Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గులాబీ దళం

$
0
0

ఘట్‌కేసర్, మార్చి 31: టిఆర్‌ఎస్ బలపరిచిన ఘట్‌కేసర్ మండల జడ్పిటిసి అభ్యర్ధి మంద సంజీవరెడ్డి తమ ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు పుట్టిస్తు ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భారి ర్యాలీలు జరిపి ప్రజలకు చేరువై పోతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు ఇదివరకే సుపరిచితుడుగా ఉన్న సంజీవరెడ్డి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు అన్ని పార్టీల నాయకులను కలుస్తు హామీలు తీసుకుంటున్నాడు. టిడిపి, కాంగ్రెస్, వైకాపా, బిజెపి నుండి వలసలు పెరగటంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి గ్రామంలో వందలాది మహిళలు, యువకులు, అన్ని పార్టీల నాయకులు మద్దతు పలుకుతుండటంతో గెలుపుదిశగా అవకాశాలు ఉన్నట్లు దీమాతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జి మలిపెద్ది సుధీర్‌రెడ్డి సొంత మండలం కావటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరువు నిలుపుకునేందుకు ముమ్మర యత్నం చేస్తు అన్ని పార్టీలకు గాలం వేస్తున్నారు. ప్రతి గ్రామంలోని ఎంపిటిసి సభ్యులందరిని గెలిపించుకునేందుకు చేస్తున్న యత్నాలు ఫలిస్తుండటంతో జడ్పిటిసి, ఎంపిపి పదవులను కైవసం చేసుకోనున్నట్లు ధీమాతో ఉన్నారు.
టిడిపి, కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులకు దీటుగా ప్రచారం చేస్తు ముందంజలో ఉన్నారు. మండల కేంధ్రంలో సోమవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామియాదవ్, నాయకులు నోముల నవీన్ ప్రకాష్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, నర్రి శ్రీశైలం పాల్గొన్నారు.
తాండూరు మున్సిపాలిటీలో హంగ్ దిశగా ఫలితాలు?

తాండూరు, మార్చి 31: మున్సిపల్ ఎన్నికలలో అత్యంత ప్రధాన ఘట్టం ఎన్నికల పోలింగ్ ఆదివారంనాడు ఉ.గం.7.00ల నుండి సా.గం.5.00 వరకు సజావుగా, ప్రశాతంగా కొనసాగింది. ఎన్నికల అధికార యంత్రాంగం మరోవైపు పోలీస్ యంత్రాంగం సమన్వయంగా పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నాయి. పట్టణంలోని 31 వార్డులలో 15 నుంచి 18 వరకు సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు అందుకు తగిన స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టి తాండూరు మున్సిపల్స్ పోలింగ్‌ను విజయవంతం చేశారు.
ఇదిలా ఉండగా గత 15 రోజులుగా ఎన్నికల బరిలో ఉత్కంఠ భరితంగా కదలిన ఆయా వార్డుల అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపిలతోపాటు దశాబ్దంన్నర కాలం తరువాత మళ్ళీ పురుడుపోసుకున్న ఎంఐఎం పార్టీ, వైకాపా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికలలో విజయం మాదంటే... మాదనీ అంటూ చర్చలు సాగిస్తున్నారు. సోమవారం నాడు ఉగాది పర్వదినం పండుగ వేళ సైతం ఈవిఎం బాక్స్‌లలో దాగిన తమ గెలుపు, ఓటముల భవితవ్యం గురించి చర్చించుకోవడం గమనార్హం.
తాండూరులో హంగ్ దిశగా ఫలితాలు
ఇదిలా ఉండగా తాండూరు మున్సిపాలిటీ, చైర్‌పర్సన్ స్థానాన్ని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి తాము కైవసం చేసుకుంటామని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు పేర్కొంటుండగా పట్టణంలోని మొత్తం 31 వార్డులలో అభ్యర్థులను రంగంలోకి దించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము 18 నుండి 20 స్థానాలలో విజయం సాధించి మరోమారు తాండూరు చైర్‌పర్హన్ పీఠాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థులుగా రంగంలో ఉన్న బి.సునీత సుకుమార్ (కాంగ్రెస్), విజయ రంగారావు (టిఆర్‌ఎస్)లు తమతమ వార్డులలో సునీత వార్డు నెం.29, విజయాదేవి వార్డు నెం.10లలో తమ విజయాలను ఖాయం చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనాలు వెల్లడవుతున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు మావే అంటూ అటు కాంగ్రెస్, ఇటు టిఆర్‌ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా తాండూరు మున్సిపాలిటీలో హంగ్ దిశగా పయనిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి మొత్తం 31 వార్డులలో 12 వార్డులు లేదా 13, టిఆర్‌ఎస్ పార్టీకి 9 వార్డులు దక్కుతాయని అంచనాలు వేస్తాన్నారు. కాగా ఎంఐఎం పార్టీకి 3 లేదా 4 స్థానాలు, టిడిపి రెండు లేదా 3 స్థానాలు, బిజెపికి 2 స్థానాలు, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు విజయావకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టిఆర్‌ఎస్ బలపరిచిన ఘట్‌కేసర్ మండల జడ్పిటిసి అభ్యర్ధి మంద సంజీవరెడ్డి తమ ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>