Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆనాటి పరిమళం?

$
0
0

ఆ పాప వయసు ఎనిమిదేళ్లు. ఐతేనేం - సరిగమలను అట్నుంచి ఇటు ఇట్నుంచీ అటూ తెగ పాడేస్తూ.. రాగాలాలపిస్తూ -సంగీత జగత్తు అచ్చెరువొందేలా చేస్తోంది. కేరాఫ్ అడ్రస్ గంగూలీ కుటుంబ వారసురాలు. ‘గంగూలీ’ అంటే ఎక్కడో విన్నట్టు ఉందే? ఇప్పుడూ సరిగ్గా మ్యూజిక్ ‘ట్రాక్’లోకి వచ్చారు. అలనాటి సుప్రసిద్ధ గాయకుడు కిషోర్ కుమార్ మనవరాలు.. అమిత్‌కుమార్ పుత్రికారత్నం - ముక్తిక. ఈ నెలలో తన తాతగారి స్మృత్యర్థం రిలీజ్ చేయబోతున్న ఆల్బమ్ ‘బాబా’లో పాడేందుకుగాను గత కొద్ది నెలలుగా ప్రాక్టీస్ చేస్తోందామె. రికార్డింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. రెండేళ్లుగా నిరంతర సంగీత సాధనలో తల మునకలైన ముక్తిక - త్వరలోనే సురేష్ వాడేకర్ స్కూల్‌లో చేరబోతోంది. అక్షర పద బంధాలను ఎక్కడ విడగొట్టాలో.. ఏ పదాన్ని ఎంత తీయగా ఆలపించవచ్చో - ఇట్టే నేర్చేసుకుంటోంది. తాతగారి కలను నెరవేర్చబోతున్నా. పై నుంచీ ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి అంటూ తెగ మురిసిపోతోంది. డిసెంబర్ 15నాటికి ఈ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ కానుంది. మరో కొసమెరుపు ఏమిటంటే- ఆ ఆల్బమ్‌లోని పాటలను రచించింది కిషోర్‌కుమార్ సతీమణి, అలనాటి అందాల నటి లీనా చంద్రవర్కర్.

ఆ పాప వయసు ఎనిమిదేళ్లు. ఐతేనేం - సరిగమలను అట్నుంచి ఇటు ఇట్నుంచీ అటూ తెగ పాడేస్తూ..
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles