మీర్పూర్, మార్చి 28: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఇక్కడ జరుగు తున్న టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సె మీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాకిస్తాన్, డిఫెం డింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్లను ఓడించి మంచి ఫామ్‌లో ఉన్న ధోనీ సేన శుక్రవారం బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ తనకు సెంటిమెంట్‌గా మారిన ఫీల్డింగ్‌ను ఎంచుకు న్నాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సర్వశక్తులు కేంద్రీకరించి భారత్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. వారి పోరాట ఫలితంగా, ఏడు వికెట్లకు 138 పరుగులు చేయగలిగింది. అనాముల్ హక్ 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. మహమ్మ దుల్లా 23 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులు చేశాడు. మిగతా వారిలో ముష్ఫికర్ రహీం 24, నాసిర్ హొస్సే న్ 16 పరుగులు చేశారు. అమిత్ మిశ్రా 26 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చడం ద్వారా బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చే యగలిగాడు. రవిచంద్రన్ అశ్విన్ 15 పరుగు లిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిం డియాను 139 పరుగుల విజయలక్ష్యం పెద్ద గా ఇబ్బంది పెట్టలేకపోయంది. వరుస వైఫ ల్యాలతో అల్లాడుతున్న శిఖర్ ధావన్ ఆరు బంతుల్లో కేవలం ఒక పరుగు చేసి అల్ అమీ న్ హొస్సేన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసిన విరాట్ కోహ్లీ ధాటీగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తిచేసి స్కోరును వంద పరుగుల మైలురా యని దాటించారు. 12.3 ఓవర్లలో సరిగ్గా 100 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనం తరం మష్రాఫ్ మొర్తాజా బౌలింగ్‌ల నాసిర్ హొస్సేన్ క్యాచ్ అందుకోగా రోహిత్ శర్మ పె విలియన్ చేరాడు. అతను మొత్తం 44 బంతు లు ఎదుర్కొని, ఐదు బౌండరీలు, ఒక సిక్స్‌తో 56 పరుగులు సాధించాడు. రోహిత్ అవుటైన తర్వాత కెప్టెన్ ధోనీ మైదానంలోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌కి సంసిద్ధమయ్యే రీతిలో చివరి ఓవర్లను వీరు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకున్నట్టు ఆడారు. మొత్తం మీద మరో తొమ్మిది బంతు లు మిగిలి ఉండగా, రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటికి, 50 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్‌తో 57 ప రుగులు చేసిన కోహ్లీ, 12 బంతుల్లోనే, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేసిన ధోనీ నాటౌట్‌గా ఉన్నారు. వరుసగా మూడో విజయాన్ని సాధించి, ఆరు పాయంట్లతో గ్రూ ప్-2లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వెస్టిండీ స్ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాల తో నాలుగు పాయంట్లు సంపాదించి రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ ఒక విజయం, మరో పరాజయంతో రెండు పాయంట్లు సం పాదించుకోగా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ రెండే సి మ్యాచ్‌లు ఆడి, ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోవడంతో ఇంకా పాయంట్ల ఖా తాను తెరవలేదు.
టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
english title:
s
Date:
Saturday, March 29, 2014