Date:
Monday, March 24, 2014 (All day)
వృశ్చికం:
విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మేషం:
కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృషభం:
కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.
మిథునం:
అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభముంది.
కర్కాటకం:
ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
సింహం:
ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేస్తారు.
కన్య:
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.
తుల:
విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ఈ రోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు:
దిగ్విజయాన్ని పొందుతారు. ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో ఆనందిస్తారు.కీర్తిప్రతిష్ఠలు పొందుతారు.
కుంభం:
వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిల వలన ధనలాభముంటుంది.
మీనం:
ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. తీర్థయాత్రలు చేస్తారు.
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
..
వర్జ్యం:
ఉ.10.34 నుండి 12.02 వరకు తిరిగి రా.09.01 నుండి 10.31 వరకు
నక్షత్రం:
మూల మ.12.02
తిథి:
బహుళ అష్టమి మ.03.50
మకరం:
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు.