Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తా

$
0
0

వికారాబాద్, మార్చి 27: వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3, 21, 18, 24, 26 వార్డులో పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. వికారాబాద్ పట్టణం అభివృద్ది చెందింది కేవలం కాంగ్రెస్ హయాంలోనేనని అన్నారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేశామన్నారు. శ్రీఅనంతపద్మనాభ స్వామి పేర మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, మహిళల కోసం హిందీమహిళా విద్యాలయం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు 132 సబ్‌స్టేషన్, మంజీరా నీటి కోసం పైపులైను పూర్తవుతోందన్నారు. కార్యక్రమంలో అభ్యర్థులు మేక చంద్రశేఖరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రెడ్యానాయక్, నర్సింగ్‌రావు, నిర్మల, రెడ్యానాయక్‌లు పాల్గొన్నారు.
75 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వే
తెలంగాణ రాష్ట్రంలో 75 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం ఎంపిటిసి స్థానాలకు పోటీ చేస్తున్న నాయకులతో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విడుదలైన కాంగ్రెస్ మెనిఫెస్టో చాలా బాగుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ ఎల్.శశాంక్‌రెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22వ వార్డును అభివృద్ది చేస్తా
22వ వార్డును అన్నిరకాలుగా అభివృద్ది చేస్తామని వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుడిసె శ్రీదేవి తెలిపారు. ఆమె వార్డులో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో మంచినీరు, వీధిదీపాలు, పారిశుధ్యం సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె భర్త, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గుడిసె లక్ష్మణ్ కోరారు.
హైటెక్ వార్డులుగా తీర్చిదిద్దుతాం
ఆలంపల్లిలోని మూడు, నాలుగు వార్డులను హైటెక్ వార్డులుగా తీర్చిదిద్దుతామని మూడు, నాలుగు వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు మేక చంద్రశేఖరరెడ్డి, లంక లక్ష్మికాంత్‌రెడ్డిలు అన్నారు. గురువారం ఆలంపల్లిలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ శివారులో గ్రామాన్ని తలపించేదిగా ఉన్న వార్డుల్లో అన్ని హంగులను ఏర్పాటు చేస్తామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కేవలం కాంగ్రెస్‌కే సాధ్యమని హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వారి వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎల్.రాంచంద్రారెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సంక్షేమం అమలు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎ.సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం వార్డులో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పేదప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి పనులు ఎక్కువగా జరుగుతాయన్నారు. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు రహీం, నాయకులు శ్రీ్ధర్‌గుప్త పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌ను గెలిపించాలి
వికారాబాద్ పట్టణం అభివృద్ది చెందాలంటే టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని 25వ వార్డు టిఆర్‌ఎస్ అభ్యర్థి జి.విజయేందర్‌గౌడ్ కోరారు. గురువారం వార్డులో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్‌నే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓటు వేయనున్నందున టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, మున్సిపల్‌లోనూ టిఆర్‌ఎస్ పాలన ఉంటే నిధులు ఎక్కువగా వస్తాయని, అభివృద్ది సాధ్యమని అందుకే కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బంటారం పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర మాజీ
english title: 
vikarabad

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>