
ఇండస్ట్రీలో షాహిద్ - సోనాక్షి ‘డేటింగ్’ వ్యవహారం గురించి కథలొచ్చాయి. ఇన్నాళ్లూ పరమ పవిత్రంగా.. ఎటువంటి ‘ఎలిగేషన్స్’ లేకండా నెట్టుకొచ్చిన సోనాక్షి ఇలా చేసిందేవిటి చెప్మా? అని వగచిన వారిక్కూడా వొకింత ఊరట కలిగించిన మాట ఇది. ‘గాసిప్’ మహత్తు అది. కాస్త నవ్వుతూ మాట్లాడితే.. ఇక ‘తాటాకులు’ కట్టేయటమేనా?
ఏదీ ఆలోచించరా? ఆ మాటకొస్తే అమ్మాయి అబ్బాయి కబుర్లు చెప్పుకోవటమే మహా పాపం అనేట్టున్నారు. షాహిద్‌కీ నాకూ మధ్య ‘ఆ’ సంబంధమూ లేదూ.. ఏ సంబంధమూ లేదు. ఇంట్లో తీరి కూర్చుని పుట్టించే మాటలకు అర్థం పర్థం ఉండదు. ఇదీ అటువంటిదే. అప్పుడప్పుడు ఈ రాతల్ని చూసి నవ్వుకొంటూ ఉంటానంటూ ‘గాసిప్’ రాయుళ్లపై జాలి కురిపిస్తోంది. అదేమోగానీ - బొద్దుగుమ్మ కాస్తా ముద్దుగుమ్మలా.. నాజూగ్గా తయారుకావటంతో సోనాక్షికి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయిట. రూమర్స్ పట్ల ఆమె మాటలు నిజమని నమ్మేద్దాం.