
సినీ పక్షుల మాటలకు వేర్వేరు అర్థాలుంటాయి. వాటికి పెడర్థాలు తీస్తే.. మీడియా మీద విరుచుకు పడతారుగానీ.. ఆ అర్థాలకు ‘స్కూప్’ అందించేదీ వాళ్లే. ఇక్కడ చూద్దాం. బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్‌ని పలకరిస్తే.. దీపిక గురించి ఉన్నవీ లేనివీ అన్నీ చెప్పాడు. ఒక్కటంటే ఒక్కటీ మిగుల్చుకోలేదు. తన జీవితానికి సరికొత్త నిర్వచనం ఆమె. అభిమానించే వ్యక్తి. స్ఫూర్తిదాత.. లాంటి బరువైన పదాలన్నీ వాడాడు. ‘రామ్ లీల’ మొదలైందగ్గర్నుంచీ వీళ్లిద్దరి మధ్య ఏదో ‘లీల’ జరుగుతున్నట్టు ఉప్పు అందించిందీ వాళ్లే. ఆమె పక్కనుంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు... ఈ మాటకి అర్థం ఎవరిని అడిగినా.. ఏం చెప్తారు? సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే కదా. కానీ అలాంటిదేం లేదు. మంచి ఫ్రెండ్స్. అంతే.. అంటూ దాటవేస్తారు. ఇదోరకం పబ్లిసిటీ.
ఏం చేస్తాం? వారికి పబ్లిసిటీ.. మీడియాకి గాసిప్ - ఏదైతేనేం - అర్థం ఒనగూడుతోంది కదా!
సినీ పక్షుల మాటలకు వేర్వేరు అర్థాలుంటాయి.
english title:
spoorthy data
Date:
Wednesday, March 26, 2014