నల్లగొండ, జూన్ 27: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో అధికార యంత్రాంగం తీవ్ర మల్లగుల్లలు పడుతు గెజిట్ విడుదలలో జాప్యం చేస్తున్న తీరుపై రాజకీయ పక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల అధికారిక గెజిట్ ప్రకటన జారీపై రేపు మాపు అంటు జిల్లా పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదంటు, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల నేపధ్యంతోనే జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులు రిజర్వేషన్ల సమాచారంపై పారదర్శకంగా వ్యవహరించకుండా గోప్యత పాటిస్తున్నారంటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిసి రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా తీసుకుని ఖరారు చేయడం..ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాష్ట్ర యూనిట్‌గా పరిగణించడం వంటి నిబంధనల నేపధ్యంలో అధికారులు జీవో నెంబర్ 293నిబంధనల మేరకు వివాదరహితంగా రిజర్వేషన్ స్థానాలను వస్తారన్నారు. డిఆర్‌డిఎ పిడి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రుణాలు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్ని మండలాలలో రుణం తీసుకున్న సంఘాల వారిని కలిసి రుణం తిరిగి చెల్లించేలా కృషి చేస్తుందన్నారు. వసూళ్లు తక్కువ ఉన్న మండలాలపై దృష్టిని కేంద్రీకరించి రుణాల చెల్లింపునకు కృషి చేస్తున్నారన్నారు. రుణాలు మంజూరైన మండలాలకు సిబ్బంది వెళ్లి సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి వాయిదాలు చెల్లించినట్లయితే వడ్డీ ఉండదని తెలుపుతున్నామని బ్యాంకర్లు ఇందుకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లు, ఐకెపి సిబ్బందిల సమస్యలపై వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘాలకు అందించే రుణాల గురించ తెలియజేశారు. ఈ సమావేశంలో నాబార్డు ఎజి ఎం వీరశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ జేమ్స్, వివిధ బ్యాంకుల అధికారులు, ఐకెపి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
సమభావన సంఘాలకు వడ్డీలేని రుణాలందించాలి
జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ , జూన్ 27: సమభావన సంఘాలకు మంజూరైన వడ్డీలేని రుణాలందించడంలో బ్యాంకర్లు చొరువ చూపాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. గురువారం టిటిడిసి సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకెపి, వెలుగు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లు లబ్ధిదారులను ప్రొత్సహించి వారికి సకాలంలో రుణాలందించేందుకు ముందుకు రావాలన్నారు. అదేవిధంగా రుణాలు తిరిగి చెల్లించేలా వారిని చైతన్య పరిచినట్లయితే రుణాలు త్వరితగతిన వసూళ్లవుతాయని తద్వారా ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతుందని బ్యాంకర్లు, అధికారులను కోరార. లబ్ధిదారునికి బ్యాంకర్లు వివిధ పథకాల కింద రుణాలందించి ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యేలా సహకరించాలని దీని ద్వారా లబ్దిదారులు తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు ముందుకు గుర్తించ లేకపోయారన్న గుసగుసలు, విమర్శలు ప్రభుత్వ యంత్రాంగంలోనే వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఖరారు చేయడంలో జనాభాతో పాటు ఒక పంచాయతీ 1995, 2001, 2006లలో ఏ వర్గానికి రిజర్వ్ చేయడమైందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సివుండగా ఈ అంశాన్ని విస్మరించినట్లుగా తెలుస్తుందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో కొన్ని చోట్ల రిజర్వ్ స్థానాలు ఇష్టారాజ్యంగా ఎంపిక చేశారని విపక్షాల నుండి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి, నల్లగొండ డివిజన్ మండలాల్లో పంచాయతీ రిజర్వేషన్ల ఖరారులో అధికారులు పొరపాట్లు చేశారని అందుకే మళ్లీ వాటిని సరి చేసి చూసుకుంటున్న క్రమంలో రిజర్వేషన్ల గెజిట్ విడుదలలో జాప్యానికి కారణమవుతుందన్న ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఎంపిడివోలకు ఈ దఫా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై లోతైన అవగాహాన లేకపోవడం సమస్యగా మారగా ఈ విషయంలో నిపుణులైన కొంత మంది ఎంపిడివోలతో మిగతా మండలాల రిజర్వేషన్లను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీల జనాభా పరిమితంగా ఉన్న రిజర్వ్ చేయాల్సిరావడం కూడా గందరగోళానికి దారితీసింది. అయితే ఇప్పటికే మండలాల్లో స్థానిక అధికారుల ద్వారా రిజర్వేషన్లపై దాదాపుగా స్పష్టత వచ్చినప్పటికి గెజిట్ విడుదల జరిగితే కదా అన్నట్లుగా పరిస్థితి ఉండటంతో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారంలో ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ జూలై 2,3తేదిలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎన్నికల నిర్వాహణ తప్పదన్న భావనతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతుండగా పల్లెల్లో పంచాయతీ పోరు క్రమంగా ఊపందుకుంటుంది.
మున్సిపాలిటీని ముట్టడించిన కార్మికులు
సూర్యాపేట, జూన్ 27: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సిఐటియు అనుబంధం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్ధానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ ఉద్యోగులను లోనికి వెళ్లకుండా కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చినపాక లక్ష్మినారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీసవేతనాలు చెల్లించకుండా వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు. వారికి రూ.12,500లచొప్పున వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగుల పిఎఫ్ కటింగ్‌లకు సంబంధించిన స్లిప్‌లను అందించాలని కోరారు. అర్హులైన కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు వర్కర్లకు పబ్లిక్ హెల్త్ పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు జిపిపి ఎకౌంట్ ప్రారంభించాలని డిమాండ్‌చేశారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సిఐటియు డివిజన్ కార్యదర్శి వెంపటి గురూజీలు మాట్లాడుతూ పని సమయంలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి కాంట్రాక్టు కార్మికులకు రూ. 50000 ఇన్సూరెన్స్ కల్పించాలని మొత్తం ప్రీమియం మున్సిపాలిటీ వారే భరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మరణం సంభవిస్తే ఖర్చులకు రూ. 10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కాంట్రాక్టు కార్మికులందరికి ఇళ్లు, ఇండ్ల స్ధలాల నిర్మాణం చేపట్టాలని కోరారు 2011 మార్చి, ఏప్రిల్‌లో పెరిగిన వేతనాలు వెంటనే ఇప్పించాలని వారంతరపు సెలవులు, పండుగ సెలవులు, ఇఎస్‌ఐ స్మార్ట్‌కార్డులు వ్యక్తిగత ఎకౌంట్‌లు అమలు కల్పించాలని కోరారు. పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్నట్లుగానే యూనిఫామ్, సబ్బులు, నూనె, చెప్పులు, మాస్కులు నైట్‌డ్యూటీలో పనిచేసేవారికి రేడియం జాకెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిచో రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలను ఉదృతంచేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సమ్మి, నాయకులు పెంటయ్య, వీరాస్వామి, దండు లక్ష్మయ్య, కృష్ణ, యాకమ్మ, భిక్షం, రమణ, సైదులు, మారయ్య, సైదమ్మ, బండారు నాగమ్మ, దేవదానం, బక్కమ్మ, సతీష్, తలారి వెంకన్న, కాసర్ల లింగయ్య, నాగరాజు, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ వివరాలు విధిగా సమర్పించాలి
భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య
చౌటుప్పల్, జూన్ 27: ఆధార్ వివరాలను విధిగా సమర్పించాలని భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య కోరారు. చౌటుప్పల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జూలై ఫస్ట్ నుంచి నగదు బదిలీ పథకం ప్రారంభమవుతున్న దృష్ట్యా లబ్ధిదారులు విధిగా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, సెల్ నెంబర్లను సమర్పించాలని కోరారు. ఆధార్, బ్యాంకు ఖాతాలను రేషన్ డీలర్లకు ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్లీ వద్దకూడా సమర్పించాలని సూచించారు. అమ్మహస్తం పథకం కింద సరఫరా చేస్తున్న తొమ్మిది రకాల సరుకులను తీసుకోవాలన్న నిబంధనలు లేవన్నారు. ఇష్టమైన సరుకులను మాత్రమే తీసుకోవచ్చన్నారు. ముందుగా లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి డిడిలు చెల్లించాలని సూచించారు. అమ్మహస్తం సరుకుల సరఫరాలో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. అమ్మహస్తం పథకం ద్వారా అందిస్తున్న సరుకుల ధరలు, స్టాక్ వివరాలను అందుబాటులో పెట్టాలన్నారు. గ్రామ ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలలో ఆహార పదార్ధాలు నాణ్యంగా లేవని ఫిర్యాదులు చేయడంతో సంబంధిత అధికారులతో తనిఖీలు జరిపిస్తానని హామీ ఇచ్చారు. గ్యాస్ డీలర్లు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ఫోన్ చేస్తే సరైన సమాధానం రాకుంటే తమకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల తహశీల్దార్ కొప్పుల వెంకట్‌రెడ్డి, ఎఎస్‌ఓ అనురాధ, సివిల్ సఫ్లై డిటి ఎల్లేష్, ఆర్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, పాశం సంజయ్‌బాబు, రిక్కల సుధాకర్‌రెడ్డి, జొన్నగంటి లింగస్వామి, భీమిడి ముత్యంరెడ్డి, ముస్కు నరసింహా, ఆకుల ధర్మయ్య, తాళ్ల యాదగిరి, సామిడి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే రిజర్వేషన్‌లు
గ్రామపంచాయతీ రిజర్వేషన్‌లను ప్రభుత్వ నిబంధనల మేరకే కేటాయించామని భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య తెలిపారు. గురువారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ రిజర్వేషన్‌లను అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతే జిల్లా కలెక్టర్‌కు అందజేశామన్నారు. ఎలాంటి అనుమానాలున్నా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోని పూర్తి సమాచారం తీసుకోవచ్చని చెప్పారు. ఇంకా అనుమానాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.
రైతులకు విత్తనాలు అందించాలని ధర్నా
గుండాల, జూన్ 27: రైతులకు విత్తనాలు, ఎరువులు అందించాలంటూ గురువారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద మండల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పత్తిరైతుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమయ్యే కల్తీలేని విత్తనాలు, ఎరువులను అందించాలని, మండల కేంద్రాన్ని కరవు మండలంగా ప్రకటించి 10కోట్ల రూపాయలతో సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు వడ్డీలేని రుణాలందించి 60సంవత్సరాల పైబడిన రైతులకు 3వేల పించన్లు చెల్లించాలని, రైతులకు జాబ్‌కార్డులతో సంబంధం లేకుండా ఉపాధి పనిని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటి తహశీల్దార్ అంజయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె.హరిశ్చంద్ర, మల్లేష్, కృష్ణమూర్తి, నర్సిరెడ్డి, రాములు, మల్లయ్య, కృష్ణయ్య, యాదయ్య, బుచ్చిరాములు, రాములు, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
5 నుండి బిఇడి రెగ్యులర్ పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలు
నల్లగొండ రూరల్, జూన్ 27: మహాత్మాగాంధీ యూనివర్సిటీ బి ఇడి రెగ్యూలర్ పరీక్షలను జులై 5నుండి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కట్ట నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకుగాను జిల్లా వ్యాప్తంగా 13పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ పట్టణంలో నాలుగు కేంద్రాలు సూర్యాపేటలో 3, భువనగిరిలో 2, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడలో ఒక్కో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 5,200మంది అభ్యర్థులు హజరవుతున్నట్లు తెలిపారు. జులై 5న పౌండేషన్ ఆఫ్ ఎడ్యూకేషన్, 8న తరగతి నిర్వాహణ, 10న స్కూల్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ ఆఫ్ ఎడ్యూకేషన్, 12న ఎడ్యూకేషన్ ఎవల్యూషన్ 15న మెత్తడ్స్ ఆఫ్ టీచింగ్ 1, 17న ఫిజికల్ సైన్స్ 19న ఇంగ్లీష్, 22న లాంగ్వేజ్‌పరీక్షలు నిర్వహించనున్నారు.
జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో అధికార యంత్రాంగం
english title:
g
Date:
Friday, June 28, 2013