
ప్రకాష్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై వల్లభ రూపొందిస్తున్న చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెల 31న ఉగాది సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ- నటుడిగా ఓ ప్రత్యేక స్థానంలో ఉన్న ప్రకాష్‌రాజ్ ‘ఉలవచారు బిరియాని’తో దర్శకుడిగా మరోసారి తన ప్రతిభను చూపనున్నారని, డిఫరెంట్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలవుతుండగా ఉగాదికి ఇళయరాజాను ఘనంగా సత్కరించనున్నామని, అప్పుడే ఆడియోను కూడా విడుదల చేయనున్నామని, ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ నచ్చు తుందని తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని, ప్రకాష్‌రాజ్‌కు జన్మదినోత్సవ శుభకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. స్నేహ, తేజస్, సంయుక్త, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్, శివాజీరావు, విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రీతా జయరామన్, ఎడిటింగ్: జో.ని.హర్ష, నిర్మాత:వల్లభ, దర్శకత్వం:ప్రకాష్‌రాజ్.