హైదరాబాద్, ఏప్రిల్ 2: ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులుగా పదోన్నతి పొందిన తెలంగాణ అధికారులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించుకున్నారు. తెలంగాణలోనే పుట్టి పెరిగినప్పటికీ విభజనలో ఇతర రాష్ట్రానికి పంపకం చేసే ప్రక్రియను వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై బుధవారం దాదాపు 20 మంది పదోన్నతి పొందిన ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు సిఎస్ మహంతిని కలిసి తమకు జరిగే అన్యాయంపై వివరించుకున్నారు. గతంలో అగర్వాల్ కమిటీ సిఫార్సుల్లో సివిల్ సర్వీసు అధికారులుగా పదోన్నతి పొందిన వారికి రోస్టర్ విధానం అమలులో ఉండాలని చేసిన సూచన వల్ల తాము ఔట్‌సైడర్లుగా మారిపోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ విధానంపై దృష్టి పెట్టాలని, డొమిసైల్ (స్థానికత్వం), చదువుకున్న ప్రాంతాల ఆధారంగా తాము తెలంగాణలోనే ఉండేలా చూడాలని వారు సిఎస్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. దీనిపై సిఎస్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. వాస్తవాలను మీరు కూడా అధికారుల విభజనకోసం కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీకి విన్నవించుకోవాలని సిఎస్ సూచించినట్లు తెలిసింది. అలాగే పదోన్నతి పొందిన అధికారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన హామీనిచ్చినట్లు సమాచారం.
ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ
ఆఫీసులో ఎసిబి దాడులు
రూ.40 లక్షల నగదు స్వాధీనం
నెల్లూరు, ఏప్రిల్ 2: ఎపిఎస్ ఆర్‌టిసి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిఎస్పీ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఎసిబి డిఎస్పీ కెఎస్ నంజుండప్ప ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి బీరువాలో ఉన్న 40లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎల్ చెంచురెడ్డి ఎపిఎస్ ఆర్టీసీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే డిఎస్పీ అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న ఎసిబి పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. బీరువాలో ఉన్న నగదుకు సంబంధించి ఎటువంటి లెక్కలు, సమాధానం చెప్పకపోవడంతో రూ.40లక్షల నగదును సీజ్ చేశారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం డిఎస్పీ చెంచురెడ్డిపై చర్యలు తీసుకోనున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. కార్యాలయంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మూడు పంచాయతీల్లో
ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: హైదరాబాద్ శివార్లలోని కొత్వాల్‌గూడ, శతంరాయ్, గుండ్లపోచంపల్లి పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. మూడు గ్రామాలకు చెందిన వారు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు మే ఐదో తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ పంచాయితీలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని నిర్ణయించి ఎన్నికలను వాయిదా వేశారని, అయితే విలీనం ఆలోచనను ప్రభుత్వం విరమించుకుందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు.
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌ల విజ్ఞప్తి కేంద్ర కమిటీకి చెప్పుకోవాలని సిఎస్ సూచన
english title:
t
Date:
Thursday, April 3, 2014