
జయనామ సంవత్సరం అడుగిడుతున్న సందర్భంలో జీ తెలుగు అందిస్తున్న వినూత్న కార్యక్రమం ‘మొగుడు - పెళ్ళామ్- ఓ ఉగాది’. ప్రేక్షకులకు పరిచయమున్న చంటి కొంటెమొగుడుగా, ఛోటా ఛాంపియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ అల్లరి భార్యగా ఈ కార్యక్రమంలో నటిస్తున్నారు. మగవాళ్లు గొప్పా ఆడవాళ్లు గొప్పా అనే వాదనకు వినోదాన్ని జోడించి ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు అయిన లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్‌తో రెండు గ్రూపులమధ్య వాదన జరిగేలా వినోదాన్ని పంచనున్నారు. ప్రియాంకా, మహేశ్వరి, సింధూర, సౌమ్య, కృతిక, లాస్య ఓవైపు వుంటే, మరోవైపు రవి, హృతేష్, అనీల్, కౌశిక్, విశ్వ, అలీ మరోవైపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మార్చి 30న ఆదివారం ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం సాయంత్రం 3 గంటలకు ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధి తెలియజేశారు.
జయనామ సంవత్సరం అడుగిడుతున్న సందర్భంలో
english title:
ugadi
Date:
Wednesday, March 26, 2014