రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై పవన్ వడయార్ దర్శకత్వంలో లగడపాటి శ్రీ్ధర్, శిరీష నిర్మించిన చిత్రం ‘పోటుగాడు’. మంచు మనోజ్ ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లతో జత కట్టడం విశేషం. చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నా రు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తమిళ దర్శకుడు లింగుస్వామి ‘పోటుగాడు’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడితో నిర్మిస్తున్నామని, యూనిట్ అంతా కలిసి ఈ చిత్రా న్ని తమ చిత్రంగా భావించి పనిచేశారని, ముఖ్యం గా కథానాయకుడు మనోజ్ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాడని, మరో వారం రోజుల్లో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుతామని తెలిపారు. కన్నడంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దామని, 45 రోజుల్లో షూ టింగ్ పూర్తి చేసిన ఈ సినిమా ఎంతో రిచ్‌గా వచ్చిందని, ఇప్పటివరకూ విడుదలైన ఆడియోలలో బెస్ట్ ఆడియోగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు పవ న్ వడయార్ తెలిపారు. కార్యక్రమంలో విష్ణు, మనోజ్, మంచులక్ష్మి, దర్శకుడు మారుతి, జె.ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్ నవాజ్, జె.బి పాల్గొన్నారు. సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా గోయెంకా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె.్ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీ్ధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై పవన్ వడయార్
english title:
potugadu
Date:
Monday, June 17, 2013