న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలింగ్ ఏజంట్లుగా ఉండరాదని, ఎందుకంటే వారి వెంట ఉండే భద్రతా సిబ్బంది వల్ల బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు సమాన అవకాశాలుండవని ఎన్నికల కమిషన్ మంగళవారం స్పష్టం చేసింది. అంతేకాకుండా నగర మేయర్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ యూనియన్ల చైర్‌పర్సన్‌లు కూడా ఎన్నికల, పోలింగ్, కౌంటింగ్ ఏజంట్లుగా ఉండడానికి తగరని, ఎందుకంటే ఎన్నికల విధుల్లో ఉండే స్థానిక సంస్థల ఉద్యోగులపై వారు ప్రభావం చూపే అవకాశముందని ఇసి స్పష్టం చేసింది. రాజ్యసభ సభ్యుడు, లేదా ఎమ్మెల్యే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎన్నికల ఏజంట్ కావచ్చా అని పుదుచ్చేరి ఎన్నికల ముఖ్య అధికారి వివరణ కోరడంతో ఇసి ఈ ఆదేశాలు జారీ చేసింది. మంత్రులుగా ఉండే వారు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల ఏజంట్లుగా ఉండడానికి అనర్హులని, ఎందుకంటే వారికి సెక్యూరిటీ ఉంటుందని, ఇది బరిలో ఉండే ఇతర అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేస్తుందని ఇసి స్పష్టం చేసింది. ఏజంట్‌గా ఉండడం కోసం అలాంటి వ్యక్తులు తమ సెక్యూరిటీని సరెండర్ చేయడానికి కూడా వీలు లేదని, ఎందుకంటే ఏదయినా అనుకోని ఘటన జరిగితే శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అది విఘాతంగా మారుతుందని కమిషన్ స్పష్టం చేసింది.
ఇసి ఆదేశం
english title:
m
Date:
Wednesday, April 2, 2014