అని యడిగిన మురరిపు పద, వనజంబులఁ దన కిరీట వరమణు లొరయన్
వినయమున మ్రొక్కి యిట్లను , ఘనమోదము తోడ నిటల ఘటితాంజలియై
భావం: అని శ్రీకృష్ణుడు అడుగగా ఆ పురుషుడు మురారి చరణ సరోజాలకు తన కిరీట మణులు సోకునట్లుగా నమస్కరించి తన నుదుట చేతులు మోడ్చి ఆనందంతో ఇలా విన్నవించాడు.
శ్రీకృష్ణుడు తనను తన జీవితంలో చేసిన పొరపాట్లను, మంచిని చెప్పుమని తనకు ఊసరవెల్లి రూపమెలా సంప్రాప్తమైందో చెప్పుమంటే నృగమహారాజు ఆనందచిత్తంతో మురసిపోయాడు. తాను గ్రహస్థితి బాగోలేక చేసిన చిన్న పొరపాటుకు పైగా అది తెలియకుండా చేసినా దానిక వచ్చిన దుర్భర ఫలితాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తూ తన లాగా మరొకరు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన జీవితంలో తాను చేసిన పనిని అక్కడ కృష్ణునితో పాటు కూర్చుని ఉన్న గోపాలురతోటి చెప్పటానికి ముందుగా శ్రీహరికి నమస్కరించాడు నృగమహారాజు.
పోతన భాగవతము-దశమస్కంధము లోని నృగమహారాజు చరిత్రములోదీ పద్యం