శేరిలింగంపల్లి, మార్చి 30: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని హైటెక్ హంగులతో అభివృద్ధి చేయడం టిడిపితోనే సాధ్యమవుతుందని పార్టీ ఇన్‌చార్జి మొవ్వా సత్యనారాయణ అన్నారు. హఫీజ్‌పేట డివిజన్ జనప్రియనగర్ ఫేజ్-2లో ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. ఎండి అక్తార్, మధుయాదవ్, దొంతి శేఖర్, మండవ రాఘవేందర్‌రావు, గుమ్మడి శ్రీను, కాకర్ల అరుణ, సరిత, మనె్నపల్లి సాంబశివరావు, శివ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ ప్రచారం..
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానకి టిఆర్‌ఎస్‌ను గెలిపించుకోల్సిన బాధ్యత అందరిపై ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కొండకల్ శంకర్‌గౌడ్ అన్నారు. ఆదివారం చందానగర్‌లో బస్తీబాట నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి, జి.సంగారెడ్డి, శ్రీనివాస్,. కుమార్, అనిల్, జమీర్, వీరేశం, వెంకట్, రమేశ్, రవి పాల్గొన్నారు.
టిడిపితోనే అభివృద్ధి సాధ్యం
మేడ్చల్: టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని సైకిల్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జడ్పీటిసి అభ్యర్థి జెకె శైలజ హరినాథ్, ఆయా గ్రామాల ప్రాధేశిక అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గౌడవెల్లి, రావల్‌కోల్, బాసురేగడి, జ్ఞానాపూర్, మునీరాబాద్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, జంగారెడ్డి, రాజు, చిన్న నర్సింహ్మ, హరివర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని హైటెక్ హంగులతో అభివృద్ధి
english title:
development
Date:
Monday, March 31, 2014