గౌతమి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓంకార్, గౌరీశర్మ జంటగా రూపొందించిన చిత్రం ‘అనార్కలి’. పి.ఎన్.రాయ్ దర్శకత్వంలో సక్కుబాయి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ప్రేమ అనగానే అనార్కలి ప్రేమ గుర్తుకురావడం సహజమని, ప్రపంచంలో గొప్ప ప్రేమజంటగా సలీం- అనార్కలి మిగిలిపోయారని, ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల పాత్రలు కూడా అదేవిధంగా ఉత్తమంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన వేలాది ప్రేమకథలను ప్రేక్షకులు ఎటువంటి బోరు లేకుండా చూశారని, ఈ చిత్రంలో కూడా ప్రేమలోవుండే గొప్పదనాన్ని కొత్తదనంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సక్కుబాయ్ తెలిపారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, ప్రభ, దేవిశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వెంకట హనుమ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలు:ఎం.వి.ఎస్.సుబ్రహ్మణ్యం,
ఎడిటింగ్:మోహన్ రామారావు,
దర్శకత్వం:పి.ఎన్.రాయ్.
గౌతమి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓంకార్,
english title:
j
Date:
Thursday, May 30, 2013