రవీంద్రభారతి, మార్చి 30: కాలుష్యంతో కరుడుగట్టిన ప్రపంచానికి పునః పుణ్యాహవచనం చేయడానికి 32వేల సంకీర్తనలు సిద్ధం చేసిన మంత్రకర్త అన్నమయ్య పరమ పదమునందుకున్న పుణ్యతిథి ఫాల్గుణ బహుళ ద్వాదశి ప్రపంచానికి పర్వదినం. ఈ ఆదివారం ఉదయం అన్నమాచార్య భావనా వాహిని నేతృత్వంలో నగర సంకీర్తన జరిగింది. తూర్పున తెల్లవారుతుండగా ప్రముఖ గాయని శోభారాజు, సినీ గాయకుడు సాందీప్ వేంకటేశ్వరస్వామి వేషంలో ముస్తాబుకాగా సినీనటుడు కిరీటి అన్నమయ్య వేషధారణలో ముస్తాబై గాయనీ గాయకులతో కలిసి శ్రీనివాసుని దర్శించుకుని అన్నమయ్య, శ్రీనివాసుల చిత్రపటాలతో ట్యాంక్‌బండ్ అన్నమయ్య విగ్రహం వద్దకు ఉ.7.30కి నగర సంకీర్తనం చేసారు. వేదికపై శోభారాజు, సినీ గాయని సునీత, స్వప్న, గజల్ శ్రీనివాస్ తదితరులు కీర్తనలు ఆలపించి తమ గానంతో అంజలి ఘటించారు. మనసులోని భావానికి సంగీతాన్ని జోడించి ఆనాడు అన్నమయ్య ఆలపించిన కీర్తనలను భక్తితో గానం చేస్తే కనుల ముందు శ్రీనివాసుడు సాక్షాత్కారమవుతాడని శోభారాజు అన్నారు. అన్నమయ్య సందేశం ప్రచారం కావాలనీ, ప్రస్తుతం వినిపిస్తున్న భావ కాలుష్యాన్ని భక్తి సంగీతంద్వారా నిర్మూలించాలనీ ఆమె అన్నారు. అమెరికాలో స్థిరపడిన ముత్యాల పద్మశ్రీ, అమెరికా తెలుగు టైమ్స్ సంపాదకులు చెన్నూరు సుబ్బారావు, ఎస్.నందగోపాల్ పాల్గొన్నారు.
కాలుష్యంతో కరుడుగట్టిన ప్రపంచానికి పునః
english title:
bhakti sangeetham
Date:
Monday, March 31, 2014