హైదరాబాద్, మార్చి 30: మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరువయ్యారా? అన్న అనుమానాలను పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్లమెంటుకు పోటీచేసే దీటైన నాయకుడు లేకపోవడంవల్లే ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు ఇక్కడి నుండి పోటీ చేస్తామంటూ ముందుకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక దశలో చంద్రబాబు నాయుడే స్వయంగా మల్కాజిగిరి పార్లమెంటుకు పోటీచేస్తారని ప్రచారం జరిగితే అప్పుడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ వర్గాల్లో బాగానే కదలిక కనిపించింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఈ సీటుపై కనే్నసి ఇప్పటికి మూడు పర్యాయాలు సర్వే నిర్వహించుకున్నారన్న విషయంపై స్థానికంగా ఉన్న పార్టీ వర్గాలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేయస్సు కోసం దశాబ్దాల కాలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసినా ఈ అవకాశం మరొకరు దక్కించుకోవడం ఎంతవరకు సమంజసమన్న కోణంలో పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. పొత్తులో భాగంగా బిజెపి లేదా ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణను రంగంలోకి దింపుతారన్న ప్రచారం తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేపుతోంది. స్వయంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీపడేందుకు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా తెలంగాణ టిడిపి వారికే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తేవడంతో స్థానిక నాయకులు మాత్రం ఈ నియోజకవర్గం పరిధిలోని వారికే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. పార్లమెంటు నియోజకవర్గానికి బరిలోకి దిగాలంటే ఎంతోకొంత ఆర్థిక పరమైన బలంతోపాటు సామాజిక స్పృహ, స్థానికంగా కొంతమేకరు సదరు అభ్యర్థి సుపరిచితులై ఉండాల్సి ఉంటుంది.
కానీ, కొన్ని పార్టీల ప్రభావం కారణంగా వ్యక్తిగత గుర్తింపు లేకున్నా విజయం సాధించిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం కోసం పార్టీలు మారడం, గెలిచే ప్రాంతాలను ఎంచుకుని బరిలోకి దిగడం లాంటి కార్యక్రమాలు స్థానిక పార్టీ వర్గాలను ఏకం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కుత్బుల్లాపూల్, మేడ్చల్, కూకట్‌పల్లి, కంటోనె్మంట్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని వారికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ మొదలైంది. దీనితో టిడిపి సీనియర్ నాయకులు ఎవరు బరిలో ఉంటారన్న ఆలోచనపై కసరత్తు ప్రారంభించిన అధిష్టానం స్థానికంగా ఆశావాహులపై ఆరాతీస్తూ పరోక్షంగా పార్టీకి సహకరించిన వారిని పార్టీలో చేర్పించుకునే ప్రక్రియ మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలోనే సిఎంఆర్ విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి ఇటీవలే టిడిపిలోకి చేరారు. పార్టీలో చేరిన రోజే అవకాశం ఇస్తే మల్కాజిగిరి పార్లమెంటు నుంచి నేను పోటీచేస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విన్నవించుకున్నారు. ఈ విషయం ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మల్లారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి కుటుంబీకులు దశాబ్దాల కాలంగా టిడిపిలో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుండి జెడ్‌పిటిసి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి అధిష్టానం సూచనల మేరకు బరిలోనుంచి తప్పుకున్న విషయం విధితమే.
ఐదేళ్ల శని వీడింది
మల్కాజిగిరి: ఎమ్మెల్యే రాజేందర్ మళ్లీ టికెట్ రాదనే తెలిసి పార్టీ వీడాడని, ఆయన వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేని గత ఐదేళ్లుగా పార్టీకి పట్టిన శని పోయిందని భావిస్తున్నామని మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జిఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఐసిసి సభ్యుడు వడ్డి సుబ్బారావు, పోల్కం వెంకటేష్, సిరిగిరి నర్సింగరావు, మల్లేష్ గౌడ్, ఎస్.రామచంద్రారెడ్డి, సత్తిరెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాజేందర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ టిడిపి బలపడే విధంగా కృషి చేశారని, ప్రజలకు ఏనాడూ సేవలందించిన పాపాన పోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా అవగాహన లేకుండా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసి తెలంగాణ వాదులపై దాడులు చేయించిన రాజేందర్‌ను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవటం పట్ల ప్రజలంతా ఆవేశంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. నిరంతరం పోలీస్ ఎస్కార్టుతో తిరిగిన రాజేందర్‌కు ప్రజాప్రతినిధి విలువలు ఏ మాత్రం తెలియవని, ఏదైనా సమస్యపైన ఎమ్మెల్యే ఇంటికొచ్చే వారిని కనీసం గంట సేపునిలబెట్టుకునేవారని తీవ్రంగా విమర్శించారు.
పార్టీ నుంచి పోయిన రాజేందర్ వల్ల కాంగ్రెస్‌కు ఏలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. కార్యక్రమంలో పద్మారావు, విశ్వనాథ్, మహేందర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, బుద్ది శ్రీ్ధర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీటైన నాయకుడు లేక దిక్కులు చూస్తున్న పార్టీ
english title:
malkajgiri
Date:
Monday, March 31, 2014