సూళ్లూరుపేట, మార్చి 31: ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహ ప్రయోగానికి 2న ఉదయం 6:44 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్) నుండి 4న సాయంత్రం 5:14గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 24 రాకెట్ ప్రయోగం జరగనుంది. రాకెట్‌లో నింపే ఘన ఇంధనం మహేంద్రగిరి లిక్విడ్ ప్రొఫెల్లెంట్ సెంటర్ నుండి సోమవారం రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. ప్రయోగానికి సంబంధించి మంగళవారం షార్‌లో మరోసారి ఎంఆర్‌ఆర్ సమావేశం జరిగాక చివరిసారిగా లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 1432 కిలోల బరువుగల ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహ ప్రయోగానికి 2న
english title:
count down
Date:
Tuesday, April 1, 2014