గద్వాలరూరల్, జనవరి 25: రాష్ట్రంలోనే అతి చిన్న ఖురాన్‌ను గట్టు మండల కేంద్రంలో ముస్లిం పెద్దలు పఠించారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా గట్టులోని జామియా మసీదులో ముస్లిం మత పెద్దలు సంప్రదాయబద్ధంగా ప్రార్థనలు నిర్వ హించిన అనంతరం కేవలం ఒక అంగుళం కలిగిన ఖురాన్‌ను పఠించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పెట్టె నుండి బయటకు తీసి పఠించిన అనంతరం తిరిగి పెట్టెలో భద్ర పరుస్తారు. తిరిగి వచ్చే సంవత్సరం మిలాదున్ నబీ సంద ర్భంగా అట్టి ఖురాన్‌ను బయటకు తీస్తామని మత పెద్దలు తెలిపారు. ఖురాన్‌ను చదవడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని ముస్లింల నమ్మకం. ఈ కార్యక్రమంలో గౌస్, బురాన్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే
english title:
m
Date:
Saturday, January 26, 2013