Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అటు నువ్వు ఇటు నేను

$
0
0

ద్వీపం - అంటే సినీ ప్రేమికుల గుండెల్లో అలజడి. ఏ కెమెరా ఎటువైపు నుంచి చిత్రీకరిస్తుందోనన్న భయం. అది ప్రైవేట్ లైఫ్ సంగతి. పబ్లిక్‌గా అదీ షూటింగ్ నిమిత్తం వెళ్తే.. ఫర్వాలేదు అనుకోవచ్చు. కానీ మధ్యలో రణవీర్‌కి ఎందుకు అసూయ? అసలు విషయం ఏమిటంటే- రణబీర్ - దీపిక పదుకొనె మొన్నామధ్య మారుమూల ద్వీపానికి వెళ్లార్ట. వీరిద్దరూ మాజీ ప్రేమికులు. యూరప్‌లోని ద్వీపం. అప్పటికే వాళ్లిద్దరూ అక్కడ గడపారన్న రూమర్. వెరసి - రణవీర్ సింగ్‌కి తిక్క రేగదా? ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న ‘విండో సీట్’ సినిమా షూటింగ్. కథలో భాగంగా ఆ ద్వీపంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ. అంతా బానే ఉంది. కాకపోతే - కథలోనూ రొమాన్స్‌లోనూ లీనమై సీన్‌ని పండించార్ట. ఏముంది? ఆపాత మధురాలేవో జ్ఞాపకం వచ్చి ఉంటాయి అని యూనిట్ సరిపెట్టుకొంది. ఐతే- ఇదే కథని కత్రినా కైఫ్ - రణవీర్ సింగ్‌లకూ దర్శకుడు ఇంతియాజ్ వినిపించాట్ట. కారణం ఏదైనప్పటికీ.. రణబీర్ - దీపికలతో కథ కానిచ్చేస్తున్నాడు. మరో విషయం - రణవీర్ సింగ్ కూడా మాజీ ప్రేయసి అనుష్క శర్మతో ‘టూర్’లో ఉన్నాట్ట. జోయా అక్తర్ నిర్మిస్తున్న ‘దిల్ ధడక్నే దో’లో ఈ మాజీ ప్రేమికులు నటించటం యాదృచ్ఛికం.

ద్వీపం - అంటే సినీ ప్రేమికుల గుండెల్లో అలజడి. ఏ కెమెరా ఎటువైపు నుంచి చిత్రీకరిస్తుందోనన్న భయం.
english title: 
atu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>