హయత్‌నగర్, మార్చి 27: ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మోసగించిన ఓ విఆర్‌ఓపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన నీరుటి వెన్నెల(24) కీసర మండల పరిధిలో విఆర్‌ఓగా పనిచేస్తోంది. ఇబ్రహీంపట్నం దండుమైలారంకు చెందిన బంగినిమతం వినయ్‌కుమార్ పెద్దంబర్‌పేట్ నగర పంచాయితీ కుంట్లూర్ గ్రామ విఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి బంధువులు వీరికి వేసవిలో వివాహం చేయడానికి ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వినయ్‌కుమార్ వెన్నెలను పెళ్లిచేసుకోనని తప్పించుకొని తిరుగుతున్నాడు. మోసపోయానని తెలుసుకున్న వెన్నెల గురువారం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మోసగించిన ఓ విఆర్‌ఓపై
english title:
vro
Date:
Friday, March 28, 2014