
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
ఆర్థిక స్వావలంబన కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అమలుపరిచి ప్రతికూల స్థితిలో కూడా మీ లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. 1, 2 తారీఖుల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత, ప్రచార, వైజ్ఞానిక రంగాల్లో కొత్త అవకాశాలు వుండే సూచనలున్నాయి. ఆదాయం మెరుగవుతుంది. ఉన్నతమైన బాధ్యతలు, గౌరవ పురస్కారాలు శుక్ర, శని వారాల్లో అనుభవానికి వస్తాయి. రచనా వ్యాసంగాలలో మీ కృషి పెరుగుతుంది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 21)
ఆర్థిక వనరులను పెంపుచేసుకోవడంలో సఫలీకృతులవుతారు. సహనంతో, సామరస్యంతో వ్యవహరించి అందరి అభిమతాలు నెరవేరే విధంగా మీ వంతు కృషి చేస్తారు. మీ మీద ఉంచిన బాధ్యతలు నియమబద్ధంగా నిర్వహించడానకి అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు. సహచరుల ప్రోద్బలంతో ఆర్థిక లావాదేవీలు, ఇండ్లు స్థలాలు కొనుగోళ్లు, పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెడతారు. వివాహ ప్రయత్నాలు దీర్ఘ కాల ప్రణాళికలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
మిథునం (మే 22 - జూన్ 21)
మీ సలహాలు, సూచనలు అమలు చేయడానికి మిత్రులు, ఆత్మీయులు సమాయత్తమవుతారు. సోమ, మంగళ వారాల్లో ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జరుగుతున్న పరిణామాలను మీకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలీకృతులవుతారు. ప్రచురణలు, ప్రజాహిత కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. మీతో విభేదించినవారు తిరిగి మీతో పని చేయాలని ఉవ్విళ్లూరుతారు. విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను, ఆశించిన ర్యాంకులను సాధించడం అనుభవంలోకి వస్తాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23)
ఇంట్లో బయటా ఊహించని పరిణామాలు తలెత్తినా చలించక మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఆత్మీయుల ఆరోగ్యస్థితి ఆందోళనకరంగా ఉండవచ్చు. 1,2 తారీఖు ల్లో విలువైన సమాచారం అందడం, పరిశోధనలు ఫలించడం, పెట్టుకున్న అర్జీలు అనుమతింపబడడం జరగవచ్చు. ప్రతికూల స్థితినుండి సౌమ్య భాషణంతో ఘర్షణలకు తావులేకుండా బయటపడతారు. శారీరక శ్రమ తప్పకపోయినా మీ వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకుంటుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23)
విదేశీ ప్రయాణాలకు, భాగస్వామ్యాలకు ఈ వారం అనుకూలించవచ్చు. మీ ప్రమేయం లేకపోయినా కొన్ని విషయాల్లో విమర్శలను భరించవలసి రావచ్చు. స్థానిక సంస్థలు, సమాజాలలో మీ పరపతి, ప్రాధాన్యత ద్విగుణీకృతమవుతుంది. మరుగున పడ్డ వస్తువులు లభించి మీ అక్కరను తీరుస్తాయి. శుభ కార్యక్రమాలకయ్యే ఖర్చులు ఏదో విధంగా మీ చేతికందుతాయి. పెద్దల ఆశీర్వాదం, పిన్నల సహకారం సకాలంలో అందుతాయని ఆశించవచ్చు. స్థిరాస్తులు ఆదాయాన్నిస్తాయి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)
భిన్న వర్గాల వారిని ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత లోపాలను సరిదిద్దుకుని నూతన జీవన విధానానికి శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక చింతన, ఆలయ సందర్శనం మీకు మనశ్శాంతిని, భవిష్యద్ధర్శనాన్ని కలగచేస్తాయి. నూతన ఉద్యోగావకాశాలు, వనరుల సమీకరణ, లక్ష్యాలు నెరవేరే దిశగా కృషిని పెంపుచేయడం శుక్ర శనివారాల్లో ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో ఆరోగ్యంలో మార్పులు రాకుండా జాగ్రత్తవహించాల్సి వుంటుంది. ప్రయాణాలు వాయిదా పడవచ్చు.
తుల (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)
రావలసిన డబ్బు ముందు వెనకలుగా అందడంతో మీ లావాదేవీలను సంతృప్తికరంగానే ముగించగలుగుతారు. అంతస్తులను అధికారాలను మరిచి అన్ని వర్గాల వారితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. గురు, శుక్ర వారాల్లో స్థలాలు, ఇండ్లకు సంబంధించిన విషయాలపై ఆసక్తి ఉత్సాహం చూపుతారు. నూతన పెట్టుబడులు, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. వివిధ సమస్యలపై మీకున్న అవగాహనతో ఆత్మీయులకు, సముచిత మార్గాంతరాలు సూచిస్తారు.
వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 23)
ఇబ్బందులు, అవరోధాలు తొలగడంతో స్వ విషయాల్లో వృత్తి రాజకీయ రంగాల్లో మీ ప్రయత్నాలు ఫలప్రదంగా సాగుతాయి. స్ర్తిలు పిల్లలకై ప్రత్యేక కార్యక్రమాలు తలపట్టి వారిని ఆహ్లాదపరుస్తారు. బ్యాంకు బాలెన్స్‌లో వృద్ధిని గమనించవచ్చు. మారుతున్న విలువలను, పరిస్థితులను గురించి సన్నిహితులకు వివరించి చైతన్యవంతులుగా చేస్తారు. స్థల మార్పిడులు, ప్రమోషన్లకు బుధ గురువారాల్లో అవకాశాలు అధికం. క్రయ విక్రయాలు లాభిస్తాయి.
ధనుస్సు (నవంబర్ 24 - డిసెంబర్ 22)
క్రయ విక్రయాలు, కమ్యూనికేషన్ ద్వారా ఆదాయం పెరుగుతుందనవచ్చు. మీ అవసరాలను గమనించి అధికారులు మీకు చేయూతనిస్తారు. పెద్ద తరహాలో వ్యవహరించి బంధువుల, ఆత్మీయుల ఇబ్బందులలో తోడుగా నిలుస్తారు. వైద్యుల సూచనలు పాటించి ఆరోగ్యం మెరుగుపరుచుకోగలుగుతారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న శుభ ఫలితాలు శుక్ర, శనివారాల్లో మీకు చేరవచ్చు. నిపుణుల సలహాలు గ్రహించి వృత్తి, విద్యా విషయాల్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తారు.
మకరం (డిసెంబర్ 23 - జనవరి 22)
ఓపికతో వ్యవహరిస్తే అనుకున్న పనులు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. కోర్టు లావాదేవీలు, ఆర్థిక విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. యంత్ర పరికరాలు, పరిశోధనలకు కావలసిన పనిముట్లు అమర్చుకుంటారు. గృహ వాతావరణం ప్రోత్సాహకరంగా, చైతన్యవంతంగా వుంటుంది. నగదు బహుమతులు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు అందుకునే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు, ప్రాజెక్టులకై అవసరమైన వనరులకై ప్రయత్నాలు సమాచార సేకరణ చేపడతారు. పదవులలో ఉన్నవారు మీకు సాయం చేయడానికి సుముఖత చూపుతారు.
కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 20)
సమస్యలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. కొత్త ఉత్సాహంతో విద్యా సాంస్కృతిక రంగాల్లో మీ ప్రాధాన్యతను చాటుకుంటారు. స్పెక్యులేషన్ వాణిజ్య రంగాల్లో ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. కుటుంబ, గృహ విషయాల్లో కొత్త మార్పులు అనుభవాలు చోటు చేసుకుంటాయి. నష్టపోయిన వస్తువులు, ఆదాయాలు తిరిగి పొందడం, పోగొట్టుకున్న పరపతిని తిరిగి రాబట్టుకోవడం జరుగుతుంది. జిడ్డుగా సాగుతున్న పనులు మంగళ, బుధవారాల్లో వేగం పుంజుకుంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు.
మీనం ( ఫిబ్రవరి 21 - మార్చి 20)
కుటుంబ విషయాల్లో విద్యా రంగంలో మీకు వారారంభంలో ఆటంకాలు, చికాకులు ఉన్నా క్షేమంగా, సౌఖ్యదాయకంగా మారుతాయి. మీ వాదనలను, ప్రతివాదనలను విన్నా మీ నిర్ణయాలను చెప్పాల్సిన అవసరం లేదు. స్వాభిమానాన్ని పక్కనపెట్టి సామరస్యంతో మెలిగి పనులు సాధించుకోగలుగుతారు. ఒడంబడికలు, నూతన కార్యాలను సక్రమంగా ప్రారంభించడానికి వలసిన వనరుల సమీకరిస్తూ మిమ్మల్ని వారమంతా బిజీగా వుంచుతాయి. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల మక్కువ చూపుతారు. ఆర్థిక విషయాల్లో మొహమాటానికి పోతే అనవసర ఖర్చులు భరించాల్సి వస్తుంది.