ఉప్పల్, మార్చి 31: బిజెపి విజయానికి సైనికుడిలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం రామంతాపూర్‌లో ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్ అధ్యక్షులు వల్లపు జగన్‌యాదవ్, గడ్డం సాయి ఆధ్వర్యంలో బిజెపి నేతలు శ్రీనివాసచారి, కె.మధు, రాజేశ్వర్ తదితరులు వందలాది మంది కార్యకర్తలు ప్రభాకర్‌ను పూలమాలలతో సత్కరించి, కేక్ కట్‌చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి మోడీని ప్రధానిగా చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రచారం ముమ్మరం చేసిన టిడిపి
ఘట్‌కేసర్, మార్చి 31: మండల జడ్పిటిసి అభ్యర్ధిగా గెలుపొందేందుకు టిడిపి బలపరిచిన బొబ్బల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఘట్‌కేసర్‌తో పాటు పలు గ్రామాలలో మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ ఘట్‌కేసర్ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని అన్నారు. జిల్లా పరిషత్ నుండి అధిక నిధులను రాబట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. మోస పూరిత ప్రకటనలో ప్రజలను వంచించేందుకు వస్తున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు ప్రజలు ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్‌ఎఫ్‌సినగర్ పంచాయతీ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు టిడిపి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. టిడిపి జిల్లా కార్యదర్శి రాపోలు రాములు, నాయకులు చక్రపాణిగౌడ్, వెంకటేశ్ ముదిరాజ్, రమాదేవి, డి.వెంకటేశ్వర్‌రావు, ఎంపిటిసి అభ్యర్ధి శేఖర్ పాల్గొన్నారు.