. అయినా ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. చదువుమానుకుని ఇంటికి వెళ్లడమే మేలనేభావనతో మెలగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్వీయు విసి, రిజిస్ట్రార్, రెక్టార్‌లకు ఫిర్యాదుకూడా చేశామన్నారు. విద్యార్థినుల వేధింపులకు సంబంధించి గవర్నర్, కలెక్టర్‌లకు కూడా ఫ్యాక్స్ సందేశాలు పంపించామన్నారు. బుధవారం ధర్నాకు దిగిన 200 మంది విద్యార్థులు వరకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గవర్నర్, కలెక్టర్‌కు ఫ్యాక్స్ సందేశాలు
english title: 
s

వీరి గతి ఇంతేనా?

0
0

విజయవాడ, జూలై 16: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులతో మమేకమై పనిచేస్తానని చేస్తున్న ప్రకటనలు హోంగార్డుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రోజువారీ కూలీలు, క్యాజువల్ కార్మికుల గురించి పట్టించుకుంటున్నారేకాని నిర్ణీత పనివేళలంటూ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న తమ సమస్యలపై దృష్టి సారించటంలేదనే బాధ హోంగార్డుల నుంచి వ్యక్తవౌతున్నాయి.
ఉన్నతాధికారులు, పోలీసు ఉద్యోగ సంఘం కూడా హోంగార్డుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన సన్మానం జరిగిన సందర్భంగా తమ సంఘం సభ్యులు కానప్పటికీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలివ్వాలని, గెజిటెడ్ అధికారుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఎన్జీవో నేతలు విన్నవించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఈ రెండు వ్యవస్థల్లో పనిచేసే వారిని దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని, త్వరలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే రూ.300 రోజువారీ కూలితో పనిచేసే హోంగార్డులు మాత్రం మరింత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు.
ఏళ్లతరబడి పనిచేస్తున్నా వీరి సర్వీసులు రెగ్యులరైజ్ కావు. అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాకపోవటంతో ఆదివారాలు, పండుగల పూట కూడా సెలవులు ఉండవు. పిఎఫ్, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు లేనేలేవు. కనీసం కాంట్రాక్ట్, లేదా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలోకి కూడా వీరు రాలేకపోతున్నారు. అత్యవసర పనులపై సెలవులు దొరక్క ఉద్యోగాలే పోగొట్టుకుని రోడ్డునపడ్డ వారెందరో. ప్రభుత్వ శాఖల్లో ఈ మాదిరి పనిచేస్తున్న వేరెవరూ లేరనే చెప్పాలి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15వేల మంది హోంగార్డులుగా పోలీసు బాస్‌ల కనుసన్నల్లో పని చేస్తున్నారు. రెగ్యులర్ పోలీసులు నిర్వర్తించే విధులన్నింటినీ వీరు కూడా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ విధులు, వాహనాల డ్రైవర్లు, పోలీసు బాస్‌ల ఇళ్లలో వంటవారిగా, కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, మెకానిక్‌లుగా, అటెండర్లుగా గంపెడు చాకిరీ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు బాస్‌ల పసిపిల్లలను ఆడించటం, పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకురావటం, మొక్కలు పెంచటం, కూరగాయలు తీసుకురావటం వంటివి వీరికి నిత్యకృత్యాలే. వీరి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటే బ్రిటీష్ కాలం నాటి బూజుపట్టిన 1948 చట్టం అడ్డు పడుతోంది. ఈ చట్టంలో హోంగార్డు వ్యవస్థను స్వచ్ఛంద సంస్థగా పేర్కొన్నారు. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చట్టప్రకారం ఆ ఒక్క పదాన్ని తొలగించి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని 15వేల మంది సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని హోంగార్డులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ౄ ఏళ్లతరబడి చాకిరీ చేసినా మారని హోంగార్డుల బతుకులు ౄ1948 చట్టం మార్పిడితోనే సర్వీసు క్రమబద్ధీకరణ
english title: 
v

బాధితులకు అండగా ఉంటాం: జగన్

0
0

విజయనగరం, జూలై 16: ‘మేము ఉద్యోగాలైతే ఇవ్వలేము.. ప్రతిపక్షంలో ఉన్నాము..ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడతాం... మీకు అండగా ఉంటాం అంటూ’ చెన్నై ఘటన బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చెన్నైలో ఇటీవల బహళ అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన 24 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం జిల్లాకు వచ్చిన జగన్ తొలిరోజు దత్తిరాజేరు, బాడంగి మండలాల్లో కొన్ని కుటుంబాలను పరామర్శించారు. రాత్రి బొబ్బిలిలో బసచేసిన ఆయన రెండోరోజు బుధవారం మక్కువ, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించినప్పుడు బాధిత కుటుంబీకులు తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ ప్రతిపక్షంలో ఉన్న తాము ఉద్యోగాలు ఇప్పించలేమన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మీకు సాయం ఏమైనా అందిందా.. ఎంత మొత్తం అందింది.. చెన్నై ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. అని ఆరా తీశారు. అలాగే చెన్నైలోని భవన యజమాని నుంచి కూడా పరిహారం అందేలా పోరాటం చేస్తానని చెప్పారు. మక్కువ మండలం గైశిల, తూరుమామిడి గ్రామాల్లో బాధిత కుటుంబీకులైన సత్యనారాయణ, తిరుపతిరావులను కలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీతానగరం, పార్వతీపురం మీదుగా కొమరాడ చేరుకున్నారు. మాదలింగిలో జాన్ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ నుంచి జియ్యమ్మవలస మండలం నీలమాంబపురంలో ఐదు బాధిత కుటుంబాలను కలుసుకొని వారిని ఓదార్చారు. అక్కడినుంచి వీరఘట్టం మీదుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. పార్టీ పటిష్ఠతకు సంబంధించి నేతలకు కొన్ని సూచనలు కూడా చేసినట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుడు పి సాంబశివరాజు, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి సుజయ్‌కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవల్లి, రాజన్నదొర పాల్గొన్నారు.
గైసిలి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న జగన్

‘మేము ఉద్యోగాలైతే ఇవ్వలేము.. ప్రతిపక్షంలో ఉన్నాము..ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడతాం...
english title: 
s

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న ఇన్‌ఫ్లో

0
0

బళ్ళారి, జూలై 16: కర్నాటక ఆంధ్ర రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఎగువ భాగంలోని శివమొగ్గ, చిక్కమంగళూరు, ఆగుంబె తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం జలాశయం ఇన్‌ఫ్లో 25,967 క్యూసెక్కులుగా నమోదైంది. అదే విధంగా తుంగ జలాశయం గేట్లు ఎత్తడంతో విడుదలైన 60 వేల క్యూసెక్కుల నీరు గురువారానికి తుంగభద్ర చేరుకుంటుంది. దీంతో జలాశయం నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది. వర్షాలు ఇలాగే కురిస్తే క్రమంగా జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వస్తుందని భావిస్తున్నారు. తుంగభద్ర జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1597.61 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 25,967 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 475 క్యూసెక్కులు. నీటి నిల్వ సామర్థ్యం వంద టిఎంసిలు కాగా ప్రస్తుతం 16.842 టిఎంసిలు ఉంది.

ఆగస్టులో భారీ వర్షాలు

ౄపశ్చిమ తీరంలో అధిక పీడనమే వర్షాభావానికి కారణం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 16: నైరుతి రుతుపవనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో సగటున 47 సెంటీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైతే, తెలంగాణలో 55 సెంటీ మీటర్లు, కోస్తాలో 45 సెంటీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైనంది. రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని అంటున్నారు వాతావరణ నిపుణులు. జూలైలో ఒక మోస్తరు వర్షాలు కురిసినా, ఆగస్ట్‌లో ఉత్తర, మధ్య భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి వర్షించడం లేదని ఇప్పటి వరకూ భావించారు. అయితే పశ్చిమ తీరంలో అధిక పీడనం ఏర్పడి సుమారు వారం రోజులు స్థిరంగా ఉండడం వలన నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని ఆంధ్రా యూనివర్శిటీ ఓష్ణోగ్రఫీ ప్రొఫెసర్ భానుకుమార్ తెలిపారు. వెస్ట్ కోస్ట్‌లో ఏర్పడిన అధికపీడనం ప్రస్తుతం బలహీనపడిందన్నారు. నైరుతి రుతుపవనాలు భారత దేశం అంతటా పూర్తిగా విస్తరించాయని ఆయన చెప్పారు. మరికొద్ది రోజుల్లో రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకూ మాన్‌సూన్ ట్రఫ్ ఏర్పడబోతోందని ఆయన చెప్పారు. ఈ ట్రఫ్ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటోందని భానుకుమార్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర, మధ్య భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఆగస్ట్ 15 తరువాత భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని భానుకుమార్ తెలియచేశారు.

కర్నాటక ఆంధ్ర రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం నీటిమట్టం
english title: 
t

ఛిన్నాభిన్న

0
0

ఖమ్మం, జూలై 16: రాష్ట్ర విభజనతో అడవి బిడ్డలు చెల్లాచెదురవుతున్నారు. వారి బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ప్రకృతిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారు అడవితో తరతరాలుగా తమకున్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకునే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు సైతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జీవనాధారం కోసం వలసలు వెళ్తూ జీవితాలు వెళ్లబుచ్చుతున్న వారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తాము మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యమా అని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని లక్ష మందికి పైగా గిరిజనులు, మూడు జిల్లాలు రెండు రాష్ట్రాలకు చెందిన వారు కానున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉన్న వీరంతా బిల్లుకు పూర్తిస్థాయి చట్టబద్ధత వచ్చాక ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భాగస్వాములు కానున్నారు. ప్రధానంగా అంతరించిపోతున్న తెగగా ఉన్న కొండరెడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితి దాపురించింది. కొండల నుంచి దించి మైదానానికి తరలిస్తే వారు అక్కడ ఉండటానికి ఆసక్తి చూపటం లేదనే ప్రచారం ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పుణ్యమా అని వారిని తప్పకుండా ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలావుండగా సీమాంధ్రలో కలుస్తున్న ప్రాంతంలోని చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి దేశంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తింపు ఉంది. ఈ ఏడు మండలాల్లో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 42 సబ్ సెంటర్లు, రెండు సివిల్ ఆసుపత్రులు సుమారు 2లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరందరికీ వైద్యసేవలు అందించటం కష్టతరంగా మారేలా కనిపిస్తోంది. మరోవైపు ముంపు మండలాల్లో ఉన్న 35వేల మంది గిరిజనులకు ప్రస్తుతం వారి మాతృభాషలోనే విద్యాబోధన సాగుతోంది. ఈ ప్రాంతంలోని 250చోట్ల 8,700 మంది కోయ భాషను చదువుతుండగా, వీరిలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతంలో కలవబోతున్నారు. అలాగే వీరి అభివృద్ధి కోసం గడిచిన నాలుగైదేళ్లల్లో వంద కోట్ల రూపాయలతో అనేక సామాజిక భవనాలు నిర్మించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే సగానికి పైగా భవనాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 770కిలోమీటర్లు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 220కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని కూడా ఒక అంచనా. విఆర్ పురం మండలం కొల్లుగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి రానుంది.
ఇలావుంటే అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను మైదాన ప్రాంతవాసులతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈప్రాంతాల్లోని గిరిజనులంతా కకావికలమయ్యే పరిస్థితి నెలకొంది. వీరంతా ఏ ప్రాంతాల్లో ఉంటారో పరిశీలించి, తిరిగి వారిని అభివృద్ధి పథంలోకి మళ్లించాల్సి

విభజనతో కొండరెడ్ల పరిస్థితి మరీ దయనీయం ౄ ఏజెన్సీ అభివృద్ధి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరే
english title: 
c

తప్పుడు ధ్రువపత్రాలతో జామీన్లు ఏడుగురు అరెస్ట్

0
0

ఖమ్మం(ఖిల్లా), జూలై 16: తప్పుడు ధ్రువపత్రాలతో జామీన్‌లు ఇప్పిస్తున్న ముఠాతో పాటు వారిద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో క్రిమినల్ కేసుల్లో నిందితులను పోలీస్ శాఖ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో నకిలీ పత్రాలతో ఆయన జామీన్లు ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం మొదటి అదనపు మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు ఖమ్మం టూ టౌన్‌లో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేసి పరిశీలించగా పలు విషయాలు బహిర్గతమయ్యాయని వివరించారు. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతి తన భర్త, అతని బంధువులు వేధిస్తున్నారంటూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారు జామీన్‌పై విడుదలయ్యారు. ఈ జామీన్ పత్రాలపై అనుమానంతో యువతి న్యాయమూర్తికి ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. పోలీసులు విచారణలో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. ఖమ్మంకి చెందిన న్యాయవాది శ్రీనివాసాచారి, ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడేనికి చెందిన మహంకాళి రామకృష్ణ, కొమ్ము భిక్షం, పెద్దమాముల అశోక్, కొమ్ము ఉపేందర్, మహంకాళి ఉపేందర్, మహంకాళి వెంకన్న, ఆరెంపుల రామనాథంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి గ్రామ పంచాయతీ పేరుతో ఉన్న ముద్రలు, గ్రామ కార్యదర్శి పేరుతో ఉన్న ముద్రలు, నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ధ్రువపత్రాలతోనే పలువురు జామీన్‌లు పొందినట్లు వెల్లడైంది. ఖమ్మం రూరల్ మండలం, అల్లీపురం, కొత్తగూడెం, రఘునాథపాలెం మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులతో పాటు న్యాయవాదులు శ్రీనివాస్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, బొడ్డు రాములు, దిలీప్ అనే న్యాయవాదులు కూడా తప్పుడు ధ్రువపత్రాలతో వీరిద్వారా వివిధ కేసుల్లో జామీన్‌లు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. న్యాయవాది శ్రీనివాసాచారితో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారిపై కూడా విచారణ జరుపుతున్నామని ఎస్పీ రంగనాథ్ వివరించారు. విలేఖరుల సమావేశంలో డిఎస్పీ బాలకిషన్‌రావు, టూ టౌన్ సిఐ సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.

నిందితులను మీడియాకు చూపుతున్న ఖమ్మం ఎస్పీ రంగనాథ్

నిందితుల్లో ఓ న్యాయవాది: ఖమ్మం ఎస్‌పి వెల్లడి
english title: 
t

పొలాల్లో బయటపడ్డ దుర్గాదేవి విగ్రహం

0
0

కుంటాల, జూలై 16: మండలంలోని గొల్లమాడ అనుబంద గ్రామమైన రాయపాట్ తాండలో బుధవారం కురిసిన వర్షానికి గ్రామపొలిమేరల్లో సాగుభూమిలో దుర్గామాత విగ్రహం కనిపించింది. గొల్లమాడ గ్రామానికి చెందిన నీరటి శంకర్ సాగుభూమిలో ఈ విగ్రహం కనిపించడంతో రైతు గొల్లమాడ గ్రామంలోని ప్రజలకు విగ్రహం బయటపడ్డ విషయం తెలియజేశారు. దీంతో పండితులు లక్ష్మీకాంతంతో పాటు గ్రామస్తులు అక్కడికి చేరుకొని దుర్గాదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ విగ్రహం తన పంట భూమిలో వెలియడం తన అదృష్టంగా బావిస్తున్ననని సంబందిత రైతు శంకర్ పేర్కొన్నారు. విషయం క్రమంగా గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు సోకడంతో ప్రజలు తండోపతండాలు వచ్చి విగ్రహాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.

తిరుమలలో తరగని రద్దీ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూలై 16: తిరుమల్లో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో సర్వ దర్శనానికి 21గంటలు, కాలినడకన భక్తులకు 10గంటల సమయం పడుతోంది. వసతి దొరకని భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రద్దీ పెరగడంతో 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని ఉదయం 11 గంటలకే నిలిపివేశారు. ఉదయం 3గంటల నుంచి 34,236మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అర్థరాత్రి వరకు మరో 30వేలమంది స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి.

పంచాయతీల విలీనంపై
రహదారి దిగ్బంధం
భద్రాచలం, జూలై 16: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం కన్నాయిగూడెం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు రహదారి దిగ్బంధం చేశారు. పురుషోత్తపట్నం, పిచుకలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలను పోలవరం ఆర్డినెన్స్‌తో ఆంధ్రాలో కలపడం వల్ల రెండు తెలంగాణ సరిహద్దులకు మధ్యలో పంచాయతీలు చిక్కుకుపోయాయి. వీరు ఎటువెళ్లాలన్నా ఈ సరిహద్దులను దాటి వెళ్లాల్సిందే. పంచాయతీలను తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ కన్నాయిగూడెం సర్పంచ్ చంద్రకళ, పిఏసిఎస్ ఉపాధ్యక్షురాలు డేగల ఈశ్వరి ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. వీరికి సంఘీభావంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టిజెఏసి కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొనడంతో భద్రాచలం- వెంకటాపురం రహదారిపై 4 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

మండలంలోని గొల్లమాడ అనుబంద గ్రామమైన రాయపాట్
english title: 
p

-పాఠశాల వద్ద పాముకాటు- మూడో తరగతి విద్యార్థి మృతి

0
0

నిజామాబాద్, జూలై 16: బడికి వెళ్లిన ఓ చిన్నారి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల ఆవరణలోనే విష సర్పం కాటు వేయడంతో అతడిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గంగాధర్, శోభ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు చాకలి శ్రీనివాస్(9) గాంధీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం పాఠశాల వెనుక భాగంలోకి వెళ్లగా, చెట్ల పొదల్లో దాగి ఉన్న విష సర్పం కాటు వేసింది. అయితే తనకు పాముకాటు వేసిన విషయాన్ని గ్రహించని అతడు తరువాత ఎప్పటిలాగే తరగతి గదిలోకి వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపటికే అతను స్పృహతప్పి పడిపోయ, నూటి నుండి నురగలు రావడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు పాముకాటు వేసినట్టు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌ను హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

-పాఠశాల వద్ద పాముకాటు-
english title: 
p

‘సదరమ్’ నరకప్రాయమే!

0
0

* సమయపాలన పాటించని వైద్యులు..
* నాలుగేళ్లయినా అందని ధ్రువీకరణ పత్రాలు..
అనంతపురం, జూలై 17:జిల్లాలో బోగస్ వికలాంగ ధ్రువీకరణలను అరికట్టి అర్హులైన వికలాంగులకు సర్ట్ఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ‘సదరమ్’ క్యాంపు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యులు మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించి అర్హులకు వికలత్వం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ఆ ధ్రువీకరణ పత్రాలు కూడా మధ్యవర్తుల ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఐకెపి సిబ్బంది ద్వారా లబ్ధిదారు ఇంటికి చేరేలా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. సదరమ్ క్యాంపులను 2010లో జిల్లాకు పరిచయం చేయగా అవి కూడా అనంతపురం, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం అనంతపురం, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రతి శనివారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సదరమ్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇలా వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఈ క్యాంపులు నిర్వహిస్తుండడంతో ప్రతి వారం ఈ క్యాంపు వద్ద యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. అయినప్పటికీ ప్రతి వారం సుమారు వంద మంది వరకూ వికలాంగులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తుంటారు. ఇలా చాలామంది గడచిన ఐదారు వారాలుగా తిరుగుతున్నా వారిని చూసి వారి వికలాంగత్వాన్ని నిర్ధారించడానికి డాక్టర్లకు సమయం దొరకడం లేదు. ఇక జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వికలాంగులు వారి సహాయకుల సహకారంతో ఉదయం 9 గంటలకే అక్కడకి చేరుకుంటారు. అనంతరం అక్కడ వారి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును పూర్తి చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దరఖాస్తు ఫారం పూర్తి చేయడం కోసం వీరు పడే పాట్లు చూస్తే ప్రకృతి వైపరీత్యాల్లో ఆహారం కోసం తన్నుకున్నట్లుగా ఉంటుంది. ఇంత కష్టపడి దరఖాస్తు పూర్తి చేసుకుని వెళ్లేటప్పటికి సమయం గడచిపోవడంతో డాక్టర్లు వెళ్లిపోవడంతో వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతి వారం సుమారు 50 నుంచి వంద మంది వరకూ తిరిగి వెళ్లిపోతుంటారు. మళ్లీ వారం కూడా ఇదే పరిస్థితి ఉండడంతో సదరమ్ క్యాంపులు వికలాంగులకు నరకం చూపిస్తున్నాయి. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే వికలాంగులు సదరమ్ క్యాంపులో డాక్టర్ల వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరు వికలాంగ ధ్రువీకరణ పత్రం కోసం జిల్లాకు రావాలంటే ఒంటరిగా రాలేని పరిస్థితి దీంతో వీరికి సహాయంగా ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది. ఇలా రెండు మూడు వారాలుగా తిరుగుతున్నా మధ్యాహ్నం 12 గంటలకే డాక్టర్లు వెళ్లిపోతుండడంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికంగా కానీ లేదా ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా 2010లో పరీక్షలు చేయించుకున్న వికలాంగులకు ఇప్పటికీ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడం గమనార్హం. ఇలా అక్కడ పనిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యానికి తోడు డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ప్రతి వారం పలువురు వికలాంగులు ఆపసోపాలు పడుతూ సదరమ్ క్యాంపు చేరుకుంటున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు.
రెండు వారాలుగా ఇదే పరిస్థితి : సత్యనారాయణ, రాయదుర్గం
గడచిన రెండు వారాలుగా తిరుగుతున్నా తమ వంతు వచ్చేటప్పటికి వైద్యులు వెళ్లిపోతుండడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నా. రెండు వారాలుగా ఇదే పరిస్థితి, ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. నేను ఒంటరిగా రాలేను కాబట్టి నాకు తోడుగా ఒకరు రావాల్సి ఉంది. ఇద్దరి ఖర్చులూ భరించి ఇక్కడకు వస్తే పరిస్థితి ఇలా ఉంది. వికలాంగుల కోసం ఇలాంటి క్యాంపులు స్థానికంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
పది మార్లు వచ్చా: నాగలక్ష్మి, చెనే్నకొత్తపల్లి
నా వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటాయి, ఇప్పటికే నేను 10 మార్లు శిబిరానికి వచ్చాను. కానీ నాకు వికలత్వం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వయస్సులో కూలి పనికి వెళ్లలేను .. అయినా డాక్టర్లు కరుణిస్తారని క్యాంపు చుట్టూ తిరుగుతూనే ఉన్నా.
నరకప్రాయం:కుళ్ళాయప్ప, ముసలప్ప, రామగిరి మండలం
గడచిన మూడు వారాలుగా వికలాంగ ధ్రువీకరణ కోసం తిరుగుతూనే ఉన్నాం. ఉదయం 5 గంటలకే ఇంటి వద్ద నుంచి ఒక సహాయకుడి సహాయంతో బయల్దేరి ఇక్కడకు వస్తే ఇక్కడ దరఖాస్తులు పూర్తి చేయడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి వారం ఇదే తంతు .. ఇకనైనా మానవతా ధృక్పథంతో డాక్టర్లు స్పందించాలని కోరుతున్నాం.
రుణమాఫీపై స్పష్టత లేని ప్రభుత్వం
* వైకాపా ఎమ్మెల్యేలు విశ్వ, చాంద్‌బాషా
అనంతపురం కల్చరల్, జూలై 17: రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి స్పష్టత లేదని వైకాపా నాయకులు విమర్శించారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఐటి కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు విశే్వశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, సిఇసి సభ్యులు మధుసూదనరెడ్డి మాట్లాడారు. రైతుల రుణాలు రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ లేఖ వచ్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, రుణమాఫీ కాకపోతే అందుకు కారణం ఆర్బీఐ అని ప్రభుత్వం తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల ముందు రైతుల రుణాలు అన్నీ మాఫీ చేస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని హామీలిచ్చారన్నారు. వ్యవసాయ, బంగారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారని, ప్రస్తుతం మంత్రులు ఒక విధంగా, ముఖ్యమంత్రి ఒక విధంగా మాట్లాడుతూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మోసపూరిత హామీల వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన వైకాపా నిలబడుతుందని, పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధికి మంత్రులు ఏ మాత్రం కృషి చేయడం లేదని, జిల్లాలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు బోయ తిరుపాల్, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నాటక పోలీసులపై
దుర్గాగ్యాంగ్ కాల్పులు
* ఎస్‌ఐ సహా నలుగురికి గాయాలు
* గౌరిబిదనూరులో ఫాంహౌస్ దోపిడీయత్నం..
* పోలీసుల అదుపులో నిందితులు..
హిందూపురం, జూలై 17:హిందూపురంలో నివాసం ఉంటూ కర్నాటక, ఆంధ్ర తదితర ప్రాంతాల్లో దారి దోపిడీలు, హత్యలు, చోరీలు వంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన ఎరుకలి దుర్గా అలియాస్ దుర్గాప్రసాద్ బుధవారం అర్ధరాత్రి కర్నాటక గౌరిబిదనూరు సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. దాదాపు వందకు పైగా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా దుర్గాప్రసాద్ వివిధ పోలీస్‌స్టేషన్‌ల రికార్డుల్లో ఉన్నాడు. 2012లో లేపాక్షి పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ కేసుకు సంబంధించి స్థానిక సబ్‌జైలు నుంచి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అప్పట్లో ఈ సంఘటన దుమారం రేపగా ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇకపోతే ఇటీవలే బెయిల్‌పై వచ్చిన దుర్గా స్థానిక త్యాగరాజనగర్‌లో బయటకు రాకుండా కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గౌరిబిదనూరు సమీపంలోని ముద్దగానికుంట వద్ద బెంగళూరు సమీపంలోని దేవనహళ్లికి చెందిన బలరాం ఫాంహౌస్‌ను దోపిడీ చేసేందుకు పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా దుర్గాతో పాటు అనుచరులు రామాంజి, మధు ఫాంహౌస్ తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ పరిణామాలను పసిగట్టిన బలరాం గౌరిబిదనూరు పోలీసులకు సమాచారం
ఇవ్వగా కేవలం 2 కి.మీ దూరంలో పోలీసుస్టేషన్ ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీనికి తోడు మంచేపల్లి, గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఫాంహౌస్‌ను చుట్టుముట్టారు. దీంతో అప్రమత్తమైన దుర్గా వర్గీయులు పోలీసులపై నాటు తుపాకులతో కాల్పులు జరిపినట్లు గౌరిబిదనూరు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో గౌరిబిదనూరు ఎస్సై బైరానితోపాటు కానిస్టేబుళ్లు లింగన్న, ఖలీల్, చిక్కన్నలు గాయపడ్డారు. దుర్గా వర్గీయుల కాల్పులను ప్రతిఘటించిన పోలీసులకు రామాంజి, మధు దొరికిపోయారు. అయితే దుర్గా చీకట్లో చాకచక్యంగా తప్పించుకుని పరారైనట్లు గౌరిబిదనూరు పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మోస్ట్ వాంటెడ్ నిందితుడైన దుర్గాను కర్నాటక పోలీసులు ఈ సంఘటన సమయంలోనే అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. కర్నాటక పోలీసులు తమదైన శైలిలో విచారించి దుర్గాను కఠినంగా శిక్షించే విధంగా లోలోపల చర్యలు తీసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. ఇకపోతే ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న కర్నాటక డిజిపి దుర్గాపై కఠినంగా వ్యవహరించాలని, ఇందులో భాగంగా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సంఘటన నేపథ్యంలో కర్నాటక పోలీసులు హిందూపురంపై ప్రత్యేక దృష్టి వహిస్తున్నారు. ఇప్పటికే మఫ్టీలో హిందూపురం చేరుకున్న కర్నాటక పోలీసులు దుర్గా కుటుంబ సభ్యులు, అనుచరుల కదలికలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దుర్గా కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
24 గంటల నీటి సరఫరా
సాధ్యమయ్యేనా!
* నీటి నిల్వ సామర్థ్యంపై కలవరం..
హిందూపురం టౌన్, జూలై 17: అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారయింది హిందూపురం మున్సిపాలిటీ నీటి సరఫరా పరిస్థితి. ఇప్పటి దాకా పూర్తి స్థాయిలో పిఎబిఆర్ నుండి నీళ్లు రాకపోవడంతో సరఫరా చేయలేక సతమతమయ్యారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నీటి సరఫరాను సీరియస్‌గా తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఇదే విషయమై ఆదేశాలు ఇవ్వడంతో ఏకంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ హిందూపురం పట్టణ నీటి సమస్యపైనే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హిందూపురం పట్టణానికి కేటాయించిన 10 ఎంఎల్‌డిల నీటితోపాటు మరో 10 ఎంఎల్‌డిలు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇటు ఆర్‌డబ్ల్యుఎస్, ట్రాన్స్‌కో తమ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసుకొంటూ నీటి సరఫరాను పెంచడానికి కార్యాచరణకు దిగాయి. దీంతో మున్సిపల్ అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఒకేసారి 20 ఎంఎల్‌డిల నీటిని అందిస్తే వాటిని పట్టణవాసులకు ఎలా అందించాలోనని తలలు పట్టుకొంటున్నారు. హిందూపురం పట్టణంలో నీటిని నిలువ చేసుకొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఉన్న ట్యాంక్‌లు అంత సామర్థ్యంలో సరఫరా చేయలేవు. పట్టణంలో ఉన్న 21 ట్యాంక్‌ల సామర్థ్యం మొత్తం కలిపి ఐదు మిలియన్ లీటర్లు మాత్రమే. అంటే ఈ ట్యాంక్‌లను ఐదు మిలియన్ లీటర్ల నీటితో నింపవచ్చు. ఈ నింపిన నీటిని పట్టణ ప్రజలకు అందించాలంటే ఏకంగా 24 గంటల సమయం పడుతుంది. అంటే మరో 15 మిలియన్ లీటర్ల నీటిని ఎక్కడ ఉంచుకోవాలి, ప్రజలకు ఎలా సరఫరా చేయాలి అనే అంశాలపై మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మదనపడుతున్నారు. గతంలో పట్టణానికి ఒక్కో వ్యక్తికి రోజుకు 70 లీటర్ల నీటిని అందించాలన్న ఉద్దేశంతో పిఎబిఆర్ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారమే పట్టణానికి 10 ఎంఎల్‌డిల నీటిని కేటాయించారు. పట్టణంలో రూ.18 కోట్లతో నిర్మించిన అంతర్గత తాగునీటి పథకాన్ని ఇదే విధంగా రూపొందించారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టణవాసులకు రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల నీటిని అందించాలని ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఒక్కసారిగా రెండింతల నీటిని అందించాలని నిర్ణయించింది. అయితే ఈ నీటిని సరఫరా చేయడానికి పంపిణీ వ్యవస్థ పట్టణంలో లేదు. దాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది. దాని కోసం మరో రూ.30 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో జరిగే పనులు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పిఎబిఆర్ నుండి 20 మిలియన్ లీటర్ల నీటిని ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి ఈ నీటిని ఇస్తే ఏమి చేయాలన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా అదనపు నీరు అవసరం లేదని, పట్టణానికి కేటాయించిన 10 మిలియన్ లీటర్ల నీటిని ప్రతి రోజూ పిఎబిఆర్ నుండి ఖచ్చితంగా అందచేస్తే పట్టణంలోని ప్రజలందరికీ రెండు రోజులకు ఒక్కసారి నీటిని అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 20 ఎంఎల్‌డిల నీటిని ఇస్తే మున్సిపల్ అధికారులు ఎలా పంపిణీ చేయాలోనని తర్జన భర్జనకు గురవుతున్నారు.
ప్రబలుతున్న విషజ్వరాలు
* 123 కేసులు నమోదు
గార్లదినె్న, జూలై 17:మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దాదాపు 123 విష జ్వరం కేసులు నమోదైనట్లు సర్వే బృందం సభ్యులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని మండల పరిషత్, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు గురువారం ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం ప్రబలుతున్న విష జ్వరాలపై అవగాహన కల్పించడంతో పాటు ఇంటింటి సర్వేలో 123 జ్వరం కేసులతో పాటు దాదాపు 93 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిపి నాగరాజు, ఎంపిడిఓ జయరాం, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ వెంకటేష్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ తులసమ్మ, హెల్త్ సూపర్‌వైజర్ నాగేశ్వర రావు తదితర అధికారులు పర్యవేక్షించారు.
వజ్రకరూరులో డెంగ్యూ బాధితుడు
వజ్రకరూరు : సీజనల్ వ్యాధుల పట్ల మండల పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సర్వేలో మండలంలో డెంగ్యూ కేసు నమోదైనట్లు సర్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై సర్వేలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మండల పరిషత్, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంల ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గూళపాల్యం గ్రామానికి చెందిన విద్యార్థి ఎర్రిస్వామి డెంగ్యూ లక్షణాలతో అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం కర్నాటకలోని బళ్లారి ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా సర్వే బృందం సభ్యులు గ్రామంలో మురుగు నీటి కాలువలు శుభ్రం చేయాలని, ముఖ్యంగా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను శుభ్ర పరచాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ నియంత్రణ పాటించండి
* జిల్లా పరిషత్ చైర్మన్ చమన్
అనంతపురం సిటీ, జూలై 17: కుటుంబ నియంత్రణను ప్రతి కుటుంబంలోను తప్పక పాటించాలని జిల్లా పరిషత్ ఛైర్మెన్ చమన్ సాహెబ్ తెలిపారు. గురువారం స్థానిక వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో ప్రపంచ జనాభా వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చమన్ మాట్లాడుతూ పూర్వకాలంలో కుటుంబ నియంత్రణ అంటే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు సులువుగా కుటుంబ నియంత్రణ జరిగిపోతున్నదని తెలిపారు. భారతదేశంలో జనాభా తగ్గించుటకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నదని, వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని జనాభాను నియంత్రించుటలో పాలుపంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ వైద్యులు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా డియం అండ్ హెచ్‌ఓ డా.రామసుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివాహ వయస్సు, మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక టీకా, జవహార్ బాల ఆరోగ్య రక్షలాంటి పథకాలతో జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వెంకటరమణ, ప్రతాప్, సుజాత, హరి లీలాకుమారి, అల్లా బకాష్, గంగాధర్, మారుతిప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి..
* కలెక్టర్ ఆరోగ్యరాజ్ ఆకస్మిక తనిఖీలు
కళ్యాణదుర్గం, జూలై 17: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుని విధులు నిర్వహించాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్య రాజ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ కళ్యాణదుర్గం, శెట్టూరు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అధికారుల హాజరు పట్టికను, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద వున్న ప్రజాప్రతినిధులతో, ప్రజలతో కలెక్టర్ ముచ్చటించారు. సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు న్యాయం చేయడానికి అధికారులు పనిచేయాలని వివరించారు. కళ్యాణదుర్గం ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, ఎంపీడీఓ బాషా, ఎంపీపీ భర్త కొల్లప్ప, కొండాపురం సర్పంచ్ అనిల్‌చౌదరి తదితరులతో కళ్యాణదుర్గం మండలంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు వున్నాయి, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సి అంశాలపై వివరించారు. అనంతరం శెట్టూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కార్యాలయాల పనివేళ్లలో ప్రజలకు అందుబాటులో వుండాలని, సమస్యలతో కార్యాలయానికి వస్తే దాన్ని పరిష్కరించడానికి కృషి చేయాలని, లేకుంటే పై అధికారుల దృష్టికి తీసుకుని పోవాలని తెలిపారు. కలెక్టర్‌తోపాటు ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్కమ్మ దేవతకు పూజలు
పుట్టపర్తి, జూలై 17: భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన అక్కమ్మ దేవతకు అడుగడుగునా పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎలవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బరాయునిపల్లి ఆవుల వంశస్థుల నుండి అక్కమ్మ దేవతను ఒక ఎలవలోను, రాజులను మరొక ఎలవలోను ఉరుముల మధ్య అక్కమ్మను కీర్తిస్తూ ఆలాపన చేశారు. అనంతరం రెండు ఎలవ గంపలను గ్రామంలోని వీధుల్లో ఊరేగిస్తూ గ్రామ దేవత మొదలుకొని అడుగడుగునా దేవాలయాల్లో పూజలు నిర్వహించి అక్కమ్మను ఊరేగించారు. చవటవంక వరకు ఎలవలను ఊరేగించారు. అక్కడ ప్రతిమలకు వడిని నింపారు. ఉరుముల మధ్య అక్కమ్మను ప్రార్థిస్తు చేసిన ఆలాపన గీతాలకు చవటవంక ప్రాంతం భక్తపారవశ్యంతో నిండిపోయింది. సంతానం, ఉద్యోగం, కోర్కెల సిద్ధి కొరకు కొలనులో స్నానమాచరించిన పిదప అక్కమ్మ దేవతల చుట్టూ నాలుగు ప్రదక్షిణలు, పొర్లుదండాలు చేసి ఒడిలో నిండిన అమ్మను ప్రార్థించారు. ఈ సందర్భంగా అమ్మ వడి నుండి రాలి పడిన నిమ్మ పండును భక్తులకు అందజేస్తే కోర్కెలు సిద్ధిస్థాయనే ప్రక్రియ అత్యంత భక్త్భివాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముద్దల బొమ్మయ్య ఆధ్వర్యంలో ఆవుల కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు.
డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి
బొమ్మనహాళ్, జూలై 17:మండల పరిధిలోని కురవల్లి గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి కూతరు ఆశ జ్వరంతో ఉన్నట్లు గుర్తించి సోమవారం బళ్లారిలోని ఓ ప్రైవేట్ నర్శింగ్ హోంకు తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు డెంగ్యూ జ్వరంగా నిర్ధారించి, రక్తమార్పిడి చేయించారు. అనంతరం బాలిక తీవ్ర అస్వస్థకు గురి కాగా బళ్లారి నుంచి బెంగుళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందినట్లు బాలిక తండ్రి రోదిస్తూ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
విడపనకల్లు, జూలై 17: మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో గురువారం విద్యుత్ ఘాతానికి గురై రైతు చంద్రశేఖర్(18) మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు అచ్చమ్మ, రాముడు దంపతుల కుమారుడు చంద్రశేఖర్ యధావిధిగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు తోటలోకి వెళ్లాడు. తోటలో సాగు చేసిన మల్లె చెట్లకు నీళ్లు పెట్టాడన్నారు. తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరుతుండగా పొలాల మీదుగా వున్న 11 కెవి విద్యుత్ వైర్ తెగి అతనిపై పడటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనపై పాల్తూరు ఎస్సై రాజశేఖర్ విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైల్వే ట్రాక్ వద్ద
గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుత్తి, జూలై 17:పట్టణ శివారులోని ఎంఎస్ డిగ్రీ కళాశాల సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతి చెందినట్లు జిఆర్‌పి పోలీసులు తెలిపారు. అతడు చామనఛాయలో 5 అడుగుల ఎత్తు కలిగి బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, క్రీం కలర్ షర్టు ధరించి వున్నట్లు తెలిపారు. అతడి వయస్సు 40 ఏళ్లు వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిఆర్‌పి పోలీసులు తెలిపారు.
కళ్యాణదుర్గంలో
ప్రత్యేక వైద్య బృందం పర్యటన
కళ్యాణదుర్గం, జూలై 17: డెంగీ కేసు నమోదు కావడం, జిల్లాలో డెంగీ మరణాలు నమోదు కావడంతో కర్నూలు నుంచి గురువారం ప్రత్యేక వైద్య బృందం కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటించింది. ప్రత్యేక బృందం డాక్టర్లు శ్రీనివాసులు, మదుసూధన్, సరోజ, క్లషర్ ఆఫీసర్ డాక్టర్ పురుశోత్తం డెంగీ లక్షణాలు వున్న కేసుల జాబితాను తీసుకుని పర్యటించారు. కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రి, ఆర్డీటీ ఆసుపత్రిలో నమోదైనా కేసుల జాబితాను పరిశీలించారు. అనంతరం రోగులను సైతం పరిశీలించి, డాక్టర్లును వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో అఖిల అనే బాలికకు డెంగీ లక్షణాలు వున్నట్లు కేసు నమోదు కావడంతో, ఆ ఇంటికి ప్రత్యేక డాక్టర్లు బృందం పోయి ఆ ఇంట్లో వున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. కంబదూరు మండలం నుంచి గురువారం ఒక డెంగీ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంత డాక్టర్లు, వైద్య సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగిందని తెలిపారు. రాయదుర్గం నియోజక వర్గంలో వీరాపురం గ్రామంలో సైతం ప్రత్యేక వైద్యబృందం పర్యటించి, గ్రామంలో వున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. రక్త నమూనాల పరీక్షలు పూర్తి చేసిన వెంటనే ఆ లక్షణాలు వున్న వారికి అనంతపురం మెడికల్ కాలేజీలో వైద్యం నిర్వహించడం జరుగుతుందని, మరోసారి రక్త పరీక్షలు చేస్తామని వారు తెలిపారు.

* సమయపాలన పాటించని వైద్యులు.. * నాలుగేళ్లయినా అందని ధ్రువీకరణ పత్రాలు..
english title: 
s

విద్యార్థి సంఘాలచే దద్దరిల్లిన కలెక్టరేట్

0
0

కడప, జూలై 17: జిల్లాలోని వివిధ విద్యార్థి సంఘాలు సమస్యలపై గురువారం పెద్దఎత్తున ఆందోళనతో కలెక్టరేట్ ఎదుట ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఆంధ్రరాష్ట్రప్రభుత్వం త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుండటంతో ఈ డిఎస్సీలో ప్రస్తుతం రెండవ సంవత్సరం డిఎడ్ శిక్షణలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థినీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లాకన్వీనర్ లెనిన్ నేతృత్వంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట నినాదాలుచేసి ఏజెసి సుదర్శన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డిలు పెద్ద ఎత్తున విద్యార్థి లోకం తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం ప్రవేశంతో పేద విద్యార్థులు, ప్రతిభగల విద్యార్థులు వృత్తికోర్సుల్లో చేరి విద్యనభ్యసిస్తున్నారని వారి చదువులు ముగిసే సమయానికి ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలుకావాలని ఈసందర్భంగా వారు కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. దీంతో సంబంధిత విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపేసి ఇంటికి తిరిగిముఖంపడితే వారి భవితకు భరోసా ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలుకాని కారణంగా పేద విద్యార్థులుపై చదువులకు వెళ్లలేక టెన్త్, ఇంటర్ మీడియట్ విద్యకే స్వస్తి చెబుతున్నారని వారు ధర్నాలో వాపోయారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కొనసాగే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి విద్యార్థులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఏఐఎస్‌ఎఫ్, బిడిఎస్, ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ, ఇన్సాఫ్ విద్యార్థి సంఘాలు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారులు విద్యార్థుల ఆందోళనతో తలలుపట్టుకుంటున్నారు. మొత్తం మీద విద్యార్థిలోకం ఆందోళనలు ఎంతవరకు ఫలిస్తాయో కాలమే నిర్ణయించాల్సివుంది. ఈకార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి తరుణ్‌కుమార్, నాయకులు శ్యామ్, శివ, మోహన్‌తోపాటు స్పిరిట్, పవన్, విజయదుర్గా, ప్రసాద్, అర్చన, న్యూమోడల్, పిఎన్‌ఆర్, వికాస్, వెంకటేశ్వర కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పేట్రేగుతున్న ఇసుక మాఫియా
కడప, జూలై 17: జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. దీంతో నదీపరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు తరలిపోతుండటంతో ఆ ప్రాంతాలు బావురుమంటున్నాయి. దీనివల్ల భూగర్భజలాలు పూర్తి స్థాయిలో అడుగంటి జిల్లావాసులు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు కరువవుతోంది. జిల్లాలోని పెన్నా, కుందు, బహుద, పాపాగ్ని, స్వర్ణముఖి తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియాలు సొరంగాలు తరహాలో ఇసుకను తరలించి కోట్లరూపాయలకు పడగెత్తారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు రెవెన్యు, మైనింగ్, ఫారెస్టు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారుల్లో సమన్వయం లోపించి ఇసుక మాఫియాకు వత్తాసుపలుకుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇసుక మాఫియాను అరికట్టాలని పంచాయతీ శాఖతోపాటు సంబంధిత శాఖలను ఆదేశించినా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యకాలంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో సుమారు 200 ట్రాక్టర్లను సీజ్ చేసి రూ.5లక్షలు మేర వాటికి జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. కొంతమంది అధికారులకు ఇసుక మాఫియాలు నెలసరి మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. సెలవు రోజుల్లో సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది పత్తా కన్పించకపోవడంతో ఆరోజుల్లో ఇసుక మాఫియా పెట్రేగి యథేచ్చగా రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతల అండదండలతో ప్రతి నియోజకవర్గంలో ఇసుక దందా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి ఇసుకను ఏకంగా పెద్దపెద్ద పట్టణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల ప్రాంతాల్లో ఇసుక మాఫియాలు ఏకంగా బహిరంగంగానే వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి కోట్లరూపాయలకు పడగెత్తారు. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో అరకొర ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఇసుక ట్రాక్టర్ రూ.500 లోపే ఉండగా ప్రస్తుతం ఇసుక మాఫియా పుణ్యమా అని రూ.2వేల నుంచి 3వేల వరకు ధర పలుకుతోంది. పేద వర్గాలకు చెందిన ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇసుక లభ్యం గగనంగా మారి పడరాని పాట్లు పడుతున్నారు. చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకుని నిర్మాణాలకు ఉపయోగించేవారు. సిమెంట్ ధర రూ.320లు చేరుకోగా ఇసుక కూడా డిమాండ్ తరహాలోనే ధరలు పెరిగాయి. ఇసుక తరలించడం కారణంగా కడప నగరంతోపాటు అన్ని నియోజకవర్గాల పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటి బోర్లలో నీరు ఆవిరై ఒక వేళ వర్షాలు వచ్చినా ఇసుక తరలింపుతో వర్షపునీరు పూర్తిస్థాయిలో వృధా అవుతోంది. చాలా వరకు నదీ పరివాహక ప్రాంతాలు ఇసుక తరలింపుతో ఇసుక గర్భశోకం అంతా ఇంతా కాదు. జిల్లా రెవెన్యూ అధికారుల నేతృత్వంలో టాస్క్ ఫార్సు ఏర్పాటుచేసిన వారుసైతం అక్రమంగా తరలిపోయే ఇసుకను అడ్డుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఇసుకమాఫియాను అరికట్టి భూగర్భజలాలు అడుగంటకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చేనేత కార్మికుల బీమా పథకంపై కసరత్తు
కడప,జూలై 17: జిల్లాలో వివిధ కులవృత్తులకు ధీటుగా చేనేత కార్మికులు ఉండగా వారి సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఒక అడుగుముందుకేసింది. ఈనేపధ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు గురువారం కలెక్టర్ సభాభవన్‌లో చేనేత శాఖతోపాటు వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా జెసి మాట్లాడుతూ చేనేత కార్మికుల సహజమరణం, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ వారసులకు జీవిత బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకంలో కార్మికులను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలన్నారు. 2014-15 సంవత్సరానికి జీవిత బీమా పథకం కింద 6500 మందిని చేర్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని , జూన్ ఆఖరు నాటికి 6082మందికి జీవిత బీమా చేయడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం చేనేతకార్మికుల జీవనోపాధికి రుణపరపతి కార్డుల ద్వారా అవసరమైన రుణసహాయం 30వేల నుంచి 50వేల రూపాయల వరకు ఏ విధమైన హామీ లేకుండా బ్యాంకుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. చేనేత రుణ పరపతి కార్డులకోసం 2355 దరఖాస్తులు బ్యాంకులో ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు బియ్యంకార్డు కలిగివుంటే వారికి ఉపాధిహామీ పథకం ద్వారా జాబ్‌కార్డులు జారీ చేయాలన్నారు. చేనేత కార్మికులకు శిల్క్ నూలు కొనుగోలుపై రాయితీ 8345 మందికి కోటి 48లక్షలు రూపాయలు వారి బ్యాంకుల ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన కార్మికులకు రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జెసి ఆదేశించారు. జిల్లాలో 2014-15 సంవత్సరానికి చేనేత కార్మికులు చనిపోయిన వారి వివరాలు జీవిత భీమా సంస్థకు పంపించాలన్నారు. పట్టుపరిశ్రమ శాఖలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారులు ఇంటికి వెళ్లి మగ్గాలు లేని వారి వివరాలు పరిశీలించాలన్నారు. చేనేత జౌలిశాఖ, పట్టుపరిశ్రమశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణరావు, రామ్‌గోపాల్‌రెడ్డి, ఎల్‌డిఎం రఘునాధరెడ్డి, ఎస్‌బిఐ ఆర్‌ఎం సుబ్రమణ్యం, ఏపిజిబి సీనియర్ మేనేజర్ వీరారెడ్డి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ సూర్యబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

లారీ లోయలోపడి ముగ్గురి మృతి
చింతకొమ్మదినె్న, జూలై 17: కడప జిల్లాలోని కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిలో చింతకొమ్మదినె్న మండలం గువ్వల చెరువు ఘాట్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సిఐ రాజగోపాల్‌రెడ్డి సమాచారం మేరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి జిప్సం లోడుతో వెళ్తున్న లారీ గువ్వలచెరువు ఘాట్‌లో తెల్లవారు జామున నాలుగవ మలుపువద్ద అదుపుతప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లోయలో పడ్డ లారీని రెండు భారీ క్రేన్‌ల ద్వారా బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు వ్యక్తులు విగత జీవులై పడి ఉండడంతో మృత దేహాలను కూడా వెలికి తీశారు. మృతుల్లో డ్రైవర్ శ్రీనివాసరావు (45), క్లీనర్ సుధాకర్ (40)తోపాటు మరో వ్యక్తి ఉన్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు
కడప(కల్చరల్), జూలై 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి, నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడటం తగదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సి.సుబ్రమణ్యం అన్నారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత యుపిఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడిమేరకు కేంద్రప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన గుర్తుచేశారు. ప్రజల వలసలు, విచారణ లక్ష్యంతో పథకం అమలులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కాగా ఇటీవల ఉపాధి హామీ పథకంతో కూలీల రేట్లు పెరిగాయని, ఇందుకోసం సవరణలు చేయడం తగదన్నారు. ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనిదినాలు, వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకాన్ని కాపాడుకునేందుకు మరోమారు ఉద్యమాలకు సమాయత్తం అవుతున్నామని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలకు పనిదినాలు 200 రోజులకు పెంచాలని, వేతనాలు రూ.300లు పెంచాలన్నారు. ఉపాధి హామీతో 90శాతం పనులను కూలీల ద్వారానే చేయించాలని, పెరిగిన కూలీ రేట్లకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. వ్యవసాయ అభివృద్ధికోసం చెరువులు, కుంటలు, వాగులు, పంట కాలువలు, వరద నియంత్రణ పనులు, భూముల అభివృద్ధి పనులు, చెట్లపెంపకం మురుగునీరు పారుదల, మట్టికాలువలు, పంచాయతీ రోడ్లు, లింక్‌రోడ్లు ,గ్రామీణాభివృద్ధి పనులు కౌలు రైతులకు ఈ పథకం అమలు పర్చాలన్నారు. ఈసమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.నాగరాజు, రూరల్ కార్యదర్శి జి.నాగేంద్ర, నాయకులు జి.కొండయ్య, ఎవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలపై డిటిలకు అవగాహన తప్పనిసరి
రాజంపేట టౌన్, జూలై 17:ప్రతి రెవెన్యూ సమస్యపై డిప్యూటీ తహశీల్దార్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆర్డీఓ ఎం.విజయసునీత అన్నారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో సభాభవన్‌లో డివిజన్ పరిధిలోని 17 మండలాల డిటిలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి ఒక రెవెన్యూ అంశాలపై అవగాహన తప్పనిసరియన్నారు. తహశీల్దార్లకు ఏ విధంగా అధికారాలు ఉన్నాయో, అదేవిధంగా డిటిలకు అధికారాలున్నాయని ఆమె వివరించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఏలాంటి పరిపాలన జరుగుతుందో, అదేవిధంగా మండల స్థాయిలో పరిపాలన సాగుతుందన్నారు. ప్రతి ఒక డిటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఇటీవల సియం వీడియో కాన్పరెన్స్ ద్వారా అన్ని మండలాల అధికారులతో సమీక్షించారన్నారు. నెలకోమారు డిటిలతో పలు రెవెన్యూ అంశాలు, విధులపై సమీక్షించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది మొదటి సమావేశం కావున ఆగస్టులో జరిగే సమావేశానికి డిటిలు సిటిజెన్ ఛార్ట్ నివేదికలతో హజరవ్వాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి ఎన్ని అర్జీలు స్వీకరించారో, వాటిలో ఏవేవి పరిష్కరించారో మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి నివేదికలను ప్రతి శుక్రవారం డిఆర్వోకు నివేదించాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి వచ్చే ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. డివిజన్‌లో 362 అర్జీలు పరిష్కరించాలన్నారు. 1052 అర్జీలు వివిధ దశలలో ఉన్నాయన్నారు. సియం పేషి నుండి వచ్చిన 153 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు న్యాయం చేకూర్చాలని ఆమె సూచించారు. బి.మఠం, బద్వేల్, అట్లూరు, ఓబులవారిపల్లె మండలాల నుండి అధికంగా అర్జీలు వస్తున్నాయని, వాటిని వీలైనంత త్వరితంగా పరిష్కరించాలన్నారు. వివిధ దృవపత్రాల ఆప్‌లోడ్ మీ సేవలో మన డివిజన్ జిల్లాలో ప్రథమస్థానంలో ఉందన్నారు. అట్లూరు, నందలూరు, పెనగలూరు, బి.మఠం, రాజంపేట మండలాలలో మీ సేవ నమోదు ఆలస్యంగా ఉందన్నారు. డివిజన్‌లో రేషన్‌కార్డులు ఆధార్ అనుసంధానం 70 శాతమే ఇప్పటికి పూరె్తైందన్నారు. ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయో, వాటిని గుర్తించి విఆర్వోల ద్వారా ఆప్‌లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు. ఆధార్ అనుసంధానంతో రుణాల రీ షెడ్యూల్, పాసుపుస్తకాలు, డ్వాక్రా రుణాల వంటి సేవలన్ని ఉంటాయన్నారు. ఇంటిపట్టాలు, డి ఫారమ్స్, అడంగళ్, నివాస దృవపత్రాలు, ఫైసల్ దృవపత్రాలను మీ డిజిటల్ సంతకాలతో మీరు నేరుగా నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో వీటిని నేరుగా జారీ చేయ వచ్చునన్నారు. వీడియో కాన్పరెన్స్‌ల ద్వారా డిటిలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. బి.కోడూరు డిటికి చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో తహశీల్దార్‌గా నిర్వర్తించేందుకు జెసి ఆమోదం తెలిపారని, పెనగలూరు డిటి ఖాళీని భర్తీ చేయడం జరుగుతుందని, రాజంపేట మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ఆర్డీఓ డిటి పివి రమణకు సూచించారు. ఈ సమావేశంలో ఏఓ శ్రీనివాసులు, ఎన్నికల డిటి సివి సుబ్బన్న, డివిజన్‌లోని 17 మండలాల డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.

ముగిసిన తాళ్ళపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట, జూలై 17:రాజంపేట మండలం తాళ్ళపాక ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముగింపు రోజు ఇక్కడి శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో ఉత్సవమూర్తులకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలతో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు ఆలయాల్లో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తెప్పించిన పుష్పయాగం ఉత్సవాన్ని భక్తులు కన్నుల పండువగా తిలకించారు. బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ధర్మప్రచార పరిషత్. అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కళాకారులు నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి అందరిని అలరించింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రెండు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం జరిగింది. ఊంజల్‌సేవ మహోత్సవంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామిని కన్నులారా తిలకించారు. అలాగే తాళ్ళపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకున్న సుదర్శనచక్రం ఆలయంలో కూడా వేద పండితులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలతో గత 11 రోజులుగా తాళ్ళపాక వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో శిఖర దీపారాధన, నంది వాహనం, గరుడ సేవ, మోహినీ అవతారం, ఒకే వేదికపై శివకేశవుల ఆర్జిత కళ్యాణోత్సవం, స్నపన తిరుమంజనం, త్రిశూల స్నానం, చక్రస్నానం, పార్వేట ఉత్సవం, పల్లకీసేవలు, ఊంజల్‌సేవ మహోత్సవాలు భక్తులను విశేషంగా అకట్టుకున్నాయి.

మూడు ట్రాక్టర్ల పట్టివేత
పెండ్లిమర్రి, జూలై 17: మండలంలోని పైడికాలువ పరిధిలో గల పాపాగ్ని నది నుంచి అక్రమంగా ఇసుకను కడపకు తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను, అలాగే మట్టి తరలిస్తున్న మరో ట్రాక్టరును వైవియు సమీపంలోని కడప -పులివెందుల రహదారి మధ్యలో మైన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను పెండ్లిమర్రి పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. అలాగే అక్రమంగా ఇసుకను తరలించడం చట్టరీత్యానేరమని, కావున ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలించాలని చూస్తే ట్రాక్టర్లు సీజ్‌చేసి కేసు నమోదుచేస్తామని వారు హెచ్చరించారు.
ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల దరఖాస్తుల పొడిగింపు
కడప (రూరల్), జూలై 17: డి.ఇడి, బి.ఇడి (స్పెషల్‌ఎడ్యుకేషన్) రెండు సంవత్సరాల రెగ్యులర్ కోర్సును హెలన్‌కెల్లర్స్ ట్రైనింగ్ కాలేజ్ ఫర్ టీచర్స్ ఆఫ్ ది డెఫ్ నిర్వహిస్తుందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.దౌలత్‌ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈకోర్సుల శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకునేవారికోసం ఈనెల 25వ తేది వరకు పొడిగించడమైనదని తెలిపారు. డి.ఇడి కోర్సులో ప్రవేశించేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఓసి, బిసిలు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ,పిహెచ్‌లు 45శాతం మార్కులు కలిగివుండాలన్నారు. అలాగే బి.ఇడి కోర్సులో ప్రవేశించేందుకు బిఎ, బిఎస్సీ, బికాం డిగ్రీ ఉత్తీర్ణులై , ఓసి, బిసి లు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌లు 45శాతం మార్కులు కలిగివుండాలన్నారు. పై విద్యార్హతలు కలిగి డి.ఇడి, బి.ఇడి కోర్సుల్లో చేరే విద్యార్థులు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నిర్ణయించిన కోర్సు ఫీజు, అన్ని ఒరిజినల్ సర్ట్ఫికెట్లు తీసుకుని ఈనెల 25వ తేది లోగా హెలన్‌కెల్లర్స్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, గృహకల్ప రోడ్డు, సెంట్రల్ జైలు, రామాంజనేపురం,చిన్నచౌక్, కడప అనే చిరునామను సంప్రదించాలన్నారు.

నగర మేయర్‌కు సన్మానం
కడప(టౌన్), జూలై 17: కడప నగర మేయర్ కె.సురేష్‌బాబును కడప బిసి అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో మేయర్ చాంబర్‌లో ఆయన్ను గురువారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మేయర్‌కు శాలువా కప్పి, పూలమాలవేసి సన్మానించారు. అనంతరం బిసి అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ జివి సుబ్రమణ్యం మాట్లాడుతూ బిసి వర్గానికి చెందిన వ్యిక్తి మేయర్ కావడం హర్షణీయమన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో దేశంలో ఎంతోమంది గొప్పవారు, మహాత్మా, జ్యోతిరావు పూలే వంటి వారి త్యాగఫలంగా ఈ అవకాశాన్ని గుర్తు చేశారు. నగర మేయర్ ముందు ఎన్నో సమస్యలున్నాయని, నగర ప్రజల సమస్యలు తీర్చి ప్రజల మన్ననలు పొందాలన్నారు. సమస్యలు లేని నగరంగా కడపను తీర్చిదిద్దాలన్నారు. ఒక బ్రాండ్ ఇమేజ్‌ను, మంచి గుర్తింపు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు కె.సునీల్‌కుమార్, రామచంద్రయ్య, వేణుగోపాల్, ఎస్.రామకృష్ణ, ఎస్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.
రైల్వే నిర్మాణపనులను పరిశీలించిన జెసి
పెండ్లిమర్రి, జూలై 17: కడప -బెంగుళూరు రైల్వే నిర్మాణ పనులు గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు పరిశీలించారు. మండలంలోని కొత్తగిరంపల్లి, రెడ్డిపల్లె, యాదవాపురం, పెండ్లిమర్రి వరకు నిర్మించిన రైల్వేపనులు రైల్వేశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామప్రజలు రైల్వేనిర్మాణం కోసం సాగుచేసుకుంటున్న డికెటి భూములు కోల్పోయామని జెసికి విన్నవించారు. ఈ సందర్భంగా జెసి స్పందిస్తూ పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక తాహశిల్దార్ కార్యాలయం సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈకార్యక్రమంలో జెసి వెంట కడప ఆర్డీవో హరిత, తాహశిల్దార్ ఆంజనేయులు, రైల్వే అధికారులు , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాగునీటిని సమస్యను పరిష్కరించిన ఎంపిడివో
వీరబల్లె, జూలై 17:మండల కేంద్రమైన వీరబల్లెలో, సోమవారం వడ్డెపల్లెలో, ఓదివీడు కాస్పాలో గత కొన్ని రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య ఉండేది. గురువారం ఎంపిడివో మల్‌రెడ్డి ఆయా ప్రాంతాలలో పర్యిటించి తాగునీటి సమస్యను వీరబల్లెలో ట్యాంకర్లుద్వారా అందించే ఏర్పాటుచేశారు. సోమవారం వడ్డెపల్లెలో 2000 లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకులు ఏర్పాటుచేయాలని ఆర్‌డబ్య్లూఎస్ జెఈని ఆదేశించారు. అదేవిధంగా ఓదివీడుకాస్పాలో ట్యాంకుకు నీరు అందేందుకు కనెక్షన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇకపై ఆయా ప్రాంతాల మహిళలు తమకు సరిపడ తాగునీరు తీసుకోవాలన్నారు. ఒకే కుటుంబానికి ఎక్కువ నీరు తీసుకోని ఇతర కుటుంబాలకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వీరబల్లె సర్పంచ్ వెంకట్రమణ, ఆర్ డబ్య్లూ ఎస్ రంగానాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
8 మంది ఎఫ్‌ఎల రెన్యూవల్
గాలివీడు, జూలై 17: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులలో 8 మంది సర్వీసులను మాత్రమే రెన్యూవల్ చేయడం జరిగిందని ఎపివో సురేష్ తెలిపారు. గోరాన్ చెరువు, ఎగువగొట్టివీడు, ప్యారంపల్లె, గుండ్లచెరువు, పందికుంట, పూలికుంట, చీమలచెరువుపల్లె, తలముడిపి పంచాయతీల ఎఫ్‌ఎలను మాత్రమే రెన్యూవల్ చేశామన్నారు. మిగిలిన వారినందరిని హోల్డింగ్‌లో ఉంచడం జరిగిందని తదుపరి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సిందన్నారు.
రెండు బోదకొట్టాలు దగ్ధం
* లక్ష రూపాయల ఆస్తి నష్టం
చక్రాయపేట, జూలై 17:మండలంలోని ఎర్రబొమ్మనపల్లె పంచాయితీ జంగపల్లె గ్రామానికి చెందిన మల్లేష్, ఓబయ్యలకు చెందిన బోదకొట్టాలు దగ్ధమై లక్ష రూపాయల మేరకు ఆస్తినష్టం సంభవించినట్లు గురువారం బాధితులు పేర్కొన్నారు. వెంటనే గ్రామస్తులు మూకుమ్మడిగా మంటలు అదుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 10 బస్తాల బియ్యం, ఇంటి సామాగ్రి కాలిపోయి తాము కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు పేర్కొన్నారు.
స్పందించిన అధికారులు
అగ్నిప్రమాద సంఘటన అధికారుల దృష్టికి రావడంతో ఆర్‌ఐ సూర్యనారాయణరెడ్డి, విఆర్వోలు అక్కడకెళ్లి నష్టాన్ని పరిశీలించి అధికారులకు నివేదించామన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహయం అందజేయాలని స్థానికులు కోరారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
రాయచోటి, జూలై 17: పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీ చెక్ పోస్టు సమీపంలో రజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకెళ్తే...రజిత, బాలాజిలకు సంవత్సరం కిందట వివాహం అయింది. తొలుత వీరు కొండవాండ్లపల్లెలో జీవనం సాగించేవారు. అనంతరం రాయచోటి పట్టణంలోని చెక్ పోస్టు సమీపంలో జీవిస్తున్నారు. బాలాజి ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో గురువారం రజిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతి చెందిన రజితను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు
రాయచోటి, జూలై 17 : పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న బానుప్రసాద్‌ను గురువారం సాయంత్రం ఆటో ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేశాపురం గ్రామం గొల్లపల్లెకుచెందిన బాను ప్రసాద్ రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తరగతులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పాఠశాల సమీపంలో ఆటో ఢీకొన్నది.
ఈ ప్రమాదంలో బాను ప్రసాద్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆ బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు.

నెలాఖరున రేషన్ ఇవ్వాలని వినతి
రాయచోటి, జూలై 17: రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల చివరి వారంలో పేదలకు పంపిణీ చేయాల్సిన నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా తహసీల్దార్ వేదనాయకంను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ సమయాల్లో ముందుగానే రేషన్ పంపిణీ చేయాలని తహసీల్దార్‌ను కోరానని అందుకు ఆయన స్పందించినట్లు తెలిపారు. పట్టణంలో అధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్నారని తెలిపారు. ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ముందు రోజుల్లో ఈ నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తే ముస్లిం సోదరులకు ఆనందంగా ఉంటుందని ఆయన తహసీల్దార్‌కు కోరినట్లు తెలిపారు. దయ ఉంచి రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్‌రెడ్డి, నాగేంద్ర, సహదేవ, మహబూబ్ బాష, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని వివిధ విద్యార్థి సంఘాలు సమస్యలపై గురువారం పెద్దఎత్తున
english title: 
collectorate

నవ్యాంధ్రకు 12 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయింపు

0
0

* తిరుపతిలో వెయ్యి ఎకరాల్లో ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐఎస్‌ఇఆర్ ఏర్పాటు
* అవసరమైతే అటవీ భూములు కూడా పరిగణనలోకి తీసుకుంటాం
* మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడి
తిరుపతి, జూలై 17: నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 12 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను కేటాయించిందని రాష్ట్ర మునిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటుచేయనున్న ఐఐటి విద్యాసంస్థల స్థల పరిశీలన తదితర అంశాలపై మంత్రి పి.నారాయణ, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలసి గురువారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిదార్థజైన్ మంత్రులకు జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పి.నారాయణ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేంద్రప్రభుత్వం రూపొందించిన బిల్లులో రాష్ట్రానికి నూతనంగా 12 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కేటాయించిందని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రహదారులు ఇతర వౌళిక వసతులు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిల్లో ఈ సంస్థలను ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో 300 ఎకరాల్లో ఐఐటి, 500 ఎకరాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం, 200 ఎకరాల్లో ఐఐఎస్‌ఆర్‌లు, విజయవాడలో అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐఐటి, గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో ఐఆర్‌ఎస్, అనంతపురం జిల్లా హిందూపురంలో సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, కర్నూలులో ఎన్‌ఐటి సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైతే అటవీ భూములను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం మేర్లపాక, పంగూర, పొగిలి వద్ద భూముల పరిశీలనకు అధికారులతో కలసి మంత్రులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి.హెచ్.శ్రీ్ధర్, తిరుపతి ఆర్‌డిఓ చెరుకూరు రంగయ్య, తుడా విసి వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రుల సమీక్షా సమావేశానికి ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ్ధర్ అధికారులతో కలసి చంద్రగిరి, ఏర్పేడు, తొట్టంబేడు తహశీల్దార్లతో ఆయా ప్రాంతాల్లో భూముల లభ్యతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

వివాహితపై అత్యాచారయత్నం
* ప్రతిఘటనలో నిందితుడు మృతి
* పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన కుటుంబం
కుప్పం, జూలై 17: గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక వివాహితపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కృష్ణప్ప (55) అనే వ్యక్తిని బాధితురాలు కర్రతో తలపై కొట్టడంతో మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వివాహిత భర్త, కృష్ణప్ప పక్కపక్క పొలాలకు చెందినవారు. వివాహిత భర్త కుటుంబ పోషణ కోసం బెంగళూరు నగరానికి ప్రతిరోజూ ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి భర్త ఇంటిలో లేని సమయం చూసి వివాహిత వంట చేసుకుంటుండగా కృష్ణప్ప అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె ఎదురుదాడికి దిగి కృష్ణప్పను తలపై కొట్టడంతో అతను అక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇంతలో భర్త రావడంతో అతనికి విషయం చెప్పి ఆటోలో కృష్ణప్పను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. గురువారం ఉదయం వివాహిత కుటుంబసభ్యులంతా గుడుపల్లె పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మృతిచెందిన కృష్ణప్పను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు సిఐ వేణుగోపాల్, ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం స్వాధీనం
* ముగ్గురు అరెస్టు
రొంపిచెర్ల, జూలై 17: మండలంలోని గానుగచింత పంచాయతీ ఓబులవారిపల్లె సమీపంలో ద్విచక్ర వాహనంతో సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుకుమార్ గురువారం తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కె.వి.పల్లె మండలం చీనేపల్లెకు చెందిన నాగేశ్వర, చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్లకు చెందిన ధనంజయ, వెంకట్రమణారెడ్డి అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున ఓబులవారిపల్లెకు సమీపంలోని ఎర్రగుట్ట పొదలవద్ద ఎర్రచందనం దుంగలను రవాణాకు సిద్ధం చేస్తుండగా పట్టుకున్నామన్నారు. వీరి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు వంద కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 2.90 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది నరసింహులు, వేణు, చంద్ర తదితర పోలీసులు పాల్గొన్నారని, కేసు నమోదుచేసి నిందితులను అరెస్టుచేసి పీలేరు కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

నవ్యాంధ్ర నిర్మాణంలో రెవెన్యూ శాఖదే కీలక పాత్ర
* ప్రభుత్వ భూములపై నివేదికలు సిద్ధం చేయాలి
* జెసికి ఉప ముఖ్యమంత్రి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూలై 17: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలక భూమిక పోషించాలని, ఈనేపథ్యంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి భూమి నిర్వహణ, కోనేరు రంగారావు కమిటీ సిపార్సుల అమలు, రెవెన్యూ పరిపాలన, మీ-సేవ, సర్వే ల్యాండ్ రికార్డుల నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రెవెన్యూ సేవలు ఎంతో కీలకమైనవన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా వివిధ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇందుకు సర్కారు భూమి అవసరమవుతుందని, పట్టణ సమీపంలోని పది కిలోమీటర్ల పరిధిలో గల సర్కారు భూములన్నింటికీ రక్షణ కల్పించాలని ఆదేశించారు. గుర్తించిన శ్మశాన వాటికలలో బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రహరీగోడలు, ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేయాలని సూచించారు. కోనేరు రంగారావు సిఫార్సుల అమలుకు సంబంధించి అసైన్డ్ భూముల వివరాలు, రెవెన్యూ, అటవీశాఖ భూముల సరిహద్దుల వివాదాలు, రుణ అర్హత కార్డుల పంపిణీ తదితర రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. సర్కారు అవసరాల నిమిత్తం ప్రజల నుంచి భూములు తీసుకున్న వాటికి సంబంధించి మొత్తం పరిహారం చెల్లింపు జరిగిందా, ఇంకా ఇవ్వాల్సిన వివరాలను కూడా వెంటనే పంపాలన్నారు. రెవెన్యూ రికార్డులన్నింటినీ పక్కాగా నిర్వహించాలని, వీలైనంత వరకు పాత రికార్డులు అన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలన్నారు. విఆర్‌ఒల పనితీరును మెరుగుపరచాలని, వాటర్ ట్యాక్స్, వ్యవసాయ సంబంధిత భూమల వివరాలను సక్రమంగా రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. మీ-సేవ ద్వారా రెవెన్యూ సేవలను మరింత అభివృద్ధి పరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2014 సంవత్సరం లోపు పంటల స్థితిగతుల డేటాఎంట్రీ పూర్తిచేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రెవెన్యూ రికార్డులో ఆధార్ నెంబరు నమోదును వందశాతం పూర్తిచేయాలన్నారు. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి పరచుకోవాలి, రెవెన్యూ పరంగా చేపట్టాల్సిన చర్యలు, వాటిపై సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వాటన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాల వారీగా సమీక్ష జరిపి అవసరమైన సలహాలు, సూచనలు జారీచేశారు. ఈ సమావేశంలో భూపరిపాలన శాఖ సహాయ కమిషనర్ సూర్యకుమారి, రెవెన్యూ శాఖ కార్యదర్శులు పాల్గొనగా, జిల్లా నుంచి మదనపల్లె సబ్ కలెక్టర్ భరత్‌గుప్తా, ఎజెసి వెంకటసుబ్బారెడ్డి, డిఆర్‌ఒ శేషయ్య, ఆర్డీఒ పెంచలకిషోర్, సర్వే ల్యాండ్ ఎడి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఎఒ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా సుబ్రహ్మణ్యస్వామికి పూజ
శ్రీకాళహస్తి, జూలై 17: ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సమేత సన్నిధిలో ఉత్సవ మూర్తులను ఏర్పాటుచేసి పూజారులు ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అదేవిధంగా విజ్ఞాన గిరిపై ఉన్న కుమార స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఇఓ శ్రీనివాసరావు, ఆలయ ఇన్స్‌పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

జెఎస్‌వై నిధులు సక్రమంగా వినియోగించాలి
* జిల్లాలో త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ
* డిసిహెచ్‌ఎస్ సరళమ్మ స్పష్టం
మదనపల్లెటౌన్, జూలై 17: ప్రభుత్వాసుపత్రులకు మంజూరయ్యే జననీ సంరక్షణ పథకం (జెఎస్‌వై) నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత వైద్య అధికారులపైనే ఉందని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ సరళమ్మ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వాసుపత్రులలో ఖాళీగావున్న 27 వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనన్నట్లు తెలిపారు. గురువారం మదనపల్లె ప్రభుత్వాసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ జెఎస్‌వై నిధుల కోసం వచ్చే బిడ్డతల్లులను ఆస్పత్రుల చుట్టూ తిప్పించుకోకూడదన్నారు. జెఎస్‌వై పథకంకు సంబంధించి నిధులు వచ్చిన వెంటనే సమాచారం అందించి పంపిణీ చేయాలన్నారు. ఎంబిబిఎస్ పూర్తి చేసిన వైద్యులు సిఎఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. త్వరలో భర్తీకానున్న పోస్టులకు సిఎఎస్ పూర్తిచేసిన వైద్యులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆస్పుత్రులలో ఎంఎన్‌ఓలు చేయాల్సిన పనులను స్వీపర్ల చేత చేయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇకమీదట ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ కాంప్లెక్స్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందుల కొరత రాకుండా చూడాలన్నారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వైద్యసేవలు ఎలా అందుతున్నాయంటూ ఆరా తీశారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాల్వ్రికుమార్, ఆర్‌ఎంఓ గురుస్వామినాయక్, వైద్యులు జ్ఞానేశ్వర్, సరస్వతి పాల్గొన్నారు.

అంధుల అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం
తిరుపతి, జూలై 17: సౌత్ ఆఫ్రికాలో డిసెంబరు నెలలో జరుగనున్న అంతర్జాతీయ అంధుల క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఇండియన్ జట్టు ఎంపిక పోటీలు గురువారం తిరుపతిలోని ఎస్వీయు తారకరామ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాయిసుధ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ అధినేత డాక్టర్ సుధారాణి ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంధులైనా తమ ప్రతిభతో భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. ఆ దిశగా వారు చేస్తున్న కృషి, పడుతున్న కష్టం చూస్తుంటే కళ్లున్నవారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుందోన్నారు. క్రికెటర్లకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని చెప్పారు. ఈపోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 56మంది అంధ క్రికెటర్లు హాజరయ్యారు. వీరిలో 17మందిని ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ ఇచ్చిన తరువాత వరల్డ్‌కప్ కోసం జరిగే పోటీలకు పంపించనున్నట్లు బాలాజీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ, ఇండియన్ టీం మేనేజర్ డేవిడ్ తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ చేయకుంటే మరో ఉద్యమం
* ఆంధ్ర, తెలంగాణల్లో అక్టోబర్ మొదటి వారంలో పోరాటాలు
* కెసిఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరం
* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఖండన
తిరుపతి, జూలై 17: ఎస్సీ వర్గీకరణ కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. గురువారం తిరుపతి పద్మావతి అతిథిగృహం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అక్టోబర్ మొదటివారంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు కెసిఆర్ కూడా మంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణకు వీరిద్దరూ మద్దతు ఇచ్చారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, కెసిఆర్‌లు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కనుక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉందని తెలిపారు. వర్గీకరణవల్లే ఎస్సీలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు కెసిఆర్ అనుసరిస్తున్న విధానం, చేస్తున్న వ్యాఖ్యలు సరిగాలేవని మందకృష్ణ మాదిగ ఖండించారు. 1956ను ప్రాతిపదికగా తీసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామనడం సరికాదన్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఆయన సూచించారు. ఏమాత్రం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం మంచిది కాదన్నారు. చుండూరు ఊచకోత విషయంలో న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై స్పందిస్తూ న్యాయస్థానాల్లో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని దీనితో రుజువైందన్నారు. చుండూరు మారణకాండలో ముందుకు వస్తున్న దళిత సంఘాలతో కలసి తాము కూడా పోరాటాలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

సారా విక్రయాలపై డ్వాక్రా మహిళల మండిపాటు
* సారా విక్రేతల ఇళ్లకు తాళాలు
మదనపల్లె, జూలై 17: సారా విక్రేతలపై డ్వాక్రా సంఘాల మహిళలు మండిపడ్డారు. గురువారం పట్టణంలో సారా విక్రయాలు సాగిస్తున్న ప్రాంతానికి చేరుకుని సారా విక్రయిస్తున్న వారి ఇళ్లకు తాళాలు వేశారు. అయితే మహిళల రాకను ముందే పసిగట్టిన విక్రేతలు గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి సారాను తరలించేశారు. దీంతో మహిళలు విక్రేతలపై విరుచుకుపడ్డారు. మరోసారి ఈప్రాంతంలో సారా విక్రయిస్తే ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో బహిరంగంగా సారా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సారా విక్రయాలు సాగిస్తే సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ సారా అమ్మకాలను అరికట్టాలని కోరారు.

* తిరుపతిలో వెయ్యి ఎకరాల్లో ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐఎస్‌ఇఆర్ ఏర్పాటు * అవసరమైతే అటవీ భూములు కూడా పరిగణనలోకి తీసుకుంటాం * మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడి
english title: 
n

మంగళగిరిలోనే ఎయిమ్స్

0
0

* కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
* రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్
మంగళగిరి, జూలై 17: ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ సంస్థను విజయవాడ - గుంటూరు నగరాల మధ్య మంగళగిరి శివారులో గల పూర్వపు టీబీ శానిటోరియం ఆసుపత్రి స్థలంలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం ఆయన మంగళగిరి విచ్చేసి జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డిఎంహెచ్‌ఓ గోపీనాయక్ తదితర అధికారులతో కలిసి ప్రతిపాదిత శానిటోరియం స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే 200 ఎకరాల విస్తీర్ణంలో గల ఆస్పత్రి స్థలాన్ని మ్యాప్‌ద్వారా మంత్రి కామినేనికి వివరించారు. అనంతరం పట్టణ శివారులోని విజిటియం ఉడా టౌన్‌షిప్ ప్రాంగణాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ విలేఖర్లతో మాట్లాడారు. వారంరోజుల్లో ఎయిమ్స్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. శానిటోరియం స్థలంలో 50 ఎకరాలను ఎన్‌డిఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్‌కు రాష్ట్ర విభజనకు ముందు కేటాయించడం జరిగిందని, ఎయిమ్స్ సంస్థకు ఈ స్థలం అవసరమైతే ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు ప్రత్యామ్నాయ స్థలంగా ఉడాటౌన్‌షిప్‌లో గల 80 ఎకరాల్లో కేటాయించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. చినకాకాని వద్దగల క్యాన్సర్ ఆస్పత్రిని 120 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నారని, ఆయన వైఖరి తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని మంత్రి అన్నారు. విభజనకు పూర్వం సీమాంధ్ర జిల్లాల వారిపట్ల ఒకరకమైన వైఖరి ప్రదర్శించి ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణాలో చదువుతున్న సీమాంధ్ర జిల్లాల విద్యార్థుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, తహశీల్దార్ శివరామకృష్ణ, పట్టణ బిజెపి అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహనరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, వైస్‌చైర్మన్ బాలాజీగుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు
* రాష్ట్ర శాసన స్పీకర్ డా కోడెల శివప్రసాదరావు
నరసరావుపేట, జూలై 17: ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టిన వారికి ఉజ్వ ల భవిష్యత్తు ఉంటుందని నవ్యాంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్థానిక ఎఎంరెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి కళాశాల చైర్మన్ అట్లూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. మనిషి ఉన్నంత కాలం జబ్బు ఉంటుందని, జబ్బు ఉన్నంత కాలం మందు ఉంటుందని, అందుకే ఫార్మసీ రంగంలో ఎప్పుడూ ఎదుగుదల ఉం టుందని అన్నారు. తెలివితేటలు ఉంటే నే చాలదని, కష్టపడేతత్త్వం ఉండాలని అన్నారు. డాక్టర్ కోడెల డ్రగ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ పాయిజన్ సెంటర్ ప్రారంభించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ డా.కెపిఆర్ చౌదరి ఫార్మసీ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అనే అంశంపై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్, డైరెక్టర్ డా.వై మధుసూదనరావు కాస్మటిక్స్ రంగంలో ఉజ్వల భవిష్యత్ పై ప్రసంగించారు. వరంగల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైనె్సస్ మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై మధుసూదన్ తదితరులు మాట్లాడారు. కళాశాలలో జరిగిన జాతీయ సదస్సుకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి ఫార్మసీ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. వీరికి పోస్టర్ ప్రజంటేషన్ నిర్వహించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కళాశాల చైర్మన్ అట్లూరి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి శాంతి గజమాలతో సత్కరించారు. .

సబ్‌ప్లాన్‌లో జిల్లా ప్రజలకు
న్యాయం జరిగేలా చూడాలి
గుంటూరు (రూరల్), జూలై 17: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో జిల్లా ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోరా రు. గురువారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాంతిలాల్‌దండేను కమిటీ సభ్యులు ఆయన ఛాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల భూషణం, మేడిద బాబురావు, ఈరి రాజశేఖర్, బొడ్డు కోటేశ్వరరావు, అశ్వనికుమార్, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కాంతిలాల్‌దండేను గురువారం రాష్ట్రప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి సోమేశ్వరరావు, సహాధ్యక్షులు ఎ రామచంద్రమూర్తి, కోశాధికారి ఎజెవిఎల్ నరసింహారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎం అప్పారావు, జి సుబ్రహ్మణ్యం, కె పిచ్చయ్య, ఎం సాంబశివరావు, టివిఎస్‌ఎస్‌ఆర్‌ఎ శర్మ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కలెక్టర్‌ను కోరారు.

గుంటూరు ఆర్డీవో కార్యాలయ
చరాస్తుల వేలం నేడు
గుంటూరు లీగర్, జూలై 17: ప్రజల నుంచి సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్న గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ చరాస్తులను శుక్రవారం వేలం వేయాలంటూ గుంటూరు ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన యలమంచిలి వెంకట సుబ్బారావుకు చెందిన మూడు ఎకరాల 23 సెంట్ల భూమిని 1981లో బిసి కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం సేకరించింది. అయితే అధికారులు మంజూరు చేసిన మొత్తం మార్కెట్ విలువ కంటే తక్కువగా ఉందంటూ సుబ్బారావు కోర్టును ఆశ్రయించారు. 2004 సంవత్సరంలో సుబ్బారావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎకరానికి 50 వేలు చొప్పున చెల్లించాలని, మరో మూడు లక్షల 50 వేల రూపాయలు నష్టపరిహారంగా 1981 ఆగస్టు 4వ తేదీ నుండి వడ్డీతో కలిపి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు ఆ మొత్తాన్ని పూర్తిగా భూ సేకరణ అధికారి ఆర్డీవో చెల్లించలేకపోయారు. ప్రస్తుతం ఆ మొత్తం 20 లక్షలకు పైగా చేరుకుంది. దీంతో మరోసారి సుబ్బారావు కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఈ మేరకు ఆస్తులను వేలం వేసి సొమ్ము వసూలు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.
శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులు
* హమాలీ ఫెడరేషన్ జాతీయ నేత బాలరాజ్

గుంటూరు (కొత్తపేట), జూలై 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని హమాలీ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ హమాలీల కూలిరేట్లు 8 నుండి 12 రూపాయలకు పెంచేందుకు అంగీకరించిన యాజమాన్యాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కూలిరేట్లు అమలుచేయడంలో ప్రభుత్వాలు, యాజమాన్యాలు తీవ్ర జాప్యం చేస్తుండటంతో కార్మికులు నష్టపోతున్నారన్నారు. ఇఎస్‌ఐ, బోనస్, పిఎఫ్ తదితర కార్మికుల ప్రయోజనాలను సాధిచుకునేందుకు భవిష్యత్తులో ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలిరేట్లను సాధించుకునే దిశగా భవిష్యత్తులో కార్మికులు చేయిచేయి కలిపి, ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హమాలీల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ యాజమాన్యాలతో కూలిరేట్లు పెంపుదల ఒప్పందం జరిగినప్పటికీ దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుండి 25వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మా ట్లాడుతూ పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులు సాధించుకోగలిగామన్నారు. తొలుత రాష్టస్రమ్మేళనంలో భాగంగా ఎఐటియుసి జెండాను రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జివి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోట మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సివిల్ సప్లై నాయకుడు జి సురేష్‌బాబు, పి మురళి, వామనమూర్తి, కామేశ్వరరావు, నూకరాజు, రావుల అంజిబాబు, కోట మరియదాసు, సైదులు, ముత్తయ్యతో పాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన అవసరం
గుంటూరు (రూరల్), జూలై 17: విద్యార్థి దశలోనే జల వనరులపై నీటిపొదుపు సంరక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే భవిష్యత్తు తరాల మనుగడ సాధ్యమవుతుందని ప్రజ్ఞ స్కూల్ కరస్పాండెంట్ నాయుడు చక్రనాగ్ అన్నారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, సదరన్ రీజియన్ వారు నిర్వహించిన సేవ్ వాటర్ ఫీచర్ సెక్యూర్ అంశంపై పాఠశాల స్థాయిలో నిర్వహించిన పెయింటింగ్ పోటీలో ప్రజ్ఞ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు 20 మంది కన్సోలేషన్ బహుమతులు సాధించారని తెలిపారు. విజేతల అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాయుడు కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి:
133 టిక్కీల రేషన్‌బియ్యం స్వాధీనం
వినుకొండ, జూలై 1: మండలంలోని విఠంరాజుపల్లిలోని ప్రశాంతి రైస్ మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక దాడులు చేశారు. ప్రశాంతి రైస్ మిల్లుకు టాటాఎసి వాహనంలో రేషన్ బియ్యం సరఫరా అవుతుందనే సమాచారం మేరకు దాడులు చేశారు. ఈ దాడుల్లో లక్షా 42 వేల 440 రూపాయల విలువగల 133 టిక్కీల బియ్యాన్ని టాటా ఎసి వాహనంలో తెచ్చి దించుతుండగా అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. లారీ డ్రైవర్ యరబిక్కి ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పిచికలపాలెంకు చెందిన చాగంటి యోగేశ్వరరావు గంటావారిపాలెం సమీపంలోని పొలాల్లో దాచి ఉంచిన ఈ బస్తాలను తీసుకు వచ్చి మిల్లులో దించమని చెప్పడంతో తాను బియ్యాన్ని తెచ్చినట్లు డ్రైవర్ అధికారుల వద్ద వెల్లడించారు. దీంతో విజిలెన్స్ సిఐ వంశీధర్, తహశీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ కాంతారావు, విఆర్‌వో షైదాలు మిల్లులోని సరుకును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి మిల్లులోని రికార్డులు పరిశీలించారు. మిల్లు యజమాని రేఖా భాస్కరరావు, డ్రైవర్ ప్రభాకర్, యోగేశ్వరరావుపై క్రిమినల్, 6ఎ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
ఆలయ పాలకమండలి పదవులకు రాజీనామా
పొన్నూరు, జూలై 17: అతిపెద్ద ఏకశిలా వీరాంజనేయస్వామి కొలువైవున్న జగద్విఖ్యాతిగాంచిన పొన్నూరు సహస్రలింగేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావుతో పాటు 10 మంది సభ్యులు పదవులకు స్వచ్ఛందంగా గురువారం రాజీనాయా చేశారు. గత కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన పాలకమండలి గత యేడాది జూన్ 27న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ బోర్డు కొనసాగేందుకు గడువు ఉంది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో గతంలోని ట్రస్టుబోర్డును రద్దుచేసి, కొత్త కమిటీని ఏర్పాటు చేసే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో ప్ర స్తుత ప్రభుత్వం తమ పదవులను రద్దుపర్చకముందే పాలకమండలి చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, పి కోటేశ్వరరావు, వై సుధారాణి, పి శ్యామ్, పి వెంకట శివనాగమల్లేశ్వరరావు, దశరధరామయ్య, వీరభద్రబాలాజీ, ఎ క్స్ అఫిషియో మెంబర్ పి కోదండరామాచార్యులు తమ రాజీనామాలను దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇఒ ఈమని అశోకరెడ్డికి అందజేశారు. పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్తున్న సభ్యులకు దేవాదాయశాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
సిరిపురం గ్రామ సమస్యలపై మహిళల ధర్నా
మేడికొండూరు, జూలై 17: మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం సిరిపురం గ్రామానికి చెందిన 200 మంది మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి దయాసాగర్ విధులకు నామమాత్రంగా వస్తూ గ్రామంలోని తాగునీరు, సైడ్‌కాల్వలు, రహదారు మరమ్మతులు వంటి సమస్యలను పట్టించుకోవడం లేదని, ఈ విషయమై గ్రామ సర్పంచ్ నలబోతు రాధిక ఆధ్వర్యంలో అనేక పర్యాయాలు తెలియజేశామన్నారు. అప్పటికీ పట్టించుకోక పోవడంతో ధర్నాకు దిగామన్నారు. ఎంపిడిఒ శ్యామలాదేవి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలపై గ్రామ కార్యదర్శి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ, పంచాయతీ రాజ్ ఎఇలతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నల్లబోతు సురేష్, మల్లిఖార్జునరావు, రణహుస్సేన్, సుభానితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
చెరువును పరిశీలించిన అధికారులు
మేడికొండూరు, జూలై 17: మేడికొండూరు రక్షిత మంచినీటి పథకానికి చెందిన చెరువును సత్తెనపల్లి డివిజన్ ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ మాధవి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. తాగునీటి చెరువును అభివృద్ధి పర్చి మండలంలోని 13 గ్రామాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఈ ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. మెగా ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రానున్న పది రోజుల్లో మంచినీటి చెరువులో పూడికతీసి అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెగా ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ ఎజిఎం రమేష్, సర్పంచ్ తలతోటి సంధ్యారాణి, మండల పార్టీ అధ్యక్షుడు నార్నె శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ నెలకుదిటి వీరయ్య తదితరులున్నారు.
ఆరోగ్యమంత్రికి వినతుల వెల్లువ
మంగళగిరి, జూలై 17: మంగళగిరి పర్యటనకు గురువారం విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు పలువురు వినతిపత్రాలను అందజేశారు. మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చూడాలని సిపిఐ, ఎఐటియుసి వైద్య ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కె మురళీరాజు, ఎస్‌కె సుభాని తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. పట్టణంలోని 19వ వార్డులో ఉన్న కబేళా నుంచి వెదజల్లుతున్న దుర్వాసన వలన ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని, కబేళాను తొలగించి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని పట్టణ బిజెపి అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహనరావు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళగిరిలోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని, గుంటూరు - విజయవాడ నగరాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఎయిమ్స్ ఏర్పాటు వలన కోస్తాజిల్లాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో బిజెపి నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు, సానా చౌడయ్య, జగ్గారపు శ్రీనివాసరావు, తాటిపాముల సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రయాణికుల సంక్షేమసంఘం ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మంత్రి శ్రీనివాస్‌ను కలిసి ఎయిమ్స్‌ను మంగళగిరిలోనే ఏర్పాటు చేయాలని, శానిటోరియం స్థలం ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైనదిగా ఉంటుందని ఆయన వినతిపత్రం అందజేశారు.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న కెసిఆర్
అచ్చంపేట, జూలై 17: ఉద్యమం పేరుతో అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న కెసిఆర్, ఇప్పుడు స్థానికత పేరుతో పేద విద్యార్థుల జీవితాలను అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్ పాలన కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలో నివశించే వారందరూ తెలంగాణ బిడ్డలేనన్న కెసిఆర్ మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. కెసిఆర్ ఇకనైనా స్థానికత పేరుకాకుండా అర్హులైన ప్రతి విద్యార్థికీ ఫీజు రీయింబర్సుమెంటు అందించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పివి రామారావు, సర్పంచ్ వెంకయ్య, ఎస్‌కె సైదావలి, పి శ్రీనివాసరావు, పూల కోటేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, డి విజయ్‌కుమార్, లక్ష్మీనారాయణగౌడ్, గాలి సాంబశివరావు, ఎస్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
20న కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
* హాజరుకానున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
గుంటూరు (పట్నంబజారు), జూలై 17: కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కార్యకర్తల సమావేశం ఈనెల 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు తెలిపారు. గురువారం స్థానిక డిసిసి కార్యాలయం రాజీవ్‌గాంధీ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి హాజరుకానున్నారన్నారు. కనుక కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. పిసిసి కార్యదర్శి టిజెఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ కోసం రఘువీరారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. మండలానికి ఐదుగురు చొప్పున ముఖ్య కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, డిసిసి మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజావలి, డిసిసి ఉపాధ్యక్షుడు అడవి ఆంజనేయులు యాదవ్, మంత్రి సుగుణ, మొగిలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పొదుపు పథకాన్ని
యథావిధిగా కొనసాగించాలి
అమరావతి, జూలై 17: ఇందిరాక్రాంతి పథం ద్వారా గ్రూపుల్లోని మహిళలందరూ విధిగా పొదుపు విధానాన్ని కొనసాగించాలని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అత్తలూరు శాఖ బ్రాంచి మేనేజర్ ఎం రత్నకుమారి కోరారు. గురువారం స్థానిక ఐకెపి కార్యాలయంలో జూపూడి, అత్తలూరు, మునగోడు గ్రామాల్లో ఉన్న డ్వాక్రా మహిళా లీడర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమావేశానికి ఐకెపి ఎపిఎం ఎస్‌వి కృష్ణప్రియ అధ్యక్షత వహించారు. బ్రాంచి మేనేజర్ రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రుణమాఫీ వచ్చినా రాకపోయినా విధిగా వడ్డీ చెల్లించి ఎకౌంట్‌లను సక్రమంగా కొనసాగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ జి నాగేశ్వరరావు, పిఎన్ ఖాన్, అయోధ్యరాఘవ, సుబ్బారావు, ఎంఎస్ అధ్యక్షురాలు నండూరి జ్యోతిరాణి, కోశాధికారి పెద్దింటి జ్యోతి, గ్రామ సంఘ ప్రతినిధులు, బ్యాంకు లింకేజి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కౌలు రైతులకు
రుణాలిప్పించండి
పెదకూరపాడు, జూలై 17: కౌలురైతులకు రుణాలిప్పించాలని కోరుతూ మండల పరిధిలోని గారపాడు, హుస్సేన్‌నగరం గ్రామాల్లో గురువారం కౌలురైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గారపాడులో గ్రామ సర్పంచ్ గణేశ్‌మాధవరావు పర్యవేక్షణలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ జరిగింది. ఈ సభలో ఎంపిటిసి పభ్యుడు కొండమీది వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి యలమందరావు, వెంకట్రావ్, విఆర్‌ఒ నరసింహారావు, డిటిసిహెచ్‌వి విశే్వశ్వరరావు తదితరులు పాల్గొనగా, 30 మంది కౌలురైతులు అర్గీలను అందజేశారు. హుస్సేన్‌నగరం గ్రామంలో జరిగిన గ్రామసభలో పంచాయితి కార్యదర్శి రమేష్‌బాబు, నెల్లూరి మల్లిఖార్జునరావు, డిటి విశే్వశ్వరరావు, విఆర్‌ఒ నరసింహారావులు పాల్గొనగా 20 మంది కౌలురైతులు అధికారులకు అర్జీలు అందజేశారు.

* కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం * రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్
english title: 
aiims

కరుణించిన వరుణుడు

0
0

* పెరుగుతున్న పంటల సాగు
* సాధారణ వర్షాలు పడతాయని అంచనా
కర్నూలు, జూలై 17 : జిల్లాలో కురిసిన వర్షాలు రైతులను ఒకింత ఆదుకున్నాయి. జూన్‌లో భయపెట్టిన వాతావరణం జూలై మొదటి వారం నుంచి మార్పు రావడంతో గత 10రోజుల్లో కురిసిన వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వర్షం నమోదు కావడంతో మున్ముందు పంటల సాగు మరింత వేగంగా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. మరో వైపు ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థితిలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కరవు నెలకొంటుందన్న భయం అవసరం లేదని వాతావరణ నిఫుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో 77మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కన్నా సుమారు 14శాతం తక్కువ వర్షం కురవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. నైరుతి రుతు పవనాలు సుమారు వారం రోజులు ఆలస్యంగా జిల్లాలో ప్రవేశించాయి. రుతు పవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. జూన్‌లో అరకొర తప్ప సరైన వర్షం పడకపోవడంతో రైతులు పంటల సాగుకు ముందుకు రాలేదు. దాదాపు జూన్ మాసం మొత్తం వేసవి వాతావరణమే నెలకొని అందరినీ ఆందోళనకు గురి చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా లెనినో కారణంగా మందగించాయని ఇక సముద్రాల్లో ఏర్పడే తుపానుల కారణంగానే వర్షాలు కురవాల్సి ఉంటుందని వాతావరణ నిఫుణులు పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రుతు పవనాల్లో కూడా కదలిక వచ్చి వర్షం సమృద్ధిగా కురుస్తుందని నిఫుణులు అంచనా వేసి జూలై మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వారి అంచనాల ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం ప్రారంభించాయి. గత 10రోజుల్లో దాదాపు అన్ని మండలాల్లోనూ మంచి వర్షమే కురిసింది. మొత్తం 54 మండలాలకు 14 మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కాగా చాగలమర్రి, బేతంచెర్ల మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆరు మండలాల్లో ఇప్పటికే సగటు వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. వీటిలో రుద్రవరం, అవుకు మండలాల్లో సగటు వర్షపాతం కన్నా రెట్టింపు వర్షం కురసింది. ఇతర అన్ని మండలాల్లో జూలైలో 15 రోజుల్లో కురవాల్సిన వర్షం కురిసిందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 5.85లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు సుమారు 1,48,437 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1.70 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది రైతులు సాగు చేసిన పంటల్లో అత్యధికంగా పత్తి పంట సాగులో ఉంది. జిల్లాలో సగటు పత్తి పంట సాగు విస్తీర్ణం 1,08,983హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 91,435 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంటకు వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్షణం ఉండటంతో రైతులు ఈ పంటపై మక్కువ చూపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పత్తి పంట తరువాత అత్యధికంగా సాగు చేసిన పంటగా ఉల్లి పంట నమోదైంది. ఉల్లి పంట సగటు విస్తీర్ణం 16,904 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 7,658 హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. ఇక జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగ పంటపై ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఆసక్తి కనపర్చడం లేదు. ఈ పంట సగటు సాగు విస్తీర్ణం 1,34,985 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 9.87శాతం విస్తీర్ణం 13,311 హెక్టార్లలో మాత్రమే పండిస్తున్నారు. ఇతర అన్ని పంటలు కూడా సాధారణ స్థాయిలో సాగవుతున్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రానున్న మరో వారం, పది రోజుల్లో జిల్లాలో మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిఫుణుల అంచనాలు చెప్తున్నాయి. ఏదిఏమైనా జిల్లాలో జూన్ మాసం భయపెట్టినా జూలై మాసంలో వరుణుడు ఆదుకోవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.

ఇసుక దందా!
* తుంగభద్ర నదీగర్భంలోకి రహదారి
* పాత గుడికంబాలిలో డంపింగ్
* యథేచ్ఛగా అక్రమ రవాణా...
* పట్టించుకోని అధికారులు
ఆదోని, జూలై 17: ఆదోని డివిజన్‌లోని పాత గుడికంబాలి కేంద్రంగా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. పాత గుడికంబాలి సమీపంలోని తుంగభద్ర నది గట్టును ఏకంగా పగలగొట్టి నదిలోకి రోడ్డు వేసి కూలీలను పెట్టి ట్రాక్టర్లతో ఇసుకను తరలించి పాత గుడికంబాలి గ్రామం సమీపంలో గుట్టలు, గుట్టలుగా ఇసుకను డంపింగ్ నెల నుంచి చేస్తున్నారు. డంపింగ్ చేసిన ఇసుకను పాత గుడికంబాలి నుంచి ఆదోని, ఆలూరు పట్టణాలకు ఇంటి నిర్మాణాలకు తరలిస్తూ రోజుకు రూ.10 లక్షల చొప్పున అక్రమార్జన సాగిస్తున్నారు. ఈ ఇసుక దందా అంతా ఓ అధికార పార్టీ మండల స్థాయి నాయకున్ని ఆధ్వర్యంలోనే సాగుతుంది. అధికారం మాదికాబట్టి ఏ సమస్య వచ్చిన తాను చూసుకుంటానని అధికారులకు హుకూం జారీ చేయడంతో ఆనేత మాటలను అధికారులు జవదాటని పరిస్థితి ఏర్పడింది. దీంతో తుంగభద్ర నదికి తూట్లు పెడుతూ అక్రమంగా నిర్మాణాలకు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణను సంబంధిత కౌతాళం మండలం తహశీల్దార్ గోపాల్‌రావు దృష్టికి తీసుకుపోగా తుంగభద్ర నది నుంచి ఇసుకను రవాణ చేయడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్రమంగా ఇసుకను రవాణ చేస్తున్న టిప్పర్ గురించి తహశీల్దార్‌కు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే విఆర్‌ఓ ఎల్లప్ప వచ్చేసరికి అక్రమ రవాణ దారులు వచ్చి టిప్పర్‌ను ఆదోనికి తరలించారు. ఈవిధంగా ఇసుక దందా మాఫీయా నేతలకు అడ్డు అదుపు లేకుండా ఉంది. ఇసుక దందా నిర్వహించే నేత హాల్వి, గోతులదొడ్డిగ్రామాలను తన కనుసైగలతో శాసిస్తున్నాడు. ఫ్యాక్షన్ చరిత్రకు తోడు అధికార నేత కావడంతో ఇసుక దందా యదేఛ్చగా కొనసాగుతుంది. ఒక నెలకు ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆధాయం గండి పడుతుంది. తుంగభద్ర నదికి వరసగా వరదలు రావడంతో పాత గుడికంబాలి గ్రామంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి ఇళ్లను నిర్మించారు.దీంతో పాత గుడికంబాలిలోప్రజలు లేకపోవడంతో ఇసుక దందా మాఫీకు అడ్డగా మారింది. పాతగుడికంబాలి పాఠశాల వద్ద, దర్గా వద్ద, గ్రామ ముఖ ద్వారం వద్ద నది నుంచి ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన ఇసుకను అక్కడ డంప్ చేస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 టిప్పర్లు ఇసుకను రవాణ చేస్తున్నట్లు సమాచారం. ఇసుక దందా నిర్వహించే నేత స్వయంగా ఆరు టిప్పర్లను కొన్నట్లు కూడా తెలిసింది. ఆంధ్రభూమి తుంగభద్ర నదిప్రాంతానికి వెళ్ళే సరికి దాదాపు 50 మంది కూలీలు ట్రాక్టర్లకు ఇసుక నింపడం కనిపించింది. రోజుకు 50 ట్రాక్టర్ల చొప్పున పాత గుడికంబాలి వద్ద ఇసుకను నిలువ చేస్తున్నట్లు కూలీలు పేర్కొన్నారు. అధికార పార్టీ నేత కావడంతో అధికారులకు తెలిసిన ఎక్కడ బదిలీ వేటు పడుతుందన్న భయంతో కిమ్మనకుండా ఉన్నారు. రాష్ట్రంలో ఇసుకమాఫీయా, మద్యం మాఫీయా, భూమాఫీయ, గుండారాజ్యం ఉండదని హోం మంత్రి చిన్నరాజప్ప ప్రకటించారు. కాని పాత గుడికంబాలిలో తుంగభద్ర నదికి తూట్లు పొడిచి అక్రమ ఇసుక దందా నిర్వహించేవారు అధికార పార్టీ నేత కావడం గమనార్హం. టిప్పర్లు ఆదోనికి ఇసుక తరలిస్తున్న సమయంలో ఇద్దరు నేత అనుయాలు వచ్చి టిప్పర్‌ను ఆదోనికి పంపించారు. నెల రోజుల నుంచి అక్రమ ఇసుక దందా నడుస్తున్న అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో ప్రభుత్వానికి ఇప్పటికే లక్షల ఆధాయం గండిపడింది. ఇలాగే అధికారులు చర్యలు తీసుకోకపోతే అక్రమ ఇసుక దందాతో ప్రభుత్వ ఆధాయానికి కోట్ల రూపాయలు గండి పడడం ఖాయమని, అదేవిధంగా చుట్టు పక్కల ఉన్న రైతుల వ్యవసాయ బోర్లు ఎండిపోయి రైతులు నష్టపోవడం ఖాయమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘోరం
* దిబ్బనకల్లు క్రాస్ వద్ద కర్నాటక బస్సు, ఆటో ఢీ..
* నలుగురి దుర్మరణం
* ఏడుగురికి గాయాలు
ఆదోని, జూలై 17 : ఆదోని పట్టణానికి సమీపంలోని దిబ్బనకల్లు క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రాస్ దాటిన తర్వాత బస్సు, ఆటో ఢీకొనడంతో రోడ్డు రక్తసిక్తమైంది. ఈ ప్రమాందలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కర్నాటక రాయచూరుకు చెందిన బస్సు, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోనబావి నుంచి ఆదోనికి వస్తున్న ఆటో ఎదురుగా ఆటోకు కుక్క అడ్డురావడంతో డ్రైవర్ రంజాన్ కుక్కను తప్పించబోయి మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును ఢీకొంది. దీంతో ఆటో మొత్తం నుజ్జనుజ్జయింది. అందులో ఉన్న గోనబావికి చెందిన మహాదేవమ్మ (35), వడ్డే పద్మావతి (40), ఆదోనికి చెందిన సరోజమ్మ (36), సి.బెలగల్‌కు చెందిన ఈరన్న(21) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సరోజమ్మ తల మొత్తం కూడా నుజ్జునుజ్జు అయ్యింది. మృతుడు ఈరన్న సి.బెలగల్ నుంచి పెళ్లి చూపుల కోసం గోనబావికి వచ్చి తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదోనికి చెందిన సరోజమ్మ బొరుగులు అమ్మడానికి గోనబావికి వెళ్లి వ్యాపారం చేసుకుని తిరిగి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో కృష్ణ, రంజాన్, నాగవేణి, నరసప్ప, రంగన్న, నందిని, వీరేష్ వారికి గాయాలు కాగా ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తాలూకా సిఐ సుధాకర్, టూటౌన్ సిఐ సురేంద్రబాబు, వన్‌టౌన్ సిఐ రమణ, ఎస్‌ఐలు నాగరాజు, వెంకటసుబ్బయ్య, పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలంకు చేరుకుని మృతదేహాలను ట్రాక్టర్‌ల్లో శవ పరీక్ష నిమిత్తం ఆదోనికి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణం శోక సంద్రమైంది. డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, ఆర్‌ఐ హరికృష్ణ, విఆర్‌ఓలు చాంద్, శివప్ప సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రికి కూడా వచ్చి వివరాలను సేకరించి విచారించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రాలయం మఠానికి
బంగారు నక్షత్రమాల విరాళం
మంత్రాలయం, జూలై 17: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంనకు బంగారు నక్షత్రమాలను దాతలు విరాళంగా ఇచ్చారు. గురువారం తెలంగాణలోని నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన మొరిశెట్టి లక్ష్మణ్ కుమార్, సంధ్యారాణి దంపతులు సుమారు రూ. 6 లక్షలు విలువ చేసి 184 గ్రాముల బరువు వున్న బంగారు నక్షత్రమాలను మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులకు దాతలు అందజేశారు. ఈమాలకు మఠం పీఠాధిపతులు సంప్రోక్షణ పూజలను నిర్వహించి మూలరాముల వారి ప్రత్యేక పూజలో అలంకరించారు. అదేవిధంగా మఠంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తి రూ. 30 వేలు విలువ చేసే 10 గ్రాముల బంగారు హారం విరాళంగా ఇచ్చారు. దాతలకు మఠం పీఠాధిపతులు స్వామి వారి శేవ్రస్త్రం, ఫలమంత్రాక్షింతలు, తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈకారక్రమంలో మఠం పిఆర్వో రాఘవేంద్రరావు, విజరుూంద్రచార్ వున్నారు.
హాస్టల్ విద్యార్థులకు
భోజన వసతి కల్పించాలి
* కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో విద్యార్థుల ధర్నా
కర్నూలు టౌన్, జూలై 17 : నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని మేనేజమెంట్ హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, టిఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, చంద్రప్ప డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం విద్యార్థి పరిషత్, టిఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఖాళీ ప్లేట్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత రెండు రెండు రోజులుగా ఎస్సీ హాస్టల్ కళాశాల విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్నారు. ఈనెల 15న హాస్టల్‌కు విద్యార్థులు రావాలని వార్డెన్ తెలపుడంతో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు 50 మంది వచ్చారన్నారు. అయితే వారికి రెండు రోజులైనా భోజన సౌకర్యం కల్పించకపోవడంతో పస్తులుండి కళాశాలకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 2 నుంచి కళాశాలలు ప్రారంభమైనా హాస్టళ్లలో భోజన సౌకర్యం కల్పించకపోవడం చూస్తుంటే పేద విద్యార్థుల పట్ల అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. అలాగే కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ హాస్టల్ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించుకునా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి హాస్టల్ విద్యార్థులకు వెంటనే భోజన వసతి కల్పించాలని లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రుడు, టిఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, శంకర్ నాయక్, సురేంద్ర, వెంకి, శ్రీనివాసులు, రమణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుదారులకు
30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి
* రాష్ట్ర స.హ చట్టం కమిషనర్ తాంతియాకుమారి
కర్నూలు, జూలై 17 : దరఖాస్తు చేస్తున్న వినియోగదారులకు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో సమాచార హక్కు చట్టంపై వచ్చిన 46 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ అధికారికి సంబంధించి 26 కేసులను పరిష్కరించి వారు అడిగిన సమాచారాన్ని త్వరితగతిన ఇవ్వాలన్నారు. కొన్ని వాటిపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మండలాలకు సంబంధించి సమాచారం ఉన్నట్లైతే సంబంధిత మండల తహశీల్దార్లకు ఎండార్స్ చేయాలని సూచించారు. భాగా చదువుకున్నవారే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందుతున్నారన్నారు. సామాన్యులు కూడా అవసరమైన సమాచారాన్ని కోరి తీసుకోవాలన్నారు.
యార్డు అభివృద్ధికి కృషి
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, జూలై 17 : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. గురువారం యార్డులో రూ.29.70లక్షలతో క్యాటిల్‌షడ్, అంతర్గత పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు యార్డులో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించుకునేలా అవకాశం ఉందన్నారు. రైతుబంధు పథకం కింద రుణాలు కూడా పొందవచ్చన్నారు. రైతులకు యార్డులో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, ఎంపిడిఓ విజయభాస్కరనాయుడు, తహశీల్దార్ రామాంజులునాయక్, యార్డు కార్యదర్శి జయలక్ష్మి, మాజీ సర్పం చ్ చింతా నాగయ్య, కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, దేశెట్టి శ్రీనివాసులు, రామలక్ష్మమ్మ, చంద్రశేఖర్, నాయకులు శెట్టి వీరన్న, వెంకటేశ్వర్లు, యార్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
నిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
ఓర్వకల్లు, జూలై 17 : నిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓర్వకల్లు సమీపంలోని పూడిచర్ల మెట్ట వద్ద 1338, 386 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం భూములు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటంతో నిట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆయా సర్వేనెంబర్ల భూముల పూర్తి వివరాలను రెండు రోజుల్లో నివేదికలు తయారు చేసి తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి కన్నబాబు, ఆర్డీఓ రఘుబాబు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేర్లు మల్లికార్జున, సుబ్బారెడ్డి, విఆర్వో వౌళిబాషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధికి కృషి : గంగుల
ఆళ్లగడ్డ, జూలై 17: ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు మండలానికి బిటి, మెటల్ రోడ్లు తదితర వాటికి రూ. 25 కోట్ల చొప్పున అన్ని మండలాలకు పంచాయతీ రాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపించామని టిడిపి నాయకులు గంగుల ప్రభాకరరెడ్డి అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుగంగ మెయిన్ లైనింగ్ పనులకు రూ. 80 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అలాగే కెసి కెనాల్ కాల్వ వెంట అసంపూర్తిగా వున్న లైనింగ్ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చెరువుల్లో పూడికతీత పనులకు, మరమ్మతులకు ఇరిగేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమావేశంలో నాయకులు గంధం రాఘవరెడ్డి, సింగం భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూగర్భజలాలు పెంచుకోండి
* కలెక్టర్ విజయమోహన్
దేవనకొండ, జూలై 17: రైతులు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని తద్వారా భూగర్భ జలాలు పెంచుకోవాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ తెలిపారు. గురువారం స్థానిక సిఎల్‌ఆర్సీ భవనంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఐడబ్ల్యూఎంపి, ఎన్‌ఆర్ ఇజిఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని వాటిలో చేపల పెంపకాన్ని కూడా చేపట్టవచ్చన్నారు. పొలాల గట్లపై గడ్డి, మొక్కలను విరివిగా పెంచాలన్నారు. నల్లచెలిమిల వాటర్‌షెడ్ ప్రాజెక్టు కింద 136 ఎకరాల్లో మామిడి మొక్కలు పెంచుతున్నట్లు సిఓ మధుసుదన్ తెలిపారు. అలాగే 150 ఎకరాల్లో పొలాల గట్లపై మొక్కల పెంపకం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పిడి హరినాథ్‌రెడ్డి, ఎపిడి ఈరన్న, సిఓ నితిన్ చక్రవర్తి, ఎపిఎ లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్షన్‌ను వదలండి...
* హైకోర్టు జడ్జి చంద్రకుమార్
పత్తికొండ,జూలై 17: ఫ్యాక్షన్ వదిలి పెట్టి ప్రజలు అభివృద్ధికి కృషి చేయాలని హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు. గురువారం పత్తికొండ న్యాయవాదుల సంఘం నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం జిల్లా జడ్జి బసవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఠాకక్షలతో కుటుంబ పెద్దలు మృతి చెందితే కుటుంబ సభ్యులు దిక్కులేని వారు అవుతారని వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. ఈప్రాంతంలో ఫ్యాక్షన్ అధికంగా ఉందని తెలిసిందని, అయితే ఫ్యాక్షన్ వల్ల అభివృద్ధి జరగదన్నారు. అభివృద్ధి సాధించుటకుప్రజలకు ఫ్యాక్షన్‌ను వదిలి పెట్టాలని కోరారు. ఉన్నత చదువులు పిల్లలను చదివించడం ద్వారా ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలన్నారు. సమాజంలో ప్రతి మనిషికి నైతిక విలువలు ఉండాలని, మాట మీద నమ్మకాన్ని సాధించుకోవాలని దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశ చరిత్ర మాటతో రాజులు రాజ్యాలు ఏలారని, అలాగే ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాలు వదులుకున్నారని గుర్తు చేశారు. దీనికి ముందు న్యాయవాదుల సంఘం సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్‌కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మైరాముడు ఆధ్వర్యంలో జడ్జిని సన్మానించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థినీ,విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పత్తికొండ జడ్జి వెంకటేశ్వర్లు, న్యాయవాదులు సత్యనారాయణ, రంగస్వామి, సూరజ్, సారప్ప, నాగభూషణ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

* పెరుగుతున్న పంటల సాగు * సాధారణ వర్షాలు పడతాయని అంచనా
english title: 
v

రేపే ప్రభుత్వ ఎసి సుబ్బారెడ్డి వైద్య కళాశాల ప్రారంభం

0
0

మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరు, జూలై 17: ప్రభుత్వ ఎసి సుబ్బారెడ్డి వైద్య కళాశాలను ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గురువారం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాల పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుండే ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. తొలి విడతగా ఎంసిఐ 150 సీట్లకు అనుమతి మంజూరు చేసిందన్నారు. అనాటమీ, ఫిజియాలజీ, సెంట్రల్ లైబ్రరీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఉండటం వల్ల ఈ ఏడాది నుంచే అనుమతి ఇచ్చిందన్నారు. చిన్న చిన్న లోపలు ఉన్నాయని, వాటిని గుర్తించి అధికారులకు తగిన సూచనలు కూడా ఇచ్చామన్నారు. 5 ఏళ్లలోపు పూర్తిస్థాయిలో వైద్య కళాశాల ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోనే గర్వించదగ్గ వైద్య కళాశాలగా తీర్చిదిద్దతామని ఆయన చెప్పారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌ను సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దాతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్, ఎస్‌పి నవదీప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే తలమానికంగా
వైద్య కళాశాలను తీర్చిదిద్దుతాం
ఎమ్మెల్యే కోటంరెడ్డి, మేయర్ అజీజ్ స్పష్టం
నెల్లూరు సిటీ, జూలై 17: నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వారు పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల రావడం ఎంతో అదృష్టం అన్నారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు అనుమతులివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈనెల 19న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన వైద్య కళాశాల భవనాలను సందర్శించి అక్కడ వివిధ విభాగాల గదులు, జరుగుతున్న పనులను పర్యవేక్షించి పలు సూచనలిచ్చారు. వైద్య కళాశాలలో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఆప్తమాలజీ తదితర విభాగాలకు చెందిన గదులు, అందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 150 మందికి ప్రవేశాలు కల్పించేందుకు ఎంసిఐ అనుమతిచ్చిందని తెలిపారు. కార్పొరేషన్ పరంగా వైద్య కళాశాలకు ఎటువంటి సేవలు కావాల్సి వచ్చినా వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అభివృద్ధి కోసం అందరితో కలిసి నడుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు బొబ్బలి శ్రీనివాస యాదవ్, వహీద, నగరపాలక సంస్థ కమిషనర్ జాన్ శ్యాంసన్, ఎంఇ సంపత్‌కుమార్, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

4 లక్షలు విలువైన రూపాయి బియ్యం పట్టివేత
కావలి, జూలై 17: కావలి పట్టణ ఉత్తర శివారులలోని వెంకట పద్మావతి రైస్ మిల్‌లో ఓ లారీలో నుంచి ప్రజాపంపిణీ పథకానికి సంబంధించిన కిలో రూపాయి పథకం బియ్యాన్ని దించేందుకు సిద్ధమవుతుండగా విజిలెన్స్ డిఎస్పీ రమేష్‌బాబు ఆధ్వర్యంలోని బృందం పట్టుకుంది. లారీలో 400 బస్తాలు (20టన్నులు) జిల్లా కేంద్రం నెల్లూరులోని కొత్తూరు ప్రాంతంలో గల పౌరసరఫరాల శాఖ గోడౌన్ నుంచి తరలిరాగా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు దానిని వెంబడించారు. సరాసరి పట్టణానికి చేరుకోగా నేరుగా పద్మావతి రైస్‌మిల్‌కు వెళ్లింది. అక్కడ సరుకును దించేందుకు సర్వం సిద్ధంచేయగా ఆకస్మికంగా విజిలెన్స్ డిఎస్పీ రమేష్‌బాబుతో పాటు అధికారులు, సిబ్బంది ప్రత్యక్షం కావడంతో మిల్ యజమానితో పాటు లారీడ్రైవర్ అక్కడ ఉన్న కూలీలు అవాక్కయ్యారు. కాగా, డ్రైవర్ జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన సన్నిబోయిన రాంబాబు అక్రమ రవాణా గుట్టును అధికారులకు వెల్లడించారు. 6 ఏ కేసు నమోదు చేసి లారీని పోలీస్‌స్టేషన్‌కు, సరుకును స్థానిక ఏఎంసి గోడౌన్ సముదాయంలో గల పౌరసరఫరాల గోడౌన్‌కు తరలించినట్లు స్థానిక సిఎస్‌డిటి మునీర్ తెలిపారు. గత ఏడాది కాలంలో అక్రమ రవాణా అవుతున్న పిడిఎస్ బియ్యం భారీ మొత్తంలో పట్టుబడటం ఇదే తొలిసారి కాగా, పట్టణ ప్రజలు మిల్లర్లు అవాక్కయ్యారు.
అక్రమరవాణాకు అడ్డాగా కావలి
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో గతంలోనే కావలి అడ్డాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. రెండేళ్ల క్రితం లెక్కకు మిక్కిలిగా స్థానిక మిల్లులకు వివిధ ప్రాంతాల నుంచి రవాణా అవుతుండేవి. ఈ దశలో ఇబ్బడి ముబ్బడిగా వాహనాల్లో బియ్యం వస్తుండగా నిఘా ఉంచిన పోలీసులు భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. 2012 సంవత్సరంలో ఒక కానిస్టేబుల్ భారీస్థాయిలో రవాణాను అడ్డుకోగా అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు నగదు రివార్డులు సైతం అందచేశారు. అప్పటి నుంచి అక్రమ రవాణా సద్దుమణగగా తిరిగి ఇటీవల ప్రారంభమైనట్లు సమాచారం. కాగా స్థానిక పోలీసులు, పౌరసరఫరాల అధికారులు నిఘా ఉంచి అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించి ప్రజాపంపిణీ బియ్యం పేదలకు చేర్చాల్సిన బాధ్యత ఎంతైనా వుంది.

విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఉద్వాసనే
* ఆర్‌జెడి కామేశ్వరి
వెంకటగిరి, జూలై 17: అంగన్‌వాడీ కార్యకర్తలు వారి వారి విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఉద్వాసన తప్పదని ఐసిడిఎస్ ఆర్‌జెడి కామేశ్వరి హెచ్చరించారు. గురువారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టుకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెంకటగిరి పట్టణ పరిధిలోని బంగారుపేట, బాలాయపల్లి మండలంలోని వాక్యాం, కడగుంట, హస్తకావేరి, నిండలి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు. హస్తకావేరి కేంద్రంలో తనిఖీ సమయంలో అక్కడ రిజిష్టర్లు లేవని, వేరే దగ్గర ఉన్నాయని అక్కడి టీచర్ ఆర్‌జెడికి సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రిజిష్టర్ ప్రకారం పాఠశాలలో చిన్నారులు, గర్భిణులు లేరని ప్రశ్నించగా, మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారని సమాధానం చెప్పడంతో మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు చెప్పారు. హస్తకావేరి పాఠశాలపై ప్రత్యేక నిఘా ఉంచి వారానికి రెండు సార్లు తమకు నివేదిక పంపాలని స్థానిక ఐసిడిఎస్ అధికారిణి అనురాధను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాఠశాల జరిగే సమయంలో రిజిష్టర్లు అందుబాటులో ఉంచాలని, అలా లేని వారికి మెమోలు ఇచ్చి ఉద్వాసన పలుకుతామని తెలిపారు. 100 రోజులు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించి మూడన్నర కేజిలు బరువు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గర్భిణులకు కూడా మంచి ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.

గూడూరు టిడిపిలో ఆధిపత్య పోరు
* నువ్వా నేనా అని పోటీ పడుతున్న బల్లి, జ్యోత్న్సలత
గూడూరు, జూలై 17: గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బల్లి దుర్గాప్రసాదరావుకు ఈసారి టిక్కెట్ దక్కకపోవడం, నియోజకవర్గానికి, రాజకీయాలకు కొత్త అయిన జ్యోత్న్సలతకు టిక్కెట్ దక్కడం, సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం తెలిసిందే. ఓటమి పాలైన డాక్టర్ బత్తల రాధా జ్యోత్న్సలత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాను టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జినని ప్రకటించుకొని తన అనుచరులతో అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరడం పట్ల ఇక్కడ సీనియర్ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. బల్లిని అలకవీడి బుజ్జగించే సమయంలో గూడూరు టికెట్ సాధించుకొన్న జ్యోత్న్సలత తాను ఎమ్మెల్యేగా గెలిచినా బల్లి దుర్గాప్రసాదరావు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారని, ఆయన అడుగుజాడల్లో తాను నడుచుకొంటానని ఎన్నికల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు కలిసి నియోజకవర్గంలో విస్తత్రంగా పర్యటించినా ఫలితం లేకపోయింది. అనంతరం జరిగిన పరిణామాల్లో టిడిపి ఓటమి పాలవడం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో గూడూరులో టిడిపి తరపున పోటీ చేసి ఓటమి పాలైన జ్యోత్న్సలత నియోజకవర్గ ఇన్‌చార్జి అని ప్రకటించుకొన్నారు. ఎన్నికల వరకు ఆమెతో సఖ్యతోగా ఉన్న బల్లి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటి వరకు సఖ్యతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు తనదైన శైలిలో తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలోనెలకొని ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున తనకు జిల్లాలో నామినేటెడ్ పోస్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జ్యోత్న్సలత కూడా నియోజకవర్గానికి కొత్త అయినా నియోజకవర్గంలో పట్టుసాధించుకోవాలన్న ఆలోచనతో ఆమె కూడా తనదైన శైలిలో పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదిఏమైనా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల విషయంలో పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక్కడి కార్యకర్తలు, నాయకుల్లో అయోమయం నెలకొని ఉంది. దీనిపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

సిఎం చంద్రబాబు పర్యటన సాగేదిలా..
నెల్లూరు, కలెక్టరేట్, జూలై 17: నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి 2:24 నిమిషాలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుండి 2:55 నిమిషాలకు హెలికాప్టర్‌లో నెల్లూరుకు బయలుదేరతారు. 3:15 గంటలకు పోలీసు కవాతు మైదానం చేరుకుంటారు. అక్కడ నుండి ఆయన నేరుగా డిఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణానికి చేరుకుని దివంగత ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

హెలిపాడ్ పరిశీలన
నెల్లూరు కలెక్టరేట్, జూలై 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను జిల్లా కలెక్టర్ శ్రీకాంత్, జిల్లా పోలీసు అధికారి నవదీప్ సింగ్ గురువారం పరిశీలించారు. అనంతరం వారు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ వేదిక ప్రాంగణం చేరుకుని ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు జిల్లా ముఖ్య అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వారు ఆదేశించారు.

మంత్రి నారాయణ వెల్లడి
english title: 
n

మలుపులు తిరుగుతున్న జిల్లా పరిషత్ రాజకీయం

0
0

ఒంగోలు, జూలై 17: జిల్లా పరిషత్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. విప్‌ను ధిక్కరించినందుకు తెలుగుదేశం జిల్లాపార్టీ నాయకత్వం ప్రస్తుత జిల్లాపరిషత్ చైర్మన్, పొన్నలూరు జడ్‌పిటిసి ఈదర హరిబాబుపై చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అదేవిధంగా కొత్తపట్నం జడ్‌పిటిసి దాసరి విజయ, కారంచేడు జడ్‌పిటిసి దగ్గుబాటి నాగజ్యోతి, కంభం జడ్‌పిటిసి సయ్యద్ జాకీర్ హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలని వైకాపా జిల్లాపార్టీ నాయకత్వం కలెక్టర్‌కు విజ్ఞప్తిచేసింది. ఈనేపథ్యంలో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీఅయ్యాయి. ఈ షోకాజ్ నోటీసులపై నలుగురు జడ్‌పిటిసి సరైన సమాధానం చెప్పాల్సిఉంది. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా తనకు ఎలాంటి విప్‌ను తెలుగుదేశం పార్టీ నాయకత్వం జారీచేయలేదని ఇటీవల జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఇటీవల విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. కాగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన ఈదర వైకాపాపార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజికి మద్దతు ఇచ్చారు. దీంతో బాలాజి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా వైకాపా మద్దతతో తెలుగుదేశంపార్టీకి చెందిన ఈదర హరిబాబు చైర్మన్‌గా గెలుపొందారు. కాగా వైకాపాకు చెందిన ముగ్గురు జడ్‌పిటిసిలు తెలుగుదేశంపార్టీకి మద్దతు తెలిపారు. దీంతో వైకాపా జిల్లా నాయకత్వం వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది.
కాగా తనకు విప్‌జారీచేయలేదని ఈదర ఒకపక్క చెబుతుండగా మరొకపక్క వీరు ముగ్గురు జడ్‌పిటిసిలపై జిల్లాకలెక్టర్ చర్యలు తీసుకుంటే వారిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. దీంతో మళ్లీ ఆ మూడు జడ్‌పిటిసిలకు ఎన్నికలు జరిగేఅవకాశాలు లేకపోలేదని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.
కాగా జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పదవీబాధ్యతలు స్వీకరించటం కూడా జరిగింది. ఇదిఇలాఉండగా ప్రకాశం జిల్లాపరిషత్ రాజకీయాలపై జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు తెలుగుదేశంపార్టీ జిల్లానాయకులుకాని, శాసనసభ్యులుకాని జిల్లాపరిషత్ సమావేశంలో జరిగిన సన్నివేశాలను జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంమీద షోకాజ్ నోటీసులకు వారు నలుగురు ఇచ్చే సమాధానం కోసం జిల్లాయంత్రాంగం వేచిచూస్తోంది. మొత్తం మీద జిల్లా పరిషత్ రాజకీయం తొలినుండి ఉత్కంఠతగానే సాగుతుంది.

ఒంగోలులో నిరంతర తాగునీటి సరఫరాకు
రూ.438 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
ఒంగోలు, జూలై 17 : ఒంగోలు నగర ప్రజలకు నిరంతరం తాగునీరు సరఫరా చేయడానికి 438 కోట్ల రూపాయల అంచనాలతో ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపివో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎన్‌ఎస్‌పి కాలువ కింద ఉన్న 158 తాగునీటి చెరువులకు సాగర్ నీటితో నింపడానికి నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ నెలాఖరు నాటికి ఎన్‌యస్‌పి కాలువకు నీరు విడుదల చేయడానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. నగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతిరోజూ తాగునీరు అందించడానికి మూడవ సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా పేర్నమిట్ట చెరువును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 352 లక్షలతో 197 తాగునీటి పథకాల పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే 119 ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూయస్ ద్వారా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. చీరాల మున్సిపాలిటీకి తాగునీరు అందించడానికి చిన్నగంజాంలోని ఆగడం ట్యాంకును ఎంపిక చేస్తామన్నారు. పథకం పూర్తి చేసి చీరాల మున్సిపాలిటీకి తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నాబార్డు సంస్థ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి అవసరమైన వ్యవసాయ, వ్యాపార రుణాలు అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,450 మంది చేనేత కార్మికులకు క్రికెట్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. నిర్మల్ భారత్ నిర్మాణ క్రింద జిల్లాలో 9 వేల మరుగుదొడ్లు నిర్మాణాలకు 4.14 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ సమావేశంలో నాబార్డు ఎజియం జ్యోతి శ్రీనివాస్, సిండికేట్ బ్యాంకు ఎల్‌డియం కె నరసింహారావు, ఆర్‌డబ్ల్యూయస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మర్టార్ ఆలీ, ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో
రెవెన్యూ శాఖ ముందుండాలి
* రాష్ట్ర డెప్యూటీ సిఎం కె ఇ కృష్ణమూర్తి సూచన
ఒంగోలు, జూలై 17 : ప్రజలకు మెరుగైన సేవలందించుటలో రెవెన్యూ శాఖ వారు ముందుండాలని, అందుకోసం కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కృషి చేసే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కె ఈ కృష్ణమూర్తి అన్నారు. హైదరాబాద్ నుండి జిల్లా సంయుక్త కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఆ శాఖ సిసిఎల్ ఎ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్‌తో పాటు ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం ప్రకారం వివిధ రకాల భూములను కాపాడాలని, శ్మశాన భూములను మార్కింగ్ చేసి నోటీసు బోర్డులు పెట్టాలని, 7వ విడత భూ పంపిణీలో ఇప్పటి భూములు చూపించాలని, భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయని వారికి పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూసేకరణ కార్యక్రమంలో భూ యజమాన్యానికి ఇప్పటికీ ఎలాంటి చెల్లింపులు చేయని పక్షంలో నిధుల కోసం ప్రతిపాదనల వివరాలు అందజేయాలన్నారు. రెవిన్యూ రికార్డులను కంప్యూటరీకరణ పూర్తి స్థాయిలో చేయాలని, కంప్యూటరీకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలన్నారు. కంప్యూటరీకరణతో ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, టాంపరింగ్ వంటి మోసాలకు తావు లేకుండా ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయి నుండి పై స్థాయి అధికారుల ప్రభుత్వం అమల చేసే ప్రక్రియలో వేగవంతం చేయాలన్నారు. వి ఆర్‌వో , తహశీల్థార్ భవనాల మరమ్మత్తులకు నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి అధికారులను కోరారు. భూముల సర్వే చేపట్టి వివరాలను కంప్యూటరీకరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమీషనర్ చందనాఖాన్ జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. భూముల సబ్ - డివిజన్ వివరాలను రిజిస్ట్రేషన్‌కు ముందుగా కంప్యూటరీకరణ చేపట్టాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో ఖాతాదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే తహశీల్థార్ల కార్యాలయాల్లో శాఖ మార్పులు చేయాలన్నారు. తద్వారా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు వెంటనే మంజూరు చేసేందుకు వీలవుతుందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి వచ్చిన డేటాను తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటరీకరణపై మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తామని ఆమె తెలిపారు. వ్యవసాయ రుణాలు మంజూరు చేసే సమయంలో తహశీల్దార్ కార్యాలయాల్లో భూముల వివరాలను బ్యాంకర్లు తెలుసుకోవడానికి యూజర్ ఐడిని బ్యాంకు అధికారులకు ఇస్తామన్నారు. తద్వారా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువుల , విత్తనాలు నేరుగా అందించడానికి వీలవుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ కె వై నాయక్, జిల్లా రెవిన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు, కందుకూరు , మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారలు మురళి, బాపిరెడ్డి, కొండయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి శ్యాంబాబ, గజిటెడ్ పర్యవేక్షకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టిడిపి కుట్రలను దెబ్బతీయడానికే ఈదర హరిబాబుకు మద్దతు
* జడ్‌పి వైస్‌చైర్మన్ నూకసాని

ఒంగోలు, జూలై 17 : ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎన్నిక విషయంలో వైకాపాను దెబ్బతీయాలని టిడిపి కుట్ర పన్నినందునే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈదర హరిబాబుకు మద్దతు ఇవ్వడం జరిగిందని వైకాపా జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. గురువారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కంటే వైకాపాకు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జడ్‌పిటిసి స్థానాలు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ కుట్ర పన్ని తమ పార్టీ తరుఫున గెలుపొందిన ముగ్గురు జడ్‌పిటిసీలను ప్రలోభ పెట్టి దేశం పార్టీలో చేర్చుకున్నట్లు తెలిపారు. అదే విధంగా మార్కాపురం జడ్‌పిటిసీ రంగారెడ్డిని మార్కాపురం డియస్‌పి రామాంజనేయులును ప్రలోభ పెట్టి సంతమాగులూరు వద్ద పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించడం జరిగిందని తెలిపారు. ఈక్రమంలో తమ పార్టీకి 27 మంది జడ్‌పిటిసీలు మిగలగా తెలుగుదేశం పార్టీకి 28 మంది జడ్‌పిటిసీలు ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జడ్‌పి అభ్యర్థి పదవిని ఆశించిన ఈదర హరిబాబు తమ సహాయాన్ని కోరారని, దీంతో తాము ఈదర హరిబాబుకు మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతే తప్ప ఈదర హరిబాబు మాయలో తాము పడ్డామన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జడ్‌పి అభ్యర్థి ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ వారు అప్రజాస్వామికంగా వ్యవహరించి పదవి కోసం తాపత్రయ పడ్డారని , అయితే వారు తీసుకున్న గుంటలో వారే పడ్డారని ఆయన విమర్శించారు. అధికార పార్టీ వారి జిమ్మిక్కులను దెబ్బతీసి అధికార పార్టీ వారికి ఖంగు తినిపించామని ఆయన పేర్కొన్నారు. తనను వైకాపా జడ్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిందని అయితే బిసి అభ్యర్థినని కూడా చూడకుండా దేశం పార్టీ నాయకులు కుట్రలు పన్ని మనే్న రవీంద్రకు జడ్‌పి చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టాలని చూశారని, అయితే వారి పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ఈదర హరిబాబు బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా మద్దతో గెలుపొంది కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న సామెతగా బుద్ధి చెప్పారని ఆయన విమర్శించారు. తనకు పదవులకు ఏలాంటి ఆశలు లేవని, తాను పదవి ఉన్నా లేకున్నా చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మేరకు తన వంతు అభివృద్ధి కార్యక్రమాలను చేయనన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మార్కాపురం జడ్‌పిటిసీ అభ్యర్థిని సంతమాగులూరు వద్ద అరెస్టు చేసిన మార్కాపురం డియస్‌పి పై గుంటూరు రేంజి ఐజి విచారణ జరిపి ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులు కూడా దేశం పార్టీ వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైకాపా దళిత విభాగం జిల్లా అధ్యక్షులు కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
మృతవీరుల ఆత్మ గౌరవాన్ని కాపాడండి
* దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ చప్పిడి పిలుపు
ఒంగోలు, జూలై 17 : కారంచేడు మృతవీరుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ చప్పిడి వెంగళరావు అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ గ్రంథాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కారంచేడు మృతవీరుల 29వ వర్థంతి సభకు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ దళిత ఉద్యమ నాయకులు, కార్యకర్తలు మృతవీరుల త్యాగాలను స్మరిస్తూ దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ 1985 జూలై 17వతేదిన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామ అగ్రకులస్థులు మాదిగలపై బరిసెలు, బాకులు, కర్రలతో అమానుషంగా క్రూరంగా చిన్నా పెద్దా తేడా లేకుండా వెంటాడి వేటాడి దాడి చేయగా యెహోషువా, మోషే, వందనం, రమేష్, మత్తయ్య, అబ్రహాం, అలీసమ్మ ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ దాడిలో చాలా మంది క్షతగాత్రులయ్యారన్నారు. నాటి సంఘటన దళిత జాతి హృదయాలను కదిలించిందన్నారు. దళిత ఉద్యమానికి ఆవిర్భావానికి నాంది పలికిన కారంచేడు మృతవీరుల వర్థంతి సభ దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక జరపడం హర్షించదగిందన్నారు. జిల్లాలోని దళిత ఉద్యమ నాయకులు, కార్యకర్తలు కారంచేడు మృతవీరుల ఆశయాల సాధన కోసం ఆత్మ గౌరవంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముందు కారంచేడు మృతవీరులు స్థూప చిత్ర పటానికి దళిత సంఘ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండేల కృష్ణ ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరుల శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షులు పట్రా బంగారం, దళిత హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు ముప్పవరపు గోపి, పిడిసిసి మాజీ డైరెక్టర్ బత్తుల గోపాలకృష్ణ, పిసిసి ప్రధాన కార్యదర్శి ఎద్దు శశికాంత్‌భూషణ్, కాంగ్రెస్ నాయకులు పర్రె నవీన్‌రాయ్, గ్రంథాలయ సంస్థ వ్యవసాయపకులు భూపతి రాజారావు, మాల యువ సేన జిల్లా అధ్యక్షులు ఎం రాజు, ఎస్సీ , ఎస్టీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు గొల్లపూడి బాబూరావు, దళితమహాసభ జిల్లా అధ్యక్షులు ఎరిచర్ల సుబ్బారావు, దళిత మహాసభ ఉపాధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
హిందూ దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
* కమలానంద భారతి డిమాండ్

అద్దంకి, జూలై 17: హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారతి అన్నారు. మణికేశ్వరంలోని శివాలయంలో త్రిశూలేశ్వరస్వామి పంచలోహ విగ్రహం చోరీకి గురికావడం, నందీశ్వర విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మణికేశ్వరంలోని దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కమలానందభారతి మాట్లాడుతూ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. గుప్తనిధుల కోసం చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల వలన ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని, దేవాలయాల పరిరక్షణకు ఆయా దేవాలయాల వద్ద రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు, శిధిలావస్థకు చేరిన దేవాలయాలకు మరమ్మతులు చేయించి వాటిని పరిరక్షించాలన్నారు. హిందూ ధర్మప్రచారం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన నెలకొల్పవచ్చునని, ఆధునికత పెరిగేకొలది ప్రజల్లో భక్త్భివం తగ్గుతున్నదన్నారు. పవిత్ర తిరుమల లాంటి దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించడంతో పాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కమలానంద భారతి వెంట గోపు శ్రీనివాసరావు, జి.రఘురామగుప్తా, కనుమర్లపూడి శ్రీనివాసరావు తదితరులున్నారు.
‘జామాయిల్ , సుబాబుల్ కర్రలు అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు’
సంతనూతలపాడు, జూలై 17 : మద్దిపాడు మార్కెట్ కమిటీ పరిధిలోని జామాయిల్, సుబాబుల్ కర్రలను మార్కెట్ కమిటీ అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తప్పవని ఎయంసి కార్యదర్శి ఎస్ సీతారామయ్య అన్నారు. గురువారం మండలంలోని నాంచారెడ్డిపాలెం నుండి త్రోవగుంట సుందరరాజాకాటా వద్దకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న జామాయిల్ లారీని సంతనూతలపాడులోని మార్కెట్ కమిటీ చెక్ పాయింట్ సిబ్బంది లారీని తన విధి నిర్వహణలో భాగంగా సంబంధిత కాగితాలను కావాలని డ్రైవర్‌ను అడగటంతో ఆయన నుండి సరైన సమాధానం రాకపోవడంతో సిబ్బంది మార్కెట్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ సయ్యద్ మహ్మద్ రఫీ, ఎయంసి కార్యదర్శి సీతారామాయ్యకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి సీతారామయ్య వచ్చి ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్న జామాయిల్ కర్రకు సంబంధించి ఆయా రైతులు వచ్చిన అనంతరం పి గుడిపాడు వద్ద జామాయిల్ పాయింట్ నందు అనుమతి రాయించిన అనంతరం లారీని విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జామాయిల్, సుబాబుల్ రైతులు మార్కెట్ కమిటీ పాయింట్ నుండి కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా అమ్మకాలు జరుపడం సరి కాదని ఆయక రైతులకు సూచించారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, జూలై 17 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్ షిప్పులు పెంచాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ భవనం నుండి కలెక్టరేట్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, ఫీజు రీయంబర్స్‌మెంట్ పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిడియస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండు నెలలు కావస్తున్నా నేటి వరకు ఫీజు రీయంబర్స్‌మెంట్ , స్కాలర్‌ఫిప్పులపై ముఖ్యంత్రి చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదన్నారు. జిల్లాకు గత సంవత్సరం 60 కోట్ల రూపాయల బకాయి ఉండగా ఈ సంవత్సరం విద్యార్థుల దరఖాస్తులను కలుపుకుంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంటుందన్నారు. రైతుల రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలు, ఐటీ విధానంపై త్వరితగతిన చూపిస్తున్న చంద్రబాబు కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై క్యాబినెట్‌లో చర్చించక పోవడం సమస్యలను దాట వేయడమేనన్నారు. తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలన్నారు.
1956కు ముందు హైదరాబాద్‌లో పుట్టిన వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం తెలుగు విద్యార్థుల మధ్య తగాదాలు రేపడమేనన్నారు. ఈ కార్యక్రమంలో పిడియస్‌యు జిల్లా కార్యదర్శి జె రమేష్, నగర కార్యదర్శి రాజు, నాయకులు కిరణ్, శ్యామ్, జగన్, దాసు, రవి, బాల రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

దొంగలను వదిలి విద్యార్థి నాయకుడ్ని
అరెస్ట్ చేస్తారా?
సంతనూతలపాడు, జూలై 17 : పోలీసులు సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న దొంగలు, రౌడీలు, అవినీతి పరులను వదిలి వేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు,ను విద్యార్థులపై లాఠీ చార్జి చేయడం ఎంత వరకు సమంజసమని ఒంగోలు డివిజన్ సిఐటియు అధ్యక్షులు బంకా సుబ్బారావు ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో సర్కిల్‌తో సంబంధం లేని, విధుల్లో లేని చీరాల సి ఐ మహ్మద్ ఫిరోజ్ , నాగులుప్పలపాడు ఎస్‌ఐ యు హరిబాబులు లాఠీచార్జి చేసి అసభ్య పదజాలాలతో దూషించి విద్యార్థి నాయకుడైన పవన్‌ను అవమానపరిచి లాకప్‌లో వేయడాన్ని నిరసిస్తూ గురువారం సంతనూతలపాడు ఎస్‌యఫ్ ఐ మండల శాఖ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్‌లో దిష్టి బొమ్మను ఎస్‌యఫ్ ఐ నాయకులు వెంకయ్య దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు సి ఐటియు నాయకులు బంకా సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలని కోరడం న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. సమస్యల కోసం స్పందించే విద్యార్థులను, విద్యార్థి నాయకులపై పోలీసుల జూలుం సహించరానిదంటూ ఆయన అన్నారు. విధులలో లేని చీరాల సిఐ ఫిరోజ్‌పై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి నాయకుడైన పవన్‌ను లాకప్‌లో ఉంచి అసభ్య పదజాలంతో దూషించిన ఎస్‌ఐ హరిబాబు పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు హై స్కూల్ హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ రాజకీయం మలుపులు తిరుగుతోంది
english title: 
zp politics

ప్రజల పక్షం మా ప్రభుత్వం

0
0

శ్రీకాకుళం, జూలై 17: ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా పక్షపాతిగానే వ్యవహరించిందని, అవగాహన లేని కొంతమంది నేతలు తెలుగుదేశం ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన రెడ్డి, ఆయన అనుచరులపై ధ్వజమెత్తారు. ఇటీవల చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిపోయిన సంఘటనలో జిల్లాకు చెందిన 14 మంది మృతి చెందగా, వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన 28 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన చెక్కుల రూపంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. గురువారం ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చెక్కుల రూపంలో ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున అందజేశారు. అనంతరం మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో దేశ వ్యాప్తంగా జిల్లా వాసులు ఉంటున్నారని అన్నారు. ఆయా రంగంలో ఎటువంటి ప్రమాదం సంబవించినా జిల్లా వాసులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను అనే్వశించి, ముఖ్యంగా వలసలు నివారించే మార్గాలు కనుగొనాలని అధికారులకు సూచించారు. చెన్నై ఘటనలో మృతిచెందిన 14 మంది కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు అందజేయడమే కాకుండా సంఘటన అనంతరం వారు నెలరోజుల పాటు కూలి నష్టపోయినందుకుగాను ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు అందజేశామని పేర్కొన్నారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదించి ఒక్కొక్కరికి మరో రెండు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అన్నారు. ఇవి కాకుండా వర్కుమెన్ కాంపెనే్సషన్ కింద ఒక్కొక్కరికి మరో 7.50 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇవేమీ తెలియని ప్రతిపక్ష నేతలు అవగాహనాలేమితో తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం భావ్యం కాదని, ఏనాడైనా కార్మిక కుటుంబాలకు ఇంతటి నష్టపరిహారం చెల్లించిన ఘనత ఏ ప్రభుత్వానికైనా ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ నష్టపోకూడదని, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ చెన్నై సంఘటన చాలా తీవ్రమైందని, ప్రభుత్వం చేసిన కృషి పలితంగా తమిళనాడు ప్రభుత్వం నుండి నష్టపరిహారం త్వరితగతిన అందజేయగలిగినట్లు చెప్పారు. ముందుగా మృతిచెందిన దాసరి కళావతి(30), దాసరి రాము(40), పైశెట్టి జ్యోతి(30), మీసాల శ్రీను(40), మీసాల భవాని(14), ముద్దాడ శ్రీనివాసరావు(23), అమలాపురపు రమేష్(21), అమలాపురపు రాజేష్(19), కిమిడి సుబ్బారావు(50), తన్ని అప్పలనరసమ్మ(40), దుక్కా తవుడు(58), దువ్వారపు పద్మ(43), ఊల రవి(27), కొంగరాపు శ్రీను(40) తదితర కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.డి.హసీం షరీప్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎం.కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల
సంక్షేమమే ధ్యేయం
శ్రీకాకుళం, జూలై 17: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనికి అధికారులంతా సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఆయన ప్రాంతీయ కార్మిక, ఉపాధి, యువజన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పరిశ్రమల్లో తగు భద్రతా పరమైన అంశాలపట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జనాభాలో 80 శాతం వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. లాకౌట్ అయిన పరిశ్రమల వివరాలు అడిగి తెలుసుకుని, పరిశ్రమ యాజమాన్యాలు, కార్మికులకు మధ్య సఖ్యత ఉండేలా కార్మిక శాఖ అధికారులు చూడాలని అన్నారు. ప్రతి కార్మికుడు తన పేరు నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆశాఖపైనే ఉందని తెలిపారు. కార్మికుడు ఇప్పటి వరకు మృతిచెందితే 30వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించేవారని, దానిని 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఇక నుండి ఏ కార్మికుడు చనిపోవడానికి వీల్లేదని తెలిపారు. కార్మిక సంక్షేమ బోర్డులో 950 కోట్ల రూపాయల వరకు నిధులు ఉన్నాయని, బిల్డింగ్ సెస్ పూర్తిస్థాయిలో వసూలు చేస్తే మరింత పెరిగే అవకాశముందన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి గ్రామం నుండి వలసపోతున్న వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. ఉపాధిశాఖతో ప్రైవేట్ పరిశ్రమలు, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను అనుసంధానం చేయడం ద్వారా వారికి కావలసిన నైపుణ్యాన్ని ఆయా పరిశ్రమల సహకారంతో యువతకు అందించే వీలుందని అన్నారు. ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఖాళీలను అందజేసి అధికారులు సహకరించాలని కోరారు. మన రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు ఇతర దేశాల నుండి వస్తున్నారని, పరిశ్రమలు ఎక్కువ నెలకొల్పితే కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభించగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్.లక్ష్మీనారాయణ, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆప్ ప్యాక్టరీస్ వర్మరాజు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎంప్లాయ్‌మెంట్ విశాఖపట్నం, ఐటిఐ జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గుణుపూర్ టు విశాఖ రైలు
శ్రీకాకుళం, జూలై 17: ఒడిశా రాష్ట్రం గుణుపూర్ నుండి జిల్లా మీదుగా విశాఖపట్నానికి నూతనంగా ఓ రైలును వేయడానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ్ హామీనిచ్చినట్లు పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో ఢిల్లీనుండి మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్ నుండి జిల్లాకు అధిక శాతం ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా ఇటీవలే ప్రారంభించిన నౌపడ - గుణుపూర్ రైలు మార్గానికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 17 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిందిగా రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నౌపడా, గుణుఫూర్ మార్గానికి మూడు కోట్ల రూపాయలు మిగులు నిధులు ఈ బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి చెప్పారన్నారు. అదే విధంగా ఖుర్ధా డివిజన్, విశాఖపట్నం డివిజన్‌లకు సంబంధించి హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇచ్చాపురంలో హాల్ట్ కల్పించాలని సంబంధిత యంత్రాంగాన్ని పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. అదే విధంగా గేజ్ కన్వర్షన్, రోడ్‌సేప్టీ, పలాసా, పూండి ఓవర్ బ్రిడ్జి, పొందూరు, జి.సిగడాం 438 మైలురాయి వద్ద బ్రిడ్జి, కోటబొమ్మాళి-తిలారు, పూండి-నౌపడ, లెవెల్ క్రాసింగ్ పనులు, రోడ్ సేఫ్టీ పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారని అన్నారు.

అండగా ఉంటా... అధైర్యపడొద్దు
పాలకొండ, జూలై 17: పెద్ద కొడుకునై అండగా ఉంటా.. ఆధైరర్యపడొద్దు అని చెన్నై బహుళ అంతస్థుల ఘటనలో మృతి చెందిన కుటుంబానికి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం పట్టణంలోని నీళ్లట్యాంకు వీధిలో నివాసమున్న ఊళ్ల రవి బాధిత కుటుంబానికి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రవి తల్లి పార్వతీ, సోదరులు శ్రీనుతో మాట్లాడి, ప్రమాద సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చింది, ఆర్థిక స్థితుగతులు ఏమిటి అని తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత సక్రమంగా లేకపోవడంతో ఆప్పుల్లో కుటుంబాన్ని గట్టెక్కించేందుకు తన కుమారుడు ఇలా వలస వెళ్లాల్సి వచ్చిందని తల్లి పార్వతీ వాపోయారు. అంది వచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడని ఎంతో భరోసాగా ఉన్నానని, ఇటువంటి తరుణంలో తన కుమారుడు మరణవార్త తనను ఎంతో కృంగదీసిందని ఆయన వద్ద విలపించారు.
దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందించి వారితో మాట్లాడుతూ ఆధైర్యపడొద్దు అని ఎటువంటి ఆపద వచ్చిన తనను సంప్రదించాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యులు పాలవలస రాజశేఖరం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే కృష్ణదాసు తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలి
* స్వామి శ్రీనివాసానంద
శ్రీకాకుళం, జూలై 17: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కట్టమని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిని ఆపాలని భారత స్వాభిమాన్ ట్రస్టు జిల్లా అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ అన్నారు. ఎన్.జి.ఒ హోమ్‌లో గురువారం అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్య వ్యాపారం అయిపోయిందని, నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ఫీజులు మాత్రం భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు. లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు కె.పోలినాయుడు, బిజెపి జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాధరావులు మాట్లాడుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కళాశాలల్లో వౌళిక వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల్లో కనీస వసతులు కూడా లేవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, యాజమాన్యం మాత్రం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, దీనిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవితవ్యంతో చెలగాటమాడవద్దని, ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ సమావేశంలో పైడి సత్యం, నాగేశ్వరరావు, సూరు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

ఏనుగుల దాడిని నివారించేందుకు చర్యలు
*జిల్లా అటవీ శాఖాధికారి విజయకుమార్
నరసన్నపేట, జూలై 17: జిల్లాలో వీరఘట్టం పరిధిలో ఏనుగుల దాడి ఎక్కువగా ఉందని, దానిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీ శాఖాధికారి విజయకుమార్ తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. 2010లో పలువురు ఏనుగుల దాడిలో మృత్యువాతపడ్డారని, ఆ నాటి నుండి నేటి వరకు ఆ దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి సంబంధించి అటవీ ప్రాంతంలో సుమారు 60 కిలోమీటర్ల మేర గుంటలు తవ్వేందుకు, 17 కిలోమీటర్ల మేర సోలార్ కంచెలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.

మార్కెట్ కమిటీలు రైతులకే దక్కాలి
* లోక్‌సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంబాబు
శ్రీకాకుళం, జూలై 17: ప్రభుత్వం ఏర్పాటు చేసే మార్కెట్ కమిటీలు రైతులకే దక్కాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల పుణ్యమాని రైతులకు, మార్కెట్ కమిటీలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయన్నారు. రైతుల నుండి ఏటా ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయల మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నప్పటికీ, మార్కెట్ యార్డుల్లో రైతుల కోసం కనీస సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. కమిటీలను పూర్తిగా రాజకీయ పునరావాసాలకు నిలయంగా మార్చేశారని అన్నారు. మార్కెట్ కమిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వస్తున్న కథనాల నేపథ్యంలో నూతన ప్రభుత్వమైనా మార్కెట్ కమిటీలను రైతుల చేతుల్లో పెట్టాలని కోరారు. రైతుల రుణమాఫీపై రోజుకో మాటచెబుతున్న ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వి.అప్పలరాజు, పి.ప్రసాద్, టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రూ.80 లక్షలతో 32 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు
* కోమర్తిలో విద్యుత్ సబ్‌స్టేషన్: ఎమ్మెల్యే రమణమూర్తి
నరసన్నపేట, జూలై 17: మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలను పూర్తిగా నివారించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టంచేశారు. గురువారం మండల కేంద్రంలో మారుతీనగర్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం శంకుస్థాపనను ఆయన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మేజర్ పంచాయతీలో విద్యుత్, లోవోల్టేజి సమస్యలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి 80 లక్షల రూపాయలతో 32 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని, వీటి ప్రక్రియను వందరోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న కోమర్తి గ్రామం వద్ద కొత్తగా 25 లక్షల రూపాయలతో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయని వివరించారు. వీటి నిర్మాణం వలన మండలంలో రూరల్ ప్రాంతాలకు చెందిన గ్రామాలకు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎ.డి ఈశ్వరరావు, ఎ.ఇ రమణ, సర్పంచ్ చిట్టిబాబు, జెడ్పీటిసి శకుంతల, అధికారులు పాల్గొన్నారు.

పిజి సెమిస్టర్ ఫలితాలు విడుదల
* 86.94 శాతం ఉత్తీర్ణత
ఎచ్చెర్ల, జూలై 17: అంబేద్కర్ విశ్వవిద్యాలయం పి.జి 2,4,6,8 సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను గురువారం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ ఆయన ఛాంబర్‌లో విడుదల చేశారు. 1189 మంది ఈ పరీక్షలకు హాజరు కాగా 1023 మంది ఉత్తీర్ణులయ్యారు. యూనివర్శిటీతోపాటు జిల్లాలో వివిధ పి.జి అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో ఉన్నారు. 15 రోజుల్లోగా రీవేల్యూషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈయనతోపాటు రెక్టార్ చంద్రయ్య, రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ తులసీరావు, ఆచార్యులు కామరాజు, అడ్డయ్యలు ఉన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షలు సత్వరంగా ఫలితాలు వెల్లడించినందుకు వీసీ సిబ్బందిని అభినందించారు.

జగన్ అభిమానులకు నిరాశ
ఆమదాలవలస, జూలై 16: ఇటీవలి చెన్నై బహుళ అంతస్థులు కూలిన సంఘటనలో జిల్లా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన పార్టీ నాయకులకు, అభిమానులకు, ప్రజలకు నిరాశే ఎదురైంది. గురువారం రాత్రి ఇక్కడి తమ్మినేని సీతారాం ఇంటికి చేరుకుని బస చేశారన్న విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం ఉదయం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం జగన్ బయటకు వచ్చి ప్రజలతోపాటు వైకాపా నాయకులు, కార్యకర్తలతో కనీసం పది నిముషాలు ముచ్చటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. ఉదయం పది గంటలకు సీతారాం ఇంటి నుండి బయటకు వచ్చిన జగన్ జనాన్ని చూసి క్షణాల్లో కారు ఎక్కి టాటా చెప్పి వెళ్లిపోవడంతో మొర్రోమంటూ తిరుగుముఖం పట్టారు.
మీడియాకు నో ఎంట్రీ!
శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సందేశాలను, సూచనలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాప్రతినిధులను సీతారాం ఇంటి వద్ద ఫ్రైవేటు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కేవలం జగన్ సొంత మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలకు రావాలని, మిగిలిన వారు ఎవరూ లోపలకు రావద్దని హెచ్చరించడంతో మీడియా బృందం కంగుతింది. కాగా, తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు సీతారాం ఇంటి వద్దకు చేరుకున్న రెడ్డి శాంతి లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సుమారు గంటసేపు బయటే నిరీక్షించారు. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించినా జగన్ సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఇంటి బయటే నిరీక్షించాల్సి వచ్చింది.

పారదర్శకత కోసమే ఈ-పాస్ పుస్తకాలు
శ్రీకాకుళం, జూలై 15: పారదర్శకత పాలనే ధ్యేయంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఈ-పాస్‌పుస్తకాలను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు కావాలంటే రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారు. ఇదే అదనుగా కొందరు రెవెన్యూ అధికారులు వేలాది రూపాయలు తీసుకుని కాళ్లరిగేలా తిప్పిన సంఘటనలు కొకొల్లలు. ఇకపై ఈ చర్యలకు బ్రేక్ పడనుంది. దరఖాస్తు చేసుకోవడంవరకు ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చినా తదుపరి ప్రక్రియ అంతా మామూలుగానే సాగేది. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకుల్లో తనఖాలు వంటి వాటిలో అవకతవకలకు ఆశించిన స్థాయిలో చెక్ పడలేదు. భూముల అమ్మకాల సమయంలో రిజిస్ట్రేషన్‌కు పాస్‌పుస్తకాలు పరిగణలోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఉదాహరణకు పది ఎకరాల రైతు రెండెకరాలభూమిని విక్రయిస్తే అతడి వద్ద మిగిలింది ఎనిమిది ఎకరాలే. అయితే ఇది పాసుపుస్తకాల్లో నమోదు కాకపోవడంతో పది ఎకరాలు పాసుపుస్తకంలో ఉంటుంది. దీంతో బ్యాంకుల్లో ఈ పది ఎకరాలకు రైతుల రుణాలు పొందిన సందర్భాలు అనేకం. ఇటువంటి అవకతవకలను సమర్ధవంతంగా నిరోధించేందుకు ఈ-పాసుపుస్తకం ఉపకరిస్తుందని రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నారు.
* ఈ-పాస్‌పుస్తకం కోసం ఏం చేయాలి?
దరఖాస్తుదారు భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, గతంలో ఉన్న పాసుపుస్తకాలు తదితర ఆధారాలతో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వీస్‌చార్జి కింద 35 రూపాయలు, స్టేషనరీ చార్జి కింద వంద రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో పోస్టులో హైదరాబాద్ సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి ముద్రితమైన ఆధునిక ఈ-పాసుపుస్తకం ఇంటికి చేరుతుంది. ఈ-పాసుపుస్తకం విధానం మేలైనదని, భూమి రిజిస్ట్రేషన్ సమయంలో పాసుపుస్తకం ఆప్షన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-పాసుపుస్తకం కూడా వస్తుందని తహశీల్దార్ ఎస్.దిలీప్‌చక్రవర్తి తెలిపారు. దీంతో లింకు డాక్యుమెంట్, యూనిక్ ఐ.డి నెంబర్‌తో సహా ప్రింట్ వస్తుందని, బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్‌లైన్ వివరాలు అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశారు.

ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా పక్షపాతిగానే వ్యవహరించిందని, అవగాహన లేని
english title: 
p

కొందామంటే కూర‘గాయాలే’

0
0

* మరో పది రోజులు ఇదే పరిస్థితి
విశాఖపట్నం, జూలై 17: జిల్లాలో కూరగాయలు సాగు గణనీయంగా తగ్గిపోయింది. గడచిన పది రోజులుగా జిల్లాలో కూరగాయలు దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులే నగరంలోని హోల్‌సేల్ మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్ని కూరగాయల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. కూరగాయలను సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఓపక్క నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయిని అంటుతుంటే, కూరగాయలు కూడా అందకుండా పోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విరివిగా అమ్ముడయ్యే టమోటా 48 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ఉల్లిపాయలు రైతు బజార్లలో 27 రూపాయలు ఉంటే, బహిరంగ మార్కెట్‌లో 35 రూపాయలు పలుకుతోంది. వీటన్నింటికీ మించి పర్చిమిర్చి రైతు బజార్లలో కిలో 40 రూపాయలుంటే, బహిరంగ మార్కెట్‌లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. అల్లం రైతు బజార్‌లో 115 రూపాయలు పలుకుతోంది. కాకరకాయ కిలో 36 రూపాయలు ఉందంటే ఇక కూరగాయల ధరలు ఏవిధంగా మండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కూరగాయల సాగు చాలా వరకూ తగ్గిపోయింది. గతంలో ఒక్కో రైతు రైతు బజారుకు రోజుకు ఐదు బస్తాల వంకాలు తీసుకువచ్చే వారు. ఇప్పుడు ఒకటి, రెండుకు మించి ఉండడం లేదని ఉద్యానవన శాఖ అధికారులు చెపుతున్నారు. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో కొన్న కూరగాయలపై కిలోకు రెండు రూపాయలు అదనంగా వేసి విక్రయిస్తున్నట్టు అధికారులు తెలియచేస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వలన దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ ధరలు మరో పది రోజులపాటు ఉంటాయని అధికారులు తెలియచేశారు. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు బజార్లలో గురువారం నాడు వివిధ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
---------------------------------------
కూరగాయలు ధర
---------------------------------------
టమోటా 48
ఉల్లి 27
పచ్చిమిర్చి (తెలుపు) 40
పచ్చిమిర్చి (నలుపు) 52
పొటల్స్ 24
క్యాప్సికం 42
బీన్స్ 46
వంకాయలు 10
క్యాబేజి 18
చిలగడదుంప 20
బీరకాయలు 28
బెండ 24
దొండ 16
కాకర 36
క్యారెట్ 25
భీముడు చిక్కుడు 50
కొత్తమీర (చిన్నకట్ట) 10
బంగాళ దుంప 17
అల్లం 115
బరబాటి 28
దోస 14

అదుపు తప్పిన శాంతి భద్రతలు
* మూడు నెలలుగా సిపి పోస్ట్ ఖాళీ
* 13 రోజుల్లో నాలుగు హత్యలు
* తొలిసారిగా రాజకీయ హత్య
విశాఖపట్నం, జూలై 17: ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి నెలకొంది. అరుదుగా జరిగే ఘోరాలు ఇప్పుడు రెగ్యులరైపోయాయి. గడచిన వారం రోజుల్లో నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ నగరంలో తొలిసారిగా రాజకీయ హత్య కూడా జరిగిందంటే శాంతి భద్రతలు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో చెప్పకనే చెప్పచ్చు. నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన శివథర్‌రెడ్డి ఇక్కడి నుంచి బదిలీ అయి వెళ్లిన తరువాత పూర్తి స్థాయి సిపిని నియమించలేదు. కోస్తా జిల్లాల ఐజి అతుల్ సింగ్‌కు నగర పోలీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన పెద్దగా నగరంలో ఉండకపోవడంతో నగర పోలీసులపై ఉన్నతాధికారుల పట్టు లేకుండా పోయింది. అనేక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లి, శిక్షా కాలం పూర్తయిన తరువాత తిరిగి బయటకు వచ్చిన వారు నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు ఇది హత్యలకు కూడా దారితీస్తోంది. ఈనెల ఐదవ తేదీ నుంచి ఇప్పటి వరకూ అంటే 13 రోజుల్లో నాలుగు హత్యలు జరిగాయి. ఈనెల ఐదవ తేదీన అక్కయ్యపాలెంలో హర్డ్‌వేర్ వ్యాపారం చేసుకుంటున్న గొర్లె ముత్యాల నాయుడు భీమిలిలోని ఒక ఫాం హౌస్‌లో హత్య చేశారు. ముత్యాలనాయుడు కొంతమందితో కలిసి భీమిలికి వెళ్లి, హత్యకు గురికావడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యకు కారకులను పోలీసులు ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయారు. ఈనెల 11న ఆరిలోవలో నివసిస్తున్న నూకాలమ్మ అనే వృద్ధురాలిని కొంతమంది అగంతుకులు హతమార్చి, ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ హత్య పట్టపగలే జరిగినా, పోలీసులు నేరస్తులను పట్టుకోలేకపోయారు. ఆ మరునాడే అంటే 12వ తేదీనే టిడిపి 34వ వార్డు అధ్యక్షుడు కిలపర్తి అప్పలనాయుడుని అతి దారుణంగా హతమార్చారు. విశాఖ నగరంలో తొలిసారిగా జరిగిన రాజకీయ హత్యగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. ఈ కేసును ఇప్పటికీ నగర పోలీసులు చేధిస్తునే ఉన్నారు. అయితే రాజకీయ నాయకుడి హత్య కాబట్టి, అనుమానితులను, పాత నేరస్థులను రప్పించి ప్రశ్నిస్తూ, హంతకుల కోసం కూపీ లాగుతున్నారు. ఈ కేసు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇంతలోనే గురువారం పెదగంట్యాడలోని బొట్టా మహలక్ష్మి అనే వృద్ధురాలిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇల్లు అద్దెకు కావాలని మహలక్ష్మి దగ్గరకు వచ్చి, ఇల్లు చూపిస్తుండగా ఆమెను గదిలోనే హతమార్చి, మెడలో ఉన్న కాసింత బంగారాన్ని లాక్కెళ్లారు. ఇలా కేవలం 13 రోజుల్లో నాలుగు హత్యలు నగరంలో చోటు చేసుకున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.
హంతకులు ఎందుకు చిక్కడం లేదు?
నగరంలో సంచలనం సృష్టిస్తున్న హంతకులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. ఈనెలలో జరిగిన మూడు హత్యలకు సంబంధించి నేరస్తులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇంతలో మరో హత్య.. పెద్ద పెద్ద హత్య కేసులను అవలీలగా చేధించగల పోలీస్ అధికారులు నగరంలో లేకపోలేదు. వీరికి ఆ బాధ్యతలను ఎందుకు అప్పగించడం లేదు? ముఖ్యంగా హత్య జరిగిన ప్రదేశం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించలేకపోతోందా? ఆనవాళ్లు దొరక్కుండా హంతకులు జాగ్రత్తపడుతున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నిలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
ఇవి రౌడీ షీటర్ల ఆగడాలా?
నగరంలో రౌడీషీటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. వివిధ కేసులలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారితో, ఈ రౌడీషీటర్లు చేతులు కలిపి, హత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పాత నేరస్థులతోపాటు, ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు, నేరగాళ్ళు కూడా నగరంలో సంచరిస్తూ, ఈ నేరాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టిడిపి నాయకుడు అప్పలనాయుడు హత్యకు కిరాయి హంతకులను వినియోగించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రౌడీ షీటర్లపై పోలీస్ నిఘా తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు కనే్నసి ఉంటే, శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
పూర్తి స్థాయి సిపి లేకుండానే...
పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. వీటన్నింటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ పోస్ట్ ఖాళీ అయి రెండు నెలలైంది. మే 22న శివథర్‌రెడ్డి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. ఆ తరువాత కోస్తా జిల్లాల ఐజి అతుల్ సింగ్‌ను ఇన్‌చార్జ్ సిపిగా నియమించారు. ఆయన అప్పుడప్పుడు నగరానికి వచ్చి వెళుతున్నారే తప్ప, పూర్తి స్థాయిలో ఇక్కడి వ్యవహారాలను పట్టించుకోలేకపోతున్నారు. వెంటనే పూర్తి స్థాయి సిపిని నియమిస్తేకానీ శాంతి భధ్రతల పరిస్థితి అధుపులోకి వచ్చేట్టు కనిపించడం లేదు.

కొత్త సిపిగా సునీల్ కుమార్?
విశాఖపట్నం, జూలై 17: నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా సునీల్ కుమార్ వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ త్వరలోనే విశాఖ సిపిగా వస్తారని పోలీసు వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో ఐపిఎస్‌ల కేటాయింపు వ్యవహారం మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనువెంటనే పోస్టింగ్‌లు ఇవ్వచ్చని భోగట్టా.

భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావాలి
* ఉపాధి, భూముల సమస్యలపైనే ప్రధాన చర్చ
* వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ కార్యదర్శి
విశాఖపట్నం, జూలై 17: దేశంలో ప్రధానంగా వ్యవసాయ కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి సునీత్‌చోప్రా ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ నగరం జగదాంబ జంక్షన్ సమీపానున్న సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. వరంగల్‌లో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించే మహాసభల్లో ఉపాధి హామీ పథకం, భూమి అనే అంశాలపైనే ప్రధాన చర్చ ఉంటుందన్నారు. వీటిపై భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ఏమాత్రం సరైందికాదన్నారు. ఎస్‌ఇజెడ్‌ల పేరుతో భూములను తీసుకుంటున్నారన్నారు. వ్యవసాయ కార్మికులు రోడ్డునపడుతున్నారన్నారు. భూ స్వాముల వద్ద నుంచి భూములు స్వాధీనం చేసుకుని పేదలకు అందజేయాలన్నారు. అలాగే ఎస్‌ఇజెడ్‌ల పేరుతో సేకరించిన భూములు ఎందుకు పనికిరాకుండా పడి వున్నాయని వీటిని స్వాధీనపర్చుకోవాలన్నారు. దేశంలో అతిపెద్ద వ్యవసాయ కార్మిక సంఘం మరెక్కడా లేదన్నారు. 1998లో వ్యవసాయ కార్మికులకు 123 రోజులు పని ఉండేదని, అటువంటిది ఇపుడు 53 రోజులకే పరిమితమవుతోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉపాధి హామీ పథకం సరిగా అమలు జరగడంలేదన్నారు. ప్రతి ఏడాది 33 లక్షల ఎకరాల భూములు అమ్మేస్తున్నారని ఆరోపించారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం మంది జనాభా జీవిస్తుండగా, శ్రామికుల్లో 50 నుంచి 60 శాతం మంది వ్యవసాయ వృత్తులపై ఆధారపడే వారే ఉన్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, చిన్నసన్నకారు రైనతులు కీలక భూమిక పోషిస్తున్నారన్నరు. కష్టాలకు వ్యతిరేకంగా వ్యవసా కూలీలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాపాడుకోవాలన్నారు. ప్రతి దళిత, గిరిజన, బిసి కుటుంబానికి మూడేకరాల సాగుభూమి ఇవ్వాలని, పేద కుటుంబానికి ఇళ్ళ స్థలం, నివాసం ఉంటున్న వారికి పట్టాలివ్వాలన్నారు. ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలని, 70 శాతం నిధులు వేతనాలకు ఖర్చు చేయడం, మెట్ల పారితోషకం ఐదు రూపాయలకే పెంచాలన్నారు. సంఘం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి క్రాంతి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో వేదిక స్థాపించాలన్నారు. రాష్ట్రం బౌగోళికంగా విడిపోయినా ప్రజాసమస్యలపై ఐక్యంగా ఉంటారని, ఐక్యతను చాటే విధంగా బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికుల సమస్యలను ప్రతిబింబించే విధంగా ఈ సభలుంటాయని, వీటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శేషారత్నం, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ బడ్జెట్‌పై చర్చ
* నాలుగు మాసాల్లో విమ్స్ సేవలు
* పలు విభాగాల అధిపతులతో సమీక్ష
* కెజిహెచ్ సేవలు మెరుగుపడాలి
* అవినీతికి పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు
* వైద్యా,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మాణ్యం
విశాఖపట్నం, జూలై 17: హెల్త్ బడ్జెట్‌పై గురువారం కెజిహెచ్‌లో కీలక సమీక్ష జరిగింది. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎల్‌వి సుబ్రహ్మాణ్యం పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ప్రధానంగా విశాఖ నగరంలో కొనే్నళ్ళ కిందట చేపట్టిన విమ్స్ నిర్మాణ పనుల గురించి ఆయన సమీక్షించారు. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ పనులు చురుగ్గా నిర్వహించడం, ఈ ఏడాది నవంబర్ నాటికి విమ్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. అనేకసార్లు వాయిదాలు పడుతూ వస్తోన్న విమ్స్ నిర్మాణం, ఆసుపత్రిలో వౌలిక వసతులు, దీని నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలు చర్చించారు. ఏ స్థాయిలో ఇది పెండింగ్‌లో ఉంది? దీనికి గల కారణాలేమిటి? టెండర్లను పిలవడం, రూ. 60 కోట్ల నిధుల మంజూరు, తదితర అంశాల గురించి ఈ సందర్భంగా సుబ్రహ్మాణ్యం విభాగాధిపతులతో చర్చించినట్టు తెలియవచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ విశాఖ నగరంలో రాదని స్పష్టంకావడంతో విమ్స్‌పైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నట్టు తెలిసింది. దీనిలోభాగంగానే విమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, కెజిహెచ్‌లో వైద్య సేవలు మెరుపర్చడం, ఇందులో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే 150 నుంచి 200 సీట్లకు మెడికల్ సీట్లు పెరగగా, భవిష్యత్ వీటిని ఇంకా పెంచాల్సిన పరిస్థితులపైన చర్చించారు. ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసి)లో తరగతి గదులు, వసతులు నిబంధనల ప్రకారం అమలవుతున్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన సమీక్షించినట్టు తెలిసింది. కెజిహెచ్‌లో ఇటీవల నెలకొన్న వరుస సంఘటనలపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ప్రసూతివార్డులో బిడ్డ అపహరణ, రోడ్డు ప్రమాద సంఘటనలో బాధితుని నుంచి లంచం డిమాండ్ చేసిన వైద్యునిపై అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) దాడులు వంటి విషయాల గురించి ఆయన వైద్యాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. నిబంధనల ఉల్లంఘన, రోగుల నుంచి మాముళ్ళు వసూళ్ళు, ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య చికిత్స కోసం ప్రోత్సహించడం తదితర మరొకొన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. రోగులకు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలందించడంలో లోపాలున్నా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేదిలేదని, అటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. అలాగే సూపర్‌స్పెషాలిటీ, విమ్స్ ఆసుప్రతుల్లో అత్యంత అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం, ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరు వాటిపైన భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొద్ది నెలల కిందట ఇక్కడకు వచ్చిన ఆయన కెజిహెచ్‌లో అన్ని విభాగాలు కలియతిరిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు తు.చ అమలు జరుగుతున్నాయా? లేదా? అంటూ వైద్యాధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.

కెజిహెచ్‌కు అవినీతి రోగం
* ఏసిబి దాడులతో వెలుగులోకి
విశాఖపట్నం, జూలై 17: ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న కెజిహెచ్ ఆసుపత్రి ఇపుడు అనేక రకాలైన అపవాదులను ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు వేనూళ్ళుకున్న అవినీటి, అక్రమ సంఘటనలు ఆసుపత్రిని కుదేపేస్తున్నాయి. వరుసగా సంఘటనలను దృష్టిలోపెట్టుకున్న అవినీతి నిరోధిక శాఖ (ఏసిబి) అధికారులు రోజుల తరబడి నిర్వహించిన దాడులు ఆసుపత్రి వర్గాలకు కనుకు లేకుండా చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది గుండెల్లో సైతం రైళ్ళు పరుగెడుతున్నాయి. ఏ క్షణంలో ఎవరిపైన చర్యలుంటాయో అన్న భయం పట్టుకొంది.
అత్యవసర వైద్యం సైతం ఇక్కడ వ్యాపారంగా మారింది. సాక్షాత్తూ ఓ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాధితునికి అందించే అత్యవసర చికిత్సకు ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టడం, చేసిదిలేక రూ.20వేలు బాధిత కుటుంబం రూ.20వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న సంఘటన కాస్త ఏసిబికి చేరింది. దీంతో ఇపుడు ఆ వైద్యునిపై చర్యలకు రంగం సిద్ధమైంది. అయితే ఈ వైద్యునిపై బాధిత కుటుంబం చేసిన పిర్యాదుతో మరికొంతమంది బాదితులు పలు సంఘటనల్లో డబ్బు డిమాండ్ చేసిన ఒకరిద్దరు వైద్యులపై ఏసిబికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. గతంలో జరిగిన అవినీతి సంఘటనలపై ఏసిబి అధికారులు ఇప్పటికే ఆరా తీస్తుండగా, ఏ ఏ సంఘటనల్లో రోగుల నుంచి ఎంతెంత డిమాండ్ చేశారనే దానిపై చాపకిందనీరులా దర్యాప్తు జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఆసుపత్రిలో ఏసిబి దాడులు సంబంధిత వర్గాల్లో దడ పుట్టిస్తుండగా మరోపక్క నాల్గవ తరగతి సిబ్బంది చేతివాటం రోగులపాలిట శాపంగా పరిణమిస్తోంది. అందువల్ల క్షేత్రస్థాయి నుంచి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ప్రసూతివార్డులో పసిబిడ్డ అపహరణ సంఘటనలోనూ స్విపర్ హస్తం ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ తదితర ముఖ్యమైన విభాగాల్లో శస్తచ్రికిత్సల కోసం వేలాది రూపాయలు గుంజుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తోన్న నేపధ్యంలో వీటిపై ఏసిబి నిఘా పెట్టింది. ఆసుపత్రి అధికారులు ఎన్ని పిర్యాదులు చేసినా, పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదని చెబుతోన్న రోగులు, వీరి బంధువులు ఇపుడు ఏసిబి అధికారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. ఆసుపత్రికి ఎటువంటి సంబంధం లేని దళారులు కొందరు ముఖ్యమైన యూనిట్ల వైద్యులను సైతం శాసిస్తున్నారు. శస్తచ్రికిత్సలకు సంబంధించి మెరుగైన వైద్య కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫారసు చేస్తోన్న దళారులు పలు యూనిట్లలో దర్జాగా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న దళారుల వ్యవహారంపై పిర్యాదులు అందతున్నా వైద్యాధికారులు మెతకవైఖరినే అవలంబిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తోంది.

మూడేళ్లయినా 50 శాతం మందికే ఆధార్
* తప్పనిసరి అంటున్న అధికారులు
* తెలుపురంగు రేషన్‌కార్డుకు లింక్
* సక్రమంగా నడవని కేంద్రాలు
* దరఖాస్తుదారులకు మళ్ళీ సమస్యలు
విశాఖపట్నం, జూలై 17: ఆధార్ కార్డులు తప్పనసరిగా మారునున్నాయి. గత యుపిఏ సర్కార్ పాలనలో గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డును అనుసంధానం చేసింది. దీంతో సర్వాత్రా నిరసన వ్యక్తమైంది. తదుపరి కొన్నాళ్ళు వెసలుబాటు కల్పించి ఆ తరువాత ఎన్నికల ముందు ఈ విధానాన్ని తొలిగించింది. దీంతో ఊపీరిపీల్చుకున్న వినియోగదారులకు మళ్ళీ నెత్తిమీద పిడుగు పడినట్టు అయ్యింది. ఆధార్‌కార్డు లేకపోతే ఇబ్బందులే. ఎందుకంటే ఈసారి కొత్త ప్రభుత్వం తెలుపురంగు రేషన్‌కార్డుకు అధార్‌కార్డును అనుసందానం చేసింది. దీనివల్ల ఇక నుంచి తెలుపురంగు రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఆధార్‌ను పొందాల్సిందే. ఇంతవరకు భారత పౌరునిగా, లేదంటే పలు అవసరాల నిమిత్తం ఆధార్‌కార్డు ఉంటే ఉంచిదనుకునే వారంతా ఇపుడు తప్పనిసరిగా వీటిని తీసుకోవాల్సిందే. అందువలనే మళ్ళీ ఆధార్ కార్డుకు సంబంధించి ధరఖాస్తులు, ఐరిస్ తీసుకోవడం వంటి వాటి కోసం కేంద్రాలను వెదుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు వంటి వాటితో కొన్నాళ్ళపాటు కేంద్రాల నిర్వహణ సవ్యంగా జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా నత్తనడకను సాగుతూ వస్తోన్న ఈ కేంద్రాలకు మళ్ళీ ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పని పడినట్టు అయ్యింది. ఆయా ప్రాంతాల్లో కేంద్రాలున్నా వీటిలో కొన్నిచోట్ల సర్వయర్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిబ్బంది కొరత, అత్యధిక జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలే అందుబాటులో లేక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్ళుగా 50 శాతం మందికే
మూడేళ్ళు కిందట కేంద్రం దీనిని ప్రారంభించింది. ఏడాదికాలంగా మాత్రమే దీనిని వేగవంతం చేశారు. ఆధార్‌కార్డు జారీలో భాగంగా కేంద్రాలను పెంచగలిగారు. అందువలనే మూడేళ్ళుగా విశాఖ జిల్లావ్యాప్తంగా కేవలం 50 శాతం మంది మాత్రమే కార్డులు పొందగలిగారు. పౌరసరఫరాల విభాగం అధికారులు మాత్రమే 58 శాతం వరకు ఇది పూర్తయ్యిందని, ఇంకా 42 శాతం మేర పూర్తికావాల్సి ఉందని అంటున్నారు. తెలుపురంగు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు రెండు కలిగి ఉంటే సరిపోతుంది. అయితే తెలుపురంగు రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్క కుటుంబానికి ఆధార్‌కార్డులేవు. అందువల్ల ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, సంబంధిత కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని ఐరిస్ తీయించుకుంటే సరిపోతుందని సంబంధితాధికారులు అంటున్నారు. ఈ విధంగా చేసేందుకు ఎటువంటి ఇబ్బందులుండవని, కేంద్రాలు అందుబాటలోనే ఉంటున్నాయని, కనీసం ఆధార్ పొందేందుకు ఇచ్చే నెంబర్ ఉన్నా సరిపోతుందని చెబుతున్నారు.

వచ్చేనెలా పామాయిల్ డౌటే
* నాలుగు మాసాలుగా ఇదే పరిస్థితి
* కాగుతున్న నూనెల ధరలు
విశాఖపట్నం, జూలై 17: నూనె ధరలు మండిపోతున్నాయి. సాదారణంగా కొనుగోలు చేసే పామాయిల్ ప్యాకెట్లు సైతం ఇపుడు మరింత ప్రియం అయ్యాయి. చౌకధర దుకాణాల ద్వారా తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు ప్రతినెల కిలో పామాయిల్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే గత నాలుగు మాసాలుగా ఈ ప్యాకెట్ల పంపిణీ నిలిచిపోయింది. ఆయిల్ నిల్వలు నౌకల ద్వారా దిగుమతి చేయడం, కాకినాడ పోర్టు నుంచి జిల్లా పౌరసరఫరాల కేంద్రాలకు తరలించడం, ఈ లోపు ప్రైవేటు ఏజేన్సీల ద్వారా ఆయిల్ ప్యాకింగ్‌లు నిర్వహించడం వంటివి నిలిచిపోయాయి. కేంద్రం సకాలంలో చొరవ తీసుకోపోవడం, బాగ్ధాద్‌లో యుద్ధవాతావరణం వంటివి పామాయిల్ సరఫరాకు బ్రేక్ వేసాయి. ఈ పరిస్థితులను గమనించిన ఆయిల్ మర్చెంట్స్ ఏకంగా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో పామాయిల్ కావాలంటే చౌకధర దుకాణం ద్వారా రూ.40లుండగా, ఇదే తరహాలో నూనె బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.70లు పలుకుతోంది. అదే నెంబర్ వన్ నూనె కోసం వంద రూపాయలకు పైబడి చెల్లించాల్సిందే. గత మూడు మాసాలుగా ఇదే పరిస్థితి ఉన్నా నూనె ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సంబంధితాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు.

బ్యాంకర్లతో సమీక్ష
* 2240 మందికి ఉపాధి
విశాఖపట్నం, జూలై 17: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం, ప్రయోజనాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించుకోవడానికి కావాల్సిన వివరాలు గురువారం జరిగిన బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. హోటల్ దసపల్లా పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమీక్షా సమావేశానికి అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, డివిజన్ కార్యాలయం, సంచాలకులు, ఎల్‌డిఎం, ఎస్‌బిఐ నుంచి అధికారులు హాజరయ్యారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, బ్యాంకు ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పనాపథకం, పంచవర్ష ప్రణాళిక (2012-13 నుంచి 2016-17) వరకు రూ.8060 కోట్ల రూపాయల మార్జిన్‌మనీ మిడిల్ అండెడ్ సబ్సిడీగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమకు మంజూరు చేశారు. ఈ పథకం 2016-17 వరకు కొనసాగిస్తారు. ఈ సదస్సు ద్వారా 2014-15 సంవత్సరానికిగాను 2240 మందికి ఉపాధి కల్పించడానికి, 386 లక్షల సబ్సిడిగా (మార్జిన్‌మనీ) ఐదు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలకు కేంద్రం ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు.

ట్రామాకేర్ సిబ్బంది నిరసన
* కొనసాగుతున్న సమ్మె
విశాఖపట్నం , జూలై 17: తొమ్మిది మాసాలు జీతాలు చెల్లించాలని కోరుతూ కెజిహెచ్ ట్రామాకేర్ సిబ్బంది చేపట్టిన సమ్మె ఇంకా కొనసాగుతోంది. గత వారం రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న సిబ్బంది గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని బకాయి పడిన జీతాలను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఇక్కడకు వచ్చిన వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మాణ్యం దృష్టికి ట్రామాకేర్ సిబ్బంది సమస్యను తీసుకువెళ్ళారు.

వేధిస్తున్న పిఇటిల కొరత
* కానరాని వౌలిక వసతులు
* కనిపించని క్రీడా పరికరాలు
విశాఖపట్నం , జూలై 17: అందరికీ క్రీడలు అవసరమనే నినాదంతో వ్యాయామ విద్యను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జారీ చేసిన జిఓ 210 అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ సాయంత్రం చివరి పిరియడ్‌లో క్రీడా మైదానంలో గడపాలని జిఓలో సూచించారు. అయితే జిల్లాలోని పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు కొరత ఉండటంతో పిల్లలు ఆడుకునేందుకు వీలు కావడం లేదు. ఉదయం పాఠశాల ప్రారంభం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులతోనే సరిపోతోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలు కలిపి సుమారు 3500 పైన ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి పదవ తరగతి వరకు బాలురు, బాలికలు కలిపి సుమారు 4.5 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి 250 మంది విద్యార్థులకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి. దీని ప్రకారం చూస్తే జిల్లాలో 1000కి మించి విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక పిడి, మూడు పిఇటి పోస్టులు అవసరం. కాని జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 30 నుంచి 40 వరకు పిఇటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హైస్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్ (పిడి)లు విధులు నిర్వహించాల్సి ఉండగా చాలా పాఠశాలల్లో పిఇటిలతోనే కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి ఏటా రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఎ) నిధుల నుంచి ప్రతి పాఠశాలకు రూ .30 వేల నుండి రూ.50 వేలు సమకూర్చారు. అందులో ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్, వ్యాయామ విభాగాలకు రూ.10వేలు ఖర్చు చేయాలని నిబంధన ఉన్నా కొంత మంది ప్రధానోపాధ్యాయులు సంవత్సరానికి రూ.5 వేలు మాత్రమే అందించారు. ఆ తరువాత ఆ నిధులను అందించిన దాఖలాలు లేవు.
క్రీడా పరికరాల కొరత
పాఠశాలల్లో వ్యాయామ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో మొక్కుబడిగా వ్యాయామ పిరియడ్‌లను నిర్వహించే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం వారానికి మూడు పిరియడ్లను మాత్రమే వ్యాయామ విద్య, మాస్‌డ్రిల్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే వారానికి మూడు పిరియడ్లు సరిపోవు అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఖాళీగా ఉన్న పిఇటిల పోస్టులను భర్తీ చేసి, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తే వారానికి ఆరు పిరియడ్లు నిర్వహణ సాధ్యమవుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. నూతన జిఓ 55 ప్రకారం 280-820 మంది విద్యార్థులకు ఒక పిఇటి ఉండాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నిబంధనలపై వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 800 మంది విద్యార్థులను ఒక పిఇటి ఎలా పర్యవేక్షించగలడని అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 నుంచి 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే జిల్లాలో 2500 మంది శిక్షణ పొందిన నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అవసరమైన పిఇటిలను నియమించి వ్యాయామ విద్య అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు సిఫార్సులు కోరుతున్నారు.

వౌలిక వసతులు అభివృద్ధి చేయాలి
లలిత్‌కుమార్ పిఇటి సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. పిఇటి పోస్టులు పెంచితేనేగాని వ్యాయామ విద్యను పిల్లలందరికీ అందించలేం. అలాగే జిఓ 55ను వ్యతిరేకిస్తున్నాం. 820 విద్యార్థులకు ఒక పిఇటి అన్నది అన్యాయం. గతంలో 250 మందికి ఒక పిఇటి ఉండాలనే నిబంధన ఉండేది. దానిని తిరిగి అమలు చేయాలి. అలాగే జిల్లాలోని పిఇటిలకు పదోన్నతి కల్పించి పిడిలుగా గుర్తిస్తే మరో వంద పోస్టులు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని కోరుతున్నారు.

యుజిసి నుండి పరిశోధనలకు రూ.39 లక్షల గ్రాంట్
విశాఖపట్నం (జగదాంబ), జూలై 17: ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్ అధ్యయన కేంద్రానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఏరియా స్టడీస్ ప్రొగ్రాంలో భాగంగా రాన్ను ఐదు సంవత్సరాలలో విభిన్న అంశాలలో పరిశోధనలు నిర్వహించడానికి వీలుగా 39 లక్షల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని వర్శిటీ విసి ఆచార్య జిఎస్‌ఎన్.రాజు తలిపారు. గురువారం ఉదయం ఎయు అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికే ఐదు దశలను పూర్తి చేసి ఆరవ దశకు చేరిందని అన్నారు. యుజిసి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఆర్థిక, రాజకీయ, రక్షణ, సహకారం తదితర అంవాలపై సార్క్ దేశాలలోని పరిస్థితులను ఈ కేంద్రం ద్వారా అధ్యయనం చేసి తగిన నివేదికలను ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని అన్నారు. సార్క్ సభ్య దేశాలలో బలమైన సహకారాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సార్క అధ్యయన కేంద్రం జరుపుతున్న అభివృద్ధి, పరిశోధనలను విసి అభినందించారు. యుజిసి, కేంద్రం ప్రభుత్వాలకు ఉపకరించే విధంగా సార్క్ కేంద్రం తనకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర సంచాలకుడు ఆచార్య ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ సార్క్ దేశాలమైన బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ దేశాలపై మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ను తమ కేంద్రం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు ఇంత భారీ మొత్తంలో యుజిసి నిధులను అందించలేదని అన్నారు. ఇప్పటి వరకూ తమ సంస్థ ద్వారా 14 పుస్తకాలు, 14 పరిశోధనా నివేదికలు, 60 పరిశోధనా పత్రాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ప్రచురించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా ప్రచురించబడుతున్న జర్నల్‌ను విసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రెక్టార్ ఆచార్య ఇఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహన్‌రావు, కేంద్రం ఆచార్యులు శ్రీమన్నారాయణమూర్తి, ఆచార్య టి.నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.

‘మనగుడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
* దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి
విశాఖపట్నం , జూలై 17: టిటిడి దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు19న నిర్వహించనున్న ఐదవ విడత మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్‌విఎస్.మూర్తి అన్నారు. గురువారం మధ్యాహ్నం టర్నర్ సత్రం ఆవరణలో ఉన్న ఉపకమిషనర్ కార్యాలయంలో దేవాదాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఉన్న అన్ని దేవాలయాలలో మనగుడి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాలని, దీనికి సంబంధించి గ్రామసంఘాలతో, భజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాలను గ్రామాలలో తిరగేలా చూడాలని అన్నారు. నగర, గ్రామ సంకీర్తన, ఆలయంలో అభిషేకం, పూజాధికాలతో పాటు భక్తులందరికీ కంకణధారణ, ప్రసాద వితరణ జరిగేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. దేవాదాయశాఖకు సంబంధించి పరిపాలనా విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఎన్.సుజాత, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, పర్యవేక్షకులు డివివి.ప్రసాదరావు, దేవాలయ కార్యనిర్వహణాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో విస్తృత కూంబింగ్
సీలేరు, జూలై 17 : ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాలను ఈనెల 28వతేదీన మావోయిస్టులు జరపడానికి పలు సన్నహాలు చేస్తున్న నేపధ్యంలో మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రా - ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గల గిరిజన గ్రామాలను వారి ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

* మరో పది రోజులు ఇదే పరిస్థితి
english title: 
vegi

రుణాల రీ-షెడ్యూల్‌తో రైతులకు ఊరట?

0
0

విజయనగరం, జూలై 17: కొత్త రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని ఆర్‌బిఐని కోరినట్టు తెలిసింది. రుణాలను ఆరేళ్లపాటు రీ-షెడ్యూల్ చేయాలని, ఏడాది మారటోరియం కల్పించాలని ఆర్‌బిఐకి నివేదించడంతో రైతులు ఊరట చెందుతున్నారు. రుణాల రీ-షెడ్యూల్‌పై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించనుందని ఆయన వెల్లడించారు. దీంతో రైతులు కాస్తా ఊరట కలుగుతుంది. ఈ ఏడాది జిల్లాలో రూ. 1220 కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో వెయ్యి కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.763 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ రుణాలపై స్పష్టత లేకపోవడంతో నేటి వరకు బ్యాంకులు కొత్త రుణాలను మంజూరు చేయలేదు. రుణాల రీ-షెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరడంతో కొత్త రుణాలకు అవకాశం లభించనుంది. జిల్లాలో మొత్తం 4,46,841 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.46 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు 3,45,424 మంది ఉన్నారు. 2.47 నుంచి 4.93 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు 67,198 మంది రైతులు ఉన్నారు. బడా రైతులు 603 మంది కాగా, 9.88 నుంచి 24 ఎకరాలు భూమి ఉన్న రైతులు 26153 మంది ఉన్నారు. వీరిలో గత ఏడాది ఖరీఫ్‌లో 1,11,856 మంది రైతులకు రూ.482.71 కోట్ల రుణాలను మంజూరు చేశారు. అలాగే రబీలో 1,24,019 మంది రైతులకు రూ.699.07 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది కూడా రూ.1220 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రుణాల మాఫీపై స్పష్టత లేకపోవడంతో ఇంత వరకు జాప్యం జరిగింది. ఇపుడు రుణాల రీ-షెడ్యూల్ చేయాలని నిర్ణయించడంతో కొత్త రుణాల మంజూరుకు అవకాశం ఏర్పడింది. అయితే దీనిపై విధి విధానాలు ఇంకా రావల్సి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు.

పిల్లల్ని బాగా చదివించండి: మంత్రి
విజయనగరం, జూలై 17:‘ప్రభుత్వం నుంచి మీకు అందజేసిన మొత్తాన్ని వృధా చేయకండి... మీ పిల్లలను బాగా చదివించండి... తెలుగు ప్రజలు ఆపదలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకుంటాం’ అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణశాఖా మంత్రి డాక్టర్ కె.మృణాళిని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చెన్నై దుర్ఘటన బాధితులకు ఆర్థిక సాయం కింద చెన్నై ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆమె బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు మంజొరు చేసేలా చూశామన్నారు. దుర్ఘటన విషయం తెలియగానే తాను, ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ఆర్డీవో వెంకట్రావు, ఇతర అధికారులు చెన్నై వెళ్లి అక్కడ దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు. బాధిత కుటుంబాలకు దుస్తులు, భోజనాలు, వసతి కల్పించాలని, మృతదేహాలకు పోస్టుమార్టం వేగం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, వారి సూచనల మేరకు రాత్రి, పగలు అక్కడే ఉండి పనిచేశామన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా బాధితులకు సమాచారం చేరవేశామన్నారు. బాధితులందరికీ, గృహాలు లేని వారికి గృహాలు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. వారి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామన్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన 24 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా, రూ.25వేలు ఖర్చుల నిమిత్తం ఒకొక్కరికి రూ.2.25 లక్షలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. 15 మంది బాధితులకు అదనంగా రూ.50వేలు ఆపద్భందు పథకం కింద అందజేశారు. దాంతోపాటు ఇటీవల ఒక్కొ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు చెక్కులను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక సాయం అందితేనే సార్థకత ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. బాధిత కుటుంబాలకు జనశ్రీ యోజన ద్వారా మూడు కుటుంబాలకు రూ.75 వేలు చొప్పున బీమా సొమ్ము అందజేస్తామన్నారు. ఎఎవై కింద రేషన్ కార్డులను మంజూరు చేస్తామని, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు మాట్లాడుతూ జిల్లా నుంచి వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకం నుంచి వేతనాలను పెంపుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలు తమ పిల్లల్ని బాగా చదివించాలని, ఏ అవసరం ఉన్నా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జేసి బి.రామారావు, సబ్‌కలెక్టర్ శే్వతామహంతి, ఎజెసి యుసిజి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకటరావు, ఆర్డీవో వెంకటరావు, ఐకెపి పిడి జ్యోతి, గృహనిర్మాణశాఖ పి.డి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
విజయనగరం , జూలై 17: పట్టణంలో వార్డుల్లో అభివృద్ధిపనులు చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. పట్టణంలో పలు చోట్ల చేపడుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో కాలువల్లో పూడిక పేరుకుపోతోందన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 25వ తేదీవరకు అన్నివార్డుల్లో కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీయాలని నిర్ణయించామన్నారు. అలాగే వార్డుల్లో అభివృద్ధిపనుల చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఉప్పు అప్పలరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్బారావుతదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ సెస్సు వసూళ్ల లక్ష్యం రూ. 10.75 కోట్ల్లు
విజయనగరం , జూలై 17:జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 10.75 కోట్ల రూపాయల మార్కెట్ సెస్సు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్‌డైరెక్టర్ బి.శ్రీనివాసరావుతెలిపారు. గురువారం ఇక్కడ ఆర్ అండ్ బి రైతుబజారును ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇంతవరకు 2.76 కోట్ల రూపాయల సెస్సు వసూలు చేశామన్నారు. జిల్లాలో అన్ని మార్కెట్‌యార్డుల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయనగరం వ్యవసాయ మార్కెట్‌యార్డులో భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మూతపడిన పార్వతీపురం భూసార పరీక్షా కేంద్రాన్ని పునరుద్ధరించాలని, సాలూరులో మొబైల్ పశువైద్యశాల నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అలాగే అన్ని రైతుబజార్లల్లో ఉల్లిపాయలను విక్రయించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. దీనిపై మార్కెటింగ్ జాయింట్‌డైరెక్టర్, జిల్లా జాయింట్‌కలెక్టర్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబజారు ఎస్టేట్ అధికారి చప్ప వెంకట సత్యనారాయణ (సతీష్) తదితరులు పాల్గొన్నారు.

‘కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి’
విజయనగరం , జూలై 17: కేంద్రంలో ప్రధాని మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాదు పిలుపునిచ్చారు. మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాల పట్ల నిరసన దినం పాటించాలని ఇఫ్టూ రాష్ట్ర కమిటీ పిలుపుభాగంగా గురువారం ఇక్కడ నారాయణం సత్రంలో ఇఫ్టూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రసాదు మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ఎంతో నమ్మకంతో మోడీని గెలిపిస్తే రెండునెలలు గడకముందే కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుస్థిర ప్రభుత్వంతో సుస్థిర పాలన ఊదరగొట్టి మోడీ గద్దెనెక్కారని విమర్శించారు. మోడీ సర్కారు రాకతో కార్పోరేట్ యాజమాన్యాలు పండుగ చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. అయితే సుస్థిర ప్రభుత్వం కార్మిక వర్గానికి మొదటి కానుకగా కార్మిక వ్యతిరేక సవరణలతో కార్మిక సవరణలతో కార్మిక చట్టాలకు
శ్రీకారం చుట్టిందన్నారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావు మాట్లాడుతూ కార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఈ సదస్సులో ఇఫ్టూ నాయకులు ధవళ లక్ష్మణరావు, పి.రమణి, ఆర్.అప్పలరాజు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు పి.మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
బాలారిష్టాలు దాటని బంగారు తల్లి పథకం
గజపతినగరం, జూలై 17: గత ఏడాది మే1వ తేదినా అప్పటి ముఖ్య మంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆడపిల్లల తల్లిదండ్రులు కోసం ప్రారంభించిన బంగారుతల్లి పథకం చట్టం చేసినప్పటికీ బాలరిష్టాలు మాత్రం ఇంకా వీడలేదు. ఇద్దరు ఆడపిల్లల వరకు ఈ పథకం వర్తించేటట్లులుగా చట్టం చేయడం జరిగింది. పథకం ప్రారంభించి నేటికి 14 నెలలు పూర్తికావస్తున్నది. ఈ పథకంలో ఉన్న లోటుపాటులుతో పాటు పథకానికి అవసరమైన నిధులు కేటాయించి లబ్ధిదార్లుకు సకాలంలో అందించాల్సిన నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరగడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఇంతవరకు మండలంలో 337 మంది లబ్ధిదారులు బంగారుతల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 172 మందికి పథకం వర్తిస్తూ తొలివిడత వాయిదాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. పథకం వర్తించే 172 లబ్ధిదారుల ఖాతాలకు ప్రసవ ఖర్చుల కింద 4.32 లక్షల రూపాయలు జమ అయ్యింది. 337 మందిలో 172 మందిని ఎంపికచేశారు. మిగిలిన వారికి మొదటి విడత 2500 రూపాయలు (ప్రసవ ఖర్చులు నిమిత్తిం) విడుదల కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ పథకం ఇందిరాక్రాంతి పథం ద్వారా అమలు జరుగుతుండగా అధికారులు కూడా పథకం నిదులు విడుదలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అధికారులు స్పందించి దీనిపై సరైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

మొలకెత్తని విత్తనాలతో రైతుల ఆందోళన
లక్కవరపుకోట, జూలై 17: ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే అన్నదాతలకు ఎప్పుడూ ఎదోరూపంలో కష్టాలు వేధిస్తునే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక తీవ్రమనోవేదన పడ్డ రైతులకు ఇప్పుడు విత్తన పోటు తగిలింది. మండలంలోని పలు గ్రామాలలో ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాంబమసూరి విత్తనాలు, శ్రీరామపురం, రెల్లిగౌరమ్మపేట తామరాపల్లి, కళ్లేపల్లి, గొల్జాం గ్రామాల రైతులను దెబ్బతీసాయి. ఇప్పటికే వర్షాలు ఆలస్యంకావడం వలన ఏరువాకం ఆలస్యమైందని ఆందోళన చెందుతున్న రైతులు, విత్తనాలు నాటకపోవడంతో ఉభాలు మరింత ఆలస్యవౌతాయని భాదపతున్నారు. మళ్లీ విత్తనాలు సేకరించి నారుపోయాల్సి రావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఆసలే వర్షాభావ పరిస్ధితులు.. దానికితోడు ఈ సమస్యలు .. ఈ ఏడాది కూడా కరువు బారిన పడతామోమనని పలు గ్రామాలరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి విత్తనాలు మొలకెత్తకపోవడంపై పరిశీలించి అధికారులకు నివేధిక సమర్పిస్తానని వ్యవసాయాధికారి గోకుల కృష్ణ తెలిపారు.

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు తప్పనిసరి
విజయనగరం , జూలై 17: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ అదేశించారు. రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖల అధికార్లుతో గురువారం తన ఛాంబర్‌లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, తదితర అంశాలపై సమీక్షా జరిపారు. జిల్లాలో 1616 బోరు బావులు పనిచేస్తున్నాయని, 827బోరు బావులకు మరమ్మతులు చేయాల్సి ఉందని ఆర్‌విఎం ఇంజినీరింగ్ అధికార్లు జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తు విద్యాశాఖ, ఆర్‌విఎం అధికార్లు సంయుక్తంగా గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేస్తున్న బోర్లు, టాయిలెట్లు మరమ్మతుల చేయించవలసిన వాటిని స్వయంగా పరిశీలించి ఖచ్చతమైన వివరాలతో రావాలన్నారు. పలు పాఠశాలల్లో సగానికి పైగా టాయిలెట్ల్ ఉంటాయని అవసరమై చోట మరమ్మతులు, కొత్తవి మంజూరుకు ప్రతి పాదించాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌డబ్యుఎస్, ఎంపిడిఓ, ఎంఇఓలు చర్చించుకొని ఒకే నివేదికను ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలకు నిర్వహణ నిధులున్నాయని వాటిలో కొంత మొత్తాన్ని వాడి బ్లీచింగ్ పౌడర్ కొని పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. మున్సిపాల్ పాఠశాలల్లో కూడా విదమైన తనిఖీలు చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.రామారావు, సబ్ కలెక్టర్ శే్వతామహంతి, ఆర్‌విఎం పిఓ శారద, డిఇఓ కృష్ణారావు, డిప్యుటి డిఇఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

కొత్త రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ రుణాలను మాఫీ
english title: 
re

పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

0
0

విజయనగరం, జూలై 18: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు పనిచేసేలా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ఆర్‌ఎంఎస్‌ఎ కింద రూ.25వేలు మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో ఆయా పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి వాటిని వినియోగంలోకి తేవాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. ఈ వర్షాలకు గ్రామాలు, పాఠశాలల రోడ్లు చిత్తడిగా మారుతాయని అందువల్ల బ్లీచింగ్ కొనిపించి చల్లించాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో కుళాయి కనెక్షన్ల కోసం కమిషనర్లను సంప్రదించాలన్నారు. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లను బయటివాళ్లు వినియోగించడం వల్ల అధ్వాన్నంగా మారుతున్నాయని ఆర్వీఎం ఇంజనీరు తెలుపగా, మున్సిపల్ పాఠశాలలకు ప్రహరీ గోడలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పాఠశాలల నిర్వహణ నిమిత్తం హెడ్‌మాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని డిఇఒ కృష్ణారావును ఆదేశించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో చేపడుతున్న విషయాలపై తనకు మొబైల్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం జిల్లా అంతటా చేపట్టిన కార్యక్రమాల నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జెసి రామారావు, ఎజెసి నాగేశ్వరరావు, ఆర్వీఎం పివో శారద, డిపిఒ మోహనరావు, పంచాయతీ అధికారి మోహనరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ మెహర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

‘స్కూళ్లలో సదుపాయాల కల్పన’
విజయనగరం , జూలై 18: పట్టణంలో మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం ఉండాలనే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడ మున్సిపల్ సమావేశ భవనంలో మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో అనేక పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల అన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు మంచినీటి సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలని, నాణ్యమైన విద్యాబోధన చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, మున్సిపల్ ఇంజనీర్ ఎం.బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మత్స్యరాజు తదితరులు పాల్గొన్నారు.

అందని ‘సేవ’లు!
బొండపల్లి, జూలై 18: ఉదయం నుంచి పడిగాపులు..మీసేవ కేంద్రం తెరుస్తారని ఎదురుచూపులు, గంటలు కొద్ది నిరీక్షిణ, వర్షాన్ని సైతం లెక్కచేయని వృద్ధులు, వికలాంగులు..అయినా ప్రయోజనం శూన్యం ఇది బొండపల్లి మీసేవ పరిస్ధితి. సామాజిక పింఛన్లు ఆధార్‌కు అనుసందానం చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో సర్కర్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీలోగా పింఛన్‌దారులు ఆధార్ నెంబర్లు నమోదుచేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీచేసింది. దీంతో ఆధార్ కోసం గ్రామాల్లో కార్యదర్శులు ఇంటింటికి వెళుతున్నారు. అయితే ఆధార్ కార్డులు లేనివారు నమోదుచేయించుకోవడానికి మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. బొండపల్లి దత్తిరాజేరు, గజపతినగరం మండలాలకు చెందిన పింఛన్‌దారులకు బొండపల్లిలోని మీసేవ ద్వారానే ఆధార్ తీస్తున్నారు. దీంతో శుక్రవారం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మీసేవ కేంద్రం వద్దకు ఉదయం నుంచి పడిగాపులు కాచినా తెరవకపోవడంతో వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయక ఆటోలు ద్వారా మీసేవ కేంద్రానికి చేరుకున్నారు. అయినా మీసేవ తెరవకపోవడంతో గంటలు కొద్ది నిరీక్షించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.

‘బిజెపిని బలోపేతం చేయాలి’
విజయనగరం, జూలై 18: బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివివి గోపాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి అవసరమైన చర్యలను సూచించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకుంటూ ముందుకు పోవాలన్నారు. అందుకు క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ఆసక్తి కనబరుస్తున్న వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ప్రాంతాల్లో ఒక్కొ వార్డు నుంచి కనీసం పది మందిని చేర్చుకున్న 400 మంది అవుతారని ఆయన సూచించారు. తదుపరి సమావేశానికి వచ్చే సరికి సభ్యత్వం పెంచడంతోపాటు పార్టీ పటిష్టానికి తీసుకున్న చర్యలను వివరించాలన్నారు.
ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాకలపాటి సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.

‘డైట్‌సెట్‌కు అర్హత కల్పించాలి’
విజయనగరం, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు డైట్‌లో అవకాశం కల్పిస్తామని పేర్కొనడంతో తామంతా ఆందోళన చెందుతున్నామని డైట్‌సెట్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని తిరుమల డైట్, వేణుగోపాలపురంలోని ప్రభుత్వ డైట్‌లో చదువుతున్న అభ్యర్థులు శుక్రవారం జిల్లా కలెక్టర్ నాయక్‌ను కలుసుకొని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము టెట్ పరీక్ష లేకుండానే డైట్‌లో చదువుతున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్ 2 నాటికి తమ కోర్సు పూర్తవుతుందని వివరించారు. అయితే ప్రభుత్వం సెప్టెంబర్ 5న డైట్‌సెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించిందని, అదే జరిగితే తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. లేదా తమకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించిన ఇబ్బంది లేదని వారు స్పష్టం చేశారు. డైట్‌సెట్‌కు తమను అర్హులుగా ప్రకటించాలన్నదే తమ డిమాండ్ అని విద్యార్థులు రామారావు తదితరులు తెలిపారు.

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు పనిచేసేలా
english title: 
collector
Viewing all 69482 articles
Browse latest View live