న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్ర జౌళి శాఖ మంత్రి కె.ఎస్.రావు తన పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాజీనామా లేఖను అందజేయనున్నారు. బిజెపి అభ్యర్థిగా ఏలూరు నుండి లోక్‌సభకు పోటీ చేసేందుకు కావూరి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితుల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తోందని ఆయన ప్రధానికి వివరిస్తారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్న కావూరి చాలాకాలం నుండి కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలనుకుంటున్నారు. రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరాలన్నది తేల్చుకోకపోవడంతో ఆయన ఇప్పటి వరకు ఆగారని అంటున్నారు. తొలుత వైకాపాలో చేరాలనుకున్నా ఏలూరు సీటు కేటాయించేందుకు ఆ పార్టీ హామీ ఇవ్వకపోవడంతో వెనుకడుగు వేశారు. టిడిపి స్థానిక నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల చంద్రబాబు కావూరిని తమ పార్టీలోకి ఆహ్వానించలేకపోయారు. దీంతో కె.ఎస్.రావు బిజెపి వైపు మొగ్గారు. కావూరి రేపు రాజీనామా చేశాక బిజెపి నాయకులతో చర్చలు జరుపుతారని అంటున్నారు.
బిజెపిలో చేరికకు రంగం సిద్ధం
english title:
n
Date:
Thursday, April 3, 2014