ముషీరాబాద్, మార్చి 27: హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఇక్కడ బతికేటోళ్లందరిదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. చలో హైదరాబాద్ పేరిట ఆరెకటిక పోరాట సమితి ఆత్మగౌరవం- హక్కుల సాధన సభను గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌లో మట్టి నింపి హోటల్ కడతామంటే పర్మిషన్ ఇవ్వడానికి వెనకాడని పాలకులు ఆరెకటికలకు ఒక మటన్ షాప్ పెట్టుకోవడానికి నానా రకాలుగా సతాయిస్తున్నారని అన్నారు. ఏ కులం తక్కువ కాదు ఎక్కువ కాదు ప్రతి వృత్తికి గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ఆరెకటికల సమస్యలను పరిష్కరించి సహాయం అందించాలని సూచించారు. ఆరెకటిక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులు జి.సుధాకర్ కటిక, కె.ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో రెండు ఎంపి, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆరెకటిక సామాజిక వర్గాన్ని ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేసి, రూ.600 కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని పార్టీలు మెనిఫెస్టోలో చేర్చాలని కోరారు. విమలక్క, గురుచరణ్, సురేశ్, శ్రీకాంత్‌లాల్, శ్రీనివాస్, ప్రవీణ్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఇక్కడ బతికేటోళ్లందరిదని తెలంగాణ రాజకీయ
english title:
kodanda
Date:
Friday, March 28, 2014