హైదరాబాద్, మార్చి 27: నగరంలోని పదిహేను అసెంబ్లీ నియోకవర్గాల్లో ఈ నెలాఖరులోపు సమస్యాత్మక ప్రాంతాలు, అక్కడున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ పోలీస్ నోడల్ అధికారులను ఆదేశించారు. అదనపు మపోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, జిహెచ్‌ఎంసి స్పెషల్ కమిషనర్ రాహూల్ బొజ్జా, జిల్లా జాయింట్ కలెక్టర్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇ.శ్రీ్ధర్‌లతో కలిసి జిల్లా ఎన్నికల భద్రతా ప్రణాళికపై గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపులో కులం, మతం పరంగా నేరాలకు పాల్పడిన వారిని, నేర చరిత్ర కల్గిన వ్యక్తులను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రొఫార్మాలు, నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుకునేందుకు వీలుగా వచ్చే రెండురోజుల్లో ఒక ఐటి టూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని సమస్యల ఫిర్యాదులకు జిహెచ్‌ఎంసి రౌండ్ ది క్లాక్ కాల్‌సెంటర్ నెంబరు 21111111కు ఫోన్ చేయాలని సూచించారు. వచ్చే వారంరోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులు, పోలీస్ నోడల్ అధికారులు కౌంటింగ్ హాల్స్‌ను, స్ట్రాంగ్ రూంలను సంయుక్తంగా తనిఖీలు చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లకు, స్టాటిక్ సర్వేలైన్స్ టీంలకు వాహానాలను రిటర్నింగ్ అధికారులు ఆర్టీఏ అధికారుల సహకారంతో అందజేస్తారని వీడియో గ్రాఫర్లను నిబంధనల మేరకు నియమించుకోవాలని ఆదేశించారు. గతంలో కర్ఫ్యూ విధించిన ప్రాంతాలను కూడా సమస్యాత్మంగా ప్రాంతాలుగా గుర్తించాలని పోలీసు అధికారి అంజనీకుమార్ ఆదేశించారు. తొంభై శాతం కంటే అధికంగా ఓట్లు నమోదైన ప్రాంతాలను, 70 శాతం కంటే అధికంగా ఓట్లు ఒక అభ్యర్థికి నమోదైన ప్రాంతాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
నగరంలోని పదిహేను అసెంబ్లీ నియోకవర్గాల్లో ఈ నెలాఖరులోపు సమస్యాత్మక ప్రాంతాలు,
english title:
samasyathmaka
Date:
Friday, March 28, 2014