ఖైరతాబాద్, మార్చి 30: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు భావజాలకుడు జలాది వెంకటేశ్వరరావు స్వీయచరిత్రగా రచించిన జ్ఞాపకాల తెరలు పుస్తకాన్ని ఆదివారం బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత సియస్ రావు, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంత రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి ఎంతో ధైర్యం కావాలని ఆ ధైర్యంతో జలాది రాసిన జ్ఞాపకాల తెరలు పుస్తకాన్ని చదివితే అప్పటి సామాజిక పరిస్థితులు, కమ్యూనిస్టు పోరాటాల నేపథ్యాలు కళ్లకు కట్టినట్లుగా ఉంటాయని అన్నారు. ఉద్యమంలో జైలు జీవితం, స్వాతంత్య్ర అనంతరం ఆయన చేసిన అభివృద్ధి పనులు ఈపుస్తకం ద్వారా తేటతెల్లం అవుతాయన్నారు.
తొమ్మిది పదుల వయస్సు దాటిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి వారి అనుభవాలను భవిష్యత్ తరాలకు అందిస్తే ఎంతో స్ఫూర్తిదాయకం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో విమర్శకులు, సోషలిస్టు నాయకులు సూర్యనారాయణ, గన్నవరం ఎమ్మెల్యే బాలవర్ధన్‌రావు పాల్గొన్నారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు భావజాలకుడు జలాది
english title:
gnapakaaalu
Date:
Monday, March 31, 2014