హైదరాబాద్, మార్చి 30: ఉగాది పండగ సందర్భంగా పోలీసు కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోలీసు సంక్షేమ విభాగం, స్నేహ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరంలో ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి సతీమణి స్మితా మహంతి, డిజిపి ప్రసాదరావు సతీమణి సౌమిని ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు సంక్షేమ విభాగం ఐజి సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని 4వ బెటాలియన్ యూనిట్లతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. జయనామ సంవత్సరం అందరికి సంతోషాన్ని అందించాలని స్మితా మహంతి, సౌమిని ప్రసాదరావు ఆకాంక్షించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి లక్ష్మి, రెండో బహుమతి ప్రియాంక, మూడో కమలమ్మకు రాగా డిజిపి సతీమణి ప్రత్యేక బహుమతి కీర్తికి వచ్చింది. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారుల సతీమణులు రేఖా షరాఫ్, ఉమా సాంబశివరాం, అనితా మహేందర్‌రెడ్డి, హేమ, సుధేష గోపాల్‌రెడ్డి, సోనికా శాండిల్య, ఉదయ త్రివేది, స్వాతి జగన్, సుధాజైన్ పాల్గొన్నారు.
ఉగాది పండగ సందర్భంగా పోలీసు కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు
english title:
rangoli
Date:
Monday, March 31, 2014