వారణాసి, ఏప్రిల్ 1: ‘చాయ్‌వాలా’గా ప్రసిద్ధి చెందిన బిజెపి అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసిలో సమాజ్‌వాదీ అభ్యర్థి కైలాష్ చౌరాసియా తనను ‘పాన్‌వాలా’గా చెప్పుకుంటూ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఆసక్తి కలిగిస్తోంది. తాను ఒకప్పుడు టీ దుకాణంలో పనిచేశానని, ‘చాయ్ పే చర్చ’ పేరిట నరేంద్ర మోడీ సాధారణ జనంలోకి దూసుకుపోతున్నారు. ఇదే తరహాలో కైలాష్ చౌరాసియా తన కుటుంబానికి ‘పాన్‌వాలా’ నేపథ్యం ఉందని ప్రచారం చేస్తున్నారు. చౌరాసియా మద్దతుదారులు ‘డాన్’ సినిమాలోని ‘ఖై కే పాన్ బనారస్ వాలా’ పాటతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, వారణాసిలో ‘పాన్’ వ్యాపారుల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నట్లు చౌరాసియా చెబుతున్నారు. ప్రస్తుతం యుపిలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా ఉన్న తాను ఎన్నికల ప్రచారంలో అనవసర విషయాలకు డబ్బు ఖర్చు చేయడం లేదని కైలాష్ చౌరాసియా తెలిపారు. పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు, నిరుపేద మహిళలకు వివాహాలు చేయించేందుకు ఆర్థికంగా సాయపడుతుంటానని చెప్పారు. స్థానికుడినైన తాను ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తున్నారు.
‘చాయ్‌వాలా’గా ప్రసిద్ధి చెందిన బిజెపి అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసిలో సమాజ్‌వాదీ అభ్యర్థి కైలాష్ చౌరాసియా తనను ‘పాన్‌వాలా’గా చెప్పుకుంటూ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఆసక్తి కలిగిస్తోంది.
english title:
p
Date:
Wednesday, April 2, 2014