జగత్తు అంతా ఈశ్వరమయం. ఈశ్వరుడు లేని జగము లేదు. ఉన్నది ఈశ్వరుడే కాని జగమే లేదు. జగము అశాశ్వతము జగన్నాథుడు శాశ్వతము. రూపము అశాశ్వతము. నామమూ అశాశ్వతమే. అందుకే నామరూపములేని స్థితి ఏర్పడితే సమదృష్టి దానికదే అలవడుతుంది. నామరూపాలు అనేవి లేవని వేదం చెబుతుంది. వేలసంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని దర్శనం చేసుకొన్న ఋషులు రూపనామాలు అశాశ్వతమన్నారు.
కుమ్మరి చేసిన బొమ్మలు ఎన్ని రూపాలు నామాలు కలిగి ఉన్నా వాటిలోని మట్టి మాత్రం ఒకటే అయినట్లు లోకాలు కంటికి కనిపిస్తున్నా లోకమంతా విస్తరించిన భగవంతుడు ఒక్కడేనంటారు.
ఏకత్వ భావన ఉంటే జగన్మిథ్య అని తెలుస్తుంది. బొమ్మలు అనేకాలుగా కనిపిస్తున్నా మట్టి మాత్రమే ఒకటేనన్న జ్ఞానం లేకపోవడం వల్లే వైరుధ్యభావలేర్పడుతాయి అంతా ఒక్కటేనన్న భావన కలిగి ఉన్నప్పుడు ఎవరు ఎవరితో భేదాన్ని చూపించగలరు?
కనుక లోకాలు లోకేశ్వరుడు ఒక్కడే నన్న భావనతో సర్వత్రా సందర్శనం చేస్తూ ఎప్పుడూ పరులలో పరమాత్మ దర్శనం చేయమని చెప్పే ఆధ్యాత్మిక విద్యా సారాంశాన్ని అర్థం చేసుకుంటూ మనుగడ సాగించటమే మానవుని కర్తవ్యం. లక్ష్యమూ అయ ఉండాలి.
జగత్తు అంతా ఈశ్వరమయం.
english title:
jagannatha
Date:
Tuesday, March 25, 2014