చాంద్రాయణగుట్ట, మార్చి 25: గ్రేటర్ ప్రజలకు వేసవి కాలంలో నీటి సరఫరాకు ఢోకా లేదని, వేసవి కాలంలో తలెత్తే వివిధ సమస్యలను అధిగమించేందుకుగాను రూ.3.20 కోట్ల రూపాయలతో ప్రణాళికలను రూపొందించామని జలమండలి టెక్నికల్ డైరెక్టర్ షెట్టిపల్లి ప్రభాకరశర్మ తెలిపారు. జంట జలాశాయాలైన ఉస్మాన్, హిమయత్‌సాగర్‌తో పాటు సింగూరు, మంజీరాలో ప్రస్తుతం ఉన్న నీటితో వేసవికాలంలో ఎటువంటి నీటి సమస్యలు తలేత్తకుండా ఉండేందుకు వీలుకల్గుతుందని ఆయన తెలిపారు. జలమండలి పరిధిలోని 1నుండి 7 మెయింటెనెన్స్ విభాగానికి చెందిన డివిజన్‌లకు చేరి రూ.35 లక్షలు, శివారు ప్రాంతంలోని డివిజన్‌లకు రూ.15 లక్షలు చొప్పున నిధులు మంజురు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో డివిజన్‌ల పరిధిలోని అయా సెక్షన్‌ల పరిధిలో చెడిపోయిన బోర్లును బాగు చేయడం, సివరేజ్, నీటి సరఫరాకు చెందిన పైప్‌లైన్ల మరమ్మతులు, నీటి సరఫరాకు సంబంధించి పంప్‌హౌస్‌ల వద్ద మోటార్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద డివిజన్‌ల వారీగా నీటి సరఫరాకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో తలెత్తే నీటి లీకేజిలను సైతం ఏప్పటికప్పుడు గుర్తించి వేంటనే మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో కలుషిత నీటి సరఫరావంటి సమస్యలు తలెత్తకుండా వుండేలా సంబందిత సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండేలా అదేశాలు జారీ చేశామన్నారు. అసరమైనా ప్రాంతాల్లో నీటిని ట్యాంకర్లద్వారా కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని శర్మ తెలిపారు.
* నీటి సరఫరాకు ఢోకా లేదని భరోసా * రూ.3.20 కోట్లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు * జలమండలి డిటి ప్రభాకర్‌శర్మ
english title:
v
Date:
Wednesday, March 26, 2014