Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రచార పర్వం వేగవంతం

$
0
0

తాండూరు, మార్చి 27: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, తాండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే పట్టణాభివృద్ధి వేగవంతమవుతుందని చైర్‌పర్సన్ అభ్యర్థి బి.సునీత సంపత్ అన్నారు. గురువారం 31వ వార్డులో ప్రచారం నిర్వహించారు. 27వ వార్డు ధన్‌గర్‌గల్లిలో అభ్యర్థి ఎంపి ఎక్బాల్ తరఫున డిసిసిబి చైర్మన్ పి.లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. చైర్మన్‌గా ఉన్నపుడు తాండూరును అభివృద్ధి చేసానని పేర్కొన్నారు. పిసిసి ప్రతినిధి సర్దార్‌ఖాన్ పాల్గొన్నారు. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కుర్వ శివలీల ప్రచారం నిర్వహించారు. తాగునీరు, వీధిలైట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జడ్పీటిసి అభ్యర్థి ప్రచారం
శంషాబాద్: మాజీ హోంమంత్రి సబితారెడ్డి చేసిన అభివృద్ధి పనులే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని జడ్పీటిసి అభ్యర్థి బూర్కుట సతీష్ అన్నారు. గురువారం షాపూర్, జూకల్, కొత్వాల్‌గూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సంజు, శివాజీ, గౌస్, బుర్కుట గోపాల్, విశ్వనాథం, నీరటి కృష్ణ, శేఖర్ యాదవ్, రాజేంద్రనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్కుట మహేశ్ పాల్గొన్నారు.
అన్ని స్థానాల్లో గెలవాలి
మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని శ్రేణులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో జడ్పీటిసి, ఎంపిటిసి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అన్ని స్థానాల్లో గెలవాలని సూచించారు.
సుస్థిర పాలన బిజెపితోనే సాధ్యం
మేడ్చల్: అవినీతి రహిత సుస్థిర పాలన బిజెపితోనే సాధ్యమని, దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర నాయకుడు కొంపల్లి మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం గౌడవెళ్లి-1 అభ్యర్థి లావణ్య కృష్ణ, జడ్పీటిసి అభ్యర్థి ఎస్.హంసరాణి తరుఫున ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నరేందర్‌రెడ్డి, నీరుడి కృష్ణ, సర్వేశ్వర్‌రెడ్డి, కృష్ణ, మహేందర్ పాల్గొన్నారు.
బడుగుల అభివృద్ధి చంద్రబాబు చలవే
శంషాబాద్: బడుగుల వర్గాల అభివృద్ధి టిడిపి అధినేత చంద్రబాబు చలవేనని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్క వేణుగోపాల్ అన్నారు. గురువారం మల్కారం, రాయన్నగూడ, నానాజీపూర్‌లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటిసి అభ్యర్థి నీరటి రాజు, నానాజీపూర్ ఎంపిటిసి అభ్యర్థి మణెమ్మ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఆర్.గణేశ్‌గుప్తా, కె.చంద్రారెడ్డి, వై.కుమార్ యాదవ్, దర్గ సత్తయ్య, సర్పంచ్ ముంజుల బిక్షపతి పాల్గొన్నారు.
7వ వార్డులో..
శంషాబాద్ 7వ వార్డు మధురానగర్‌లో ఎంపిటిసి టిడిపి అభ్యర్థి దూడల వెంకటేశ్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసాద్, విఠల్‌రెడ్డి, జంగయ్య, మేకల సత్తయ్య, శ్రీను, రాజు, శంకర్ పాల్గొన్నారు.
దుండిగల్‌లో..
జీడిమెట్ల: దుండిగల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ఎంపిటిసి టిడిపి అభ్యర్థి జక్కుల లక్ష్మి కృష్ణాయాదవ్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని దుండిగల్ గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జక్కుల లక్ష్మి మాట్లాడుతూ దుండిగల్ గ్రామంలో తన భర్త మాజీ సర్పంచ్ జక్కుల కృష్ణాయాదవ్ అనేక విధాలుగా అభివృద్ధి పనులను చేశారని, గ్రామ ప్రజలకు చేసిన అభివృద్ధి సేవలు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిపెట్టిందన్నారు.
ఎంపిటిసి ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమని, ప్రజలంతా టిడిపికే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గణేశ్, సతీష్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైకాపా ప్రచారం
వనస్థలిపురం: ఎల్‌బినగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు కుమ్మక్కై ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని వైకాపా సమన్వయకర్త పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షుడు మామిడి రాంచందర్ ఆధ్వర్యంలో భరత్‌నగర్ కాలనీ, రాజీవ్‌నగాంధీ నగర్‌కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సూరజ్ యజ్ఞాని, ఎం.శ్రీనివాస్, ప్రవీణ్‌బాబు, మాసు బేగం, యూనస్, లక్ష్మణ్, షఫీ, సీతమ్మ పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, తాండూరు
english title: 
campaign

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>