సిల్హెట్ (బంగ్లాదేశ్), మార్చి 28: మహిళల టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్-బిలో శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 79 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 69 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లతో 80 పరుగులు చేసింది. నతాలీ సివర్ 20 పరుగులతో రాణించగా, హీతర్ నైట్ అజేయంగా 18 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 137 పరుగులు సాధించగా, లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 58 పరుగులకు పరిమితమైంది. ఆ జట్టులో ఫాతిమా ఖతున్ (16 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిస్తే, ఆయేషా రహ్మాన్, లతా మోండల్ చెరి 10 పరుగులు చేశారు. మిగతావారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హాజెల్, సివర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఆ జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన చార్లొట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
స్ట్ఫోనీ అర్ధ సెంచరీ
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వె స్టిండీస్ మరో 30 పరుగులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో వి జయం సాధించింది. స్ట్ఫోనీ టేలర్ అజేయంగా అర్ధ సెంచరీ సాధించి విండీస్‌ను విజయ పథంలో నడిపిం చింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక 16.5 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటైంది. యశోదా మేండిస్ (21), ఇషానీ లొకుసురియాగే (20) తప్ప మిగతా వారు రాణించలేకపోయారు. విండీస్ బౌలర్లలో షానెల్ డాలీ 15 పరుగులకు నాలుగు, ట్రెమేన్ స్మార్ట్ 15 పరుగులకు మూడు చొప్పున వికె ట్లు పడగొట్టారు. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కైసియా నైట్ (15) రూపం లో కోల్పోయంది. దిదేంద్ర డోటిన్ ఏ డు పరుగులు చేసి రనౌట్‌కాగా, స్టెఫనీ నాటౌట్ (56), షేమానే క్యాంప్ బెలే (నాటౌట్ 9) మరో వికెట్ కూల కుండా జాగ్రత్త పడ్డారు. విండీస్ 15 ఓవర్లలో రెండు వికెట్లకు 87 పరుగు లు చేసి విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ గెలుపు
english title:
c
Date:
Saturday, March 29, 2014