నీరజాకరములు నిష్ఠమై ఁజేసిన
భవ్యతపంబుల ఫల మనంగ
దివసముఖఆభినందిత చక్రయుగ్మకం
బుల యనురాగంపుఁ బ్రోవనంగ
హరి హర బ్రహ్మ మహానుభావంబు లొ
క్కటి గాఁగ గరఁగిన గట్టి యనఁగ
నతుల వేద త్రయ లతికాచయము పెను
పొందఁబు ట్టెడు మూలకంద మనఁగ
నఖిల జగముల కందెఱ యగుచు జనస
మాజ కరపుట హృదయ సరోజములకు
ముకుళనంబును జృంభణమునునొనర్చి
భాను బింబంబు పూర్వాద్రిపై వెలింగె
భావం: ఉదయస్తున్న సూర్యుడు, తామరకొలనులు అతినిష్ఠతో చేసిన తపస్సుఫలమా అన్నట్టు తెల్లవారు సమయంలో ఆనందంతో అలరారుతున్న చక్రవాకపక్షుల జంటల అనురాగపు రాశియా అన్నట్టు హరిహరుడు వేద సముదాయం పెంపొందటానికి ఏర్పడిన దుంపయా అన్నట్టు తూర్పుకొండపై అన్ని లోకాలను కనుల తెరిపించేలాగు కనుబడ్డాడు. ఆమహిమను చూచేవారు వారికి తెలియ కుండానే చేతులను ముకుళించు కొంటున్నారు. పెదవులు కేశవనామంతో ఉచ్చరిస్తున్నారు.
మహాభారతములోని పద్యమిది ( కూర్పు శలాక రఘునాథశర్మ ) నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్