విజయవాడ, మార్చి 21: రాజకీయాలు చాలా విచిత్రమైనవని సామాన్యులకు విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి వారు ఇట్టే గ్రహించేస్తున్నారు. కొన్ని దశాబ్దాలపాటు గ్రామ పంచాయతీలకు మాత్రమే, అదీ ఐదారు రోజులకోసారి సర్పంచ్ ఇంటికి పోస్టులో ఏదోఒక దినపత్రిక వచ్చేది. ఆరోజుల్లో టీవీలు, రేడియోలు కూడా లేవు. తర్వాతి కాలంలో రేడియోలో వారానికోసారి తెలుగు సినిమా ప్రసారమయ్యేది. నలుగురమ్మలు ఓచోట కూడి వినేవారు. అలాగే క్రికెట్ టెస్ట్‌ల సమయంలో మగవారు గుమికూడేవారు. ఎన్టీఆర్ హయాంలో గుంటూరు జిల్లా పరిషత్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మల్లాది శివన్నారాయణపై సునాయాసంగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే దొడ్డపనేని ఇందిర కొద్దిమాసాల్లోనే అనారోగ్యంతో కన్నుమూశారు. దీనివల్ల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున డా.రాయపాటి శ్రీనివాస్, టిడిపి తరపున సక్కుర్తి రామయ్య పోటీ చేశారు. ఆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. రాయపాటి సోదరుల పొగాకు వ్యాపారం దేశవిదేశాల్లో జరిగిన తీరుతెన్నులపై నిప్పులు చెరిగారు. రాయపాటి సాంబశివరావు నాడు కేంద్రంలో తనకున్న పలుకుబడితో నాటి కేంద్ర మంత్రులు జలగం వెంగళరావు, బూటాసింగ్, ఇలా మరెందరో ప్రముఖులను ఎన్నికల ప్రచారానికి రప్పించారు. ఇదంతా గత చరిత్ర. ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన అదే రాయపాటి సాంబశివరావు నేడు మారిన రాజకీయ పరిణామాల్లో వచ్చే ఉగాది రోజున తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నరసరావుపేట ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారానికి రాక తప్పదు. రాయపాటికి మద్దతుగా ఆయనను బాబు ఏవిధంగా ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడతారోనని గుంటూరు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు!
రాజకీయాలు చాలా విచిత్రమైనవని సామాన్యులకు విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి
english title:
tdp
Date:
Saturday, March 22, 2014