
కాశి చిత్రంలో నటించిన కావ్య మాధవన్ గుర్తుంది కదా! తమిళంలో కూడా ఎన్‌మనవానిల్, సాధు మిరండా చిత్రాల్లో కథానాయికగా రాణించిన కావ్య మాధవన్ కువైట్‌లో ఉండే నిషాల్ చంద్రను వివాహం చేసుకొని వెళ్లిపోయారు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన ఈమె ఈమధ్య బాలీవుడ్‌లో దిగిపోయారట. గత ఏడాది చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు దిలీప్ ప్రేమలో పడినట్టుగా మాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయాన్ని కావ్య మాధవన్ ఖండించారు. ఆమె ఖండించినా దిలీప్ భార్య మాత్రం వారిద్దరికీ రహస్య సంబంధాలున్నట్లుగా గొడవ చేసింది. దిలీప్ భార్య మంజువారియర్ భర్తను విడిచి వేరుగా ఉంటూ తన నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. మలయాళ చిత్రాల్లోనూ నటించడానికి ముందుకు వస్తోంది. ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న కావ్య తాను రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమని చెబుతోంది. ఇందుకోసం వచ్చే సంవత్సరం వివాహం జరిగితే ఎటువంటి సమస్యలు తలెత్తవని జ్యోతిష్యులు చెప్పినమీదట వచ్చే ఏడాది వివాహ ప్రకటన చేయవచ్చని కావ్య మాధవన్ సన్నిహితులు చెబుతున్నారు.