చేగుంట, జనవరి 25: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతుంది సీమాంధ్ర నాయకులు, జగన్ కోవర్టులు, టిడిపి పెద్దలేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. శుక్రవారం చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుతగులుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల అక్రమ ఆస్థులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆలోచన చేస్తున్న తరుణంలో కెవిపి రాంచంద్రారావు డిల్లీ పెద్దలను కలిసి అడ్డుతగలడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. కెవిపిని ప్రజాకోర్టులో దోషిగా నిలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయం ఆసన్నవౌతుందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రాహుల్‌గాంధీ సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తుందన్నారు. ప్రజా పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ సాధించుకుంటామన్నారు. తెలంగాణకు అడ్డుతగులుతున్న సీమాంధ్ర దగాకోరుల కుట్రలు కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరుతో స్థాపించిన పార్టీ నాయకులు అక్రమ ఆస్థులు, ధనార్జనేకోసం పాకులాడుతూ హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం రాజీనామాలు కాదు సమిష్టి రాజీనామాలు అవసరమన్నారు. ఎంపిలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగిద్దామన్నారు. ఈ సమావేశంలో గౌడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, కిష్టాగౌడ్, రాములుగౌడ్, ఆంజనేయులుగౌడ్, కిషన్‌గౌడ్, నర్సాగౌడ్, యాదాగౌడ్, చంద్రాగౌడ్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
* ఎంపి మధుయాష్కీగౌడ్
english title:
m
Date:
Saturday, January 26, 2013