ఆవారా, నాపేరు శివ చిత్రాల తరువాత కార్తీనటించిన బిరియానీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆయ న కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా ప్రేక్షకుల నుండి మంచి చిత్రం అన్న కామెంట్స్ కూడా అందాయి. కార్తీ నటన, వెంకటప్రభు టేకింగ్, సెల్వ ఫైట్స్, యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా మారాయి అని నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై వెంకటప్రభు దర్శకత్వంలో కార్తీ, హన్సిక జంటగా నటించిన ‘బిరియాని’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 2500 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత పైవిధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- తమిళంలో ‘మాంగాత్తా’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన వెంకటప్రభుకు ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని, అలాగే కార్తీకి కమ్‌బ్యాక్ ఫిలింగా ప్రేక్షకులనుండి ఆదరణ లభిస్తోందని, తెలుగులో చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన అభిమానులకు గ్రీన్ స్టూడియో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ చిత్రంలోని పాటలు సెనే్సషన్ హిట్ అయిన నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. సినిమా చాలా బాగందని, ముఖ్యంగా రెండో సగంలో పాటలు బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు తెలుగువారికి ధన్యవాదాలని కార్తీ తెలిపారు. తన వందో చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు పాటలే ప్లస్ అయ్యాయని అందరూ అంటుంటే మళ్లీ మళ్లీ ఇదే బ్యానర్‌లో పనిచేయాలని ఉందని యువన్ శంకర్‌రాజా తెలిపారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం- అనుకున్న కధని అనుకున్నట్టుగా రూపొందించడమేనని, అందుకు హీరో సహకారం మరువలేనిదని, ఆయన సినిమాలో నటించేటప్పుడు సామాన్య ప్రేక్షకుడిలా ఆలోచించి నటిస్తారని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు కృతజ్ఞతలని దర్శకుడు వెంకట ప్రభు తెలిపారు. కార్యక్రమంలో శశాంక్ వెనె్నలకంటి, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు.
(చిత్రం) ‘బిరియాని’ కార్తీ, హన్సిక
నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా
english title:
biriyani
Date:
Sunday, December 22, 2013