
రామ్‌చరణ్‌తో ‘మగధీర’ చిత్రం నిర్మించినప్పటినుండి అర్జున్‌తో ఓ చిత్రం చేయమని అనేకమంది చెబుతూనే ఉన్నారని, అయితే ఇటీవల తాను అల్లు అర్జున్‌తో సినిమా రూపొందిస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో నిజం లేదని దర్శకుడు రాజవౌళి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ప్రభాస్‌తో నిర్మిస్తున్న ‘బాహుబలి’ చిత్రంపైనే ఉందని, ఈ చిత్రాన్ని ఎంత బాగా తీర్చిదిద్దాలో అంత బాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అర్జున్‌తో చిత్రం చేస్తున్నాననేది ఓ పుకారేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా తాను రూపొందిస్తున్న ‘బాహుబలి’ పూర్తి అయిన తరువాతే మరో చిత్రంపై దృష్టిపెడతానని, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణలతోపాటుగా అనేకమంది ఈ చిత్రం కోసం నటిస్తున్నారని, వచ్చే సంవత్సరం అనగా 2015లో ఈ చిత్రం విడుదలవుతుందని ఆయన తెలిపారు.
రాజవౌళి
english title:
a
Date:
Wednesday, March 26, 2014