Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లండన్ బాబులు వస్తున్నారు

$
0
0

తమిళంలో విజయవంతమైన ఆండవన్ కట్టాలై చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నూతన కథానాయకుడు రక్షిత్ హీరోగా, కలర్స్ స్వాతి కథానాయికగా మారుతీ టాకీస్ పతాకంపై ఎవిఎస్ స్టూడియోస్ సమర్పణలో చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లండన్ బాబులు’ అనే పేరు ఖరారు చేశారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ- తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా కథనం నచ్చి తెలుగులో చేస్తున్నామని, కథానాయకుడు కొత్తవాడైనా సీనియర్ నటుడిగా నటిస్తున్నాడని, ప్రతి ఒక్క పాత్ర సినిమాలో వైవిధ్యంగా ఉంటుందని, చివరికి హీరో లండన్‌కు ఎలా వెళ్లాడు అనేది ప్రధాన కథాంశమని ఆయన తెలిపారు. అలీ, మురళీశర్మ, రాజా రవీందర్, జీవా, ధన్‌రాజ్, సత్య, అజయ్‌ఘోష్, సాయి, వేణు, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్:ఉద్ధవ్, దర్శకత్వం:చిన్నికృష్ణ.


Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>