
చాంద్రాయణగుట్ట, మార్చి 27: హైదరాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మొదటి భాషా పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం 65252 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 64787 మంది హాజరయ్యారని, 465 గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 75 పరీక్షా కేంద్రాలను, డిఎల్‌వో నాలుగు సెంటర్లను, డిఇవో రెండు సెంటర్లలో తనిఖీ చేశారని వెల్లడించారు. ఎక్కడా మాల్‌ప్రాక్టిస్ కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన
english title:
tenth exams
Date:
Friday, March 28, 2014