
ఇన్నాళ్లుగా పెళ్లెప్పుడు అని అడిగితే దాటవేస్తూ వచ్చిన ఇలియానా చివరికి తనకు కావలసిన వరుడు ఎలా ఉండాలో చెప్పేసింది. ఓ రకంగా ఆయన పేరు కూడా పరోక్షంగా చెప్పినట్లే అని అంటున్నారు. ‘మై తేరా హీరో’ చిత్రంలో ఆమెతో నటించిన వరుణ్‌ధావన్ అంటే తనకు చాలా ఇష్టమని, తామిద్దరం నటించిన చిత్రాల్లో కెమిస్ట్రీ బాగా పండుతుందని, ఆయన మంచి అందగాడే కాక గుణవంతుడు, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలిసిన సభ్యత కలిగిన నటుడు అంటూ పొగడ్తల్లో ముంచేసింది. అటువంటి వ్యక్తి తనకు తారస పడితే తప్పక పెళ్లాడుతానంటూ ప్రకటించేసింది. తాను గతంలో రణబీర్‌కపూర్, షాహిద్‌ల సరసన నటించినా వారికంటే వరుణ్‌ధావన్‌తోనే తనకు షూటింగ్ చేయడంలో సంతృప్తి వుంటుందని చెప్పుకొచ్చింది. ఇంకా సమయం వుంటే చాలా చెప్పేటట్లే వుంది మరి!
ముంబై టాకీస్
english title:
a
Date:
Thursday, March 27, 2014