Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గేటు దగ్గర గాడ్జెట్ గోల!

$
0
0

ఎ-డ-వా అను

బి-వై-ఓ-డి

ఇదేం గోలండీ

ఎ-డ-వా అంటూ..

ఇదేదో ఎదవా

అన్నట్టుంది అని

ఫీలవ్వకండి. ఆమధ్య

తెలుగులో ఎవడిగోల

వాడిది అని ఒక

సినిమా వచ్చింది

గుర్తుందీ..

అదన్నమాట.

కాకపోతే, ఎవరి

డబ్బా వారిదే (ఎవరి

డబ్బు వారిదే) అని

కూడా చెప్పుకోవచ్చు.

అంటే, మీరు ఉద్యోగం

చేస్తున్నా సరే,

మీతంటా మీరు

పడాల్సిందే. అదే దీని

వెనుక రహస్యం. దీన్లో

అసలు సంగతేంటో

చెబుతా వినండి. మీ

అందరికీ మొబైల్

ఫోన్, డిజిటల్ కెమెరా,

టాబ్లెట్, లాప్‌టాప్-

ఇన్నీ దేహంలో

భాగాల్లాగా

అయిపోయాయి కదా.

ఐతే, మీరు ఖర్మగాలి

ఏదో ఉద్యోగంలో

చేరారనుకోండి.

అక్కడ గేటు దగ్గరే

అన్నిటినీ జమ చేసిన

తర్వాతే ఆఫీస్‌లోకి

వెళ్లాల్సిన అవసరం

ఎంతో ఉంది. కారణం

మీ సంస్థ మీ సొంత

గాడ్జెట్స్‌ను తన

ఆఫీసులోకి

అనుమతించకపోవడ

మే. దీనివల్ల అటు

గేటు దగ్గర వదిలేసి

లోపలికి

వెళ్లినప్పటినించీ

మీకు అవి భద్రంగా

ఉంటాయా? లేదా?

అని ధ్యాసంతా

వాటిమీదే ఉంటుంది.

చిత్తం చెప్పులమీద,

భక్తి

దేవుడిమీదన్నట్టు.

అంతేకాదు, మీ సంస్థ

కూడా టెన్షన్లోనే

ఉంటుంది. గేటు దగ్గర

ఏదన్నా చోరీనో,

దొమ్మియో జరిగితే

ఆయా గాడ్జెట్లను

మీకు

అప్పగించాలంటే

కష్టం, నష్టం- రెంటినీ

భరించాల్సిందే కదా.

దాదాపు 37 ఏళ్ల

కిందట వచ్చిన

ముత్యాలముగ్గు

సినిమాలో అన్నట్టు,

ఇప్పటికే ఈడిమీద

బోల్డు కరుసైంది, మళ్లీ

తగలెట్టడానికో

కరుసా అని ఆయా

సంస్థలు

(వ్యాపారమంటే అదే

గదా) అనుకోకుండా

ఉండవు.
పైగా నానాటికి

పెరిగిపోతున్న

నిర్వహణ ఖర్చులో

సిబ్బందికి

కలిగించాల్సిన వౌలిక

సదుపాయాలదే

ప్రధానం కావడంతో,

ఈ సంస్థల్లో కొన్ని

స్మార్ట్‌గా

ఆలోచించాయి.

దెబ్బకు అటు మీరు

మీ ధ్యాసను గేటు

దగ్గర వదిలి

రానక్కరలేదు.

సంస్థలు మీ కోసం

ఎగస్ట్రా ఖర్చు

చేయనక్కరలేదు. ఆ

ఆలోచనే బి-వై-ఓ-డి

పద్ధతిని అమలులోకి

తెచ్చే పనిచేసింది.

ఇది వర్క్ ఫ్రమ్

హోమ్ కంటే

భిన్నమైంది. ఇంతకీ

బి-వై-ఓ-డి అంటే

ఏమిటంటే, బ్రిగ్

యవర్ ఓన్ డివైజ్

అని అర్థం. అంటే, నీ

పనికి వాడే

కంప్యూటర్ బాధ్యత

నీదే. దాని

స్వంతదారు నీవే.

పని, పనితనం నీది.

ఫలితం మాది అనేది

అంతిమ సందేశం.

కానీ, ఇండియాలో

దాదాపు 48 శాతం

సంస్థలు ఈ పద్ధతికి

వ్యతిరేకం.
మరి విదేశాల్లో ఏం

చేసినా చెల్లిపోతుంది.

ఇండియాలో ఈ

పద్ధతికి పెద్ద

చిక్కేనంటున్నారు

విశే్లషకులు.

ఇండియాలో సైతం ఈ

రకం ఏడవా పద్ధతి

2016కెల్లా తథ్యం

అంటున్నాయి

సర్వేలు. గార్ట్‌నర్

సర్వే ప్రకారం, 2016

నాటికల్లా

ఇండియాలో 38

శాతం సంస్థలు తమ

ఉద్యోగులకు

ప్రత్యేకంగా ఆఫీసులో

గాడ్జెట్స్‌ను

ఇవ్వకపోవచ్చు.

ఎందుకంటారా? మీ

లాప్‌టాప్ ఇంటికెళ్లాక

మీరే కాకుండా మీ

సోదర సోదరీమణులు

వాడొచ్చు, లేదా

ఇంట్లో పిల్లలుంటే

వారూ వాడొచ్చు.

దారిలో పోతూండగా

ఏ ఆకతాయో సదరు

మీ లాప్‌టాప్‌ను

దొంగిలించేయవచ్చు.

అలాటపుడు, మీ

లాప్‌టాప్ లేదా మీ

గాడ్జెట్‌లో ఉండే

కంపెనీ

సమాచారానికి

ఎంతవరకు భద్రత

ఉంటుంది. మీరు చేసే

పనిని ప్రతి

నిమిషమూ ఏ క్లౌడు

సౌకర్యంలోనో

సింక్రనైజ్ చేయాలా?

కష్టనష్టాలను ఎవరు

భరిస్తారు- ఇన్నీ శేష

ప్రశ్నలు. ఇన్ని శేష

ప్రశ్నల నడుమ ఈ

ఏడవా

పద్ధతెందుకండీ

బాబూ ఏడవడానికి

కాకపోతేనూ...

అంటారా.. ఆ

ఏడుపేదో సమస్యను

అనభవించేవాళ్లు

ఏడుస్తార్లెండి.

తెలుసుకోవాల్సిన

సంగతి

క్రోమ్‌లో అన్నీ

ఉన్నాయట...
మీరు గనక అచ్చంగా

మీ లాప్‌టాప్‌తో

కేవలం ఇంటర్నెట్టే

యాక్సెస్ చేస్తూ వెబ్

బ్రౌజింగ్, క్లౌడు

అప్లికేషన్సు వాడటం,

సోషల్ నెట్

వర్కింగ్‌లో కాలం

గడపటం చేసేవారైతే,

మీకు క్రోమ్ బుక్

బెస్టు అంటున్నారు

విశే్లషకులు.

మిగిలిన

లాప్‌టాప్‌లతో పోలిస్తే

క్రోమ్ బుక్ చాలా

వేగంగా బూటవడం

మాత్రమే కాదు, నెట్

వేగంగా వాడుకోవడం,

ఆఫ్‌లైన్‌లో నెట్‌లో

పనిచేసుకోవడం,

గూగుల్ డ్రైవ్‌తో

సింక్రనైజ్ కావడం,

గేమ్స్ ఆడుకోవడం-

అన్నీ

చేయవచ్చంటున్నా

రు. ఆఫ్ లైన్‌లో

వాడుకోగల్గడంతో

24/7 నెట్ కనెక్షను

అక్కర్లేదంటున్నారు

కూడా. అన్నట్టు క్రోమ్

బుక్ వీడియో

ఎన్‌కోడింగులో

దూడలు వేస్తుందిట.

అంచేత మీరు భారీ

ఎత్తున వీడియోతో

పనిచేకోవాలనుకుంటే

మాత్రం క్రోమ్ బుక్

జోలికి

వెళ్ళకపోవడమే

రైటు(ట). అలాగే

ఇందులో క్రోమ్

బ్రౌజర్ తప్ప వేరే

వాడలేరు. విఎల్‌సిసి

ప్లేయరు లేదు.

విన్‌రార్ లేదు.

ఫొటోషాపు తెరవలేం

కూడా. అసలు

ఎందుకింత

మోనోపలీ, అంటారా,

మరీ అన్ని ఫ్రీ అంటే

అంగడి నడవొద్దూ...

సామెత

డిస్కు ఇరకటం,

క్లౌడు మరకటం...

నెట్‌న్యూస్

శబ్దంతో వైరస్సు...
శబ్ద తరంగాలతో మీ

కంప్యూటర్‌ను

పనిచేయకుండా

చేసేయగలం

అంటున్నారు

జర్మనీకి చెందిన ఫ్రాన్

హౌఫర్ ఇన్‌స్టిట్యూట్

ఫర్ కమ్యూనికేషన్

సంస్థలో పనే్జసే

శాస్తవ్రేత్తలు. హెచ్చు

పౌనఃపున్యంగల

శబ్దాలను వాడి

పనిచేసే

కంప్యూటర్లను కొన్ని

శబ్ద తరంగాలతో

పనిచేయకుండా

చేయడం

సాధ్యమేనట. అలా

చేయడంలో ఏర్పరచే

నెట్‌వర్క్‌ను కోవర్టు

నెట్ వర్క్

అంటున్నారు.

అంతేలెండి. ఐతే

డైరెక్టు, లేదంటే

కోవర్టూ అంటారా.

అదీ నిజమే..

షార్ట్‌కట్స్ (్ఫటో

షాప్ 7.0 -టైప్)

Ctrl+Alt+
లీడింగును 10

పాయింట్స్

తగ్గించడానికి లేదా

పెంచడానికి
Alt+
లీడింగును 2

పాయింట్స్

తగ్గించడానికి లేదా

పెంచడానికి
Ctrl+Alt+Shift+<,>
టైపును 10

పాయింట్స్

తగ్గించడానికి లేదా

పెంచడానికి
Ctrl+Shift+<,>
టైపును 2 పాయింట్స్

తగ్గించడానికి లేదా

పెంచడానికి

టెక్-టాక్
english title: 
tek talk
author: 
వి.వి.వి.రమణ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>