
16వ వసంతంలోకి అడుగుపెడుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా చెన్నై తెలుగువారి ఘనతను చాటుతూ ప్రతి ఏడాది ఉగాది పండుగను పురస్కరించుకొని సత్కరిస్తోంది. ప్రతి ఏడాది విడుదలైన చిత్రాలకు సంబంధించిన ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం కూడా 24మంది తెలుగువారికి మార్చి 30వ తేదీ ఆదివారం అవార్డులను అందించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనం కూడా జరగనుంది. కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ బేతిరెడ్డి మాట్లాడుతూ- ప్రతి సంవత్సరంలాగే కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఈ ఉగాది పురస్కారాలను అందించనున్నామని, పునాదిరాళ్ళు చిత్రంతో కెరీర్ ప్రారంభించి ‘అత్తారింటికి దారేది’తో వేయి చిత్రాలు పూర్తిచేసుకున్న అలీకి ప్రత్యేక సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని తెలిపారు. చెన్నైలో వుండగా ఈ అకాడమీ విశిష్టతను తెలుసుకున్నానని, ఎలాగైనా ఆ అవార్డు తీసుకోవాలని ఆశపడేవాడినని, గత ఏడాది గబ్బర్‌సింగ్‌లో సాంబ పాత్రకు అవార్డురాగా, ఈ సంవత్సరం ప్రత్యేక సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని అలీ తెలిపారు. కార్యక్రమంలో వి.ఎన్.ఆదిత్య, వెనె్నలకంటి తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలు
ఉత్తమ చిత్రం:అత్తారింటికి దారేది
ఉత్తమ కుటుంబ కథాచిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు
ఉత్తమ భక్తిరస చిత్రం: జగద్గురు ఆదిశంకర
ఉత్తమ హాస్య చిత్రం: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
ఉత్తమ కథ:జె.కె.్భరవి (జగద్గురు ఆదిశంకర)
మాటల రచయిత: గణేష్ పాత్రో (సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: చంద్రశేఖర్ ఏలేటి (సాహసం)
ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ నటుడు: గోపీచంద్ (సాహసం)
ఉత్తమ నటి: నిత్యా మీనన్ (గుండెజారి గల్లంతయ్యిందే)
జ్యూరీ అవార్డ్స్: సందీప్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్), శ్రీదివ్య
(మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు)
ఉత్తమ నూతన నటుడు :రాజ్ తరుణ్ (ఉయ్యాల జంపాల)
ఉత్తమ నూతన నటి: ఇష (అంతకుముందు ఆ తర్వాత)
ఉత్తమ కెమెరామెన్ (వి.ఎస్.ఆర్.స్వామి అవార్డు): చోటా కె.నాయుడు
ఉత్తమ గాయకుడు, రచయిత: దేవిశ్రీ ప్రసాద్
(నిన్ను చూడగానే- అత్తారింటికి దారేది)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (గుండెజారి గల్లంతయ్యిందే)
ఉత్తమ గాయని: శే్వతా మోహన్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ నూతన దర్శకులు: కొరటాల శివ (మిర్చి),
విజయకుమార్ కొండ, విరించి వర్మ (ఉయ్యాల జంపాల),
మేర్లపాక గాంధి (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)
*