హాలీ వుడ్‌లో నాలుగున్నర సంవత్సరాలపాటు రూపుదిద్దుకున్న ‘జాన్ కార్టర్’ చిత్రాన్ని తెలుగులో ‘మహావీరుడు’గా ఆర్.ఆర్ మూవీ మేకర్స్, ఎల్లోఫ్లవర్స్, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చి, అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తోందని నిర్మాత వి.సురేష్‌రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- హాలీవుడ్‌లో గ్రాండియర్‌గా, లావిష్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘మహావీరుడు’ చిత్రం విడుదలైన అన్ని థియేటర్లవద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌తో హౌస్‌ఫుల్ అవుతున్నాయని, తాము తెలుగు, తమిళ, హిందీ భాషలలో 150 థియేటర్లలో విడుదల చేశామని తెలిపారు. హాలీవుడ్‌లో నిర్మించినట్లుగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయలేకపోవడంవల్లనే డబ్బింగ్ చిత్రంగా అనువదించామని, ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న సదుద్దేశంతో చిత్రాన్ని విడుదల చేశామని, తమ కృషికి గుర్తింపుగా చిత్రం అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణను పొందడం సంతోషంగా వుందని సురేష్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ హరికుమార్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
హాలీ వుడ్‌లో నాలుగున్నర సంవత్సరాలపాటు రూపుదిద్దుకున్న ‘జాన్ కార్టర్’ చిత్రాన్ని తెలుగులో ‘మహావీరుడు’గా
english title:
mahaveerudu
Date:
Saturday, March 10, 2012